మార్చి 7, 2007

మన్మధుడు మళ్ళీ చూసాను…

Posted in మన్మధుడు, సినిమా వద్ద 3:18 సా. ద్వారా Praveen Garlapati

అబ్బా ఎన్నాళ్ళ తరవాతో మళ్ళీ మన్మధుడు సినిమా చూసాను. ఎన్ని సార్లు చూసినా చూడబుద్ధవుతుంది ఈ సినిమా.

ఎంత డీసెంట్ స్టొరీ, చక్కని హాస్యం ఉంటుంది ఈ సినిమాలో.

కొన్ని సీన్లయితే ఎప్పటికీ గుర్తుండిపోతాయి

– నాగార్జున ఆడాళ్ళ మీటింగు ని ఉప్పర మీటింగ్ అనటం

– లిప్స్టిక్ పెదాలకే ఎందుకు రాసుకోవాలి కళ్ళకి ఎందుకూ రాసుకోకూడదు అనే అయిడియా రావడం

– ధర్మవరపు సుబ్రమణ్యం ఆకాశం ఎర్రగా ఉంది సీను

-ఇక బ్రహ్మానందం సీన్లకయితే లెక్కే లేదు, అన్నీ కామెడీ గుళికలే.. ముఖ్యం గా ఆ ఎయిర్ పోర్టు సీను.
ఇండియా ని టేప్ రెకార్డర్ లో పెట్టి యాభై ఏళ్ళు ముందుకు తిప్పితే అదే పారిస్ అని డబ్బాలు కొడుతూ, ఎస్కలేటర్ ఏంటొ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే, అయ్యో మాస్టారూ ఇలా దిగాలని తెలీక మామూలుగా దిగేసాం అని నాగార్జున తిక్క కుదిర్చే సీను.

-ఇక సునీల్ చీటికీ మాటికీ కోపం గా అరిచే సీన్లు.

అబ్బో ఒకటేంటి

అసలు కామెడీ ఈ సినిమాకే హైలైటు.

ఇంత చక్కని సినిమాలు ఒప్పుకోక నాగార్జున కి ఈ బాస్ లాంటి చెత్త సినిమాలు ఎందుకో. అవునులే చెత్త సినిమాలు లేకపోతే మంచి సినిమాల విలువెలా తెలుస్తుంది ?

ఇలాంటి ఇంకెన్నో మంచి సినిమాలు రావాలని ఆశిద్దాము.

అన్నట్టు నేను కూడా యాభై పోస్టులు పూర్తి చేసుకున్నానండోయ్.

ప్రకటనలు

17 వ్యాఖ్యలు »

 1. valluri said,

  కంగ్రాట్యులేషన్స్ మీ అర్ధసెంచూరికి.

 2. valluri said,

  కంగ్రాట్యులేషన్స్ మీ అర్ధసెంచూరికి.

 3. పారుపల్లి said,

  నువ్వు నాకు నచ్చావు, మన్మధుడు ఈ రెండు సినిమాలు మంచి విలువలున్న హాస్య భరిత సినిమాలు

 4. నువ్వు నాకు నచ్చావు, మన్మధుడు ఈ రెండు సినిమాలు మంచి విలువలున్న హాస్య భరిత సినిమాలు

 5. ప్రవీణ్ గార్లపాటి said,

  @valluri గారు:
  థాంక్సండీ.

  @పారుపల్లి గారు:
  మీరన్నది నిజం.

 6. @valluri గారు:థాంక్సండీ.@పారుపల్లి గారు:మీరన్నది నిజం.

 7. కొత్త పాళీ said,

  మన్మథుడు సినిమా చెత్త అనను గానీ ఇంత పొగడవలసింది కూడా ఏమీ లేదనిపించింది. నాకు చాలా చోట్ల బోరు కొట్టింది. కథలో అనేక పాత్రలు చేసే పనుల్లో అలా ఎందుకు చేస్తారో అర్థం కాదు. సినిమాకున్న రెండు హైలైట్స్ మాటల రచయితగా త్రివిక్రం, బంకు సీను పాత్రలో సునిల్.
  @పారుపల్లి గారు – తనకింద ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అమ్మాయిని ఆఫీసులో పదిమంది ముందూ పదే పదే అవమానిస్తూ ఉండటం “విలువ” ఎలా అవుతుంది సార్? మీరన్నది బహుశా సినీ నిర్మాణపు విలువలని కాబోలు.
  మీ మీ రుచుల్ని విమర్శించటం నా ఉద్దేశం కాదు. నా అభిప్రాయం చెబుతున్నా నంతే.

 8. మన్మథుడు సినిమా చెత్త అనను గానీ ఇంత పొగడవలసింది కూడా ఏమీ లేదనిపించింది. నాకు చాలా చోట్ల బోరు కొట్టింది. కథలో అనేక పాత్రలు చేసే పనుల్లో అలా ఎందుకు చేస్తారో అర్థం కాదు. సినిమాకున్న రెండు హైలైట్స్ మాటల రచయితగా త్రివిక్రం, బంకు సీను పాత్రలో సునిల్. @పారుపల్లి గారు – తనకింద ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అమ్మాయిని ఆఫీసులో పదిమంది ముందూ పదే పదే అవమానిస్తూ ఉండటం “విలువ” ఎలా అవుతుంది సార్? మీరన్నది బహుశా సినీ నిర్మాణపు విలువలని కాబోలు.మీ మీ రుచుల్ని విమర్శించటం నా ఉద్దేశం కాదు. నా అభిప్రాయం చెబుతున్నా నంతే.

 9. This comment has been removed by the author.

 10. ప్రవీణ్ గార్లపాటి said,

  @కొత్త పాళీ గారు:

  సినిమాని సినిమాగా చూడడం అలవాటు నాకు. ఎంతో మంది లాగా విమర్శ దృష్టితో చూడటం నాకు పెద్దగా అలవాటు కాలేదు. నేను సినీ జీవితాన్ని, నిజ జీవితాన్ని పోల్చను. అలాగని అది తప్పు అని కూడా కాదు.

  నాకు సంబంధించినంత వరకూ ఆహ్లాదంగా నడిచే (నా ప్రకారం) ఏ సినిమా అయినా నాకు మంచి సినిమా కింద లెక్కే.

  తనకింద ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అమ్మాయిని ఆఫీసులో పదిమంది ముందూ పదే పదే అవమానిస్తూ ఉండటం “విలువ” ఎలా అవుతుంది సార్?

  ఇక మీరన్నారే… దీనితో నేను విభేదిస్తాను. దానిని కథ పరం గా చూడాలే కానీ అది పర్సనల్ గా తీసుకోకూడదు. మళ్ళీ ఇంతకు ముందు చెప్పినట్టే నేను casual cine goer ని. కాబట్టి ఇవి నాకు పెద్దగా పట్టవు.

  మీరన్నట్టు Its just a difference of opinion.

 11. @కొత్త పాళీ గారు: సినిమాని సినిమాగా చూడడం అలవాటు నాకు. ఎంతో మంది లాగా విమర్శ దృష్టితో చూడటం నాకు పెద్దగా అలవాటు కాలేదు. నేను సినీ జీవితాన్ని, నిజ జీవితాన్ని పోల్చను. అలాగని అది తప్పు అని కూడా కాదు.నాకు సంబంధించినంత వరకూ ఆహ్లాదంగా నడిచే (నా ప్రకారం) ఏ సినిమా అయినా నాకు మంచి సినిమా కింద లెక్కే.తనకింద ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అమ్మాయిని ఆఫీసులో పదిమంది ముందూ పదే పదే అవమానిస్తూ ఉండటం “విలువ” ఎలా అవుతుంది సార్?ఇక మీరన్నారే… దీనితో నేను విభేదిస్తాను. దానిని కథ పరం గా చూడాలే కానీ అది పర్సనల్ గా తీసుకోకూడదు. మళ్ళీ ఇంతకు ముందు చెప్పినట్టే నేను casual cine goer ని. కాబట్టి ఇవి నాకు పెద్దగా పట్టవు.మీరన్నట్టు Its just a difference of opinion.

 12. కొత్త పాళీ said,

  ప్రవీణ్ గారూ,
  నేనేదో ఆర్టు సినిమా టైపు అనుకోకండి. అలాగైతే అసలు దేశీ సినిమాల జోలికి పోయే వాణ్ణే కాదు. ప్రవాస జీవనం వల్ల 1988 నించీ 2002 వరకూ తెలుగు సినిమాలు చూళ్ళేదు. ఆ లోటు (?) తీర్చుకోడానికి హైదరాబాదులో ఉన్న రెండేళ్ళూ ఇంక అది తప్ప వేరే వినోదం లేదు. మీరు కనీవినీ ఎరుగని సినిమాలు కూడా నేను చూసి ఉంటాను. మళ్ళీ 2004లో అమెరికా వొచ్చాక ఆ మిస్సయిన సూపరుహిట్లన్నీ ఇప్పుడిప్పుడే చూశ్తున్నా. అందుకే మన perspective freshగా ఉంటుంది. 🙂
  BTW, NTR Jr సినిమా సింహాద్రి నాకు చాలా నచ్చిన సినిమాల్లో ఒకటి! 🙂

 13. ప్రవీణ్ గారూ,నేనేదో ఆర్టు సినిమా టైపు అనుకోకండి. అలాగైతే అసలు దేశీ సినిమాల జోలికి పోయే వాణ్ణే కాదు. ప్రవాస జీవనం వల్ల 1988 నించీ 2002 వరకూ తెలుగు సినిమాలు చూళ్ళేదు. ఆ లోటు (?) తీర్చుకోడానికి హైదరాబాదులో ఉన్న రెండేళ్ళూ ఇంక అది తప్ప వేరే వినోదం లేదు. మీరు కనీవినీ ఎరుగని సినిమాలు కూడా నేను చూసి ఉంటాను. మళ్ళీ 2004లో అమెరికా వొచ్చాక ఆ మిస్సయిన సూపరుహిట్లన్నీ ఇప్పుడిప్పుడే చూశ్తున్నా. అందుకే మన perspective freshగా ఉంటుంది. :-)BTW, NTR Jr సినిమా సింహాద్రి నాకు చాలా నచ్చిన సినిమాల్లో ఒకటి! 🙂

 14. Naveen said,

  కొత్తాపాళీ గారు, మీరు 1988 – 2002 వరకు తెలుగు సినిమాలు చూడలేదంటే …చాలా మిస్సయ్యరే..ముఖ్యంగా 1988 – 1995 మధ్య విడుదలైన చిరంజీవి సినిమాలు 🙂

 15. Naveen said,

  కొత్తాపాళీ గారు, మీరు 1988 – 2002 వరకు తెలుగు సినిమాలు చూడలేదంటే …చాలా మిస్సయ్యరే..ముఖ్యంగా 1988 – 1995 మధ్య విడుదలైన చిరంజీవి సినిమాలు 🙂

 16. ramya said,

  వాళ్ళు పారిస్ లో షాపింగ్ చేసి బహ్మానందాన్ని ఇరికించేస్తారు ఆ సీన్‌ లో కూడా నేను భలే నవ్వాను. 🙂

 17. ramya said,

  వాళ్ళు పారిస్ లో షాపింగ్ చేసి బహ్మానందాన్ని ఇరికించేస్తారు ఆ సీన్‌ లో కూడా నేను భలే నవ్వాను. 🙂


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: