ఫిబ్రవరి 19, 2007

Tom Hanks…

Posted in Tom Hanks వద్ద 4:04 సా. ద్వారా Praveen Garlapati

Tom Hanks ఒక విలక్షణమయిన నటుడు. మన ఇండియా లో నటులతో పోల్చాలంటే ఒక్క అమీర్ ఖాన్ ని కొద్దిగా దూరంగా చూడచ్చు.

నేను పెద్దగా ఇంగ్లీషు సినిమాలు చూసే వాడిని కాదు. ఎదో తెలుగు, హిందీ సినిమాల నుంచి కొద్దిగా బ్రేక్ ఇవ్వడానికి మధ్య మధ్యలో చూసే వాడిని. అలాంటి నాకు ఇంగ్లీషు సినిమాల మీద ఆసక్తి కలిగించి వాటి మీదకి మనసు మళ్ళేలా చేసింది Tom Hanks ఏ అంటే అతిశయొక్తి కాదు.

నేను చూసిన Tom Hanks మొదటి సినిమా Forrest Gump. చాలా బాగా నచ్చింది. అది చూడగానే అనుకున్నాను ఇతను రొటీన్‌గా సినిమాలు చేసే రకం కాదు అని. ఆ తరువాత ఈ మధ్య కొద్దిగా సమయం చిక్కడంతో స్నెహితుడి దగ్గర ఉన్న The Terminal, Cast Away తో మొదలెట్టాను. తరువాత అసలు ఇంత మంచి సినిమాలు నేను ఇన్ని రోజులు మిస్ అయ్యానా అని అనుకుని ఇక చూడడం మొదలెట్టాను. అలా The Green Mile, You’ve Got Mail కూడా చూసాను. ఒక్కోటి ఒక్కో కళాఖండం. దేనికదే సాటి అనిపించింది. ఇంకా చాలా చూడాల్సినవి మిగిలిపోయాయి. ముందుగా Saving Private Ryan చూడాలి.

The Terminal విమానాశ్రయం terminal లో అనుకోకుండా చిక్కుపడిపొయిన ఒక మనిషి ఎలా గడిపాడు అన వ్రుత్తాంతంతో నడుస్తుంది. ఎంతో హాస్యం తో నిండి ఉన్నా ఆఖరన ఎందుకు అంత పట్టుదలతో తనకు కావలసినది సాధించుకున్నాడు అనేది తెలిసి కళ్ళళ్ళో నీళ్ళు తిరుగుతాయి.

Cast Away లో విమాన ప్రమాదం లో ఒక దీవిలో చిక్కుకుపొయి ఎన్నో యేళ్ళు ఎలా గడిపాడు అన్న ఒక కథ. మనుషులు, విలువలు ఎంత ముఖ్యమో, వీటిలో చూడచ్చు.

Green Mile కూడా ఒక మంచి సినిమా. ప్రత్యెకమయిన శక్తులు ఉన్న ఒక మనిషి గురించిన కథ ఇది. Tom Hanks ఇందులో మంచి కీ చెడు కీ మధ్య నలిగిపోతాడు.

You’ve Got Mail లో internet లో కలిసిన ఒక స్నెహితురాలు నిజ జీవితంలో తనకు పోటీదారు అవుతుంది. ఒక మంచి ప్రేమ కథ.

Forrest Gump గురించి అయితే చెప్పలేను చూడవలసిందే.

మిగిలిన వాటిలో మంచివి ఎవో చెబితే అవి కూడా చూస్తాను మరి. చెప్పండి.

ప్రకటనలు

17 వ్యాఖ్యలు »

 1. Krishh Raem said,

  TOM HANKS మీద ఇష్టానికంటే ఆయన మీద గౌరవమే ఎక్కువ నాకు !!

  ఫొర్బ్స్ వారి సర్వే ప్రకారం అయన హాలివుడ్ లో అత్యంత నమ్మదగిన వ్యక్తి !!

  http://www.forbes.com/2006/09/22/tech-cx_lr_06trust_trustcelebslide.html?partner=aollatino

  నాకు నచ్చిన ఆయన సినిమాలు !!

  Road to Perdition ఇందులో అయన పెర్ఫర్మెన్స్ అల్టిమేట్ , కచ్చితంగా మరో సారి ఫ్లాట్ మీరు !!

  Philadelphia ఇందులో ఆయన AIDS పేషంట్ గా నటించారు !! ఆస్కార్ కూడా కొట్టేసారు !!

  APOLLO 13 గురించి ఎలా మర్చి పోగలం !!

  CATCH ME IF YOU CAN స్టీవెన్ స్పీల్ బర్గ్ గారి తో టాం హాంక్శ్ చేసిన మరో సినిమా !!

  SLEEP LESS IN SEATTLE కూడా బావుంటుంది !!

  ఇక ఈ మధ్యే రీలీస్ అయిన DA VINCI CODE కూడా బానే ఉంది !! మీరు బుక్ చదవక పోయి

  ఉంటే ఇంకా ఎక్కువగా నచ్చుతుంది !! మీరు చూసేది మన హీరో గారి కొసం కాబట్టి బుక్ చదవక పోయినా ఫర్లేదు !!

  అయన మంచి ఆక్టర్ ఈ కదండొయి సూపర్ డైరెక్టర్ కూడా BAND OF BROTHERS అనే HBO సీరియల్ డైరెక్ట్ చేసారు !!uq

 2. Krishh Raem said,

  TOM HANKS మీద ఇష్టానికంటే ఆయన మీద గౌరవమే ఎక్కువ నాకు !!ఫొర్బ్స్ వారి సర్వే ప్రకారం అయన హాలివుడ్ లో అత్యంత నమ్మదగిన వ్యక్తి !!http://www.forbes.com/2006/09/22/tech-cx_lr_06trust_trustcelebslide.html?partner=aollatinoనాకు నచ్చిన ఆయన సినిమాలు !! Road to Perdition ఇందులో అయన పెర్ఫర్మెన్స్ అల్టిమేట్ , కచ్చితంగా మరో సారి ఫ్లాట్ మీరు !!Philadelphia ఇందులో ఆయన AIDS పేషంట్ గా నటించారు !! ఆస్కార్ కూడా కొట్టేసారు !!APOLLO 13 గురించి ఎలా మర్చి పోగలం !!CATCH ME IF YOU CAN స్టీవెన్ స్పీల్ బర్గ్ గారి తో టాం హాంక్శ్ చేసిన మరో సినిమా !!SLEEP LESS IN SEATTLE కూడా బావుంటుంది !!ఇక ఈ మధ్యే రీలీస్ అయిన DA VINCI CODE కూడా బానే ఉంది !! మీరు బుక్ చదవక పోయి ఉంటే ఇంకా ఎక్కువగా నచ్చుతుంది !! మీరు చూసేది మన హీరో గారి కొసం కాబట్టి బుక్ చదవక పోయినా ఫర్లేదు !!అయన మంచి ఆక్టర్ ఈ కదండొయి సూపర్ డైరెక్టర్ కూడా BAND OF BROTHERS అనే HBO సీరియల్ డైరెక్ట్ చేసారు !!uq

 3. Dr.Ismail said,

  This comment has been removed by the author.

 4. Dr.Ismail said,

  ఈ చిత్రాలు మిస్ కాకండి…
  Catch Me If You Can.
  Road to Perdition.
  మరీ ముఖ్యంగా…
  Philadelphia
  అందులో ఎయిడ్స్ రోగిగా అత్యద్భుతమైన నటన ప్రదర్శించాడు.

  మీరన్నట్లు ‘అమీర్ ఖాన్’ ఇతన్ని అనుకరిస్తాడు…అమితాబ్ నటనలో ‘అల్ పచీనో’ ఛాయలు కనిపించినట్టు!

  11:03 PM

 5. Dr.Ismail said,

  ఈ చిత్రాలు మిస్ కాకండి…Catch Me If You Can.Road to Perdition.మరీ ముఖ్యంగా…Philadelphiaఅందులో ఎయిడ్స్ రోగిగా అత్యద్భుతమైన నటన ప్రదర్శించాడు.మీరన్నట్లు ‘అమీర్ ఖాన్’ ఇతన్ని అనుకరిస్తాడు…అమితాబ్ నటనలో ‘అల్ పచీనో’ ఛాయలు కనిపించినట్టు! 11:03 PM

 6. ప్రవీణ్ గార్లపాటి said,

  @krishh raem:

  మీ దగ్గర నుంచి response వస్తుందని ఊహించాను 🙂

  thanks! చక్కని సినిమాలు పరిచయం చేసినందుకు.

  అయ్యో Da Vinci Code గురించి మర్చిపోయాను. ఒకప్పుడు చూసేవాడిని కాదు కానీ ఇప్పుడు latest గా వచ్చే మంచి ఇంగ్లీష్ సినిమాలన్నీ హాం ఫట్టే.

  సినిమాలు చూడక పోయినా novels మాత్రం తెగ చదువుతాను అందుకే Dan Brown నవలలన్నీ ఎప్పుడో అవుటు 🙂

 7. @krishh raem: మీ దగ్గర నుంచి response వస్తుందని ఊహించాను :)thanks! చక్కని సినిమాలు పరిచయం చేసినందుకు.అయ్యో Da Vinci Code గురించి మర్చిపోయాను. ఒకప్పుడు చూసేవాడిని కాదు కానీ ఇప్పుడు latest గా వచ్చే మంచి ఇంగ్లీష్ సినిమాలన్నీ హాం ఫట్టే. సినిమాలు చూడక పోయినా novels మాత్రం తెగ చదువుతాను అందుకే Dan Brown నవలలన్నీ ఎప్పుడో అవుటు 🙂

 8. ప్రవీణ్ గార్లపాటి said,

  @ఇస్మాయిల్ గారు:

  మీరు చెప్పిన సినిమాలు తప్పకుండా చూస్తాను.

 9. @ఇస్మాయిల్ గారు:మీరు చెప్పిన సినిమాలు తప్పకుండా చూస్తాను.

 10. Krishh Raem said,

  మీ దగ్గర నుంచి response వస్తుందని ఊహించాను

  హి హి హి ….

  @ ISMAIL sir

  అమితాబ్ నటన అల్ పచీనో తో పోలి ఉంటుందా ?? ఎప్పుడూ గమనించ లేదు !! రేపు ఎలాగో ఏకలవ్య వెల్తున్నా చూడాలి ఈ సారి !!

 11. Krishh Raem said,

  మీ దగ్గర నుంచి response వస్తుందని ఊహించాను హి హి హి ….@ ISMAIL sir అమితాబ్ నటన అల్ పచీనో తో పోలి ఉంటుందా ?? ఎప్పుడూ గమనించ లేదు !! రేపు ఎలాగో ఏకలవ్య వెల్తున్నా చూడాలి ఈ సారి !!

 12. కొత్త పాళీ said,

  టాం హేంక్స్ నటజీవితం ప్రారంభించిన కొత్తలో అమాయకుడైన రొమాంటిక్ హీరో పాత్రలే వేశాడు. చూడ్డానికీ అలేగే ఉండే వాడు – రింగుల జుట్టు, ముద్దొచ్చే మొహం, అమాయకత నిండిన కళ్ళు, కొంచెం పప్పు సుద్ద లా కనిపించే వొళ్ళు. అతనీ దశలో ఉండగా నే చూసిన సినిమాలు – Splash, Dragnet, Big. ఇందులో చివరది ఈ మధ్య మహేష్ బాబుతో తెలుగు లో వచ్చిన సినిమా (చిన్ని? బుజ్జి?) కి మూలం. ఈ సినిమాలన్నీ కుటుంబ సహితంగా చూసి హాయిగా నవ్వుకునేట్టు ఉంటాయి. ఈ Big చిత్రంలో నటనకి ఆయన చాలా అవార్డులు గెలిచాడు.
  ఆయన నట జీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం Philadelphia. దీంట్లో నటనకి ఆస్కార్ వచ్చింది.
  నాకు వ్యక్తిగతంగా చాలా నచ్చిన చిత్రం Green Mile.
  2001 తరవాత వచ్చిన సినిమాలు ఎక్కువ చూడలేదు.
  ఆయన సినిమాలన్నిటి వివరాలకు http://www.imdb.com లో చూడండి.

 13. టాం హేంక్స్ నటజీవితం ప్రారంభించిన కొత్తలో అమాయకుడైన రొమాంటిక్ హీరో పాత్రలే వేశాడు. చూడ్డానికీ అలేగే ఉండే వాడు – రింగుల జుట్టు, ముద్దొచ్చే మొహం, అమాయకత నిండిన కళ్ళు, కొంచెం పప్పు సుద్ద లా కనిపించే వొళ్ళు. అతనీ దశలో ఉండగా నే చూసిన సినిమాలు – Splash, Dragnet, Big. ఇందులో చివరది ఈ మధ్య మహేష్ బాబుతో తెలుగు లో వచ్చిన సినిమా (చిన్ని? బుజ్జి?) కి మూలం. ఈ సినిమాలన్నీ కుటుంబ సహితంగా చూసి హాయిగా నవ్వుకునేట్టు ఉంటాయి. ఈ Big చిత్రంలో నటనకి ఆయన చాలా అవార్డులు గెలిచాడు.ఆయన నట జీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం Philadelphia. దీంట్లో నటనకి ఆస్కార్ వచ్చింది.నాకు వ్యక్తిగతంగా చాలా నచ్చిన చిత్రం Green Mile. 2001 తరవాత వచ్చిన సినిమాలు ఎక్కువ చూడలేదు. ఆయన సినిమాలన్నిటి వివరాలకు http://www.imdb.com లో చూడండి.

 14. పవన్‌ said,

  ఇప్పటికే అందరూ మంచి సినెమాలు అన్నీ చెప్పారు… నేను recommend చేసేవి …road to perdition (ఇందులో తండ్రీ కోడుకుల మధ్య అనుబంధం బాగా చిత్రీకరించారు) and big (తమిళ్‌లో new తెలుగులో నాని)

 15. ఇప్పటికే అందరూ మంచి సినెమాలు అన్నీ చెప్పారు… నేను recommend చేసేవి …road to perdition (ఇందులో తండ్రీ కోడుకుల మధ్య అనుబంధం బాగా చిత్రీకరించారు) and big (తమిళ్‌లో new తెలుగులో నాని)

 16. ప్రవీణ్ గార్లపాటి said,

  సూపర్ ఇక నాకు ఒక నెల కి సరిపడా సినిమాలు దొరికినట్టే !

 17. సూపర్ ఇక నాకు ఒక నెల కి సరిపడా సినిమాలు దొరికినట్టే !


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: