జూన్ 18, 2007

ఆయ్… మేమంటే అంత చులకనా !?

Posted in సరదా, సాఫ్ట్‌వేర్ ఇంజనీరు వద్ద 6:17 సా. ద్వారా Praveen Garlapati

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లంటే అందరికీ ఎంత లోకువో.

సినిమాలోళ్ళ దగ్గర నుంచి దారిన పోయే దానయ్యల వరకూ అందరికీ వీరి మీద వారి వారి అభిప్రాయాలే.

అవునయ్యా నేనూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నే, అందుకే డిఫెండ్ చేసుకుంటున్నా… ఏం తప్పా ?

ఒకడిని చూస్తే బ్రహ్మి సాఫ్ట్‌వేర్ ఇంజినీరని, ఏజ్ బార్ అయిన ఒక డొక్కు గాణ్ణి చూపించి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కి ప్రతీక గా నిలబెట్టేసారు.

ఇంకోడిని చూస్తే పనికిరాని వెధవలందరూ సాఫ్ట్‌వేర్ లోనే తగలడినట్టు, చటుక్కున జాబ్ తెచ్చుకుని లటుక్కున ఫారిన్ చాన్స్ కొట్టేసి, ఆడపిల్లల వెంట పడేటట్టు చూపిస్తాడు.

గుడ్డిలో మెల్ల ఒక్కో సినిమాలో ‘సంతోషం’ గా ఉన్నట్టు కూడా చూపిస్తారనుకోండి.

ఇక సినిమాలిలా ఉన్నాయి అనుకుంటే బయట అడుగు పెడితే చాలు ఆటో వాడి దగ్గర నుండి, ఇల్లద్దెకిచ్చే వాడి వరకూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ని దోచుకోవాలనుకునేవాడే.

మా కంపెనీ ఎదురుగా ఆటోలుంటాయి. ఎక్కడికయినా వెళదామని వాడినడిగామా మీటర్ మీద ఇరవై రూపాయలు సార్ అని పళ్ళికిలిస్తాడు, వెనక కంపెనీ వంక చూస్తూ. సర్లే పక్కనోడేమయినా వస్తాడేమో కనుక్కుందామనుకుంటే వాళ్ళంతా ఒకటే (ఇలాంటి వాటిల్లో మాత్రం సంఘటితంగా ఉంటారు). అప్పటికే రెండున్నర రెట్ల వేగంతో తిరుగుతున్న మీటర్ మీద ఇరవై రూపాయలు ఎక్కువ సమర్పించుకుని పక్కనున్న అయిదు కిలోమీటర్ల దూరం వెళ్ళాలి.

ఇక ఇంతద్దెకోసం స్నేహితులు వెళితే ఎక్కడ పని చేస్తున్నావని అడిగి సాఫ్ట్‌వేర్ అని వినపడగానే దొరికాడురా బకరా అనుకుంటారు. అదీ బాచిలర్ అయితే ఇక వాళ్ళ పంట పండినట్టే. సడన్ గా ఇంటద్దె రెట్టింపయిపోతుంది. ఏ అంత సంపాయిస్తున్నావుగా ఇవ్వడానికేం దురద అని చూస్తారు. ఇంకొందరయితే మీకు కంపెనీ లీజ్ వస్తుందిగా అని రేట్లు ఇంకా పెంచేస్తారు, ఏదో కంపెనీ మనకి ఫ్రీ గా ఇచ్చేస్తున్నట్టు. మనం సీటీసీ చట్రం లో ఉన్నట్టు తెలీనట్టు నటిస్తారు.

ఇక సర్లే ముగ్గురం కదా పదిహేనువేలు వాటాలో అయిదు వేలేగా అని జనాలు సమాధాన పరచుకుని వారికి బంగారు బాతులవుతారు.

ఇదయిందా ఇక బట్టలు, సినిమాలు, మాల్స్, తిండి ఏది చూసినా బొక్కే. ఇవన్నీ చెయ్యకుంటే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కాదన్నట్టే లెక్క జనాలకి మరి. మల్టీప్లెక్సులలోనే సినిమాలు చూడాలి. లీ, లివైస్ జీన్సే కట్టాలి. పిజ్జా, బర్గర్, కాఫీ షాపులలోనే వీకెండ్స్ తిండి తినాలి. మాల్స్ లోనే షాపింగ్ కి వెళ్ళాలి.

ఏదయినా చెయ్యకపోతే మళ్ళీ పక్కనోళ్ళు ఏ వెర్రి వాజమ్మ కింద జమకట్టేస్తారో అని భయం.

ఇక పోతే ఇంటిపక్కనోళ్ళు, బంధువులు స్నేహితులు వీరి పైన పెట్టే ప్రెషర్ చూడాలి. అదేంటి బాబూ నువ్వప్పుడే ఉద్యోగంలో జాయిన్ అయ్యి మూడేళ్ళు అయింది, ఒక్క జాబ్ కూడా మారలేదా ? మా వాడు అప్పుడే నాలుగు ఉద్యోగాలు మారిపోయాడు తెలుసా.

ఇంకోడు అర్రే ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది ఇంతేనా వచ్చేది. మా చుట్టాలబ్బాయికి అయితే పది లక్షల జీతం వస్తుంది అని జాలి చూపుతాడు.

ఇంకోడేంట్రా అంటే నేను కనిపించగానే తెలుగు లో కాక ఇంగ్లీషులో మాట్లాడుతాడు, నే తెలుగు లో మాట్లాడినా… ఇదెక్కడి గొడవరా బాబూ నేను సాఫ్ట్‌వేర్ ఇంజినేర్ నేనా అన్నట్టు డౌట్ గా చూస్తాడు.

ఇక స్నేహితులు కలిస్తే నీకెంత రా నాకెంతరా లు మామూలే.

ఇక మామూలోళ్ళు అందరూ నీకేంటి అయిదు రోజులే పని, రోజుకెనిమిది గంటలే పని వేళలు అని ఎక్కించేస్తుంటారు. అక్కడ వారానికి పది రోజుల పని చేస్తూ, రాత్రి నిద్దరపోకుండా పని చేసేవోడు ఎక్కడ చెబితే అలుసయిపోతామో అని ఎహ్హెహ్హె అని ఓ పిచ్చి నవ్వు నవ్వుతాడు.

ఇవన్నీ తట్టుకుని ఎక్కడికక్కడ్ జేబులు గుల్ల చేసుకుని, మాటలు పడి నెగ్గుకురావడం అంత వీజీ కాదని మనవి. కాబట్టి ఈ సారి మీకో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కనిపిస్తే బ్రహ్మీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ని కాకుండా ఏ బిల్ గేట్స్ నో, స్టీవ్ జాబ్స్ నో గుర్తు తెచ్చుకోమని మనవి.

38 వ్యాఖ్యలు »

 1. విహారి said,

  ఆ మరే! ఇచ్చేస్తారు పేద్ద రెస్పక్టు? రోజూ ఆ మానిటర్ ముందు కూర్చుని సినిమాలూ, కూడలి చూస్తూ వుంటే డబ్బులు బ్యాంకులో పడి పోతున్నాయిగా. ఎక్కడన్న లంచ మిచ్చారా ఏంటి.మేము మా ఆటోలకు లేసెన్సు కోసం పోలీసాళ్ళకు లంచమియ్యాలి. అదెవడిస్తాడు మానిటర్ల ముందు కూర్చునే నీలాంటొళ్ళే కదా. అంతగా అయితే నా ఆటో నే రోజుకు పది సార్లు ఎక్కండి ఓ సారి ఫ్రీగా డ్రాప్ చేస్తా. మీటర్ మీద యాభై ఇవ్వు చాలు. వింటున్నావా సాఫ్టువేరోడా?

  — ఓ ఆటో వాడు (నీ లాంటోళ్ళను తిప్పి, అలాంటొళ్ళకే ఇల్లు అద్దెకిస్తున్న ఓ ఓనరోడు కూడా).

  సీనుగాడి ఇండియా ప్రయాణం లో ఇండియాలో దిగిన తరువాతా ఇలాంటి బోల్డు పదనిస వుంటాయి. ఏంటొ ఈ మధ్య అన్ని అవిడియాలూ కాపీ కొట్టేస్తున్నారు 😦

  — విహారి
  http://vihaari.blogspot.com

 2. ఆ మరే! ఇచ్చేస్తారు పేద్ద రెస్పక్టు? రోజూ ఆ మానిటర్ ముందు కూర్చుని సినిమాలూ, కూడలి చూస్తూ వుంటే డబ్బులు బ్యాంకులో పడి పోతున్నాయిగా. ఎక్కడన్న లంచ మిచ్చారా ఏంటి.మేము మా ఆటోలకు లేసెన్సు కోసం పోలీసాళ్ళకు లంచమియ్యాలి. అదెవడిస్తాడు మానిటర్ల ముందు కూర్చునే నీలాంటొళ్ళే కదా. అంతగా అయితే నా ఆటో నే రోజుకు పది సార్లు ఎక్కండి ఓ సారి ఫ్రీగా డ్రాప్ చేస్తా. మీటర్ మీద యాభై ఇవ్వు చాలు. వింటున్నావా సాఫ్టువేరోడా?– ఓ ఆటో వాడు (నీ లాంటోళ్ళను తిప్పి, అలాంటొళ్ళకే ఇల్లు అద్దెకిస్తున్న ఓ ఓనరోడు కూడా).సీనుగాడి ఇండియా ప్రయాణం లో ఇండియాలో దిగిన తరువాతా ఇలాంటి బోల్డు పదనిస వుంటాయి. ఏంటొ ఈ మధ్య అన్ని అవిడియాలూ కాపీ కొట్టేస్తున్నారు :-(– విహారిhttp://vihaari.blogspot.com

 3. రాకేశ్వర రావు said,

  అన్ని సాఫ్ట్ వేర్ అనుభవాలను జతచేసి చక్కగా వివరించారు, చాలా బాగుంది.

  ఆ జీతం అడిగి, ఇంతేనా, మా చుట్టాలబ్బాయికి అంత
  అన్నప్పుడు నా కైతే పీక పిసికి చంపేయాలనిపిస్తుంది.

 4. అన్ని సాఫ్ట్ వేర్ అనుభవాలను జతచేసి చక్కగా వివరించారు, చాలా బాగుంది. ఆ జీతం అడిగి, ఇంతేనా, మా చుట్టాలబ్బాయికి అంత అన్నప్పుడు నా కైతే పీక పిసికి చంపేయాలనిపిస్తుంది.

 5. క్రాంతి said,

  చాలా బాగుందండి మీ టపా,నాకు కూడ ఆ IBM ThinkPad laptop వేసుకోని భయటకి రావలంటే ఎంత భయమో,ఎక్కడ “బ్రహ్మి” అని పిలుస్తారో అని.

 6. చాలా బాగుందండి మీ టపా,నాకు కూడ ఆ IBM ThinkPad laptop వేసుకోని భయటకి రావలంటే ఎంత భయమో,ఎక్కడ “బ్రహ్మి” అని పిలుస్తారో అని.

 7. ప్రవీణ్ గార్లపాటి said,

  అమ్మ విహారి గారు:
  వామ్మో ఎంత పెద్ద అభాండం వేసేసారు… వా….

  వారి లెవెల్లో వారికుంటే మా లెవెల్లో మాకుంటాయి బాబూ లంచాలివ్వడాలు. ఇదో పెద్ద వలయం. అందరూ వద్దు వద్దు అనుకుంటూనే ఇందులో చిక్కుకుంటున్నారు. 😦

  ఈ సారి టపా రాసే ముందు మీకు పంపిస్తాలేండి ప్రూఫ్ రీడింగ్ కోసం 🙂

  రాకేశ్వర రావు గారు:

  సేం టు సేం…

  క్రాంతి గారు:

  మామూలు బాగు వేసుకుని లాప్టాప్ ని దాచెయ్యండి.

 8. అమ్మ విహారి గారు: వామ్మో ఎంత పెద్ద అభాండం వేసేసారు… వా….వారి లెవెల్లో వారికుంటే మా లెవెల్లో మాకుంటాయి బాబూ లంచాలివ్వడాలు. ఇదో పెద్ద వలయం. అందరూ వద్దు వద్దు అనుకుంటూనే ఇందులో చిక్కుకుంటున్నారు. :(ఈ సారి టపా రాసే ముందు మీకు పంపిస్తాలేండి ప్రూఫ్ రీడింగ్ కోసం :)రాకేశ్వర రావు గారు:సేం టు సేం…క్రాంతి గారు:మామూలు బాగు వేసుకుని లాప్టాప్ ని దాచెయ్యండి.

 9. రాజశేఖర్ said,

  చాలా బాగుంది ప్రవీణ్.
  నిజమే ! ఒకచోట పనిచేసుకుంటూ , ఆ వచ్చే జీతంతోనే తృప్తిగా ఉందామన్నా ఉండనివ్వరు.
  ఆ జాలి కబుర్లు విన్నప్పుడు (మనసులో )తిట్టుకోనివాళ్ళెవరైనా ఉన్నారంటే అది అతిశయోక్తేనేమో !

 10. చాలా బాగుంది ప్రవీణ్.నిజమే ! ఒకచోట పనిచేసుకుంటూ , ఆ వచ్చే జీతంతోనే తృప్తిగా ఉందామన్నా ఉండనివ్వరు.ఆ జాలి కబుర్లు విన్నప్పుడు (మనసులో )తిట్టుకోనివాళ్ళెవరైనా ఉన్నారంటే అది అతిశయోక్తేనేమో !

 11. రవి వైజాసత్య said,

  ఈ బ్రహ్మీ అంటే ఏంటి? ఎల్కేజీ ప్రశ్న అడిగినందుకు క్షమించగలరు.

 12. ఈ బ్రహ్మీ అంటే ఏంటి? ఎల్కేజీ ప్రశ్న అడిగినందుకు క్షమించగలరు.

 13. ప్రవీణ్ గార్లపాటి said,

  రాజశేఖర్ అన్న:
  థాంక్స్…

  రవి గారు:
  బ్రహ్మీ సాఫ్ట్‍వేర్ ఇంజనీర్ అనేది పోకిరి సినిమాలో ఓ కారక్టర్. బ్రహ్మానందం వేసాడు. సాఫ్ట్‍వేర్ ఇంజనీర్ ల మీద చమక్కులాడే కారక్టర్ అది.

 14. రాజశేఖర్ అన్న:థాంక్స్…రవి గారు:బ్రహ్మీ సాఫ్ట్‍వేర్ ఇంజనీర్ అనేది పోకిరి సినిమాలో ఓ కారక్టర్. బ్రహ్మానందం వేసాడు. సాఫ్ట్‍వేర్ ఇంజనీర్ ల మీద చమక్కులాడే కారక్టర్ అది.

 15. Nagaraja said,

  ఇదంతా వదిలేస్తే, బయట ఇండియా సాఫ్టువేరు ఉద్యోగుల పరిస్థితి అమెరికా కంటే చాలా నయం అనుకుంటాను..

 16. Nagaraja said,

  ఇదంతా వదిలేస్తే, బయట ఇండియా సాఫ్టువేరు ఉద్యోగుల పరిస్థితి అమెరికా కంటే చాలా నయం అనుకుంటాను..

 17. Phani said,

  ఇందులో ఒక ఉపయోగం కూడా ఉందండోయ్! ఆమధ్య ఎక్కడో చదివా అమ్మాయిలు సాఫ్టువేరు భర్తలనే ఎక్కువ కోరుకుంటున్నారట.

 18. Phani said,

  ఇందులో ఒక ఉపయోగం కూడా ఉందండోయ్! ఆమధ్య ఎక్కడో చదివా అమ్మాయిలు సాఫ్టువేరు భర్తలనే ఎక్కువ కోరుకుంటున్నారట.

 19. sarathbiochem said,

  hammayya! software vaariki kuaDaa baadhalumTaayanna maaTa. thank goD.

 20. hammayya! software vaariki kuaDaa baadhalumTaayanna maaTa. thank goD.

 21. రానారె said,

  నాకు ఉద్యోగం వచ్చినరోజు నేనూ నా మిత్రుడూ అనుకున్నాం – “ఇంకొకరి జీతంలోగానీ సంపాదనతోగానీ పోల్చుకుని మనసు పాడుచేసుకోకూడదు. మన సంపాదన మన అవసరాలకు సరిపోకపోతే ఇంకో ఉద్యోగాన్ని సంపాదించాలి అంతే తప్ప, ఇంకొకళ్లను చూసి, వాడికంటే ఎక్కువ సంపాదించాలి అనే పోలికలు మనసుకు శాంతి లేకుండా చేస్తాయి. ఈ ఆలోచనలు స్వతహాగా మనకు రాకున్నా ఇలాంటి పోలికలు తెచ్చే శ్రేయోభిలాషుల వేషం వేసుకున్న మానవులనుండి కూడా మన మనశ్శాంతిని కాపాడుకోవాలి” అని.

 22. నాకు ఉద్యోగం వచ్చినరోజు నేనూ నా మిత్రుడూ అనుకున్నాం – “ఇంకొకరి జీతంలోగానీ సంపాదనతోగానీ పోల్చుకుని మనసు పాడుచేసుకోకూడదు. మన సంపాదన మన అవసరాలకు సరిపోకపోతే ఇంకో ఉద్యోగాన్ని సంపాదించాలి అంతే తప్ప, ఇంకొకళ్లను చూసి, వాడికంటే ఎక్కువ సంపాదించాలి అనే పోలికలు మనసుకు శాంతి లేకుండా చేస్తాయి. ఈ ఆలోచనలు స్వతహాగా మనకు రాకున్నా ఇలాంటి పోలికలు తెచ్చే శ్రేయోభిలాషుల వేషం వేసుకున్న మానవులనుండి కూడా మన మనశ్శాంతిని కాపాడుకోవాలి” అని.

 23. ప్రవీణ్ గార్లపాటి said,

  నాగరాజ గారు:
  ఏమో మరి నాకు వారి మీద అంత అవగాహన లేదు, ఆ జీవితం నాకు ఇంటరెస్టూ లేదనుకోండి.

  phani గారు:
  హహ… అవునా అయినా ఇప్పుడు అమ్మాయిలూ సమానంగానే ఉన్నారుగా సాఫ్ట్‌వేర్ లో, పెద్ద కాంపిటీషన్ ఉండదేమో. 😉

  శరత్ గారు:
  సాఫ్ట్‌వేర్ వారికి బాధలు లేవని ఎవరన్నారండి ? పీత బాధలు పీతవి మరి 🙂

  రానారె:
  అవునయ్యా నేనూ అలాంటి డెసిషన్లే తీసుకున్నా అయినా ఎక్కడో అక్కడ ఈ డిస్కషన్లు రాక మానదు.

 24. నాగరాజ గారు:ఏమో మరి నాకు వారి మీద అంత అవగాహన లేదు, ఆ జీవితం నాకు ఇంటరెస్టూ లేదనుకోండి.phani గారు:హహ… అవునా అయినా ఇప్పుడు అమ్మాయిలూ సమానంగానే ఉన్నారుగా సాఫ్ట్‌వేర్ లో, పెద్ద కాంపిటీషన్ ఉండదేమో. ;)శరత్ గారు:సాఫ్ట్‌వేర్ వారికి బాధలు లేవని ఎవరన్నారండి ? పీత బాధలు పీతవి మరి :)రానారె:అవునయ్యా నేనూ అలాంటి డెసిషన్లే తీసుకున్నా అయినా ఎక్కడో అక్కడ ఈ డిస్కషన్లు రాక మానదు.

 25. వంశీకృష్ణ said,

  హయ్ ప్రవీణ్,
  మీరు చెప్పింది నిజమే. మీ టపా చాల బాగుంది. మీ బ్లాగు చూసిన తరువాత నాకు ఒక తెలుగు బ్లాగు ఉంటే బాగుంటుంది అనిపచింది. ప్రస్థుథానికైతే మీ బ్లాగు ని కాపి కొట్టేసి ఒక బ్లాగు తయారు చేసాను.

 26. హయ్ ప్రవీణ్, మీరు చెప్పింది నిజమే. మీ టపా చాల బాగుంది. మీ బ్లాగు చూసిన తరువాత నాకు ఒక తెలుగు బ్లాగు ఉంటే బాగుంటుంది అనిపచింది. ప్రస్థుథానికైతే మీ బ్లాగు ని కాపి కొట్టేసి ఒక బ్లాగు తయారు చేసాను.

 27. Arjuna said,

  ప్రవీణ్,
  నీ బ్లాగు చక్కగా వుంది. కొన్ని ఇంగ్లీషు పత్రికలు చేస్తున్నట్లు, మన తెలుగు పత్రికలు కూడ మీ బ్లాగుని ప్రింటు చేస్తే ఎంత బాగుంటుందో.

  ధన్యవాదాలు
  అర్జున

 28. Arjuna said,

  ప్రవీణ్,నీ బ్లాగు చక్కగా వుంది. కొన్ని ఇంగ్లీషు పత్రికలు చేస్తున్నట్లు, మన తెలుగు పత్రికలు కూడ మీ బ్లాగుని ప్రింటు చేస్తే ఎంత బాగుంటుందో.ధన్యవాదాలుఅర్జున

 29. ప్రవీణ్ గార్లపాటి said,

  వంశీ గారు:
  మీరు తెలుగు బ్లాగు మొదలెట్టారు గనక మీ ఆలోచనలను కూడా బ్లాగటం మొదలెట్టండి మరి.

  అర్జున్ గారు:
  మీ కాంప్లిమెంట్ కు కృతజ్ఞతలు. అంత అర్హత ఇంకా రాలేదు లేండి. కూడలి లో ఉన్న వారిలో నెనెంత 🙂

 30. వంశీ గారు:మీరు తెలుగు బ్లాగు మొదలెట్టారు గనక మీ ఆలోచనలను కూడా బ్లాగటం మొదలెట్టండి మరి.అర్జున్ గారు:మీ కాంప్లిమెంట్ కు కృతజ్ఞతలు. అంత అర్హత ఇంకా రాలేదు లేండి. కూడలి లో ఉన్న వారిలో నెనెంత 🙂

 31. రానారె said,

  కూడలిలో ఉన్నవారిలో నువ్వెంతా? ఎంతకావాలేమిటి? తెలుగులో (తొలి!?) టెక్నికల్ బ్లాగు నీదేకదయ్యా!

 32. కూడలిలో ఉన్నవారిలో నువ్వెంతా? ఎంతకావాలేమిటి? తెలుగులో (తొలి!?) టెక్నికల్ బ్లాగు నీదేకదయ్యా!

 33. శ్రీనివాసరాజు said,

  బాగుంది..

  సాఫ్వేర్.. ఇంజనీరు సాఫ్వేర్ ఇంజనీరు రాసుకుంటే.. బగ్గులు రాలాయని..!! అలా ఉంది.. మీ భాధలు మాకు.. మా భాధలు మీకు చెప్పుకుంటే ఏమొస్తుంది.. 🙂

  ఇవేమిటీ.. ఇంకా ఉన్నాయి.. బాధలు. అన్నీ రాసి జనాలకు బోర్ కొట్టించకూడదని.. రాయటంలేదు..

  ఖర్మ కాకపోతే.. ఏంటి చెప్పండి.. రెండురూపాయల సమోసా.. ఇరవై రూపాయలు పెట్టికొనుక్కోవటమేమిటీ…

 34. బాగుంది..సాఫ్వేర్.. ఇంజనీరు సాఫ్వేర్ ఇంజనీరు రాసుకుంటే.. బగ్గులు రాలాయని..!! అలా ఉంది.. మీ భాధలు మాకు.. మా భాధలు మీకు చెప్పుకుంటే ఏమొస్తుంది.. :-)ఇవేమిటీ.. ఇంకా ఉన్నాయి.. బాధలు. అన్నీ రాసి జనాలకు బోర్ కొట్టించకూడదని.. రాయటంలేదు..ఖర్మ కాకపోతే.. ఏంటి చెప్పండి.. రెండురూపాయల సమోసా.. ఇరవై రూపాయలు పెట్టికొనుక్కోవటమేమిటీ…

 35. balu said,

  baaga chepparu, alage system admin la badhalu kooda post cheyyagalaru

 36. balu said,

  baaga chepparu, alage system admin la badhalu kooda post cheyyagalaru

 37. balu said,

  software pokiri gaaru baaga rasaru

 38. balu said,

  software pokiri gaaru baaga rasaru


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: