ఫిబ్రవరి 13, 2007

RSS…

Posted in atom, rss వద్ద 10:08 ఉద. ద్వారా Praveen Garlapati

RSS అంటే మనలో చాలా మందికే తెలిసి ఉంటుంది.

ఇప్పుడు మనం ఉపయొగించే కూడలి మొదలయినవి అన్నీ ఈ RSS తోనే సృష్తించబడినవి.

అసలు ఈ RSS అంటే ఎంటి ? simple గా చెప్పాలంటే ఇది XML అంతే. title, link, description మొదలయిన elements ఉండే ఒక XML document అన్నమాట.

RSS అంటే Really Simple Syndication, Rich Site Summary, RDF Site Summary అని కానీ అంటారు.

ఇంతకు ముందు ఎక్కువగా mailing lists ని వాడేవారు. కానీ వాటితో ఎన్నో సమస్యలు. స్పాం బెడద ఎక్కువగా ఉండేది కూడా. అలా కాకుండా users కి కావలసిన విధంగా updates అందుకునే విధంగా ఈ RSS ఉపయొగపడుతుంది.

ఇది అందించే వెబ్ సైట్ కీ, users కీ ఇద్దరికీ సమానంగా ఉపయొగపడుతుంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు కొత్త సమాచారం తెలుసుకోవడానికి users కీ, users ని ఆకర్షించడానికి వెబ్ సైట్ లకూ ఉపయొగపడుతుంది.

అంతే కాక ఇప్పుడు మనం చూస్తున్న Digg, Lifehacker, Techmeme, TechCrunch, Reddit, లాంటి వెబ్ సైట్ లు అన్నీ ప్రచారం పొందడానికి కూడా ఈ RSS పాత్ర ఎంతో ఉంది. ఇప్పుడు తయారయే ఏ వెబ్ సైట్ కన్నా RSS ఉంటుంది. అదే కాక అన్ని బ్లాగులకీ, న్యూస్ సైట్లకి కూడా ఈ సౌకర్యం ఉంటుంది. వారు కొత్త సమాచారం publish చెయ్యగానే మీకిట్టే తెలిసిపోతుంది RSS feeds ద్వారా.

మరి ఈ XML లాగా ఉండే RSS చదవడానికి చాలా కష్టంగా ఉంటుంది కదా అందుకనే దానికోసం Feed Readers అనే సాఫ్ట్ వేర్లు అందుబాటులోకి వచ్చాయి. ఇవి desktop సాఫ్ట్ వేర్ల గానూ, వెబ్ వెర్షన్లలోనూ ఉంటాయి. thunderbird లాంటి డెస్క్ టాప్ సాఫ్ట్ వేర్ల లోను, bloglines, Google Reader వంటి వెబ్ వర్షన్లలో లభ్యం. వీటిలో మీకు నచ్చిన RSS ఫీడ్లను add చేసుకుని చదవచ్చు. ఇవే కాక netvibes లాంటివి కూడా ఎంతో ఉపయొగకరం.

పైన చెప్పుకున్న లాభాలే కాక మీరు కూడా వేరు వేరు వెబ్ సైట్ల నుంచి ఫీడ్లను ఉపయొగించి మీ సొంత applications రాయవచ్చు (feed aggregators). ఉదాహరణకి Google News, కూడలి, తేనెగూడు లాగా.

ఇంతకీ ఒక వెబ్ సైట్ కి ఈ RSS సౌకర్యం ఉందో లేదో తెలుసుకోవడం ఎలా ?

మీరు ఎదయిన వెబ్ సైట్ కి వెళ్ళినప్పుడు ఈ క్రింద లాంటి icons చూస్తే గనక దానికి ఈ RSS సౌలభ్యం ఉన్నట్టే.

అదే కాక ఫైర్ఫాక్స్ లాంటి బ్రౌసర్లు కూడా వీటిని ప్రత్యెకంగా చూపిస్తాయి మీ URL bar లో.

ఇక మీరు వీటిని పోగేసుకుని సమాచారం అందుకోవడమే తరువాయి.

గమనిక: RSS లాంటి standards ఇంకా వేరే కూడా ఉన్నాయి. Atom అందులో ఒకటి. RSS 1.0, 2.0 version లు కూడా ఉన్నాయి.

ప్రకటనలు

5 వ్యాఖ్యలు »

  1. Ramanadha Reddy said,

    మంచి సమాచారం. ఇప్పుడే సుధాకర్ గారి Savvy చూసొచ్చి IE7లో కూడలి ఫీడ్ జోడించి మీ పోస్టు చూస్తున్నాను. థాంక్యూ.

  2. మంచి సమాచారం. ఇప్పుడే సుధాకర్ గారి Savvy చూసొచ్చి IE7లో కూడలి ఫీడ్ జోడించి మీ పోస్టు చూస్తున్నాను. థాంక్యూ.

  3. ప్రవీణ్ గార్లపాటి said,

    గూగుల్ రీడర్ తప్ప ఇంకేది నేను ఉపయోగించలేనండి. ఇంతకు ముందు bloglines ఉపయోగించే వాడిని. ఇప్పుడు ఇదొక్కటే.
    అసలు ie అంటే ఏంటో కూడా నాకు తెలీదు. నిజంగా నిజం 🙂
    మీరు firefox గనక ఉపయోగిస్తున్నట్టయితే sage అనే ఒక extension ఉంది. బాగుంది.

  4. గూగుల్ రీడర్ తప్ప ఇంకేది నేను ఉపయోగించలేనండి. ఇంతకు ముందు bloglines ఉపయోగించే వాడిని. ఇప్పుడు ఇదొక్కటే.అసలు ie అంటే ఏంటో కూడా నాకు తెలీదు. నిజంగా నిజం :)మీరు firefox గనక ఉపయోగిస్తున్నట్టయితే sage అనే ఒక extension ఉంది. బాగుంది.

  5. harsha said,

    ఏదైనా ఒక webpageకి rssలేనట్లయితే మనమట్టుగా websiteవారి ప్రమేయం లేకుండా rssకొత్తది తయారు చెయ్యటం సాధ్యమా? (urlసహాయం తో )


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: