IIT లు, మేధో వలసలు

IIT ని బాసర కి బదులు మెదక్ కి మార్చడం మీద అంతలా పోట్లాడటం ఎందుకో అర్థం కావట్లేదు. రాజకీయ పరంగా కాకపోతే ఎలా అయినా అది మన రాష్ట్రానికి వచ్చింది. అది చాలదా ?
అది వదిలేసి ఏదో కుట్ర జరిగిందంటూ గగ్గోలు పెడుతున్నారు.

ఇందులో మాట్లాడే వారికి అసలు IIT యొక్క ప్రముఖ్యం కూడా సరిగా తెలుసో లేదో.

అయిన మన పిచ్చి కాకపోతే గాని IIT ఎక్కడ ఉంటే మాత్రం ఏమిటి ??? ఆఖరికి అందులో చదివిన వారెవరూ ఇండియా లో ఉంటే కదా మన దేశానికి ఏమయినా మంచి జరగడానికి.

ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే IIT లో చదివిన వారిలో 80% మంది U.S కి వెళ్లే

స్థిరపడుతున్నారని  అర్థమవుతుంది. మరి అలాంటి దానికి ఎన్ని ఉంటే ఎందుకు ?

మొన్నే ఈనాడు లో చదివాను, IIT లను improve చెయ్యాలంటే కొన్ని వందల కోట్లు అవసరమవుతాయని. మరి అంత ప్రజల సొమ్ము ఖర్చు పెట్టి, వేరే దేశాన్ని ఉద్ధరించతామెందుకు ???

ఏమిటో ఈ జనాల పిచ్చి అనిపిస్తుంది ఒక్కోసారి. తల్లి తండ్రులను, మనవాళ్లను వదిలిపెట్టి, ఇక్కడ దొరికే సుఖమయిన జీవితాన్ని వదులుకుని ఎందుకు ప్రాణాన్ని కష్టపెట్టుకుంటారో అని ??? కానీ అంతలోనే అర్థమవుతుంది అందరూ ఒకేలా ఆలోచించరు కదా అని. ఎవరి priorities వారికి ఉంటాయి.

నాకు ఆశ్చర్యం వేసే మరో సంగతి ఏమిటి అంటే నా స్నేహితులు ఎవరు messenger లో లేదా online లో తగిలినా వారు నన్ను ముందు అడిగే ప్రశ్న U.S లో ఎక్కడున్నావు అని ?? అంటే నేను అక్కడే ఉన్నానని decide అయిపోతారాన్నమాట. నేను ఇండియా లోనే ఉన్నాను అని చెబితే ఏదో పాపం జాలి చూపిస్తారు, పాపం నాకు U.S వెళ్లే అవకాశం రాలేదేమో అని. నాకు interest లేదు అని చెబితే నాకు రాలేదు అని అలా మాట్లాడుతున్నానని అనుకుంటారు. అయిన వారు అనుకునే దానితో నాకు పని లేదనుకోండి

నేను క్రితం సంవత్సరం ఆఫీస్ పని మీద U.S కి వెళ్లాను అక్కడ అందరూ మానవల్లే. ఎవరిని పలకరించనూ ఏదో నీర్వేదం వారిలో. ఏంటో నండి ఎలాగయినా వెనక్కి వచ్చేయ్యాలి అని ఉంది అని చెబుతారు. కానీ అది అంత వరకే అని వారికీ తెలుసు నాకూ తెలుసు. ఆ డబ్బు మాయ అటువంటిది మరి.

సరే ఎక్కడో మొదలెట్తి ఎక్కడకో వచ్చినట్టున్నాము. ఇక ముగిస్తాను.

మనవి: పైన రాసినవి నా అభిప్రాయాలు మాత్రమే. ఎవరినీ నొప్పించడానికి కాదు.

24 thoughts on “IIT లు, మేధో వలసలు

  1. వవీన్,
    మీరు చెప్పింది కొంతే నిజం. IITల వల్ల మనకు ఒరిగేది లేదనే మొన్నటి వరకూ అనుకున్నారు..కానీ ఇప్పుడు brain gain వల్ల IITల స్థాపన ఇండియాకు ఎంత మేలు చేసిందో అమెరికాలో తెల్లవాళ్ళు కూడా తెల్లమొహం వేసుకొని చూస్తున్నారు. అలా IITలలో చదివి ఇతరదేశాలకు వెళ్ళిన వాళ్ళే ఆయా దేశాల్లో ఇండియా సత్తా ఏంటో చూపిస్తున్నారు. చాలా వరకూ వాళ్ళ వల్లే మనదేశానికి టెక్నాలగీ గుర్తింపు వచ్చిందన్నా ఇప్పుడు ఇలా రెక్కలు కట్టుకొని ఇండియాకు IT వుద్యోగాలు వస్తున్నాయన్నా అతిశయోక్తి అవుతుందా?

    ఇక ప్రవాసులు ఇండియాకు రావడం గురించయతే ..నా మట్టుకు నాకయితే ఇండియాలో వుద్యోగం రాకే ఇక్కడకు వచ్చాను. కనీసం పది వేల రూపాయల వుద్యోగం ఏదైయినా 1997లో దొరికివుంటే ఇప్పుడు నేనిక్కడ వుండేవాడిని కాదు. అందరూ ఇక్కడికి డబ్బుకోసమే రాలేదు, తిరిగి రావాలని ఎంతున్నా ఒక్కోసారి ఇక్కడి యాంత్రిక జీవనానికి అలవాటు పడ్డాక అక్కడ మళ్ళీ బతకగలమా అనిపిస్తుంది.
    –ఫ్రసాద్
    http://blog.charasala.com

  2. వవీన్,మీరు చెప్పింది కొంతే నిజం. IITల వల్ల మనకు ఒరిగేది లేదనే మొన్నటి వరకూ అనుకున్నారు..కానీ ఇప్పుడు brain gain వల్ల IITల స్థాపన ఇండియాకు ఎంత మేలు చేసిందో అమెరికాలో తెల్లవాళ్ళు కూడా తెల్లమొహం వేసుకొని చూస్తున్నారు. అలా IITలలో చదివి ఇతరదేశాలకు వెళ్ళిన వాళ్ళే ఆయా దేశాల్లో ఇండియా సత్తా ఏంటో చూపిస్తున్నారు. చాలా వరకూ వాళ్ళ వల్లే మనదేశానికి టెక్నాలగీ గుర్తింపు వచ్చిందన్నా ఇప్పుడు ఇలా రెక్కలు కట్టుకొని ఇండియాకు IT వుద్యోగాలు వస్తున్నాయన్నా అతిశయోక్తి అవుతుందా?ఇక ప్రవాసులు ఇండియాకు రావడం గురించయతే ..నా మట్టుకు నాకయితే ఇండియాలో వుద్యోగం రాకే ఇక్కడకు వచ్చాను. కనీసం పది వేల రూపాయల వుద్యోగం ఏదైయినా 1997లో దొరికివుంటే ఇప్పుడు నేనిక్కడ వుండేవాడిని కాదు. అందరూ ఇక్కడికి డబ్బుకోసమే రాలేదు, తిరిగి రావాలని ఎంతున్నా ఒక్కోసారి ఇక్కడి యాంత్రిక జీవనానికి అలవాటు పడ్డాక అక్కడ మళ్ళీ బతకగలమా అనిపిస్తుంది.–ఫ్రసాద్http://blog.charasala.com

  3. @చరసాల గారూ….:

    లేదండీ…IIT ల వల్లే ఇంత మేలు జరిగింది అంటే నేను ఒప్పుకోను… అవి కూడా పాత్ర పోషించాయి అంటే ఒప్పుకుంటాను.
    ఇండియా లో IT అభివృద్ధి ఇంతగా జరగడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. తక్కువ ఖర్చు, ఎక్కువ గ్రాడ్యువేట్లు మొదలగునవి. IIT లు పోషించిన పాత్ర ఇందులో ఒక వంతు మాత్రమే.

    నాకు తెలిసి IIT ల లో చదవాని వారు ఎంతో మంది ఉన్నారు, వారికి దీటుగా ఎంతో చక్కగా పని చేస్తున్నారు.

    నేను డబ్బు అని ఎందుకన్నాను అంటే ఎక్కువ మంది నాకు తెలిసిన వాళ్ళు వెళ్లేది దాని కోసము ఇంకా అమెరికా అన్న మొజుతోనూ.
    నా అభిప్రాయం తప్పు కావచ్చు.

  4. @చరసాల గారూ….:లేదండీ…IIT ల వల్లే ఇంత మేలు జరిగింది అంటే నేను ఒప్పుకోను… అవి కూడా పాత్ర పోషించాయి అంటే ఒప్పుకుంటాను.ఇండియా లో IT అభివృద్ధి ఇంతగా జరగడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. తక్కువ ఖర్చు, ఎక్కువ గ్రాడ్యువేట్లు మొదలగునవి. IIT లు పోషించిన పాత్ర ఇందులో ఒక వంతు మాత్రమే.నాకు తెలిసి IIT ల లో చదవాని వారు ఎంతో మంది ఉన్నారు, వారికి దీటుగా ఎంతో చక్కగా పని చేస్తున్నారు.నేను డబ్బు అని ఎందుకన్నాను అంటే ఎక్కువ మంది నాకు తెలిసిన వాళ్ళు వెళ్లేది దాని కోసము ఇంకా అమెరికా అన్న మొజుతోనూ.నా అభిప్రాయం తప్పు కావచ్చు.

  5. డబ్బు, భూగోళంమరోవైపు ఎలా వుంటుందో చూసే అవకాశం, కొన్ని కొత్తసంగతులు తెలుసుకొనే అవకాశం ఇవన్నీ నన్ను ఊరించినవి. కాకపోతే నేను ఇక్కడికొస్తానని కలగనలేదు, ప్రయత్నించనూలేదు. ఉద్యోగరీత్యా నన్నిక్కడకు పంపించారు. బహుసంతోషంగా వచ్చాను. నేనిక్కడ కోల్పోతున్నది ఏదైనా వుందీ అంటే ఒకే ఒకటి – ఇండియాలో వున్న Social life. అది కూడా పూర్తిగా నిజంకాదు. నా మటుకు ఇక్కడికొచ్చాకే త్వరగా అప్పులు తీరి జీవితం ప్రశాంతంగా మారింది. ఇండియాలో వుంటేమాత్రమే నేననుభవించగలిగేవి కొన్ని వున్నా, ఇక్కడుంటేనే అనుభవించగలిగేవీ కొన్ని వున్నాయి. కాబట్టి ఇండియాకు వచ్చేయటానికి సంతోషమే, అమెరికాను వదలడానికీ బాధేమీలేదు. ఎక్కడున్నా ఆనందంగా గడపగలం. ఆమాటకొస్తే మన జనాలు ఇక్కడ బాగా సంపాదించి ఇండియాకు రాగలిగితే మనదేశం కొంతమేరకు ధనికదేశమౌతుందికదా. ఎందుకంటే మనం మన రాజకీయుల్లాగా జనాల డబ్బు దోచుకోలేదు. ఐతేగియితే కొంతమంది బాగుకు తోడ్పడగలం. నావరకు నేను ఎవరికైనా సాయపడటమంటే “తనకు మాలిన ధర్మం” అయేది, ఇక్కడికి రాక ముందు. ఈ కారణంగా Braindrain ని నేను సమర్థిస్తాను. మన అబ్దుల్‌కలాం కూడా తన అత్మకథలో దీన్ని తప్పుపట్టలేదు. Life sucks in US అనే రొడ్డకొట్టుడు మాట చెబుతూ, దీన్ని వదలివెళ్లని వాళ్లు మాత్రం నాకర్థంకారు.

  6. డబ్బు, భూగోళంమరోవైపు ఎలా వుంటుందో చూసే అవకాశం, కొన్ని కొత్తసంగతులు తెలుసుకొనే అవకాశం ఇవన్నీ నన్ను ఊరించినవి. కాకపోతే నేను ఇక్కడికొస్తానని కలగనలేదు, ప్రయత్నించనూలేదు. ఉద్యోగరీత్యా నన్నిక్కడకు పంపించారు. బహుసంతోషంగా వచ్చాను. నేనిక్కడ కోల్పోతున్నది ఏదైనా వుందీ అంటే ఒకే ఒకటి – ఇండియాలో వున్న Social life. అది కూడా పూర్తిగా నిజంకాదు. నా మటుకు ఇక్కడికొచ్చాకే త్వరగా అప్పులు తీరి జీవితం ప్రశాంతంగా మారింది. ఇండియాలో వుంటేమాత్రమే నేననుభవించగలిగేవి కొన్ని వున్నా, ఇక్కడుంటేనే అనుభవించగలిగేవీ కొన్ని వున్నాయి. కాబట్టి ఇండియాకు వచ్చేయటానికి సంతోషమే, అమెరికాను వదలడానికీ బాధేమీలేదు. ఎక్కడున్నా ఆనందంగా గడపగలం. ఆమాటకొస్తే మన జనాలు ఇక్కడ బాగా సంపాదించి ఇండియాకు రాగలిగితే మనదేశం కొంతమేరకు ధనికదేశమౌతుందికదా. ఎందుకంటే మనం మన రాజకీయుల్లాగా జనాల డబ్బు దోచుకోలేదు. ఐతేగియితే కొంతమంది బాగుకు తోడ్పడగలం. నావరకు నేను ఎవరికైనా సాయపడటమంటే “తనకు మాలిన ధర్మం” అయేది, ఇక్కడికి రాక ముందు. ఈ కారణంగా Braindrain ని నేను సమర్థిస్తాను. మన అబ్దుల్‌కలాం కూడా తన అత్మకథలో దీన్ని తప్పుపట్టలేదు. Life sucks in US అనే రొడ్డకొట్టుడు మాట చెబుతూ, దీన్ని వదలివెళ్లని వాళ్లు మాత్రం నాకర్థంకారు.

  7. ఐ.ఐ.టి ఇక్కడ రావాలంటే ఇక్కడ రావాలని గొడవలు ఎందుకంటే ఐ.ఐ.టి వచ్చిన చోట భూముల ధరలు పెరుగుతాయనట.తమ తమ భూముల ధరలు పెంచుకుందామని అలా గొడవ చెస్తున్నారు.ఈ రాజకీయులది ఎవరి స్వార్దం వాల్లది. మొన్న జరిగిన ఒక గెట్ టుగెదర్ లొ అందరు కలిసి అన్న మాటలు ఇవి.ఇక దేశాన్ని వదిలి వచ్చేసామని ఎవరూ బాధ పడకండి….దేశానికి మనం విదేశీ మారక ద్రవ్యాన్ని చేకూరుస్తున్నాము.పెట్టు బడులు పెట్టి దేశాన్ని ముందుకి తీసుకెలుతున్నాము. మనం ఇక్కడ వుండడంవల్లనే ఇవన్ని చేయగలుగుతున్నాము అదే దేశం లో వుండి వుంటే ఏమి చేయలేకపోయేవాల్లం అని ఎంత బాగా చెప్పరో తెలుసా…నాలాంటి వాల్లందరమూ మాట్లాడడానికి మరొక్క మాటలేదు. తరువాత ఆలోచిస్తే నిజమే కదా అనిపించింది. తెలివినంతా పెట్టినా దేశాన్ని అభివ్రుద్దిచేయలేము.విదేశాలకు వెల్లి తెలివిని అమ్ముకుని దేశానికే కదా సేవ చేస్తున్నారు.ఆలొచించండి వ్య్యాసకర్త గారూ…

  8. ఐ.ఐ.టి ఇక్కడ రావాలంటే ఇక్కడ రావాలని గొడవలు ఎందుకంటే ఐ.ఐ.టి వచ్చిన చోట భూముల ధరలు పెరుగుతాయనట.తమ తమ భూముల ధరలు పెంచుకుందామని అలా గొడవ చెస్తున్నారు.ఈ రాజకీయులది ఎవరి స్వార్దం వాల్లది. మొన్న జరిగిన ఒక గెట్ టుగెదర్ లొ అందరు కలిసి అన్న మాటలు ఇవి.ఇక దేశాన్ని వదిలి వచ్చేసామని ఎవరూ బాధ పడకండి….దేశానికి మనం విదేశీ మారక ద్రవ్యాన్ని చేకూరుస్తున్నాము.పెట్టు బడులు పెట్టి దేశాన్ని ముందుకి తీసుకెలుతున్నాము. మనం ఇక్కడ వుండడంవల్లనే ఇవన్ని చేయగలుగుతున్నాము అదే దేశం లో వుండి వుంటే ఏమి చేయలేకపోయేవాల్లం అని ఎంత బాగా చెప్పరో తెలుసా…నాలాంటి వాల్లందరమూ మాట్లాడడానికి మరొక్క మాటలేదు. తరువాత ఆలోచిస్తే నిజమే కదా అనిపించింది. తెలివినంతా పెట్టినా దేశాన్ని అభివ్రుద్దిచేయలేము.విదేశాలకు వెల్లి తెలివిని అమ్ముకుని దేశానికే కదా సేవ చేస్తున్నారు.ఆలొచించండి వ్య్యాసకర్త గారూ…

  9. @Ramanadha Reddy:

    అందరిని ఒకే గాతిన కట్టాలేము అని నాకు తెలుసు…
    అందుకనే నేను అన్నది ఎవరి priorities వారికి ఉంటాయి అని. అందరూ నాలాగే ఆలోచించాలని లేదు.

    మీరన్నరే అక్కడ డబ్బులు సంపాదించి ఇక్కడకు వస్తే అని దానికి మీరే సమాధానం చెప్పండి. ఎంత మంది నిజంగా డబ్బు సంపాదించి వెనక్కి వస్తున్నారు ?? మీలాగా company పంపిస్తే వెళ్లిన వాళ్ళు తప్ప.

    నేను ఎవరిని తప్పు పట్టట్లేదు అంది ఇక్కడ…నా అభిప్రాయం చెబుతున్నాను అంతే

    ఏ విషయమయినా ROI ఆలోంచించాలి కదా మరి అన్ని వందల కోట్లు IIT ల మీద ఖర్చు పెట్టేటప్పుడు వాటి వల్ల వచ్చే లాభం ఎంత అనేది కూడా ఆలోచించాలి. google video లో ఒక విదే చూశాను, IIT ians తో interview, వాళ్ళని మీ aspiration ఏమిటి అంటే U.S కి వెళ్ళి settle అవడం అని చెప్పారు.

    సరే వాదనలకి అని కాదు కానీ, డబ్బున్నంత మాత్రాన జనాలు వేరే వాళ్ళకు సాయం చేస్తారని లేదండి. ఇక్కడ నాకున్న ఎంతో మంది స్నేహితులు వారికి తగిన రీతులలో ధన రూపేణా, పని రూపేణా ఎందరికో సహాయపడుతున్నారు.

  10. @Ramanadha Reddy: అందరిని ఒకే గాతిన కట్టాలేము అని నాకు తెలుసు…అందుకనే నేను అన్నది ఎవరి priorities వారికి ఉంటాయి అని. అందరూ నాలాగే ఆలోచించాలని లేదు.మీరన్నరే అక్కడ డబ్బులు సంపాదించి ఇక్కడకు వస్తే అని దానికి మీరే సమాధానం చెప్పండి. ఎంత మంది నిజంగా డబ్బు సంపాదించి వెనక్కి వస్తున్నారు ?? మీలాగా company పంపిస్తే వెళ్లిన వాళ్ళు తప్ప.నేను ఎవరిని తప్పు పట్టట్లేదు అంది ఇక్కడ…నా అభిప్రాయం చెబుతున్నాను అంతేఏ విషయమయినా ROI ఆలోంచించాలి కదా మరి అన్ని వందల కోట్లు IIT ల మీద ఖర్చు పెట్టేటప్పుడు వాటి వల్ల వచ్చే లాభం ఎంత అనేది కూడా ఆలోచించాలి. google video లో ఒక విదే చూశాను, IIT ians తో interview, వాళ్ళని మీ aspiration ఏమిటి అంటే U.S కి వెళ్ళి settle అవడం అని చెప్పారు.సరే వాదనలకి అని కాదు కానీ, డబ్బున్నంత మాత్రాన జనాలు వేరే వాళ్ళకు సాయం చేస్తారని లేదండి. ఇక్కడ నాకున్న ఎంతో మంది స్నేహితులు వారికి తగిన రీతులలో ధన రూపేణా, పని రూపేణా ఎందరికో సహాయపడుతున్నారు.

  11. ఐ.ఐ.టి ల వల్లనే దేశాభివృద్ధి జరిగిందంటే నేను నమ్మను. ఉన్నవి ఆరు. ఈ ఆరింటి నుంచి దేశానికి పనికొచ్చిన పేటెంట్లు ఎన్ని? దేశంలో పని చేస్తున్న వారు ఎంత మంది? మనం ఎప్పుడూ IITM వాళ్ళకు ఇంత ఆఫర్ వచ్చింది, IITK వాళ్లను GE తన్నుకు పోయింది అని సరదా పడటమే తప్ప ఇంకేమీ లేదు. ఉదాహరణకు ఈ వ్యాసం చదవండి.

    http://youthcurry.blogspot.com/2006/12/iit-waalon-ki-chaandi.html

    వ్యాఖ్యలు చదవండి.

    మన దేశం కొంత బాగు పడటానికి కారణం అతి కొద్ది మంది దార్శనిక రాజకీయ నాయకులు, ఇంజనీర్లు, బ్రిటీషు వారు (కొంత),ఆ తరువాతే విశ్వవిద్యాలయాలు.

  12. ఐ.ఐ.టి ల వల్లనే దేశాభివృద్ధి జరిగిందంటే నేను నమ్మను. ఉన్నవి ఆరు. ఈ ఆరింటి నుంచి దేశానికి పనికొచ్చిన పేటెంట్లు ఎన్ని? దేశంలో పని చేస్తున్న వారు ఎంత మంది? మనం ఎప్పుడూ IITM వాళ్ళకు ఇంత ఆఫర్ వచ్చింది, IITK వాళ్లను GE తన్నుకు పోయింది అని సరదా పడటమే తప్ప ఇంకేమీ లేదు. ఉదాహరణకు ఈ వ్యాసం చదవండి.http://youthcurry.blogspot.com/2006/12/iit-waalon-ki-chaandi.htmlవ్యాఖ్యలు చదవండి. మన దేశం కొంత బాగు పడటానికి కారణం అతి కొద్ది మంది దార్శనిక రాజకీయ నాయకులు, ఇంజనీర్లు, బ్రిటీషు వారు (కొంత),ఆ తరువాతే విశ్వవిద్యాలయాలు.

  13. స్వదేశంలోని నిరుద్యోగాన్ని పేదరికాన్ని భరించలేక విదేశాలకి పారిపోయినవాళ్ళు అక్కడ సంపాదించో లేక స్వదేశానికి (అక్కడి తమ బంధువులకి) డబ్బు పంపించో స్వదేశాన్ని బాగుచెయ్యడమనే తరహాలో అభివృద్ధి నమూనా ప్రపంచంలో ఎక్కడా జరగలేదు.ఇక్కడ కూడా జరగలేదు.ఎప్పటికీ జరగదు కూడా.ఎందుకంటే అసలు వాళ్ళు వెళ్ళిన ప్రయోజనం మౌలికంగా అది కాదు గనక.వాళ్ళ వర్తమాన స్థితి ఎలాంటిదైనప్పటికీ ప్రాథమికంగా వాళ్ళు పొట్టపట్టుకు వెళ్ళిన బాపతు జనం అనేది ఎప్పుడూ మర్చిపోకూడదు.వాళ్ళ జీవన వేదాంతం ఆ స్థాయిలోంచి రూపుదిద్దుకుని ఉంటుంది.అయినా వాళ్ళని తప్పుపట్టకూడదు.పేదవారికి అభిమానాలు ప్రేమలూ అనేవి ఓ నిషిద్ధ దర్జా.

    స్వదేశానికి విదేశీ మారకద్రవ్యం సమకూర్చిపెట్టడం మాటకొస్తే మనకి సమకూడే విదేశీమారకద్రవ్యంలో ఎంతెంత ఎవరినుంచి వస్తోందనే విషయంలో గణాంకాలు లభ్యం కావట్లేదు. ఏమైనా మనం ఎగుమతి చేసే వస్తువుల ద్వారా సమకూడేటంత మొత్తం NRIs చేసే remittances ద్వారా సమకూడదని నా అనుమానం.ఎందుకంటే విదేశాలకి వెళ్ళేవారిలో ఎక్కువమంది కొద్ది సంవత్సరాల వ్యవధిలోనే తమ ఆప్తుల్ని సైతం మర్చిపోతారు.ఇక డబ్బు పంపేటంత సీన్ ఉంటుందనుకోను.

  14. స్వదేశంలోని నిరుద్యోగాన్ని పేదరికాన్ని భరించలేక విదేశాలకి పారిపోయినవాళ్ళు అక్కడ సంపాదించో లేక స్వదేశానికి (అక్కడి తమ బంధువులకి) డబ్బు పంపించో స్వదేశాన్ని బాగుచెయ్యడమనే తరహాలో అభివృద్ధి నమూనా ప్రపంచంలో ఎక్కడా జరగలేదు.ఇక్కడ కూడా జరగలేదు.ఎప్పటికీ జరగదు కూడా.ఎందుకంటే అసలు వాళ్ళు వెళ్ళిన ప్రయోజనం మౌలికంగా అది కాదు గనక.వాళ్ళ వర్తమాన స్థితి ఎలాంటిదైనప్పటికీ ప్రాథమికంగా వాళ్ళు పొట్టపట్టుకు వెళ్ళిన బాపతు జనం అనేది ఎప్పుడూ మర్చిపోకూడదు.వాళ్ళ జీవన వేదాంతం ఆ స్థాయిలోంచి రూపుదిద్దుకుని ఉంటుంది.అయినా వాళ్ళని తప్పుపట్టకూడదు.పేదవారికి అభిమానాలు ప్రేమలూ అనేవి ఓ నిషిద్ధ దర్జా.స్వదేశానికి విదేశీ మారకద్రవ్యం సమకూర్చిపెట్టడం మాటకొస్తే మనకి సమకూడే విదేశీమారకద్రవ్యంలో ఎంతెంత ఎవరినుంచి వస్తోందనే విషయంలో గణాంకాలు లభ్యం కావట్లేదు. ఏమైనా మనం ఎగుమతి చేసే వస్తువుల ద్వారా సమకూడేటంత మొత్తం NRIs చేసే remittances ద్వారా సమకూడదని నా అనుమానం.ఎందుకంటే విదేశాలకి వెళ్ళేవారిలో ఎక్కువమంది కొద్ది సంవత్సరాల వ్యవధిలోనే తమ ఆప్తుల్ని సైతం మర్చిపోతారు.ఇక డబ్బు పంపేటంత సీన్ ఉంటుందనుకోను.

  15. @radhika:

    విడేశీమారకద్రవ్యం ఒక పెద్ద జోకండి బాబూ..
    NRI లు మన దేశానికి చేసేది అంత మోతాదులో లేదని నా అభిప్రాయం. మీరు ఒక సంగతి గమనించండి. ఇక్కడ నుంచి వలస వెళ్లిన వాళ్ళలో ఎంత మంది enterpreneurs ఉన్నారు ???

    మామూలు salaried people చేసే ఇన్వెస్ట్‌మెంట్ ఏమిటి అంది ??? మహా అంటే ఇక్కడ ఒక ఫ్లాట్, ఒక site అంతే కదా ? ఆది మన economy కి ఎలా ఉపయోగ పడుతుంది ?

    దేశంలో ఉండి ఏమీ చెయ్యలేకపోయారా ???
    ఏమండి బాబూ ఇన్ఫోసిస్, విప్రో, సత్యం ఇవన్నీ దేశీ కొంపనీలండి. వీరు చేసేది ఎంతో ఎక్కువ.

  16. @radhika:విడేశీమారకద్రవ్యం ఒక పెద్ద జోకండి బాబూ..NRI లు మన దేశానికి చేసేది అంత మోతాదులో లేదని నా అభిప్రాయం. మీరు ఒక సంగతి గమనించండి. ఇక్కడ నుంచి వలస వెళ్లిన వాళ్ళలో ఎంత మంది enterpreneurs ఉన్నారు ???మామూలు salaried people చేసే ఇన్వెస్ట్‌మెంట్ ఏమిటి అంది ??? మహా అంటే ఇక్కడ ఒక ఫ్లాట్, ఒక site అంతే కదా ? ఆది మన economy కి ఎలా ఉపయోగ పడుతుంది ?దేశంలో ఉండి ఏమీ చెయ్యలేకపోయారా ???ఏమండి బాబూ ఇన్ఫోసిస్, విప్రో, సత్యం ఇవన్నీ దేశీ కొంపనీలండి. వీరు చేసేది ఎంతో ఎక్కువ.

  17. మ్మ్…
    ఇది ఇండియాలో వున్న వాళ్ళకూ బయట వున్న వాళ్ళకూ మద్య పోరులా వుందే! 🙂
    ఇండియాకు తిరిగి ఎవరు వస్తున్నారు అనేమాటకు ఇంతకు ముందైతే వెతకాల్సి వచ్చేది కానీ మారుతున్న ఇప్పటి పరిస్థితిలో వస్తున్నారు. ఎంతమంది అంటే నేను చెప్పలేను. నాకు మా బావ 15 ఏళ్ళు అమెరికాలో వుండి ఇక్కడి పౌరసత్వము కూడా తీసుకొని ఇప్పుడు హైదరాబాదులో స్థిరపడ్డాడు. కారణం ఇక్కడ అస్థవ్యస్త సామాజికజీవనం. మనకు నచ్చని ఇక్కడి ఆచారాలలో పిల్లలు ఎక్కడ చిక్కుకుపోయి బారతీయ విలువలను మరిచిపోతారేమొననే బెంగ. నాకు తెలిసిన ఆయన మితృలు ఇద్దరు కూడా దే బాట పట్టారు. అందులో ఒకాయన పేరు రావణాసురుడు (వాళ్ళ నాన్న నాస్తికుడట) యహూ ఇండియాలో మంచి పదవిలో వున్నారు. ఇంకొకాయన చెన్నయిలో వున్నారు.
    ఇప్పుడు ఇండియాలో వుద్యోగావకాశాలు, జీతభత్యాల ప్రమాణాలూ బాగానే వూరిస్తున్నాయి గనుక అక్కడి జీవితమే మేలనే విషయం ఇక్కడికి (అమెరికాకు) వచ్చాక తెలుస్తుంది. ఇక నాతో ఇంతకు ముందు Verizonలో పని చేస్తున్న ఇద్దరు మిత్రులు కూడా VDSI (Verizon India Div)లో వుద్యోగాలు తీసుకొని ఇక్కడి నుంచీ వెళ్ళిపోయారు.
    ఇండియా వెళ్ళిపోవడనికి, పోవాలని అనుకుంటున్నదానికి కారణాలు.
    1) డబ్బు ఎంతున్నా అయిన వారికి దూరంగా వుండటం, నారాయణ స్వామి సందూకలో చెప్పినట్లు అందరిమద్యా ఒంటరిగా వుండినట్లనిపించడం.
    2) పిల్లలు ఇక్కడి మాదక ద్రవ్యాలు, వివాహ పూర్వపు స్వేచ్చా శ్రంగార విశృంఖలత్వాల పట్ల మొగ్గుతారేమొనన్న భీతి.( ఈ మద్య ఓ సర్వేలో సుమారు 90శాతం వివాహానికి పూర్వమే సెక్సులో పాల్గొన్నట్లు వెల్లడించరు.)
    3) యాంత్రిక జీవనం పట్ల వెగటు. పక్కనే వున్న పొరుగు వాడి ఇంటికి వెళ్ళాలన్నా అనుమతి తీసుకొని వెళ్ళాలి.
    4) ఒకప్పటి కంటే ఇప్పుడు వుద్యోగావకాశాలూ, మెరుగైన సిటీ జీవనం (ఇక్కడి లెవెల్లో) దానికి తోడు ప్రతి పనికీ పనిమనుషులు లభ్యం.

    ఇక NRIలు ఇండియాకు పంపిస్తున్న డబ్బు ….
    ఇది ఎదో వుచితంగా పంపిస్తున్నది మీరు అనుకుంటున్నట్లుంది. NRIలు అక్కడ వ్యాపారం కోసం, ఆస్తుల కోసం, బహుమానాల కోసం పంపిస్తున్నది అంట ఇంతా కాదు. ఒక్క అరబ్బు దేశాలను తీసుకుంటేనే ఎంతో పంపిస్తున్నారు. వాళ్ళ కుటుంబాలను ఇండియాలో వదిలేసి వాళ్ళు ఇండియాకు కాక ఇంకెంక్కడికి పంపిస్తారు డబ్బుని.
    ఇక అమెరికా విషయానికొస్తే, హైదరాబాదులో భూములు పెరగడానికి NRIలు ఒక కారణం కాదా? ఏ ఇంటి నుంచీ అమెరికా వెళ్ళినవాడున్నా ఆ యిల్లు ఆ డబ్బుతో సగటు జీవన ప్రమాణం పెరగడం లేదా? బాబు జన్మభూమి పధకంలో ఎంతమంది NRIలు డబ్బును వెచ్చించలేదు.
    ఇక దాతృత్వం విషయానికొస్తే..
    రానారె అన్నట్లు ఇండియాలో వచ్చే జీతానికి అక్కడి నెలసరి అవసరాలకే సరిపోతుంది. అయితే అమెరికా వచ్చాక డాలర్ విలువను రూపాయల్లో సరిచూడటం వల్ల తక్కువ డాలర్లతోనే ఎక్కువ సహాయం చేసినట్లు అవుతుంది. అదీగాక మురికిలో దొర్లే పందికి (ఇది కేవలం వుపమానం మాత్రమే) మురికే సుఖమనుకున్నట్లు, అలాగే ఎప్పుడూ AC భావనంలో నివసించే వాడికి గుడిసెలో వాడి పాట్లు తెలీనట్లు, ఇండియాలో వున్నప్పుడు తెలియని ఇండియన్ల పాట్లు ఇక్కడికి వచ్చాక, ఇక్కడి సౌకర్యాలు చూశాక మనవాళ్ళూ ఇలా వుండాలి, మనమూ ఇలా అభివృద్ది అవ్వాలి అని అనిపించడం ప్రారంభిస్తుంది. అందువల్ల దాతృత్వమయితేనేం, ఇండియా మీద ప్రేమ అయితేనెం, స్థానికుల కంటే ప్రవాసులకు ఎక్కువ వుంటుంది.
    అంబానాధ్ గారికి “ఎందుకంటే విదేశాలకి వెళ్ళేవారిలో ఎక్కువమంది కొద్ది సంవత్సరాల వ్యవధిలోనే తమ ఆప్తుల్ని సైతం మర్చిపోతారు. ఇక డబ్బు పంపేటంత సీన్ ఉంటుందనుకోను.” అనేంత విపరీతబావం NRIల మీద ఎందుకేర్పడిందో ఆశ్చర్యంగా వుంది. రెండవ, మూడవ, ఆపై తరాల వాళ్ళకు ఇండియా మీద ప్రేమ వుంటుందో లేదో (అది వాళ్ళే చెప్పాలి) కానీ మొదటి తరం మాత్రం వచ్చిన కొన్నినాళ్ళలోనే ఆప్తులను మరచిపోవడం నేను చూడలేదు. అంబానాధ్ గారికి ఒకరిద్దరు అలా తారసపడ్డారేమొ తెలియదు.. అందువల్ల అందరినీ ఆ గాట కట్టలేం.

    ప్రవీణ్, “NRI”లు అక్కడ ప్లాటు కొన్నా, ఫ్లాటు కొన్నా అందుకు డాలర్లు వుపయోగించనప్పుడల్లా ఇండియాకు లాభమే! ఎలా అంటే చాలా ఆర్థిక సూత్రాలు చెపాల్సి వస్తుంది. దాన్ని ఇంకోసారి చర్చిద్దాం.

    –ఫ్రసాద్
    http://blog.charasala.com

  18. మ్మ్…ఇది ఇండియాలో వున్న వాళ్ళకూ బయట వున్న వాళ్ళకూ మద్య పోరులా వుందే! :)ఇండియాకు తిరిగి ఎవరు వస్తున్నారు అనేమాటకు ఇంతకు ముందైతే వెతకాల్సి వచ్చేది కానీ మారుతున్న ఇప్పటి పరిస్థితిలో వస్తున్నారు. ఎంతమంది అంటే నేను చెప్పలేను. నాకు మా బావ 15 ఏళ్ళు అమెరికాలో వుండి ఇక్కడి పౌరసత్వము కూడా తీసుకొని ఇప్పుడు హైదరాబాదులో స్థిరపడ్డాడు. కారణం ఇక్కడ అస్థవ్యస్త సామాజికజీవనం. మనకు నచ్చని ఇక్కడి ఆచారాలలో పిల్లలు ఎక్కడ చిక్కుకుపోయి బారతీయ విలువలను మరిచిపోతారేమొననే బెంగ. నాకు తెలిసిన ఆయన మితృలు ఇద్దరు కూడా దే బాట పట్టారు. అందులో ఒకాయన పేరు రావణాసురుడు (వాళ్ళ నాన్న నాస్తికుడట) యహూ ఇండియాలో మంచి పదవిలో వున్నారు. ఇంకొకాయన చెన్నయిలో వున్నారు.ఇప్పుడు ఇండియాలో వుద్యోగావకాశాలు, జీతభత్యాల ప్రమాణాలూ బాగానే వూరిస్తున్నాయి గనుక అక్కడి జీవితమే మేలనే విషయం ఇక్కడికి (అమెరికాకు) వచ్చాక తెలుస్తుంది. ఇక నాతో ఇంతకు ముందు Verizonలో పని చేస్తున్న ఇద్దరు మిత్రులు కూడా VDSI (Verizon India Div)లో వుద్యోగాలు తీసుకొని ఇక్కడి నుంచీ వెళ్ళిపోయారు.ఇండియా వెళ్ళిపోవడనికి, పోవాలని అనుకుంటున్నదానికి కారణాలు.1) డబ్బు ఎంతున్నా అయిన వారికి దూరంగా వుండటం, నారాయణ స్వామి సందూకలో చెప్పినట్లు అందరిమద్యా ఒంటరిగా వుండినట్లనిపించడం.2) పిల్లలు ఇక్కడి మాదక ద్రవ్యాలు, వివాహ పూర్వపు స్వేచ్చా శ్రంగార విశృంఖలత్వాల పట్ల మొగ్గుతారేమొనన్న భీతి.( ఈ మద్య ఓ సర్వేలో సుమారు 90శాతం వివాహానికి పూర్వమే సెక్సులో పాల్గొన్నట్లు వెల్లడించరు.)3) యాంత్రిక జీవనం పట్ల వెగటు. పక్కనే వున్న పొరుగు వాడి ఇంటికి వెళ్ళాలన్నా అనుమతి తీసుకొని వెళ్ళాలి. 4) ఒకప్పటి కంటే ఇప్పుడు వుద్యోగావకాశాలూ, మెరుగైన సిటీ జీవనం (ఇక్కడి లెవెల్లో) దానికి తోడు ప్రతి పనికీ పనిమనుషులు లభ్యం.ఇక NRIలు ఇండియాకు పంపిస్తున్న డబ్బు ….ఇది ఎదో వుచితంగా పంపిస్తున్నది మీరు అనుకుంటున్నట్లుంది. NRIలు అక్కడ వ్యాపారం కోసం, ఆస్తుల కోసం, బహుమానాల కోసం పంపిస్తున్నది అంట ఇంతా కాదు. ఒక్క అరబ్బు దేశాలను తీసుకుంటేనే ఎంతో పంపిస్తున్నారు. వాళ్ళ కుటుంబాలను ఇండియాలో వదిలేసి వాళ్ళు ఇండియాకు కాక ఇంకెంక్కడికి పంపిస్తారు డబ్బుని.ఇక అమెరికా విషయానికొస్తే, హైదరాబాదులో భూములు పెరగడానికి NRIలు ఒక కారణం కాదా? ఏ ఇంటి నుంచీ అమెరికా వెళ్ళినవాడున్నా ఆ యిల్లు ఆ డబ్బుతో సగటు జీవన ప్రమాణం పెరగడం లేదా? బాబు జన్మభూమి పధకంలో ఎంతమంది NRIలు డబ్బును వెచ్చించలేదు.ఇక దాతృత్వం విషయానికొస్తే..రానారె అన్నట్లు ఇండియాలో వచ్చే జీతానికి అక్కడి నెలసరి అవసరాలకే సరిపోతుంది. అయితే అమెరికా వచ్చాక డాలర్ విలువను రూపాయల్లో సరిచూడటం వల్ల తక్కువ డాలర్లతోనే ఎక్కువ సహాయం చేసినట్లు అవుతుంది. అదీగాక మురికిలో దొర్లే పందికి (ఇది కేవలం వుపమానం మాత్రమే) మురికే సుఖమనుకున్నట్లు, అలాగే ఎప్పుడూ AC భావనంలో నివసించే వాడికి గుడిసెలో వాడి పాట్లు తెలీనట్లు, ఇండియాలో వున్నప్పుడు తెలియని ఇండియన్ల పాట్లు ఇక్కడికి వచ్చాక, ఇక్కడి సౌకర్యాలు చూశాక మనవాళ్ళూ ఇలా వుండాలి, మనమూ ఇలా అభివృద్ది అవ్వాలి అని అనిపించడం ప్రారంభిస్తుంది. అందువల్ల దాతృత్వమయితేనేం, ఇండియా మీద ప్రేమ అయితేనెం, స్థానికుల కంటే ప్రవాసులకు ఎక్కువ వుంటుంది.అంబానాధ్ గారికి “ఎందుకంటే విదేశాలకి వెళ్ళేవారిలో ఎక్కువమంది కొద్ది సంవత్సరాల వ్యవధిలోనే తమ ఆప్తుల్ని సైతం మర్చిపోతారు. ఇక డబ్బు పంపేటంత సీన్ ఉంటుందనుకోను.” అనేంత విపరీతబావం NRIల మీద ఎందుకేర్పడిందో ఆశ్చర్యంగా వుంది. రెండవ, మూడవ, ఆపై తరాల వాళ్ళకు ఇండియా మీద ప్రేమ వుంటుందో లేదో (అది వాళ్ళే చెప్పాలి) కానీ మొదటి తరం మాత్రం వచ్చిన కొన్నినాళ్ళలోనే ఆప్తులను మరచిపోవడం నేను చూడలేదు. అంబానాధ్ గారికి ఒకరిద్దరు అలా తారసపడ్డారేమొ తెలియదు.. అందువల్ల అందరినీ ఆ గాట కట్టలేం.ప్రవీణ్, “NRI”లు అక్కడ ప్లాటు కొన్నా, ఫ్లాటు కొన్నా అందుకు డాలర్లు వుపయోగించనప్పుడల్లా ఇండియాకు లాభమే! ఎలా అంటే చాలా ఆర్థిక సూత్రాలు చెపాల్సి వస్తుంది. దాన్ని ఇంకోసారి చర్చిద్దాం. –ఫ్రసాద్http://blog.charasala.com

  19. విదేసీ మారక ద్రవ్యం గనాంకాలు నాకు తెలీదు గాని నావరకు నాకు తెలిసిన పరిధిలో ఒక 1000 మంది నెలకు 2000$పంపిస్తున్నారు.అంటే నాకు తెలిసిన వాళ్ళ ద్వారనే 10కోట్ల రూపాయలు నెలకి దేశానికి వెళుతున్నాయి. 30 లక్షల భారతీయులు వున్నారట ఒక్క అమెరికాలోనే.ప్రపంచవ్యాప్తం గా ఎంత మంది వున్నారో నాకు తెలియదు.ఈ లెక్కన దేశానికి ఎంత వెలుతుందో మీరే అంచనా వేయండి.సత్యం,ఇంఫోసిస్ అంటూ మీరు చెప్పినవి బాగున్నాయి.కాని ఇక్కడ వున్న ప్రతీ భారతీయుడు ఒక సత్యాన్ని,ఇంఫోసిస్ ని స్తాపించలేదు గా.అక్కడ ఒక ఉద్యోగిగా చేయలేనిది ప్రవాస భారతీయుడిగా చేస్తున్నాడు.ఎంతోమంది ప్రవాస భారతీయులు వాళ్ళ వాళ్ళ గ్రామాలని దత్తు తీసుకుని అభివ్రుద్ది చేసారు.అక్కడ నెలకి 5000 రూపాయలు ఈతరుల కోసం ఖర్చుచేయడం చాలా కష్టం.ఇక్కడున్న వాళ్ళు ఆనందం గా ఇస్తున్నారు.కన్న తల్లి తండ్రులని కూడా బయటకి నెట్టేస్తున్నవాల్లు,ఆప్తులని,స్నేహితులని మోసం చేస్తున్నవాళ్ళు,మొహం చాటేసుకు తిరుగుతున్నవాళ్ళు దేశం లోనే చాలామంది వున్నారు.ఇక్కడివాళ్ళని అనుకొనవసరం లేదు.నిజం చెప్పాలంటే దూరం గా వున్నవాళ్ళకే మమతల విలువ ఎక్కువ తెలుస్తుంది.ఎక్కడో ఒకరిద్దరు వుండొచ్చు మీరనే వాళ్ళు.అలాని అందరిని ఒక గాటిన కట్టేయ కూడదు కదా…

  20. విదేసీ మారక ద్రవ్యం గనాంకాలు నాకు తెలీదు గాని నావరకు నాకు తెలిసిన పరిధిలో ఒక 1000 మంది నెలకు 2000$పంపిస్తున్నారు.అంటే నాకు తెలిసిన వాళ్ళ ద్వారనే 10కోట్ల రూపాయలు నెలకి దేశానికి వెళుతున్నాయి. 30 లక్షల భారతీయులు వున్నారట ఒక్క అమెరికాలోనే.ప్రపంచవ్యాప్తం గా ఎంత మంది వున్నారో నాకు తెలియదు.ఈ లెక్కన దేశానికి ఎంత వెలుతుందో మీరే అంచనా వేయండి.సత్యం,ఇంఫోసిస్ అంటూ మీరు చెప్పినవి బాగున్నాయి.కాని ఇక్కడ వున్న ప్రతీ భారతీయుడు ఒక సత్యాన్ని,ఇంఫోసిస్ ని స్తాపించలేదు గా.అక్కడ ఒక ఉద్యోగిగా చేయలేనిది ప్రవాస భారతీయుడిగా చేస్తున్నాడు.ఎంతోమంది ప్రవాస భారతీయులు వాళ్ళ వాళ్ళ గ్రామాలని దత్తు తీసుకుని అభివ్రుద్ది చేసారు.అక్కడ నెలకి 5000 రూపాయలు ఈతరుల కోసం ఖర్చుచేయడం చాలా కష్టం.ఇక్కడున్న వాళ్ళు ఆనందం గా ఇస్తున్నారు.కన్న తల్లి తండ్రులని కూడా బయటకి నెట్టేస్తున్నవాల్లు,ఆప్తులని,స్నేహితులని మోసం చేస్తున్నవాళ్ళు,మొహం చాటేసుకు తిరుగుతున్నవాళ్ళు దేశం లోనే చాలామంది వున్నారు.ఇక్కడివాళ్ళని అనుకొనవసరం లేదు.నిజం చెప్పాలంటే దూరం గా వున్నవాళ్ళకే మమతల విలువ ఎక్కువ తెలుస్తుంది.ఎక్కడో ఒకరిద్దరు వుండొచ్చు మీరనే వాళ్ళు.అలాని అందరిని ఒక గాటిన కట్టేయ కూడదు కదా…

  21. వ్యక్తిగత అభిప్రాయాలను వదిలి కొన్ని గట్టి నిజాలు
    *ప్రపంచములో అందరికంటే ఎక్కువ దానధర్మాలు చేసేది అమెరికా ప్రజలే (ప్రభుత్వం గురించి మాట్లడట్లేదు)
    *అంబానాథ్ గారికి – ప్రవాసుల డబ్బుతో లాభంపొందిన ఆర్థిక వ్యవస్థ (చైనా)

    ఇక నా అభిప్రాయాలు
    *మేధోవలసలని ఒకప్పుడు తెగిడారు పొగిడే సమయమొస్తుంది (దశాబ్దం క్రితం దాకా మన సమస్యలన్నింటికీ జనాభా, మేధోవలస కారణమన్నారు. ఇప్పడవే మన పాలిటి వరాలంటున్నారు)
    *వలసలో తప్పేంలేదు కాకపోతే వెళ్లేటప్పుడు రాయితీలతో చదివిన చదువుకు తగిన మొత్తం చెల్లించిపోతే తరువాత వచ్చే విద్యార్ధులకు పనికొస్తుంది. భారతదేశములో ఉన్నంతవరకు చెల్లించక్కర్లేదు కానీ విదేశాలకు వెళ్లేటప్పుడు మొత్తము చెల్లించో లేక సంపాదించిన తరువాత చెల్లిస్తామని ఒక బాండో రాసిపోతే బాగుంటుంది.

  22. వ్యక్తిగత అభిప్రాయాలను వదిలి కొన్ని గట్టి నిజాలు*ప్రపంచములో అందరికంటే ఎక్కువ దానధర్మాలు చేసేది అమెరికా ప్రజలే (ప్రభుత్వం గురించి మాట్లడట్లేదు)*అంబానాథ్ గారికి – ప్రవాసుల డబ్బుతో లాభంపొందిన ఆర్థిక వ్యవస్థ (చైనా)ఇక నా అభిప్రాయాలు*మేధోవలసలని ఒకప్పుడు తెగిడారు పొగిడే సమయమొస్తుంది (దశాబ్దం క్రితం దాకా మన సమస్యలన్నింటికీ జనాభా, మేధోవలస కారణమన్నారు. ఇప్పడవే మన పాలిటి వరాలంటున్నారు)*వలసలో తప్పేంలేదు కాకపోతే వెళ్లేటప్పుడు రాయితీలతో చదివిన చదువుకు తగిన మొత్తం చెల్లించిపోతే తరువాత వచ్చే విద్యార్ధులకు పనికొస్తుంది. భారతదేశములో ఉన్నంతవరకు చెల్లించక్కర్లేదు కానీ విదేశాలకు వెళ్లేటప్పుడు మొత్తము చెల్లించో లేక సంపాదించిన తరువాత చెల్లిస్తామని ఒక బాండో రాసిపోతే బాగుంటుంది.

  23. నాకు తెలిసినంతలో NRI ల ద్వారా విదేశీ మారక ద్రవ్యం పెరగడం లేదు. అది ఎంతో కొంత దోహదం చేయవచ్చు. మనకు వస్తున్న దంతా విదేశీ పెట్టుబడుల నుంచే. కొన్ని బిజినెస్ వార్తల ప్రకారం రియల్ ఎస్టేట్ లోకి కొన్ని MNC’s రావడం వల్ల ధరలు అలా పెరిగాయి. దానికి తోడు మన భారత్ లో వున్న నల్ల ధనం మొత్తం చడీ చప్పుడు కాకుండా బయటి వచ్చి ఎన్నో చొట్ల పెట్టుబడులు పెట్టబడ్డాయి.

    మన IIT లు IIM లు దేశానికి ఖ్యాతి తెచ్చిపెడుతున్న మాట నిజమే కానీ. అది దేశాభి వృద్దికి దోహదం చేసి పెట్టట్లేదు. ఇందుకు ఎవరో కొద్ది మంది మినహాయిపు. వాళ్ళు అక్కడే వుంటాలంటే వాళ్ళకు I.A.S., I.P.S. ఉద్యోగాలుండాలి. జీతం సరీగా లేక పోయినా సంఘం లో పరపతి కోసం అక్కడ ఉంటారు. అంతే కాకుండా తన తెలివితేటలకు ఒక రూపం ఇవ్వాడానికి ఆ ఉద్యొగాలు సరిపోతాయి. అందులో వున్నవాళ్ళకు తను అందరికన్న ప్రతిభావంతుడని(రాలినని) మనసులో వుండటం సహజం. దాతో ఎక్కువ గౌరవం(డబ్బు తో సహా) పొందాలనుకోవడం
    అంతే సహజం. ఇవన్నే ఏ DRDO లోనో ISRO లొనో రావు కద. వున్నా అక్కడున్న రెడ్ టేపిజం చూసి బయటి ప్రయత్నాలు చేసుకుని వెళ్ళిపోతారు. కొంతమంది ఏ స్వార్థం లేకుండా వున్నా ఎన్నో రకాల పరిస్థితులను ఎదుర్కోవాలి.

    మనకు IIT లు IIM లు వుండవలసిందే కానీ వాటినుండి ఏమీ ఆశించకుండా వుండడం మంచిది. తాజ్ మహల్ మనకుండడం అదృష్టం. ఎంతో విజ్ఞాన వంతులు మన దేశంలో జన్మించడమూ మన అదృష్టమే.

    ఏ చదువుండి ధీరుభాయ్ అంబానీ అంత ఎంత్తు ఎదిగాడు. ఏ చదువుండి లాలు ప్రసాద్ యాదవ్ నష్టాల్లో వున్న మన రైల్వేలను పాసింజరు మీద భారం పడకుండా లాభాల్లోకి తెచ్చాడు. సత్తా వుంటే దేనికదే అభివృద్ది జరిగుతుంది. అడ్డంకులు లేకుంటే చాలు.

    విహారి.

  24. నాకు తెలిసినంతలో NRI ల ద్వారా విదేశీ మారక ద్రవ్యం పెరగడం లేదు. అది ఎంతో కొంత దోహదం చేయవచ్చు. మనకు వస్తున్న దంతా విదేశీ పెట్టుబడుల నుంచే. కొన్ని బిజినెస్ వార్తల ప్రకారం రియల్ ఎస్టేట్ లోకి కొన్ని MNC’s రావడం వల్ల ధరలు అలా పెరిగాయి. దానికి తోడు మన భారత్ లో వున్న నల్ల ధనం మొత్తం చడీ చప్పుడు కాకుండా బయటి వచ్చి ఎన్నో చొట్ల పెట్టుబడులు పెట్టబడ్డాయి. మన IIT లు IIM లు దేశానికి ఖ్యాతి తెచ్చిపెడుతున్న మాట నిజమే కానీ. అది దేశాభి వృద్దికి దోహదం చేసి పెట్టట్లేదు. ఇందుకు ఎవరో కొద్ది మంది మినహాయిపు. వాళ్ళు అక్కడే వుంటాలంటే వాళ్ళకు I.A.S., I.P.S. ఉద్యోగాలుండాలి. జీతం సరీగా లేక పోయినా సంఘం లో పరపతి కోసం అక్కడ ఉంటారు. అంతే కాకుండా తన తెలివితేటలకు ఒక రూపం ఇవ్వాడానికి ఆ ఉద్యొగాలు సరిపోతాయి. అందులో వున్నవాళ్ళకు తను అందరికన్న ప్రతిభావంతుడని(రాలినని) మనసులో వుండటం సహజం. దాతో ఎక్కువ గౌరవం(డబ్బు తో సహా) పొందాలనుకోవడంఅంతే సహజం. ఇవన్నే ఏ DRDO లోనో ISRO లొనో రావు కద. వున్నా అక్కడున్న రెడ్ టేపిజం చూసి బయటి ప్రయత్నాలు చేసుకుని వెళ్ళిపోతారు. కొంతమంది ఏ స్వార్థం లేకుండా వున్నా ఎన్నో రకాల పరిస్థితులను ఎదుర్కోవాలి.మనకు IIT లు IIM లు వుండవలసిందే కానీ వాటినుండి ఏమీ ఆశించకుండా వుండడం మంచిది. తాజ్ మహల్ మనకుండడం అదృష్టం. ఎంతో విజ్ఞాన వంతులు మన దేశంలో జన్మించడమూ మన అదృష్టమే. ఏ చదువుండి ధీరుభాయ్ అంబానీ అంత ఎంత్తు ఎదిగాడు. ఏ చదువుండి లాలు ప్రసాద్ యాదవ్ నష్టాల్లో వున్న మన రైల్వేలను పాసింజరు మీద భారం పడకుండా లాభాల్లోకి తెచ్చాడు. సత్తా వుంటే దేనికదే అభివృద్ది జరిగుతుంది. అడ్డంకులు లేకుంటే చాలు.విహారి.

Leave a reply to ప్రవీణ్ గార్లపాటి స్పందనను రద్దుచేయి