మే 10, 2007

నా మొదటి స్టేజీ ప్రదర్శన…

Posted in నా గురించి, స్టేజీ ప్రదర్శన వద్ద 5:03 సా. ద్వారా Praveen Garlapati

అది నేను ఇంజినీరింగ్ చదివే రోజులు. ఏదో ఫస్ట్ బెంచ్ లో కూర్చుని సైలెంట్ గా క్లాసు కి వచ్చి పోయే వాడిని నేను. ఓ మోస్తరు గా బాగా చదువుతానని, పరవాలేదని లెక్చరర్లకు తెలుసు. అంతకన్న నా గురించి తెలీదు. అంటే మనం ఏ అల్లరి చెయ్యము అని కాదు. కానీ చేసిన అల్లరి కనిపించదన్నమాట.

అలా ఒక నాలుగు సెమిస్టర్లు గడిచిపోయాయి.

మా కంప్యూటర్ బ్రాంచ్ వారికి కాస్మోస్ (కాష్మోరా కాదు లేండి) అని ఒక సంఘం ఉండేది లేండి. మేము ప్రతీ ఏడాదీ పండగ చేసుకునేవాళ్ళము. చస్ ఇంతవరకూ అసలు స్టేజీ ఎక్కలేదు మనం అని చెప్పి ఈ సారి ఖచ్చితంగా ఏదయినా చెయ్యాలి అని నిర్ణయించేసుకున్నా. సరే ఇక నా దోస్తు భరత్ ఉండనే ఉన్నాడు. వాడు ఏ ఫంక్షన్ అయినా డాన్స్ కి ముందే.

సరే మనం కూడా ఈ సారి డాన్సేద్దాం అని అనుకున్నా. తీరా చూస్తే మరుసటి రోజే ఫంక్షన్. ప్రోగ్రాం ఎలాగూ ఖరారయింది కానీ నేను డాన్సేద్దాం అని నిర్ణయించుకున్నది ఆ ముందు రోజు రాత్రి పదకొండు గంటలకి. సర్లే ఇక డాన్సా తొక్కా అనుకున్నా, అంతలో వాడు కలిసాడూ, రా మామా డాన్సుదేముంది మనమేసిందే డాన్స్, ఎవడు చూడొచ్చాడు ఎంజాయ్ చేద్దాం రా అన్నాడు. ఇక ఎక్కడ లేని ధైర్యం వచ్చేసింది.

సరే అని అప్పటికప్పుడు ప్రాక్టీస్ మొదలెట్టాము. ఇక తెలిసిందేగా డాన్స్ కొద్దో గొప్పో వచ్చు కానీ హహ… చెప్పాల్సిందేముంది ఇరగ స్టెప్పులు నేర్చేసుకుని పొడిచేద్దామనుకున్నా… అప్పుడు గానీ తెలీలా చిన్న చిన్న స్టెప్పులకే ఎంత స్టామినా కావాలో. మళ్ళీ మేము చెయ్యాలనుకున్నది ఒకే పాటకి కాదాయే. నాలుగు పాటలు రీమిక్స్ చేసి సగం సగం పెట్టి చించేద్దామనుకున్నాము. ఇక ఆ రోజు రెండు అయ్యేవరకూ నేను అవుటు. మామా ఇంక నా వల్ల కాదు రా అనగానే సర్లే రా రేపు సాయంత్రం కదా అంత వరకూ ప్రాక్టీస్ చెయ్యచ్చులే అనుకున్నాము.

పొద్దున్న లేచే సరికి పదకొండు మామా ప్రాక్టీస్ చేద్దామా అన్నాడు. సర్లే రా చాయ్ తాగొచ్చి ఫ్రెష్ గా చేద్దామన్నా. బయటికెళ్ళాము, బ్రేక్‌ఫాస్ట్ తిని తిరిగొచ్చే సరికి మధ్యాహ్నం. ఒక అరగంట సేపు అడ్డదిడ్డంగా స్టెప్పులేశాం. ఏదో చేసాం అనడానికి. ఇక సర్లే అని ఒక కునుకు తీశాం. కళ్ళు తెరిస్తే సాయంత్రం. సర్లే వచ్చింది ఏద్దాం లే స్టేజీ మీద అని రిలాక్స్ అవుతుంటే గుర్తొచ్చింది డాన్స్ కి డ్రెస్సేదిరా అని ? వార్నీ తస్సాదియ్యా ఏమేసుకోవాలి రా బాబూ అని తర్జన భర్జన పడి మొత్తానికి సర్లే అందరి దగ్గరా ఉంటుంది కదా అని బ్లూ జీన్స్, వైట్ షర్ట్, ఓ ఎదవ టై అని డిసైడయ్యాం. అది కూడా నా దగ్గర లేదాయే. అన్నీ డస్ట్ బిన్ అదే ఉతకాల్సిన బాస్కెట్ లో తొంగున్నాయి(అవి ఎప్పటికీ అక్కడే ఉంటాయి.) ఇక అడూక్కోవడం మొదలు, అరే నా సైజు జీన్స్ ఎవడి దగ్గరుంటుందా అని, ఎలాగయితే జీన్స్ ఒకడి దగ్గరా, షర్ట్ ఒకడి దగ్గరా, టై ఒకడి దగ్గరా బదులడిగి ఎలాగయితే స్టేజీ ఎక్కామనిపించాం.

అంతలో మా ట్రూపులో ఒకడొచ్చి నేను రావట్లేదురా స్టేజీ మీదకి నాకు భయం అని పారిపోయాడు. ఇదేంట్రా బాబూ అని షాకు తినేప్పటికే ఇక ఇంకో పది నిముషాల్లో మందే రో అంటూ వచ్చాడు భరత్ గాడు. ఇంతకీ చూస్తే మిగిలిన నాలుగు శాల్తీల్లో ఇంకోడు మిస్సింగు. టట్టడాయ్ అనుకుంటూ మా ఇంకో ఎదవ వాడు కనబడట్లేదురో అని న్యూస్ మోసుకొచ్చాడు. చా తస్సాదియ్య ఇదేంటి అనుకుంటుండగానే సరే రా అయితే మనం ముగ్గురమే అని కొంచం టెన్షన్లో అన్నాడు భరత్ గాడు. నాకు మరీనూ ఎందుకంటే అందాకా వెనక వరసలో ఉండే నన్ను తీసుకొచ్చి మనమిద్దరం ముందుండి డాన్సేద్దాము రోయ్ అన్నాడు వాడు (ఇంకోడు మరీ దారుణం లేండి.) నాకు వణుకు మొదలయ్యింది. వాడేమో భలే రా మొదటి సారి స్టేజీ మీదే ఇరగదీస్తావన్నమాట అని నవ్వుతున్నాడు.

సర్లే కానీ అని ఇక స్టేజీ ఎక్కాం.
ఇక అక్కడ చూస్తే ముందు వరసలో మా లెక్చరర్లు, అందులో చండ శాసనుడు అయిన ఒక మేష్టారు. గుర్రు గా చూస్తున్నాడు. అందరికీ షాక్ ఏంటి వీడు మొదటి బెంచీలో కూర్చుని, అప్పుడప్పుడూ ఆవలిస్తూ, అప్పుడప్పుడూ కునుకు తీస్తున్నట్టుండే వీడు స్టేజెక్కాడా అని. మా క్లాస్మేట్స్, జూనియర్లు, బాచ్‌మేట్శ్ అప్పటికే విజిల్సూ, గొడవా. నా యాల్ది అని సాంగ్ మొదలయ్యింది. మాంచి ఊపు మీద స్టెప్పులేసేస్తున్నాం. లెక్చరర్లందరూ ఆ అని నోళ్ళు వెళ్ళబెట్టుకుని చూస్తున్నారు, వీళ్ళేసే సాంగులేంట్రా అని. ఇంతకూ మేము డాన్సులేసింది మొదటి పాట కన్నె పిట్టరో కన్ను కొట్టరో, రెండోది బంగారు కోడిపెట్ట, తతిమ్మా అలాంటివే. వింటేనే తెగ మాసు అనిపిచ్చే సాంగులకి మేమేసే స్టెప్పులు, మధ్యలో లుంగీ ఆహా నా రాజా అదిరిపోయింది, ఒకటే గోల, విజిల్సూ. ఇంకా నయం కర్ణాటక లో చదవబట్టి సరిపోయింది కానీ పాటలకర్థం తెలిసుంటే లెక్చరర్లు తర్వాత సిబాకా ఆడేవారేమో.

ఇక నాలుగో సాంగు కి స్టెప్పులేస్తుంటే మా జూనియర్లు, బాచ్‌మేట్లూ, నార్తీ ఫ్రెండ్లూ, ఒక్కరేంటి అందరూ స్తేజీ ఎక్కేసారు, మా చుట్టూ ఇరగ డాన్సు. ఇక మమ్మల్ని స్టేజీ మీద నుంచి తోసి మరీ పంపించాల్సొచ్చింది ఆఖరికి. అప్పటి దాకా మైఖేల్ జాక్సనూ, హ్రితిక్ రోషనూ చూసి మొహం మొత్తిన వారందరికీ వెరయిటీ ప్రోగ్రామన్నమాట మాది 🙂

అలా ముగిసింది నా మొదటి స్టేజీ ప్రదర్శన.

ఇక ఆ తరవాత మన రాముడు మంచి బాలుడు (ఎప్పుడూ నిజం కాదనుకోండి) ఇమేజీ కాస్తా హుష్ కాకి అయ్యింది. తర్వాత లెక్చరర్లు కూడా పిలిచి బాగా చేసావని చెప్పారనుకోండి (ఆఫ్కోర్స్ మన గండర గండ లెక్చరరు గుర్రు మంటూనే ఉన్నాడు.)

అప్పటి నుంచీ అప్రతిహతంగా ప్రతీ ఫంక్షన్ లోనూ డాన్సేయ్యాల్సిందే. ఆఖరికి మైఖేల్ జాక్సన్ పాటకి హ్రితిక్ రోషన్ డాన్స్ కూడా ఏసాం 🙂

ఇప్పుడు తలచుకుంటే నవ్వొస్తుంది.

16 వ్యాఖ్యలు »

 1. సుధాకర్(శోధన) said,

  🙂 బ్లాగు అదిరింది మీ స్టెప్పులతో

 2. 🙂 బ్లాగు అదిరింది మీ స్టెప్పులతో

 3. Srinivas Ch said,

  వీలైతే మీ డాన్స్ వీడియోని యూట్యూబ్ లోనో గూగుల్ వీడియో లోనో అప్ లోడ్ చేసి దాని లింక్ ఇక్కడ పడెయ్యండి. మేమూ చూసి ఎంజాయ్ చేస్తాము.

 4. Srinivas Ch said,

  వీలైతే మీ డాన్స్ వీడియోని యూట్యూబ్ లోనో గూగుల్ వీడియో లోనో అప్ లోడ్ చేసి దాని లింక్ ఇక్కడ పడెయ్యండి. మేమూ చూసి ఎంజాయ్ చేస్తాము.

 5. ప్రవీణ్ గార్లపాటి said,

  @సుధాకర్ గారు:
  నన్ను స్మరించుకుని ఓ నాలుగు స్టెప్పులెయ్యండి మరి 🙂

  @ srinivas గారు:
  అబ్బో ఇంకేమన్నా ఉందా ? ఫాన్సొచ్చి పడీపోరూ ? అప్పుడు అంత సీను లేదండీ. ఆ సీడీ కూడా నే సంపాదించలా.

 6. @సుధాకర్ గారు: నన్ను స్మరించుకుని ఓ నాలుగు స్టెప్పులెయ్యండి మరి :)@ srinivas గారు: అబ్బో ఇంకేమన్నా ఉందా ? ఫాన్సొచ్చి పడీపోరూ ? అప్పుడు అంత సీను లేదండీ. ఆ సీడీ కూడా నే సంపాదించలా.

 7. రానారె said,

  ఇలాక్కాదు, నేను బెంగుళూరొచ్చాక మన బ్లాగు జీవులంతా కలసి మళ్లీ స్టేజీ ఎక్కాల్సిందే. ఇక్కడికొచ్చాక నేనూ మొదటిసారిగా డాన్సు చేయడంకోసం స్టేజీ ఎక్కాను. “ఎల్లిపోతె ఎల్లిపోని … ఎలిజబెత్తుటేలరేటి ఆ పిల్ల” అనే అబ్దుల్లావేషం నాది. (మనహీరోగారు ఆవిడ నిజ జీవిత భాగస్వామే). మాదీ అంతే, పాట చివరికొచ్చేసరికి, “…అద్దిరబన్నా ముద్దులజంట అదిరెనహో” అంటూ స్టేజీ డాన్సర్లతో నిండింది. ఆ పాటకు కొరియోగ్రాఫర్లలోకూడా నేనూ ఒకడిని. అబ్బో మనమూ ఫరవాలేదనిపించింది. స్టేజీ ఎక్కేంతవరకే బెరుకు. తర్వాత అంతా మనదే :))

 8. ఇలాక్కాదు, నేను బెంగుళూరొచ్చాక మన బ్లాగు జీవులంతా కలసి మళ్లీ స్టేజీ ఎక్కాల్సిందే. ఇక్కడికొచ్చాక నేనూ మొదటిసారిగా డాన్సు చేయడంకోసం స్టేజీ ఎక్కాను. “ఎల్లిపోతె ఎల్లిపోని … ఎలిజబెత్తుటేలరేటి ఆ పిల్ల” అనే అబ్దుల్లావేషం నాది. (మనహీరోగారు ఆవిడ నిజ జీవిత భాగస్వామే). మాదీ అంతే, పాట చివరికొచ్చేసరికి, “…అద్దిరబన్నా ముద్దులజంట అదిరెనహో” అంటూ స్టేజీ డాన్సర్లతో నిండింది. ఆ పాటకు కొరియోగ్రాఫర్లలోకూడా నేనూ ఒకడిని. అబ్బో మనమూ ఫరవాలేదనిపించింది. స్టేజీ ఎక్కేంతవరకే బెరుకు. తర్వాత అంతా మనదే :))

 9. Rajasekhar S said,

  ఈ ఫన్ నేను మిస్ అయ్యానుగా 😦
  బాగా రాసావురా 🙂
  నీకు ఇలా డాన్స్ చెయ్యాలనే కోరికపుడుతుందని నాకు ముందే తెలిస్తే నేను నిన్ను ర్యాగింగ్ చేసేవాడిని కదరా :))
  నీకు మంచి డాన్స్ ప్రాక్టిస్ అయ్యేది 😛

 10. Rajasekhar S said,

  ఈ ఫన్ నేను మిస్ అయ్యానుగా :(బాగా రాసావురా :)నీకు ఇలా డాన్స్ చెయ్యాలనే కోరికపుడుతుందని నాకు ముందే తెలిస్తే నేను నిన్ను ర్యాగింగ్ చేసేవాడిని కదరా :))నీకు మంచి డాన్స్ ప్రాక్టిస్ అయ్యేది 😛

 11. ప్రవీణ్ గార్లపాటి said,

  రానారె:
  నువ్వు రావయ్యా బెంగుళూరు ముందు. తరవాత నీతో కలిసి స్టెప్పులేంటి, వీధి నాటకాలు కూడా వేద్దాము. 🙂

  రాజశేఖర్ అన్న:
  అందుకే మరి స్ట్రాంగ్ ఫవుండేషన్ ఏసుకుని ఇంకొన్ని రోజులు కాలేజీ లో ఉండాల్సింది.
  మరే మీ రాగింగ్ అనుభవం మాకు ఎక్కువగా కలగలేదుగా.

 12. రానారె: నువ్వు రావయ్యా బెంగుళూరు ముందు. తరవాత నీతో కలిసి స్టెప్పులేంటి, వీధి నాటకాలు కూడా వేద్దాము. :)రాజశేఖర్ అన్న: అందుకే మరి స్ట్రాంగ్ ఫవుండేషన్ ఏసుకుని ఇంకొన్ని రోజులు కాలేజీ లో ఉండాల్సింది.మరే మీ రాగింగ్ అనుభవం మాకు ఎక్కువగా కలగలేదుగా.

 13. రాజశేఖర్ శాఖా said,

  హమ్మ ప్రవీణూ .. నువ్వు కూడా నర్మగర్బంగా మాట్లాడడం నేర్చుకున్నావ్ ఈ మధ్య.

 14. హమ్మ ప్రవీణూ .. నువ్వు కూడా నర్మగర్బంగా మాట్లాడడం నేర్చుకున్నావ్ ఈ మధ్య.

 15. ప్రవీణ్ గార్లపాటి said,

  రాజశేఖర్ అన్నా:
  మరే సాంగత్యం అలాంటిది. మీ లాంటి వారితో కలిసి.
  అనుకోకుండా చేసిన వ్యాఖ్య అది 🙂

 16. రాజశేఖర్ అన్నా:మరే సాంగత్యం అలాంటిది. మీ లాంటి వారితో కలిసి.అనుకోకుండా చేసిన వ్యాఖ్య అది 🙂


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: