మే 31, 2007

అడోబ్ అపోలో, మైక్రోసాఫ్ట్ సిల్వర్లైట్, JavaFX …

Posted in అడోబ్ అపోలో, మైక్రోసాఫ్ట్ సిల్వర, JavaFX వద్ద 8:31 సా. ద్వారా Praveen Garlapati

యూజర్ ఇంటర్ఫేస్ యొక్క ప్రాముఖ్యం RIA (Rich Internet Applications) రావడం తో బాగా పెరిగింది.

బాగా ఇంటరాక్టీవ్ గా ఉండే వెబ్‌సైట్ లు, ఆకట్టుకునే విధమయిన అజాక్స్, జావాస్క్రిప్ట్ బేస్డ్ UI లు, మాషప్ లు సాధారణమయిపోయాయి.

ఇప్పుడు కొత్త జనరేషన్ టెక్నాలజీలకు అంకురార్పణ జరుగుతుంది. అవే డెస్క్‌టాప్ మీద వెబ్ అప్లికేషన్లని మాష్ చెయ్యగలిగే విధానం కల్పించే అడోబ్ వారి అపోలో, మైక్రోసాఫ్ట్ వారి సిల్వర్లైట్, JavaFX మొదలయినవి.

అడోబ్ అపోలో: ఇది అడోబ్ వారి నుండి విడుదలయిన కొత్త ప్రాడక్ట్. ఇంత వరకూ మనం వెబ్ అప్లికేషన్లను విడిగా, డెస్క్‌టాప్ అప్లికేషన్లను విడిగా చూస్తూ వచ్చాము. కానీ ఈ రిలీజ్ తో అడోబ్ వారు రెండిటినీ కలిపేందుకు ప్రయత్నిస్తున్నారు. అంటే మీరు రాసిన జావాస్క్రిప్ట్, అజాక్స్ కోడ్ ఇందులో కూడా రన్ అవుతుందన్నమాట. ఇంతవరకూ కేవలం బ్రౌజర్ కే పరిమితమయిన టెక్నాలజీలను ఇప్పుడు డెస్క్‌టాప్ మీద కి తీసుకొస్తామని చెబుతున్నారు.
వీరి ఫ్లాష్ టెక్నాలజీ ఎంత ప్రచారం పొందిందో మనకు తెలిసిందే. మరి ఈ టెక్నాలజీ కూడా అదే రేంజ్ లో హిట్టవుతుందో లేదో వేచి చూడాల్సిందే.

మైక్రోసాఫ్ట్ సిల్వర్లైట్: ఇంతవరకూ జావాస్క్రిప్ట్, ఫ్లాష్ మొదలయినవి మాత్రమే RIA లకి వయబుల్ ఆల్టర్నేటీవ్స్ గా ఉండేవి. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ సిల్వర్లైట్ రిలీజ్తో వీటికి కాంపిటీషన్ గా వస్తుంది. ఇంతవరకూ డేస్క్టాప్ అప్లికేషన్ల మీదే కాన్సంట్రేట్ చేసిన మైక్రోసాఫ్ట్ ఇప్పుడు వెబ్ మీద ఉండే పొటెన్షియల్ రియలైజ్ అయ్యి ఆ దిశలో ఎన్నో కొత్త టెక్నాలజీలు, అప్లికేషన్లూ రిలీజ్ చేస్తుంది. (popfly లాంటి మాషప్ అప్లికేషన్లూ, విండోస్ లైవ్, వెబ్ స్పేసస్ మొదలయినవి…) ఈ రిలీజ్ తో ఫ్లాష్ సంపాదించిన క్రేజ్ ని సంపాదించి దానిని కొట్టాలన్నది మైక్రోసాఫ్ట్ లక్ష్యం లా కనపడుతుంది. ఎలాగూ విండోస్ తో నేటీవ్ ఇంటిగ్రేషన్ ఉండనే ఉంది కాబట్టి మంచి లుక్ అండ్ ఫీల్ ఇవ్వచ్చు. వేచి చూడాలి ఎంతలా అడాప్ట్ అవుతుందో.

JavaFX: జావా లో ఎప్పటి నుంచో వీక్ లింక్ ప్రెజంటేషనే. ఇప్పుడు ఈ JavaFX రిలీజ్ తో ఆ ప్రెజంటేషన్ ని టార్గెట్ చేద్దామని చూస్తుంది సన్. వారికున్న జావా రన్ టైం మీదే ఇది కూడా రన్ అవుతుంది. కాబట్టి రీచ్ కోసం పెద్ద ఇబ్బందులు లేవు.వీరి ప్రకారం ఈ JavaFX వివిధ రకాలయిన క్లైంట్స్ మీద సీంలెస్ గా పని చేస్తుంది. కాబట్టి దీనితో నయినా అది సరవుతుందేమో చూడాలి.

పై వాటిలొ గమనించాల్సినవి:

మైక్రోసాఫ్ట్ సిల్వర్లైట్ విండోస్, మరియు మాక్ ప్లాట్ఫాం ల మీదే లభ్యం. లినక్స్ మీద కాదు. అడోబ్ అపోలో కూడా కానీ ఇది తొందరలోనే లినక్స్ వర్షన్ రిలీజ్ చెయ్యనుంది (ఫ్లాష్ అల్రడీ ఉంది). ఇక జావా ఎలాగూ క్రాస్ ప్లాట్ఫాం కాబట్టి దానికి సమస్యలు లేవు.
ఇకపోతే అన్నిటికీ ఈజీగా కోడ్ చెయ్యగలిగే ఇంటర్ఫేస్లున్నాయి.

ఫ్యూచర్ ఈజ్ ఎక్సైటింగ్.

ప్రకటనలు

14 వ్యాఖ్యలు »

  1. రాజు సైకం said,

    మంచి పోస్ట్… definitely future is exciting…

  2. మంచి పోస్ట్… definitely future is exciting…

  3. శోధన said,

    I see bright future for apollo and silverlight (Popfly is more than fantastic) but I doubt about JavaFx. Running things on JRE in web pages has been not so elegant since ages.

    I donno much about Apollo right now, but I can see some advantage in silverlight supporting Dynamic language runtime, which means you can run any .net language (python, perl , c#, VB.NET) to write scripts with in SilverLight (in contrast with action script for Flash or Apollo)

  4. శోధన said,

    I see bright future for apollo and silverlight (Popfly is more than fantastic) but I doubt about JavaFx. Running things on JRE in web pages has been not so elegant since ages. I donno much about Apollo right now, but I can see some advantage in silverlight supporting Dynamic language runtime, which means you can run any .net language (python, perl , c#, VB.NET) to write scripts with in SilverLight (in contrast with action script for Flash or Apollo)

  5. Anonymous said,

    మంచి సమాచారం. అడోబ్ కాదు అడోబీ అని పలకడం, తెలుగులో రాయడం సరి అయినది.

  6. Anonymous said,

    మంచి సమాచారం. అడోబ్ కాదు అడోబీ అని పలకడం, తెలుగులో రాయడం సరి అయినది.

  7. ప్రవీణ్ గార్లపాటి said,

    రాజు గారూ: థాంకులు

    శోధన గారూ: అపోలో మిగతా వెబ్ టెక్నాలజీలను కూడా సపోర్ట్ చేస్తుంది. దానితోనే అది ఎంతో వైడ్ ఆక్సెప్టన్స్ సాధించేస్తుంది అని నా అభిప్రాయం.
    ఇక సిల్వర్లైట్ కి .net ప్లాట్ఫాం తప్పకుండా ఊతమిచ్చేదే. కానీ .net ప్లాట్ఫామే లినక్స్ లో లేకపోవడం ఒక దెబ్బే. అందుకని అది పూర్తి క్రాస్ ప్లాట్ఫాం కాలేకపోతుంది.

    అనానిమస్ గారూ: పాయింట్ నోటెడ్. సరి చేసుకుంటా.

  8. రాజు గారూ: థాంకులుశోధన గారూ: అపోలో మిగతా వెబ్ టెక్నాలజీలను కూడా సపోర్ట్ చేస్తుంది. దానితోనే అది ఎంతో వైడ్ ఆక్సెప్టన్స్ సాధించేస్తుంది అని నా అభిప్రాయం.ఇక సిల్వర్లైట్ కి .net ప్లాట్ఫాం తప్పకుండా ఊతమిచ్చేదే. కానీ .net ప్లాట్ఫామే లినక్స్ లో లేకపోవడం ఒక దెబ్బే. అందుకని అది పూర్తి క్రాస్ ప్లాట్ఫాం కాలేకపోతుంది.అనానిమస్ గారూ: పాయింట్ నోటెడ్. సరి చేసుకుంటా.

  9. Sudhakar said,

    చాలా రోజుల తర్వాత ఈ టపా చూసా. కొన్ని చెప్పాల్సినవున్నాయి.
    ౦౧. .net లినక్స్కు కూడా లభ్యం. ఎందుకంటే అది ఒక ECMA Standard కనుక. మోనో అనే పేరుతో లభ్యం.

    ౦౨. సిల్వర్ లైట్ లినక్స్ లో చక్కగా పని చేస్తుంది. ఫెడోరా మీద ఈ మధ్యనే ఒక డెమో కూడా చూసా.

  10. Sudhakar said,

    చాలా రోజుల తర్వాత ఈ టపా చూసా. కొన్ని చెప్పాల్సినవున్నాయి. ౦౧. .net లినక్స్కు కూడా లభ్యం. ఎందుకంటే అది ఒక ECMA Standard కనుక. మోనో అనే పేరుతో లభ్యం.౦౨. సిల్వర్ లైట్ లినక్స్ లో చక్కగా పని చేస్తుంది. ఫెడోరా మీద ఈ మధ్యనే ఒక డెమో కూడా చూసా.

  11. ప్రవీణ్ గార్లపాటి said,

    అవును మోనో గురించి వివరాలు నాకు తెలుసు కానీ ఆఫీషియల్ గా సపోర్టు లేదు కదా.
    అదీ కాక నా స్నేహితుల ద్వారా మోనో బగ్గీ అని విన్నాను. నే వాడలేదు కనుక నాకు తెలీదు.
    ECMA స్టాండర్డ్స్ గురించి నాకు తెలీదు. ఇప్పుడే చదివాను. థాంక్స్.

    ఇక సిల్వర్‌లైట్ లినక్స్ కోసం లభ్యం కాదు. ఇక్కడ
    చూడండి.
    కాకపోతే మోనో ప్రాజెక్టు వారే సిల్వర్‌లైటు ని లినక్సు కి పోర్టు చేయదలచారని ఇక్కడ చదివాను. కాబట్టి మీరు చూసింది అదేనేమో ?

  12. అవును మోనో గురించి వివరాలు నాకు తెలుసు కానీ ఆఫీషియల్ గా సపోర్టు లేదు కదా. అదీ కాక నా స్నేహితుల ద్వారా మోనో బగ్గీ అని విన్నాను. నే వాడలేదు కనుక నాకు తెలీదు. ECMA స్టాండర్డ్స్ గురించి నాకు తెలీదు. ఇప్పుడే చదివాను. థాంక్స్.ఇక సిల్వర్‌లైట్ లినక్స్ కోసం లభ్యం కాదు. ఇక్కడ చూడండి.కాకపోతే మోనో ప్రాజెక్టు వారే సిల్వర్‌లైటు ని లినక్సు కి పోర్టు చేయదలచారని ఇక్కడ చదివాను. కాబట్టి మీరు చూసింది అదేనేమో ?

  13. Sudhakar said,

    ఓపెన్ స్టాండర్డ్ అన్నాకా సపోర్టు గురించి ఎలా మాట్లాడుతాం. లినస్ టోర్వాల్డ్ లినక్సుకు సపోర్టు ఇస్తున్నాడా? 🙂

    ఇక సిల్వర్ లైట్ లినక్స్ మీద : ఇక్కడ చదవండి
    http://www.mono-project.com/Moonlight

    మోనో బగ్గీ అని ఎవరన్నారో తెలీదు కానీ, పెద్ద పెద్ద అప్లికేషన్లు మోనో మీద నడుస్తున్నాయ్.
    http://www.mono-project.com/Software

    మోనో కమర్షియల్ సపోర్టుతో వస్తుంది.

  14. Sudhakar said,

    ఓపెన్ స్టాండర్డ్ అన్నాకా సపోర్టు గురించి ఎలా మాట్లాడుతాం. లినస్ టోర్వాల్డ్ లినక్సుకు సపోర్టు ఇస్తున్నాడా? :-)ఇక సిల్వర్ లైట్ లినక్స్ మీద : ఇక్కడ చదవండి http://www.mono-project.com/Moonlightమోనో బగ్గీ అని ఎవరన్నారో తెలీదు కానీ, పెద్ద పెద్ద అప్లికేషన్లు మోనో మీద నడుస్తున్నాయ్.http://www.mono-project.com/Software మోనో కమర్షియల్ సపోర్టుతో వస్తుంది.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: