మే 30, 2007

మెమెంటో, బటర్ఫ్లై ఎఫెక్ట్ …

Posted in సినిమా, సినిమాలు వద్ద 5:45 సా. ద్వారా Praveen Garlapati

అబ్బో ఏంటో సడన్ గా పని తెగ పెరిగిపోయింది. ఎక్కడా తీరిక దొరకట్లేదు.

అయినా సినిమాలు వదులుతామా ? ఈ మధ్య చూసిన రెండు సినిమాలు

Memento: తమిళ్/తెలుగు లో వచ్చిన గజిని దీని కాపీ. షార్ట్ టర్మ్ మెమోరీ లాస్ తో బాధపడే ఒక వ్యక్తి కథ ఇది.

అన్నీ గుర్తు పెట్టుకోవడానికి తన వంటి మీద పచ్చబొట్లు పొడిపించుకుంటాడు, పోలరాయిడ్ తో ఫోటోలు తీసుకుంటుంటాడు. అలా ఉన్న ప్రదేశాలనీ, వ్యక్తులనీ గుర్తు పెట్టుకుంటుంటాడు.

సినిమా అంతా తన భార్యని చంపిన వారి మీద పగ తీర్చుకోవడానికి ఏం చేస్తాడొ అనే దాని గురించి.

సినిమా ఒక వ్యక్తి ని షూట్ చెయ్యడంతో మొదలవుతుంది. అక్కడ నుంచి అంతా వెనక్కి సాగుతుంది స్టోరీ. అంతకు ముందు ఏం జరిగింది, ఆ ముందు ఏం జరిగింది ఆ సీను అలా…

మొత్తం ఎలా తన భార్యని చంపిన వ్యక్తి ని షూట్ చేసాడో అని కథ నడుస్తుంది.

కాకపోతే మన తమిళ్ గజినీ లో లేని మంచి ట్విస్ట్ చివర్లో ఇచ్చాడు. ఏంటి అని చెప్పే కంటే చూస్తేనే బాగుంటుంది.

నా రేటింగ్: 4/5

———————————————————————————————————————————————————

Butterfly Effect: ఇంతకు ముందు చూసిన సినిమానే. మళ్ళీ ఓ సారి లుక్కేసా.
ఒక చిన్న మార్పు ఎలాంటి ప్రళయం సృష్టించగలదో అనే కాన్సెప్ట్ మీద నడుస్తుంది ఈ సినిమా.

సినిమా మొదట్లో ఏం చెబుతాడంటే ప్రపంచంలో ఒక చోట ఒక సీతకోకచిలుక రెక్కలాడిస్తే ఇంకో చోట దాని వల్ల ప్రళయం వస్తుంది అని.

భలే ట్విస్ట్లతో సాగుతుంది ఈ సినిమా.

హాస్పిటల్ లో ఓ పారిపోతున్న వ్యక్తి కంగారుగా రాస్తుంటాడు. అలా మొదలవుతుంది సినిమా.

తర్వాత కథ ఆ వ్యక్తి చిన్నప్పుడు జరిగిన సంఘటన వైపు మరలుతుంది. అతనికి అప్పుడప్పుడూ సడన్ గా మైండ్ బ్లాక్ అయిపోయి ఆ సమయం లో ఏం జరిగిందో గుర్తుండదు. వాళ్ళ నాన్న కి కూడా అలాంటి వ్యాధే ఉండేదని తరవాత తెలుస్తుంది. (మెంటల్ హాస్పిటల్ లో ఉంటాడు)

డాక్టర్ అతడిని జర్నల్ రాయమని చెబుతాడు సంఘటనలన్నీ పూస గుచ్చినట్టుగా.

తర్వాత కాలేజీ లో కి సీను మారుతుంది. సడన్ గా చిన్ననాటి జర్నళ్ళు తీసి చదవడంతో అతడికి పాత సంగతులన్నీ గుర్తుకొస్తాయి. కానీ అక్కడక్కడా ఏం జరిగిందో మాత్రం గుర్తుండదు. అందుకని చిన్ననాటి స్నేహితులను కలిసి అడగడం మొదలెడతాడు. వారందరూ దయనీయ స్థితిలో ఉంటారు. తన గర్ల్ ఫ్రెండ్ ని కలిసి మాట్లాడతాడు. ఆమె కి పాత సంగతులు గుర్తుకొచ్చి సూయిసైడ్ చేసుకుంటుంది.

అతనికి ఆ తరవాత తెలుస్తుంది తనకి ఆ జర్నళ్ళు చదవడం ద్వారా పాత కాలానికి వెళ్ళి అక్కడ జరిగింది మార్చగలిగే శక్తి ఉందని.

అప్పటి నుంచీ ఆ చిన్న కాలంలో జరిగిన సంఘటని మార్చాలని చూస్తాడు. ఆ సంఘటని మార్చడం ద్వారా తన గర్ల్ ఫ్రెండ్ ని కాపాడుకోవచ్చు, జరిగిన తప్పులని సరి దిద్దుకోవచ్చు అని.
కానీ అలా ఆ పాత సంఘటనని మార్చిన ప్రతీసారీ ఉన్న పరిస్థితి కంటే ఘోరమయిన పరిస్థితిలో లాండ్ అవుతాడు. అలా మూడు నాలుగు సార్లు ప్రయత్నిస్తాడు. ఆఖరికి అతనిని ఒక మెంటల్ ఇన్స్టిట్యూషన్లో పెట్టి ట్రీట్మెంట్ ఇస్తుంటారు, అక్కడ డాక్టర్ ని జర్నళ్ళు ఇవ్వమంటాడు తిరిగి మార్చడానికి, కానీ డాక్టర్ జర్నళ్ళు లాంటివేవీ లేవు, అన్నీ నువ్వు ఊహించుకుంటున్నావు అని చెప్పడంతో అక్కడ నుంచి పారిపోతాడు. తన చిన్ననాటి వీడియో దొరకడంతో మళ్ళీ పాత జ్ఞాపకాలలోకి వెళ్ళి తన గర్ల్ ఫ్రెండ్ ని భయపెట్టి తనంటే భయం కలిగించేలా ప్రవర్తించి దూరమయిపోతాడు.

దాంతో సినిమా ముగుస్తుంది.

అబ్బో మొదటి సారి చూసిన వారెవరికయినా తల తిరుగుతుంది.

కథనంలో లోపాలున్నా వెరయిటీ కి మార్కులివ్వచ్చు.

నా రేటింగ్: 4/5

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: