మార్చి 18, 2007

ఈ జనరేషన్ తప్పేంటి ?

Posted in అభిప్రాయం, ఈ జనరేషన్ వద్ద 10:41 ఉద. ద్వారా Praveen Garlapati

నాకు ఈ పత్రికలు ప్రచురించే “ఈ జనరేషన్” వ్యాసాలంటే ఎంతో చిరాకు. వీళ్ళు ఈ జనరేషన్ అంటే ఒట్టి వెధవలు, అతిగా దుబారా చేస్తారు, ఖర్చు పెడతారు అని, డబ్బు అంటే లెక్క లేదు అని, ప్లానింగ్ లేదు అని ఇష్టమొచ్చినట్టు రాసేస్తారు.

అవును నిన్నటి జనరేషన్ కంటే ఎక్కువ డబ్బులు వస్తుండవచ్చు, అది ఈ జనరేషన్ తప్పా ? వచ్చిన డబ్బుని తగినట్టు ఖర్చు పెట్టాలనుకుంటారు, లైఫ్ ని కొద్దిగా ఎంజాయ్ చేద్దామనుకుంటారు. అది కూడా తప్పయితే ఇక ఏమి చెప్పాలి ?

ఈ జనరేషన్ అంటే ఇంత చులకనా ? ప్రతి ఒక్క పత్రిక, మ్యాగజైను IIT, IIM ల విద్యార్థులకు ఇంతొస్తుంది, అంతొస్తుంది. ఇప్పుడు జీతలు ఇంతున్నాయి, అంతున్నాయి అని అవేదో వీరికి అక్కరగా వస్తున్నట్టు చెబుతున్నాయి. ఏ వీరికి వర్త్ లేందే ఎందుకు వస్తున్నాయి ?

ఏ ఇక్కడ రాసే తెలుగు బ్లాగర్లలో ఎంత మంది ఈ జనరేషన్ వారు లేరు, మరి అందరికీ తెలుగు మీద అభిమానమే కదా ? ఎంత మంది ఇంతకు ముందు జనరేషన్ వారి కంటే ఎక్కువగా భాష గురించి తెలుసుకోవాలని తపిస్తున్నారు. ఎంతగా లోతుగా ఆలోచించి వివిధ విషయాల మీద కూలంకషంగా రాస్తున్నారు. మరి వీరంతా ఈ జనరేషన్ అని ఎందుకు గుర్తించరో ?

ఏ జనరేషన్లో చూసినా మంచి వారు, చెడు వారు ఇద్దరూ ఉన్నారు. బాగు పడిన వారు, చెడిపోయిన వారు ఉన్నారు. కాకపోతే ఇవాళ కొత్తగా వచ్చిన opportunities వల్ల ఎక్కువ మంది కి మంచి ఉద్యోగాలు వస్తున్నాయి, లైఫ్ లో త్వరగా సెటిల్ అవగలుగుతున్నారు. అవును ఒప్పుకుంటాను ఇప్పుడు పెరిగిన జీతాల వల్ల అఫర్డబిలిటీ పెరిగింది, అందుకని కొన్ని దుబారా ఖర్చులు చేస్తూ ఉండవచ్చు, కొందరు చెడిపోతూ ఉండవచ్చు కూడా. అంత మాత్రాన అందరినీ ఒకే గాటిన ఎలా కట్టేస్తారు ?

వారి జీతాలు చూసి రియల్ ఎస్టేట్ మొదలయిన రంగాల వారు దానిని అలుసుగా తీసుకుని తెగ పెంచేస్తే అది ఈ జనరేషన్ తప్పెలా అవుతుంది. అయితే పెరిగింది అని కొనకుండా ఎలా ఉండగలం ? ఇవాళ x ఉన్నది రేపు y అవుతుంది. అదీ కాక ఇప్పుడు కొనకుండా ఒక పదేళ్ళు పోయిన తరవాత నేను ఎంజాయ్ చెయ్యలేనప్పుడు కొనాలా ? పిల్లలకి వాళ్ళ పిల్లలకి ఇవాడానికా నేను సంపాదించేది ?

అవును ఇప్పటి వరకూ అన్ని జనరేషన్లూ ఇలాగే ఆలోచించారు. నా పిల్లలకి, వారి పిల్లలకి అంటూ. అలా చెయ్యడం నాకు ఇష్టం లేదు. అలాగని వారి కోసం ఏదీ చెయ్యవద్దు అని కూడా కాదు. దేనికయినా ఒక బాలన్స్ ఉండాలి. ఎప్పటికీ దాస్తూనే ఉంటే ఇక ఎంజాయ్ చేసేది ఎప్పుడు ?

నాకు ఉద్యోగం రాగానే మా నాన్న గారికి నేను మొదట చెప్పింది ఇక నుంచి నా కోసం ఏదీ దాచవద్దు. ఇప్పటి వరకూ చేసింది చాలు, ఇక లైఫ్ ఎంజాయ్ చెయ్యండి అని. ఆయన లో నాకు నచ్చింది ఆయన పర్ఫెక్ట్ ప్లానింగ్. అందరికీ అన్నీ సమకూర్చి లైఫ్ లో అన్నీ ఎంజాయ్ చేసారు. నా కోసం నేను సంపాదించుకోగలను. నేను స్థిరపడేంత వరకూ నన్ను సపోర్ట్ చేసారు చాలు. ఇక కూడా నేను నా అంతట బతకలేకపోతే ఎందుకు ? కానీ ఇప్పుడు మనకి ఒక మంచి అవకాశం వచ్చింది. డబ్బు ఉంది. ఖర్చులూ ఉన్నాయనుకోండి. కానీ కొద్దిగా సర్ప్లస్ ఉన్నవాళ్ళు దాన్ని కొంత ఆనందం కోసం ఖర్చు పెట్టడంలో తప్పు లేదంటాను. దానితో పాటూ సేవింగ్స్ కూడా చెయ్యాలి. స్థిరాస్తులు కొనుక్కోవాలి. రేపటి కోసం ఆలోచించాలి. ఆలోచిస్తున్నారు.

కాబట్టి అనవసరంగా ఎవరినీ నిందించవద్దు.

14 వ్యాఖ్యలు »

 1. cbrao said,

  ఈ పత్రికలు, కూడలి లో రాసే వారు మీరు చెప్పిన విధంగా ఈ తరాన్ని విమర్శిస్తూ రాస్తున్నారా! నాకు తెలిసి తెలుగు బ్లాగరులు ఎక్కువమంది బ్రహ్మచారులే. పాత జనరేషన్ వాళ్ళకు చాలా మందికి e-mail i.d లేదు. ఒక వేళ ఉంది అనుకున్నా కంపూటర్ లో తెలుగులో రాయటం వారికి సులభంగా సాధ్యమయ్యే పని కాదు. ఎవరి దగ్గరన్నా సహయం పొందాలి. బ్లాగూ, కథ కాకరకాయలు రాసే senior citizens మీకు తెలిస్తే వారిని మన తెలుగు గుంపుకు పరిచయం చెయ్యండి. మన e – తెలుగు సమావేశాలలో ఈ విషయం ఒకసారి ప్రస్తావనకు వచ్చినా ఎవరూ సరైన సమాచారం ఇవ్వలేక పోయారు. తెలుగు బ్లాగరులు ఎక్కువమంది బ్రహ్మచారులు, లేక కొత్తగా పెళ్ళయిన వాళ్ళు. అందరిదీ జుట్టు తలే. తెల్ల జుట్టు అడపా దడపా కనిపిస్తుంది.

 2. cbrao said,

  ఈ పత్రికలు, కూడలి లో రాసే వారు మీరు చెప్పిన విధంగా ఈ తరాన్ని విమర్శిస్తూ రాస్తున్నారా! నాకు తెలిసి తెలుగు బ్లాగరులు ఎక్కువమంది బ్రహ్మచారులే. పాత జనరేషన్ వాళ్ళకు చాలా మందికి e-mail i.d లేదు. ఒక వేళ ఉంది అనుకున్నా కంపూటర్ లో తెలుగులో రాయటం వారికి సులభంగా సాధ్యమయ్యే పని కాదు. ఎవరి దగ్గరన్నా సహయం పొందాలి. బ్లాగూ, కథ కాకరకాయలు రాసే senior citizens మీకు తెలిస్తే వారిని మన తెలుగు గుంపుకు పరిచయం చెయ్యండి. మన e – తెలుగు సమావేశాలలో ఈ విషయం ఒకసారి ప్రస్తావనకు వచ్చినా ఎవరూ సరైన సమాచారం ఇవ్వలేక పోయారు. తెలుగు బ్లాగరులు ఎక్కువమంది బ్రహ్మచారులు, లేక కొత్తగా పెళ్ళయిన వాళ్ళు. అందరిదీ జుట్టు తలే. తెల్ల జుట్టు అడపా దడపా కనిపిస్తుంది.

 3. ప్రవీణ్ గార్లపాటి said,

  అవునండీ నేను చదివిన్న కొన్ని పత్రికలలో ఈ విధంగా రాసారు/రాస్తున్నారు.

  ఇక పోతే మీరన్నది కరక్టే. ఇక్కడ రాసే ఎక్కువ మంది యంగ్ పీపులే. మరి ఒకటి రెండు సార్లు నేను అనుకున్నాను వేరే వారికి చెబుదామని, కానీ వారిలో ఇవన్నీ నేర్చుకోవాలనే interest కనిపించలేదు. నాకు వారిని ఒప్పించే ఓపిక లేకపోయింది. ఒకరిద్దరికి నా స్నేహితులకి చెప్పినా అది బ్లాగు మొదలెట్టే వరకే కానీ రాయడం వరకూ రాలేదు.

  మరి ఎలా చెయ్యాలి అనేది ఇంకా తేలకుండా ఉంది. barcamp లాంటి వాటిలో చెబుదామని ఒక ఐడియా.

  జనరల్ గా నేను చేసేది ఇది:

  1. వారికి తెలుగులో రాయడం గురించి చెబుతాను. లేఖిని చూపిస్తాను. అలాగే బరహా గురించి కూడా చెబుతాను

  2. కూడలి చూపిస్తాను.

  3. మన తెలుగు పీడీఎఫ్ పంపిస్తాను.

  చదివే వరకూ ఓకే కానీ రాయడం వరకూ ఎక్కువ మంది చేరట్లేదు.

 4. అవునండీ నేను చదివిన్న కొన్ని పత్రికలలో ఈ విధంగా రాసారు/రాస్తున్నారు.ఇక పోతే మీరన్నది కరక్టే. ఇక్కడ రాసే ఎక్కువ మంది యంగ్ పీపులే. మరి ఒకటి రెండు సార్లు నేను అనుకున్నాను వేరే వారికి చెబుదామని, కానీ వారిలో ఇవన్నీ నేర్చుకోవాలనే interest కనిపించలేదు. నాకు వారిని ఒప్పించే ఓపిక లేకపోయింది. ఒకరిద్దరికి నా స్నేహితులకి చెప్పినా అది బ్లాగు మొదలెట్టే వరకే కానీ రాయడం వరకూ రాలేదు.మరి ఎలా చెయ్యాలి అనేది ఇంకా తేలకుండా ఉంది. barcamp లాంటి వాటిలో చెబుదామని ఒక ఐడియా.జనరల్ గా నేను చేసేది ఇది:1. వారికి తెలుగులో రాయడం గురించి చెబుతాను. లేఖిని చూపిస్తాను. అలాగే బరహా గురించి కూడా చెబుతాను2. కూడలి చూపిస్తాను.3. మన తెలుగు పీడీఎఫ్ పంపిస్తాను.చదివే వరకూ ఓకే కానీ రాయడం వరకూ ఎక్కువ మంది చేరట్లేదు.

 5. kiran kumar Chava said,

  ఈ జనరేషన్ల గురించి పెద్దగా బాధ పడకూడదు

  వెనకటికి అంటే చాలా వెనకటికి…

  ఆరిస్టాటిల్ కూడ ఇలాగే బాధ పడినాడట

  ఇప్పటి యువకులకు బుద్ధిలేదు ఎట్సెట్రా ఎట్సెట్రా అని

 6. ఈ జనరేషన్ల గురించి పెద్దగా బాధ పడకూడదువెనకటికి అంటే చాలా వెనకటికి…ఆరిస్టాటిల్ కూడ ఇలాగే బాధ పడినాడట ఇప్పటి యువకులకు బుద్ధిలేదు ఎట్సెట్రా ఎట్సెట్రా అని

 7. కొత్త పాళీ said,

  బాగా చెప్పారు. ఇది కొంతవరకూ అమెరికన్ మీడియాని గుడ్డిగా అనుసరించిన ఫలితం కావచ్చు. ఐనా ఒకటి ఒప్పుకోవాలి. గాంధీగారి సత్యాగ్రహం తరవాత ఏ ఒక్క జెనరేషన్ సాధారణ జన జీవితాన్ని ఇంత విస్తృతంగా ప్రభావితం చేసిన దాఖలా కనపడదు. ఆనందాలకి దూరంగా ఉండటాన్ని, అనవసరపు త్యాగాల్ని మన సమాజం హర్షిస్తుంది.

 8. బాగా చెప్పారు. ఇది కొంతవరకూ అమెరికన్ మీడియాని గుడ్డిగా అనుసరించిన ఫలితం కావచ్చు. ఐనా ఒకటి ఒప్పుకోవాలి. గాంధీగారి సత్యాగ్రహం తరవాత ఏ ఒక్క జెనరేషన్ సాధారణ జన జీవితాన్ని ఇంత విస్తృతంగా ప్రభావితం చేసిన దాఖలా కనపడదు. ఆనందాలకి దూరంగా ఉండటాన్ని, అనవసరపు త్యాగాల్ని మన సమాజం హర్షిస్తుంది.

 9. spandana said,

  iనన్నడిగితే మొన్నటికంటే నిన్న బాగుంది. నిన్నటికంటే నేడు బాగుంది. నేటి కంటే రేపు బాగుంటుంది. రేపటి తరమూ బాగుంటుంది.

  –ప్రసాద్
  http://blog.charasala.com

 10. spandana said,

  iనన్నడిగితే మొన్నటికంటే నిన్న బాగుంది. నిన్నటికంటే నేడు బాగుంది. నేటి కంటే రేపు బాగుంటుంది. రేపటి తరమూ బాగుంటుంది.–ప్రసాద్http://blog.charasala.com

 11. రానారె said,

  టీవీ, రిఫ్రిజిరేటర్, వాహనం లాంటివి కొని భద్రపరచుకోవడం మన ముందుతరాలకు పెద్ద విషయం. ఇవన్నీ జీవితంలో ఒకసారి మాత్రమే పొందగలిగేవారు. ఇదీ ఆనాటి ఎగువమధ్యతరగతి సంగతి. మధ్య, దిగువమధ్య తరగతుల గతి ఊహించుకోవచ్చు. కానీ మనకు ఈ మస్తువులు, సామాగ్రీ “అంతా మాయ బాబూ” అనిపిస్తుంది. కొని అవతలపారేసే వీలు మనకుందిప్పుడు. మన ధోరణి చూస్తే వారికి భయం మేయడంలో ఆశ్చర్యంలేదు. మనకున్న సంపాదనావకాశాలమూలంగా ‘పిల్లలకోసం మన కడుపులు మాడ్చుకొని కోట్లు కూడబెట్టడా’నికి మనం విముఖులం. పిల్లలను ప్రయోజకులను చేయడం ఎంత ముఖ్యమో మనకు తెలుసు. అలాగని ఆస్తులు కూడబెట్టనక్కరలేదని మన తరం ఆలోచన. మనం బ్రతికినంతకాలం సంతోషంగా చిన్నాపెద్దా కోరికలను తీర్చుకోవడం నా దృష్టిలోకూడా దుబారా కాదు.

 12. టీవీ, రిఫ్రిజిరేటర్, వాహనం లాంటివి కొని భద్రపరచుకోవడం మన ముందుతరాలకు పెద్ద విషయం. ఇవన్నీ జీవితంలో ఒకసారి మాత్రమే పొందగలిగేవారు. ఇదీ ఆనాటి ఎగువమధ్యతరగతి సంగతి. మధ్య, దిగువమధ్య తరగతుల గతి ఊహించుకోవచ్చు. కానీ మనకు ఈ మస్తువులు, సామాగ్రీ “అంతా మాయ బాబూ” అనిపిస్తుంది. కొని అవతలపారేసే వీలు మనకుందిప్పుడు. మన ధోరణి చూస్తే వారికి భయం మేయడంలో ఆశ్చర్యంలేదు. మనకున్న సంపాదనావకాశాలమూలంగా ‘పిల్లలకోసం మన కడుపులు మాడ్చుకొని కోట్లు కూడబెట్టడా’నికి మనం విముఖులం. పిల్లలను ప్రయోజకులను చేయడం ఎంత ముఖ్యమో మనకు తెలుసు. అలాగని ఆస్తులు కూడబెట్టనక్కరలేదని మన తరం ఆలోచన. మనం బ్రతికినంతకాలం సంతోషంగా చిన్నాపెద్దా కోరికలను తీర్చుకోవడం నా దృష్టిలోకూడా దుబారా కాదు.

 13. radhika said,

  ఇప్పుడు ఇలా మాట్లాడిన మనమే రేపు ముసలోళ్ళం అయ్యాకా “మా కాలం లో అయితే” అంటూ మొదలు పెడతాం.అప్పుడు మన పిల్లల జనరేషన్ పాడయిపోయింది అని బాధపడతాం.ఇది చాలా కామన్.పిల్లలకోసం అంటూ ఓ కూడబెట్టడమంటే పిల్లలని కావాలని అసమర్ధులుగా మార్చడమే.

 14. radhika said,

  ఇప్పుడు ఇలా మాట్లాడిన మనమే రేపు ముసలోళ్ళం అయ్యాకా “మా కాలం లో అయితే” అంటూ మొదలు పెడతాం.అప్పుడు మన పిల్లల జనరేషన్ పాడయిపోయింది అని బాధపడతాం.ఇది చాలా కామన్.పిల్లలకోసం అంటూ ఓ కూడబెట్టడమంటే పిల్లలని కావాలని అసమర్ధులుగా మార్చడమే.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: