ఏప్రిల్ 22, 2007

లినక్స్/ఉబుంటు డ్యువల్ బూట్ …

Posted in ఉబుంటు, డ్యువల్ బూట్, లినక్స్ వద్ద 8:38 సా. ద్వారా Praveen Garlapati

ఈ కింద నాకు తెలిసున్నంత వరకూ ఎలా చెయ్యాలో చెబుతాను, ఒకట్రెండు లింకులు కూడా ఇస్తాను.

* నేను ఇతరుల దగ్గర నుండి నేర్చుకుందే ఎక్కువ, ట్యుటోరియళ్ళు ఎక్కువ ఉపయోగించలేదు.

డ్యువల్ బూట్ మొదలెట్టే ముందు కొన్ని సూచనలు

1. డాటా ని తప్పక బాకప్ చేసుకోండి.
2. ఉబుంటు ని ఉపయోగించడానికి 2 GB హార్డ్ డిస్క్ స్పేస్, 256 MB రాం అవసరం. దానిని సరి చూసుకోండి.
3. ఉబుంటు మీకు సరిపోతుందో లేదో లైవ్ సీడీ ఉపయోగించి చూసుకోండి.
4. ఒక వేళ కొన్నాళ్ళు వాడి తరవాత ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే ఉచితంగా లభించే vmware server ఉపయోగించి వాడి చూడండి.

ఇక డ్యువల్ బూట్ విధానం:

1. డ్యువల్ బూట్ కోసం మనకు ముందు మన హార్డ్ డిస్క్ లో సెపరేట్ పార్టీషన్ కావాలి. అంటే మీకు C, D లాంటి డ్రైవులు కనీసం రెండు ఉండాలి. అందులో ఒకటి లినక్స్ కి కేటాయించగలగాలి.

2. లేవు అనుకోండి ఉన్న ఒకే డ్రైవ్ ని మనం ముక్కలు చేసి దానిని మనకు కావలసిన విధంగా పార్టీషన్ చేసుకోవాలి. దానికి ఎన్నో విధానాలు ఉన్నాయి.

అ) ఉబుంటు ఇన్స్టాలర్ ఇప్పుడు లైవ్ సీడీ ద్వారానే సాధ్యం. కాబట్టి మీరు ఆ సీడీ ని మీ సీడీ డ్రైవ్ లో ఉంచి బూట్ చెయ్యండి.
ఆ) ఉబుంటు లోకి బూట్ అయ్యిన తరవాత అక్కడ మెనూ లో పార్టీషన్ చెయ్యడానికి QTParted (under System) అనే యూటిలిటీ ఉంటుంది. దానిని ఉపయోగించి మీ హార్డ్ డిస్క్ ని రీసైజ్ చెయ్యండి. మీకు కావలసినట్టు అందులో సైజ్ నిర్ణయించుకోండి. (ఇది చేసే ముందు విండోస్ లో ఒక సారి మీ డిస్క్ ని డీఫ్రాగ్మెంట్ చేస్తే మంచిది.)

* ఈ QTParted పని చెయ్యకపోతే ఇతర ఏ పార్టీషన్ చెయ్యగలిగే టూల్ నయినా ఉపయోగించి పార్టీషన్ చెయ్యండి. (System Rescue CD, Knoppix, Partition Magic లాంటివి)

3. మీరు ఆ టూల్స్ ని ఉపయోగించి పార్టీషన్ చేసిన తరవాత ఒక సారి సరి చూసుకోండి. (విండోస్ లోకి బూట్ అయి కూడా చూసుకోండి.)

4. అంతా సరిగా ఉందనుకుంటే మళ్ళీ సీడీ నుండి బూట్ చెయ్యండి. మీరు బూట్ చేసిన తరవాత మీకు డెస్క్‌టాప్ మీద ఉబుంటు ఇన్స్టాలర్ అని ఒకటి కనిపిస్తుంది, దానిని తెరవండి. దాంట్లో ఆటోమాతిక్ కాకుండా, మాన్యువల్ అని ఉంటుంది ఆ విధానం సెలెక్ట్ చేసుకోండి డిస్క్ పార్టీషన్ కి.

5. ఇప్పుడు మీరు పార్టీషన్ చేసిన స్పేస్ ని(అదే కొత్తగా సృష్టించిన పార్టీషన్ లో) ఉబుంటు కోసం ఎంపిక చేసుకోండి. మీకు ఒక రూట్ పాటీషన్, ఒక స్వాప్ స్పేస్ కావాలి మినిమం గా. స్వాప్ స్పేస్ కి బండ గుర్తు ఏమిటి అంటే మీ రాం సైజ్ కి రెట్టింపు ఉండాలి. నాకు తెలిసి ఉబుంటు ఆటోమాటిగ్గా దీనిని చేస్తుంది.

6. పైన చెప్పినవే కొద్దిగా కష్టమయిన పనులు. కుదిరితే ఎవరయినా ఇంతకు ముందు చేసిన వారి సహాయం తీసుకోండి. మీకు గనక అల్రెడీ రెండు పార్టీషన్లు ఉండి, ఒక దానిని లినక్స్ కోసం ఉపయోగించగలిగితే అసలు సమస్యే లేదు.

7. ఇక అది సెలెక్ట్ చేసుకున్న తరవాత అంతా straight forward. విండోస్ ఇన్స్టాలర్ మాదిరిగా విజర్డ్ ఉంటుంది, దానిని పట్టి ఆన్సర్ చేస్తూ పోవడమే.

8. మీ సిస్టం లో ఉన్న విండోస్ ని ఇది ఆటోమాతిగ్గ డిటెక్ట్ చేసి మీకు చెబుతుంది, తర్వాత గ్రబ్ ఇన్స్టాల్ చేసి అందులో మీకు విండోస్ ఎక్స్పీ ఆప్షన్ పెడుతింది.

(డ్యూవల్ బూట్ గనక ఇది గ్రబ్ ఇన్స్టాల్ చేస్తుంది. ఇది బూట్‌లోడ్ మేనేజర్. ఇందులో మీకు విండోస్ మరియు, ఉబుంటు ఆప్షన్స్ కనపడతాయి. ఏది సెలెక్ట్ చేసుకుంటే అందులోకి బూట్ అవుతుంది).

మీరు మొదటి సారి చేస్తుంటే గనక ఎవరినయినా సహాయం తీసుకోవడం మంచిది. కానీ మీ పర్సనల్ సిస్టం అయి ఉండి పర్వాలేదు అనుకుంటే సొంతంగా చేస్తే ఎక్కువ విషయాలు తెలుస్తాయి. తప్పు ఆయే ప్రమాదం కూడా ఉంది.

నేను సెర్చ్ చేసిన వాటిలో ఒక రెండు లింకులు పనికొచ్చేవి

http://www.linuxdevcenter.com/pub/a/linux/2006/05/08/dual-boot-laptop.html?page=1
http://ca.geocities.com/zachandloricox@rogers.com/ubuntu/windowsxp.html
http://www.dedoimedo.com/computers/install_kubuntu.html

ఆల్ ద బెస్ట్. 🙂

ప్రకటనలు

15 వ్యాఖ్యలు »

  1. ప్రసాద్ said,

    ప్రవీణ్,
    సమాచారానికి కృతజ్ఞతలు. కానీ Live CDతో బూట్ చెయ్యడంలోనే (ఆదిలోనే హంసపాదు) విఫలమయ్యాను.

    నేను చేస్తున్నది, DELL laptop మీద. XP operating system. ఉబంటు నుండి Live CD చ్రేతె చేసి, CD Driveలో వుంచి restart చేశాను. కానీ దాన్ని గమనించనట్లే మళ్ళీ XP వచ్చేసింది. మనకు 2000, 98లలో బూట్ అయ్యేటపుడు వచ్చే కమాండ్ ఆప్షన్స్ రాలేదు.
    XPలో CD నుంచి బూట్ ఎలా చేయాలో తెలియలేదు!!

    –ప్రసాద్
    http://blog.charasala.com

  2. ప్రవీణ్,సమాచారానికి కృతజ్ఞతలు. కానీ Live CDతో బూట్ చెయ్యడంలోనే (ఆదిలోనే హంసపాదు) విఫలమయ్యాను.నేను చేస్తున్నది, DELL laptop మీద. XP operating system. ఉబంటు నుండి Live CD చ్రేతె చేసి, CD Driveలో వుంచి restart చేశాను. కానీ దాన్ని గమనించనట్లే మళ్ళీ XP వచ్చేసింది. మనకు 2000, 98లలో బూట్ అయ్యేటపుడు వచ్చే కమాండ్ ఆప్షన్స్ రాలేదు.XPలో CD నుంచి బూట్ ఎలా చేయాలో తెలియలేదు!! –ప్రసాద్ http://blog.charasala.com

  3. ప్రవీణ్ గార్లపాటి said,

    లేదండీ… సీడీ నుంచి బూట్ అయే ఆప్షన్ బయోస్ (BIOS) లో చెయ్యాలండీ. మీరు BIOS లో కి వెళ్ళి మీ FIRST BOOT DEVICE ని సీడీ గా ఉంచాలి. అప్పుడు మీరు బూట్ చేస్తే సీడీ నుంచి బూట్ అవుతుంది.

    అలా చేసాక కూడా అవలేదంటే, మీ సీడీ బూటబుల్ కాదని అర్థం. కాబట్టి మీ సీడీ ని సరిగా బర్న్ చేసారో లేదో గమనించండి. iso ని బర్న్ చేసేటప్పుడు డాటా సీడీ గా బర్న్ చెయ్యాలి. ఉన్నదున్నట్టు iso ఇమేజీ ని బర్న్ చేస్తే అది బూటబుల్ అవదు.

    ఇంకా పని చెయ్యకపోతే ఇంకేదో సమస్య ఉందని అర్థం. మళ్ళీ డీబగ్ చేద్దాము.

  4. లేదండీ… సీడీ నుంచి బూట్ అయే ఆప్షన్ బయోస్ (BIOS) లో చెయ్యాలండీ. మీరు BIOS లో కి వెళ్ళి మీ FIRST BOOT DEVICE ని సీడీ గా ఉంచాలి. అప్పుడు మీరు బూట్ చేస్తే సీడీ నుంచి బూట్ అవుతుంది.అలా చేసాక కూడా అవలేదంటే, మీ సీడీ బూటబుల్ కాదని అర్థం. కాబట్టి మీ సీడీ ని సరిగా బర్న్ చేసారో లేదో గమనించండి. iso ని బర్న్ చేసేటప్పుడు డాటా సీడీ గా బర్న్ చెయ్యాలి. ఉన్నదున్నట్టు iso ఇమేజీ ని బర్న్ చేస్తే అది బూటబుల్ అవదు.ఇంకా పని చెయ్యకపోతే ఇంకేదో సమస్య ఉందని అర్థం. మళ్ళీ డీబగ్ చేద్దాము.

  5. ప్రసాద్ said,

    ఆ అదేనండీ ఆ BIOS అనేమాట గుర్తురాలేదు నిన్న. 98, 2000 బూట్ అయ్యేప్పుడు BIOSలో ఆగి If you want to setup press F2″ అనో ఇంకేదో అంటాయి గదా!
    XPలో ఆ option రావట్లేదే!

    –ప్రసాద్
    http://blog.charasala.com

  6. ఆ అదేనండీ ఆ BIOS అనేమాట గుర్తురాలేదు నిన్న. 98, 2000 బూట్ అయ్యేప్పుడు BIOSలో ఆగి If you want to setup press F2″ అనో ఇంకేదో అంటాయి గదా! XPలో ఆ option రావట్లేదే!–ప్రసాద్ http://blog.charasala.com

  7. ప్రవీణ్ గార్లపాటి said,

    ఓ అలాగా…
    మీరు అదే కీ ఉపయోగించి చూసారా పని చేస్తుందేమో?

    ఈ కింద వేమన్నా పనికొస్తాయేమో చూడండి.

    Dell® 400 F3, F1
    Dell 4400 F12
    Dell Dimension® F2 or DEL
    Dell Inspiron® F2
    Dell Latitude Fn+F1 (while booted)
    Dell Latitude F2 (on boot)
    Dell Optiplex DEL
    Dell Optiplex F2
    Dell Precision™ F2

  8. ఓ అలాగా…మీరు అదే కీ ఉపయోగించి చూసారా పని చేస్తుందేమో?ఈ కింద వేమన్నా పనికొస్తాయేమో చూడండి.Dell® 400 F3, F1Dell 4400 F12Dell Dimension® F2 or DELDell Inspiron® F2Dell Latitude Fn+F1 (while booted)Dell Latitude F2 (on boot)Dell Optiplex DELDell Optiplex F2Dell Precision™ F2

  9. ప్రవీణ్ గారు నేను ఉబుంటు ని డౌన్ లోడ్ చేసా బూటబుల్ గా ఎలా మార్చాలో చెప్ప గలరా అంటే ఎలా బర్న్ చెయ్యాలి ?

  10. నేను మీ అంత టెకీ ని కాదు. Let me put my fingure in between but.ఒక CD ని OS recognize చెయ్యటమ్లేదు అంటే, అది ఏ ఫార్మాట్ లో రాసారు అనేది మొదటిది. దాంట్లో checksum errors ఎమైనా ఉన్నాయా అనేది రెండోది. iso image లా రాస్తే ఎలా burn చేసారు అనేది మూడోది. ఎంత speed తో burn చేసారు అనేది నాల్గోది.Download an ISO, say, ubuntu.iso. Download infra recorder or something like that. Load your ISO into infra, burn it as an ISO image. check it with MD5 or something like that for checksum errors.Now, if everything goes good, its ready to use. Put it in DVD reader, restart your OS. If you want to change the boot sequence, goto bios, change the order, meaning push DVD Drive to first. Restart OS again.Please do correct me if I fat fingured anywhere.ThanksFlipside – Anyone wants to have parallel OSs. Download VirtualBox from Sun Micro, install it. On the top of it, install any linux flavour that supports x86 (Assuming that your host OS is on x86).Thanks

  11. @ చైతన్య:మీరు ఉబుంటు iso డౌన్‌లోడ్ చేసి ఉంటారని అనుకుంటున్నాను.ఇప్పుడు మీరు nero లేదా imgburn లాంటి సీడీ బర్నింగ్ యూటిలిటీని మీ సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోండి.అందులో iso ని బర్న్ చేసే ఎంపిక ఎంచుకోండి. అంతే.మీ సిస్టం ని సీడీ First boot device గా ఎంచుకుని రీబూట్ చెయ్యండి.ఆ తర్వాత ఇన్స్టాల్ అంతా సులభమే.@ భాస్కర్ రామరాజు గారు:లేదు మీరు సరిగానే చెప్పారు. iso ఇమేజీ డౌన్‌లోడ్ లో సమస్య ఉంటే సరిగా బర్న్ అవదు. తర్వాత బూట్ సమస్యలు ఉండవచ్చు.కాబట్టి ఆ ఇమేజీతో పాటు md5 checksum కూడా డౌన్‌లోడ్ చేసుకుని వెరీఫై చేసుకోవడం మంచి పద్ధతే.ఇకపోతే నేను వీఎమ్‌వేర్, వర్చ్యువల్ బాక్స్ లాంటి వాటి మీద కొత్త వర్షన్లను పరీక్షించడానికి ఇష్టపడతాను కానీ డ్యూవల్ బూటే నాకు ఇష్టం.

  12. గార్లపాటి గారు: ధన్యోస్మి.

  13. ప్రవీణ్ గారు నేను ఉబుంటు install చెయ్యడానికి ట్రై చేసా, 80 జి.బి హార్ద్ డిస్క్ లో ఉబుంటు install చేసా ఆ హార్డ్ డిస్క్ లో విండోస్ లేదు. తరువాత బూట్ చెయ్యడానికి ట్రై చేస్తే GRUB LOADING STATE 1.5 GRUB LOADING PLEASE WAITERROR 18….అంటూంది files system NTFS ఉంది.ప్రాబ్లం ఏమై ఉంటుంది XP CD తో పార్టీషన్ చెసి ఉబుంటు install చెసా ఇందు వల్ల అయిఉంటుంది అంటారా ?

  14. ఉబుంటు ఇన్స్టాల్ చేసే ముందు ఫార్మాట్ చెయ్యాల్సిన అవసరం లేదు. ఫార్మాట్ చేసిలేకపోతే ఉబుంటు ఇన్స్టాలేషన్ టైమ్ లోనే ఫార్మాట్ చెయ్యొచ్చు. ఉబుంటు ఇంటెల్ 386 సీరీస్ లేదా AMD64 ప్రోసెసర్స్ ఉన్న సిస్టమ్స్ లోనే రన్ అవుతుంది.

  15. @ చైతన్య:మీ ఉబుంటు ఇన్స్టాలేషన్ పూర్తిగా అయిందో లేదో మీరు చెప్పలేదు.లినక్స్ ext3 అనే ఫైలు సిస్టం మీద పని చేస్తుంది. NTFS విండోసు xp నుంచీ విండోసు కోసం వాడబడుతుంది.కాబట్టి ఉబుంటుని ఇన్స్టాల్ చేసే పార్టీషనుని సరిగా ఫార్మాట్ చెయ్యవలసి ఉంటుంది.మీరు ఉబుంటు లైవ్ సీడీ ఉపయోగించి బూట్ చెయ్యండి. తర్వాత మీరు ఉబుంటు కోసం కేటాయించదలచుకున్న 80 GB హార్డు డిస్కుని రెండు భాగాలుగా విభజించండి. ఒకటి లినక్సు కోసం, ఇంకోటి స్వాప్ స్పేసు కోసం.మొదటి దానికి mount point / అని ఇవ్వండి. రెండో దానికి /swap అని ఇవ్వండి./ అని ఇచ్చిన పార్టీషను గనక NTFS అయితే దానిని EXT3 గా ఫార్మాటు చెయ్యండి. తర్వాత మీ ఇన్స్టాలేషను కొనసాగించండి.(పైన చెప్పినదంతా మీరు డ్యూవల్ బూట్ చెయ్యాలంటేనే)ఒక వేళ మీరు కేవలం ఉబుంటు ఉపయోగించాలనుకుంటే పార్టీషను పద్దతిని Automatic గా ఎంచుకోండి. అంతే తర్వాత ఇన్స్టాలేషను కొనసాగించండి.ఇంకో పద్దతి, మీ సిస్టం పైన విండోసు ఇప్పటికే ఇన్స్టాల్ అయి ఉంటే ఇప్పుడు ఉబుంటు కొత్త వర్షనులో విండోసు పైనే ఉబుంటుని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఆ పద్దతిని నా ఇంకో టపాలో వివరించాను. ఇక్కడ చూడండి.ఇంకేమయినా సందేహాలుంటే అడగండి లేదా నాకు ఒక మెయిలు పంపండి.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: