నవంబర్ 2, 2006

బ్రౌసర్లు వాటి ఉపయోగాలు…

Posted in Uncategorized వద్ద 4:53 సా. ద్వారా Praveen Garlapati

నేను నా దైనందిన జీవితంలో ఎన్నో బ్రౌసర్స్ ఉపయోగిస్తాను. వాటిలో “internet explorer”, “firefox”, “opera” లాంటివి ఉన్నాయి. వీటిలో ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత ఉంది, సందర్భానికి తగ్గట్టుగా నేను ఆ బ్రౌసర్స్ ని వాడుతాను.

ఇంతకు ముందు “internet explorer” లో టాబ్స్ ఉండేవి కావు. ఇప్పుడు కొత్తగా ie 7.0 version లో టాబ్స్ ని ప్రవేశ పెట్టారు. ఇంకా ఎన్నో కొత్త విశేషాలు ఉన్నాయి ఇందులో, ఉదాహరణకి “Phishing” sites” ని పసిగట్టె సదుపాయం ఇందులో ఉంది. అంటే మనల్ని మోసం చెయ్యడానికి ప్రయత్నించే websites నుంచి జాగ్రత్త అన్నమాట. అలాంటి websites ఎదురైతే ఇది మనల్ని హెచ్చరిస్తుంది. ఇలాంటివే కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి ఇందులో కానీ ఇప్పటికే చాలా మటుకు ఇవి మిగత బ్రౌసర్స్ లో ఉన్నవే.

అలాగే “firefox” కొత్తగా టాబ్స్ ని బాగా ప్రచారం చేసింది, ఇంకా ఎన్నో సదుపాయలు ప్రవేశపెట్టింది, బ్రౌసర్ నుంచే ఎన్నో సెర్చ్‌లను కేంద్రీకరించడం, addons వంటివి. బ్రోవ్సెర్ మామూలుగానే ఉన్న, అద్దొన్స్ వల్ల చాలా శాక్తిమంతంగా తయారు చేయవచ్చు. కానీ ఇది ఎక్కువ memory వాడుతుంది అని చాలా మంది అనుభవం. అది బ్రౌసర్ ప్రోబ్లెమ్ కాదు ఆది ఒక feature అని ఫీరెఫ్ోక్ష్ వాళ్ళు చెపుతారు. ఇంకా ఆది అద్దొన్స్ వల్ల వచ్చేది అని చెబుతారు. ఇది తప్పితే ఈ బ్రౌసర్ ఎంతో ప్రాచుర్యం పొందింది. “internet explorer” కు గట్టి పోటీ ఇస్తుంది.

నేను వాడే ఇంకో బ్రౌసర్ “opera”. చాలా మంది దీనిని వాడరు కానీ ఇది ఎంతో చక్కని బ్రౌసర్. నాకు ఇది ప్రత్యేకంగా ఎందుకు ఇష్టం అంటే ఇందులో బ్రౌసర్, mail client, news reader, rss feed reader అన్ని కలిసి ఉంటాయి. ప్రతిదానికి ఒక ప్రత్యేకమైన ఉపకరణం వాడక్కర్లేదు. memory కూడా తక్కువ తీసుకుంటుంది.

ఇవి కాక లినక్స్ లో konqueror వంటి బ్రౌసర్స్ ఉన్నాయి. ఇది వెబ్ బ్రోవ్సింగ్ తో బాటు, file explorer గా కూడా పని చేస్తుంది. ( internet explorer కూడా 6.0 వరకు file explorer గా పని చేసేది.)
చాలా మంది ఇంకా విండోస్ వాడతారు కాబట్టి, దాని తో వచ్చే “internet explorer” వాడతారు. web sites తయారు చేసేవారు ఈ బ్రౌసర్స్ అన్నిటిని దృస్టిలో పెట్టుకుని తయారు చేస్తారు.

వీటన్నిటిలో నుంచి మనం మనకు సరిపోయే బ్రౌసర్ ఉపయోగించవచ్చు. అన్ని ఉచితమే కాబట్టి ఎలాంటి సమస్య ఉండదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: