మే 20, 2007

ఈ సినిమాకి అర్థాలే వేరులే …

Posted in సినిమా, సినిమాలు వద్ద 7:58 సా. ద్వారా Praveen Garlapati

ఈ మధ్యనే “ఆడవారి మాటలకు అర్థాలే వేరులే” సినిమా చూసి బలయ్యిన వారిలో నేనూ ఒకడిని.
అసలు ఇలాంటి సినిమాలు ఎందుకు తీస్తారా అన్నంత వెగటు పుట్టించింది ఈ సినిమా. రాక రాక ఓ పెద్ద హేరో సినిమా వచ్చింది గదా, చూద్దాం లే అనుకున్నా.

వామ్మో ఘోరం.
అసలు మొదటి సగం లో అయితే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల గురించి చెడుగుడు ఆడుకున్నాడు.
ఏమీ రాని ఒక పనికి మాలిన వెధవ, ఉద్యోగం సద్యోగం లేకుండా ఉన్నవాడికి కూడా సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వచ్చేస్తుంది అనే విధంగా వెంకటేష్ కి ఉద్యోగం వచ్చేస్తుంది.

ఆ తర్వాత త్రిష వాడికి ప్రాజెక్ట్ మేనేజర్. ప్రాజెక్ట్ మేనేజర్లు రెక్రూట్మెంట్ చెయ్యడం కూడానూ. మేనేజర్, లీడ్ అంటేనే ఇక నేను టెక్నికల్ విషయాలు మనేసి అజమాయిషీ చేసెయ్యచ్చు అనే విధంగా ఉన్న మన దేశం లో ప్రాజెక్ట్ మేనేజర్ టెక్నికల్ విషయాలు హేండిల్ చెయ్యడం కూడానా ? అన్నన్నా…

సరే అది వదిలెయ్యండి, ఆ తర్వాత ఏమీ రాని వెంకటేష్ ఏదొ టక టక లాడీంచడం వల్ల కంప్యూటర్ క్రాష్ అవ్వడం, దానికి ఎండీ వచ్చి త్రిషా ని తిట్టడం, దానికి త్రిషా ఏద్వడం, అది చూసి వెంకటేష్ రాత్రంతా నిద్ర లేకుండా చదివేసి టప టపా కంప్యూటర్లో కొట్టెయ్యడం, దానికి ప్రతి గా ప్రింటర్ లోంచి పుంఖాను పుంఖాలుగా పేజీలు వచ్చెయ్యడం (హహ.. కోడ్ కొట్టగానే ప్రింటర్ లోంచి పేజీలొస్తాయంట.) మనకవసరమా అనిపించింది.

ఇక ఆ తరవాత సాఫ్ట్‌వేర్ జాబ్ అంటే కేవలం విదేశాలకు వెళ్ళడమా అన్నట్టు జాయిన్ అవగానే ఆస్ట్రేలియా ట్రిప్పోటి అందులో స్ట్రిప్ క్లబ్ కి త్రిషా పట్టుబట్టి వెళ్ళడం (టీం మెంబర్స్ బాధ్యత అంట. మాకు తెలీదులే ఇంత పట్టించుకునే వాళ్ళుంటారా ?) అబ్బో…

ఇంకేమి చూడాలో అనుకుంటుండగానే సీను సడన్ గా పల్లె కి మారుతుంది. అక్కడ మామూలుగానే మంచితనంతో హీరో అందరి మనసులూ గెలుచుకోవడం, తరవాత ఎడబాటు, మనస్పర్థలు, చివరికి హీరో ని తెగ పొగిడి హీరోయిన్ ని కట్టబెట్టడం.

ఈ సినిమా చూసిన తరవాత అర్థమయ్యింది ఏమిటయ్యా అంటే ప్రేక్షకులు ఎదవలు, ఏం చూపించినా చూస్తారు అనే భావన ఆ దర్శకుడిలో ఉందేమో అని. అసలు మనం తీసే సినిమా గురించి కొంతయినా రీసర్చ్ చెయ్యాలి అనే ఇంగిత జ్ఞానం కూడా లేని ఈ డైరెక్టర్లను ఏం చెయ్యాలి, వాళ్ళ సినిమాలు ఫెయిల్ అయ్యేలా చూడడం కంటే.

అందుకే నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నా, ఈ టపా ద్వారా… ఇక మీ ఇష్టం. రేటింగ్ కూడా వేస్టే.

ప్రకటనలు

26 వ్యాఖ్యలు »

 1. రాకేశ్వర రావు said,

  పాటలు విని, మన త్రిషా, మన వెంకటేశ్ ఉన్నారుగా, ఈ సినిమా తప్పక చూడాలి అనుకున్నా .

  అదృష్టవసాత్తు చూడలేక పోయా..

  సినిమా ఇండస్ట్రీ నిజంగా క్రైసిస్ లో ఉన్నట్టుంది. ఎవరైనా కాపాడండి బాబో…

 2. పాటలు విని, మన త్రిషా, మన వెంకటేశ్ ఉన్నారుగా, ఈ సినిమా తప్పక చూడాలి అనుకున్నా . అదృష్టవసాత్తు చూడలేక పోయా.. సినిమా ఇండస్ట్రీ నిజంగా క్రైసిస్ లో ఉన్నట్టుంది. ఎవరైనా కాపాడండి బాబో…

 3. lalitha said,

  ఇలాంటిది ఇదే మొదలంటారా?
  సినిమా సంగతేమో కాని మీ రివ్యూ చదివి తెగ నవ్వుకున్నాను. ఇలాగ కామెడీ కాని కామెడీ సినిమాలు చాలా చూసాము. అవన్నీ గుర్తు చేశారు. ధన్యవాదాలు. అది ఒక నాటి మాట లెండి. TeleTubbies నుండి Dora కి, ఆ తర్వాత ఈ మధ్యనే spongebob కి graduate అయ్యాము.

 4. lalitha said,

  ఇలాంటిది ఇదే మొదలంటారా?సినిమా సంగతేమో కాని మీ రివ్యూ చదివి తెగ నవ్వుకున్నాను. ఇలాగ కామెడీ కాని కామెడీ సినిమాలు చాలా చూసాము. అవన్నీ గుర్తు చేశారు. ధన్యవాదాలు. అది ఒక నాటి మాట లెండి. TeleTubbies నుండి Dora కి, ఆ తర్వాత ఈ మధ్యనే spongebob కి graduate అయ్యాము.

 5. నాగరాజా said,

  కాపాడినందుకు థాంక్స్. ఇకపొతే మేము కూడా డో(రా)వా నుండి స్పాంజి బాబ్‌కు ప్రమోషన్ పొంది (బలవంతంగా అయినా) ఆనందిస్తున్నాము.

 6. కాపాడినందుకు థాంక్స్. ఇకపొతే మేము కూడా డో(రా)వా నుండి స్పాంజి బాబ్‌కు ప్రమోషన్ పొంది (బలవంతంగా అయినా) ఆనందిస్తున్నాము.

 7. సుధాకర్(శోధన) said,

  అసలు మన తెలుగు దర్శకులకు వున్న బుర్రే అతి చిన్నది. దానికి సాఫ్టు వేర్ ఇంజనీర్లు అంటే అలానే అర్ధం అవుతారు. కనీసం వెంకటేష్ కు కూడా ఇంగిత జ్జానం లేక పోవటం విచిత్రం.

 8. అసలు మన తెలుగు దర్శకులకు వున్న బుర్రే అతి చిన్నది. దానికి సాఫ్టు వేర్ ఇంజనీర్లు అంటే అలానే అర్ధం అవుతారు. కనీసం వెంకటేష్ కు కూడా ఇంగిత జ్జానం లేక పోవటం విచిత్రం.

 9. Anonymous said,

  హమ్మయ్య ఈ సినిమా చూసి బలయ్యానని ఫీల్ అయ్యినవాళ్ళు నాలాగే చాలామందే వున్నారన్నమాట…ఈ మధ్య కాలంలో నేను చూసిన అతి చెత్త సినిమా..వెంకటేష్ ‘వసంతం’ సినిమా చూసాక ఇక జీవితం లో అతని సినిమాలు చూడకూడదని ఒట్టు పెట్టుకున్నాను…కాని తర్వాత ‘సంక్రాంతి ‘ చూశాను…చూశాక మరింత గట్టిగా ఒట్టు పెట్టేసుకున్నాను ఇక మళ్ళి వెంకటేష్ సినిమా కి డబ్బులు వేస్ట్ చెయ్యొద్దని..కాని దురద్రుష్టవశాత్తూ మళ్ళీ ఈ సినిమా చూసాను 😦 ఇక నేను ఎలాంటి ఒట్ట్లు పెట్టుకోదలుచుకోలేదు

 10. Anonymous said,

  హమ్మయ్య ఈ సినిమా చూసి బలయ్యానని ఫీల్ అయ్యినవాళ్ళు నాలాగే చాలామందే వున్నారన్నమాట…ఈ మధ్య కాలంలో నేను చూసిన అతి చెత్త సినిమా..వెంకటేష్ ‘వసంతం’ సినిమా చూసాక ఇక జీవితం లో అతని సినిమాలు చూడకూడదని ఒట్టు పెట్టుకున్నాను…కాని తర్వాత ‘సంక్రాంతి ‘ చూశాను…చూశాక మరింత గట్టిగా ఒట్టు పెట్టేసుకున్నాను ఇక మళ్ళి వెంకటేష్ సినిమా కి డబ్బులు వేస్ట్ చెయ్యొద్దని..కాని దురద్రుష్టవశాత్తూ మళ్ళీ ఈ సినిమా చూసాను 😦 ఇక నేను ఎలాంటి ఒట్ట్లు పెట్టుకోదలుచుకోలేదు

 11. నవీన్ గార్ల said,

  సినిమా ఏమో కానీ నువ్వు వ్రాసిన విధానం బాగుంది. నీ కోపం విసుగు చదువుతూంటే నేను బ్రతికిపోయినందుకు భలే ఆనందం వేసింది 🙂
  సుధాకర్, దీన్ని తీసింది తమిళ దర్శకుడు. తెలుగు దర్శకుడు ఐనా పెద్ద తేడాగా తీయడనుకో…అది వేరే విషయం.

 12. సినిమా ఏమో కానీ నువ్వు వ్రాసిన విధానం బాగుంది. నీ కోపం విసుగు చదువుతూంటే నేను బ్రతికిపోయినందుకు భలే ఆనందం వేసింది :)సుధాకర్, దీన్ని తీసింది తమిళ దర్శకుడు. తెలుగు దర్శకుడు ఐనా పెద్ద తేడాగా తీయడనుకో…అది వేరే విషయం.

 13. రాజశేఖర్ said,

  చాలా బాగా వ్రాసావు ప్రవీణ్ 🙂
  చిన్న తేడా జరిగి నేను తప్పించుకున్నా ..లేదంటే బాధితుల జాబితాలో నేను కూడా చేరేవాడిని.
  (ప్రవీణ్ నాకు తోడున్నాడు అనుకునేవాడిని … స్వగతం)

 14. చాలా బాగా వ్రాసావు ప్రవీణ్ :)చిన్న తేడా జరిగి నేను తప్పించుకున్నా ..లేదంటే బాధితుల జాబితాలో నేను కూడా చేరేవాడిని.(ప్రవీణ్ నాకు తోడున్నాడు అనుకునేవాడిని … స్వగతం)

 15. కామేష్ said,

  చాలా బాగా రాసావయ్యా ప్రవీణూ ( ఆభిమానంగా). కొన్ని సంవత్సరాలక్రితం అనేకంటే రెండు దశాబ్దాలక్రింతం నేను నెలలో సుమారు 40, 50 సినిమాలు చూసే స్టేజినుండి, ప్రస్తుతం సంవత్సరానికి ఒకటో రెండో చూసే స్ధాయికి దిగజారానని బాధపడుతున్నప్పుడు, ఈ పోస్టు చూసి అబ్బో నాకొచ్చింది డిమోషన్ కాదు ప్రమోషన్ అని తెగ సంబరపడిపోయా. ధన్యవాదాలు.

 16. చాలా బాగా రాసావయ్యా ప్రవీణూ ( ఆభిమానంగా). కొన్ని సంవత్సరాలక్రితం అనేకంటే రెండు దశాబ్దాలక్రింతం నేను నెలలో సుమారు 40, 50 సినిమాలు చూసే స్టేజినుండి, ప్రస్తుతం సంవత్సరానికి ఒకటో రెండో చూసే స్ధాయికి దిగజారానని బాధపడుతున్నప్పుడు, ఈ పోస్టు చూసి అబ్బో నాకొచ్చింది డిమోషన్ కాదు ప్రమోషన్ అని తెగ సంబరపడిపోయా. ధన్యవాదాలు.

 17. ప్రవీణ్ గార్లపాటి said,

  అబ్బా నాకిప్పుడు ఎంత తృప్తిగా ఉందో…
  కొంత మందినయినా కాపాడగలిగినందుకు. 🙂

 18. అబ్బా నాకిప్పుడు ఎంత తృప్తిగా ఉందో…కొంత మందినయినా కాపాడగలిగినందుకు. 🙂

 19. radhika said,

  సినిమా చాలా బాగుంది ఆడవాళ్ళు కు బాగా ఎక్కుతుంది అన్నారు.అహో అనుకుని వెళ్ళి చూస్తే ఏముంది చూసిన వాళ్ళం వెధవలం అయ్యాము. మీరు ఈ టపా కాస్త ముందుగా రాసుంటే నన్ను కాపాడిన వారయ్యుండేవారు.

 20. radhika said,

  సినిమా చాలా బాగుంది ఆడవాళ్ళు కు బాగా ఎక్కుతుంది అన్నారు.అహో అనుకుని వెళ్ళి చూస్తే ఏముంది చూసిన వాళ్ళం వెధవలం అయ్యాము. మీరు ఈ టపా కాస్త ముందుగా రాసుంటే నన్ను కాపాడిన వారయ్యుండేవారు.

 21. సిరి said,

  చాలా చక్కగా చెప్పారు…రక్షించారు. చాలా thanks. నేనింకా సినిమా చూడలేదు, మీరిలా చెప్పేక బహుశా చూడను కూడా!
  మీ ఆవేదన అర్థవంతమైందే! ఈ మధ్య వస్తున్న చాలా సినిమాలు చూసి, మీలాగే నేను కూడా చాలా సార్లు చాలా బాధ పడ్డాను.
  ఇక ఈ సినిమా గురించి మరో వైపు నుంచీ ఆలోచిద్దాం. మనకున్న తెలుగు జనాభాలో కంప్యూటర్ల్ గురించీ, ఆ ఉద్యోగాల గురించీ ఎందరికి పూర్తి అవగాహన ఉంటుంది? computer crash అయినప్పుడు, కీబోర్డును టకటక లాడించకుండా … వెంకటేషో, త్రిషో అందరికీ సోష వచ్చేలాగా technical విషయాలతో చెడుగుడు ఆడేస్తే, సినిమా బాక్సాఫీసు దగ్గర బోర్లా పడుతుంది కదా? సామాన్యుడిని (సిన్మా పరిభాషలో మాస్ ని) ఆకట్టుకోవాలంటే, పైసలు రాల్చు కోవాలంటే…మెజారిటీ ప్రేక్షకులకు నచ్చేవిధంగా, అర్థమయ్యే విధంగా వాళ్ళ లెవెల్ లో సినిమాలు తీయడం తప్పనిసరి కదా?!
  పైసల వర్షం కురిపించే ప్రేక్షక వర్గం బాగా ఎడ్యుకేట్ అయి, కంప్యూటర్ల గురించిన knowledge పెరిగినప్పు డు, ఇదే సినిమాను (మీరు చెప్పినట్లు) ఇదే విధంగా తీస్తారని నేననుకోను. అప్పుడూ ఇలాగే తీస్తే, మెజారిటీ వర్గం తమల్ని సినిమా తీసినోళ్ళు వెధవల్ని చేస్తున్నారని గ్రహిస్తారు కాబట్టి నిర్మాత బొచ్చెలో రాయి పడుతుంది!
  మీరేమంటారు?
  పైది చదివి చెత్త సిన్మాలు తీసే వాళ్ళను వెనకేసుకొస్తున్నానని అపోహ పడొద్దు!కేవలం మరో కోణం లోంచీ ఈ విషయాన్ని చూడొచ్చని చెప్పే ప్రయత్నమే నేను చేసింది!
  thanks,
  సిరి

 22. సిరి said,

  చాలా చక్కగా చెప్పారు…రక్షించారు. చాలా thanks. నేనింకా సినిమా చూడలేదు, మీరిలా చెప్పేక బహుశా చూడను కూడా!మీ ఆవేదన అర్థవంతమైందే! ఈ మధ్య వస్తున్న చాలా సినిమాలు చూసి, మీలాగే నేను కూడా చాలా సార్లు చాలా బాధ పడ్డాను.ఇక ఈ సినిమా గురించి మరో వైపు నుంచీ ఆలోచిద్దాం. మనకున్న తెలుగు జనాభాలో కంప్యూటర్ల్ గురించీ, ఆ ఉద్యోగాల గురించీ ఎందరికి పూర్తి అవగాహన ఉంటుంది? computer crash అయినప్పుడు, కీబోర్డును టకటక లాడించకుండా … వెంకటేషో, త్రిషో అందరికీ సోష వచ్చేలాగా technical విషయాలతో చెడుగుడు ఆడేస్తే, సినిమా బాక్సాఫీసు దగ్గర బోర్లా పడుతుంది కదా? సామాన్యుడిని (సిన్మా పరిభాషలో మాస్ ని) ఆకట్టుకోవాలంటే, పైసలు రాల్చు కోవాలంటే…మెజారిటీ ప్రేక్షకులకు నచ్చేవిధంగా, అర్థమయ్యే విధంగా వాళ్ళ లెవెల్ లో సినిమాలు తీయడం తప్పనిసరి కదా?!పైసల వర్షం కురిపించే ప్రేక్షక వర్గం బాగా ఎడ్యుకేట్ అయి, కంప్యూటర్ల గురించిన knowledge పెరిగినప్పు డు, ఇదే సినిమాను (మీరు చెప్పినట్లు) ఇదే విధంగా తీస్తారని నేననుకోను. అప్పుడూ ఇలాగే తీస్తే, మెజారిటీ వర్గం తమల్ని సినిమా తీసినోళ్ళు వెధవల్ని చేస్తున్నారని గ్రహిస్తారు కాబట్టి నిర్మాత బొచ్చెలో రాయి పడుతుంది!మీరేమంటారు?పైది చదివి చెత్త సిన్మాలు తీసే వాళ్ళను వెనకేసుకొస్తున్నానని అపోహ పడొద్దు!కేవలం మరో కోణం లోంచీ ఈ విషయాన్ని చూడొచ్చని చెప్పే ప్రయత్నమే నేను చేసింది!thanks, సిరి

 23. chaitu said,

  నేను సినిమాలు ఎక్కువగా చూడను… ఈ సినిమా కూడా చూడలేదు… బ్రతికిపోయాను

 24. chaitu said,

  నేను సినిమాలు ఎక్కువగా చూడను… ఈ సినిమా కూడా చూడలేదు… బ్రతికిపోయాను

 25. ప్రవీణ్ గార్లపాటి said,

  సిరి గారూ:
  మీరు చెప్పిన కోణం కొత్తదేమీ కాదు. ఎన్నాళ్ళ నుంచో మన సినిమాలలో అనాదిగా వస్తున్నదే. ముసలి హీరోల కుర్ర డాన్సులు, వాన పాటలు, అసహజమయిన ప్రాంతం పేరిట అత్యాచారాలు, తన్నే కామెడీలు అన్నీ ఇన్నాళ్ళుగా తెలుగు ఇండస్ట్రీ భరిస్తూ వస్తున్నదే.
  మరి ఇవన్నీ కూడా మాసు జనాలకి ఇష్టమే. అలాగని వీటినే కొనసాగిస్తే వెగటు పుట్టిస్తుంది.
  కాదనను పూర్తి శాతం నిజమే ఉండాలని నేననట్లేదు. సినిమాలన్నాకా కొద్దిగా అతిశయం ఎప్పుడూ ఉంటుంది. అది మరీ అతి అయితేనే సమస్యలన్నీ.
  ఇక కంప్యూటర్ల విషయానికొస్తే సాధారణ వీక్షకుడికి ఆ చిన్న సన్నివేశంలో ఎలా చూపించినా పెద్ద తేడా ఉండదు . కానీ తెలిసున్న జనాలకి ఎలా ఉంటుందో నేను చెప్పాల్సిన అవసరం లేదు.
  అందుకని మనం సాధ్యమయినంత వరకూ సహజంగా చూపించడానికి ప్రయత్నిస్తేనే అందమని నా అభిప్రాయం.

  మీ కోణం కాదనట్లేదు.

 26. సిరి గారూ:మీరు చెప్పిన కోణం కొత్తదేమీ కాదు. ఎన్నాళ్ళ నుంచో మన సినిమాలలో అనాదిగా వస్తున్నదే. ముసలి హీరోల కుర్ర డాన్సులు, వాన పాటలు, అసహజమయిన ప్రాంతం పేరిట అత్యాచారాలు, తన్నే కామెడీలు అన్నీ ఇన్నాళ్ళుగా తెలుగు ఇండస్ట్రీ భరిస్తూ వస్తున్నదే.మరి ఇవన్నీ కూడా మాసు జనాలకి ఇష్టమే. అలాగని వీటినే కొనసాగిస్తే వెగటు పుట్టిస్తుంది.కాదనను పూర్తి శాతం నిజమే ఉండాలని నేననట్లేదు. సినిమాలన్నాకా కొద్దిగా అతిశయం ఎప్పుడూ ఉంటుంది. అది మరీ అతి అయితేనే సమస్యలన్నీ.ఇక కంప్యూటర్ల విషయానికొస్తే సాధారణ వీక్షకుడికి ఆ చిన్న సన్నివేశంలో ఎలా చూపించినా పెద్ద తేడా ఉండదు . కానీ తెలిసున్న జనాలకి ఎలా ఉంటుందో నేను చెప్పాల్సిన అవసరం లేదు.అందుకని మనం సాధ్యమయినంత వరకూ సహజంగా చూపించడానికి ప్రయత్నిస్తేనే అందమని నా అభిప్రాయం.మీ కోణం కాదనట్లేదు.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: