ఏప్రిల్ 19, 2007

ఉబుంటు "ఫియెస్టీ ఫాన్" …

Posted in Uncategorized వద్ద 9:14 సా. ద్వారా Praveen Garlapati

మన ఉబుంటు/కుబుంటు వాడకందారులందరూ ఇక మీ మీ ఆప్ట్-గెట్ లకి పని చెప్పండి. ఉబుంటు కొత్త రిలీజ్ “ఫియెస్టీ ఫాన్” వచ్చేసింది.

అద్భుతంగా ఉంది, ఇన్నాళ్ళూ నేను ప్రీ రిలీజ్ వర్షన్ వాడుతున్నాను. ఇది లినక్స్ ని డెస్క్‌టాప్ కి చేరువ చెయ్యడంలో ఎంతో పాత్ర పోషిస్తుందని ఆశిద్దాము.

ప్రతి ఆరు నెలలకీ ఒక మేజర్ రిలీజ్ తో అప్రతిహతంగా కొనసాగుతున్న ఉబుంటు ని ప్రయత్నించని వారందరూ తొందరలో ప్రయత్నించి చూడండి. ఎప్పటికప్పుడు సాఫ్ట్‌వేర్ ల కొత్త వర్షన్లను ఇంటిగ్రేట్ చేస్తూ కటింగ్ ఎడ్జ్ లో ఉంటుంది ఈ డిస్ట్రో.

దీనిని మీరు ఇక్కడ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇన్స్టాల్ చేసుకునే ముందు ప్రివ్యూ లాగా చూడాలనుకుంటే ఇప్పుడు ఉబుంటు ఇన్స్టాలేషన్ లైవ్ సీడీ ద్వారానే సాధ్యం, కాబట్టి వాడి, నచ్చితే ఇన్స్టాల్ చేసేసుకోండి. కావాలనుకుంటే విండోస్ తో పాటూ డ్యువల్ బూట్ కూడా చెయ్యచ్చు. కానీ అవసరం రాదనుకుంట 😉

అంతే కాదు మీరు కుబుంటు సీడీ లను వారి వెబ్‌సైట్ నుంచి ఉచితంగా పొందవచ్చు (పోస్టల్ చార్జీలు ఏమీ వర్తించవు, మీ అడ్రస్ ఇస్తే చాలు). నేను ఇప్పటికే ఇంతకు ముందు రెండు వర్షన్లు ఇలా తెప్పించుకుని కొంత మందిని లినక్స్ కి పరిచయం చేసాను, మీలో కూడా ఎంతో కొంత మంది దీనిని వాడి చూస్తారని ఆశిస్తున్నా.

జై ఉబుంటూ, జై జై ఉబుంటు…

16 వ్యాఖ్యలు »

 1. ప్రసాద్ said,

  థ్యాంక్స్ ప్రవీణ్.
  ఈ వారమైనా ప్రయత్నిస్తా దీన్ని install చేయడానికి.

  –ప్రసాద్
  http://blog.charasala.com

 2. థ్యాంక్స్ ప్రవీణ్.ఈ వారమైనా ప్రయత్నిస్తా దీన్ని install చేయడానికి.–ప్రసాద్ http://blog.charasala.com

 3. Anonymous said,

  ఏంటి ప్రవీన్, నువ్వు కూడా ఇల్ల లైసెన్స్ గోలల్లోకి వచ్చావు. అసలే, వెబ్బులో తెలుగు పేజీలు చాలా తక్కువ. మీపాటికి మీరు ఇట్లా లైసెన్సులు పెట్టేసుకుని జనాలని బెదిరిస్తే ఎట్లా సామీ.

  ఇలాంటివి చెయ్యడానికి ఇంకా చాల టైం ఉంది అని నా ఫీలింగ్. ఏమంటావు??

 4. Anonymous said,

  ఏంటి ప్రవీన్, నువ్వు కూడా ఇల్ల లైసెన్స్ గోలల్లోకి వచ్చావు. అసలే, వెబ్బులో తెలుగు పేజీలు చాలా తక్కువ. మీపాటికి మీరు ఇట్లా లైసెన్సులు పెట్టేసుకుని జనాలని బెదిరిస్తే ఎట్లా సామీ.ఇలాంటివి చెయ్యడానికి ఇంకా చాల టైం ఉంది అని నా ఫీలింగ్. ఏమంటావు??

 5. smadpr said,

  ayyo, the last comment was mine.. alavaatloa porapatu, sry

 6. smadpr said,

  ayyo, the last comment was mine.. alavaatloa porapatu, sry

 7. సుధాకర్(శోధన) said,

  నేను ఉబుంటూ వైపు పోదామని ఎంత ప్రయత్నించినా నా దినచర్య సాఫీగా సాగటంలో ఎక్కడొ ఒక దగ్గర అది అడ్డు తగలడం, దాన్ని తీసి పడెయ్యటం జరుగుతుంది 😦 ఆఖరుకు Live CD వాడటం మొదలు పెట్టా కానీ XP ఎప్పుడు ఒక భుజం మీద దెయ్యం పిల్లలా నన్ను బయటకు లాగుతూనే వుంది. మొన్నీమధ్య రియల్ సాఫ్ట్ వేర్ సిస్టమ్స్ లో పని చేసే నా స్నేహితుడు తన వుబుంటులో (చాలా రోజులనుంచి వాడుతున్నది) ఒక మెమరీ స్టిక్ లోనికి ఫైల్లు కాపీ చెయ్యలేక పరాభవం పొందాడు (గంట సేపు ప్రయత్నించి.) 2GB మెమరీ స్టిక్ ఎప్పటికీ 1 MB నే చూపిస్తుంది అదేంటో 😦

 8. నేను ఉబుంటూ వైపు పోదామని ఎంత ప్రయత్నించినా నా దినచర్య సాఫీగా సాగటంలో ఎక్కడొ ఒక దగ్గర అది అడ్డు తగలడం, దాన్ని తీసి పడెయ్యటం జరుగుతుంది 😦 ఆఖరుకు Live CD వాడటం మొదలు పెట్టా కానీ XP ఎప్పుడు ఒక భుజం మీద దెయ్యం పిల్లలా నన్ను బయటకు లాగుతూనే వుంది. మొన్నీమధ్య రియల్ సాఫ్ట్ వేర్ సిస్టమ్స్ లో పని చేసే నా స్నేహితుడు తన వుబుంటులో (చాలా రోజులనుంచి వాడుతున్నది) ఒక మెమరీ స్టిక్ లోనికి ఫైల్లు కాపీ చెయ్యలేక పరాభవం పొందాడు (గంట సేపు ప్రయత్నించి.) 2GB మెమరీ స్టిక్ ఎప్పటికీ 1 MB నే చూపిస్తుంది అదేంటో 😦

 9. ప్రవీణ్ గార్లపాటి said,

  @సుధాకర్ గారూ:

  ఉబుంటు లో సమస్యలు లేవని కాదు.

  కానీ ఉబుంటు కి మంచి సపోర్ట్ కూడా ఉంది. మీ మిత్రుడిని bugs.launchpad.net లో సమస్య ఉంచమని చెప్పండి. పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాను.

  BTW నేను విండోస్ కి వ్యతిరేకం కాదు. కానీ నాకు నచ్చలేదు అంతే. ఇది పర్సనల్ ప్రిఫరెన్స్.

  మీకు ఉబుంటు నచ్చకపోతే ఇంకేదయినా లినక్స్ డిస్ట్రో ఉపయోగించి చూడండి. లినక్సే ఇష్టం లేకపోతే విండోస్ ఉండనే ఉంది. 🙂

 10. @సుధాకర్ గారూ: ఉబుంటు లో సమస్యలు లేవని కాదు.కానీ ఉబుంటు కి మంచి సపోర్ట్ కూడా ఉంది. మీ మిత్రుడిని bugs.launchpad.net లో సమస్య ఉంచమని చెప్పండి. పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాను.BTW నేను విండోస్ కి వ్యతిరేకం కాదు. కానీ నాకు నచ్చలేదు అంతే. ఇది పర్సనల్ ప్రిఫరెన్స్.మీకు ఉబుంటు నచ్చకపోతే ఇంకేదయినా లినక్స్ డిస్ట్రో ఉపయోగించి చూడండి. లినక్సే ఇష్టం లేకపోతే విండోస్ ఉండనే ఉంది. 🙂

 11. ప్రవీణ్ గార్లపాటి said,

  అయ్యో ఈ లైసెన్స్ నా వ్యాసాలు వాడుకోవచ్చనే చెబుతుందండీ. కాకపోతే నా వ్యాసాలను కమర్షియల్ గా వాడుకోడానికి నిషేధిస్తుంది. నా వ్యాసాలను వాడుకున్నప్పుడు నా సోర్స్ కి లింక్ చెయ్యమని చెబుతుంది. నా వ్యాసం వాడిన వారు నా లాగే మళ్ళీ షేర్ చెయ్యాలని చెబుతుంది.

  ఇది సరిగా అర్థం కాదు అనుకుంటే విపులంగా రాస్తాను ఆ లైసెన్స్ కింద.

  వద్దంటారా ?

 12. అయ్యో ఈ లైసెన్స్ నా వ్యాసాలు వాడుకోవచ్చనే చెబుతుందండీ. కాకపోతే నా వ్యాసాలను కమర్షియల్ గా వాడుకోడానికి నిషేధిస్తుంది. నా వ్యాసాలను వాడుకున్నప్పుడు నా సోర్స్ కి లింక్ చెయ్యమని చెబుతుంది. నా వ్యాసం వాడిన వారు నా లాగే మళ్ళీ షేర్ చెయ్యాలని చెబుతుంది.ఇది సరిగా అర్థం కాదు అనుకుంటే విపులంగా రాస్తాను ఆ లైసెన్స్ కింద.వద్దంటారా ?

 13. ప్రసాద్ said,

  ప్రవీణ్,
  ప్రస్తుతం వున్న XP అలాగే వుంచి Dual Bootలో ఊబంటు install చేద్దామని చూస్తున్నా! మంచి వివరణాత్మక documents వుంటే చూపెడుదూ!

  –ప్రసాద్
  http://blog.charasala.com

 14. ప్రవీణ్,ప్రస్తుతం వున్న XP అలాగే వుంచి Dual Bootలో ఊబంటు install చేద్దామని చూస్తున్నా! మంచి వివరణాత్మక documents వుంటే చూపెడుదూ!–ప్రసాద్http://blog.charasala.com

 15. ప్రవీణ్ గార్లపాటి said,

  @ప్రసాద్ గారూ:
  నాకు తెలిసినంత వరకూ ఇక్కడ రాసాను (http://praveengarlapati.blogspot.com/2007/04/blog-post_23.html). ఒక రెండు లింకులు కూడా అక్కడ ఇచ్చాను. చూడండి.

 16. @ప్రసాద్ గారూ: నాకు తెలిసినంత వరకూ ఇక్కడ రాసాను (http://praveengarlapati.blogspot.com/2007/04/blog-post_23.html). ఒక రెండు లింకులు కూడా అక్కడ ఇచ్చాను. చూడండి.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: