జూన్ 11, 2007

ఉబుంటు స్టార్టర్స్ …

Posted in ఉబుంటు, టెక్నాలజీ వద్ద 4:49 సా. ద్వారా Praveen Garlapati

ఉబుంటు కొత్తగా వాడటం మొదలెట్టిన వారికి కొన్ని సంగతులు.

ఉబుంటు కి అద్భుతమయిన డాక్యుమెంటేషన్ ఉంది. గూగుల్ లో వెతికితే ఉబుంటు హెల్ప్ లో గానీ ఉబుంటు ఫొరంస్ లో గానీ చటుక్కున సమాధానం దొరుకుతుంది.

ముందో మాట. మీరు రూట్ గాక ఇంకో యూజర్ సృష్టించే ఉంటారని ఆశిస్తున్నా. ఉబుంటు లో ఇది సృష్టించనిదే ఇన్స్టాల్ కానివ్వదనుకోండి. రూట్ యూజర్ ని డీఫాల్ట్ గా డిసేబుల్ చేసి ఉంచుతుంది. దానికి కారణం సెక్యూరిటీ. లినక్స్ లో రూట్ యూజర్ అంటే దేవుడు అన్నమాట. రూట్ యూజర్ గా లాగిన్ అయి ఉంటే పొరపాటున ఏదయినా తప్పు చేసే అవకాశం ఉంది. దాని వల్ల అనుకోని విధమయిన సమస్యలు రావచ్చు. అలాంటివి రాకుండా ముందు జాగ్రత్త చర్యగా రూట్ యూజర్ ని డిసేబుల్ చేసి ఉంచుతుంది.

మామూలు పనులు చేసుకోవడానికి ఆ యూజర్ సరిపోతుంది కానీ సిస్టం లో ఏదయినా మార్పులు చేర్పులు చెయ్యాలంటే మాత్రం రూట్ లేదా అడ్మినిస్ట్రేటర్ కుండే ప్రివిలేజస్ కావాలి. మరి మామూలు యూజర్ గా ఉన్నప్పుడు మార్పులు చెయ్యాలంటే ఎలా అనే సందేహం వచ్చిందా ?
మీరు మామూలు యూజర్ గా లాగిన్ అయినప్పుడు ఏదయినా ఇన్స్టాల్ చెయ్యలన్నా, సిస్టం లో ఏ మార్పులయినా చెయ్యాలన్నా టెంపరరీ గా రూట్ ప్రివిలేజస్ రావడానికి “sudo” అనే కమాండ్ ఉంది. దానిని వాడితే మీకు టెంపరరీగా రూట్ ప్రివిలేజస్ వస్తాయి.

ఉదాహరణకి మీరు ఏదయినా పాకేజీ ఇన్స్టాల్ చెయ్యాలనుకున్నారనుకోండి:

రూట్ అయితే

apt-get install <package-name>

అని ఇస్తే సరిపోతుంది. కానీ రూట్ గా కాక మామూలు యూజర్ గా ఉన్నప్పుడు మీరు

sudo apt-get install <package-name>

అని ఇవ్వాల్సుంటుంది. అపుడు మిమ్మల్ని పాస్వర్డ్ అడుగుతుంది. మీ యూజర్ పాస్వర్డ్ ఎంటర్ చెయ్యండి అంతే, పనిచేస్తుంది. (sudo గురించి ఇంకా ఉంది కానీ ఇక్కడ చెబితే అది పెద్ద తతంగం గా తయారవుతుంది. అందుకని ఇప్పటికి వదిలెయ్యండి. ఏదయినా టెంపరరీగా రూట్ ప్రివిలేజస్ కావాలంటే sudo వాడాలని మాత్రం గుర్తు పెట్టుకోండి.)

పైన చెప్పిన తతంగమంతా ఉబుంటు లో మీరు కమాండ్ లైన్ ఉపయోగిస్తేనే. ఉబుంటు లో చాలా మటుకు GUI తోనే పనులయిపోతాయి. అందుకనే అది అంతగా వ్యాప్తి చెందింది. సరే ఇక UI మాటకొస్తే ఏదయినా సిస్టం లో మార్పులు చెయ్యాలనుకున్నారనుకోండి ఉదాహరణకి System Settings అందులో కింద Administrator Mode అని ఒకటుంటుంది. ఆ బటన్ ని క్లిక్కి మీ యూజర్ పాస్వర్డ్ ఇచ్చి పని కానిచ్చుకోవచ్చు.

ఇదంతా మొదట్లో కలగాపులగం గా అనిపించవచ్చు కానీ దీని వల్ల ఎంతో మంచి జరుగుతుంది. అలవాటయిపోతుంది.

ఇక పోతే ఏదయినా పాకేజీ ఇన్స్టాల్ చెయ్యాలనుకుంటే ఎలా ?

అది చెప్పుకునే ముందు ఒక రెండు విషయాలు చెప్పుకోవాలి. ఉబుంటు లో డీఫాల్ట్ గా వచ్చే పాకేజీలలో సాధ్యమయినంత వరకూ ప్రొప్రయిటరీ డ్రైవర్లు/పాకేజీలను వాడరు. కానీ అవి కావాలనుకోండి అవి డౌన్లోడ్ చేసుకోవడం కోసం కావలసిన రిపాజిటరీలు ఉంటాయి. (ఉదాహరణకి ఫ్లాష్, జావా, ఎన్వీడియా డ్రైవర్లు మొదలయినవి.) డీఫాల్ట్ గా అవి ఎనేబుల్ అయి ఉండవు, వాటిని ఎనేబుల్ చెయ్యడానికి మీరు /etc/apt/sources.list అనే ఫైలులో కామెంట్ చేసి ఉన్న రిపాజిటరీలను మీకు కావలసిన విధంగా అన్‌కామెంట్ చెయ్యండి.

ఇక పాకేజీలేమిటి అంటే విండోస్ లో సెటప్ చెయడానికి ఇన్స్టాలర్లు ఉన్నట్టే లినక్స్ లో కూడా ఏ ఫ్లేవర్ కి కావలసిన విధంగా వాటికి పాకేజీలుంటాయి (ఉదాహరణకి డెబియన్/ఉబుంటు మొదలయిన వాటికి .deb, రెడ్‌హాట్/ఫెడోరా లకి .rpm, మొదలయినవి…)

ఇక పోతే మీరు ఇన్స్టాల్ చేసే పాకేజీలు ఇంటర్నల్ గా వేర్వేరు పాకేజీల మీద ఆధారపడి ఉండవచ్చు. అవన్నీ మీరు విడి విడి గా ఇన్స్టాల్ చేసుకోనక్కర్లేకుండా ఉబుంటు లో వివిధ రకాల టూల్స్ మీకు అందుబాటులో ఉంటాయి.

apt-get – ఆప్టిట్యూడ్ అనే ఈ కమాండ్ లైన్ ప్రోగ్రాం మీకు కావలసిన పాకేజీ ని ఇన్స్టాల్ చేస్తుంది, డిపెండెన్సీలతో సహా ఆటోమాటిగ్గా.
దీని ద్వారా ఇన్స్టాల్ చెయ్యడానికి sudo apt-get install <package-name> అని ఇవ్వాల్సి ఉంటుంది. పాకేజీ ని తీసివేయడానికి sudo apt-get remove <package-name> అని ఇవ్వాల్సుంటుంది. అంతే.
నేనెక్కువగా ఇదే వాడతా. కింద ఒక ఉదాహరణ.

సన్ జావా ఇన్స్టాల్ చెయ్యాలనుకోండి.

మీ కన్సోల్ ఓపెన్ చేసి ఈ కింది విధంగా చెయ్యండి.

sudo vi /etc/apt/sources.list

మీకు ఓ ఫైలు కనిపిస్తుంది, అందులో మల్టీవర్స్ అనే ఒక రిపాజిటరీ ఉంటుంది

#deb http://in.archive.ubuntu.com/ubuntu/ gutsy multiverse
#deb-src http://in.archive.ubuntu.com/ubuntu/ gutsy multiverse

వాటి ముందున్న # లని తొలగించండి.

తరవాత ఈ కింది కమాండ్ లని ఎక్జిక్యూట్ చెయ్యండి.

sudo apt-get update
sudo apt-get install sun-java5-jdk లేదా sudo apt-get install sun-java6-jdk

Adept Manager – ఉబుంటు లో దేనికయినా దాదాపుగా GUI టూల్ ఉంటుందని గుర్తుంచుకోండి అలాగే ఇన్స్టాల్ కి కూడా. ఉదాహరణకి అడెప్ట్ మేనేజర్. మీరు System > Adept Manager కి వెళ్ళండి. దానిని తెరిచి అక్కడ సెర్చ్ లో మీకు కావలసిన పాకేజీ ని ఎంచుకుని Apply Changes అనడమే. ఇన్స్టాల్ అయిపోతుంది.

అలాగే Synaptic Package Manager అని ఇంకో టూల్ కూడా ఉంది. దాని ద్వారా కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అలాగే Add/Remove Programs తో కూడా.

ఇప్పటికే చాలా ఎక్కువయిపోయిందా. ఏదో ఒక మీకు నచ్చిన విధానం ఎంచుకుని సాగిపోండి అంతే.

* ఉబుంటు పాకేజీలన్నీ కావాలనుకుంటే మీరు ఆ డీవీడీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా ఆన్లైన్ రిపాజిటరీల నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
* ఉబుంటు లో తెలుగు సరిగా కనిపించకపోయినట్టయితే ఈ లంకెలో ఉన్న సోపానాలని పాటించండి.
* లినక్స్ లో వేర్వేరు డెస్క్‌టాప్ మేనేజర్లున్నాయి. (జీనోం, కేడీయీ, మొదలయినవి…) UI కి కేడీయీ పేరు పొందిన డెస్క్టాప్ మేనేజర్, నాకిష్టమయినది. ఉబుంటు డీఫాల్ట్ గా జీనో తో వస్తుంది, కేడీయీ కావాలనుకుంటే కుబుంటు ఇన్స్టాల్ చేసుకోవచ్చు లేదా మీ కన్సోల్ లో sudo apt-get install kubuntu-desktop అనే కమాండ్ తో కేడీయీ ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
* ఉబుంటు లో Alt + Space నొక్కితే అప్లికేషన్ లాంచర్ వస్తుంది. దాని ద్వారా కావలసిన ఏ అప్లికేషన్ నయినా లాంచ్ చేసుకోవచ్చు.

ప్రకటనలు

17 వ్యాఖ్యలు »

 1. వీవెన్ said,

  బాగుంది. ఒక టపాకి ఎక్కువే. 🙂

  తెరచాపలు కూడా పెడితే మరింత ఆసక్తికరంగా ఉండేది.

 2. బాగుంది. ఒక టపాకి ఎక్కువే. :-)తెరచాపలు కూడా పెడితే మరింత ఆసక్తికరంగా ఉండేది.

 3. ప్రసాద్ said,

  ప్రవీణ్,
  ఈ టపా చాలా బాగుంది. కెడియు డెస్క్‌టాప్ గురించి తెలిసింది.

  కుడిచేతి భాగాన కింద ECMI English/Europian అనో ఏదో వుంటుంది. అదేంటి? కీబోర్డ్ లే అవుట్ ఎంచుకోవడమా?

  –ప్రసాద్
  http://blog.charasala.com

 4. ప్రవీణ్, ఈ టపా చాలా బాగుంది. కెడియు డెస్క్‌టాప్ గురించి తెలిసింది. కుడిచేతి భాగాన కింద ECMI English/Europian అనో ఏదో వుంటుంది. అదేంటి? కీబోర్డ్ లే అవుట్ ఎంచుకోవడమా?–ప్రసాద్http://blog.charasala.com

 5. ssv said,

  This comment has been removed by the author.

 6. ssv said,

  ఒక వేళ ప్యాకేజీ పేరు గుర్తుకు రాకపొతే apt-get అని టైప్ చేసి, మొదతి ఒకటో, రెండో, అక్షరాలు టైప్ చేసి, tab నొక్కితె, అందుబాటు లో ఉన్న ప్యాకేజి లను చూపిస్తుంది కూడా.మంచి సదుపాయం ఇది.

  ఊబుంటు (మానవత్వం) ని పరిచయం చేసారు.. కృతజ్ఞతలు…మీరు “స్వేచ్చ” (తెలుగు లైనక్సు డిస్ట్రిబ్యూషన్) ని కూడ పరిచయం చేస్తారని అనుకొంటున్నాను. ఇది నాపిక్స్ ఆధారితం.

  నేను కొన్ని రంగ స్థల బొమ్మలు (డెస్క్ టాప్ ఫోటోస్) పొస్ట్ చేసాను నా బ్లాగు లో.తెలుగు నోం లో బెరిల్ ని రన్ చేస్తే ఎల వుంటుందో, పోస్ట్ చేసాను.http://ssvbios.blogspot.com/

 7. ssv said,

  ఒక వేళ ప్యాకేజీ పేరు గుర్తుకు రాకపొతే apt-get అని టైప్ చేసి, మొదతి ఒకటో, రెండో, అక్షరాలు టైప్ చేసి, tab నొక్కితె, అందుబాటు లో ఉన్న ప్యాకేజి లను చూపిస్తుంది కూడా.మంచి సదుపాయం ఇది.ఊబుంటు (మానవత్వం) ని పరిచయం చేసారు.. కృతజ్ఞతలు…మీరు “స్వేచ్చ” (తెలుగు లైనక్సు డిస్ట్రిబ్యూషన్) ని కూడ పరిచయం చేస్తారని అనుకొంటున్నాను. ఇది నాపిక్స్ ఆధారితం.నేను కొన్ని రంగ స్థల బొమ్మలు (డెస్క్ టాప్ ఫోటోస్) పొస్ట్ చేసాను నా బ్లాగు లో.తెలుగు నోం లో బెరిల్ ని రన్ చేస్తే ఎల వుంటుందో, పోస్ట్ చేసాను.http://ssvbios.blogspot.com/

 8. ప్రసాద్ said,

  ప్రవీణ్,
  మీ పోస్టు ద్వారా బోలెడన్ని కొత్త విశయాలు తెలిశాయి. చాలా థ్యాంక్స్!

  కాకుంటే మీరిచ్చిన ఉబుంటు archive link ఇక్కడ usలో
  deb http://us.archive.ubuntu.com/ubuntu/ gutsy multiverse
  deb-src http://us.archive.ubuntu.com/ubuntu/ gutsy multiverse
  అవుతాయనుకుంటా.

  –ప్రసాద్
  http://blog.charasala.com

 9. ప్రవీణ్,మీ పోస్టు ద్వారా బోలెడన్ని కొత్త విశయాలు తెలిశాయి. చాలా థ్యాంక్స్!కాకుంటే మీరిచ్చిన ఉబుంటు archive link ఇక్కడ usలో deb http://us.archive.ubuntu.com/ubuntu/ gutsy multiversedeb-src http://us.archive.ubuntu.com/ubuntu/ gutsy multiverseఅవుతాయనుకుంటా.–ప్రసాద్http://blog.charasala.com

 10. ప్రవీణ్ గార్లపాటి said,

  వీవెన్:
  థాంక్స్. అవును ఒక టపాకి ఎక్కువే పోస్ట్ చేసిన తర్వాత అనిపించింది.
  అప్పటికే పనయిపోయింది, ఇవాళ తీరిక దొరికితే తెరచాపలు పెడతా.

  ssv గారు:
  మీ బ్లాగులో పెట్టిన బొమ్మలు బాగున్నాయి. నా తదుపరి టపా బెరిల్ మీద రాద్దామనుకున్నా. అప్పుడు జనాలకి మీ బొమ్మలు చూపిస్తా 🙂
  స్వేచ్చ ఒక సారి vmware లో ట్రై చేసా కానీ ఎక్కువగా వాడలేదు.
  ఇంతకు ముందు మన తెలుగు బ్లాగులలోనే వీవెన్ గారో ఎవరో పరిచయం చేసారు.
  మీరు కూడా డీటెయిల్డ్ గా ఓ టపా రాయండి.

  ప్రసాద్ గారు:
  కేడీయీ సెటప్ చేసేసుంటారు ఈ పాటికి.
  అవును రిపాజిటరీలు లోకల్ గా మారతాయి తొందరగా డౌన్లోడ్ చెయ్యడానికి.

 11. వీవెన్: థాంక్స్. అవును ఒక టపాకి ఎక్కువే పోస్ట్ చేసిన తర్వాత అనిపించింది.అప్పటికే పనయిపోయింది, ఇవాళ తీరిక దొరికితే తెరచాపలు పెడతా.ssv గారు:మీ బ్లాగులో పెట్టిన బొమ్మలు బాగున్నాయి. నా తదుపరి టపా బెరిల్ మీద రాద్దామనుకున్నా. అప్పుడు జనాలకి మీ బొమ్మలు చూపిస్తా :)స్వేచ్చ ఒక సారి vmware లో ట్రై చేసా కానీ ఎక్కువగా వాడలేదు. ఇంతకు ముందు మన తెలుగు బ్లాగులలోనే వీవెన్ గారో ఎవరో పరిచయం చేసారు.మీరు కూడా డీటెయిల్డ్ గా ఓ టపా రాయండి.ప్రసాద్ గారు:కేడీయీ సెటప్ చేసేసుంటారు ఈ పాటికి.అవును రిపాజిటరీలు లోకల్ గా మారతాయి తొందరగా డౌన్లోడ్ చెయ్యడానికి.

 12. ssv said,

  ప్రసాద్ గారు,
  gutsy gibbon అనేది ఉబుంటు తరువాత వెర్షన్.. Dapper Drake (6.06) , Edgy Eft (6.10), Feisty fawn (7.04) ఇవీ ఇంతవరకూ రిలీజ్ అయిన వెర్షన్స్. డేపరు కు ముందు కొన్ని రీలీజ్ అయ్యాయి. గట్సీ ప్రస్తుతం ఆల్ఫా స్టేజ్ లో ఉంది. ఇన్ స్టాలు చేస్తే, బహుశా సిస్టం బ్రేక్ అవ్వచ్చు.

 13. ssv said,

  ప్రసాద్ గారు,gutsy gibbon అనేది ఉబుంటు తరువాత వెర్షన్.. Dapper Drake (6.06) , Edgy Eft (6.10), Feisty fawn (7.04) ఇవీ ఇంతవరకూ రిలీజ్ అయిన వెర్షన్స్. డేపరు కు ముందు కొన్ని రీలీజ్ అయ్యాయి. గట్సీ ప్రస్తుతం ఆల్ఫా స్టేజ్ లో ఉంది. ఇన్ స్టాలు చేస్తే, బహుశా సిస్టం బ్రేక్ అవ్వచ్చు.

 14. ప్రవీణ్ గార్లపాటి said,

  ssv గారు అది నా తప్పు, పొరపాటున నా రిపాజిటరీలో ఉన్న లైన్లు తీసి పెట్టేసాను.

 15. ssv గారు అది నా తప్పు, పొరపాటున నా రిపాజిటరీలో ఉన్న లైన్లు తీసి పెట్టేసాను.

 16. ssv said,

  hmm…నేను మీ బ్లాగు లో రిపాజిటరీస్ ని చూడకుండా, ప్రసాదు గారి కామెంట్స్ కి జవాబు ఇచ్చాను..సారీ ప్రసాదు గారూ!

 17. ssv said,

  hmm…నేను మీ బ్లాగు లో రిపాజిటరీస్ ని చూడకుండా, ప్రసాదు గారి కామెంట్స్ కి జవాబు ఇచ్చాను..సారీ ప్రసాదు గారూ!


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: