ఆగస్ట్ 23, 2007

చక్ దే ఇండియా…

Posted in చక్ దే ఇండియా, షారూఖ్ ఖాన్, సినిమా వద్ద 7:17 సా. ద్వారా Praveen Garlapati

ఓకే మొదటి లైన్లోనే తీర్పు చెప్పేస్తా. మంచి సినిమా.

ముందు ఇక్కడ చెప్పుకోవాల్సింది నాకు షారూఖ్ ఖాన్ అంటే ఇష్టం లేదు. ఆ చెత్త సినిమాలు, వెధవ వేషాలు, ఫామిలీ డ్రామా అని చెప్పి కరణ్ జోహర్ వేయించే చెత్త వేషాలు అన్నీ కలిసి నాకు షారూఖ్ అంటే విముఖత కలిగించాయి. అలాగని టాలెంట్ లేదా అంటే ? ఉందీ…

మొత్తానికి అలా విసుగెత్తిన నాకు షారుఖ్ టాలెంట్ మొదటి సారిగా స్వదేశ్ లో కనిపించింది. చాలా మంచి సినిమా అది. మొదటి సారి ఓ అర్థవంతమయిన సినిమాలో నటించాడు అనిపించింది. దాని తరవాత మళ్ళీ షరా మామూలే అయినా మళ్ళీ “చక్ దే ఇండియా” సినిమాతో నే వెనక్కొచ్చా అని చెప్పాడు.

ఇక సినిమా కథ విషయానికి వస్తే ఇంతకు ముందు ఇలాంటి కథతో సినిమాలు వచ్చాయి. సినిమా కబీర్ ఖాన్ అనే ఓ హాకీ ఆటగాడు/కోచ్ కథ.
సినిమా ఇండియా పాకిస్తాన్ మధ్య వరల్డ్ కప్ ఫైనల్ హాకీ మాచ్ తో మొదలవుతుంది. అందులో ఆఖరి నిముషంలో వచ్చిన పెనాల్టీ ని మిస్ చేసి కబీర్ ఖాన్ దేశ ద్రోహవుతాడు. కొద్దిగా నాటకీయంగా చూపించినా ఈ నాడు మన వార్తా చానళ్ళు చాలా మటుకు ఆ కోవకి చెందినవే. చిలువలు పలువలు చేసి చూపించడం, నోటికే చెత్త వస్తే ఆ చెత్త వాగడం, చిన్న విషయాలను పెద్దవి చెయ్యడం, అనవసర డిబేట్లు పెట్టడం మొదలయినవి. ఇవన్నీ చేసి కబీర్ ఖాన్ ని ఓ దేశ ద్రోహి లా చిత్రీకరిస్తారు.

కట్ చేస్తే ఓ ఏడేళ్ళ తరవాత కబీర్ ఖాన్ మళ్ళీ తెర మీదకొస్తాడు. అదీ ఇండియా మహిళా హాకీ టీం కోచ్‌గా పనిచెయ్యడానికి. అంత వరకూ రాష్ట్రాల వారీగా ఆడే ఆ జట్టుని ఓ తాటి మీదకి తీసుకొచ్చి, డిసిప్లిన్ నేర్పించి, అదేలేండి ఆఖరికి వరల్డ్ కప్ నెగ్గేలా చేస్తాడు. అవును కొద్దిగా ఎక్సాజరేటెడ్ గానే ఉంటుంది కథ, కానీ దానిని నడిపిన తీరుని మాత్రం మెచ్చుకోవాల్సిందే. ఎడిటింగ్ కి ప్రాధాన్యత ఏమిటో నాకింతకు ముందు వరకూ అర్థమయ్యేది కాదు. ఇప్పుడు తెలిసింది. సీన్లన్నీ చక్కగా కుదిరాయి. పాటలు లేవు. అవును నిజం. అదే కాక ఇప్పుడు మన దేశంలో జరుగుతున్న క్రికెట్ పిచ్చి తప్ప ఇంకేదీ పట్టించుకోకపోవడం, అందులోనూ మహిళలు ఆడుతున్నారంటే దానిని చిన్న చూపు చూడడం, సెలెక్టర్ల అతి చేష్టలు, వంటి నిజాలెన్నో ఉన్నాయి ఈ సినిమాలో. అంతే కాదు వ్యక్తిగత రికార్డుల కోసం ఆట ఆడే ఆటగాళ్ళ గురించి కూడా సరిగ్గా చూపించాడు.

కానీ ఈ సినిమా ఓ డ్రీం అని చెప్పవచ్చు. ఎందుకంటె ఈ దేశంలో అలాంటి కోచ్ రానూ లేడు, అలాంటి మార్పులు జరగనూ లేవు, బాగు పడే అవకాశాలూ కనిపించట్లేదు.

మొత్తానికి ఈ సినిమాలో నాకు నచ్చిన అంశాలు:

1. ఏ క్రికెట్ నో ఎంచుకోకుండా మన జాతీయ క్రీడ అయిన హాకీని కథాంశంగా ఎంచుకోవడం. (అవును ఇప్పుడు మన జాతీయ క్రీడ హాకీ అని కూడా జనాలు మర్చిపోయారేమో.)

2. ఆటగాళ్ళు రాష్ట్రం తరఫున కాదు దేశం తరఫున ఆడుతున్నారు అని ఎన్నో చోట్ల గుర్తు చెయ్యడం

3. ఏ క్రీడలోనయినా సీనియర్ ఆటగాళ్ళు ఇప్పుడు టీం లో ఎలా చెలాయిస్తున్నారో చూపించడం

4. దేశం తరఫున ఆడేటప్పుడు ప్రైడ్ ఉండాలి అని చెప్పడం

5. మన మీద మనం నమ్మకం పెంచుకుని, సాధనతో, కఠోర శ్రమతో విజయం సాధించగలం అని చెప్పడం

6. సొంత రికార్డుల ఆట కాదు, ఏ ఆట అయినా జట్టు లాగా ఆడాలి అనే పాయింట్ ని పదే పదే స్ట్రెస్ చెయ్యడం

సినిమాలో ఎగస్ట్రాలు లేవా ? ఉన్నాయి. కానీ మొత్తం మీద అంతర్లీనంగా ఉన్న థీం సినిమా లో అతి ని డామినేట్ చేస్తుంది. నాకయితే నచ్చింది. కుదిరితే తప్పకుండా చూడండి. “చక్ దే ఇండియా…”

ప్రకటనలు

12 వ్యాఖ్యలు »

 1. వికటకవి said,

  నేనూ విన్నాను, సినిమా బాగుందని. త్వరలో చూడాలి.

 2. నేనూ విన్నాను, సినిమా బాగుందని. త్వరలో చూడాలి.

 3. మేధ said,

  మీరు చెప్పినట్లు, ఇది డ్రీమ్ కాదండి.. ఈ సినిమా మొత్తం కబీర్ ఖాన్ జీవిత గాధ.. ఆయన నిజంగానే, పాకిస్తాన్ తో, జరిగిన మ్యాచ్ లో, గోల్ చేయలేకపోవడం తో, అప్పుడు మీడియాలో, మొత్తం ఆయనమీద వ్యతిరేకంగా కధనాలు వచ్చాయి.. ఆ బాధ తట్టుకోలేక, ఆయన ఎక్సైల్ ఐపోతారు.. తరువాత మళ్ళీ తిరిగి వచ్చి, ఇండియా టీం (జూ) కి కప్ సాధించిపెట్టారు.. ఇది అంతా నిజంగానే, జరిగింది.. ఇక సినిమా విషయానికి వస్తే, బావుంది అని అందరూ అంటున్నారు.. అసలు, సినిమా చూస్తున్నట్లు లేదు, హాకీ ఆట చూస్తున్నట్లు ఉంది అని అంటున్నారు…

 4. మేధ said,

  మీరు చెప్పినట్లు, ఇది డ్రీమ్ కాదండి.. ఈ సినిమా మొత్తం కబీర్ ఖాన్ జీవిత గాధ.. ఆయన నిజంగానే, పాకిస్తాన్ తో, జరిగిన మ్యాచ్ లో, గోల్ చేయలేకపోవడం తో, అప్పుడు మీడియాలో, మొత్తం ఆయనమీద వ్యతిరేకంగా కధనాలు వచ్చాయి.. ఆ బాధ తట్టుకోలేక, ఆయన ఎక్సైల్ ఐపోతారు.. తరువాత మళ్ళీ తిరిగి వచ్చి, ఇండియా టీం (జూ) కి కప్ సాధించిపెట్టారు.. ఇది అంతా నిజంగానే, జరిగింది.. ఇక సినిమా విషయానికి వస్తే, బావుంది అని అందరూ అంటున్నారు.. అసలు, సినిమా చూస్తున్నట్లు లేదు, హాకీ ఆట చూస్తున్నట్లు ఉంది అని అంటున్నారు…

 5. Sudhakar said,

  Swades is a master piece. I bought a DVD just to have it in my collection…

 6. Sudhakar said,

  Swades is a master piece. I bought a DVD just to have it in my collection…

 7. ప్రవీణ్ గార్లపాటి said,

  వికటకవి గారు: తప్పక చూడండి.

  మేధ గారు: మీరు చెప్పిన విషయాలు నాకు తెలీదు. నిజమయిన కథ అయితే చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది. మీ వ్యాఖ్య చదివిన తరవాత సెర్చ్ చేసాను, నేగీ అనే వ్యక్తి కథ అని అంటున్నారు జనాలు.

  సుధకర్ గారు: అవును నాకు కూడా ఎంతో ఇష్టమయిన సినిమా స్వదేశ్. మన కలెక్షన్లో ఉండవలసిన సినిమా.

 8. వికటకవి గారు: తప్పక చూడండి.మేధ గారు: మీరు చెప్పిన విషయాలు నాకు తెలీదు. నిజమయిన కథ అయితే చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది. మీ వ్యాఖ్య చదివిన తరవాత సెర్చ్ చేసాను, నేగీ అనే వ్యక్తి కథ అని అంటున్నారు జనాలు.సుధకర్ గారు: అవును నాకు కూడా ఎంతో ఇష్టమయిన సినిమా స్వదేశ్. మన కలెక్షన్లో ఉండవలసిన సినిమా.

 9. రానారె said,

  నీ సిఫారసుతో, శనివారం ఒకసారి, ఆదివారం ఒకసారి చూశాను. నాకు చాలా నచ్చింది. నువ్వన్నట్టు “సినిమాలో ఎగస్ట్రాలే లేవా?” అంటే ఉన్నాయి. కానీ వాటిని పక్కనబెడితే, ఉపయోగపడేవి ఇంకా చాలా ఉన్నాయి. కల్‌-హో-న-హో అనేది నేను చూసిన ఒకే ఒక షారుఖ్ సినిమా. నా ఖర్మ పండి ఆ సినిమాకు వెళ్లాను. ఆ సినిమాలో ఆయన తొందరగా చావడు, చూసేవాళ్లను చంపుతాడు. అప్పట్నుంచీ షారుఖ్ అంటే విరక్తి. కానీ, ‘ఛక్ దే’ మాత్రం ఒక సినిమా చూస్తున్నట్లుగా అనిపించదు.

 10. నీ సిఫారసుతో, శనివారం ఒకసారి, ఆదివారం ఒకసారి చూశాను. నాకు చాలా నచ్చింది. నువ్వన్నట్టు “సినిమాలో ఎగస్ట్రాలే లేవా?” అంటే ఉన్నాయి. కానీ వాటిని పక్కనబెడితే, ఉపయోగపడేవి ఇంకా చాలా ఉన్నాయి. కల్‌-హో-న-హో అనేది నేను చూసిన ఒకే ఒక షారుఖ్ సినిమా. నా ఖర్మ పండి ఆ సినిమాకు వెళ్లాను. ఆ సినిమాలో ఆయన తొందరగా చావడు, చూసేవాళ్లను చంపుతాడు. అప్పట్నుంచీ షారుఖ్ అంటే విరక్తి. కానీ, ‘ఛక్ దే’ మాత్రం ఒక సినిమా చూస్తున్నట్లుగా అనిపించదు.

 11. ప్రవీణ్ గార్లపాటి said,

  @రానారె: అవును! అప్పుడప్పుడూ అలా అన్నమాట.

 12. @రానారె: అవును! అప్పుడప్పుడూ అలా అన్నమాట.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: