మే 8, 2007

మరో అద్భుతమయిన సినిమా "The Breakfast Club" …

Posted in సినిమా, సినిమాలు వద్ద 1:46 సా. ద్వారా Praveen Garlapati

నా ఇంతకు ముందు టపాలో రాకేశ్వర రావు గారు రాసిన వ్యాఖ్య వల్ల నాకు “The Breakfast Club” సినిమా పరిచయం అయ్యింది.

1985 లో తీసినా ఇప్పటి పరిస్థితులకీ అన్వయించగలిగే సినిమా అది.

అయిదుగురు హై స్కూల్ విద్యార్థులకి డిటెన్షన్ ఇవ్వబడుతుంది. వారయిదుగురూ ఆ వారాంతంలో స్కూలుకి వస్తారు.
అందులో అయిదుగురిదీ వేరువేరు మనస్థత్వాలు. ఒకరు రెక్లెస్ గా, ఒకరు స్టైలిష్ గా, ఒకరు స్టూడియస్ గా, ఒకరు ఇంట్రావర్ట్ గా, ఒకరు సక్సస్‌ఫుల్ స్పోర్ట్స్మన్ గా పరిచయమవుతారు.

ఎవరికీ వేరేవారితో ఎందులోనూ సరిపోదు. వారందరినీ వారి ప్రిన్సిపాల్ గమనిస్తుంటాడు.

ఇక కథంతా వారు ఏ విధంగా ఆ డిటెన్షన్ గడిపారు అనేది.

పైన కనిపించే వారి మనస్థత్వాల కింద అసలు స్వభావం ఏంటి? ఎందుకు వారలా ప్రవర్తిస్తున్నారు అనేది ఎంతో హత్తుకునేలా ఉంటుంది. పిల్లల మీద తల్లిదండ్రులు ఏ విధంగా అనవసరమయిన ఒత్తిడి తెస్తారో, అందువల్ల సైడ్ ఎఫెక్ట్స్, వారికి ఎలా ఎవరితో తమ బాధ చెప్పుకోవాలో తెలీక వారిలో వారు ఎలా కుమిలిపోతుంటారో ఎంతో చక్కగా ఈ సినిమాలో బంధించగలిగాడు దర్శకుడు. అంతే కాక ఇంట్లో సరయిన వాతావరణం లేకపోతే పిల్లల మీద అది ఎలా ప్రభావం చూపుతుందో కూడా చెబుతాడు.

కుదిరితే తప్పకుండా చూడవలసిన సినిమాల లిస్టులో ఇది కూడా ఉంటుంది.

నా రేటింగ్: 4.5/5

ఈ మధ్యనే చూసిన ఇంకో సినిమా American Beauty. దాని గురించి నే చెప్ప.

ఈ మధ్య కొన్ని రోజులు బ్లాగు సన్యాసం తీసుకున్నా లేండి. అందుకే టపాలు లేవు. దానితో పాటూ ఊటీ ట్రిప్ కూడా 🙂

6 వ్యాఖ్యలు »

 1. కొత్త పాళీ said,

  బ్రేక్ఫాస్ట్ క్లబ్ గురించి చెప్పినందుకు థాంకులు. దీన్ని గురించి చదువుతుంటే ఈంకో హైస్కూలు సినిమా డెడ్ పొయెట్ సొసైటీ గుర్తొచ్చింది.
  ఏం, అమెరికన్ బ్యూటీ గురించి ఎందుకు చెప్పరు? ఆ సినిమ మొదట వచ్చినప్పుడు చూసి చాలా మెచ్చాను. మొన్నీ మధ్య మళ్ళి విడియోలో చూసినప్పుడు అంత గొప్పగా అనిపించలా – చాలా చోట్ల వదులు వదులుగా ఉంది. కెవిన్ స్పేసీ, థోరా బిర్చ్ (స్పేసీ కూతురిగా వేసింది) నటన అమోఘం.

 2. బ్రేక్ఫాస్ట్ క్లబ్ గురించి చెప్పినందుకు థాంకులు. దీన్ని గురించి చదువుతుంటే ఈంకో హైస్కూలు సినిమా డెడ్ పొయెట్ సొసైటీ గుర్తొచ్చింది.ఏం, అమెరికన్ బ్యూటీ గురించి ఎందుకు చెప్పరు? ఆ సినిమ మొదట వచ్చినప్పుడు చూసి చాలా మెచ్చాను. మొన్నీ మధ్య మళ్ళి విడియోలో చూసినప్పుడు అంత గొప్పగా అనిపించలా – చాలా చోట్ల వదులు వదులుగా ఉంది. కెవిన్ స్పేసీ, థోరా బిర్చ్ (స్పేసీ కూతురిగా వేసింది) నటన అమోఘం.

 3. రాకేశ్వర రావు said,

  నా వల్ల ఒ పది మంది the breakfast club చూస్తున్నారంటే నాకు చాలా ఆనందం వేస్తుంది 🙂

  మా చిన్నాన్న అంటారు American Beauty లో Beauty అసలు ఎక్కడుంది అని.

  American Dream లో ఉండే భారతీయులకు ఈ సినిమా అస్సలు నచ్చదు.

  నేనైతే ఈ సినిమా అప్పటికీ నాలుగు సార్లు చూసాననుకోండి.

 4. నా వల్ల ఒ పది మంది the breakfast club చూస్తున్నారంటే నాకు చాలా ఆనందం వేస్తుంది :)మా చిన్నాన్న అంటారు American Beauty లో Beauty అసలు ఎక్కడుంది అని. American Dream లో ఉండే భారతీయులకు ఈ సినిమా అస్సలు నచ్చదు. నేనైతే ఈ సినిమా అప్పటికీ నాలుగు సార్లు చూసాననుకోండి.

 5. ప్రవీణ్ గార్లపాటి said,

  @కొత్త పాళీ గారు (ఎంత వద్దనుకున్నా గారు వదలడం చేతకావట్లా):
  నాకు అమెరికన్ బ్యూటీ అంతగా నచ్చలా. కొద్దిగా డిఫరెంట్ సినిమా కానీ అందులో కథ మన జీవన విధానాలకు సరిపోలేదు. ఇక అది వదిలేస్తే ఓకే.
  డెడ్ పోయెట్స్ సొసైటీ చూస్తా. క్రిష్ కూడా దీని గురించి చెప్పినట్టు గుర్తు.

  @రాకేశ్వర రావు గారు:
  మీ వ్యాఖ్య నాకు సరిగా అర్థం కాలా. American Dream లో ఉన్న అంటే అమెరికా వైపు కి పరిగెట్టే మన వాళ్ళని అర్థమా ? అలాగయితే నేనా కాటగరీలో లేను. అయినా నాకు నచ్చలా.

 6. @కొత్త పాళీ గారు (ఎంత వద్దనుకున్నా గారు వదలడం చేతకావట్లా):నాకు అమెరికన్ బ్యూటీ అంతగా నచ్చలా. కొద్దిగా డిఫరెంట్ సినిమా కానీ అందులో కథ మన జీవన విధానాలకు సరిపోలేదు. ఇక అది వదిలేస్తే ఓకే.డెడ్ పోయెట్స్ సొసైటీ చూస్తా. క్రిష్ కూడా దీని గురించి చెప్పినట్టు గుర్తు.@రాకేశ్వర రావు గారు:మీ వ్యాఖ్య నాకు సరిగా అర్థం కాలా. American Dream లో ఉన్న అంటే అమెరికా వైపు కి పరిగెట్టే మన వాళ్ళని అర్థమా ? అలాగయితే నేనా కాటగరీలో లేను. అయినా నాకు నచ్చలా.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: