మార్చి 27, 2007

నువ్వెంత ?? నేనెంత ??

Posted in Uncategorized వద్ద 8:11 సా. ద్వారా Praveen Garlapati

జనాలకి తమ మీద కంటే పక్క వారి మీద ధ్యాస ఎక్కువ. ఎందుకో అర్థం కాదు.

ఉదాహరణకి మొన్న ఇండియా ఓడిపోయినప్పుడు చూడండి జనాలకి ఇండియా ఓడిపోయినా పాకిస్తాన్ కూడా ఓడిపోయినందుకు సంతోషం. అంటే పాకిస్తాన్ ఓడిపోతే ఇండియా ఓడిపోయినా పర్వాలేదన్నమాట.

మన దైనందిన చర్యలో ఇతరులతో పోల్చుకోవడం ఒక భాగమయిపోయిందనుకుంట. ఒక ఉదాహరణ చెబుతాను. నేను నా స్నేహితులను కలుస్తుంటాను అప్పుడప్పుడూ. ఒక పది నిముషాలు గడిస్తే చాలు ఇక మొదలు ఏంట్రా ఎంతొస్తుంది నీకు ? ఆ ప్రశ్న అడిగి ఒక పది క్షణాలు ఊపిరి బిగపట్టి ఎదురు చూస్తుంటాడు ఎంతని సమాధానం చెబుతానో అని. ఒక వేళ వాడికంటే తక్కువయితే హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటాడు లేక పోతే ఇక టెన్షన్ స్టార్ట్ అన్నమాట. అవసరమా ? ఏ నీకొచ్చేదాంతో నువ్వు సంతొషంగా ఉన్నావో లేదొ చూసుకుంటే చాలదా ? ఎప్పుడూ పక్క వాడితొ పోలిక అన్నమాట.

ఇక మనం మన ఊళ్ళకు వెళితే చూడాలి. ఏం బాబూ ఎక్కడ పని చేస్తున్నావు ? ఎంతొస్తుంది ? అనే ప్రశ్నలతోనే సంభాషణలు మొదలవుతాయి. ఏదో MNC పేరు చెప్పారనుకోండి, అయ్యో అవునా infosys, wipro లలో రాలేదా ? మా వాడు సత్యం లో పని చేస్తాడు. ఇక జీతం గురించి దాటేయాలని చూస్తే మా వాడికి ఇంతొస్తుంది తెలుసా ? అని ముందే చెప్పేస్తారు ఇక నీకు చెప్పక తప్పదు అని. ఇక అక్కడ నుంచి మళ్ళీ పోలికలు మొదలన్నమాట. అయ్యో నీకు అంతేనా మా వాడికి అయితే ఇంతొస్తుంది, కారు, ఫ్లాటు అన్నీ ఇస్తున్నారు. ఇక తక్కువయితే మా వాడికి ఇంతకంటే రెట్టింపు జీతం ఇస్తానన్నారండీ కానీ వాడికి పని ముఖ్యం. అందుకనే చేరలేదు. ఏవో పెద్ద జీతలొస్తాయనే మాటే గానీ వాళ్ళ పని బాగోదటండీ. (Mr. Know it alls అన్నమాట).

ఇక మొన్న మా ఇంటికి ఒకాయనొచ్చారు బంధువు. ఇక పిచ్చాపాటీ మొదలయింది. ఇక ప్రశ్నల పరంపర అన్నమాట. ఏం బాబూ US వెళ్ళలేదా ? అక్కడ నీకు ఉద్యోగం రాలేదా ? మా వాడు వెళ్ళి అప్పుడే మూడేళ్ళ పైనే అయింది. గ్రీన్ కార్డ్ కూడా వచ్చేసింది, కొన్నాళ్ళలో సిటిజన్ షిప్ కూడా వచ్చేస్తుంది. ఇక మనం చెప్పనవసరం లేదన్నమాట. నే వెళ్ళలేదంటే నేనో వెధవని. అంతా బాగుంటే నువ్వింకా ఇండియా లోనే ఎందుకుంటావన్నట్టు మాట్లాడాడు. చిరాకొచ్చింది. ఇంతా చేస్తే వాళ్ళ ఇద్దరు కొడుకులూ US లోనే ఉన్నారంట, గత రెండు మూడేళ్ళ నుంచీ వారిని చూడనేలేదు, అలా ఉంటారన్నమాట. అది వాళ్ళకి సంతోషం.

ఇక పోతే ఉద్యోగంలో చూడండి. మీకు హైక్ వచ్చింది. మీ మది లో అన్నిటి కంటే మొదటిగా మెదిలేది నా కొలీగ్ కి ఎంతొచ్చింది అని. ఇక ఎలాగయినా ఆ సమాచారం లాగాలని తెగ ప్రయత్నిస్తుంటారు. అంతే గానీ నాకు కావలసినంత నాకొచ్చిందా ? అని ఆలోచించరు.

ఈ పోల్చడం మన చిన్నప్పుడు ఎల్కేజీ లో రాంక్ దగ్గర నుంచి, అరవయ్యేళ్ళప్పుడు ఎన్ని పళ్ళు మిగిలున్నాయి అనేదాకా సాగుతుంది.

అలా అని పోల్చుకోవడం తప్పు అని నేను అనను. పాజిటీవ్ గా ఆలోచించి కష్టపడి అందరికన్నా ఎత్తులో ఉండాలనుకోవడం లో తప్పు లేదు. కానీ ఏమీ చెయ్యకుండానే అన్నీ వచ్చెయ్యాలని అనుకోవడమే తప్పు.

ప్రకటనలు

17 వ్యాఖ్యలు »

 1. Sudhakar said,

  అద్బుతంగా చేప్పారు. నా మనసు లో వున్న మాట చేప్పారు. అమెరికా టార్చర్ నేను చాలా సార్లు ఎదుర్కొన్నాను. కావాలని ఇండీయా లో సెటిల్ అవుతున్నానంటే పిచ్చి వాన్ని చూసినట్లు చుస్తున్నారు.

 2. Sudhakar said,

  అద్బుతంగా చేప్పారు. నా మనసు లో వున్న మాట చేప్పారు. అమెరికా టార్చర్ నేను చాలా సార్లు ఎదుర్కొన్నాను. కావాలని ఇండీయా లో సెటిల్ అవుతున్నానంటే పిచ్చి వాన్ని చూసినట్లు చుస్తున్నారు.

 3. radhika said,

  ఇంతకు ముందు అంటే 25,30 ఏళ్ళ క్రితం పిల్లలు చదువులకని,ఉద్యోగాలకని దూరం గా వెలుతుంటే తల్లిదండ్రులు బాధపడేవారు.పిల్లలని తమ దగ్గరగా చూసుకుంటూ కాలం వెళ్ళదీయాలని పెద్దలనుకుంటూవుంటే పిల్లలేమో మా భవిష్యత్తు అంటూ మాటలు చెప్పేవారు.ఇప్పుడేమో పిల్లలు తమ వాళ్ళకు దగ్గరగానో,వాళ్ళతోనో జీవిస్తూ వాళ్ళని మంచిగా చూసుకోవాలని అనుకుంటుంటే పెద్దవాళ్ళేమో మా వాడు ఆ దేశం లో వున్నాడు,అంత సంపాదిస్తున్నాడు అని చెప్పుకోవడంలో ఆనందం పొందుతున్నారు. ఎంత మార్పు.

 4. radhika said,

  ఇంతకు ముందు అంటే 25,30 ఏళ్ళ క్రితం పిల్లలు చదువులకని,ఉద్యోగాలకని దూరం గా వెలుతుంటే తల్లిదండ్రులు బాధపడేవారు.పిల్లలని తమ దగ్గరగా చూసుకుంటూ కాలం వెళ్ళదీయాలని పెద్దలనుకుంటూవుంటే పిల్లలేమో మా భవిష్యత్తు అంటూ మాటలు చెప్పేవారు.ఇప్పుడేమో పిల్లలు తమ వాళ్ళకు దగ్గరగానో,వాళ్ళతోనో జీవిస్తూ వాళ్ళని మంచిగా చూసుకోవాలని అనుకుంటుంటే పెద్దవాళ్ళేమో మా వాడు ఆ దేశం లో వున్నాడు,అంత సంపాదిస్తున్నాడు అని చెప్పుకోవడంలో ఆనందం పొందుతున్నారు. ఎంత మార్పు.

 5. spandana said,

  బాగా చెప్పారు. “ఎల్కేజీ లో రాంక్ దగ్గర నుంచి, అరవయ్యేళ్ళప్పుడు ఎన్ని పళ్ళు మిగిలున్నాయి అనేదాకా ” ఇది మరీ నచ్చింది.
  అంతా relativityనే! బరువు చెప్పాలంటే ఏమని చెబుతాం ఒక కిలో అనా అంటే అది ఒక కిలో రాయంత అని కదా?
  అలాగే పొడవు, వేగం, సుఖం, బాధా అన్నీ పోల్చి చెప్పినవే!
  ఈ ప్రపంచమే అలా వుంది. ప్చ్ ఏం చేద్దామ్.

  –ప్రసాద్
  http://blog.charasala.com

 6. spandana said,

  బాగా చెప్పారు. “ఎల్కేజీ లో రాంక్ దగ్గర నుంచి, అరవయ్యేళ్ళప్పుడు ఎన్ని పళ్ళు మిగిలున్నాయి అనేదాకా ” ఇది మరీ నచ్చింది.అంతా relativityనే! బరువు చెప్పాలంటే ఏమని చెబుతాం ఒక కిలో అనా అంటే అది ఒక కిలో రాయంత అని కదా?అలాగే పొడవు, వేగం, సుఖం, బాధా అన్నీ పోల్చి చెప్పినవే!ఈ ప్రపంచమే అలా వుంది. ప్చ్ ఏం చేద్దామ్.–ప్రసాద్http://blog.charasala.com

 7. చేతన said,

  మరో విషయం, మనవాళ్ళకి మనది కానిదేదన్నా గొప్పే. పక్కవాళ్ళ పిల్లాడికొచ్చిన ర్యాంకు గొప్ప. చదివే కాలేజి గొప్ప. పక్క రాష్ట్రం గొప్ప. north india పద్ధతులు గొప్ప. US అయితే మరీ గొప్ప. మొన్న ఒకమ్మాయితో మాట్లాడుతున్నాను. ఆ అమ్మాయి అంటుంది, మనకి ఎంత అదృష్టం కాకపోతే ఇక్కడికి (USకి)వస్తాము, ఇవన్నీ చూస్తాము (ఆ అమ్మాయి ఇక్కడకి వచ్చిన రెండేళ్ళలో ఊరు దాటి బయటకి వెళ్ళలేదు) అని. నాకయితే అందులో అదృష్టం ఏముందో అర్థం కాలేదు. its just a different world. ఇక్కడి వాళ్ళకి తాజ్‌మహల్ గొప్ప. మనవాళ్ళకి White House గొప్ప.

 8. చేతన said,

  మరో విషయం, మనవాళ్ళకి మనది కానిదేదన్నా గొప్పే. పక్కవాళ్ళ పిల్లాడికొచ్చిన ర్యాంకు గొప్ప. చదివే కాలేజి గొప్ప. పక్క రాష్ట్రం గొప్ప. north india పద్ధతులు గొప్ప. US అయితే మరీ గొప్ప. మొన్న ఒకమ్మాయితో మాట్లాడుతున్నాను. ఆ అమ్మాయి అంటుంది, మనకి ఎంత అదృష్టం కాకపోతే ఇక్కడికి (USకి)వస్తాము, ఇవన్నీ చూస్తాము (ఆ అమ్మాయి ఇక్కడకి వచ్చిన రెండేళ్ళలో ఊరు దాటి బయటకి వెళ్ళలేదు) అని. నాకయితే అందులో అదృష్టం ఏముందో అర్థం కాలేదు. its just a different world. ఇక్కడి వాళ్ళకి తాజ్‌మహల్ గొప్ప. మనవాళ్ళకి White House గొప్ప.

 9. నవీన్ గార్ల said,

  ఎవరి పోస్టుకు ఎక్కువ కామెంట్లు వచ్చాయి అని జనాలు చూసుకోవట్లా 🙂

 10. ఎవరి పోస్టుకు ఎక్కువ కామెంట్లు వచ్చాయి అని జనాలు చూసుకోవట్లా 🙂

 11. ఎవరి పోస్టుకు ఎక్కువ కామెంట్లు వచ్చాయి అని జనాలు చూసుకోవట్లా 🙂

 12. రవి వైజాసత్య said,

  అమెరికా గొప్పనా అంటే గొప్పే..ఇండియా గొప్పనా అంటే గొప్పే రెండు సంస్కృతుల్లో, దేశాల్లో గొప్పలు, లోపాలు ఉన్నాయి. ఇక్కడ డాలర్ల సంపాదించినా అక్కడ రూపాయల్లో సంపాదించినా ఒక్కటే..ఇక్కడ బిల్లులు డాలర్లలో అక్కడి బిల్లులు రూపాయల్లో కట్టాల్సిందే కదా..అష్టకష్టాలు పడి మిగిల్చి ఇండియా పంపితే చాలా డబ్బులవుతాయి..ఒక పది సంవత్సరాలు ఉండి తిరిగివెలదామనుకున్న వాళ్లది మృగతృష్ణే..అటు వెళ్లిపోరు..ఇక్కడ ఉండాలేరు ఇక్కడ జీవితాన్ని అనుభవించలేరు..వాళ్లని చూస్తే నాకు తెగ జాలేస్తుంది.

  కానీ భారతీయ యువకులందరూ వాళ్ల జీవితంలో కనీసం ఒకసంవత్సరం పాటు అమెరికాలో ఒకసంవత్సరం పాటు చైనాలో గడిపితే బాగుంటుందని నా ఆలోచన. అప్పుడు భారతదేశం యొక్క విలువ తెలిసివస్తుంది. భారత దేశంలో ఉండాలా, అమెరికాలో ఉండాలా అన్నది వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. స్వయం ప్రకటిత అమెరికన్ ఐన నేను కొంత సీమ బిడ్డను, కొంత హైదరాబాదీని, కొంత తెలుగోన్ని, కొంత భారతీయున్ని..ఇక పాస్‌పోర్టులు కేవలం సౌలభ్యం కొరకే.

 13. రవి వైజాసత్య said,

  అమెరికా గొప్పనా అంటే గొప్పే..ఇండియా గొప్పనా అంటే గొప్పే రెండు సంస్కృతుల్లో, దేశాల్లో గొప్పలు, లోపాలు ఉన్నాయి. ఇక్కడ డాలర్ల సంపాదించినా అక్కడ రూపాయల్లో సంపాదించినా ఒక్కటే..ఇక్కడ బిల్లులు డాలర్లలో అక్కడి బిల్లులు రూపాయల్లో కట్టాల్సిందే కదా..అష్టకష్టాలు పడి మిగిల్చి ఇండియా పంపితే చాలా డబ్బులవుతాయి..ఒక పది సంవత్సరాలు ఉండి తిరిగివెలదామనుకున్న వాళ్లది మృగతృష్ణే..అటు వెళ్లిపోరు..ఇక్కడ ఉండాలేరు ఇక్కడ జీవితాన్ని అనుభవించలేరు..వాళ్లని చూస్తే నాకు తెగ జాలేస్తుంది.కానీ భారతీయ యువకులందరూ వాళ్ల జీవితంలో కనీసం ఒకసంవత్సరం పాటు అమెరికాలో ఒకసంవత్సరం పాటు చైనాలో గడిపితే బాగుంటుందని నా ఆలోచన. అప్పుడు భారతదేశం యొక్క విలువ తెలిసివస్తుంది. భారత దేశంలో ఉండాలా, అమెరికాలో ఉండాలా అన్నది వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. స్వయం ప్రకటిత అమెరికన్ ఐన నేను కొంత సీమ బిడ్డను, కొంత హైదరాబాదీని, కొంత తెలుగోన్ని, కొంత భారతీయున్ని..ఇక పాస్‌పోర్టులు కేవలం సౌలభ్యం కొరకే.

 14. రానారె said,

  పొరుగింటి మీనాక్షమ్మను చూశారా, వాళ్ల ఆయన చేసే ముద్దూముచ్చట విన్నారా? — అన్న పాట గుర్తొస్తోంది. ఆ వెటకారపు యిల్లాలి “ముద్దూముచ్చట” ఏడుపుకు అర్థం “ఓ ముత్యాల బేసరి ఇచ్చి ముక్కుకు అందం తెచ్చారా, నా ముక్కుకు అందం తెచ్చారా?” అన్న మాటతో తేటతెల్లమవుతుంది. “పొరుగింటి పుల్లయ గొడవ ఎందుకులేవే, వాడికి జీతం కన్నా గీతం ఎక్కువ తెలుసుకోవే” అనే మొగుడి మాటలు చెవినబడవు. “అమ్మా నాన్న ప్రేమగుర్తుగా పుట్టెను బుల్లి నామాలూ” అని మొగుడు రాగంతీస్తే ఆమెకు అతని మాటలు అసమర్థుని వాగుడుగా అనిపిస్తాయి. ఈ పాటను విన్నారా? ఇక్కడ మళ్లీ వినండి (5వ పాట).

 15. పొరుగింటి మీనాక్షమ్మను చూశారా, వాళ్ల ఆయన చేసే ముద్దూముచ్చట విన్నారా? — అన్న పాట గుర్తొస్తోంది. ఆ వెటకారపు యిల్లాలి “ముద్దూముచ్చట” ఏడుపుకు అర్థం “ఓ ముత్యాల బేసరి ఇచ్చి ముక్కుకు అందం తెచ్చారా, నా ముక్కుకు అందం తెచ్చారా?” అన్న మాటతో తేటతెల్లమవుతుంది. “పొరుగింటి పుల్లయ గొడవ ఎందుకులేవే, వాడికి జీతం కన్నా గీతం ఎక్కువ తెలుసుకోవే” అనే మొగుడి మాటలు చెవినబడవు. “అమ్మా నాన్న ప్రేమగుర్తుగా పుట్టెను బుల్లి నామాలూ” అని మొగుడు రాగంతీస్తే ఆమెకు అతని మాటలు అసమర్థుని వాగుడుగా అనిపిస్తాయి. ఈ పాటను విన్నారా? ఇక్కడ మళ్లీ వినండి (5వ పాట).

 16. ప్రవీణ్ గార్లపాటి said,

  @సుధాకర్: ప్చ్ ఏం చేస్తాం చెప్పండి …

  @రాధిక: అదే మరి వింత.

  @స్పందన: అవునండీ ఈ దునియా అంతా రిలేటీవ్‌గానే పని చేస్తుంది. ఇతరులతో పోలిస్తే నువ్వు ఎక్కడున్నావన్నదే ముఖ్యం మరి.

  @చేతన: ఎవరండీ బాబూ… భలే అమ్మాయే.

  @ నవీన్: అవునా ? ఇంతకీ నా స్కోరేంటో మరి ?

  @రవి: నేను మీతో ఏకీభవిస్తాను.


  ఒక పది సంవత్సరాలు ఉండి తిరిగివెలదామనుకున్న వాళ్లది మృగతృష్ణే..అటు వెళ్లిపోరు..ఇక్కడ ఉండాలేరు ఇక్కడ జీవితాన్ని అనుభవించలేరు..వాళ్లని చూస్తే నాకు తెగ జాలేస్తుంది.

  ఇది మాత్రం నిజం.

  @రానారె: భలే పాటను గుర్తు చేసావు. వింటున్నా…

 17. @సుధాకర్: ప్చ్ ఏం చేస్తాం చెప్పండి …@రాధిక: అదే మరి వింత.@స్పందన: అవునండీ ఈ దునియా అంతా రిలేటీవ్‌గానే పని చేస్తుంది. ఇతరులతో పోలిస్తే నువ్వు ఎక్కడున్నావన్నదే ముఖ్యం మరి.@చేతన: ఎవరండీ బాబూ… భలే అమ్మాయే.@ నవీన్: అవునా ? ఇంతకీ నా స్కోరేంటో మరి ?@రవి: నేను మీతో ఏకీభవిస్తాను.ఒక పది సంవత్సరాలు ఉండి తిరిగివెలదామనుకున్న వాళ్లది మృగతృష్ణే..అటు వెళ్లిపోరు..ఇక్కడ ఉండాలేరు ఇక్కడ జీవితాన్ని అనుభవించలేరు..వాళ్లని చూస్తే నాకు తెగ జాలేస్తుంది.ఇది మాత్రం నిజం.@రానారె: భలే పాటను గుర్తు చేసావు. వింటున్నా…


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: