ఫిబ్రవరి 28, 2007

Gaim…

Posted in gaim వద్ద 7:41 సా. ద్వారా Praveen Garlapati

మీరు ఎన్నో “IM” (Internet Messenger) లు వాడుతుంటారు. అన్నిటినీ లోకీ లాగిన్ అయ్యి వాటికోసం టాస్క్ బార్ లో అంత ప్రదేశం కేటాయించాలంటే కష్టమే కదా.

అందుకనే నేను gaim వాడతాను.

ఇదో Open Source సాఫ్ట్ వేర్. ఇది Yahoo, MSN, Google Talk, AIM, Jabber, ICQ, Sametime మొదలయిన ఎన్నో IMs తో పని చెయ్యగలదు.

అన్నీ విడి విడిగా తెరచి ఉంచక్కర్లేకుండా అన్నిటినీ కలిపి gaim లో తెరవవచ్చు. అదే కాకుండా ఇందులో కొన్ని ప్రత్యేకమయిన సదుపాయాలు ఉన్నాయి. ఏంటంటే వేరే IM లలో మీరు ఒకసారి ఒకే అకౌంట్ లో లాగిన్ అయ్యి ఉండగలరు. కానీ gaim ఉపయొగించి ఒకేసారి ఒకే IM కి సంబంధించిన ఎన్నయినా అకౌంట్లలో లాగిన్ అయ్యి ఉండవచ్చు (మీ స్నేహితులకొకటి, మీ గర్ల్ ఫ్రెండ్ కోసం ఒకటి అన్నమాట 😉 ).

అదే కాక ఎన్నో పెద్ద కంపనీలు వాడే IBM వారి Sametime ని కూడా ఇది support చేస్తుంది. కాబట్టి మీ కార్పోరేట్ మెసంజర్ లను కూడా ఇందులో నిక్షిప్తం చేసుకోవచ్చు అన్నమాట .

దీనికి ఎన్నో చక్కటి plugins కూడా ఉన్నాయి. నాకు అన్నిటికన్నా నచ్చింది psychic mode అనే plugin. ఇదేంటి అంటే అవతలి వారు మీకు మెసేజ్ పంపుదామని IM window తెరిస్తే చాలు. మీకు ఇక్కడ తెలిసిపోతుంది. వారు మెసేజ్ పంపకముందే మీకు తెలిసిపోతుంది. అదే మరి. అలాగే మీరు వింటున్న సంగీతం, పాటలు మీ IM status గా మార్చే plugin కూడా ఉంది. ఇలాంటివెన్నో.

ఇది మొదట లినక్స్ కోసం తయారు చెయ్యబడినది, కానీ తరవాత GTK ని విండోస్ కి port చెయ్యడంతో సుబ్బరంగా విండోస్ లో కూడా వాడుకునే వీలు వచ్చింది. ప్రయత్నించండి మరి.

ప్రకటనలు

18 వ్యాఖ్యలు »

 1. Rajendra said,

  నేను కూడా గైం ఉపయోగిస్తాను. చాలా ఉపయోకరం. ఇది జాబ్బర్ తో కూడా పని చేస్తుంది.

 2. Rajendra said,

  నేను కూడా గైం ఉపయోగిస్తాను. చాలా ఉపయోకరం. ఇది జాబ్బర్ తో కూడా పని చేస్తుంది.

 3. Rajendra said,

  నేను కూడా గైం ఉపయోగిస్తాను. చాలా ఉపయోకరం. ఇది జాబ్బర్ తో కూడా పని చేస్తుంది.

 4. Rajendra said,

  నేను కూడా గైం ఉపయోగిస్తాను. చాలా ఉపయోకరం. ఇది జాబ్బర్ తో కూడా పని చేస్తుంది.

 5. రానారె said,

  ఇది వ్యవస్థాపితం చేశాక, నా కంప్యూటరునుండి యాహూ, జీటాక్, లైవ్‌మెసెంజర్లను తుడిచేయొచ్చా? కాస్త స్థలమ మిగుల్చుకోవచ్చు కదా!?

 6. ఇది వ్యవస్థాపితం చేశాక, నా కంప్యూటరునుండి యాహూ, జీటాక్, లైవ్‌మెసెంజర్లను తుడిచేయొచ్చా? కాస్త స్థలమ మిగుల్చుకోవచ్చు కదా!?

 7. సుధాకర్(శోధన) said,

  నేను కొద్ది నెలలుగా దీనిని జీటాక్ కోసం వాడుతున్నా. బాగానే వుంది (జీటాక్ కు).చాలా తేలిక రకం అప్లికేషన్. మీరన్నట్లు psychic mode మొదట బాగానే వుంటుంది, గానీ రాను రాను దానితో చాలా privacy చిక్కులున్నాయి. Gtalk మొదటినుంచి plain vanilla కాబట్టి నాకు గైమ్ బాగానే వుంది. అయితే యాహూ, లైవ్ మెసెంజర్లు ఇచ్చే యూజర్ ఎక్స్పీరియన్స్ ఇది చచ్చినా ఇవ్వలేదు. నేను యాహూ మిత్రులకు, లైవ్ మిత్రులకూ కలిపి లైవ్ మెసెంజర్నే వాడుతా.

 8. నేను కొద్ది నెలలుగా దీనిని జీటాక్ కోసం వాడుతున్నా. బాగానే వుంది (జీటాక్ కు).చాలా తేలిక రకం అప్లికేషన్. మీరన్నట్లు psychic mode మొదట బాగానే వుంటుంది, గానీ రాను రాను దానితో చాలా privacy చిక్కులున్నాయి. Gtalk మొదటినుంచి plain vanilla కాబట్టి నాకు గైమ్ బాగానే వుంది. అయితే యాహూ, లైవ్ మెసెంజర్లు ఇచ్చే యూజర్ ఎక్స్పీరియన్స్ ఇది చచ్చినా ఇవ్వలేదు. నేను యాహూ మిత్రులకు, లైవ్ మిత్రులకూ కలిపి లైవ్ మెసెంజర్నే వాడుతా.

 9. ప్రవీణ్ గార్లపాటి said,

  @రానారె: తీసెయ్యచ్చండీ…
  వాటి అవసరం ఉండదు. కాకపోతే మీరు కొన్నాళ్ళు gaim వాడి నచ్చితే అప్పుడు తీసేయండి.

 10. @రానారె: తీసెయ్యచ్చండీ…వాటి అవసరం ఉండదు. కాకపోతే మీరు కొన్నాళ్ళు gaim వాడి నచ్చితే అప్పుడు తీసేయండి.

 11. ప్రవీణ్ గార్లపాటి said,

  @శోధన: నాకు మొదటి నుంచీ ఇతర మెసెంజర్లలో హంగులు ఆర్భాటాలు (ఆడ్స్ కూడాను) అంటే చిరాకు. అందుకే నాకు ఇది suitable.
  అవును ఇది మిగతా మెసెంజర్ల లాగా కాదు. మీకు వాయిస్ సౌకర్యం కూడా ఉండదు.
  కానీ నాకు దీని User Experience బాగా నచ్చింది. అన్నీ simplistic గా deal చేస్తుంది. IM లో నాకు కావలసిన సౌకర్యం communication, అది నాకు text ఒక్కటే. కాబట్టి అతికినట్టు సరిపోయింది. మీరు Google Talk కోసం ఇది వాడే బదులు దాని మెసెంజరే వాడచ్చు కదా. అది చగ్గా ఉంటుంది. 🙂

 12. @శోధన: నాకు మొదటి నుంచీ ఇతర మెసెంజర్లలో హంగులు ఆర్భాటాలు (ఆడ్స్ కూడాను) అంటే చిరాకు. అందుకే నాకు ఇది suitable. అవును ఇది మిగతా మెసెంజర్ల లాగా కాదు. మీకు వాయిస్ సౌకర్యం కూడా ఉండదు.కానీ నాకు దీని User Experience బాగా నచ్చింది. అన్నీ simplistic గా deal చేస్తుంది. IM లో నాకు కావలసిన సౌకర్యం communication, అది నాకు text ఒక్కటే. కాబట్టి అతికినట్టు సరిపోయింది. మీరు Google Talk కోసం ఇది వాడే బదులు దాని మెసెంజరే వాడచ్చు కదా. అది చగ్గా ఉంటుంది. 🙂

 13. సుధాకర్(శోధన) said,

  మీరు UX అనే దానిని ఏ సందర్భంలో బాగుందన్నారో నాకస్సలు అర్ధం కావటం లేదు. Gaim simplicity అయితే బాగానే వుంటుంది కానీ User Experience బాగుంటుందంటే అస్సలు ఒప్పుకో బుద్ధవ్వటం లేదు. Icons అన్ని తికమకగా వుంటాయి.Gaim తాలుకా UX మీద కావలంటే ఒక Article రాసి ఇస్తా మీకు(End user perspective).

  ఇక మీరు హంగులన్నవి హంగులు కావు. అవి గత ఇరవై సంవత్స్రరాలలో చాట్లో వచ్చిన విప్లవాత్మక మార్పులు. Smiley అనే కాన్సెప్టు వచ్చి దాదాపు పదేల్లు అవుతుంది. :-%) అని కనిపిస్తే ఎంతమందికి అర్ధం అవుతుంది? అది మంచి UX ఎలా అవుతుంది?

  మీరన్నట్లు ఒక్క Text పంపుకోవటానికి మాత్రమే అయితే Gaim వాడండి. Text తో పాటు భావ వ్యక్తీకరణ చెయ్యాలంటే yahoo, live or AOL వాడండి 🙂

 14. మీరు UX అనే దానిని ఏ సందర్భంలో బాగుందన్నారో నాకస్సలు అర్ధం కావటం లేదు. Gaim simplicity అయితే బాగానే వుంటుంది కానీ User Experience బాగుంటుందంటే అస్సలు ఒప్పుకో బుద్ధవ్వటం లేదు. Icons అన్ని తికమకగా వుంటాయి.Gaim తాలుకా UX మీద కావలంటే ఒక Article రాసి ఇస్తా మీకు(End user perspective). ఇక మీరు హంగులన్నవి హంగులు కావు. అవి గత ఇరవై సంవత్స్రరాలలో చాట్లో వచ్చిన విప్లవాత్మక మార్పులు. Smiley అనే కాన్సెప్టు వచ్చి దాదాపు పదేల్లు అవుతుంది. :-%) అని కనిపిస్తే ఎంతమందికి అర్ధం అవుతుంది? అది మంచి UX ఎలా అవుతుంది? మీరన్నట్లు ఒక్క Text పంపుకోవటానికి మాత్రమే అయితే Gaim వాడండి. Text తో పాటు భావ వ్యక్తీకరణ చెయ్యాలంటే yahoo, live or AOL వాడండి 🙂

 15. ప్రవీణ్ గార్లపాటి said,

  User Experience అనేది User మీదే ఆధారపడి ఉంటుంది. అది అందరికీ ఒకేలా ఉండాలని లేదు. నేను ముందే చెప్పినట్టు నాకు IM అనేది నాకు ఒక text communication వరకే, అంతకన్నా ఎక్కువ కావాలంటే నేను ఫోను, లేదా స్కైప్ వాడతాను. అప్పుడప్పుడూ Google Talk కూడా. మెసెంజర్ లో వాయిస్, వెబ్ కాం, రేడియో, ఆడ్స్ నాకు పెద్దగా అవసరం లేదు. కాబట్టి నాకు సంబంధించినంత వరకు నా User Experience బాగానే ఉంది.

  నేను యాహూ, ఎమెసెన్, మొదలయినవి అన్నీ వాడాను. అన్నిట్లోకీ కొద్దిగా better అనిపించింది ఒక్క Google Talk మాత్రమే. ఇది నేను గూగుల్ మీద నాకున్న అభిమానం తో చెప్పడం లేదు. ఏదో argument కోసం కూడా చెప్పట్లేదు. ఇది నా honest opinion. simplicity నాకు చాలా ముఖ్యం.

  అసలు gaim ఎందుకు బాలేదో నాకు అర్థం కావట్లేదు. పది మెసెంజర్లు ఓపెన్ చేసి వాటి మధ్య స్విచ్ అవుతూ, పది చాట్ విండోలు ఓపెన్ చేసి మాట్లాడడం నా వల్ల కాలేదు. gaim లో నేను అన్ని యూజర్లనూ నాకు కావలసిన common categories లో పెట్టుకుంటాను, అది ఏ మెసెంజర్ నుంచి అయినా కానీ. అందుకని organize చేసుకోడానికి ఎంతో చక్కగా ఉంటుంది. conversations అన్నీ tabbed windows లో ఉంటాయి, కాబట్టి పది విండొస్ ఓపెన్ చేసి ఉంచవలసిన అవసరం లేదు. అన్నీ firefox లో లాగా tabs లాగా లభ్యం. ఇంకో చిన్న ఉదాహరణ చెబుతాను, మీరు gaim ని తెరిచి మీకు కావలసిన పేరు ని టైప్ చేసెయ్యండి అది మిమ్మల్ని సరిగ్గా ఆ పేరు మీదకి తీసుకెళ్ళిపోతుంది. ఇది మంచి User Experience కాదా ?

  gaim లో smileys లేవా ? అదేంటండీ అలా అంటారు. నేను చక్కగా వాడుతుంటేనూ. దాదాపు తరచూ వాడే అన్ని smileys దాంట్లో లభ్యం. అది కూడా ఏ మెసెంజర్ కు సంబంధించి దానికి తగ్గట్టుగా.

  మీరే వర్షన్ వాడుతున్నారో నాకు తెలీదు కానీ 2.0 beta 6 వాడి చూడండి.

  ఇది నా opinion మాత్రమే, అందరికీ అలాగే ఉండాలని నేను అనుకోవట్లేదు కూడా. అందరికీ దీనిని పరిచయం చేయాలని నా అభిమతం అంతే. 🙂

 16. User Experience అనేది User మీదే ఆధారపడి ఉంటుంది. అది అందరికీ ఒకేలా ఉండాలని లేదు. నేను ముందే చెప్పినట్టు నాకు IM అనేది నాకు ఒక text communication వరకే, అంతకన్నా ఎక్కువ కావాలంటే నేను ఫోను, లేదా స్కైప్ వాడతాను. అప్పుడప్పుడూ Google Talk కూడా. మెసెంజర్ లో వాయిస్, వెబ్ కాం, రేడియో, ఆడ్స్ నాకు పెద్దగా అవసరం లేదు. కాబట్టి నాకు సంబంధించినంత వరకు నా User Experience బాగానే ఉంది.నేను యాహూ, ఎమెసెన్, మొదలయినవి అన్నీ వాడాను. అన్నిట్లోకీ కొద్దిగా better అనిపించింది ఒక్క Google Talk మాత్రమే. ఇది నేను గూగుల్ మీద నాకున్న అభిమానం తో చెప్పడం లేదు. ఏదో argument కోసం కూడా చెప్పట్లేదు. ఇది నా honest opinion. simplicity నాకు చాలా ముఖ్యం.అసలు gaim ఎందుకు బాలేదో నాకు అర్థం కావట్లేదు. పది మెసెంజర్లు ఓపెన్ చేసి వాటి మధ్య స్విచ్ అవుతూ, పది చాట్ విండోలు ఓపెన్ చేసి మాట్లాడడం నా వల్ల కాలేదు. gaim లో నేను అన్ని యూజర్లనూ నాకు కావలసిన common categories లో పెట్టుకుంటాను, అది ఏ మెసెంజర్ నుంచి అయినా కానీ. అందుకని organize చేసుకోడానికి ఎంతో చక్కగా ఉంటుంది. conversations అన్నీ tabbed windows లో ఉంటాయి, కాబట్టి పది విండొస్ ఓపెన్ చేసి ఉంచవలసిన అవసరం లేదు. అన్నీ firefox లో లాగా tabs లాగా లభ్యం. ఇంకో చిన్న ఉదాహరణ చెబుతాను, మీరు gaim ని తెరిచి మీకు కావలసిన పేరు ని టైప్ చేసెయ్యండి అది మిమ్మల్ని సరిగ్గా ఆ పేరు మీదకి తీసుకెళ్ళిపోతుంది. ఇది మంచి User Experience కాదా ?gaim లో smileys లేవా ? అదేంటండీ అలా అంటారు. నేను చక్కగా వాడుతుంటేనూ. దాదాపు తరచూ వాడే అన్ని smileys దాంట్లో లభ్యం. అది కూడా ఏ మెసెంజర్ కు సంబంధించి దానికి తగ్గట్టుగా.మీరే వర్షన్ వాడుతున్నారో నాకు తెలీదు కానీ 2.0 beta 6 వాడి చూడండి. ఇది నా opinion మాత్రమే, అందరికీ అలాగే ఉండాలని నేను అనుకోవట్లేదు కూడా. అందరికీ దీనిని పరిచయం చేయాలని నా అభిమతం అంతే. 🙂

 17. సుధాకర్(శోధన) said,

  నా భావం మీకు అర్ధం అయినట్లు లేదు 🙂 నేను గైం బాగుండదనో లేక పోతే దానిని వాడకూడదనో చెప్పటం లేదు. నేను కూడా దానిని వాడుతున్నాను.కాక పోతే ఒక్క జీటాక్ కోసమే. అన్ని ఒక్క చోటే వాడాలంటే ఉపయోగించే ట్రిలియన్ అనే మెసెంజర్ పది సంవత్సరాల క్రితం నుంచే వున్నది. మీరు దానిని కూడా ఒక్క సారి వాడి చూడండి.

  ఇక స్మయిలీలు…గైం స్మయిలీలు ఎందుకు వాడదు? వాడుతుంది.నేను పైన ఇచ్చిన వ్యాఖ్యలో అది ఎలా చూపిస్తుందో కూడా చెప్పాను..:-) అయితే మీరన్నట్లు Beta వాడి చూస్తా..జీటాక్ కు ఏదైనా ఒకటేనేమో 🙂

  టైప్ చేసిన వెంటనే యూజర్ పేరు ప్రత్యక్షం కావటం. ఇది మంచి UX. కానీ మీరన్న Beta లోనే వున్నట్లుంది. నాకు పనిచెయ్యటంలా. ఇది లైవ్ మెసెంజర్లో అయితే ఎప్పటినుంచో వున్నదే.

  చివరిగా UX అనేది User మీద అధారపడుతుందేమో గానీ, User preference, taste మీద అధారపడ్డ శాస్త్రం అయితే కాదు. average user (end user) experience ని మరింత బాగా చెయ్యటమే ఈ UX ప్రధాన ఉద్దేశ్యం. UX పరీక్షలో గైమ్ కి నేను అన్ని మార్కులు వెయ్యలేను. నా ప్రకారం కాదు, ఒక End user perspective లో.

  త్వరలో ఈ మూడు మెసెంజర్ల UX comparision నా ఆంగ్ల బ్లాగులో రాస్తాను.

 18. నా భావం మీకు అర్ధం అయినట్లు లేదు 🙂 నేను గైం బాగుండదనో లేక పోతే దానిని వాడకూడదనో చెప్పటం లేదు. నేను కూడా దానిని వాడుతున్నాను.కాక పోతే ఒక్క జీటాక్ కోసమే. అన్ని ఒక్క చోటే వాడాలంటే ఉపయోగించే ట్రిలియన్ అనే మెసెంజర్ పది సంవత్సరాల క్రితం నుంచే వున్నది. మీరు దానిని కూడా ఒక్క సారి వాడి చూడండి.ఇక స్మయిలీలు…గైం స్మయిలీలు ఎందుకు వాడదు? వాడుతుంది.నేను పైన ఇచ్చిన వ్యాఖ్యలో అది ఎలా చూపిస్తుందో కూడా చెప్పాను..:-) అయితే మీరన్నట్లు Beta వాడి చూస్తా..జీటాక్ కు ఏదైనా ఒకటేనేమో :-)టైప్ చేసిన వెంటనే యూజర్ పేరు ప్రత్యక్షం కావటం. ఇది మంచి UX. కానీ మీరన్న Beta లోనే వున్నట్లుంది. నాకు పనిచెయ్యటంలా. ఇది లైవ్ మెసెంజర్లో అయితే ఎప్పటినుంచో వున్నదే. చివరిగా UX అనేది User మీద అధారపడుతుందేమో గానీ, User preference, taste మీద అధారపడ్డ శాస్త్రం అయితే కాదు. average user (end user) experience ని మరింత బాగా చెయ్యటమే ఈ UX ప్రధాన ఉద్దేశ్యం. UX పరీక్షలో గైమ్ కి నేను అన్ని మార్కులు వెయ్యలేను. నా ప్రకారం కాదు, ఒక End user perspective లో. త్వరలో ఈ మూడు మెసెంజర్ల UX comparision నా ఆంగ్ల బ్లాగులో రాస్తాను.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: