ఏప్రిల్ 21, 2007

సినిమాలు, సినిమాలు, సినిమాలు …

Posted in సినిమా, సినిమాలు వద్ద 9:15 సా. ద్వారా Praveen Garlapati

ఈ మధ్య చూసిన సినిమాలు:

The Prestige: ఇది ఇద్దరు మాంత్రికుల మధ్య జరిగే పోరు. ఒకరి ట్రిక్కులు ని మరిపించడానికి ఇంకొకరు ఎంత దూరమయినా వెళతారు. ఆఖరికి చంపడానికి, వారి రహస్యాలను తెలుసుకోడానికి గూఢచారులను కూడా వాడతారు. ఆఖరికి ఇతరులను భ్రమింప చేసే ఉత్తుత్తి మాజిక్ కాకుండా నిజమయిన మాజిక్ వారికి అనుభవంలోకొస్తుంది. ఇంటరెస్టింగ్ అయిన సినిమా.

నా రేటింగ్: 4/5

Before Sunrise / Before Sunset: ఈ సినిమాలు నా జీవితంలో చూసిన వాటిలో మొదటి పది స్థానాల్లో తప్పకుండా ఉంటాయి. ఈ సినిమాల గురించి చెప్పనలవి కాదు చూడవలసిందే. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఒక ట్రైన్ లో కలుసుకుంటారు. పరిచయమవుతుంది. ఇద్దరూ కలిసి ఒక రాత్రి ఆ పట్టణంలో గడుపుదామని నిర్ణయించుకుంటారు. ఇక సినిమా మొత్తం వారు మాట్లాడుకొవడమే. అది ఎంత ఆసక్తికరంగా ఉంటుందో చెప్పనలవి కాదు. చూడవలసిందే. వారు అలా మాట్లాడుకుంటూ ఒకరితో ఒకరు ప్రేమలో పడతారు. చివరికి పొద్దు పొడవడంతో ఇద్దరూ విడిపోతారు. విడిపోతూ ఆరు నెలల తరవాత అదే ప్రదేశంలో కలుద్దామని నిర్ణయించుకుంటారు. అక్కడితో Before Sunrise ముగుస్తుంది.

దాని సీక్వెల్ Before Sunset. ఇది కూడా చాలా బాగుంది. మొదటి పార్ట్ లో విడిపోయిన ఇద్దరూ పదేళ్ళ తరవాత కలుసుకుంటారు. ఆరు నెలల తరవాత కలుసుకుందామనుకున్న వాళ్ళు కొన్ని కారణాల వల్ల కలుసుకోడానికి కుదరదు. ఆ తరవాత ఆ అబ్బాయి వారి కథని పుస్తకంలా రాస్తే అది పెద్ద హిట్ అవుతుంది. ఆ పుస్తక ప్రచారంలో భాగంగా ఆ అమ్మాయి ఉండే పట్టణానికి వస్తాడు. అక్కడ ఇద్దరూ కలుసుకుంటారు. ఈ సారి సినిమా ఒక రోజు మొత్తం ఇద్దరూ గడపడం గురించి.

మంచి సినిమాలు చూసిన అనుభూతి కలిగింది చాన్నాళ్ళ తరవాత.

నా రేటింగ్: 5/5

Little Miss Sunshine: అనుబంధాలు సరిగా లేని ఒక కుటుంబ కథ ఇది. ఇందులో ఒక చిన్నారికి ఒక బ్యూటీ కాంటెస్ట్ లో పాల్గొనే అవకాశం వస్తుంది. కానీ దాంట్లో పాల్గొనడానికి ఎన్నో అడ్డంకులు. కానీ ఆ అడ్డంకులు అన్నీ దాటి, ఆ చిన్నారి సంతోషం కోసం కుటుంబం అంతా ఒకటయి ఎలా ముగుస్తుందో చూడవలసిందే. మంచి సినిమా.

నా రేటింగ్: 3.5/5

Children of Men: ఫ్రాంక్ గా చెప్పాలంటే ఈ సినిమా తో నేను కనెక్ట్ అవ్వలేదు అనడం సరయినదేమో. ఇందులో భవిష్యత్ లో జనాలకు పిల్లలను కనే సామర్థ్యాన్ని కోల్పోతారు. అలాంటి పరిస్థితుల్లో ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అవుతుంది. కొందరు ఎక్స్ట్రీమిస్టులు ఆ అమ్మాయిని చంపడానికి, లేదా ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఆ అమ్మాయిని కొంత మంది కలిసి ఎలా కాపాడతారొ అనేదే చిత్రం కథ. ఎన్నో అంశాలను స్పృశిస్తుంది. ఎన్నో మంచి పెర్ఫార్మెన్సులు.

నా రేటింగ్: 3/5 (ఇంకా ఎక్కువివ్వాలి కానీ నాకు అంతగా కిల్క్ అవ్వలేదు.)

The Guardian: ఇది కోస్ట్ గార్డ్స్ కథ. కోస్ట్ గార్డ్స్ జీవితం ఎంత కష్టమో, వారికి ఎంత డెడికేషన్ కావాలో, వారినెలా తీర్చిదిద్దుతారో అనేదే కథ స్థూలంగా. ఒకే ఒకే సినిమా.

నా రేటింగ్: 3/5

Apocalypto: ఇందులో ఒక ఆదివాసీ తెగ ఉంటుంది. వారిని గెలిచి వారిని బానిసలౌగా చేసుకోడానికి ఇంకో తెగ వారి మీద దండెత్తుతుంది. అందరినీ కట్టి తీసుకెళ్ళి కొంత మందిని బానిసలుగానూ, కొంత మందిని బలి గానూ ఇచ్చేస్తారు. అందులో ఒకడు మాత్రం తప్పించుకుంటాడు ఆఖరికి. ఈ కథ ఎన్నో ఆలోచనలను రేకెత్తిస్తుంది. ఈ రోజు మానవుడు చేసే ఆకృత్యాలు మనకు దాదాపుగా అలాగే కనిపిస్తాయి. తన లాభం కోసం ఇతరుల ప్రదేశాలను ఆక్రమించుకోవడం, ఇతరులను బానిసలుగా చేసుకోవడానికి ప్రయత్నించడం మొదలయినవి. మంచి సినిమా కానీ ఇందులొ వయోలెన్స్ మోతాదు చాలా ఎక్కువ.

నా రేటింగ్: 4/5

300: దీని గురించి అందరికీ తెలిసిందే. అంతో ఎంజాయ్ చేసాను ఈ సినిమా. అద్భుతంగా ఉంది. మూడొందల మంది వీరులు ఓటమిని ఒప్పుకోకుండా ఎన్నో వేల మంది సైన్యాన్ని ఎదురొడ్డి ఎలా పోరాడుతారో అనేదే కథ. చిన్నప్పటి నుండీ వీరు వీరులగానే, ఓటమి, భ్యం అనేది తెలియని వారుగా పెరుగుతారు. అందుకని చావో రేవో తేల్చుకోవాల్సి వచ్చినప్పుడు యుద్ధం చేసి అవతల ప్రత్యర్థిని మట్టి కరిపించి చావడానికే నిర్ణయించుకుంటాడు నాయకుడు. మిగతా వారు అంగీకరించకపోవడంతో ఒక మూడొందల మందిని తీసుకుని వారితోనే యుద్ధం చేస్తాడు. అత్యంత ఉత్తమమయిన ప్రమాణాలతో ఉన్నాయి గ్రాఫిక్స్ ఈ సినిమాలో. అద్భుతం.

నా రేటింగ్: 5/5

The Holiday: ఇద్దరు అమ్మాయిల కథ ఇది. వీరిద్దరూ విభిన్న పరిస్థితులలో ఉంటారు. ఒకరు ఎంతో ధనికురాలు, ఇంకొకరు కటిక పేద. ఇద్దరూ ఒక నెల రోజులు తమ ఇళ్ళు మార్చుకుని జీవించడానికి ప్రయత్నిస్తారు. ఆ రోజులలో వారు ఎలాంటి అనుభవాలు పొందారన్నదే ఈ సినిమా. బానే ఉంది. కానీ ఇందులో కేట్ విన్స్లెట్ ఎంతో ముసలిదానిలా ఉంది. ప్చ్…

నా రేటింగ్: 2.5/5

Hanuman: ఆనిమేషన్ సినిమా ఇది. మనకు తెలిసిన రామాయణం కథే ఇది. అందులో హనుమంతుని కథ. బాగుంది. పిల్లలకు ఎంతగానో నచ్చుతుంది. దీంట్లో చిరంజీవి గొంతు అరువిచ్చారు.

నా రేటింగ్: 3.5/5

జగడం: జగడం, వయోలెన్స్ ఈ కాలంలో ఎలా ఫాషన్ గా మారుతుందో అన్నది ఈ కథ. చెడు వైపు ఆకర్షితుడయిన ఒకడు ఎలా అందులో కొట్టుకుపోతాడో, చివరికి అతని జీవితాన్ని అది ఎలా మార్చేస్తుందో అనేదే ఈ కథ. తెలుసుగా ఇలాంటి సినిమాల్లో సినిమా అంతా వయోలెన్స్ ని త్రీడీలో చూపించి చివరకు ఇలా చెయ్యద్దు అని చెబుతారు. అలాంటి కథే. పెద్ద చూడాల్సిన సినిమా కాదు.

నా రేటింగ్: 2/5

ఇంకా ఉన్నాయి కానీ ఇక ఆపేస్తాను.

13 వ్యాఖ్యలు »

 1. రాకేశ్వర రావు said,

  before sunrise/before sunset
  పేర్లే నాకు తెగ నచ్చాసాయి. మీ వివరణ కూడా నన్ను ఆకట్టుకుంది. తప్పకుండ చూడాలి.

  ఇలాంటిదే, the breakfast club, అనే సినిమా. అది తప్పక చూడండి.

 2. before sunrise/before sunset పేర్లే నాకు తెగ నచ్చాసాయి. మీ వివరణ కూడా నన్ను ఆకట్టుకుంది. తప్పకుండ చూడాలి.ఇలాంటిదే, the breakfast club, అనే సినిమా. అది తప్పక చూడండి.

 3. ప్రవీణ్ గార్లపాటి said,

  రాక్. ఆ. గారు:
  థాంక్సండీ మరో మంచి సినిమా పరిచయం చేసినందుకు.

 4. రాక్. ఆ. గారు: థాంక్సండీ మరో మంచి సినిమా పరిచయం చేసినందుకు.

 5. Krishh Raem said,

  Little Miss Sunshine కి 3.5 .. Apocalypto కి 4 ఆ …. నేనొప్పుకోనంతే ….
  😉 , నాకు Little Miss Sunshine ఎందుకో విపరీతంగా నచ్చేసింది.
  Children of Men ఇది మరో సారి చూడండి కచ్చితంగా మీ రేటింగ్ పెంచుతారు 🙂

  జగడం — ఇలాంటి సినిమాల కోసం రేటింగ్ ల లో మైనస్ నెంబర్లు కూడా పెట్టాలి -20/5 😉

 6. Krishh Raem said,

  Little Miss Sunshine కి 3.5 .. Apocalypto కి 4 ఆ …. నేనొప్పుకోనంతే ….;) , నాకు Little Miss Sunshine ఎందుకో విపరీతంగా నచ్చేసింది.Children of Men ఇది మరో సారి చూడండి కచ్చితంగా మీ రేటింగ్ పెంచుతారు :)జగడం — ఇలాంటి సినిమాల కోసం రేటింగ్ ల లో మైనస్ నెంబర్లు కూడా పెట్టాలి -20/5 😉

 7. ప్రవీణ్ గార్లపాటి said,

  @క్రిష్ (ఇదన్నప్పుడల్లా హ్రితిక్ రోషన్ క్రిష్ సినిమా గుర్తొస్తుంది):

  మీరన్నది కరక్టే. Little Miss Sunshine కి ఇంకా ఎక్కువివ్వచ్చు. కానీ ఎక్కడో కొద్దిగా క్రూడ్ గా అనిపించింది, స్టోరీ కాదు, టేకింగ్. కాబట్టి ఏమో 4కి సవరించచ్చేమో.

  Children of Men అవును నేను చెప్పినట్టే ఎక్కడో అది నేను మిస్సయ్యాను. సరిగా తగల్లేదు నాకు, ఇంకోసారి ప్రయత్నిస్తా తీరిగ్గా, ఈ సారి రాత్రి మూడింటికి మొదలెట్టకుండా ముందే మొదలెడితే బావుంటుందేమో. 🙂

  హహహ… జగడం నో కామెంట్.

  ఇంకేమన్నా మంచి సినిమాలుంటే చెబుదురూ…

 8. @క్రిష్ (ఇదన్నప్పుడల్లా హ్రితిక్ రోషన్ క్రిష్ సినిమా గుర్తొస్తుంది):మీరన్నది కరక్టే. Little Miss Sunshine కి ఇంకా ఎక్కువివ్వచ్చు. కానీ ఎక్కడో కొద్దిగా క్రూడ్ గా అనిపించింది, స్టోరీ కాదు, టేకింగ్. కాబట్టి ఏమో 4కి సవరించచ్చేమో.Children of Men అవును నేను చెప్పినట్టే ఎక్కడో అది నేను మిస్సయ్యాను. సరిగా తగల్లేదు నాకు, ఇంకోసారి ప్రయత్నిస్తా తీరిగ్గా, ఈ సారి రాత్రి మూడింటికి మొదలెట్టకుండా ముందే మొదలెడితే బావుంటుందేమో. :)హహహ… జగడం నో కామెంట్.ఇంకేమన్నా మంచి సినిమాలుంటే చెబుదురూ…

 9. Krishh Raem said,

  క్రిష్ రేం — నేను 10th లో ఉండగా నా పే…..ద్ద పేరు ను పిలువ లేక ఫ్రెండ్స్ ఇలా మొదలెట్టారు … ఇది 5 సం వ కింద జరిగింది … హ్రితిక్ కి ఇది ఎలా తెలిసిందో ఎంటో నా పేరు వాడేసుకున్నాడు సినిమాకి 😉

  సినిమాలు — MY SASSY GIRL అనే ఫిలిం చూసారా ?? కొరియన్ సినిమా అది … చాలా బావుంటుంది !!

 10. Krishh Raem said,

  క్రిష్ రేం — నేను 10th లో ఉండగా నా పే…..ద్ద పేరు ను పిలువ లేక ఫ్రెండ్స్ ఇలా మొదలెట్టారు … ఇది 5 సం వ కింద జరిగింది … హ్రితిక్ కి ఇది ఎలా తెలిసిందో ఎంటో నా పేరు వాడేసుకున్నాడు సినిమాకి ;)సినిమాలు — MY SASSY GIRL అనే ఫిలిం చూసారా ?? కొరియన్ సినిమా అది … చాలా బావుంటుంది !!

 11. Falling Angel said,

  Before sunrise/Sunset, my all time fav’s too.

  Bitter moon చూశారా!!
  పేరుకు తగ్గట్టే సినిమా చూసిన రెండురోజుల వరకూ ఆ Bitter feeling అలా ఉండిపోతుంది.

  మీరు పరిచయం చేస్తున్న సినిమాల్లో చాలావరకూ నాకు నచ్చినవి ఉన్నాయి.

 12. Before sunrise/Sunset, my all time fav’s too.Bitter moon చూశారా!! పేరుకు తగ్గట్టే సినిమా చూసిన రెండురోజుల వరకూ ఆ Bitter feeling అలా ఉండిపోతుంది. మీరు పరిచయం చేస్తున్న సినిమాల్లో చాలావరకూ నాకు నచ్చినవి ఉన్నాయి.

 13. Anonymous said,

  జగడం సినిమా కాస్త సిటి ఆఫ్ గాడ్ అన్న బ్రెజిల్ సినిమాకి కాపీ ప్రవీణ్ గారు. మీకు వీలుంటే గెస్సోపి టొర్నోటర్ గారి ” మెలీన ” సినిమా చూడండి ఇది ఒక ఇటాలియన్ సినిమా..ఈయనగారి అన్ని సినిమాలు బాగుంటాయి..! కమల్.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: