మే 26, 2007

తెలుగు ఎనేబ్లర్…

Posted in టెక్నాలజీ, తెలుగు ఎనేబ్లర్, యూటిలిటీ వద్ద 10:35 ఉద. ద్వారా Praveen Garlapati

జనాలకు తమ తమ సిస్టం లలో తెలుగు ని ఎనేబుల్ చెయ్యమని చెప్పేకంటే మనమే ఒక చిన్న యూటిలిటీ తయారు ద్వారా తెలుగు ని ఎనేబుల్ చెయ్యాలని మొన్న బెంగుళూరు బ్లాగర్లం కలిసినప్పుడు అనుకున్నాము.
అందుకని మొదటి విడతగా విండోస్ (xp, 95, 98, ME, 2000) లో తెలుగు ని ఎనేబుల్ చెయ్యడానికి యూటిలిటీలను తయారు చేసాను.

వీటిని ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీటిని మీ సిస్టం మీద పరిగెత్తించి పని చేస్తుందో లేదో చెప్పగలరు. (ఇవి ఇంకా ఆల్ఫా వర్షన్ లో ఉన్నాయి. కాబట్టి పరిగెత్తించే ముందు తగు జాగ్రత్తలు తీసుకోవలసినదిగా మనవి. మీ పని ని దాచుకోండి.)

విండోస్ xp యూటిలిటీ
విండోస్ ఇతర వర్షన్లకోసం యూటిలిటీ

మీ బగ్గులు, తిట్లు బ్లాగు కామెంట్లలో పెట్టగలరు. 🙂 ఇంకెలాగయినా అభివృద్ధి పరచాలంటే సూచించగలరు.

గమనికలు:

విండోస్ xp యూటిలిటీ లో చిక్కులు:

* ఒక వేళ ఆల్రడీ మీ సిస్టం లో గనక తెలుగు కి సపోర్ట్ ఎనేబుల్ చేసుంటే గనక ఇది దానిని డిసేబుల్ చేస్తుంది. మళ్ళీ పరిగెత్తిస్తే ఎనేబుల్ చేస్తుంది. అంటే పరిగెత్తించిన ప్రతీ సారీ ఆప్షన్ ఫ్లిప్ అవుతుందన్నమాట.
సరి చెయ్యడం ఇప్పటికయితే కుదరలేదు. ఖాళీ దొరికితే చేస్తాను.
– సరయింది. కొత్త వర్షన్ అదే లంకె నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు..

* ఇంకోటి తెలుగు ఎనేబుల్ చేసిన తరువాత సిస్టం రీబూట్ చెయ్యాలా వద్దా అని అడుగుతుంది. నేను రీబూట్ చెయ్యట్లేదు (కావాలంటే చెయ్యవచ్చు). యూజర్ నే రీబూట్ చెయ్యమని అడుగుతున్నాను. ఇది ఓకే అనుకుంట ???

* కొన్ని సార్లు పని చెయ్యకపోవడం గమనించాను. (స్టక్ అవుతుంది.)

విండోస్ ఇతర వర్షన్ల యూటిలిటీ లో చిక్కులు:

* నా దగ్గర ఈ వర్షన్లు లేవు కాబట్టి ఇది టెస్ట్ చెయ్యబడలేదు. కానీ సింపుల్ ఫైల్ కాపీ కాబట్టి పెద్దగా ఇబ్బందులు ఎదురు కాకపోవచ్చు. (దీనిని జిప్ ఫైల్ గా కాక ఒక ఎక్స్ట్రాక్ట్ గా చేసే ఆలోచన ఉంది. ఒకట్రెండు రోజుల్లో అదీ తయారవుద్ది.)

పెద్దగా కంప్యూటర్ల గురించి తెలీని వారికోసం ఈ యూటిలిటీలని ఎలా వాడాలో తొందర్లోనే ఒక పేజీ పెడతాను.

24 వ్యాఖ్యలు »

 1. మన్యవ said,

  wow great!!

  ఇది మన తెలుగు పట్టీ #installer# తో ఇంటెగ్రేట్ చేస్తే ఎలా వుంటుంది?

 2. wow great!! ఇది మన తెలుగు పట్టీ #installer# తో ఇంటెగ్రేట్ చేస్తే ఎలా వుంటుంది?

 3. ప్రసాద్ said,

  నేను చెప్పాలనుకున్నదే మన్యవ గారు చెప్పేశారు.

  –ప్రసాద్
  http://blog.charasala.com

 4. నేను చెప్పాలనుకున్నదే మన్యవ గారు చెప్పేశారు.–ప్రసాద్http://blog.charasala.com

 5. ప్రవీణ్ గార్లపాటి said,

  మన్యవ గారూ, చరసాల గారూ:
  తప్పకుండా నండీ…
  ముందు ఇది స్టేబుల్ అయ్యాక దీనిని ఎలా ఉపయోగించాలో, ఎలా ఇంటిగ్రేట్ చెయ్యాలో తప్పకుండా చూద్దాము.

 6. మన్యవ గారూ, చరసాల గారూ: తప్పకుండా నండీ…ముందు ఇది స్టేబుల్ అయ్యాక దీనిని ఎలా ఉపయోగించాలో, ఎలా ఇంటిగ్రేట్ చెయ్యాలో తప్పకుండా చూద్దాము.

 7. రాకేశ్వర రావు said,

  గ్రేట్ జాబ్
  బెంగుశూరు శైలిలో చెప్పాలంటే, థాంక్సో 🙂

 8. గ్రేట్ జాబ్బెంగుశూరు శైలిలో చెప్పాలంటే, థాంక్సో 🙂

 9. రానారె said,

  బహళ ప్రశస్తవాద కెలస మాడిరువ నమ్మ ప్రవీణవరిగె అభినందనగళు. తుంబ ఉపయోగకర సాధన ఇదు. ఇదన్ను స్వల్ప స్థిరీకరిసి.

 10. బహళ ప్రశస్తవాద కెలస మాడిరువ నమ్మ ప్రవీణవరిగె అభినందనగళు. తుంబ ఉపయోగకర సాధన ఇదు. ఇదన్ను స్వల్ప స్థిరీకరిసి.

 11. ప్రవీణ్ గార్లపాటి said,

  రాకేశ్వర రావు గారూ:
  థాంక్సో నే 🙂

  రానారె:
  త్వరితవాగి ఇదున్ను స్థిరీకరిసి రిలీజ్ మాడ్తిని. స్వల్ప సమయ బేకు. 🙂

 12. రాకేశ్వర రావు గారూ:థాంక్సో నే :)రానారె:త్వరితవాగి ఇదున్ను స్థిరీకరిసి రిలీజ్ మాడ్తిని. స్వల్ప సమయ బేకు. 🙂

 13. శోధన said,

  కలుగు (కన్నడ in తెలుగు) బాగుంది 🙂

 14. శోధన said,

  కలుగు (కన్నడ in తెలుగు) బాగుంది 🙂

 15. Anonymous said,

  హయ్ ప్రవీణ్,
  మేము మీరు చెప్పినట్టుగానె మీ s/w install chesamu, kaani miglilina anni regional fonts kooda clear ayyipoyayi…now iam not able to see telugu font atall in my computer. Please point me to the solution.

 16. Anonymous said,

  హయ్ ప్రవీణ్, మేము మీరు చెప్పినట్టుగానె మీ s/w install chesamu, kaani miglilina anni regional fonts kooda clear ayyipoyayi…now iam not able to see telugu font atall in my computer. Please point me to the solution.

 17. ప్రవీణ్ గార్లపాటి said,

  anonymous :

  అవునండీ ఇంతకు ముందు వర్షన్లో అదే సమస్య… అల్రడీ తెలుగు సపోర్ట్ ఎనేబుల్ అయి ఉంటే ఇది దానిని డిసేబుల్ చేస్తుంది. అందుకే నేను నా టపాలో దాని గురించి గమనిక రాశాను.

  నా తప్పే. ఇప్పుడు సరి చేసాను.

  మీకు మళ్ళీ అన్ని లాంగ్వేజస్ కనిపించాలంటె ఇంకోసారి అదే యూటిలిటీ ని రన్ చెయ్యండి.

  అది ఎనేబుల్ చేస్తుంది.

  మీకు కలిగిన అసౌకర్యానికి క్షమించాలి.

 18. anonymous :అవునండీ ఇంతకు ముందు వర్షన్లో అదే సమస్య… అల్రడీ తెలుగు సపోర్ట్ ఎనేబుల్ అయి ఉంటే ఇది దానిని డిసేబుల్ చేస్తుంది. అందుకే నేను నా టపాలో దాని గురించి గమనిక రాశాను. నా తప్పే. ఇప్పుడు సరి చేసాను.మీకు మళ్ళీ అన్ని లాంగ్వేజస్ కనిపించాలంటె ఇంకోసారి అదే యూటిలిటీ ని రన్ చెయ్యండి. అది ఎనేబుల్ చేస్తుంది.మీకు కలిగిన అసౌకర్యానికి క్షమించాలి.

 19. రానారె said,

  శోధన సుధాకర్ ఒక బెదిరింపు లేఖ పంపించారే, దానిగురించి ఏమిటి మీ ఆలోచన? గోలీమారేటట్లైతే, దీన్ని మన శోధకుడే తయారుచేసిన తెలుగుపట్టీలోకూడా ఉంచితే బాగుంటుంది. పట్టీకి తగిన ప్రాచుర్యం ఇంకా లభించాల్సి ఉంది.

 20. శోధన సుధాకర్ ఒక బెదిరింపు లేఖ పంపించారే, దానిగురించి ఏమిటి మీ ఆలోచన? గోలీమారేటట్లైతే, దీన్ని మన శోధకుడే తయారుచేసిన తెలుగుపట్టీలోకూడా ఉంచితే బాగుంటుంది. పట్టీకి తగిన ప్రాచుర్యం ఇంకా లభించాల్సి ఉంది.

 21. ప్రవీణ్ గార్లపాటి said,

  రానారె:

  ఇప్పుడున్న XP యూటిలిటీ ఉన్నదున్నట్టుగా పని చేస్తే సుధాకర్ గారు చెప్పిన ప్రాబ్లం రాదు. ఇది పని చెయ్యక DLLs, ఫాంట్స్ కాపీ చెయ్యవలసి వస్తేనే ఆ సమస్య.

  ఒక సారి పని చేస్తుందని కన్‌ఫర్మ్ చేసుకుంటే తర్వాత ఎలా ఇంటిగ్రేట్ చెయ్యాలో నిర్ణయించుకుందాము. ఏమంటావు ?

 22. రానారె:ఇప్పుడున్న XP యూటిలిటీ ఉన్నదున్నట్టుగా పని చేస్తే సుధాకర్ గారు చెప్పిన ప్రాబ్లం రాదు. ఇది పని చెయ్యక DLLs, ఫాంట్స్ కాపీ చెయ్యవలసి వస్తేనే ఆ సమస్య.ఒక సారి పని చేస్తుందని కన్‌ఫర్మ్ చేసుకుంటే తర్వాత ఎలా ఇంటిగ్రేట్ చెయ్యాలో నిర్ణయించుకుందాము. ఏమంటావు ?

 23. రానారె said,

  నువ్వే ఏదో ఒకటి అనేదాక నేనేమీ అనను 🙂

 24. నువ్వే ఏదో ఒకటి అనేదాక నేనేమీ అనను 🙂


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: