జనవరి 28, 2007

తెలుగు సినేమా వజ్రోత్సవాలు – చిరంజీవి vs మోహన్‌బాబు

Posted in తెలుగు సినేమా వజ్రో వద్ద 9:09 సా. ద్వారా Praveen Garlapati

ఈ పాటికి అందరూ తెలుగు సినేమా వజ్రోత్సవ వేడుకలు చూసే ఉంటారు.

ఏది ఎలా ఉన్నా ఆఖరి రోజు మాత్రం అందరికి మంచి entertainment కల్పించిందనుకుంట. 🙂

మోహన్‌బాబు మొదలెట్టిన పిచ్చి వాగుడికి చిరంజీవి ముక్టాయింపు చూసే ఉంటారు

ఇంతకు ముందు కూడా చిరంజీవి felicitation ఫుంకతిఓన్ లో మోహన్‌బాబు ఇలాగే చెత్త వాగుడు వాగాడు, అప్పుడు కూడా పవన్ కల్యాణ్, చిరంజీవి తిప్పి కొట్టారు. మరి కుక్క బుద్ధి కాకపోతే మళ్లీ బయట పడ్డాడు మోహన్‌బాబు.

ఏదో criticize చేసి sensation సృష్టిడ్దాం అనే ధ్యాశలో ఉన్నట్టున్నాడు. దాసరి అండ చూసుకుని వాగుదామనుకున్నట్టున్నాడు. మొత్తానికి బోల్తా పడ్డాడు.

కానీ మొత్తానికి ఇదేమీ బాగాలేదు. ఒకరిని ఉద్దేశించి ఒకరు వ్యాఖ్యలు చేసుకోవడం. చిరంజీవి కూడా ఈ మధ్య కొద్దిగా సహనం కోల్పోయి ప్రవర్తిస్తున్నాదేమో అనిపిస్తుంది. తాను సరాయినా కానీ కొద్దిగా సహనం చూపించి ఉంటే బాగుండేది. పవన్ కల్యాణ్ ఎలాగూ రెచ్చగొడితే రెచ్చిపోయే టైపే…

సరే మనకేం పోయింది ఏదో time pass అంతే.

ప్రకటనలు

22 వ్యాఖ్యలు »

 1. radhika said,

  మొహన్ బాబు గురించి కాదు గానీ అక్కడ పెద్దపెద్ద వాళ్ళు,గొప్పవాళ్ళు చాలా మంది వుండగా అందరినీ వదిలేసి చిరుని,బాలయ్యని లెజెండ్స్ అంటూ సత్కరించడం చాలా దారుణం అనిపించింది.మొహన్ బాబు ఎప్పుడూ అలాగే చెత్త వాగుడు వాగుతూ వుంటాడు.అతను చెప్పేవి కొన్ని నిజాలయినా సమయం సందర్భం లేకుండా మాట్లాడడం వల్ల అభాసుపాలవుతూ వుంటాడు.చిరంజీవి అక్కడ అంత ఆవేశ పడాలిసింది కాదనిపించింది.మీరన్నట్టు ప్రేక్షకులకు మంచి వినోదం లభించింది.

 2. radhika said,

  మొహన్ బాబు గురించి కాదు గానీ అక్కడ పెద్దపెద్ద వాళ్ళు,గొప్పవాళ్ళు చాలా మంది వుండగా అందరినీ వదిలేసి చిరుని,బాలయ్యని లెజెండ్స్ అంటూ సత్కరించడం చాలా దారుణం అనిపించింది.మొహన్ బాబు ఎప్పుడూ అలాగే చెత్త వాగుడు వాగుతూ వుంటాడు.అతను చెప్పేవి కొన్ని నిజాలయినా సమయం సందర్భం లేకుండా మాట్లాడడం వల్ల అభాసుపాలవుతూ వుంటాడు.చిరంజీవి అక్కడ అంత ఆవేశ పడాలిసింది కాదనిపించింది.మీరన్నట్టు ప్రేక్షకులకు మంచి వినోదం లభించింది.

 3. Dr.Ismail said,

  ఇలా జరగడం నిజంగా బాధాకరం.ఇదంతా ఎవరికి వారు నేనే గొప్ప అని భావించడం వల్ల.ఇక బిరుదులు, అవార్డుల విషయానికొస్తే తెలుగు చిత్రసీమకు రెండు కళ్లు ఎన్.టి.ఆర్ & ఎ.ఎన్.ఆర్ అని అందరూ ఎప్పుడూ అంటూంటారు మరి ఎస్.వి.ఆర్? ఆయన నటన గొప్పది కాదా?ప్రజాదరణ పొందిన నటులే ఎప్పుడూ జనం నోళ్లలో నానుతూంటారు ఇలా అవార్డులు,రివార్డులకు అర్హులవుతారు.అప్పటికీ అన్నగారికి దాదాసాహెబ్ వచ్చిందా,భారత రాజకీయాలలో సంచలనం కలిగించిన నాయకుడిగా భారతరత్న వచ్చిందా?మహాత్మునికి నోబెల్ శాంతి బహుమతి వచ్చిందా?ఇక్కడ సమయం, సందర్భం అనే విచక్షణ లేకుండా మాట్లాడిన ఎం.బాబుదే తప్పు!

 4. Dr.Ismail said,

  ఇలా జరగడం నిజంగా బాధాకరం.ఇదంతా ఎవరికి వారు నేనే గొప్ప అని భావించడం వల్ల.ఇక బిరుదులు, అవార్డుల విషయానికొస్తే తెలుగు చిత్రసీమకు రెండు కళ్లు ఎన్.టి.ఆర్ & ఎ.ఎన్.ఆర్ అని అందరూ ఎప్పుడూ అంటూంటారు మరి ఎస్.వి.ఆర్? ఆయన నటన గొప్పది కాదా?ప్రజాదరణ పొందిన నటులే ఎప్పుడూ జనం నోళ్లలో నానుతూంటారు ఇలా అవార్డులు,రివార్డులకు అర్హులవుతారు.అప్పటికీ అన్నగారికి దాదాసాహెబ్ వచ్చిందా,భారత రాజకీయాలలో సంచలనం కలిగించిన నాయకుడిగా భారతరత్న వచ్చిందా?మహాత్మునికి నోబెల్ శాంతి బహుమతి వచ్చిందా?ఇక్కడ సమయం, సందర్భం అనే విచక్షణ లేకుండా మాట్లాడిన ఎం.బాబుదే తప్పు!

 5. Ramanadha Reddy said,

  కథానాయకుడి ఔదార్యాన్ని ఎత్తిచూపడంకోసం సినిమాల్లో ప్రతినాయకుడి ‘తిరస్కారం-భంగపాటు’ ప్రక్రియ ఉపయోగపడుతుంటుంది. ఐతే మొన్నటి ఘటన నిజజీవితంలోనిది. కలెక్షన్‌కింగ్‌గా తనను తానే అభివర్ణించుకొనే విలనుగారి ధిక్కారము హీరోను మరింత గొప్పవాడిగా, పెద్దవాడిగా చేయడంలో ఉపయోగపడింది. హీరోగారి తమ్ముడు ఎప్పటిలాగే ఉద్వేగాన్ని దాచుకోలేకపోయాడు. ఈ ప్రవర్తన సపోర్టే అయినా హీరోగారి మనసులోని మాటకు (‘మన తొలిరోజుల్లోని మామూలు మనుషులుగానే ప్రవర్తిద్దాం, మనమంతా ఒకటి’) కాస్తభిన్నమైనది. అంజలీదేవి నాగేశ్వరరావు కన్నా ముందునుంచీ సినిమాల్లో వున్నారు, ఆమెమాట ప్రస్థావనకు మచ్చినట్టులేదు.

 6. కథానాయకుడి ఔదార్యాన్ని ఎత్తిచూపడంకోసం సినిమాల్లో ప్రతినాయకుడి ‘తిరస్కారం-భంగపాటు’ ప్రక్రియ ఉపయోగపడుతుంటుంది. ఐతే మొన్నటి ఘటన నిజజీవితంలోనిది. కలెక్షన్‌కింగ్‌గా తనను తానే అభివర్ణించుకొనే విలనుగారి ధిక్కారము హీరోను మరింత గొప్పవాడిగా, పెద్దవాడిగా చేయడంలో ఉపయోగపడింది. హీరోగారి తమ్ముడు ఎప్పటిలాగే ఉద్వేగాన్ని దాచుకోలేకపోయాడు. ఈ ప్రవర్తన సపోర్టే అయినా హీరోగారి మనసులోని మాటకు (‘మన తొలిరోజుల్లోని మామూలు మనుషులుగానే ప్రవర్తిద్దాం, మనమంతా ఒకటి’) కాస్తభిన్నమైనది. అంజలీదేవి నాగేశ్వరరావు కన్నా ముందునుంచీ సినిమాల్లో వున్నారు, ఆమెమాట ప్రస్థావనకు మచ్చినట్టులేదు.

 7. spandana said,

  ఇంతకీ ఆరోజు ఏమి జరిగిందో ఒకరైనా చెప్పండి ప్రోగ్రాం చూడని నాలాంటి వాళ్ళ కోసం. మాకు జెమిని, తేజ వున్నాయి. వాటిల్లో ఈ ప్రోగ్రాం వచ్చినట్లు లేదే!
  ఏమి జరిగి వున్నా మోహన్‌బాబు ఒక చెత్త వాగుడుకాయ అని నేను ఒప్పుకుంటాను. ఈ దాసరి గాడే అతని చేంఛగాడికి పద్మశ్రీ ఇప్పించినట్లున్నాడు. మోహన్‌బాబు పద్మశ్రీకి అర్హుడైతే రాజేంద్ర ప్రసాద్, చంద్ర మోహన్ ఇంకా ఎందరో వున్నారు వారి మాటేమిటి?

  –ప్రసాద్
  http://blog.charasala.com

 8. spandana said,

  ఇంతకీ ఆరోజు ఏమి జరిగిందో ఒకరైనా చెప్పండి ప్రోగ్రాం చూడని నాలాంటి వాళ్ళ కోసం. మాకు జెమిని, తేజ వున్నాయి. వాటిల్లో ఈ ప్రోగ్రాం వచ్చినట్లు లేదే!ఏమి జరిగి వున్నా మోహన్‌బాబు ఒక చెత్త వాగుడుకాయ అని నేను ఒప్పుకుంటాను. ఈ దాసరి గాడే అతని చేంఛగాడికి పద్మశ్రీ ఇప్పించినట్లున్నాడు. మోహన్‌బాబు పద్మశ్రీకి అర్హుడైతే రాజేంద్ర ప్రసాద్, చంద్ర మోహన్ ఇంకా ఎందరో వున్నారు వారి మాటేమిటి?–ప్రసాద్http://blog.charasala.com

 9. ప్రవీణ్ గార్లపాటి said,

  చరసాల గారూ…
  ఈనాడు లో dialog to dialog వేసాడండి 🙂

 10. చరసాల గారూ…ఈనాడు లో dialog to dialog వేసాడండి 🙂

 11. శోధన said,

  రానారె గారన్నట్లు ఇది కేవలం ఆధిపత్య ధోరణి మాత్రమే. ఇద్దరు మాట్లాడిన దాంట్లో అక్కసు, కోపం , తప్పులు అన్నీ ఉన్నాయి. నిజానికి గోవా చిత్రోత్సవాలలో భానుమతి గారి విప్రనారాయణ ప్రదర్శించారు. అసలు ఈ ఉత్సవాలలో భానుమతి గారి ప్రస్తావనే లేదు.భానుమతి గారి దగ్గర NTR, ANR లు కూడా శిష్యుల్లా ఉండేవారు. సినీ చరిత్రలో 75 దిగ్గజాలను ఏరితే ఇప్పటి నటులు చస్తే దానిలో ఉండరు.

 12. శోధన said,

  రానారె గారన్నట్లు ఇది కేవలం ఆధిపత్య ధోరణి మాత్రమే. ఇద్దరు మాట్లాడిన దాంట్లో అక్కసు, కోపం , తప్పులు అన్నీ ఉన్నాయి. నిజానికి గోవా చిత్రోత్సవాలలో భానుమతి గారి విప్రనారాయణ ప్రదర్శించారు. అసలు ఈ ఉత్సవాలలో భానుమతి గారి ప్రస్తావనే లేదు.భానుమతి గారి దగ్గర NTR, ANR లు కూడా శిష్యుల్లా ఉండేవారు. సినీ చరిత్రలో 75 దిగ్గజాలను ఏరితే ఇప్పటి నటులు చస్తే దానిలో ఉండరు.

 13. చేతన said,

  నేను ప్రోగ్రాం చూడలేదు, కాబట్టి ఎవరు మట్లాడింది ఎంతవరకు ఉచితం, ఎంతవరకు అనుచితం అని చెప్పలేను గానీ, మోహన్‌బాబుకి మాత్రం ప్రతీ సారీ ప్రతీదానికీ గొడవలేసుకోవటం అలవాటు అనిపిస్తుంది. చిరంజీవి సన్మానంలో చేసిన గొడవే కాదు, నాకు గుర్తుండి, తెలిసి గత 9-10 పదేళ్ళలో ఇలా మిగతావాళ్ళమీద గొడవకి దిగి రచ్చరచ్చ చేయటం, అందరితో అక్షింతలు వేయించుకోవటం 4-5 సార్లు జరిగింది. అప్పుడోసారి మొదటిసారి సినిమావాళ్ళందరూ, భూకంపం రిలీఫ్ ఫండ్ కి అనుకుంట, క్రికెట్ ఆడుతుంటే తనని తన కొడుకుల్ని పిలవలేదు, అని గొడవగొడవ చేసాడు.

  చిరంజీవికీ బాలకృష్ణకి లెజెండ్ అవార్డు అప్పుడే ఇవ్వటం ఏంటీ? వాళ్ళకీ ఇచ్చినా ఇవ్వకపోయినా, మోహన్‌బాబు ఏరకంగా లెజెండ్? “డింగో డింగు” అంటూ ఎక్కువ విలన్/కామెడీవిలన్ వేషాలు వేసినందుకా? తనని తాను లెజెండ్ అని పరిగణించేసుకుని అవార్డు ఇవ్వమని గొడవచేయటమేంటీ?

  అయినా ఇతని గొడవ మినహా మిగతా ఫంక్షన్ అంతా బాగానే జరిగినట్టు వింటున్నదాన్ని బట్టి చూస్తే.

 14. చేతన said,

  నేను ప్రోగ్రాం చూడలేదు, కాబట్టి ఎవరు మట్లాడింది ఎంతవరకు ఉచితం, ఎంతవరకు అనుచితం అని చెప్పలేను గానీ, మోహన్‌బాబుకి మాత్రం ప్రతీ సారీ ప్రతీదానికీ గొడవలేసుకోవటం అలవాటు అనిపిస్తుంది. చిరంజీవి సన్మానంలో చేసిన గొడవే కాదు, నాకు గుర్తుండి, తెలిసి గత 9-10 పదేళ్ళలో ఇలా మిగతావాళ్ళమీద గొడవకి దిగి రచ్చరచ్చ చేయటం, అందరితో అక్షింతలు వేయించుకోవటం 4-5 సార్లు జరిగింది. అప్పుడోసారి మొదటిసారి సినిమావాళ్ళందరూ, భూకంపం రిలీఫ్ ఫండ్ కి అనుకుంట, క్రికెట్ ఆడుతుంటే తనని తన కొడుకుల్ని పిలవలేదు, అని గొడవగొడవ చేసాడు. చిరంజీవికీ బాలకృష్ణకి లెజెండ్ అవార్డు అప్పుడే ఇవ్వటం ఏంటీ? వాళ్ళకీ ఇచ్చినా ఇవ్వకపోయినా, మోహన్‌బాబు ఏరకంగా లెజెండ్? “డింగో డింగు” అంటూ ఎక్కువ విలన్/కామెడీవిలన్ వేషాలు వేసినందుకా? తనని తాను లెజెండ్ అని పరిగణించేసుకుని అవార్డు ఇవ్వమని గొడవచేయటమేంటీ?అయినా ఇతని గొడవ మినహా మిగతా ఫంక్షన్ అంతా బాగానే జరిగినట్టు వింటున్నదాన్ని బట్టి చూస్తే.

 15. spandana said,

  ప్రవీణ్,
  శని, ఆది వారాలు పిల్లకోసం అంకితం. ఇంటర్‌నెట్ మీదికి రావడమే అరుదు. అందుకే ఈ గమ్మత్తులన్నీ మిస్సయ్యాను. మీ బ్లాగు చూశాక అన్నీ తవ్వి తీసి చదివాను.
  మోహన్ బాబుకు అల్లరి చేయడం అలవాటే అందులో ఆశ్చర్యపోవడానికేమీ లేదు. కానీ చిరంజీవి మాట్లాడిన మాటలు చాలా పెద్దమనిషి తరహాలో హుందాగా వున్నా అతను పడిన ఆవేశం, ఉద్రేకం, మాట రాక పోవడం, కళ్ళ నీళ్ళు రావడం (ఇవన్నీ ఈనాడూ అచ్చులో లేవు) చూస్తే అతను అంతగా ఫీలయ్యుండాల్సింది కాదనిపించింది. కానీ ఆయన భావోద్రేకము చూస్తే ఎప్పట్నుంచో గూడు కట్టుకున్న తన బాధని ఇలా వెళ్ళ గక్కాడనిపించింది.
  –ప్రసాద్
  http://blog.charasala.com

 16. spandana said,

  ప్రవీణ్,శని, ఆది వారాలు పిల్లకోసం అంకితం. ఇంటర్‌నెట్ మీదికి రావడమే అరుదు. అందుకే ఈ గమ్మత్తులన్నీ మిస్సయ్యాను. మీ బ్లాగు చూశాక అన్నీ తవ్వి తీసి చదివాను. మోహన్ బాబుకు అల్లరి చేయడం అలవాటే అందులో ఆశ్చర్యపోవడానికేమీ లేదు. కానీ చిరంజీవి మాట్లాడిన మాటలు చాలా పెద్దమనిషి తరహాలో హుందాగా వున్నా అతను పడిన ఆవేశం, ఉద్రేకం, మాట రాక పోవడం, కళ్ళ నీళ్ళు రావడం (ఇవన్నీ ఈనాడూ అచ్చులో లేవు) చూస్తే అతను అంతగా ఫీలయ్యుండాల్సింది కాదనిపించింది. కానీ ఆయన భావోద్రేకము చూస్తే ఎప్పట్నుంచో గూడు కట్టుకున్న తన బాధని ఇలా వెళ్ళ గక్కాడనిపించింది.–ప్రసాద్http://blog.charasala.com

 17. విహారి said,

  నామటుకు నేను చిరంజీవి మాటలతో ఏకీభవిస్తాను.
  అంతే సమానంగా మోహన్ బాబు మాటలను ఖండించను.

  జరగాల్సిందంతా జరిపేసి చివర్లో నాటకాలేస్తున్నారు కొందరు.

  విహారి
  http://vihaari.blogspot.com

 18. నామటుకు నేను చిరంజీవి మాటలతో ఏకీభవిస్తాను.అంతే సమానంగా మోహన్ బాబు మాటలను ఖండించను.జరగాల్సిందంతా జరిపేసి చివర్లో నాటకాలేస్తున్నారు కొందరు.విహారిhttp://vihaari.blogspot.com

 19. చదువరి said,

  నేనింత గొప్పవాడిని అని చెప్పుకోడంలోనే ఉంది మోహన్‌బాబు చవకతనం. కానీ చిరంజీవి ఎందుకంత ఆవేశపడ్డాడో అర్థం కాలా! అసలు తనకిష్టం లేనపుడు శాలువా వగైరాలు తీసుకోడం ఎందుకు, ఆ తరువాత వాటిని కాలనాళికలో వెయ్యడమెందుకు? పైగా కళ్ళకద్దుకునే నాటకమొకటి! అం..థా సినిమా!

 20. నేనింత గొప్పవాడిని అని చెప్పుకోడంలోనే ఉంది మోహన్‌బాబు చవకతనం. కానీ చిరంజీవి ఎందుకంత ఆవేశపడ్డాడో అర్థం కాలా! అసలు తనకిష్టం లేనపుడు శాలువా వగైరాలు తీసుకోడం ఎందుకు, ఆ తరువాత వాటిని కాలనాళికలో వెయ్యడమెందుకు? పైగా కళ్ళకద్దుకునే నాటకమొకటి! అం..థా సినిమా!

 21. radhika said,

  ఇదంతా కాదుగాని ముందే తెర వెనుక ఏదో పెద్ద గొడవే జరిగినట్టుంది.లేకపోతే మోహన్ బాబు ఏమి అనక ముందే చిరు సన్మానాన్ని స్వీకరించలేకపోతున్నను అని చెప్పాడు గా.కారణం తరువాత చెపుతాను అని కూడా అన్నాడు.ఈలోపులో మోహన్ బాబు మాట అననే అనేసాడు.గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు అయింది చిరంజీవి పని.మరీ నాటకీయం గా చేసాడు.

 22. radhika said,

  ఇదంతా కాదుగాని ముందే తెర వెనుక ఏదో పెద్ద గొడవే జరిగినట్టుంది.లేకపోతే మోహన్ బాబు ఏమి అనక ముందే చిరు సన్మానాన్ని స్వీకరించలేకపోతున్నను అని చెప్పాడు గా.కారణం తరువాత చెపుతాను అని కూడా అన్నాడు.ఈలోపులో మోహన్ బాబు మాట అననే అనేసాడు.గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు అయింది చిరంజీవి పని.మరీ నాటకీయం గా చేసాడు.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: