జూలై 4, 2007

కూడలి కి కొత్త ఫీచర్లు…

Posted in కూడలి, గ్రీజ్‌మంకీ, టెక్నాలజీ వద్ద 7:11 సా. ద్వారా Praveen Garlapati

అదేంటి వీవెన్ కాకుండా నేను విడుదల చేస్తున్నానేంటా అని అనుకుంటున్నారా ? అదే మరి.

మొన్న వీవెన్ గారు కూడలి కోసం కొత్త ఫీచర్ రిలీజ్ చేసినప్పుడు రానారె అడిగాడు, కూడలి లో మనకు కావలసిన టపాలు మాత్రమే కనిపించేలా చేసే ఫీచర్ కోసమని.

అంతకు ముందే నేను ఆ ఫీచర్ రాద్దామనుకున్నా… 🙂

దీనికి జిడ్డుకోతి కావాలి (అదే Greasemonkey). దానిని మీ మంట నక్క లో ఇన్స్టాల్ చేసుకోండి.

తర్వాత ఇక్కడ నుంచి స్క్రిప్ట్ ని దిగుమతి చేసుకుని జిడ్డు కోతిలో చేర్చుకోండి.

ఇదెలా పనిచేస్తుందంటే దీనిని మీ జిడ్డు కోతిలో అమర్చుకున్న తర్వాత మొదటి సారి కూడలి ని తెరుస్తే మిమ్మల్ని ఓ కొచ్చెన్ అడుగుద్ది, ఏ ఏ బ్లాగుల నుండి మీకు టపాలు కనిపించాలో అని. కాబట్టి ముందు మీకు ఏ ఏ బ్లాగులు కనిపించాలనుకుంటూన్నారో వాటి లంకెలు రెడీగా పెట్టుకోండి.

మీకు కావలసిన బ్లాగులన్నీ “|” డీలిమిటర్ తో అందులో ఇవ్వండి.

ఉదా: http://abc.blogspot.com|http://def.wordpress.com అలా అన్నమాట. అంతే కూడలిని ఓ సారి రిఫ్రెష్ చెయ్యండి. మీకు కావలసిన బ్లాగుల నుండి టపాలు మాత్రమే కనిపిస్తాయి.

ఉదా: http://uniquespeck.blogspot.com/ అనే బ్లాగొకటే కనిపించాలని నేను ఎంచుకుంటే కూడలి పేజీ నాకు ఈ కింద ఉన్నట్లుగా కనిపిస్తుంది.

కానీ ఇందులో ఓ మతలబు ఉంది. మీకు కావలసిన బ్లాగుల లిస్టులో ఓ కొత్త బ్లాగుని చేర్చాలనుకోండి ఈ కింది ప్రొసీజర్ ఫాలో అవ్వాలి:

మీ మంట నక్క URL bar లో about:config అని టైప్ చెయ్యండి. వచ్చిన తర్వాత, దాని ఫిల్టర్ బాక్సులో greasemonkey.scriptvals.http://employees.org/~praveeng/KoodaliFilter-Include.
blockurls అని టైప్ చేసి వచ్చినే ఎంట్రీ ని ఎంచుకుని మీ ఎలక తో డబల్ క్లిక్కండి. అక్కడ మీకు కావలసిన బ్లాగుని ఇంకో “|” జత చేసి జోడించండి. ఇక నుండి ఆ బ్లాగు టపాలు కూడా మీకు కనిపించడం మొదలెడుతుంది.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ఒక వేళ మీరు కావలసిన బ్లాగులు కాకుండా అక్కరలేని బ్లాగులు తీసెయ్యాలనుకున్నరనుకోండి కూడలి లోనుంచి దానికి కూడా ఓ స్క్రిప్ట్ రాశా. పై దీనికి ఉల్టా అన్నమాట. ఉపయోగించడం పై దానిలాగానే. కాకపోతే దీనికి మీకు అక్కరలేని బ్లాగుల లంకెలు ఇవ్వండి.

తరవాతి సారి నుంచి మీకు అక్కర్లేని బ్లాగులు కనిపించవు. పైదాని లాగే ఈ లిస్టు కి ఏదయినా ఇంకో బ్లాగు జోడించాలంటే మళ్ళీ about:config కి వెళ్ళి ఈ సారి greasemonkey.scriptvals.http://employees.org/~praveeng/KoodaliFilter-Exclude.
blockurls
అనే దానిని ఎంచుకుని దానికి ఆ బ్లాగు లంకె ని జోడించండి. అంతే.

కూడలిలో కూడా ఇదే కోడునుపయోగించి ఫీచర్ ని జోడించచ్చు. కాకపోతే ఏ కుకీ నో ఉపయోగించాలి బ్లాగులను గుర్తు పెట్టుకోవడానికి.

* గ్రీజ్‌మంకీ గురించి ఓ చిన్న ఇంట్రడక్షన్ కావాలంటే నా ఈ టపా చదవచ్చు. ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే ఈ పుస్తకం చదవండి.
* మీరు గనక మంట నక్క (firefox) ఉపయోగించనట్లయితే మీకిది పనికిరాదు.

26 వ్యాఖ్యలు »

 1. Krishh Raém said,

  కోటి ధాంకులు !! 🙂

  ఇలాంటి పుణ్య కార్యాలు చేస్తూ పోతే … దేవుడు మీకు కోరినన్ని మంచి సినిమాలు దొరికేలా చేస్తాడు 😉 !!

 2. Krishh Raém said,

  కోటి ధాంకులు !! :)ఇలాంటి పుణ్య కార్యాలు చేస్తూ పోతే … దేవుడు మీకు కోరినన్ని మంచి సినిమాలు దొరికేలా చేస్తాడు 😉 !!

 3. మాకినేని ప్రదీపు said,

  నాది కూడా సేం టు సేం డిట్టో కామెంటు.

 4. నాది కూడా సేం టు సేం డిట్టో కామెంటు.

 5. This comment has been removed by the author.

 6. This comment has been removed by the author.

 7. This comment has been removed by the author.

 8. ప్రవీణ్ గార్లపాటి said,

  క్రిష్: ఆహా, ఇలాంటి వరమిస్తే ఇంకే…

  ప్రదీపు: మరేం పరవాలేదు నేనూ ఎన్నో సార్లు అలాంటి మిస్టేకులు చేసాను…

 9. క్రిష్: ఆహా, ఇలాంటి వరమిస్తే ఇంకే…ప్రదీపు: మరేం పరవాలేదు నేనూ ఎన్నో సార్లు అలాంటి మిస్టేకులు చేసాను…

 10. chava said,

  This comment has been removed by the author.

 11. రానారె said,

  దీనికోసం అయ్యీకి మంటబెట్టి మంటనక్కను తెచ్చుకోవలసిందే! థాంకులు!!

 12. దీనికోసం అయ్యీకి మంటబెట్టి మంటనక్కను తెచ్చుకోవలసిందే! థాంకులు!!

 13. Giri said,

  Can’t we achieve the same by using Yahoo pipes?

  Loss of sponteinity is one problem with extreme personalization, to give a small example – how would you discover good new blogs if you have a filtered koodali? Do you agree?

 14. Giri said,

  Can’t we achieve the same by using Yahoo pipes?Loss of sponteinity is one problem with extreme personalization, to give a small example – how would you discover good new blogs if you have a filtered koodali? Do you agree?

 15. ప్రవీణ్ గార్లపాటి said,

  చావా గారు:
  తొందర పడ్డారండీ…
  పైన తొలగించిన వ్యాఖ్యలు మీవి కాదు ప్రదీప్ గారివి. ఆయనే తొలగించారు. మీరు చేసిన వ్యాఖ్యలు ఈ టపాలో కాదు (నా ఇంతకు ముందు టపాలో)

  రానారె: శుభం !

  గిరి గారు:
  Yahoo! Pipes తో సొల్యూషన్ లేదని నేననలేదు. వీవెన్ టపాలో నా వ్యాఖ్య చూస్తే మీకే అర్థమవుతుంది.
  ఇంకోటి మీరు టపా పూర్తిగా చదవలేదు. ఇంక్లూడ్ ఫిల్టర్ వాడితే మీకు సమస్యేమో కానీ ఎక్స్క్లూడ్ ఫిల్టర్ వాడితే మీకు సమస్యెందుకో నా కర్థం కాలేదు. అయినా ఇదో ఆప్షన్ మాత్రమే అవసరం అయిన వారు వాడుకుంటారు. బలవంతం కాదు.

 16. చావా గారు: తొందర పడ్డారండీ…పైన తొలగించిన వ్యాఖ్యలు మీవి కాదు ప్రదీప్ గారివి. ఆయనే తొలగించారు. మీరు చేసిన వ్యాఖ్యలు ఈ టపాలో కాదు (నా ఇంతకు ముందు టపాలో)రానారె: శుభం !గిరి గారు: Yahoo! Pipes తో సొల్యూషన్ లేదని నేననలేదు. వీవెన్ టపాలో నా వ్యాఖ్య చూస్తే మీకే అర్థమవుతుంది.ఇంకోటి మీరు టపా పూర్తిగా చదవలేదు. ఇంక్లూడ్ ఫిల్టర్ వాడితే మీకు సమస్యేమో కానీ ఎక్స్క్లూడ్ ఫిల్టర్ వాడితే మీకు సమస్యెందుకో నా కర్థం కాలేదు. అయినా ఇదో ఆప్షన్ మాత్రమే అవసరం అయిన వారు వాడుకుంటారు. బలవంతం కాదు.

 17. oremuna said,

  గమనిక: ఇక్కడ బ్లాగావరణంలో ఇద్దరు చావాలు ఉన్నారు చావాకిరణ్ చావాశరత్ 🙂

 18. oremuna said,

  గమనిక: ఇక్కడ బ్లాగావరణంలో ఇద్దరు చావాలు ఉన్నారు చావాకిరణ్ చావాశరత్ 🙂

 19. chava said,

  oops .. my bad .. i take it back

 20. chava said,

  oops .. my bad .. i take it back

 21. ప్రవీణ్ గార్లపాటి said,

  చావా గారు:
  మిమ్మల్నే… చావా కిరణ్ గారు 🙂
  నేను భలే కన్ఫ్యూజ్ అయ్యా. కామెంట్ చేసింది మీరేననుకున్నా

  chava gaaru:
  ఫరవాలా… నో ప్ర్రాబ్లెం.

 22. చావా గారు: మిమ్మల్నే… చావా కిరణ్ గారు :)నేను భలే కన్ఫ్యూజ్ అయ్యా. కామెంట్ చేసింది మీరేననుకున్నాchava gaaru:ఫరవాలా… నో ప్ర్రాబ్లెం.

 23. రానారె said,

  ఈరోజే గూగుల్ రీడరు వాడటం మొదలెట్టాను. నీ టపాలు కూడలి సుడిలోపడి నాక్కనబడకుండా కొట్టుకుపోవడం జరగదింక.

 24. ఈరోజే గూగుల్ రీడరు వాడటం మొదలెట్టాను. నీ టపాలు కూడలి సుడిలోపడి నాక్కనబడకుండా కొట్టుకుపోవడం జరగదింక.

 25. ప్రవీణ్ గార్లపాటి said,

  రానారె:

  గూగుల్ రీడర్ అదుర్స్… మరీ ఎక్కువ ఫీడ్లుంటే మాత్రం టైమంతా హుష్ కాకే 🙂

 26. రానారె:గూగుల్ రీడర్ అదుర్స్… మరీ ఎక్కువ ఫీడ్లుంటే మాత్రం టైమంతా హుష్ కాకే 🙂


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: