జూన్ 22, 2007

సినిమాలో సినిమాలు మళ్ళీ …

Posted in సినిమా, సినిమాలు వద్ద 7:59 సా. ద్వారా Praveen Garlapati

When Harry Met Sally:

క్రిష్ గారి రొమాంటిక్ సినిమాల టపా చూసిన దగ్గర నుండి ఇది చూడాలని అనుకుంటున్నా (రొమాంటిక్ సినిమాలంటే నాకు ఇష్టం లేండి). మంచి సినిమా. అందులోనూ మెగ్ ర్యాన్ ఉంది… ఓహ్…

ఇంతకీ కథ ఏమిటి అంటే ఒక మగాడూ ఆడదీ స్నేహితులుగా ఉండలేరు, వారిద్దరి మధ్యలో సెక్స్ ఉండనే ఉంటుంది కానీ ఉత్త స్నేహితులుగానే ఉండలేరు అని మన హీరో వాదన. అలాంటిదేమీ లేదు స్నేహితులుగానే ఉండవచ్చని హీరోయిన్ వాదన. అసలు ఇద్దరికీ పరిచయం ఎలా కలుగుతుందంటే ఓ సారి న్యూ యార్క్ కి కలిసి ఒకే కారులో వెళతారు. అప్పుడు ఈ సంభాషణ జరుగుతుంది.
తరవాత ఇద్దరూ ఓ ఎయిర్ పోర్టులో కలుస్తారు కానీ ఇద్దరూ వేరే వారితో రిలేషన్ లో ఉంటారు ఆల్రడీ.
ఆ విషయం లో మాత్రం ఇద్దరూ ఎప్పుడూ ఒప్పుకోరు.
ఆ తరవాత ఇంకెప్పుడో కలుస్తారు. అప్పుడు ఇద్దరూ వారి వారి పార్ట్నర్స్ తో విడిపోయి ఉంటారు. హీరోయిన్ పెద్దగా ఫీలవకపోయినా హీరో మాత్రం ఎప్పుడూ తన ఎక్స్ గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. ఇక ఎలాగో ఇద్దరికీ స్నేహం కుదురుతుంది ఈ సారి. ఆఖరికి హీరో ఒప్పుకుంటాడు సెక్స్ లేకుండా స్నేహంగా ఉండచ్చని, అంతలోనే తన ఎక్స్ ఇంకో పెళ్ళి చేసుకుంటున్నాడని హీరోయిన్ కి తెలుస్తుంది. అప్పటి వరకూ ఏమీ పట్టనట్టు ఉన్న హీరోయిన్ కి తెగ ఏడుపొస్తుంది. హీరో ని పిలుస్తుంది. వాళ్ళిద్దరి మధ్యా తప్పు జరిగిపోతుంది (హెహె.. ఇంకే పదం ఉపయోగించాలో తెలీలేదు.) ఇక అక్కడ నుంచి ఇద్దరి మధ్యా దూరం పెరిగిపోతూ ఉంటుంది. ఆఖరికి ఇద్దరూ కలవడం తో కథ సుఖాంతం.
నాకు సినిమా నచ్చేసింది. ఎక్సలెంట్ పెర్ఫార్మెన్సులు. నాచురల్ గా ఉన్నాయి. మెగ్ ర్యాన్ మాత్రం హైలైట్.

నా రేటింగ్: 4/5

Just My Luck:

ఓ కామెడీ కథ. ఇద్దరు మనుషులు ఓ అబ్బాయి, ఓ అమ్మాయి. అబ్బయికేమో ఏది ముట్టుకున్నా దరిద్రమే. అమ్మాయేమో ఏది ముట్టుకుంటే అది బంగారం. ఇద్దరూ అలా సాగిపోతుంటారు. అనుకోకుండా ఓ పార్టీ లో ఆ అమ్మాయి ఆ అబ్బాయిని కిస్ చేస్తుంది (ఆ అబ్బాయెవరో తెలీకుండా). అక్కడితో ఆ అమ్మాయి గుడ్ లక్ కాస్తా అబ్బాయికి వెళ్ళిపోతుంది, ఆ అబ్బాయి బాడ్ లక్ కాస్తా అమ్మాయికి వచ్చేస్తుంది. ఇక అమ్మాయికి కష్టాలు మొదలు. ఉద్యోగం ఊడుతుంది, జైలుకెళుతుంది, ఫ్లాట్ కూలగొట్టబడుతుంది… అబ్బాయికేమో సూపర్ లక్ అతని బాండ్ కి మంచి మంచి ఛాన్సులొస్తాయి. బాగా పేరొస్తుంది. ఆ అమ్మాయికి గుడ్ లక్ వెనక్కి రావాలంటే మళ్ళీ ఆ అబ్బాయిని కిస్ చెయ్యాలి. ఇక ఆ అబ్బాయి కోసం వేట మొదలు. అనుకోకుండా ఆ అబ్బాయి అమ్మాయి కలుసుకుంటారు. ఇద్దరూ లవ్ లో పడతారు. కానీ ఆ అమ్మాయికి ఆ అబ్బాయే అని తెలీదు. ఆఖరికి ఆ అబ్బాయి బాండ్ పెద్ద స్టేజ్ షో ఇచ్చేటప్పుడు తెలుస్తుంది. అబ్బాయిని కిస్ చేసి తన లక్కు వెనక్కి తెచ్చేస్కుంటుంది, కానీ అంతలోనే గిల్టీ ఫీలయి తిరిగి కిస్ చేసి లక్ ని వెనక్కిచ్చేస్తుంది. ఆఖరికి లక్ సంగతి ఎలా ఉన్నా జీవించగలం అని చెప్పి ఇద్దరూ తెలుసుకోవడంతో కథ సుఖాంతం. టైం పాస్ సినిమా. నాకు నచ్చిందనుకోండి. లిండ్సే లోహన్ హాట్ (నా టేస్టు అప్పుడప్పుడూ అంతే.)

నా రేటింగ్: 3/5

Pirates of the Caribbean – At Worlds End:

క్రిష్ గారు బానే ఉందని చెప్పినా నాకిది పెద్దగా నచ్చలా… ఆఖరి అరగంట మాత్రం బాగుంది. కొద్దిగా డిసప్పాయింట్మెంట్ అనే చెప్పచ్చు. ముందర స్టోరీ అంతా కొద్దిగా సాగదీసినట్టు అనిపించింది. మొత్తానికి ఈ మూడు కూడా పెద్దగా క్లిక్కలా నాకు.

నా రేటింగ్: 3/5

అన్నట్టు ఓ కన్నడ సినిమా కూడా చూసానండోయ్… ముంగారు మళే అని. నా మొదటి కన్నడ సినిమా. ఫరవాలేదు. సాడ్ ఎండింగ్. పాటలు బాగున్నాయి.

14 వ్యాఖ్యలు »

 1. DILEEP said,

  మీరు http://employees.org వుపయోగిస్తారు కదా. అక్కడ account create చేసుకోవడానికి లింకు ఏమీ లేదు. employees.org ని వుపయోగించుకోవడానికి ఏమి చేయాలి.?

 2. DILEEP said,

  మీరు http://employees.org వుపయోగిస్తారు కదా. అక్కడ account create చేసుకోవడానికి లింకు ఏమీ లేదు. employees.org ని వుపయోగించుకోవడానికి ఏమి చేయాలి.?

 3. అజిత్ కుమార్ said,

  సినిమా కథ బాగుంది.మీరు కథని 2 నిమిషాలలోనే చెప్పడం ముగించారు. కనీసం ఇంగ్లీషు సినిమా కథను 30 నిమిషాలు చెప్పగలిగేలా ఉంటే బాగుంటుంది.ఒకసారి ప్రయత్నించి చూడండి.

 4. సినిమా కథ బాగుంది.మీరు కథని 2 నిమిషాలలోనే చెప్పడం ముగించారు. కనీసం ఇంగ్లీషు సినిమా కథను 30 నిమిషాలు చెప్పగలిగేలా ఉంటే బాగుంటుంది.ఒకసారి ప్రయత్నించి చూడండి.

 5. Krishh Raem said,

  …. చెప్పాగా మెగ్ ర్యాన్ ఇస్ క్వీన్ ఆఫ్ రోమాన్స్ అని …. 🙂 ….
  వీలైతే Knocked Up చూడండి , సూపర్ మూవీ :)..

 6. Krishh Raem said,

  …. చెప్పాగా మెగ్ ర్యాన్ ఇస్ క్వీన్ ఆఫ్ రోమాన్స్ అని …. 🙂 ….వీలైతే Knocked Up చూడండి , సూపర్ మూవీ :)..

 7. ప్రవీణ్ గార్లపాటి said,

  దిలీప్ గారు:
  అది కంపెనీ దండీ. బయటి వారు రిజిస్టర్ చేసుకోవడానికి కుదరదు.

  అజిత్ గారు:
  మీరు గానీ వెటకారంగా అంటున్నారా ?

  క్రిష్:
  మూవీ నోటెడ్ 🙂

 8. దిలీప్ గారు:అది కంపెనీ దండీ. బయటి వారు రిజిస్టర్ చేసుకోవడానికి కుదరదు.అజిత్ గారు:మీరు గానీ వెటకారంగా అంటున్నారా ?క్రిష్:మూవీ నోటెడ్ 🙂

 9. అజిత్ కుమార్ said,

  క్షమించాలి. సినిమా కథ మొత్తం వినవచ్చని….ఇంకే అర్ధమూలేదు.

 10. క్షమించాలి. సినిమా కథ మొత్తం వినవచ్చని….ఇంకే అర్ధమూలేదు.

 11. ప్రవీణ్ గార్లపాటి said,

  అజిత్ గారు:
  అయితే నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను. వచ్చే సారి నుంచి ఇంకొంచం వివరంగా రాయడానికి ప్రయత్నిస్తా. ఎంతయినా క్రిష్ లాగో, వెంకట్ గారి లాగో రాయడం నా వల్ల కాదు 🙂

 12. అజిత్ గారు:అయితే నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను. వచ్చే సారి నుంచి ఇంకొంచం వివరంగా రాయడానికి ప్రయత్నిస్తా. ఎంతయినా క్రిష్ లాగో, వెంకట్ గారి లాగో రాయడం నా వల్ల కాదు 🙂

 13. Falling Angel said,

  Meg is my love godess 🙂

 14. Meg is my love godess 🙂


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: