జూలై 23, 2007

హారీ పాటర్ అండ్ ద డెత్లీ హాలోస్ …

Posted in హారీ పాటర్ వద్ద 6:20 సా. ద్వారా Praveen Garlapati

హారీ పాటర్ అండ్ ద డెత్లీ హాలోస్… రిలీజ్ అయ్యింది. నాకు మాత్రం చాలా బాధగా ఉంది.
నేను చదివిన పుస్తకాలన్నింటిలోనూ నన్నెంతగానో ఆకట్టుకున్న హారీ పాటర్ ఇక ఉండదంటేనే నాకెంతో బాధగా ఉంది.

ఆప్పటికీ ఈ పుస్తకం చదవకుండా కొన్ని గంటలు వాయిదా వేసాను. ఊహూ… కుదిరితేగా. ఒక్క అదాటున మొత్తం చదివేశా.

అంతా బాగానే ఉన్నా ఎండింగ్ మాత్రం ఏదో మన తెలుగు సినిమాల్లోలా తీసినట్టు అనిపించింది. ట్విస్ట్లు కూడా ఎక్కువయ్యాయి.
అయినా బాగానే ఉంది.

నాకు అన్నిట్లోనూ నచ్చిన హారీ పాటర్ – హారీ పాటర్ అండ్ ద గోబ్లెట్ ఆఫ్ ఫైర్. ఇందులో అద్భుతమయిన సాహసాలు చేస్తూ ఉర్రూతలూగించే సన్నివేశాలు చాలా ఉన్నాయి.
అయితే నిరాశపరిచిందేమిటంటే వీటి ఆధారంగా తీయబడిన ఏ సినిమాలోనూ పుస్తకం లో ఉన్నట్టుగా చూపించలేకపోవడం. అది కుదరదు కూడా అనుకోండి.

పుస్తకం చదవని జనాలు హారీ పాటర్ అంటే కేవలం మాజిక్కు, మాయలు, మంత్రాలు మాత్రమే అనుకుంటారు. కానీ నాకు ఇందులో నచ్చేదేమిటంటే హారీ పాటర్ ని ఎప్పుడూ రచయిత ఓ మామూలు అబ్బాయిగానే చూపించింది కానీ హీరో లా కాదు. అవును ధైర్య సాహసాలు మెండుగా ఉంటాయి కానీ మిత్రుల పట్ల చూపించే బాధ్యత, వాళ్ళ మీద నమ్మకం, అన్నిటికీ నేనే అనే అహంభావం లేకపోవడం, నిజాయితీ, ప్రేమ ఇలాంటి భావాలు పుస్తకం నిండా కనిపిస్తాయి.

నాకయితే అన్నిటికన్నా స్నేహమే ఇందులో ఎక్కువగా హత్తుకున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు కష్టాలు వచ్చినా ఒకరికొకరు అన్నట్టు ఉంటారు ముగ్గురు స్నేహితులు హారీ పాటర్, హెర్మియానీ, రాన్. ఒక్కొక్కరు ఒక్కో విధంగా వినూత్నమయిన శైలిలో ఉంటారు కానీ అందరూ కలిసి సాధించే విజయాలే ముఖ్యం గా కనిపిస్తాయి. హెర్మియానీ అయితే ఎంతో తెలివి గల పిల్ల. చటుక్కున పట్టేసి లటుక్కున చేసేస్తుంది ఏదయినా సరే. ఎన్నో పుస్తకాలు చదువుతుంది. కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటుంది. రాన్ అయితే హారీ కి ఎంతో దగ్గరగా ఉండే స్నేహితుడు. కొద్దిగా మూర్ఖత్వం ఉన్నా ఎన్నో సార్లు హారీ ని రక్షిస్తాడు. ఇక హారీ అన్నిటిలోనూ సామాన్యంగానే ఉన్నా దుడుకుగా ఉంటూ, నిజం కోసం పోరాడుతూ, ధైర్య సాహసాలతో ముందడుగు వేస్తుంటాడు.

ఇక ఈ కొత్త పుస్తకం లో ముగ్గురూ కలిసి వాల్డెమార్ట్ కి సంబంధించిన హార్క్రక్స్ లను ఎలా నాశనం చెయ్యగలిగారో అనేది కథ. తప్పు చేసినా తప్పు ని ఒప్పుకుని, స్నేహితులలో తప్పులను మన్నించి, అందరినీ కలుపుకుని చెడు మీద ఎలా పోరాడుతాడో పుస్తకం చదవాల్సిందే. ఇంకా అందరూ చదివి ఉండరు కాబట్టి నేను కథ గురించి చెప్పను.

ఇలాంటి కథ ముగుసిపోయిందంటే మీకు కూడా బాధగా లేదూ ???
హారీ మళ్ళీ కొనసాగితే బాగుండు. ప్చ్….

10 వ్యాఖ్యలు »

 1. మాకినేని ప్రదీపు said,

  అవును బాధగానే ఉంటుంది. కానీ మళ్లీ కొనసాగితే సాగదీసినట్లు అనిపిస్తుంది. అందుకని మీరు హ్యారీ పోట్ర్ను మొదటి నుండి మళ్లీ చదవండి అప్పుడు కొత్త కొత్తవి చదివినట్లు అనిపిస్తుంది.

  నేను మూడు రకాల హ్యారీ పోటర్ నవలలు చదివాను. రెండేమో ఫ్యాన్ ఫిక్షన్లు, ఒకటి అసలుది. అన్నిటికింటే అసలయినదే చాలా లాజికల్‌గా అనిపించింది. నాకు అన్నిటికంటే చివరి చాప్టర్లే బాగా నచ్చాయి.

 2. అవును బాధగానే ఉంటుంది. కానీ మళ్లీ కొనసాగితే సాగదీసినట్లు అనిపిస్తుంది. అందుకని మీరు హ్యారీ పోట్ర్ను మొదటి నుండి మళ్లీ చదవండి అప్పుడు కొత్త కొత్తవి చదివినట్లు అనిపిస్తుంది.నేను మూడు రకాల హ్యారీ పోటర్ నవలలు చదివాను. రెండేమో ఫ్యాన్ ఫిక్షన్లు, ఒకటి అసలుది. అన్నిటికింటే అసలయినదే చాలా లాజికల్‌గా అనిపించింది. నాకు అన్నిటికంటే చివరి చాప్టర్లే బాగా నచ్చాయి.

 3. నవీన్ గార్ల said,

  హ్హ హ్హ హ్హ…ఇంత వరకు నేను ఒక్క పుస్తకం / సినిమా కూడా చదవలేదు / చూడలేదు. ఇప్పుడు ఏడు పుస్తకాలు నా ముందేసుకొని..తీరికగా ప్రశాంతంగా చదువుతా 🙂
  అసలే నాకు మాంత్రికులు, సాహసాలు అంటే భలే ఇష్టం

 4. హ్హ హ్హ హ్హ…ఇంత వరకు నేను ఒక్క పుస్తకం / సినిమా కూడా చదవలేదు / చూడలేదు. ఇప్పుడు ఏడు పుస్తకాలు నా ముందేసుకొని..తీరికగా ప్రశాంతంగా చదువుతా :)అసలే నాకు మాంత్రికులు, సాహసాలు అంటే భలే ఇష్టం

 5. ప్రవీణ్ గార్లపాటి said,

  @ప్రదీపు:

  హహహ…

  నేను కూడా ఒకటి మొదలెట్టా ఫాన్ ఫిక్షన్ కానీ ముగించలా.
  పోయిన సారి మాత్రం ఓ ఫాన్ ఫిక్షన్ ని పూర్తిగా చదివా.

  అవును అన్నిటికన్నా అసలు నవలే బాగుంటుంది ఎందుకంటే అన్ని దారాలనూ కలుపుతుంది రచయిత్రి. ఎక్కడెక్కడి మిస్సింగ్ పార్టులన్నీ పూడ్చబడినవి.

  ఎండింగ్ బాలేదని కాదు కానీ కొద్దిగా ఫిల్మీ స్టైల్ లో చేసింది. ఇంకొద్దిగా బాగా చెయ్యచ్చు అని నా ఉద్దేశం. నెవిలే నాగిని ని చంపడం కూడా నాకు నచ్చింది. పాత్ర కి ఇవ్వాల్సిన ప్రాముఖ్యం వచ్చింది.

  నవీన్ అన్న:

  మీకు భలే నచ్చుతుంది లేండి. నేనూ మళ్ళీ మొదలెట్టా 🙂

 6. @ప్రదీపు:హహహ…నేను కూడా ఒకటి మొదలెట్టా ఫాన్ ఫిక్షన్ కానీ ముగించలా.పోయిన సారి మాత్రం ఓ ఫాన్ ఫిక్షన్ ని పూర్తిగా చదివా.అవును అన్నిటికన్నా అసలు నవలే బాగుంటుంది ఎందుకంటే అన్ని దారాలనూ కలుపుతుంది రచయిత్రి. ఎక్కడెక్కడి మిస్సింగ్ పార్టులన్నీ పూడ్చబడినవి.ఎండింగ్ బాలేదని కాదు కానీ కొద్దిగా ఫిల్మీ స్టైల్ లో చేసింది. ఇంకొద్దిగా బాగా చెయ్యచ్చు అని నా ఉద్దేశం. నెవిలే నాగిని ని చంపడం కూడా నాకు నచ్చింది. పాత్ర కి ఇవ్వాల్సిన ప్రాముఖ్యం వచ్చింది.నవీన్ అన్న:మీకు భలే నచ్చుతుంది లేండి. నేనూ మళ్ళీ మొదలెట్టా 🙂

 7. రానారె said,

  ఏవిటీ! అదాటున చదివించేస్తుందా? మీ టపా చూసేవరకూ నాకూ హ్యారీపాటర్ కథల మీద సదభిప్రాయం లేదు. హ్యారీ, స్పైడర్‌మాన్, లార్డాఫ్‌దరింగులు ఇయ్యన్నీ నాకు నచ్చే విషయాలు కాదులే వదిలేశాను. లార్డాఫ్‌దరింగుల్లో ఒక రింగు డీవీడీ నా మిత్రుడు ఒకసారి తెచ్చాడు, బలవంతంగా చూశాను కొంతసేపు. నాకేమాత్రం నచ్చలేదు. గ్రాఫిక్సు సీన్లు కొన్ని బాగున్నాయి. మిగతా కథంతా పరమచెత్తగా అనిపించింది. హ్యారీని కూడా ఇదే కోవలో జమక్కట్టి అతని జోలికి పోలేదు.

 8. ఏవిటీ! అదాటున చదివించేస్తుందా? మీ టపా చూసేవరకూ నాకూ హ్యారీపాటర్ కథల మీద సదభిప్రాయం లేదు. హ్యారీ, స్పైడర్‌మాన్, లార్డాఫ్‌దరింగులు ఇయ్యన్నీ నాకు నచ్చే విషయాలు కాదులే వదిలేశాను. లార్డాఫ్‌దరింగుల్లో ఒక రింగు డీవీడీ నా మిత్రుడు ఒకసారి తెచ్చాడు, బలవంతంగా చూశాను కొంతసేపు. నాకేమాత్రం నచ్చలేదు. గ్రాఫిక్సు సీన్లు కొన్ని బాగున్నాయి. మిగతా కథంతా పరమచెత్తగా అనిపించింది. హ్యారీని కూడా ఇదే కోవలో జమక్కట్టి అతని జోలికి పోలేదు.

 9. ప్రవీణ్ గార్లపాటి said,

  రానారె:
  లార్డ్ ఆఫ్ ద రింగ్స్ నాకు కూడా అంత నచ్చలా పుస్తకం. అలా సాగుతుంటుంది. సినిమా మొదటిది అయితే మొదటి సారి చూసినప్పుడు అరగంట లో నిద్రపోయాను 🙂
  కానీ గ్రాఫిక్స్ మాత్రం అదిరేలా ఉంటాయి. తరవాత అన్నీ చూసాను. బాగానే ఉన్నాయి.

  హారీ పాటర్ మాత్రం వీటన్నిటికంటే ఓ ప్రత్యేక స్థానం. అదో లోకం. చాలా బాగుంటుంది. ట్రై చెయ్యి. నచ్చుతుందనే అనుకుంటున్నా…

 10. రానారె:లార్డ్ ఆఫ్ ద రింగ్స్ నాకు కూడా అంత నచ్చలా పుస్తకం. అలా సాగుతుంటుంది. సినిమా మొదటిది అయితే మొదటి సారి చూసినప్పుడు అరగంట లో నిద్రపోయాను :)కానీ గ్రాఫిక్స్ మాత్రం అదిరేలా ఉంటాయి. తరవాత అన్నీ చూసాను. బాగానే ఉన్నాయి.హారీ పాటర్ మాత్రం వీటన్నిటికంటే ఓ ప్రత్యేక స్థానం. అదో లోకం. చాలా బాగుంటుంది. ట్రై చెయ్యి. నచ్చుతుందనే అనుకుంటున్నా…


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: