ఆగస్ట్ 20, 2007

Posted in సినిమా, The Ant Bully వద్ద 8:16 సా. ద్వారా Praveen Garlapati

చాలా రోజుల తరవాత సినిమా గురించి రాస్తున్నా…
చూడక కాదు లేండి, తెగ చూసా, ఎన్నిటి గురించని రాస్తా 🙂

నే చెప్పబోయే సినిమా “The Ant Bully”. అన్న గారి సెలెక్షన్. చూడు బాగుంటుంది అని చెప్పారు. ఆనిమేషన్, కార్టూన్లు నాకు తెగ ఇష్టం. అందుకనే వెంటనే చూసేసా. మంచి సినిమా.

టాం హాంక్స్ నిర్మాత ఈ సినిమాకి. ఇందులో ఆనిమేషన్ బాగుంది. కథ కూడా చక్కగానే నడుస్తుంది.

ఓ చిన్ని పిల్లాడు తన తోటి పిల్లలు తనని ఏడిపిస్తున్నందుకు తన కోపాన్ని చీమల మీద ప్రదర్శిస్తూంటాడు. దాని వల్ల ఆ చీమలకి విపరీతమయిన నష్టం కలుగుతుంది. అందుకని ఆ చీమలు ఓ రకమయిన పోషన్ తయారు చేసి ఆ పిల్లాడిని చీమలంత చిన్నగా మార్చేస్తాయి.
తమ లోకంలోకి తీసుకెళ్ళి శిక్షగా ఆ పిల్లాడు కూడా చీమలాగే బతకాలని తీర్పిస్తాయి.

ఇక అక్కడ నుంచి చీమల ప్రపంచంలో బతుకలేక ఇమడలేక, అవి పడే కష్టం తెలుసుకుని అబ్బురపడతాడు. చివరికి ఇంత కష్టపడే చీమలనా నేను హింసిస్తుంది అని తెలుసుకుని వాటిని కాపాడతాడు.

ఈ సినిమాలో చక్కని హాస్యంతో పాటు మంచి సందేశం కూడా ఉంది. ఎవరూ తక్కువ కాదు ఎవరూ ఎక్కువ కాదు. కలిసి కట్టుగా ఉంటే ఏదయినా సాధ్యమేనని చీమలు నిరూపిస్తాయి. చిన్న పెద్ద తేడా కాదు, శక్తి యుక్తి కాదు, అందరూ తమ వంతు సహాయం చేస్తే ఈ సమాజం ఎంతో బాగుపడుతుంది.

చీమల మాంత్రికుడు, పిల్లాడి కారెక్టరు, సెంటిమెంట్ పండించే మాంత్రికుడి భార్య కారెక్టర్లు నాకు నచ్చాయి. జెల్లీ బీన్స్ సన్నివేశం, కప్ప చీమలని మింగేసే ఘట్టం నాకు బాగా నచ్చాయి.

అన్నట్టు ఆనిమేషన్ ఎంత కష్టమో తెలుసా మీకు ? ఒక్కొక్క సినిమా తీయడానికే మూడునాలుగేళ్ళు కూడా పట్టవచ్చు. ఎందుకంటారా అందులో కనిపించే కారెక్టర్ల హావ భావాలు అవీ ఎంతో నాచురల్ గా రావాలంటే తప్పదు మరి. ఆ సినిమాలు చూస్తున్నంత సేపూ మనకి అవి ఆనిమేటెడ్ అయినా వాటికీ ఫీలింగ్స్ ఉంటాయి అని మనకు అనుభూతి కలిగించేలా చేయాలంటే దానికెంతో రీసెర్చ్ అవసరం మరి.

అదీ కాక ఒక్క కారెక్టర్ ని తీసుకుంటే దానికి సంబంధించిన చిన్న చిన్న వివరాలను కూడా ఎంతో జాగ్రత్తగా చెయ్యాల్సుంటుంది. ఉదాహరణకి ఆ కారెక్టర్ నడుస్తున్నప్పుడు జుట్టు ఎగరడం, నవ్వినప్పుడు పెదాలు సాగడం, ముఖ కవళికలు, నడక లో సోయగాలు మొదలయినవి.
నమ్మరా ఓ సారి ష్రెక్ లాంటి సినిమా ఒకటి చూడండి. అందుకే నేను ఎప్పుడు ఈ ఆనిమేషన్ సినిమాలు చూసినా అవి నన్ను అబ్బురపరుస్తాయి.

ప్రకటనలు

8 వ్యాఖ్యలు »

 1. S said,

  Hmm… ఆసక్తి కరంగా ఉంది కథాంశం…
  అనిమేషన్ సినిమాలు చాలా వరకు అంతర్లీనంగా ఏదో ఒక సందేశం తోనే ఉంటాయి అనుకుంటా…. ఇప్పటి వరకు చూసిన అన్ని అనిమేషన్ సినిమాల్లోనూ ఆ ఎలిమెంట్ ఉంది. ఒక వేళ సందేశం పాలు తక్కువుంటే ఫిలాసఫీ పాలు ఎక్కువ కనబడ్డది. సాంకేతికత పెరుగుతున్న కొద్దీ పాత్రలు మరింత జీవకళను పొందుతున్నాయి అనుకుంటా ఈ సినిమాల్లో.

 2. S said,

  Hmm… ఆసక్తి కరంగా ఉంది కథాంశం…అనిమేషన్ సినిమాలు చాలా వరకు అంతర్లీనంగా ఏదో ఒక సందేశం తోనే ఉంటాయి అనుకుంటా…. ఇప్పటి వరకు చూసిన అన్ని అనిమేషన్ సినిమాల్లోనూ ఆ ఎలిమెంట్ ఉంది. ఒక వేళ సందేశం పాలు తక్కువుంటే ఫిలాసఫీ పాలు ఎక్కువ కనబడ్డది. సాంకేతికత పెరుగుతున్న కొద్దీ పాత్రలు మరింత జీవకళను పొందుతున్నాయి అనుకుంటా ఈ సినిమాల్లో.

 3. చేతన said,

  I’m a huge fan of animation movies, and the ones from Pixar particularly. I used to be under the impression that animation movies are kid stuff. Finding Nemo was huge hit then, and I dint understand why people were flocking to the theaters. I watched Monsters Inc on a casette an year later.. I was totally bowled over. Now I usually try not to miss out on any of the animation movies in theaters.

 4. చేతన said,

  I’m a huge fan of animation movies, and the ones from Pixar particularly. I used to be under the impression that animation movies are kid stuff. Finding Nemo was huge hit then, and I dint understand why people were flocking to the theaters. I watched Monsters Inc on a casette an year later.. I was totally bowled over. Now I usually try not to miss out on any of the animation movies in theaters.

 5. ప్రవీణ్ గార్లపాటి said,

  @సౌమ్య గారు: అవును పాత్రలను జీవకళ ఉట్టిపడేలా తీర్చిదిద్దుతున్నారు. అందుకే నాకు కూడా ఆనిమేషన్ సినిమాలంటె ఎంతో ఇష్టం. హాపీ ఫీట్ లాంటి సినిమాలతో మంచి మంచి సన్దేశాలు కూడా అందించారు. ఫైండింగ్ నెమో నాకు బాగా నచ్చిన మరో ఆనిమేషన్ సినిమా.

  @చేతన గారు: వాల్ట్ డిస్నీ నుంచి వచ్చే సినిమాలు చాలా మంచి ఆనిమేషన్ కలిగుంటాయి. ష్రెక్ ఒకటి, రెండు నాకు చాలా బాగా నచ్చిన ఆనిమేషన్ సినిమాలు.

 6. @సౌమ్య గారు: అవును పాత్రలను జీవకళ ఉట్టిపడేలా తీర్చిదిద్దుతున్నారు. అందుకే నాకు కూడా ఆనిమేషన్ సినిమాలంటె ఎంతో ఇష్టం. హాపీ ఫీట్ లాంటి సినిమాలతో మంచి మంచి సన్దేశాలు కూడా అందించారు. ఫైండింగ్ నెమో నాకు బాగా నచ్చిన మరో ఆనిమేషన్ సినిమా.@చేతన గారు: వాల్ట్ డిస్నీ నుంచి వచ్చే సినిమాలు చాలా మంచి ఆనిమేషన్ కలిగుంటాయి. ష్రెక్ ఒకటి, రెండు నాకు చాలా బాగా నచ్చిన ఆనిమేషన్ సినిమాలు.

 7. రానారె said,

  Over the Hedge చూశావా? అందులో మొదటి సీన్‌కే నేను ఫ్లాట్.

 8. Over the Hedge చూశావా? అందులో మొదటి సీన్‌కే నేను ఫ్లాట్.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: