మార్చి 30, 2007

బంతితో మలింగ గారడీ…

Posted in Uncategorized వద్ద 4:34 సా. ద్వారా Praveen Garlapati

శ్రీ లంక, సౌత్ ఆఫ్రికా మాచ్ లో మొన్న మలింగ బండార నాలుగు బంతుల లో నాలుగు వికెట్లు తీసాడు. అద్భుతమయిన బౌలింగ్.

శ్రీ లంక 209 పరుగులు చేసింది, సౌత్ ఆఫ్రికా గెలవడానికి నాలుగు పరుగులు కావాలి, అయిదు వికెట్లు చేతిలో ఉన్నాయి. పొలాక్, కలిస్ బాటింగ్ చేస్తున్నారు. ఇంకెంత ఒక ఫోర్ కొడితే అయిపోయింది అనుకున్నారు.

అప్పుడే మలింగ బౌలింగ్ కి వచ్చాడు. నాలుగు బంతులయిపోయాయి, వికెట్లేమీ రాలేదు. అయిదో బంతి సర్రున దూసుకు పోయి పొలాక్ వికెట్లు పడగొట్టింది. బౌల్డ్ …
తర్వాత బాట్స్‌మన్ హాల్ వచ్చాడు. మొదటి బంతి, కాచ్. అవుట్.

ఓవరయిపోయింది.

మళ్ళీ బౌలింగ్ కొచ్చాడు మలింగ. అందరిలో ఒక్కసారే ఉత్కంఠ. ఎమవుతుందో అని. మొదటి బాల్ కలిస్. డ్రైవ్ చేసి కీపెర్ కి నిక్ చేసాడు. మలింగ హాట్రిక్.

అంతలో మలింగ తరవాతి బాల్ వెయ్యటానికి వచ్చాడు. ఎన్‌తిని బాటింగ్. మలింగ యార్కర్ వేశాదు. క్లీన్ బౌల్డ్.

ఇక ఒక్క బాట్స్‌మన్ మిగిలాడు. శ్రీ లంక గెలుస్తుందేమో అని అందరూ చూస్తున్నారు. మలింగ బాల్ వేసాడు. పీటర్సన్ బాట్ ఎడ్జ్ తీసుకుని బౌండరీకి వెళ్ళిపోయింది. సౌత్ ఆఫ్రికన్లు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు.

 

ఆ ఘట్టం మళ్ళీ చూడండి.

 

 

ప్రకటనలు

8 వ్యాఖ్యలు »

  1. చదువరి said,

    ఏం బౌలింగో లెండి!! లేపాల్సిన చెయ్యిని చాచిపెట్టి బంతిని విసురుతుంటే ఏంటోగా అనిపిస్తుంది, నాకైతే.

  2. ఏం బౌలింగో లెండి!! లేపాల్సిన చెయ్యిని చాచిపెట్టి బంతిని విసురుతుంటే ఏంటోగా అనిపిస్తుంది, నాకైతే.

  3. ప్రవీణ్ గార్లపాటి said,

    అది నిజమే, నాక్కూడా చిరాకు కానీ పట్టుపడనంత వరకూ దొంగ దొంగ కాదు అన్నట్లు, అంతే.

    అదీ ఇప్పుడు పదిహేను డిగ్రీల వరకూ చెయ్యి వంచచ్చు అని ICC నిర్ణయించడంతో అందరూ కావలసినంత వంచుతున్నారు 🙂 ప్చ్…

  4. అది నిజమే, నాక్కూడా చిరాకు కానీ పట్టుపడనంత వరకూ దొంగ దొంగ కాదు అన్నట్లు, అంతే. అదీ ఇప్పుడు పదిహేను డిగ్రీల వరకూ చెయ్యి వంచచ్చు అని ICC నిర్ణయించడంతో అందరూ కావలసినంత వంచుతున్నారు 🙂 ప్చ్…

  5. Srinivas Chintakindi said,

    హాలో ప్రవీణ్ గారు, నేను మీ బ్లాగ్ ని రెగ్యులర్ గా చూస్తూంటాను. చాలా మామూలు విషయాన్ని కూడా మీరు చాలా Intresting గా వుండేలా రాస్తారు. Hats-Off to you.

    నాక్కూడా మీలాగా తెలుగులో బ్లాగ్ రాయలని వుంది. రాద్దామని కూచుంటె ఏమి రాయలో తెలిదు. అసలు మీరు ఇంత పేస్ తొ ఏల రాయగలుగుతున్నారు అని నాకు ఆశ్చర్యముగ ఉంది. ఎనీవే కీప్ ఇట్ అప్.

  6. హాలో ప్రవీణ్ గారు, నేను మీ బ్లాగ్ ని రెగ్యులర్ గా చూస్తూంటాను. చాలా మామూలు విషయాన్ని కూడా మీరు చాలా Intresting గా వుండేలా రాస్తారు. Hats-Off to you.నాక్కూడా మీలాగా తెలుగులో బ్లాగ్ రాయలని వుంది. రాద్దామని కూచుంటె ఏమి రాయలో తెలిదు. అసలు మీరు ఇంత పేస్ తొ ఏల రాయగలుగుతున్నారు అని నాకు ఆశ్చర్యముగ ఉంది. ఎనీవే కీప్ ఇట్ అప్.

  7. ప్రవీణ్ గార్లపాటి said,

    శ్రీనివాస్ గారూ: మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.
    నాకంత సీను లేదండీ. ఏదో టైంపాస్ గా రాస్తాను.

    కూడలి లో మీరు చూస్తే అందరూ మామూలు విషయాలే రాస్తారు. కాకపోతే ఎవరి కి తెలిసిన, ఎవరికి ఇష్టం ఉన్న విషయాల మీద వారు రాయడం చూస్తారు.

    ఇక మీరు కానీండి మరి 🙂

  8. శ్రీనివాస్ గారూ: మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.నాకంత సీను లేదండీ. ఏదో టైంపాస్ గా రాస్తాను. కూడలి లో మీరు చూస్తే అందరూ మామూలు విషయాలే రాస్తారు. కాకపోతే ఎవరి కి తెలిసిన, ఎవరికి ఇష్టం ఉన్న విషయాల మీద వారు రాయడం చూస్తారు.ఇక మీరు కానీండి మరి 🙂


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: