మార్చి 4, 2007

పాడాలని ఉంది…

Posted in Uncategorized వద్ద 9:25 ఉద. ద్వారా Praveen Garlapati

అవసరమయినంత వరకు విమర్శలు ఎంతో అవసరం అని భావించే వారిలో నేను ఒకడిని. ఒక సద్విమర్శ కలిగించినంత మేలు మనకు ప్రశంస కూడా కలిగించదేమో…

కానీ నాకు నచ్చనిదేమిటంటే విమర్శలు మాత్రమే చెయ్యడం. ఉదాహరణకి ప్రతి ఆదివారం మా నాన్నగారు పాడాలని ఉంది అనే కార్యక్రమం చూస్తారు. (మా టీవీ లో అనుకుంట.)

నాకు ఈ ప్రోగ్రాం అంటే చిరాకు, కారణం బాలసుబ్రమణ్యం. ఇందులో ఆయన ఏ నాడూ ఎవరినీ పొగడగా నేను చూడలేదు. తప్పులని సరి చెయ్యడం ఎంతో ముఖ్యం, కాదనను. కానీ తప్పులు ఎంచడం మాత్రమే పనిగా పెట్టుకుంటే ??

ఎంచగ్గా ఈనాటి పిల్లలు, యూత్ అంతా చక్కని పాటలు ఎంచుకుని పాడుతుంటే కూడా అందులోని మంచిని ఏ నాడూ చూడలేకున్నారు ఆయన. ఆయన ఎంత మంచి గాయకుడయినా అది ఆయన ఎన్నో ఏళ్ళు కష్టపడి సంపాదించింది. మరి ఇప్పుడిప్పుడు పాడుతున్న కొత్త వారినుండి ఆ స్థాయిలోనే ఆశించడం ఎంత వరకు సమంజసం. ఆ కొత్త గాయనీ గాయకులకు విమర్శ ఎంత ముఖ్యమో ప్రశంస కూడా అంతే ముఖ్యం. ఆయన వారి confidence ని పటా పంచలు చేస్తే వారికి నేర్చుకోవాలనే ఉద్దేశ్యమే పోయే అవకాశం ఉంది.

అదీ కాక ప్రతి ఎపిసోడులోనూ నేను సంగీతం నేర్చుకోలేదు, అయినా కష్టపడి ఈ స్థితి కి చేరుకున్నాను అంటూ సెల్ఫ్ డబ్బా ఒకటి.

ఆయనే గనక మరి అంత ఐడియల్ అయితే ఆయన జీవిత కాలంలో ఎంత మంది యువ గాయనీ గాయకులని ప్రోత్సాహించాడో చెప్పమనండి.

ఆయనేదో తప్పు చేసాడని, ఆయన మంచి గాయకుడు కాదు అని నా ఉద్దేశ్యము కాదు. కానీ ఆయన చక్కని సూచనలిచ్చి దానితో పాటు వారికి ప్రశంసలూ అందిస్తే అది చక్కగా చేరవలసిన చోటుకి చేరుతుంది అని నా అభిప్రాయం.

ప్రకటనలు

10 వ్యాఖ్యలు »

 1. cbrao said,

  ఆయన సద్విమర్శలు చేస్తూ, అవసరమైన చొట్ల ప్రశంశల జల్లూ కురిపిస్తారు.

 2. cbrao said,

  ఆయన సద్విమర్శలు చేస్తూ, అవసరమైన చొట్ల ప్రశంశల జల్లూ కురిపిస్తారు.

 3. సుధాకర్(శోధన) said,

  మీతో నేను ఏకీభవిస్తాను. బాలు అద్భుత గాయకుడు, సమాజంలో మంచి, చెడులు గురించి బాగానే చెప్తాడు గానీ, పాడిన పిల్లల గాలి మాత్రం భయంకరంగా తీసేస్తాడు. ఇతడే గనక software project manager అయితే ఆ టీమ్ లో వాళ్లు పారిపోవడం ఖాయం.

 4. మీతో నేను ఏకీభవిస్తాను. బాలు అద్భుత గాయకుడు, సమాజంలో మంచి, చెడులు గురించి బాగానే చెప్తాడు గానీ, పాడిన పిల్లల గాలి మాత్రం భయంకరంగా తీసేస్తాడు. ఇతడే గనక software project manager అయితే ఆ టీమ్ లో వాళ్లు పారిపోవడం ఖాయం.

 5. వెంకట రమణ said,

  నేనూ ఈ కార్యక్రమం అప్పుడప్పుడు చూస్తుంటాను. నాకు బాల సుబ్రమణ్యం గారి విమర్శలు సద్విమర్శల్లానే అనిపిస్తుంటాయి. బాగా పాడినవారిని అప్పుడప్పుడు పొగడడం నేను గమనించాను.

  ఆయన వీలైనప్పుడల్లా సొంత డబ్బా కొట్టుకుంటాడనే విషయములో మాత్రం నేను మీతో ఏకీభవిస్తాను.

 6. నేనూ ఈ కార్యక్రమం అప్పుడప్పుడు చూస్తుంటాను. నాకు బాల సుబ్రమణ్యం గారి విమర్శలు సద్విమర్శల్లానే అనిపిస్తుంటాయి. బాగా పాడినవారిని అప్పుడప్పుడు పొగడడం నేను గమనించాను.ఆయన వీలైనప్పుడల్లా సొంత డబ్బా కొట్టుకుంటాడనే విషయములో మాత్రం నేను మీతో ఏకీభవిస్తాను.

 7. radhika said,

  నేనూ ఆ ప్రోగ్రాము చూస్తాను.నాకు చాలా ఇష్టం.అప్పుడప్పుడూ అలా చేస్తూవుంటారు గానీ ప్రతీ సారీ అలా గాలితీయడం చేయరు.గాయకుడిగా వెలుగుతున్న రోజుల్లో నూతన గాయకులని ఎదగనీయలేదని అంటారు.అది ద్రుష్టిలో పెట్టుకుని ప్రోగ్రాం చూసినా చాలావరకు నాకు ఆయనవి సద్విమర్శల లానే అనిపిస్తాయి.సొంత డబ్బా మాత్రం చాలా ఎక్కువ ఆ మాట మాత్రం ఏకీభవిస్తాను.

 8. radhika said,

  నేనూ ఆ ప్రోగ్రాము చూస్తాను.నాకు చాలా ఇష్టం.అప్పుడప్పుడూ అలా చేస్తూవుంటారు గానీ ప్రతీ సారీ అలా గాలితీయడం చేయరు.గాయకుడిగా వెలుగుతున్న రోజుల్లో నూతన గాయకులని ఎదగనీయలేదని అంటారు.అది ద్రుష్టిలో పెట్టుకుని ప్రోగ్రాం చూసినా చాలావరకు నాకు ఆయనవి సద్విమర్శల లానే అనిపిస్తాయి.సొంత డబ్బా మాత్రం చాలా ఎక్కువ ఆ మాట మాత్రం ఏకీభవిస్తాను.

 9. ప్రవీణ్ గార్లపాటి said,

  ఆయన సద్విమర్శలు చేయరని నా అభిప్రాయం కాదు. కానీ విమర్శలు ఎక్కువగా చేస్తారని నా అభిప్రాయం.

  సరిగా చేయని దానికి విమర్శ ఎంత ముఖ్యమో, సరిగా చేసిన దానికి ప్రశంస అంతే ముఖ్యం అని చెప్పడం నా ఉద్దేశ్యం.

 10. ఆయన సద్విమర్శలు చేయరని నా అభిప్రాయం కాదు. కానీ విమర్శలు ఎక్కువగా చేస్తారని నా అభిప్రాయం.సరిగా చేయని దానికి విమర్శ ఎంత ముఖ్యమో, సరిగా చేసిన దానికి ప్రశంస అంతే ముఖ్యం అని చెప్పడం నా ఉద్దేశ్యం.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: