సెప్టెంబర్ 8, 2007

ఒపెరా – విహరిణి విపణిలో అండర్‌డాగ్ …

Posted in ఒపెరా, కెస్ట్రెల్, టెక్నాలజీ, విహరిణి వద్ద 6:05 సా. ద్వారా Praveen Garlapati

ఒపెరా – అంటే ఓ సంగీత నాటకం.

కానీ ఇక్కడ నేను చెప్పబోయేది ఒపెరా విహరిణి (browser) గురించి. ఈ విహరిణి అంటే నాకు ఎంతో గౌరవం.
అవును నేను మంటనక్క (firefox) వాడతాను, అది నాకిష్టం. కానీ ఒపెరా అంటే నాకు చాలా గౌరవం. దానికి కారణం కూడా లేకపోలేదు.

నేను ఒపెరా ని ఉపయోగించడం దాదాపు ఓ నాలుగయిదు సంవత్సరాల క్రితం మొదలుపెట్టాను.
అప్పట్లోనే దాంట్లో టాబ్ లు ఉండేవి. ఓ మూడు సంవత్సరాల క్రితం మంటనక్క వచ్చినప్పుడు జనాలు టాబ్ ల గురించి అబ్బురపడటమే ఒపెరా మార్కెటింగ్ లో ఎంతగా విఫలమయిందో చెబుతుంది.
నిర్ద్వంద్వంగా ఒపెరా అన్నిటికన్నా వేగవంతమయిన విహరిణి. అయినా జనాల ఆదరణ ఎక్కువగా దక్కలేదు.
దానికి ముఖ్య కారణం మొదట్లో ఇది ఉచితం కాకపోవడమే. ఉచిత వర్షన్లో పైన ఓ ఆడ్ బానర్ ఉండేది. అది చికాకు కలిగించేది.

నాకు ఒపెరా అంటే ఎందుకంత గౌరవమో దీంట్లో ఉన్న ఫీచర్లు చూస్తే తెలుస్తుంది. ఎన్నో విహరిణులలో లేని ఫీచర్లు ఇందులో ఏ ఆడాన్లు లేకుండానే లభ్యం.

* మెయిల్ క్లయింట్
* న్యూస్‌గ్రూప్ క్లయింట్
* ఐఆర్సీ క్లయింట్
* బిట్ టోరెంట్ క్లయింట్
* నోట్స్ అప్లికేషన్
* విడ్జెట్లు

ఇన్ని ఫీచర్లతోనూ ఇది తక్కువ మెమోరీ తీసుకుంటుంది. వేగవంతంగా పని చేస్తుంది.
చాలా మంచి ఇన్నోవేషన్లు చేస్తారు ఈ విహరిణి తయారీదారులు.

ఏ ఇతర విహరిణి లోనూ లేని కొన్ని ప్రత్యేకమయిన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇందులో కొన్ని ఈ మధ్య విడుదలయిన కెస్ట్రెల్ అనే ఆల్ఫా బిల్డ్ లోనివి. కెస్ట్రెల్ అద్భుతంగా ఉంది.

* స్పీడ్ డయల్: ఒపెరా లో మీరు ఓ కొత్త టాబ్ తెరవగానే మీకు తొమ్మిది చిన్న కిటికీలు కనిపిస్తాయి. అందులో ఒక్కో కిటికీలో ఒక వెబ్ పేజీ ని సెట్ చేసుకోవచ్చు. ఆ కిటికీలనే స్పీడ్ డయల్ అంటారు. అందులో సెట్ చేసిన వెబ్ పేజీల స్నాప్ షాట్ ఆ స్పీడ్ డయల్ లో కనిపిస్తుంది. అది ఎప్పటికప్పుడు అప్డేట్ కూడా అవుతుంది. కాబట్టి మీకు కావలసిన పేజీలు ఓ క్లిక్కు దూరం మాత్రమే. అదీ కాక ఆ వెబ్ పేజీ తెరవకుండానే దానిని చూడచ్చు.
* మౌస్ జెస్చర్స్: మీ మౌస్ తో బ్రౌజింగ్ చర్యలని నియంత్రించవచ్చు. ఉదా: రైట్ క్లిక్కు, లెఫ్ట్ క్లిక్కు చేస్తే మీ ఇంతకు ముందు పేజీ కి వెళతారు.
* వాయిస్ బ్రౌజింగ్: వాయిస్ కమాండ్లతో బ్రౌజ్ చెయ్యవచ్చు. ఈ ఫీచర్ ని నేను ఎప్పుడూ ఉపయోగించలేదు.
* కంటెంట్ బ్లాకర్/పాపప్ బ్లాకర్: ఇది మంట నక్క ఆడ్ బ్లాక్ లాంటి ఫీచర్. దీని ద్వారా మీ ఆడ్లను, అక్కర్లేని ఫ్లాష్ కంటెంటు నూ బ్లాక్ చెయ్యవచ్చు. అలాగే పాపప్ లని ఆటోమాటిగ్గా బ్లాక్ చేసేస్తుంది.
* టాబ్ ప్రీవ్యూ: మీరు ఏ టాబ్ మీదయినా మీ మౌస్ ని ఉంచితే ఆ వెబ్ పేజీ ప్రీవ్యూ కనిపిస్తుంది.
* సింక్రనైజేషన్ (కెస్ట్రెల్ ఫీచర్): ఇది గూగుల్ బ్రౌజర్ సింక్, లేదా ఫాక్స్‌మార్క్స్ లాంటి ఫీచర్. దీని ద్వారా మీ పేజీకలు (bookmarks) అన్నీ మీ ఒపెరా విహరిణుల మధ్య సింక్రనైజ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఒక సిస్టం మీద సేవ్ చేసుకున్న పేజీకలను ఎక్కడయినా సరే పొందవచ్చు. అలాగే మీ స్పీడ్ డయల్స్ కూడా.
* హిస్టరీ సెర్చ్ (కెస్ట్రెల్ ఫీచర్): మీరో వెబ్ పేజీ చూసారు. అందులో ఏదో కంటెంట్ కోసం వెతికారు. తరవాత అదే పేజీ కి మళ్ళీ వెళ్ళాలనుకున్నారనుకోండి అప్పుడు మళ్ళీ సెర్చ్ చేసో లేదా హిస్టరీ లోని పేజీలను ఒక్కోటీ వెతికో చేరుకోవాల్సుంటుంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా మీ హిస్టరీ లో కేవలం లంకెలనే కాకుండా పేజీ కంటెంటు ని కూడా ఇది గుర్తుంచుకుంటుంది. కాబట్టి మీరు వెతకాలంటే చాలా ఈజీ. కంటెంట్ ని ఇట్టే పట్టెయ్యవచ్చు. అంతే కాక మీరు మీ URL bar లో టైప్ చేసిన పదాలను కూడా అప్పటికప్పుడు వెతికేస్తుంది ఆ హిస్టరీ లో. చాలా సౌకర్యం కదూ.

మరందుకే చెప్పింది ఈ విహరిణి అంటే నాకెంతో గౌరవం అని. ఈ ఫీచర్లే కాకుండా వేగం లో దీనికి సాటి రాగలిగే బ్రౌజర్లు తక్కువే అని చెప్పాలి.

అంతా బానే ఉంది కానీ దీనితో వచ్చిన చిక్కులంటారా ?
* డెవలపర్స్ సాధారణంగా ఈ బ్రౌజర్ కోసం టెస్ట్ చెయ్యడం తక్కువే ఎందుకంటే దీని మార్కెట్ ఎక్కువ కాదు కాబటి.
* జావాస్క్రిప్ట్, అజాక్స్ తో దీనికి కొన్ని సమస్యలు ఉన్నాయి.
* దీనికి కూడా అన్‌జస్టీఫై సమస్య ఉంది.

అన్నట్టు ఇందులో తెలుగు బాగానే కనిపిస్తుంది కానీ మీకు డీఫాల్ట్ సెట్టింగులలో తెలుగక్షరాలు చిన్నవిగా కనిపిస్తాయి ఎందుకంటే ఇందులో డీఫాల్ట్ గా ఏరియల్ ఫాంట్ ఉపయోగించబడుతుంది. కాబట్టి మీరు ప్రిఫరెన్సస్ లో ఫాంట్స్ కి వెళ్ళీ అక్కడ ఇంటర్నేషనల్ ఫాంట్స్ లో తెలుగు ఎంచుకుని గౌతమి ఫాంట్ ని ఎంచుకోండి. చక్కగా కనిపిస్తుంది.

ప్రకటనలు

16 వ్యాఖ్యలు »

 1. శ్రీనివాస said,

  నేనూ ఈ మధ్య తెలుగు చూడటానికి ఒపెరానే వాడుతున్నాను. దీనిలో (యూనీకోడ్ తెలుగు) పేజీ లోడ్ అయ్యాక స్క్రాలింగ్ సమస్య ఉండదు. పైగా జావాస్క్రిప్ట్ వేగంగా పనిచేస్తుంది.

 2. నేనూ ఈ మధ్య తెలుగు చూడటానికి ఒపెరానే వాడుతున్నాను. దీనిలో (యూనీకోడ్ తెలుగు) పేజీ లోడ్ అయ్యాక స్క్రాలింగ్ సమస్య ఉండదు. పైగా జావాస్క్రిప్ట్ వేగంగా పనిచేస్తుంది.

 3. Tulasi Ram Reddy said,

  మీరన్నట్లు నాకు కూడా ఓపెరా అంటే గౌరవమే. అయితే ఇందులో పొడిగింతలు() చాలా తక్కువ.నాకు మటుకు మన నిప్పులనక్క అంటేనే ఇష్టం. ముఖ్యంగా దీని పొడిగింతలు, వల్ల అందరూ తమ ఇష్టాలకు తగ్గట్లుగా తమ విహరణిని తయారుచేసుకోవచ్చు. బహుశా ఈ ఒక్క విషయం వల్లనే నాకు నిప్పులనక్క అంటే అభిమానమేమో..
  నేను నిత్యం ఉపయోగించే కొన్ని పొడిగింతలు..

  Adblock Plus
  Advanced Dork
  Blog Rovr
  Bookmark Duplicate Detector
  Bookmark Tags
  Bugmenot
  Customize Google
  Download Status Bar
  Firefox Universal Uploader
  FlashGot
  Foxy Tunes
  Grease Monkey
  IE Tab
  IMacros
  Noscript
  Reload Every
  Research Word
  Scribe Fire
  StumbleUpon
  Tab Mix Plus
  Telugu input toolbar
  Unplug
  Useragent switcher
  Visual Bookmarks
  Web Search Pro
  Wizz Rss Newsreader
  Yoono

 4. మీరన్నట్లు నాకు కూడా ఓపెరా అంటే గౌరవమే. అయితే ఇందులో పొడిగింతలు() చాలా తక్కువ.నాకు మటుకు మన నిప్పులనక్క అంటేనే ఇష్టం. ముఖ్యంగా దీని పొడిగింతలు, వల్ల అందరూ తమ ఇష్టాలకు తగ్గట్లుగా తమ విహరణిని తయారుచేసుకోవచ్చు. బహుశా ఈ ఒక్క విషయం వల్లనే నాకు నిప్పులనక్క అంటే అభిమానమేమో..నేను నిత్యం ఉపయోగించే కొన్ని పొడిగింతలు..Adblock PlusAdvanced DorkBlog RovrBookmark Duplicate DetectorBookmark TagsBugmenotCustomize GoogleDownload Status BarFirefox Universal UploaderFlashGotFoxy TunesGrease MonkeyIE TabIMacrosNoscriptReload EveryResearch WordScribe FireStumbleUponTab Mix PlusTelugu input toolbarUnplugUseragent switcherVisual BookmarksWeb Search ProWizz Rss NewsreaderYoono

 5. వీవెన్ said,

  వినూత్నశీలతలో ఓపెరా ప్రధమం. సందేహమే లేదు.
  ఉపయోగశీలతలోనే వెసుకబడింది. క్రెస్టల్‌లో ఉపయోగశీలత కొంతవరకు మెరుగయ్యింది.

 6. వినూత్నశీలతలో ఓపెరా ప్రధమం. సందేహమే లేదు.ఉపయోగశీలతలోనే వెసుకబడింది. క్రెస్టల్‌లో ఉపయోగశీలత కొంతవరకు మెరుగయ్యింది.

 7. Ravi Kiranam said,

  చాలా బాగుందండీ. వుపయోగకరంగా కూడా వుంది. ఈ విషయాలు నాకు కొత్త. తెలుగు లో డైరెక్ట్ గా టైపు చేసుకునే అవకాశం వుందా ఓపెరా లొ లేదా మంట నక్క లో ? అలా వీలుంటె, ఆ విహారిణి ఎక్కడ దొరుకుతుంది (ఫ్రీ లేదా ట్రయల్ వర్షన్) చెప్పి మాకు కొంచెం ఙ్ఞానోదయం కలిగించండి ప్లీజ్.

 8. Ravi Kiranam said,

  చాలా బాగుందండీ. వుపయోగకరంగా కూడా వుంది. ఈ విషయాలు నాకు కొత్త. తెలుగు లో డైరెక్ట్ గా టైపు చేసుకునే అవకాశం వుందా ఓపెరా లొ లేదా మంట నక్క లో ? అలా వీలుంటె, ఆ విహారిణి ఎక్కడ దొరుకుతుంది (ఫ్రీ లేదా ట్రయల్ వర్షన్) చెప్పి మాకు కొంచెం ఙ్ఞానోదయం కలిగించండి ప్లీజ్.

 9. ప్రవీణ్ గార్లపాటి said,

  @శ్రీనివాస గారు:
  అవును నిజమే. నేను ఒపెరా ని దాదాపు మంటనక్క తో సమానంగా వాడతా అందుకే.

  @tulasi ram reddy గారు:
  మంటనక్క అంటే నాకు కూడా ఇష్టమే. కానీ దానిలో పొడిగింతలు ఎక్కువయ్యే కొద్దీ అది వాడుకునే మెమరీ ఎక్కువవుతుంది. స్పీడు తగ్గుతుంది. అందుకనే నేను ఒపెరా ని కూడా ఎక్కువగానే వాడతాను.
  మీ పొడిగింతల లిస్టు బాగుంది 🙂

  @వీవెన్ గారు:
  నాకు పెద్దగా అలా అనిపించదు. ఏమో అలవాటు పడిపోయుండవచ్చు. నాకు వెబ్ పేజీల సపోర్ట్ సమస్య తప్పితే ఇంకెక్కడా ఇబ్బందులు లేవు.

  @ravi kiranam గారు:
  నేనయితే బరహ వాడతాను. దీని ద్వారా ఎందులోనయినా టైపు చేసుకునే సౌకర్యం ఉంటుంది. ఒపెరా లో తెలుగు టైపు చేసేందుకు నేరుగా వీలు లేదు.
  మంట నక్క లో ఆడాన్లు ఉన్నాయి తెలుగులో టైపు చేసేందుకు. నేను వాడేది Indic Input Extension. అలాగే పద్మ కూడా వాడతాను.

 10. @శ్రీనివాస గారు: అవును నిజమే. నేను ఒపెరా ని దాదాపు మంటనక్క తో సమానంగా వాడతా అందుకే.@tulasi ram reddy గారు:మంటనక్క అంటే నాకు కూడా ఇష్టమే. కానీ దానిలో పొడిగింతలు ఎక్కువయ్యే కొద్దీ అది వాడుకునే మెమరీ ఎక్కువవుతుంది. స్పీడు తగ్గుతుంది. అందుకనే నేను ఒపెరా ని కూడా ఎక్కువగానే వాడతాను.మీ పొడిగింతల లిస్టు బాగుంది :)@వీవెన్ గారు:నాకు పెద్దగా అలా అనిపించదు. ఏమో అలవాటు పడిపోయుండవచ్చు. నాకు వెబ్ పేజీల సపోర్ట్ సమస్య తప్పితే ఇంకెక్కడా ఇబ్బందులు లేవు.@ravi kiranam గారు:నేనయితే బరహ వాడతాను. దీని ద్వారా ఎందులోనయినా టైపు చేసుకునే సౌకర్యం ఉంటుంది. ఒపెరా లో తెలుగు టైపు చేసేందుకు నేరుగా వీలు లేదు.మంట నక్క లో ఆడాన్లు ఉన్నాయి తెలుగులో టైపు చేసేందుకు. నేను వాడేది Indic Input Extension. అలాగే పద్మ కూడా వాడతాను.

 11. రానారె said,

  నేను డిగ్రీ చదివేటప్పుడు ఒపెరాను చూశాను. అంతే. మళ్లీ నీ టపా చదివి, ఇప్పుడే నా నోటుబుక్కులో వ్యవస్థీకరించాను. కొత్తకొత్తగా ఉంది. మంటనక్కను ఎప్పుడూ వాడలేదు. అందుచేతనేనేమో అయ్యీలో నాకు ఎటువంటి సమస్యా కనబడలేదు 😉

 12. నేను డిగ్రీ చదివేటప్పుడు ఒపెరాను చూశాను. అంతే. మళ్లీ నీ టపా చదివి, ఇప్పుడే నా నోటుబుక్కులో వ్యవస్థీకరించాను. కొత్తకొత్తగా ఉంది. మంటనక్కను ఎప్పుడూ వాడలేదు. అందుచేతనేనేమో అయ్యీలో నాకు ఎటువంటి సమస్యా కనబడలేదు 😉

 13. ప్రవీణ్ గార్లపాటి said,

  @రానారె:

  మంటనక్కను ఎప్పుడూ వాడలేదు.
  ఆ…

  అందుచేతనేనేమో అయ్యీలో నాకు ఎటువంటి సమస్యా కనబడలేదు 😉
  మంచిదే! దానికి కూడా వాడుకదారులు కావాలిగా 😉

 14. @రానారె:మంటనక్కను ఎప్పుడూ వాడలేదు. ఆ… అందుచేతనేనేమో అయ్యీలో నాకు ఎటువంటి సమస్యా కనబడలేదు ;-)మంచిదే! దానికి కూడా వాడుకదారులు కావాలిగా 😉

 15. DILEEP said,

  నేను కొన్నాళ్ళ క్రితం వరకూ ఒపేరా వుపయోగించేవాడిని. ఇప్పుడు మొబైల్ బ్రౌజర్స్ లో ఒపేరా మినీ ని మించింది లేదు.(విండోస్ మొబైల్స్ ని మినహాయిస్తే. ఇది నా అనుభవం.) ఒపేరా మినీ లో జావాస్క్రిప్ట్ కూడా చక్కగా పని చేస్తుంది.(మొబైల్ లో జావా స్క్రిప్ట్ కి కొన్ని మినహాయింపులు ఉన్నాయి.) లేఅవుట్,టేబుల్స్ ని చాలా చక్కగా చూపిస్తోంది.మొబైల్స్ కి ప్రిఫరబుల్ బ్రౌజర్.

 16. DILEEP said,

  నేను కొన్నాళ్ళ క్రితం వరకూ ఒపేరా వుపయోగించేవాడిని. ఇప్పుడు మొబైల్ బ్రౌజర్స్ లో ఒపేరా మినీ ని మించింది లేదు.(విండోస్ మొబైల్స్ ని మినహాయిస్తే. ఇది నా అనుభవం.) ఒపేరా మినీ లో జావాస్క్రిప్ట్ కూడా చక్కగా పని చేస్తుంది.(మొబైల్ లో జావా స్క్రిప్ట్ కి కొన్ని మినహాయింపులు ఉన్నాయి.) లేఅవుట్,టేబుల్స్ ని చాలా చక్కగా చూపిస్తోంది.మొబైల్స్ కి ప్రిఫరబుల్ బ్రౌజర్.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: