ఫిబ్రవరి 10, 2007

నేను నేనే….

Posted in నేను వద్ద 3:45 సా. ద్వారా Praveen Garlapati

నేను నేనే….

నేను ఇంకెవరినో కాదు. నాకు ఎవరయినా వారి భావాలు నా మీద రుద్దాలని చూస్తే మండుకొస్తుంది. ఏ అందరికీ వారి వారి ఆలోచనలు ఉండవా ? మనకున్న అలోచనలే ఎదుటి వారికి నచ్చాలని ఎందుకనుకుంటారు ? ఎదుటి వారి అలొచనలకు నువ్వు ప్రాధాన్యత ఇవ్వక పోతె వారు మాత్రం నీ వాటికి ఎందుకు ఇవ్వాలి ?

చిన్నప్పటి నుంచీ ఎంతో independent గా పెరిగాను నేను. నేను అనుకున్నది సరి అయితే అదే చెసెంత స్వాతంత్ర్యం ఇచ్చారు నాకు మా అమ్మా నాన్నా. వారి అలోచనలు నా మీద రుద్దాలని ఏనాడూ అలోచించలెదు. నాకేది మంచిదనిపిస్తే అదే చెయ్యమనేవారు కాకపొతే వారి అలోచనలు, నేను తీసుకునే నిర్ణయం యొక్క మంచి చెడులు మాత్రం వివరించేవారు. రెండు వైపుల నుంచీ అలొచించి చెప్పేవారు. నిర్ణయం మాత్రం నాకు వదిలెసేవారు.

అందుకనే నేను అలాగే పెరిగాను. ఎవరు నన్ను, నా అలోచనలని అనవసరంగా నియంత్రించాలని చూసినా నాకు మా చెడ్డ చిరాకు. ఎవరయినా ఒక విషయం చెబితే విని వాటిలో మంచి చెడు అలొచించి నా నిర్ణయం తీసుకుంటాను. అంతే కానీ ఇదే చెయ్యి అంటే మాత్రం నాకు నచ్చదు. ఇదే అందరికీ అని నా అభిప్రాయం. కాబట్టి ఎవరయినా ఓ ఉచిత సలహా పాడెసె ముందు కొద్దిగా ఆలోచించి మరీ ఇవ్వాలని నా అభిప్రాయం.

అదే కాదు ఎవరన్నా ఏ కారణం లెకుండా అబ్బో ఇప్పటి తరం వారు అసలు చాలా చెడిపోతున్నారు అండి అనో, లెక ఈ క్రికెట్ ఉంది చూసారూ అందులో పడి జనాలు అసలేమి పట్టించుకోకుండా పోతున్నారు అనో లాంటివి అంటె కూడా. ఏ నాకు నచ్చినవి నేను చెయ్యడం కూడా తప్పేనా. ఇందువల్ల నేను ఎవరికయినా హాని చెస్తున్నానా ? ఎవరినయినా అగౌరవ పరుస్తున్నానా ? మరి ఏదీ లేనప్పుడు ఎందుకంత బాధ ?

నిజానికి చెప్పాలంటె నేను చూసినంతలో ఈ generation వారికి ఎంతో awareness పెరిగింది. చదువుకోవాలని, బాగా పైకి రావాలని, ఎదో సాధించాలి అని వీరిలో పట్టుదల ఎక్కువ.ఎక్కడ ఏమయినా విపరీతాలు జరిగినా, ప్రమాదాలు జరిగినా ధన రూపేణా నో లెక శ్రమ రూపేణానో మొదట సహయం అందించేది వీరే. ఎన్నో social activities లో పాలు పంచుకుంటూ, తాము సంపాదించిన డబ్బులలొ నుంచి ఎంతో కొంత వేరే వారికి ఇవ్వాలన్న అలోచనలూ ఎక్కువే. అంతే కాదు పర్యావరణం మీద అవగాహనా ఎక్కువే.

పెద్దలని గౌరవించట్లేదా అంటె అదీ నేను ఒప్పుకోను. ఇది వ్యక్తి ని బట్టి కానీ ఒక generation మొత్తం గా కాదు.

ఇక్కడ గుర్తించాల్సింది ఎమిటంటె మారుతున్న generation తో అలోచనలు మారుతుంటాయి , మీకు నచ్చిన సినిమాలు, మీకు నచ్చిన భావాలు నచ్చక పోవచ్చు. అంత మాత్రాన అదేదో తప్పు అని చూడకండి.

ఒక మచ్చుతునకగా బొమ్మరిల్లు సినిమా చూసిన వారికి అర్థమయ్యె ఉంటుంది. generations మధ్య gap ఉండడం సహజమే. మీరే అలొచించుకోండి మీ తల్లిదండ్రుల generation తో పొల్చుకుంటే మీలో ఏ మార్పూ లేదా ? మరి అలాంటప్పుడు మీరు మీ తరువాత generation నుంచి ఏ మార్పూ ఉండకూడదు అనుకొవడం ఎంత వరకూ సమంజసం ?

మీరు ఇప్పటికే reasonable గా ఉంటె ఏ సమస్యా లేదు లేకపోతే ఒకసారి అలొచించండి.

అసలు ఇదంతా ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటారా ఇవళ మా ఇంటికి ఒకరు వచ్చారు. ఆయన వాళ్ళ అబ్బాయి ఏం చెయ్యలో తనే నిర్ణయించేసి ఇప్పుడు అతను అది కాక వేరే ఏదో చెస్తానంటే అదేదో తప్పయినట్టు చెబుతున్నారు. నాకు కోపం వచ్చినా పెద్దవారయిపొయారు ఎమీ అనలేకపోయాను అదిగో అందుకే ఇలా.

ప్రకటనలు

4 వ్యాఖ్యలు »

 1. Harsha said,

  ఇది ప్రతీ జెనరేషన్లోనూ తప్పని పరిస్థితి అనుకుంటా. నూటికి తొంభై సార్లు పెద్దవాళ్ళు పిల్లల నిర్ణయాలపై తమ ఆందోళనలని భయాల్ని వ్యక్తపరచటానికి ప్రధాన కారణం తమ జీవితాల్లో అలాంటి సన్నివేశాల్లో తాము నిర్ణయాత్మకంగా వ్యవహరించలేకపోవటం అనిపిస్తుంది నాకు. చాలా సందర్భాల్లో పరిధిని మించి ఆలోచించిలేకపోవటం అనేది కూడా మరో కారణంగా కనిపిస్తుంది. అందుకే ఇది పూర్తిగా క్షమార్హమైన విషయమేనంటాను. నిజమే, ఒక్కోసారి భలే చిరాకు తెప్పిస్తాయి ఇలాంటి సందర్భాలు. కానీ పెద్దల ఆలోచనా పరిధిని అర్థం చేసుకోగలిగి అవేశపడకుండా తను సరైనదనుకున్న పని తాను చేసుకుపోగలిగే శక్తియుక్తులు ప్రతీ యువతరానికీ ఉండి తీరుతాయని నా అభిప్రాయం. కానీ ఒక్కోసారి వారి అనుభవం మనకు సరయిన పాఠాన్నే బోధిస్తూ ఉండవచ్చు. అయినా కూడా ఒక వయసు దాటిన పిల్లలకు సలహాలు మాత్రం ఇచ్చి నిర్ణయాధికారాన్ని మాత్రం వారికే వదిలెయ్యటం (వాళ్ళు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా కూడా) వారి అభివృధ్ధికే తోడ్పడుతుందని నేననుకుంటాను. మరి మనం పెద్దల జాబితాలో చేరాక ఈ “న్యూటన్స్ లా ఆఫ్ ఇనెర్షియా ఆఫ్ స్టేట్” ని ఎలా హ్యాండిల్ చేస్తామో చూడాలి. ఏమంటారు?

 2. Harsha said,

 3. ప్రవీణ్ గార్లపాటి said,

  నేను ఈ టపా రాయడం వెనక ఇలాంటి ఆలోచనే ఉంది అండి.
  మనం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.

  మీ ఆలోచనలతో ఏకీభవిస్తాను.

 4. నేను ఈ టపా రాయడం వెనక ఇలాంటి ఆలోచనే ఉంది అండి.మనం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.మీ ఆలోచనలతో ఏకీభవిస్తాను.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: