ఏప్రిల్ 27, 2007

ఇంజినీరూ డాక్టరేనా ?

Posted in ఆలోచనలు వద్ద 8:19 సా. ద్వారా Praveen Garlapati

ఇండియా లో అసలు జాబ్ అంటే ఇంజినీర్ (ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్), డాక్టర్ తప్ప ఇంకేవీ వినిపించవెందుకో.
చిన్నప్పటి నుంచి పిల్లలకి నువ్వు ఇంజినీర్ కావాలి, పెద్ద డాక్టర్ అవ్వాలి, అని అంటారే తప్ప నువ్వు మంచి ఆర్టిస్ట్ వి అవ్వాలి, మంచి చిత్రకారుడివి అవ్వాలి, మంచి రచయితవి అవ్వాలి, ఒక రీసెర్చ్ చెయ్యాలి అని ఎప్పుడూ వినము ఎందుకో.

అసలు సమస్య ఎక్కడ ఉంది ?

నేను ఆలోచించినంత వరకూ నాకు తడుతున్నవి ఇవి:

1. ఇంజినీర్, డాక్టర్ వంటి ఉద్యోగాలను మాత్రమే గౌరవమయిన ఉద్యోగాలు గా అందరూ గుర్తించడం.
2. ఇంకే ఇతర ఉద్యోగాల్లోనూ డబ్బులు ఇంతగా రావు ? (దీనికి సమాధానం నాకు నిజంగా తెలీదు.)
3. వేరే ఉద్యోగాలను జనాలు రిస్క్ గా పరిగణించడం (ఒక రకమయిన fear of failure). ఉదాహరణకి అందరికీ 9 టు 5 జాబ్ కావాలి, నెలకి జీతం కావాలి. వేరే ఉద్యోగాలు ఉదాహరణకి ఒక ఆటగాడినో, ఒక చిత్రకారుడినో తీసుకుంటె చాలా మటుకు అది వారి టాలెంట్ మీద ఆధార పడి ఉంటుంది (వేరే ఉద్యోగాలలో అవసరం లేదు అని కాదు.), కన్సిస్టన్సీ కావాలి.
4. క్రియేటివిటీ అనే పదానికి, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనే పదానికి సరయిన నిర్వచనం అనేది అర్థం చేసుకోలేకపోవడం.
5. వేరే ఉద్యోగాలలో విదేశాలకు వెళ్ళి డబ్బులు గడించే అవకాశం అంతగా లేకపోవడం.
6. రీసెర్చ్ మొదలయినవి చేసే వారికి సరయిన ఫండింగ్, బాకప్ లేకపోవడం. గైడెన్స్ లేకపోవడం.

అసలు ఇండియా లో ఆర్ అండ్ డీ అంటారు, వారు చేసేది అంతా ప్రాడక్టులే, ఏ గ్రౌండ్ బ్రేకింగ్ టెక్నాలజీ కానీ, కొత్త విధానాలు గానీ కనిపెట్టడం లాంటివి అరుదు. రీసెర్చ్ అనే పదం ఫాన్సీ గా ఉపయోగిస్తారు, అందులో ఎన్ని రీసెర్చులు నిజంగా ఉపయోగపడతాయి ?

ఇలా జరగడంలో తల్లి దండ్రుల పాత్ర కూడా ఎంతో కొంత ఉందని నా నమ్మకం. ఎందుకంటే వారు ఎప్పుడూ సేఫ్ గా ప్లే చెయ్యడానికే మక్కువ చూపుతారు తప్ప నిజంగా అది ఇష్టమా అని గమనిస్తారా ? అదీ కాక పిల్లలకి ఇవి కాక వేరే ప్రత్యామ్నాయాలు ఉన్నాయని చెప్పేది ఎవరు ?

చిన్నప్పటి నుంచీ ఏడొ తరగతి బోర్డు పరీక్షలు, తర్వాత పదో తరగతి బోర్డ్ పరీక్షలు. అంతలో ఐఐటీ స్పెషల్ కోచింగ్, అంతా ఒక నేచురల్ ప్రాసస్ లాగా జరిగిపోతుంటుంది. ఎక్కడా అసలు వేరే వాటి గురించి ఆలోచించే అవకాశమే రాదు. మరి అలాంటప్పుడు డైవర్సీఫైడ్ వర్క్ ఫోర్స్ ఎలా సాధ్యమవుతుంది ?

నేను పైన చెప్పినవాటిలో కొంత జనరలైజ్ చేసి ఉండవచ్చు. కానీ ఎంతో కొంత నిజం ఉందనేది కూడా కాదనలేని సత్యం.
ఇప్పుడు రోజులు మారుతున్నాయి. జనాలు కొద్ది కొద్దిగా తెలుసుకుంటున్నారు. ఇది ఇంకా బాగా జరగాలి.

ఇంతా చెప్పి నేను ఏమయినా వేరేగా చేస్తానా అని అంటే దానికి నా సమాధానం అనుమానమే…

ప్రకటనలు

24 వ్యాఖ్యలు »

 1. విహారి said,

  మొన్న లాస్ వేగాస్ నుండి వచ్చేటప్పుడి నా పక్కన వున్న ఒకావిడతో ఇలాంటి చర్చే వచ్చింది. ఆవిడ కో యభై ఏళ్ళు వుంటాయేమో.
  అవిడ పియానో ప్రాక్టీసు మిస్సయిందని చేతివేళ్ళతో తను రాసుకొచ్చింది ప్రాక్టీసు చేసుకుంటోంది. ఏంటని అడిగితే ‘రేపు నేను పియానో వాయించాలి ‘ అని చెప్పింది. అలా మొదలయించ చర్చ తను చిన్నగా వున్నప్పుడు నాకు స్కూల్ వద్దు గీల్ వొద్దు పియానో నేర్చుకుంటా అంటే బలవంతంగా స్కూల్లో తోశారంట. చివరికి ఎటూ కాకుండా పోయిందట.
  బహుశా అప్పట్లో మిగతా వాటి మీద ఇప్పుడున్నంత అవకాశాలు లేవేమో.

  మనకు కూడా భారత్ లో ఇలాంటి పరిస్థితే వుంది ఇప్పుడు. చదువు అనేది ఒక సెక్యూరిటీ భారత్ లో. అది లేక పోతే మనం బతకలేమని నూరి పోస్తారు…పొస్తున్నారు. ఇది ఎవరీ తప్పు కాదు ఆయా పరిస్థితులలో ఆయా సామాజిక అవసారల బట్టి వుంటుంది.

  అల్లు రామలింగయ్య అన్నాడట ఓ సారి.
  “మా అల్లు అర్జున్ భోళా శంకరుడు వాడు ఎలా బతుకుతాడో ఏమొ అని వాడికోసం డబ్బులు ప్రత్యేకంగా కూడ బెడుతున్నా”

  అన్నీ కలిసొచ్చి ఇప్పుడు స్టార్ అయ్యాడు. అలా అందరికీ రాసిపెట్టుండదు కదా 🙂

  — విహారి

 2. మొన్న లాస్ వేగాస్ నుండి వచ్చేటప్పుడి నా పక్కన వున్న ఒకావిడతో ఇలాంటి చర్చే వచ్చింది. ఆవిడ కో యభై ఏళ్ళు వుంటాయేమో.అవిడ పియానో ప్రాక్టీసు మిస్సయిందని చేతివేళ్ళతో తను రాసుకొచ్చింది ప్రాక్టీసు చేసుకుంటోంది. ఏంటని అడిగితే ‘రేపు నేను పియానో వాయించాలి ‘ అని చెప్పింది. అలా మొదలయించ చర్చ తను చిన్నగా వున్నప్పుడు నాకు స్కూల్ వద్దు గీల్ వొద్దు పియానో నేర్చుకుంటా అంటే బలవంతంగా స్కూల్లో తోశారంట. చివరికి ఎటూ కాకుండా పోయిందట. బహుశా అప్పట్లో మిగతా వాటి మీద ఇప్పుడున్నంత అవకాశాలు లేవేమో. మనకు కూడా భారత్ లో ఇలాంటి పరిస్థితే వుంది ఇప్పుడు. చదువు అనేది ఒక సెక్యూరిటీ భారత్ లో. అది లేక పోతే మనం బతకలేమని నూరి పోస్తారు…పొస్తున్నారు. ఇది ఎవరీ తప్పు కాదు ఆయా పరిస్థితులలో ఆయా సామాజిక అవసారల బట్టి వుంటుంది.అల్లు రామలింగయ్య అన్నాడట ఓ సారి.”మా అల్లు అర్జున్ భోళా శంకరుడు వాడు ఎలా బతుకుతాడో ఏమొ అని వాడికోసం డబ్బులు ప్రత్యేకంగా కూడ బెడుతున్నా” అన్నీ కలిసొచ్చి ఇప్పుడు స్టార్ అయ్యాడు. అలా అందరికీ రాసిపెట్టుండదు కదా :-)– విహారి

 3. సత్యసాయి కొవ్వలి said,

  మంచి విషయం లేవనెత్తారు, ప్రవీణ్. అందరూ గంభీరంగా ఆలోచించాల్సిన విషయం. చిన్నపిల్లల చేత పెద్దయాకా ఏమవుతావు అని చెప్పిస్తారు. వాళ్ళకి తెలిసిన టీచరో, అమ్మానాన్నలకి తెలిసిన డాక్టరు, ఇంజినీరో అవుతామని చెప్తారు. మాఅబ్బాయిని ఇదే ప్రశ్న వేశారు- మినిష్టర్ అవుతా అన్నాడు. బలే సంతోషం వేసింది. ఒక మిత్రుడు, చిన్నప్పుడు డ్రైవర్నవుతా అనగానే అందరూ షాకట. బొంబాయి జనాలకి ఢాక్టర్, ఇంజినీర్లవాలని వెంపర్లాడరు. టైం వేష్టని. కామర్సు చదవడానికి ఇష్టపడతారు. డబ్బు సంపాదనకి వేరేమార్గాలున్నాయని వాళ్ళకి తెలుసు.
  ఈకాలం పిల్లల్లో అవగాహన కన్పిస్తోంది- ఆశాజనక పరిణామం.

 4. మంచి విషయం లేవనెత్తారు, ప్రవీణ్. అందరూ గంభీరంగా ఆలోచించాల్సిన విషయం. చిన్నపిల్లల చేత పెద్దయాకా ఏమవుతావు అని చెప్పిస్తారు. వాళ్ళకి తెలిసిన టీచరో, అమ్మానాన్నలకి తెలిసిన డాక్టరు, ఇంజినీరో అవుతామని చెప్తారు. మాఅబ్బాయిని ఇదే ప్రశ్న వేశారు- మినిష్టర్ అవుతా అన్నాడు. బలే సంతోషం వేసింది. ఒక మిత్రుడు, చిన్నప్పుడు డ్రైవర్నవుతా అనగానే అందరూ షాకట. బొంబాయి జనాలకి ఢాక్టర్, ఇంజినీర్లవాలని వెంపర్లాడరు. టైం వేష్టని. కామర్సు చదవడానికి ఇష్టపడతారు. డబ్బు సంపాదనకి వేరేమార్గాలున్నాయని వాళ్ళకి తెలుసు. ఈకాలం పిల్లల్లో అవగాహన కన్పిస్తోంది- ఆశాజనక పరిణామం.

 5. Dr.Ismail said,

  ఇప్పుడు కొత్తగా పట్టా తీసుకొంటున్న ప్రతి డాక్టరూ… సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎందుకు కాలేదా అని బాధపడుతున్నారు. కారణం తెలిసే ఉంటుంది! డబ్బే ప్రధానం కాదని ఎందరన్నా చివరికి దానికే మొదటి ప్రాధాన్యత లభిస్తుంది. కారణం వేమన ఎప్పుడో చెప్పాడు”…విద్య చేత విర్రవీగువాడు, పసిడిగలవాని బానిసకొడుకులు” అని!

  ఇదే మన రీసర్చికి అన్వయిస్తుంది. అదీగాక ఒక్కసారి ఆలోచిస్తే మన కష్టంతో మన సృజనాత్మకతతో ఎన్ని మందులు కనిపెట్టాం( అప్పుడెప్పుడో అమెరికాలో ఎల్లాప్రగడ సుబ్బారావు…ఇప్పుడిప్పుడు కొన్ని కంపెనీలు తయారుచేస్తున్న కొన్ని మందులు తప్పించి) మన దేశం నుంచి శాస్త్రీయ పరిశోధనలు ఇప్పటికైనా ఎందుకు సరిగా జరగడం లేదు…ఒకే ఒక్క కారణం సంపాదన అందులో తక్కువ కాబట్టి. పిల్లలకు ఓ శాస్త్రవేత్త కావాలి అనే తలంపే మనం రానీయం కాబట్టి!

 6. Dr.Ismail said,

  ఇప్పుడు కొత్తగా పట్టా తీసుకొంటున్న ప్రతి డాక్టరూ… సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎందుకు కాలేదా అని బాధపడుతున్నారు. కారణం తెలిసే ఉంటుంది! డబ్బే ప్రధానం కాదని ఎందరన్నా చివరికి దానికే మొదటి ప్రాధాన్యత లభిస్తుంది. కారణం వేమన ఎప్పుడో చెప్పాడు”…విద్య చేత విర్రవీగువాడు, పసిడిగలవాని బానిసకొడుకులు” అని!ఇదే మన రీసర్చికి అన్వయిస్తుంది. అదీగాక ఒక్కసారి ఆలోచిస్తే మన కష్టంతో మన సృజనాత్మకతతో ఎన్ని మందులు కనిపెట్టాం( అప్పుడెప్పుడో అమెరికాలో ఎల్లాప్రగడ సుబ్బారావు…ఇప్పుడిప్పుడు కొన్ని కంపెనీలు తయారుచేస్తున్న కొన్ని మందులు తప్పించి) మన దేశం నుంచి శాస్త్రీయ పరిశోధనలు ఇప్పటికైనా ఎందుకు సరిగా జరగడం లేదు…ఒకే ఒక్క కారణం సంపాదన అందులో తక్కువ కాబట్టి. పిల్లలకు ఓ శాస్త్రవేత్త కావాలి అనే తలంపే మనం రానీయం కాబట్టి!

 7. రానారె said,

  మనదేశం ఆర్థికంగా మరింత బలపడి, జీవితం గడవడానికి అంత భయపడాల్సిందేమీ లేదు అనిపించుకొన్నాక – అప్పుడు రావొచ్చు ఈ క్రియేటివిటీ, డైవర్సిపైడ్ వర్కుఫోర్స్ (సృజనాత్మకత, వైవిధ్యభరిత శ్రామికబలం). నాకు కడుపు నిండకుంటే ఒక చోట కూర్చొని కవిత్వం, కథలు రాయలేను. తల్లిదండ్రులు మనల్నందరినీ రుద్దడం వెనకున్నది చాలావరకు ఈ భయమే. అత్యాశ కేసులు, అజ్ఞానం కేసులూ, అనవసరపు ఈగో పోటీల కేసులు వీటితో జతకడతాయి. ఇదీ నా అభిప్రాయం.

 8. మనదేశం ఆర్థికంగా మరింత బలపడి, జీవితం గడవడానికి అంత భయపడాల్సిందేమీ లేదు అనిపించుకొన్నాక – అప్పుడు రావొచ్చు ఈ క్రియేటివిటీ, డైవర్సిపైడ్ వర్కుఫోర్స్ (సృజనాత్మకత, వైవిధ్యభరిత శ్రామికబలం). నాకు కడుపు నిండకుంటే ఒక చోట కూర్చొని కవిత్వం, కథలు రాయలేను. తల్లిదండ్రులు మనల్నందరినీ రుద్దడం వెనకున్నది చాలావరకు ఈ భయమే. అత్యాశ కేసులు, అజ్ఞానం కేసులూ, అనవసరపు ఈగో పోటీల కేసులు వీటితో జతకడతాయి. ఇదీ నా అభిప్రాయం.

 9. radhika said,

  ఇప్పటి చదువులు డబ్బుల వెనుక పరిగెడుతున్నాయి జ్ఞానం వెనుక కాదు.మొన్న జావా అన్నారు,తరువాత సాప్..ఇలా డిమాండ్ కి అనుగుణం గా మనలని మనం మలచుకోవడం కూడా గ్రేట్ కదా.అయినా ప్రవీణ్ గారన్నట్టు విధ్యార్ధి గా వున్నంత కాలం డాక్టరు,ఇంజబీరేనా ఇంకేమీ కనపడవా అమ్మానాన్నలకి అని బాధపడిన మనమే మన పిల్లల విషయం లోను మన తల్లిదండ్రులనే ఆదర్సం గా తీసుకుంటున్నాము.ఎమో నేనూ అంతేనేమో?

 10. radhika said,

  ఇప్పటి చదువులు డబ్బుల వెనుక పరిగెడుతున్నాయి జ్ఞానం వెనుక కాదు.మొన్న జావా అన్నారు,తరువాత సాప్..ఇలా డిమాండ్ కి అనుగుణం గా మనలని మనం మలచుకోవడం కూడా గ్రేట్ కదా.అయినా ప్రవీణ్ గారన్నట్టు విధ్యార్ధి గా వున్నంత కాలం డాక్టరు,ఇంజబీరేనా ఇంకేమీ కనపడవా అమ్మానాన్నలకి అని బాధపడిన మనమే మన పిల్లల విషయం లోను మన తల్లిదండ్రులనే ఆదర్సం గా తీసుకుంటున్నాము.ఎమో నేనూ అంతేనేమో?

 11. ప్రవీణ్ గార్లపాటి said,

  @విహారి గారు:
  ఆ.. అదే నేనూ అనుకున్నది.
  నేనూ తప్పు అనలేదు. ఎలా అసలు వేరే ఫీల్డ్స్ లోకి మన వాళ్ళు వెళతారని ఒక సందేహం.
  అమెరికా లోనూ కొంత అదే స్థితి అన్నమాట.

  కొవ్వలి గారూ:
  మీ వాడు ఘటికుడే. 🙂
  అవును అవగాహన పెరిగి వేరే వాటిలోనూ మంచి అవకాశాలు రావాలని కోరుకుందాము.

  ఇస్మాయిల్ గారూ:
  మీరన్నది కరక్టే. వేరే వాటిలోనూ, రీసెర్చ్ లోనూ ఎక్కువ డబ్బులు లేకపోవడమూ ఒక కారణమే. మనం ఇంకా ఆ స్థితి కి చేరుకోడానికి సమయం పడుతుందేమో ?

  రానారె:
  నిజం. ఫైనాన్షియల్ స్టబిలిటీ రావాలి. అప్పుడే మనకి మిగతా వాటి మీద దృష్టి మరలుతుంది. కానీ ఆ ఫైనన్షియల్ స్టబిలిటీ మిగతా వాటి వల్ల కూడా రావడం మొదలయితే కూడా మారొచ్చు. అది ఇప్పుడున్న వాటికి అనుబంధంగా వచ్చినా మంచిదే.

  రాధిక గారూ:
  డబ్బులు వచ్చే ఉద్యోగాలే ఎప్పుడయినా జనాలు ఎక్కువ చదివేది. ఇంతకు ముందు ఐటీ, ఇప్పుడు ఎమ్బీయే, రేపు ఇంకేదో.
  కానీ ఉదాహరణకి రేపు ఇప్పుడున్న వాటిలో ఏదయినా మందగిస్తే మనకు ఆల్టర్నేటీవ్ అన్నది లేకుండా పోతున్నది. ఇప్పుడు ఇంతగా దూసుకుపోతున్న ఐటీ రేపు లేదనుకుందాము, అప్పుడేంటి ?

 12. @విహారి గారు: ఆ.. అదే నేనూ అనుకున్నది. నేనూ తప్పు అనలేదు. ఎలా అసలు వేరే ఫీల్డ్స్ లోకి మన వాళ్ళు వెళతారని ఒక సందేహం.అమెరికా లోనూ కొంత అదే స్థితి అన్నమాట.కొవ్వలి గారూ: మీ వాడు ఘటికుడే. :)అవును అవగాహన పెరిగి వేరే వాటిలోనూ మంచి అవకాశాలు రావాలని కోరుకుందాము.ఇస్మాయిల్ గారూ: మీరన్నది కరక్టే. వేరే వాటిలోనూ, రీసెర్చ్ లోనూ ఎక్కువ డబ్బులు లేకపోవడమూ ఒక కారణమే. మనం ఇంకా ఆ స్థితి కి చేరుకోడానికి సమయం పడుతుందేమో ?రానారె: నిజం. ఫైనాన్షియల్ స్టబిలిటీ రావాలి. అప్పుడే మనకి మిగతా వాటి మీద దృష్టి మరలుతుంది. కానీ ఆ ఫైనన్షియల్ స్టబిలిటీ మిగతా వాటి వల్ల కూడా రావడం మొదలయితే కూడా మారొచ్చు. అది ఇప్పుడున్న వాటికి అనుబంధంగా వచ్చినా మంచిదే.రాధిక గారూ:డబ్బులు వచ్చే ఉద్యోగాలే ఎప్పుడయినా జనాలు ఎక్కువ చదివేది. ఇంతకు ముందు ఐటీ, ఇప్పుడు ఎమ్బీయే, రేపు ఇంకేదో.కానీ ఉదాహరణకి రేపు ఇప్పుడున్న వాటిలో ఏదయినా మందగిస్తే మనకు ఆల్టర్నేటీవ్ అన్నది లేకుండా పోతున్నది. ఇప్పుడు ఇంతగా దూసుకుపోతున్న ఐటీ రేపు లేదనుకుందాము, అప్పుడేంటి ?

 13. రాకేశ్వర రావు said,

  డబ్బు డబ్బు డబ్బు…
  తరాలు గా కొంత పేదరికం లేద మధ్యతరగతిగా బ్రతికిన సంఘం, “మాస్లోవ్ హైరార్కీ ఆఫ్ నీడ్స్” లో ఆ డబ్బు లెవెల్ లో చిక్కుకుపోయింది.

  మన పిల్లలకి డబ్బుకన్నా ఉన్నత లక్ష్యాలని చూపించ గలగాలి. ఆ ధైర్యం మీకుందా ?

 14. డబ్బు డబ్బు డబ్బు… తరాలు గా కొంత పేదరికం లేద మధ్యతరగతిగా బ్రతికిన సంఘం, “మాస్లోవ్ హైరార్కీ ఆఫ్ నీడ్స్” లో ఆ డబ్బు లెవెల్ లో చిక్కుకుపోయింది. మన పిల్లలకి డబ్బుకన్నా ఉన్నత లక్ష్యాలని చూపించ గలగాలి. ఆ ధైర్యం మీకుందా ?

 15. lalitha said,

  మంచి విషయం మీద మాట్లాడుతున్నారు. నేను, నా స్నేహితురాలు విపరీతంగా చర్చించుకుంటుంటాము మా మా పిల్లల పెంపకం గురించి. ఆ అమ్మాయిది ప్రయివేటు పాఠశాల, ప్రభుత్వ పాఠశాలలా అన్న సమస్యతో మొదలయ్యింది. నాది మిగతా దేశీలలాగా నా పిల్లలకి ఎక్కాలూ, గుణకారాలూ ఒక దాని తరవాత ఒకటి నేర్పిస్తూ పోవాలా, నెమ్మదిగా ఉండొచ్చా అన్న మీమాంస.

  అప్పుడప్పుడు డోలాయమానంగా ఉంటుంది మనసు. కొద్ది కొద్దిగా నేర్పిస్తూ పోతే బాగానే ఉంటుంది కదా అని. మళ్ళీ బడిలో శ్రద్ధ చూపించరేమో అని భయం. అయినా ఒక్క లెక్కలూ, సైన్సులే కాకుండా, ఇప్పుడే కదా కాస్త అవకాశం వారికి ఎక్స్టెన్సివ్ గా చాలా విషయాలు పరిచయం చెయ్యడానికి అని. మళ్ళీ, మిగిల పిల్లలకు నా లాంటి వాళ్ళు శిక్షణ ఇస్తంటే నేను మా పిల్లలని వెనక్కి ఉంచేస్తున్నానా అని.

  మన దేశంలో “చదువు” ప్రాముఖ్యత కొంచెం ఎక్కువే. నిజం చెప్పాలంటే ఎక్కువ శాతం మంది చదువుల గురించీ, దాని మీద ఆధారపడే పిల్లల భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేస్తుంటారు. ఇక్కడ ఆ శాతం తక్కువేమో. కాకుంటే ఆసియా వారి మధ్యలో పోటీ విపరీతంగానే ఉంటుంది. అలాగే, ఇక్కడ కూడా చదువు గురించి శ్రధ్ధ చూపించే వారేమీ తక్కువ లేరు. పై చదువులకు మరి మనం ఇక్కడ రావడానికి ఎందుకు ఆశ పడతాము? బహుశా, చదువు ఖరీదు ఇక్కడ ఎక్కువ అనుకుంటాను, పోల్చి చూస్తే (పై చదువులకి).

  ఒకటి నిజం. చదువులు మన సంపద. కొందరన్నట్లు ప్రొఫెషనల్ చదువులు మనకు సెక్యూరిటీ లాంటివి. చదువించగలిగే స్థోమత ఉండి, చదువును ప్రోత్సహించే వనరులు ఉండి, చదువులు నేర్చుకోగలిగే శక్తి పిల్లలకున్నప్పుడు చదువును ముఖ్యంగా తీసుకోక పోవడం తప్పే అనిపిస్తుంటుంది ఒక్కోసారి నాకు. మనకున్న ట్యాలెంటు అది అనుకోవచ్చు. కాకుంటే జీవితంలో చదువు స్థానం చదువుది. ఆ పోటీల ప్రపంచానికి తయారు చేయడానికి కూడా ఒక హద్దు ఉంది. ఏడో తరగతినుండి ప్రవేశ పరీక్షలకు తయారు చేసే ట్యుటోరియల్స్ ఉన్నాయని, వాటిలో ప్రవేశానికి ప్రవేశ పరీక్షలు ఉన్నాయని తెలిసి నేను తట్టుకోలేక పోయాను.

  ప్రతి వారిలోను బ్రతకడానికి అవసరమైన ట్యాలెంటు ఉంటుంది. దాని ప్రోత్సహించే బదులు మనం కృత్రిమ సాధనాలను ప్రోత్సహిస్తున్నమా అని నాకు అనుమానం కలుగుతుంటుంది అప్పుడప్పుడూ.

  లలిత.

 16. lalitha said,

  మంచి విషయం మీద మాట్లాడుతున్నారు. నేను, నా స్నేహితురాలు విపరీతంగా చర్చించుకుంటుంటాము మా మా పిల్లల పెంపకం గురించి. ఆ అమ్మాయిది ప్రయివేటు పాఠశాల, ప్రభుత్వ పాఠశాలలా అన్న సమస్యతో మొదలయ్యింది. నాది మిగతా దేశీలలాగా నా పిల్లలకి ఎక్కాలూ, గుణకారాలూ ఒక దాని తరవాత ఒకటి నేర్పిస్తూ పోవాలా, నెమ్మదిగా ఉండొచ్చా అన్న మీమాంస. అప్పుడప్పుడు డోలాయమానంగా ఉంటుంది మనసు. కొద్ది కొద్దిగా నేర్పిస్తూ పోతే బాగానే ఉంటుంది కదా అని. మళ్ళీ బడిలో శ్రద్ధ చూపించరేమో అని భయం. అయినా ఒక్క లెక్కలూ, సైన్సులే కాకుండా, ఇప్పుడే కదా కాస్త అవకాశం వారికి ఎక్స్టెన్సివ్ గా చాలా విషయాలు పరిచయం చెయ్యడానికి అని. మళ్ళీ, మిగిల పిల్లలకు నా లాంటి వాళ్ళు శిక్షణ ఇస్తంటే నేను మా పిల్లలని వెనక్కి ఉంచేస్తున్నానా అని.మన దేశంలో “చదువు” ప్రాముఖ్యత కొంచెం ఎక్కువే. నిజం చెప్పాలంటే ఎక్కువ శాతం మంది చదువుల గురించీ, దాని మీద ఆధారపడే పిల్లల భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేస్తుంటారు. ఇక్కడ ఆ శాతం తక్కువేమో. కాకుంటే ఆసియా వారి మధ్యలో పోటీ విపరీతంగానే ఉంటుంది. అలాగే, ఇక్కడ కూడా చదువు గురించి శ్రధ్ధ చూపించే వారేమీ తక్కువ లేరు. పై చదువులకు మరి మనం ఇక్కడ రావడానికి ఎందుకు ఆశ పడతాము? బహుశా, చదువు ఖరీదు ఇక్కడ ఎక్కువ అనుకుంటాను, పోల్చి చూస్తే (పై చదువులకి). ఒకటి నిజం. చదువులు మన సంపద. కొందరన్నట్లు ప్రొఫెషనల్ చదువులు మనకు సెక్యూరిటీ లాంటివి. చదువించగలిగే స్థోమత ఉండి, చదువును ప్రోత్సహించే వనరులు ఉండి, చదువులు నేర్చుకోగలిగే శక్తి పిల్లలకున్నప్పుడు చదువును ముఖ్యంగా తీసుకోక పోవడం తప్పే అనిపిస్తుంటుంది ఒక్కోసారి నాకు. మనకున్న ట్యాలెంటు అది అనుకోవచ్చు. కాకుంటే జీవితంలో చదువు స్థానం చదువుది. ఆ పోటీల ప్రపంచానికి తయారు చేయడానికి కూడా ఒక హద్దు ఉంది. ఏడో తరగతినుండి ప్రవేశ పరీక్షలకు తయారు చేసే ట్యుటోరియల్స్ ఉన్నాయని, వాటిలో ప్రవేశానికి ప్రవేశ పరీక్షలు ఉన్నాయని తెలిసి నేను తట్టుకోలేక పోయాను. ప్రతి వారిలోను బ్రతకడానికి అవసరమైన ట్యాలెంటు ఉంటుంది. దాని ప్రోత్సహించే బదులు మనం కృత్రిమ సాధనాలను ప్రోత్సహిస్తున్నమా అని నాకు అనుమానం కలుగుతుంటుంది అప్పుడప్పుడూ. లలిత.

 17. భాస్కర్ రామరాజు said,

  అందరికీ నమస్కారాలు
  ఇంజనీరా డాక్టరా అనేది పిల్లలమీద రుద్దడం ఒకరకంగా తప్పే. ఐతే అస్సలు పెద్దైనాక నువ్వు ఏమి అవుతావు అని చిన్నప్పటినుంచే అనవసరంగా సొద పెట్టటం కూడా తప్పే అంటాను.
  లలిత గారు అన్నట్టు, అమేరికాలో చదువులు బాగున్నై కాబట్టే ఇక్కడకి వస్తున్నారా మన వాళ్ళు? నేను మొత్తంగా ఏకీభవించటమ్లేదు. నేను చూసినంతవరకూ నేనుచూసిన జనాల్లో నిజంగా ఇక్కడకి చదువుకోసం వచ్చిన వాళ్ళా సంఖ్య చాలా తక్కువ. ఒకానొక జనరేషన్ వాళ్ళు వచ్చారేమో. మిగతా వాళ్ళు కేవలం డబ్బు కోసం, లేక ఇంట్లో వాళ్ళా పోరు పడలేక, లేక స్టేటస్సు కోసం వచ్చిన వాళ్ళే (నేనూ డబ్బు కోసమే వచ్చా).
  అసలు విషయం
  డాక్టరా ఇంజనీరా? దీంట్లో మనం గమనిచాల్సింది ఉంది. అది ఈరెండిట్లోకి రావటానికి విపరీతమైన పోటీ ఉండేది (ఈరోజున యంసెట్ లో కనీస మార్కులు సాధిస్తే చాలు అనుకోడి) కాబట్టి “నువ్వు ఆ పోటీ తత్వాన్ని అలవర్చుకో” అనేది నిఘూడమైన అర్ధం. ఇలా పోటీ తత్వం ఆకళింపు చేసుకున్న వాడు ఈరోజు జావా లో రేపు బావా లో ఎల్లుడి సాప్ లో నెట్టుకు రాగలడు, అమేరికావాడు తనకి పంపిన అవుట్సోర్సుడు పనిని చక్కగా చెయ్యగలడు.
  ఇంకొక విషయం, ఒకానొక జనరేషనుకి అసలు డాక్టరు ఇంజనీరు తప్ప ఇంకొక డైరెక్షను ఉంది అని తెలియదు. బికాం ఎంకాం చేసిన వాళ్ళకి పెద్ద ఉద్యోగావకాశాలు ఉండేవికావు కాబట్టి. మరింక పిల్లల్ని ఇంజనీరు లేక డాక్టరు చేయమని ప్రోత్సహించకుండా తప్పదుకదా?

 18. అందరికీ నమస్కారాలుఇంజనీరా డాక్టరా అనేది పిల్లలమీద రుద్దడం ఒకరకంగా తప్పే. ఐతే అస్సలు పెద్దైనాక నువ్వు ఏమి అవుతావు అని చిన్నప్పటినుంచే అనవసరంగా సొద పెట్టటం కూడా తప్పే అంటాను.లలిత గారు అన్నట్టు, అమేరికాలో చదువులు బాగున్నై కాబట్టే ఇక్కడకి వస్తున్నారా మన వాళ్ళు? నేను మొత్తంగా ఏకీభవించటమ్లేదు. నేను చూసినంతవరకూ నేనుచూసిన జనాల్లో నిజంగా ఇక్కడకి చదువుకోసం వచ్చిన వాళ్ళా సంఖ్య చాలా తక్కువ. ఒకానొక జనరేషన్ వాళ్ళు వచ్చారేమో. మిగతా వాళ్ళు కేవలం డబ్బు కోసం, లేక ఇంట్లో వాళ్ళా పోరు పడలేక, లేక స్టేటస్సు కోసం వచ్చిన వాళ్ళే (నేనూ డబ్బు కోసమే వచ్చా).అసలు విషయండాక్టరా ఇంజనీరా? దీంట్లో మనం గమనిచాల్సింది ఉంది. అది ఈరెండిట్లోకి రావటానికి విపరీతమైన పోటీ ఉండేది (ఈరోజున యంసెట్ లో కనీస మార్కులు సాధిస్తే చాలు అనుకోడి) కాబట్టి “నువ్వు ఆ పోటీ తత్వాన్ని అలవర్చుకో” అనేది నిఘూడమైన అర్ధం. ఇలా పోటీ తత్వం ఆకళింపు చేసుకున్న వాడు ఈరోజు జావా లో రేపు బావా లో ఎల్లుడి సాప్ లో నెట్టుకు రాగలడు, అమేరికావాడు తనకి పంపిన అవుట్సోర్సుడు పనిని చక్కగా చెయ్యగలడు.ఇంకొక విషయం, ఒకానొక జనరేషనుకి అసలు డాక్టరు ఇంజనీరు తప్ప ఇంకొక డైరెక్షను ఉంది అని తెలియదు. బికాం ఎంకాం చేసిన వాళ్ళకి పెద్ద ఉద్యోగావకాశాలు ఉండేవికావు కాబట్టి. మరింక పిల్లల్ని ఇంజనీరు లేక డాక్టరు చేయమని ప్రోత్సహించకుండా తప్పదుకదా?

 19. ప్రవీణ్ గార్లపాటి said,

  రాకేశ్వర రావు గారూ:

  ఆ ధైర్యం నాకు ఉందో లేదో డౌటే అందుకే అన్నా
  నేను ఏమయినా వేరేగా చేస్తానా అని అంటే దానికి నా సమాధానం అనుమానమే…

  లలిత గారూ:

  బాగా చెప్పారు. మీరున్న మీమాంసలోనే చాలా మంది ఉండి ఉంటారు. ఇక ప్రాక్టికాలిటీ కి వస్తే అవసరమయినది బతకడం కనక దానిని సమకూర్చే విద్య పైనే అందరికీ దృష్టి ఉంటుంది.
  మనం పిల్లల మీద కృత్రిమమయిన ఆసక్తిని రుద్దుతున్నామా అంటే అవునూ కాదూ రెండూ అనే సమాధానం వస్తుంది. అవును ఎందుకంటే చిన్నపటి నుంచీ మనం వారికి ఎలా ఉండాలో, ఏం చెయ్యాలో రుద్దెయ్యటం, వాళ్ళకి ఒక సొంత ఐడెంటిటీ అనేది లేకుండా తయారు చెయ్యడం. కాదు ఎందుకంటే వారికి మనం ఇలా మార్గ నిర్దేశం చేస్తుండడం వల్ల వారు రియాలిటీ లో వారికి నచ్చింది చెయ్యలేకపోవడం అనే ప్రస్తావనే రాదు.
  ఇక పోతే మీరు, ఇంకొంత మంది అన్నట్టు మిగతావన్నిటికీ గుర్తింపు వచ్చేది మన వ్యవస్థ ఆర్థికంగా ఇంకా బలమయినప్పుడే.
  అయినా కొంత వరకూ ఇంకా ఇది సాధ్యమే అని నా నమ్మకం. ఎలాగంటే పిల్లలను చదువు మాత్రమే కాకుండా ఇతర వ్యాపకాల వైపుకీ ఆసక్తి కలిగించేలా చెయ్యడం.ఉదాహరణ కి ఎవరయినా పిల్లలకి ఆర్ట్ బాగ వస్తుందనుకోండి వారిని ఖాళీ సమయాల్లో, వీకెండ్స్ లో ఆర్ట్ వెయ్యమని ప్రోత్సాహించడం లాగా.
  ఇందువల్ల లాభం వారిలో సృజన పెరుగుతుంది.

  భాస్కర్ గారూ:

  మరన్నది చాలా వరకూ నిజమే. ఎంత బుకాయించినా తొంభై శాతం మంది అమెరికా కి చదవడానికి వెళ్ళేది అక్కడ సెటిల్ అవడానికోసమే, డబ్బు కోసమే. ఎక్కడో ఒకరు తప్ప.
  మీరన్నట్టు ఈ పోటీ తత్వం పిల్లలలో సర్వైవల్ కోసం అవసరమయ్యే తత్వాన్ని పెంచుతుంది, కాదనను కానీ వారిలో అనాసక్తి ని కూడా పెంచుతుంది. ఎందుకంటే ఉదాహరణకి మా అక్క ఉంది. తను బాగా చదివేది. తను ఇంటర్లో CEC చదివి CA చేస్తానంటే ప్రిన్సిపాల్ ఒకటే ఆశ్చర్యం ఎందుకు MPC లేదా BiPC తీసుకోవట్లేదో అని.
  మరి అలా అనాసక్తితో చదివి, ఇష్టం లేని పనిలో స్థిరపడితే డబ్బు వస్తుందేమో కానీ అనాసక్తత కూడా ఉంటుంది. ఓకే పని చెయ్యాలి కాబట్టి చేద్దాం అనే ధోరణి ఉంటుంది అని నా ఉద్దేశ్యం.

 20. రాకేశ్వర రావు గారూ: ఆ ధైర్యం నాకు ఉందో లేదో డౌటే అందుకే అన్నా నేను ఏమయినా వేరేగా చేస్తానా అని అంటే దానికి నా సమాధానం అనుమానమే…లలిత గారూ: బాగా చెప్పారు. మీరున్న మీమాంసలోనే చాలా మంది ఉండి ఉంటారు. ఇక ప్రాక్టికాలిటీ కి వస్తే అవసరమయినది బతకడం కనక దానిని సమకూర్చే విద్య పైనే అందరికీ దృష్టి ఉంటుంది.మనం పిల్లల మీద కృత్రిమమయిన ఆసక్తిని రుద్దుతున్నామా అంటే అవునూ కాదూ రెండూ అనే సమాధానం వస్తుంది. అవును ఎందుకంటే చిన్నపటి నుంచీ మనం వారికి ఎలా ఉండాలో, ఏం చెయ్యాలో రుద్దెయ్యటం, వాళ్ళకి ఒక సొంత ఐడెంటిటీ అనేది లేకుండా తయారు చెయ్యడం. కాదు ఎందుకంటే వారికి మనం ఇలా మార్గ నిర్దేశం చేస్తుండడం వల్ల వారు రియాలిటీ లో వారికి నచ్చింది చెయ్యలేకపోవడం అనే ప్రస్తావనే రాదు.ఇక పోతే మీరు, ఇంకొంత మంది అన్నట్టు మిగతావన్నిటికీ గుర్తింపు వచ్చేది మన వ్యవస్థ ఆర్థికంగా ఇంకా బలమయినప్పుడే.అయినా కొంత వరకూ ఇంకా ఇది సాధ్యమే అని నా నమ్మకం. ఎలాగంటే పిల్లలను చదువు మాత్రమే కాకుండా ఇతర వ్యాపకాల వైపుకీ ఆసక్తి కలిగించేలా చెయ్యడం.ఉదాహరణ కి ఎవరయినా పిల్లలకి ఆర్ట్ బాగ వస్తుందనుకోండి వారిని ఖాళీ సమయాల్లో, వీకెండ్స్ లో ఆర్ట్ వెయ్యమని ప్రోత్సాహించడం లాగా.ఇందువల్ల లాభం వారిలో సృజన పెరుగుతుంది.భాస్కర్ గారూ: మరన్నది చాలా వరకూ నిజమే. ఎంత బుకాయించినా తొంభై శాతం మంది అమెరికా కి చదవడానికి వెళ్ళేది అక్కడ సెటిల్ అవడానికోసమే, డబ్బు కోసమే. ఎక్కడో ఒకరు తప్ప.మీరన్నట్టు ఈ పోటీ తత్వం పిల్లలలో సర్వైవల్ కోసం అవసరమయ్యే తత్వాన్ని పెంచుతుంది, కాదనను కానీ వారిలో అనాసక్తి ని కూడా పెంచుతుంది. ఎందుకంటే ఉదాహరణకి మా అక్క ఉంది. తను బాగా చదివేది. తను ఇంటర్లో CEC చదివి CA చేస్తానంటే ప్రిన్సిపాల్ ఒకటే ఆశ్చర్యం ఎందుకు MPC లేదా BiPC తీసుకోవట్లేదో అని.మరి అలా అనాసక్తితో చదివి, ఇష్టం లేని పనిలో స్థిరపడితే డబ్బు వస్తుందేమో కానీ అనాసక్తత కూడా ఉంటుంది. ఓకే పని చెయ్యాలి కాబట్టి చేద్దాం అనే ధోరణి ఉంటుంది అని నా ఉద్దేశ్యం.

 21. భాస్కర్ రామరాజు said,

  అన్నా
  వప్పుకుంటా అన్నా!! అది నిజమే. ఐతే మన పరీస్థితి ఏంటంటే ఎదుగుతున్న దేశాలల్లో ఒక ఉద్యోగం సంపాదించటమే ఎక్కువ. ఇంక, నేను కోరుకున్న ఫీల్డులో, నేను కోరుకున్న ఉద్యోగం, అవి ఇవి అంటే కష్టం. రెక్కాడితే కాని దొక్కాడని పరీస్త్థి మంది (మన భారతదేశం లాటి దేశ ఆర్ధిక స్థితి). కాబట్టి, ఈ పోటీ ప్రపంచమ్లో నిలబడాలంటే తప్పదు, కొన్ని త్యాగాలు చెయ్యాల్సిందే.
  ఇదొక పెద్ద అంశం బ్రదర్. అంత చిన్న విషయం కాదు ఒక్క ముక్కలో తేల్చటానికి. దీనికి చాలా కోణాలు ఉన్నై. మన ఆర్ధిక, సామాజిక పరీస్థితుల గురించి కూడా మనం లెక్కలోకి తీసుకోవాలి, మన తల్లితండ్రుల మానసిక పరీస్థితి, వాళ్ళు ఎక్కలేని నిచ్చనలు, వాటిని పిల్లలచేత ఎక్కించాలనుకోవటాలు ఎన్నో ఉంటాయి. ఐతే సీఏ మంచి మార్గమే. కాని అది కావాలంటే ఎంతో సమయం, సహనం కావాలి. నిజానికి మన సమాజానికి సహనం తక్కువ. మనకి మొక్క నాటంగనే పండు రావాలి. ఇంజనీరింగు ఐతే చెయ్యంగనే జీఆరుఈయో టోఫెలో రాసి అమేరికా కో ఆఫ్రికా కో తొయ్యొచ్చు, లేక ప్రవీణ్ లాంటి వాల్లకి చెప్పీ ఉద్యోగమ్లోకి నెట్టొచ్చు (సాఫ్టువేరు). మన ఆలోచనలు ఎప్పుడు “పండు” మీదనే ఉంటాయి. అది తప్పా? అంటే, ఏమో తప్పుకాదేమో, తప్పేమో. పిల్లల మంచిచెడ్డలు తల్లితండ్రులకి కాక మీకుతెలుస్తాయా అని మళ్ళి సెటైరు ఉంది కదా?

  నేను ముందు రాసిన టపా లో ఒక చిన్న అంశం మీదకూడా మనం దృష్టి పెట్టాలి. ముందు పిల్లల్ని అడగవద్దు “ఏమి అవుతావ్ పెద్దైతే” అని. ఇప్పుడు మీరు తుపాకి పెట్టి భాస్కరా రాబోయే 5 సంవత్సరాలల్లో నిన్ను ఎక్కడ చూసుకుందామని అనుకుంటున్నావ్? అంటే నేను తప్పక తెల్ల మొఖం వెయ్యాల్సిందే. ఇక్కడ ప్రతీరోజు హమ్మయ్య ఈరోజు నా ఉద్యోగం ఉంది అనే పరీస్థితి. 10 yrs అనుభవం, దెశదేశాలల్లో పని చేసిన నాకే ఒకనిర్దిష్టమైన ప్లాను లేదు ఇంక వాల్లకి ఆ అనవసరమైన సొద అనవసరం అని నా అభిప్రాయం.
  మీరు లేవనెత్తిన విషయం, కొంచెంపెద్దాఇయ్యాక, అవును వాళ్ళకి ఛాయీసు ఉండాలి. తల్లితండ్రులకి కూడా అవగాహన ఉండాలి.

  దీనికి కూడా ఒక సుదీర్ఘ సుత్తి ఒకటి రాయాల్సి వస్తున్నది. అది:
  ఒకానొక రోజుల్లో మనకి ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఒక కుటుంబ వృక్షం ఉండేది. ఇంటికి ఒకానొక పెద్ద తలకాయి అంటే అనుభవమ్లో పండిన తాత ఉండేవాడు. ఇలాంటి నిర్ణయాలు వచ్చినప్పుడు ఆయన తల్లితండ్రులకి పిల్లలకి వారధిలా ఉండి పిల్లల అభిరుచుల్ని పెద్దల పెద్దరికాన్ని నిలబెట్టేవాడు. ఇప్పుడు మితిమీరిన స్వాతంత్రం, అటామిక్కు కుటుంబాలవలన అగాధాలు పెరుగుతున్నాయి, అభిరుచులు కలలు పేకమేడాలవుతున్నై. లలిత గారి టపా “ఆడవాళ్ళు స్వేచ్ఛ” కుడా ఇది వర్తిస్తుంది.

  సుదీర్ఘ సుత్తికొట్టినందుకు క్షమించండి.

  భాస్కర్

 22. అన్నావప్పుకుంటా అన్నా!! అది నిజమే. ఐతే మన పరీస్థితి ఏంటంటే ఎదుగుతున్న దేశాలల్లో ఒక ఉద్యోగం సంపాదించటమే ఎక్కువ. ఇంక, నేను కోరుకున్న ఫీల్డులో, నేను కోరుకున్న ఉద్యోగం, అవి ఇవి అంటే కష్టం. రెక్కాడితే కాని దొక్కాడని పరీస్త్థి మంది (మన భారతదేశం లాటి దేశ ఆర్ధిక స్థితి). కాబట్టి, ఈ పోటీ ప్రపంచమ్లో నిలబడాలంటే తప్పదు, కొన్ని త్యాగాలు చెయ్యాల్సిందే.ఇదొక పెద్ద అంశం బ్రదర్. అంత చిన్న విషయం కాదు ఒక్క ముక్కలో తేల్చటానికి. దీనికి చాలా కోణాలు ఉన్నై. మన ఆర్ధిక, సామాజిక పరీస్థితుల గురించి కూడా మనం లెక్కలోకి తీసుకోవాలి, మన తల్లితండ్రుల మానసిక పరీస్థితి, వాళ్ళు ఎక్కలేని నిచ్చనలు, వాటిని పిల్లలచేత ఎక్కించాలనుకోవటాలు ఎన్నో ఉంటాయి. ఐతే సీఏ మంచి మార్గమే. కాని అది కావాలంటే ఎంతో సమయం, సహనం కావాలి. నిజానికి మన సమాజానికి సహనం తక్కువ. మనకి మొక్క నాటంగనే పండు రావాలి. ఇంజనీరింగు ఐతే చెయ్యంగనే జీఆరుఈయో టోఫెలో రాసి అమేరికా కో ఆఫ్రికా కో తొయ్యొచ్చు, లేక ప్రవీణ్ లాంటి వాల్లకి చెప్పీ ఉద్యోగమ్లోకి నెట్టొచ్చు (సాఫ్టువేరు). మన ఆలోచనలు ఎప్పుడు “పండు” మీదనే ఉంటాయి. అది తప్పా? అంటే, ఏమో తప్పుకాదేమో, తప్పేమో. పిల్లల మంచిచెడ్డలు తల్లితండ్రులకి కాక మీకుతెలుస్తాయా అని మళ్ళి సెటైరు ఉంది కదా?నేను ముందు రాసిన టపా లో ఒక చిన్న అంశం మీదకూడా మనం దృష్టి పెట్టాలి. ముందు పిల్లల్ని అడగవద్దు “ఏమి అవుతావ్ పెద్దైతే” అని. ఇప్పుడు మీరు తుపాకి పెట్టి భాస్కరా రాబోయే 5 సంవత్సరాలల్లో నిన్ను ఎక్కడ చూసుకుందామని అనుకుంటున్నావ్? అంటే నేను తప్పక తెల్ల మొఖం వెయ్యాల్సిందే. ఇక్కడ ప్రతీరోజు హమ్మయ్య ఈరోజు నా ఉద్యోగం ఉంది అనే పరీస్థితి. 10 yrs అనుభవం, దెశదేశాలల్లో పని చేసిన నాకే ఒకనిర్దిష్టమైన ప్లాను లేదు ఇంక వాల్లకి ఆ అనవసరమైన సొద అనవసరం అని నా అభిప్రాయం.మీరు లేవనెత్తిన విషయం, కొంచెంపెద్దాఇయ్యాక, అవును వాళ్ళకి ఛాయీసు ఉండాలి. తల్లితండ్రులకి కూడా అవగాహన ఉండాలి.దీనికి కూడా ఒక సుదీర్ఘ సుత్తి ఒకటి రాయాల్సి వస్తున్నది. అది:ఒకానొక రోజుల్లో మనకి ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఒక కుటుంబ వృక్షం ఉండేది. ఇంటికి ఒకానొక పెద్ద తలకాయి అంటే అనుభవమ్లో పండిన తాత ఉండేవాడు. ఇలాంటి నిర్ణయాలు వచ్చినప్పుడు ఆయన తల్లితండ్రులకి పిల్లలకి వారధిలా ఉండి పిల్లల అభిరుచుల్ని పెద్దల పెద్దరికాన్ని నిలబెట్టేవాడు. ఇప్పుడు మితిమీరిన స్వాతంత్రం, అటామిక్కు కుటుంబాలవలన అగాధాలు పెరుగుతున్నాయి, అభిరుచులు కలలు పేకమేడాలవుతున్నై. లలిత గారి టపా “ఆడవాళ్ళు స్వేచ్ఛ” కుడా ఇది వర్తిస్తుంది.సుదీర్ఘ సుత్తికొట్టినందుకు క్షమించండి.భాస్కర్

 23. భాస్కర్ రామరాజు said,

  cinnaporabATu aTAmikku kAdu IrOjuvi nyUkliyaru kuTumbAlu. (?? saricEyagalaru)

 24. cinnaporabATu aTAmikku kAdu IrOjuvi nyUkliyaru kuTumbAlu. (?? saricEyagalaru)


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: