ఏమిటిది ???

మనిషి జీవితానికి ఓ దిశా నిర్దేశం అవసరం అని అందరూ చెబుతారు.

ఇది అంటూ ఒకటి మన జీవితంలో సాధించాలి అని అంటారు. కానీ నాకు ఎంత ఆలోచించినా ఏదీ తట్టదే.

నాకూ లక్ష్యాలు ఉంటాయి, కానీ అవన్నీ చిన్నవి, అప్పటికప్పుడు మారుతూ ఉంటాయి కూడా. చిన్నప్పుడు క్రికెటర్ అవుదామనుకున్నా, తరవాత రియాలిటీ తెలిసిన తరవాత ఇంజినీర్ అవుదామనుకున్నా. అదయిన తరవాత ఉద్యోగం సాధించాలి, మళ్ళీ మంచి ఉద్యోగం సాధించాలి, మంచి పని చెయ్యాలి, జీవితం లో సెటిల్ అవ్వాలి. ఒక ఇల్లు కొనుక్కోవాలి, ఒక బైక్ కొనుక్కోవాలి, ఒక కారు కొనుక్కోవాలి (ఇంకా పెళ్ళి ఆ లిస్టులో లేదు లేండి.)

ఇలా ఎన్ని ఆలోచించినా అన్నీ చిన్న చిన్న లక్ష్యాలు, అదీ నాకు సంబంధించినవే, లేదా నా తల్లి దండ్రులు, బంధువులకి సంబంధించినవే. మరి అందరూ నిన్ను దాటి ఆలోచించాలి అంటారే, అది ఎలా ?

నాకు ఇతరుల గురించి పట్టదా అంటే అందరి గురించీ ఆలోచిస్తాను, స్నేహితులకి సహాయం చేస్తాను, ఎవరికయినా అవసరముంటే ఆదుకుంటాను, నాకు సాధ్యమయినంత వరకూ అన్నీ చేస్తాను. కానీ చివరికి చూస్తే ఎవరన్నా నువ్వేం చేసావోయ్ అని అడిగితే నా దగ్గర సమాధానం ఉండదు.

నాకెప్పుడూ జీవితం ఎంజాయ్ చెయ్యాలని ఉంటుంది, నాకు నచ్చినవి చెయ్యాలని ఉంటుంది, హాపీ గా ఉండాలని ఉంటుంది. ఎక్కువగా, అతిగా ఆలోచించాలని ఉండదు. మరి ఎక్కడ చూసినా, ఎవరు చెప్పినా వీటన్నిటి కంటే పైన ఉన్నవాటి గురించి ఆలోచించాలని చెబుతారు కదా ? 

అంటే నేను తప్పు దారిలో ఉన్నానా ? ఏమీ అర్థం కావట్లా… 

35 thoughts on “ఏమిటిది ???

  1. తప్పు కాదు కాని, చాలా మంది మీ ఆలోచనా పరిధి లోకే వస్తారని అభిప్రాయం..ఏమి కావాలో తెలియదు.. మార్కేట్లో ఏ జాబ్ కి ఎక్కువ జీతం వస్తుందో అదే చెయ్యాలనుకొంటారు.. కాని అందులో సాటిస్ఫాక్షను ఉండదు.. దీనికి తోడు, మన చుట్టు పక్కల ప్రభావం… మొత్తం అంతా గందర గోళం గా ఉంటుంది. మనం ఏమి కావాలనుకొంటున్నాం మరియు మనం దేన్ని enjoy చెయ్యగలం..చాలా లేట్ గా అర్ధం అవుతుంది..ఎందుకంటే మీకు మీరు అర్ధం అయ్యేసరికి టైమ్ పడుతుందని నా అభిప్రాయం…కాని ఆ టైమ్ కి మీరు సెటిల్ అయిపోయి ఉంటారు.. I think its common for most of us(ordinary folks like us, unless your parents are politicians/actors/doctors/contractors)

  2. తప్పు కాదు కాని, చాలా మంది మీ ఆలోచనా పరిధి లోకే వస్తారని అభిప్రాయం..ఏమి కావాలో తెలియదు.. మార్కేట్లో ఏ జాబ్ కి ఎక్కువ జీతం వస్తుందో అదే చెయ్యాలనుకొంటారు.. కాని అందులో సాటిస్ఫాక్షను ఉండదు.. దీనికి తోడు, మన చుట్టు పక్కల ప్రభావం… మొత్తం అంతా గందర గోళం గా ఉంటుంది. మనం ఏమి కావాలనుకొంటున్నాం మరియు మనం దేన్ని enjoy చెయ్యగలం..చాలా లేట్ గా అర్ధం అవుతుంది..ఎందుకంటే మీకు మీరు అర్ధం అయ్యేసరికి టైమ్ పడుతుందని నా అభిప్రాయం…కాని ఆ టైమ్ కి మీరు సెటిల్ అయిపోయి ఉంటారు.. I think its common for most of us(ordinary folks like us, unless your parents are politicians/actors/doctors/contractors)

  3. తప్పు దారేం లేదు. అసలేదో గమ్యం ఉంటుంది,దానికో దారి ఉంటుంది, ఆ దారిని మనం వెతుక్కోవాలి అనే ఆలోచన ఉండడం కూడా ఆనందించాల్సిన అభినందించాల్సిన విషయమే. మిమ్మల్ని ఆకర్షించిన ఉత్తేజ పరిచిన ఆ చిన్న చిన్న గమ్యాల వేపే ప్రయాణం సాగించండి .. అదే ఒక పెద్ద ప్రయాణం అని గ్రహిస్తారు.

  4. తప్పు దారేం లేదు. అసలేదో గమ్యం ఉంటుంది,దానికో దారి ఉంటుంది, ఆ దారిని మనం వెతుక్కోవాలి అనే ఆలోచన ఉండడం కూడా ఆనందించాల్సిన అభినందించాల్సిన విషయమే. మిమ్మల్ని ఆకర్షించిన ఉత్తేజ పరిచిన ఆ చిన్న చిన్న గమ్యాల వేపే ప్రయాణం సాగించండి .. అదే ఒక పెద్ద ప్రయాణం అని గ్రహిస్తారు.

  5. పెద్ద పెద్ద విషయాల గురించి ఆలోచించి చించి, నాకు మెథడు పోయింది.

    ఇప్పుడు ఎ ఉద్యోగం చేద్దామన్నా, ఇది మానవాళికి మంచిది కాదే అనే అనిపించి జీవితంలో నే motivation పోయింది. ఆ పక్కకు వెళ్ళోద్దు.

  6. పెద్ద పెద్ద విషయాల గురించి ఆలోచించి చించి, నాకు మెథడు పోయింది. ఇప్పుడు ఎ ఉద్యోగం చేద్దామన్నా, ఇది మానవాళికి మంచిది కాదే అనే అనిపించి జీవితంలో నే motivation పోయింది. ఆ పక్కకు వెళ్ళోద్దు.

  7. ప్రదీప్ గారూ:

    థాంక్స్. తప్పు కాదనుకోండి. అసలు మిగతా వారు ఎలా ఆలోచిస్తారు అని తెలుసుకుందామని కూడా ఉంది.

    ssv గారూ:

    నా కన్‌ఫ్యూజన్ జీవితం లోనే నండీ, జాబ్ లో కాదు. చాలా వరకు నాకేం కావాలో నాకు తెలుస్తుంది. కానీ ఒక అంతిమ లక్ష్యం అంటూ ఏదో ఉంటుంది కదా, అదే లేదు. దానిని సృష్టించుకోవడం ఎలాగో కూడా తెలియట్లేదు.
    మీరన్నట్టు అది తెలిసే వరకూ చాలా లేట్ అయిపోకూడదనే నా బాధ.

    కొత పాళీ గారూ:

    విజ్ఞులు మీకు తెలిసే ఉంటుంది. పాటించి చూస్తాను.

    రాకేశ్వర రావు గారూ:

    చెప్పినందుకు కృతజ్ఞతలు. మరీ అలాంటి ఆలోచనలలో లీనమయిపోను లేండి. కాకపోతే క్లారిఫికేషన్ అవసరం కదా.

  8. ప్రదీప్ గారూ:థాంక్స్. తప్పు కాదనుకోండి. అసలు మిగతా వారు ఎలా ఆలోచిస్తారు అని తెలుసుకుందామని కూడా ఉంది.ssv గారూ:నా కన్‌ఫ్యూజన్ జీవితం లోనే నండీ, జాబ్ లో కాదు. చాలా వరకు నాకేం కావాలో నాకు తెలుస్తుంది. కానీ ఒక అంతిమ లక్ష్యం అంటూ ఏదో ఉంటుంది కదా, అదే లేదు. దానిని సృష్టించుకోవడం ఎలాగో కూడా తెలియట్లేదు.మీరన్నట్టు అది తెలిసే వరకూ చాలా లేట్ అయిపోకూడదనే నా బాధ.కొత పాళీ గారూ:విజ్ఞులు మీకు తెలిసే ఉంటుంది. పాటించి చూస్తాను.రాకేశ్వర రావు గారూ:చెప్పినందుకు కృతజ్ఞతలు. మరీ అలాంటి ఆలోచనలలో లీనమయిపోను లేండి. కాకపోతే క్లారిఫికేషన్ అవసరం కదా.

  9. ప్రవీణ్
    నేను ఎప్పుడూ దీర్ఘకాలం గురించి ఎక్కువగా ఆలోచించలేదు. అనవసరం కూడా. వర్తమానంలో ఏం చేస్తున్నామో ముఖ్యం. వర్తమానంలో చేయాల్సిన విధులు వీలైనంత సిన్సియర్గా చేస్తే సరిపోతుందనుకొంటా. కానీ మనకంటో ఒక ఫిలాసఫీ ఉండాలి అంతే. మీరు వెళ్తున్న మార్గం సరైనదే. కొత్త పాళీ గారు చెప్పింది కరెక్ట్. దీర్ఘకాలపు ప్రయాణాలలో చిన్న చిన్న స్వల్పకాల ప్రయాణాలు ఒదిగి ఉంటాయి.

  10. ప్రవీణ్నేను ఎప్పుడూ దీర్ఘకాలం గురించి ఎక్కువగా ఆలోచించలేదు. అనవసరం కూడా. వర్తమానంలో ఏం చేస్తున్నామో ముఖ్యం. వర్తమానంలో చేయాల్సిన విధులు వీలైనంత సిన్సియర్గా చేస్తే సరిపోతుందనుకొంటా. కానీ మనకంటో ఒక ఫిలాసఫీ ఉండాలి అంతే. మీరు వెళ్తున్న మార్గం సరైనదే. కొత్త పాళీ గారు చెప్పింది కరెక్ట్. దీర్ఘకాలపు ప్రయాణాలలో చిన్న చిన్న స్వల్పకాల ప్రయాణాలు ఒదిగి ఉంటాయి.

  11. ప్రవీణ్, “వారు ఎలా ఆలోచిస్తారు అని తెలుసుకుందామని కూడా ఉంది.” అన్నావు కదా, నేను కూడా ఒక మిగతావాణ్ణి 🙂

    అసలువిషయానికొస్తే, ఈ విషయంలో ప్రస్తుతానికి నేను ఒక నిర్ణయానికి వచ్చాను (ముందుముందు అదికూడా మారవచ్చునేమో). ఏమిటంటే, నేను ఎక్కువదూరం ఆలోచించను. దీర్ఘకాలిక ప్రణాళికలు పెట్టుకోను. ఒకవేళ పెట్టుకోవలసివచ్చినా, దాన్ని సాధించితీరడమే నా జీవితలక్ష్యమన్నట్లు చిన్నచిన్న ఆనందాల్ని త్యాగం చేయను. ఇలా చేసి నా యవ్వనాన్ని కోల్పోయాను. ఆ బాధాకరమైన అనుభవం నుంచి నేను నేర్చుకున్నపాఠం – “ఏరోజుకారోజు కలిగే చిన్నచిన్న ఆనందాలే జీవితం. వాటిని త్యాగం చేసి పెద్ద లక్ష్యమేదో సాధించాలనుకోవడం మరణమే. అలా నేను ముఖ్యమైన కొన్ని సంవత్సరాలు మరణించాను.” మనకున్నదాంట్లో కొంత తీసి(మనసుకు నచ్చినంత) నిజంగా అవసరంలో ఉన్నవానికి తోడ్పడటం ఒక్కటి చాలు. అంతకుమించిన జీవిత పరమార్థం మరేమీలేదు. ఇంతకంటే ఉన్నతమైనదీ పైన ఉన్నదీ మరణం మాత్రమే అని నా అనుభవం. నా దృష్టిలో నువ్వు సరైన దారిలో ఉన్నట్లే. మనకున్న చిన్నచిన్న అభిరుచులే మనల్ని ఉన్నతులను చేస్తాయి. కానీ, ఇప్పుడు నీకొచ్చిన సందేహాలు మాత్రం వీడవు. నన్నుకూడా. ఇలా నిర్మాణాత్మకంగా ఆత్మావలోకనమూ పునర్విమర్శ చేసుకొనేవిధంగా ఆలోచించడం చాలా అవసరం. లేకపోతే “అంతా మనకు తెలుసు” అనే భావన నిండిపోయి, మన జీవయాత్రకూడా “అసమర్థుని జీవయాత్ర” అయిపోతుంది.

  12. ప్రవీణ్, “వారు ఎలా ఆలోచిస్తారు అని తెలుసుకుందామని కూడా ఉంది.” అన్నావు కదా, నేను కూడా ఒక మిగతావాణ్ణి :)అసలువిషయానికొస్తే, ఈ విషయంలో ప్రస్తుతానికి నేను ఒక నిర్ణయానికి వచ్చాను (ముందుముందు అదికూడా మారవచ్చునేమో). ఏమిటంటే, నేను ఎక్కువదూరం ఆలోచించను. దీర్ఘకాలిక ప్రణాళికలు పెట్టుకోను. ఒకవేళ పెట్టుకోవలసివచ్చినా, దాన్ని సాధించితీరడమే నా జీవితలక్ష్యమన్నట్లు చిన్నచిన్న ఆనందాల్ని త్యాగం చేయను. ఇలా చేసి నా యవ్వనాన్ని కోల్పోయాను. ఆ బాధాకరమైన అనుభవం నుంచి నేను నేర్చుకున్నపాఠం – “ఏరోజుకారోజు కలిగే చిన్నచిన్న ఆనందాలే జీవితం. వాటిని త్యాగం చేసి పెద్ద లక్ష్యమేదో సాధించాలనుకోవడం మరణమే. అలా నేను ముఖ్యమైన కొన్ని సంవత్సరాలు మరణించాను.” మనకున్నదాంట్లో కొంత తీసి(మనసుకు నచ్చినంత) నిజంగా అవసరంలో ఉన్నవానికి తోడ్పడటం ఒక్కటి చాలు. అంతకుమించిన జీవిత పరమార్థం మరేమీలేదు. ఇంతకంటే ఉన్నతమైనదీ పైన ఉన్నదీ మరణం మాత్రమే అని నా అనుభవం. నా దృష్టిలో నువ్వు సరైన దారిలో ఉన్నట్లే. మనకున్న చిన్నచిన్న అభిరుచులే మనల్ని ఉన్నతులను చేస్తాయి. కానీ, ఇప్పుడు నీకొచ్చిన సందేహాలు మాత్రం వీడవు. నన్నుకూడా. ఇలా నిర్మాణాత్మకంగా ఆత్మావలోకనమూ పునర్విమర్శ చేసుకొనేవిధంగా ఆలోచించడం చాలా అవసరం. లేకపోతే “అంతా మనకు తెలుసు” అనే భావన నిండిపోయి, మన జీవయాత్రకూడా “అసమర్థుని జీవయాత్ర” అయిపోతుంది.

  13. అసమర్థుని జీవయాత్ర – తెలుగులో తొలి మనో వైఙ్ఞానిక నవల. ఈ నవలలో విషయం అర్థంకాక…మనస్సు బరువయ్యి..మధ్యలోనే చదవటం వదిలేసిన వాళ్ళు వేల మంది ఉన్నారు. దీని గురించి నేను కొన్ని నెలల ముందు ఓ పోస్టు వ్రాశాను: http://gsnaveen.wordpress.com/2006/12/30/paapam_sitaramarao/

    ఇది చదివిన తరువాత ఇదే విషయం (నవల) గురించి బ్లాగు.

  14. అసమర్థుని జీవయాత్ర – తెలుగులో తొలి మనో వైఙ్ఞానిక నవల. ఈ నవలలో విషయం అర్థంకాక…మనస్సు బరువయ్యి..మధ్యలోనే చదవటం వదిలేసిన వాళ్ళు వేల మంది ఉన్నారు. దీని గురించి నేను కొన్ని నెలల ముందు ఓ పోస్టు వ్రాశాను: http://gsnaveen.wordpress.com/2006/12/30/paapam_sitaramarao/ఇది చదివిన తరువాత ఇదే విషయం (నవల) గురించి బ్లాగు.

  15. కొవ్వలి గారు:

    మీ అనుభావలు పంచుకున్నందుకు కృతజ్ఞతలు. సాధ్యమయినంత వరకూ ఆచరిస్తాను.
    అదీ కాక మీ ఇంతకు ముందు టపాలో ప్రస్తావించిన “ఎప్పుడూ ఆశించడమే” కాకుండా, “అప్పుడప్పుడూ అయినా” ఇవ్వడం మన జీవితంలో భాగం చేసుకోవాలి.

    రానారె:

    నీ లాంటి వారి అభిప్రాయాలు నా లాంటి వారికెంతయినా అవసరం.
    జీవితానికో పరమార్థం కావాలని నీ లాంటి వారిని చూస్తే అప్పుడప్పుడు కొందరికయినా అనిపించక మానదు.
    ఇకపోతే చిన్న చిన్న ఆనందాలని వదులుకోకూడదన్నది నిజం. అదీ కాక మనం సంతోషం గా ఉంటేనే ఎదుటి వారి గురించి ఆలోచించగలుగుతాము. అందరికీ చేతనయినంతలో సహాయం చెయ్యాలనుకోవడం మాత్రం గుర్తుంచుకోవాలి.
    అసమర్థుని జీవయాత్ర గురించి ఎంతో మంది చెప్పారు, కింద నవీన్ అన్న కూడా. దాన్ని త్వరలోనే దొరకబుచ్చుకుంటా. (యండమూరి ని కాస్త పక్కన బెట్టి.)

    అన్నా:

    మీరు చెప్పినట్టు ఆ నవల చదువుతా, మీ దగ్గర ఆల్రడీ ఉంటే పంపించండి. మీరు ఇంతకు ముందు పంపిస్తానన్న నవలలు ఇంకా పంపించనే లేదు.

    హిమబిందు గారు:
    Thanagurinche ,thanavalla guricnhe sariga alochincha leni vallu pakka vallaa gurinchi em alochistharu

    మీ లాజిక్కు నచ్చింది. 🙂

  16. కొవ్వలి గారు:మీ అనుభావలు పంచుకున్నందుకు కృతజ్ఞతలు. సాధ్యమయినంత వరకూ ఆచరిస్తాను.అదీ కాక మీ ఇంతకు ముందు టపాలో ప్రస్తావించిన “ఎప్పుడూ ఆశించడమే” కాకుండా, “అప్పుడప్పుడూ అయినా” ఇవ్వడం మన జీవితంలో భాగం చేసుకోవాలి.రానారె:నీ లాంటి వారి అభిప్రాయాలు నా లాంటి వారికెంతయినా అవసరం. జీవితానికో పరమార్థం కావాలని నీ లాంటి వారిని చూస్తే అప్పుడప్పుడు కొందరికయినా అనిపించక మానదు. ఇకపోతే చిన్న చిన్న ఆనందాలని వదులుకోకూడదన్నది నిజం. అదీ కాక మనం సంతోషం గా ఉంటేనే ఎదుటి వారి గురించి ఆలోచించగలుగుతాము. అందరికీ చేతనయినంతలో సహాయం చెయ్యాలనుకోవడం మాత్రం గుర్తుంచుకోవాలి.అసమర్థుని జీవయాత్ర గురించి ఎంతో మంది చెప్పారు, కింద నవీన్ అన్న కూడా. దాన్ని త్వరలోనే దొరకబుచ్చుకుంటా. (యండమూరి ని కాస్త పక్కన బెట్టి.)అన్నా:మీరు చెప్పినట్టు ఆ నవల చదువుతా, మీ దగ్గర ఆల్రడీ ఉంటే పంపించండి. మీరు ఇంతకు ముందు పంపిస్తానన్న నవలలు ఇంకా పంపించనే లేదు.హిమబిందు గారు:Thanagurinche ,thanavalla guricnhe sariga alochincha leni vallu pakka vallaa gurinchi em alochistharuమీ లాజిక్కు నచ్చింది. 🙂

  17. అంతిమ లక్ష్యం అంటే , అది నాకెందుకో ఇప్పట్లో మనకు తెలిసేది కాదనిపిస్తుంది.
    కాలానుగుణంగా ఎన్నో మార్పులు వస్తుంటాయి .. ఈరోజు మనకు గొప్ప అనిపించింది కొన్నాళ్ళ తర్వాత సాధారణ విషయం అయిపోవచ్చు.
    అందుకే నేను అంతిమ లక్ష్యం గురించి మరీ ఎక్కువ ఆలోచించను.
    ఇది నా అభిప్రాయం మాత్రమే 🙂

  18. అంతిమ లక్ష్యం అంటే , అది నాకెందుకో ఇప్పట్లో మనకు తెలిసేది కాదనిపిస్తుంది.కాలానుగుణంగా ఎన్నో మార్పులు వస్తుంటాయి .. ఈరోజు మనకు గొప్ప అనిపించింది కొన్నాళ్ళ తర్వాత సాధారణ విషయం అయిపోవచ్చు.అందుకే నేను అంతిమ లక్ష్యం గురించి మరీ ఎక్కువ ఆలోచించను. ఇది నా అభిప్రాయం మాత్రమే 🙂

  19. “దీర్ఘకాలిక ప్రణాళికలు పెట్టుకోను. ఒకవేళ పెట్టుకోవలసివచ్చినా, దాన్ని సాధించితీరడమే నా జీవితలక్ష్యమన్నట్లు చిన్నచిన్న ఆనందాల్ని త్యాగం చేయను.” రానారె అభిప్రాయమే నాదీనూ! ఎందుకంటే రేపు అనేదాని గురించి ఎంత ఎక్కువ ఆలోచిస్తే ప్రకృతి అంత ఎక్కువగా మన మీద పగబట్టడమనేదాన్ని నేనెరుగుదును. అందుకే నన్ను ఆఠాణా బిచ్చమడిగే వ్యక్తికి నేను ఒక ప్లేటు ఇడ్లీనో, ఒక కొబ్బరిబోండామో ఇప్పించి ఆరోజంతా చాలా సంతోషంతో, సంతృప్తితో హుషారుగా గడిపేస్తూంటాను – ఎనీ హౌ – ఒక సమీక్ష అంటూ మొదలైతే జీవితానికి అదే నిజమైన దిశానిర్ధేశం!
    శుభాకాంక్షలు……….

  20. “దీర్ఘకాలిక ప్రణాళికలు పెట్టుకోను. ఒకవేళ పెట్టుకోవలసివచ్చినా, దాన్ని సాధించితీరడమే నా జీవితలక్ష్యమన్నట్లు చిన్నచిన్న ఆనందాల్ని త్యాగం చేయను.” రానారె అభిప్రాయమే నాదీనూ! ఎందుకంటే రేపు అనేదాని గురించి ఎంత ఎక్కువ ఆలోచిస్తే ప్రకృతి అంత ఎక్కువగా మన మీద పగబట్టడమనేదాన్ని నేనెరుగుదును. అందుకే నన్ను ఆఠాణా బిచ్చమడిగే వ్యక్తికి నేను ఒక ప్లేటు ఇడ్లీనో, ఒక కొబ్బరిబోండామో ఇప్పించి ఆరోజంతా చాలా సంతోషంతో, సంతృప్తితో హుషారుగా గడిపేస్తూంటాను – ఎనీ హౌ – ఒక సమీక్ష అంటూ మొదలైతే జీవితానికి అదే నిజమైన దిశానిర్ధేశం!శుభాకాంక్షలు……….

  21. @kasyap గారు:
    మీరెంతయినా అభినందనీయులు. మీ ప్రయత్నంలో మీకు శుభం కలగాలని ఆశిస్తున్నాను.

    రాజశేఖర్ అన్న:
    అర్థమయ్యేది లా లేదు. అందుకనే ఎవరయినా అర్థం అయిన వారున్నారేమో కనుక్కుందామని. అయినా ఇక్కడ నేను ఆలోచించేది గొప్పా అని కాదు. అసలు ఎవరయినా నా జీవితంలో ఇది సాధించాలి అని అనుకుంటే వారు ఆ కంక్లూజన్ కి ఎలా వస్తున్నారు అనేది.

    కృష్ణ మోహన్ కందర్ప గారు:
    థాంక్స్.. మీ ఆలోచనలు పంచుకున్నందుకు.
    మీ రూటు బావుంది.

  22. @kasyap గారు:మీరెంతయినా అభినందనీయులు. మీ ప్రయత్నంలో మీకు శుభం కలగాలని ఆశిస్తున్నాను.రాజశేఖర్ అన్న:అర్థమయ్యేది లా లేదు. అందుకనే ఎవరయినా అర్థం అయిన వారున్నారేమో కనుక్కుందామని. అయినా ఇక్కడ నేను ఆలోచించేది గొప్పా అని కాదు. అసలు ఎవరయినా నా జీవితంలో ఇది సాధించాలి అని అనుకుంటే వారు ఆ కంక్లూజన్ కి ఎలా వస్తున్నారు అనేది.కృష్ణ మోహన్ కందర్ప గారు: థాంక్స్.. మీ ఆలోచనలు పంచుకున్నందుకు.మీ రూటు బావుంది.

  23. జీవితం లో ఏదన్నా సాధించాలి అనే పెద్ద లక్ష్యాలకి ముందు అంతులేని సవాళ్ళు, వాటిని ఎదుర్కోవటం లోని వైఫల్యాలు, వైఫల్యాలని విశ్లేషిస్తూ గమ్యం ఏర్పరచుకోవడం, చివరకి ఒక పెద్ద అంతిమ లక్ష్యం పెట్టుకోవడం జరుగుతాయి. లేదా మొదటి నుండి మిమ్మల్ని అమితం గా ప్రభావితం చేసి, మీ మనసు ని పూర్తి గా వశం చేస్కున్న విషయం సాధించటం లాంటివి ఏమన్నా వున్నా, అవే పెద్ద లక్ష్యాలు అవుతాయి.

    మీకు చాలా ప్రొటెక్టెడ్ లైఫ్ అయ్యి వుంటుంది. మన్నించాలి. ఇది నా అనాలసిస్ మాత్రమె.

    మీకు నా సూచన. మీ కరీర్ లో నే, మీకు ఇష్టం ఐన అంశం పైన ఎవరు అందుకోలేనంత గా ఎదగండి. మీరు చేసే ప్రతీ పనిని ఇంకొంచం పర్ఫెక్ట్ గా చెయ్యడానికి ప్రయత్నించండి. నిదానం గా మీ అంతిమ లక్ష్యం ఏంటొ మీకే తెలుస్తుంది. 🙂

  24. జీవితం లో ఏదన్నా సాధించాలి అనే పెద్ద లక్ష్యాలకి ముందు అంతులేని సవాళ్ళు, వాటిని ఎదుర్కోవటం లోని వైఫల్యాలు, వైఫల్యాలని విశ్లేషిస్తూ గమ్యం ఏర్పరచుకోవడం, చివరకి ఒక పెద్ద అంతిమ లక్ష్యం పెట్టుకోవడం జరుగుతాయి. లేదా మొదటి నుండి మిమ్మల్ని అమితం గా ప్రభావితం చేసి, మీ మనసు ని పూర్తి గా వశం చేస్కున్న విషయం సాధించటం లాంటివి ఏమన్నా వున్నా, అవే పెద్ద లక్ష్యాలు అవుతాయి. మీకు చాలా ప్రొటెక్టెడ్ లైఫ్ అయ్యి వుంటుంది. మన్నించాలి. ఇది నా అనాలసిస్ మాత్రమె. మీకు నా సూచన. మీ కరీర్ లో నే, మీకు ఇష్టం ఐన అంశం పైన ఎవరు అందుకోలేనంత గా ఎదగండి. మీరు చేసే ప్రతీ పనిని ఇంకొంచం పర్ఫెక్ట్ గా చెయ్యడానికి ప్రయత్నించండి. నిదానం గా మీ అంతిమ లక్ష్యం ఏంటొ మీకే తెలుస్తుంది. 🙂

  25. దాదాపుగా వ్యాఖ్యలన్నీ నాకు నచ్చాయి. అయినా తోచింది రాసి మీకు ఏదో చెప్పాలి అని నా ఉబలాటం.

    “ఏమీ అర్థం కావట్లా… ” అని అన్నారు కదా! మీరు చెప్పిన లిస్టులో అన్నీ (పెళ్ళితో సహా ) చేసినా, భూప్రపంచానికి రారాజు అయినా కానీ ఈ ప్రశ్న మిమ్మల్ని వేధించక మానదు అని నా అనుభవం చెబుతుంది. ఈ ప్రశ్నకు మరో గుణం ఉన్నది, అదేమిటి అంటే, ప్రశ్నను వేసుకున్న తరువాత కాసేపటికి అది జీవితపు హోరులో మరుగున పడిపోయి, మళ్ళీ ఎప్పుడో తిరిగి వస్తుంది.

    ఇప్పుడంటే యవ్వనంలో, తక్కువ బంధాలతో ఉన్నారు కనుక ఒక టపా రాసి కొంత ప్రశాంతంగా ఉన్నారు కానీ, అదే చేతకాని ముసలి వయస్సులో వస్తే, ఇంకా దు:ఖంగా ఉంటుంది, చివరి క్షణంలో అయితే చెప్పలేనంతగా – చేయగలిగింది ఏమీ ఉండదు కనుక. ప్రతీ ఒక్కరు ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా వేసుకోవలసిన ప్రశ్నే ఇది. దీనికి సమాధానం మీరు మరొకరి దగ్గర్నుండి పొందలేరు, సహాయాన్ని మాత్రం పొందగలరు.

    “ఎవరికి వారే నాథుడు, ఎవరికి వారే గతి” అన్నాడు గౌతమ బుద్ధుడు. అర్థాన్ని ఎవరికి వారే వెతుక్కోవాలి. “సాధనమున పనులు సమకూరు ధరలోన” అన్నారు కదా పెద్దలు, దగ్గరలో అర్థాన్ని సాధించిన వారి కోసం వెతికి సాధనను ఎంత త్వరగా చేపడితే అంత మంచిది.

  26. దాదాపుగా వ్యాఖ్యలన్నీ నాకు నచ్చాయి. అయినా తోచింది రాసి మీకు ఏదో చెప్పాలి అని నా ఉబలాటం.”ఏమీ అర్థం కావట్లా… ” అని అన్నారు కదా! మీరు చెప్పిన లిస్టులో అన్నీ (పెళ్ళితో సహా ) చేసినా, భూప్రపంచానికి రారాజు అయినా కానీ ఈ ప్రశ్న మిమ్మల్ని వేధించక మానదు అని నా అనుభవం చెబుతుంది. ఈ ప్రశ్నకు మరో గుణం ఉన్నది, అదేమిటి అంటే, ప్రశ్నను వేసుకున్న తరువాత కాసేపటికి అది జీవితపు హోరులో మరుగున పడిపోయి, మళ్ళీ ఎప్పుడో తిరిగి వస్తుంది.ఇప్పుడంటే యవ్వనంలో, తక్కువ బంధాలతో ఉన్నారు కనుక ఒక టపా రాసి కొంత ప్రశాంతంగా ఉన్నారు కానీ, అదే చేతకాని ముసలి వయస్సులో వస్తే, ఇంకా దు:ఖంగా ఉంటుంది, చివరి క్షణంలో అయితే చెప్పలేనంతగా – చేయగలిగింది ఏమీ ఉండదు కనుక. ప్రతీ ఒక్కరు ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా వేసుకోవలసిన ప్రశ్నే ఇది. దీనికి సమాధానం మీరు మరొకరి దగ్గర్నుండి పొందలేరు, సహాయాన్ని మాత్రం పొందగలరు.”ఎవరికి వారే నాథుడు, ఎవరికి వారే గతి” అన్నాడు గౌతమ బుద్ధుడు. అర్థాన్ని ఎవరికి వారే వెతుక్కోవాలి. “సాధనమున పనులు సమకూరు ధరలోన” అన్నారు కదా పెద్దలు, దగ్గరలో అర్థాన్ని సాధించిన వారి కోసం వెతికి సాధనను ఎంత త్వరగా చేపడితే అంత మంచిది.

Leave a reply to ssv స్పందనను రద్దుచేయి