సెప్టెంబర్ 21, 2007

ఓపెన్ సోర్స్ ఉచితమా ?

Posted in ఓపెన్ సోర్స్, టెక్నాలజీ, విధానం వద్ద 4:16 సా. ద్వారా Praveen Garlapati

ఓపెన్ సోర్స్ అంటే ఉచితం కాదు…

అసలు ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ (OSS) ఫిలాసఫీ ఏంటి ? అని తరచి చూస్తే అది చెప్పేది మీరు ఉపయోగించే సాఫ్ట్‌వేర్ యొక్క సోర్స్ మీ చెంత ఉండాలనే.

అంటే మీరు ఇవాళ ఓ సాఫ్ట్‌వేర్ కొన్నారనుకోండి దానికి చెందిన సోర్స్ కోడ్ మీ దగ్గర ఉంటుందన్నమాట. మీకు కావాలంటే దాని డిజైన్ గమనించవచ్చు, దాని కోడ్ చూడచ్చు, మార్చనూ వచ్చు. అలా ఉండే సాఫ్ట్‌వేర్ ని ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ అని అంటారు (OSS). కానీ ఇందులో ఎక్కడా ఇది ఉచితంగా ఉండాలి అని చెప్పలేదు. (ఉచితం మరియు ఓపెన్ సోర్స్ అయిన సాఫ్ట్‌వేర్ ని FOSS అని అంటారు) కానీ సాధారణంగా తొంభై శాతం పైన ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్లన్నీ ఉచితమే. ఇంకా ఎక్కువ శాతం కూడా అయి ఉండవచ్చు.

ఉదా: ఓపెన్ సోర్స్ అయి ఉచితం కాని సాఫ్ట్‌వేర్ రెడ్‌హాట్ లినక్స్. అది సప్లై చేసే సాఫ్ట్‌వేర్ ఓపెన్ సోర్సే. అదే లినక్స్. కానీ దానికి అది వాడుకదార్ల దగ్గర డబ్బు వసూలు చేస్తుంది. అది డబ్బు వసూలు చేసేది సోర్స్ కోసం కాదు. పాకేజింగ్ కి, సపోర్ట్ కీ. అంటే మీరు లినక్స్ లో సాధారణంగా అప్లికేషన్లు గానీ, ఫీచర్లు గానీ వ్యవస్థీకరించాలనుకుంటే అవి పాకేజీలుగా లభ్యం అవుతాయి. ఎలా అంటే రెడ్‌హాట్ ఆధారితమయిన లినక్స్ ఫ్లేవర్లలో RPM లని ఉంటాయి. డెబియన్ ఆధారిత లినక్స్ ఫ్లేవర్లలో deb లు ఉంటాయి.

అలా ఆ పాకేజీలను వాడుకదార్లకు కావలసిన రీతిలో సృష్టించినందుకూ, సోర్స్ కోడ్ ని మెయిన్‌టెయిన్ చేసినందుకూ అది డబ్బు వసూలు చేస్తుందన్నమాట. అలాగే మీ వర్షన్లలో బగ్గులున్నాయనుకోండి వాటిని ఫిక్స్ కూడా చేసి ఇస్తారు. మామూలుగా అయితే లినక్స్ కమ్యూనిటీ ఆధారితమయినది కాబట్టి మీరు ఎవరో ఒకరు ఆ బగ్గుని ఫిక్స్ చేసేవరకూ ఆగాల్సుంటుంది (అదీ త్వరగానే ఫిక్సయిపోతుందనుకోండి.) కానీ ఈ మోడల్ లో అయితే మీకు ఆ బగ్గులు ఫిక్స్ చేసేందుకు సపోర్టు రెడ్‌హాట్ నుండి లభిస్తుంది.

ఇక్కడ నేను మాట్లాడేది ఫెడోరా గురించి కాదు, రెడ్‌హాట్ ఎంటర్ప్రెయిస్ వర్షన్ గురించి. ఫెడోరా అని రెడ్‌హాట్ నుండి ఉచిత వర్షన్ కూడా ఉంది.

అలా ఓపెన్ సోర్స్ నుండి రెవెన్యూ సృష్టించుకున్న కంపెనీలు కూడా ఉన్నాయన్నమాట. ఉచితంగా లభిస్తుంటే ఎవరు వాడతారులే అనుకుంటున్నారా ? చాలా ఎంటర్ప్రయిజులే దీనిని వాడతాయి. (నే పని చేసే కంపెనీ కూడా వాడుతుంది కానీ నే వాడను 🙂 )ఎందుకంటే సపోర్టు లభ్యమవుతుంది. అది అవసరం. ఉదాహరణకి మీరు ఓ ప్రోడక్ట్ ని ఓపెన్ సోర్స్ కోడ్ పైన తయారు చేస్తున్నారనుకోండి, సగం కోడ్ తయారయిన తరవాత ఆ ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ లో బగ్గులుంటే మీరు మీ ప్రోడక్ట్ ని ఆపెయ్యలేరు కదా. అందుకనే ఆ భరోసా కోసమే కంపెనీలు వీటిని వాడతాయి.

ఓపెన్ సోర్స్ కోసం ఎన్నో లైసెన్సులున్నాయి GPL, Apache, Mozilla Public License, వగైరా… కొద్ది తేడాలతో ఇవన్నీ ఒకటే. మీరు సోర్స్ ఉపయోగించండి, మార్చండి. మళ్ళీ పది మందికి పంచండి. ఇలా చెయ్యడం వల్ల కోడ్ నాణ్యత వాడుతున్నకొద్దీ పెరుగుతుంది.

ఇవన్నీ ఎందుకు అసలు ఓపెన్ సోర్స్ ఎందుకు ఉపయోగించాలంటారా ?

మీరుపయోగించే లేదా కొన్న సాఫ్ట్‌వేర్ కోడ్ మీ దగ్గరే ఉంటుంది. దానికి కావలసిన మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ఆ కోడ్ ని, డిజైన్ ని గమనించి మరింత మంచి సాఫ్ట్‌వేర్ రాయవచ్చు. కావాలంటే చిన్న చిన్న బగ్గులుంటే వాటిని మీరే ఫిక్స్ చేసుకోవచ్చు. స్వేఛ్ఛ ఉంటుంది.

ఇక మామూలు వాడుకదారు విషయానికొస్తే చాలా మటుకు ఓపెన్ సోర్స్ ఉచితం. సాఫ్ట్‌వేర్ ఉచితంగా లభిస్తుంది. అది కూడా నాణ్యమైనది. సరే ఇక పైరేటెడ్ వాడతానంటారా, అది వారి వారి నిర్ణయం. వీధుల్లో కాకుండా రహదారిలో వెళతానంటారా ఓపెన్ సోర్స్ వాడి అదీ వారి ఇష్టమే 🙂

ప్రకటనలు

9 వ్యాఖ్యలు »

 1. anil said,

  ఒపెన్ సోర్స్ అంటే ఉచితం అని ఇన్నాళ్ళు భ్రమలో ఉన్నాను. నా కళ్ళు తెరిపించినందుకు, మీకు నా కృతజ్ఞతలు.

 2. anil said,

  ఒపెన్ సోర్స్ అంటే ఉచితం అని ఇన్నాళ్ళు భ్రమలో ఉన్నాను. నా కళ్ళు తెరిపించినందుకు, మీకు నా కృతజ్ఞతలు.

 3. Ravi Kiranam said,

  లినక్స్ మొబైల్స్ వస్తున్నాయి కదా ఈ మధ్య. అదీ ఓపన్ సోర్సు కదా. ఇలా ఓపన్ సోర్సు వుపయోగించి, మొబైల్స్ తయారు చేసి మార్కెట్ లో విక్రయించుకుంటే, లినక్స్ వారికి రాయల్టీ ఇవ్వ వలసిన అవసరం లేదా ?

 4. Ravi Kiranam said,

  లినక్స్ మొబైల్స్ వస్తున్నాయి కదా ఈ మధ్య. అదీ ఓపన్ సోర్సు కదా. ఇలా ఓపన్ సోర్సు వుపయోగించి, మొబైల్స్ తయారు చేసి మార్కెట్ లో విక్రయించుకుంటే, లినక్స్ వారికి రాయల్టీ ఇవ్వ వలసిన అవసరం లేదా ?

 5. SivaPatnani said,

  మీ వ్యాసం బాగుంది.
  వివిధ లైసెన్స్ ల గురించి వివరించగలరు.

 6. SivaPatnani said,

  మీ వ్యాసం బాగుంది.వివిధ లైసెన్స్ ల గురించి వివరించగలరు.

 7. ప్రవీణ్ గార్లపాటి said,

  anil గారు: 🙂

  ravi kiranam గారు:
  లేదు అవసరం లేదు. లినక్స్ ని కమర్షియల్ గా ఉపయోగించవచ్చు. ఉచితంగానా లేదా అనేది అది ఏ వెండర్ నుంచి అనే దాని పైన ఆధారపడి ఉంటుందనుకోండి.
  ఒక వేళ ఆ మొబైల్ కంపెనీ ఏ వెండర్ తో నయినా ఒప్పందం కుదుర్చుకుంటే లినక్స్ కోసం వారికి మాత్రం డబ్బులు కట్టాల్సిందే.
  సాధారణంగా మొబైల్స్ వంటి ఉపకరణాలలో తక్కువ ఫుట్ప్రింట్ అంటే చిన్న సైజు, తక్కువ మెమోరీ తీసుకునే విధంగా కస్టమైజ్ చేసుకుంటారు.

  sivapatnani గారు:
  థాంక్స్. లైసెన్సుల మీద ఓ టపా రాయాలని ఉంది. నాకు అన్ని లైసెన్సుల మీదా పూర్తిగా అవగాహన లేదు. కొంత చదివి త్వరలోనే రాస్తా.
  క్రియేటీవ్ కామన్స్ గురించి ఓ చిన్న టపా ఇదివరకూ రాసాను. ఇక్కడ చదవచ్చు.

 8. anil గారు: :)ravi kiranam గారు:లేదు అవసరం లేదు. లినక్స్ ని కమర్షియల్ గా ఉపయోగించవచ్చు. ఉచితంగానా లేదా అనేది అది ఏ వెండర్ నుంచి అనే దాని పైన ఆధారపడి ఉంటుందనుకోండి. ఒక వేళ ఆ మొబైల్ కంపెనీ ఏ వెండర్ తో నయినా ఒప్పందం కుదుర్చుకుంటే లినక్స్ కోసం వారికి మాత్రం డబ్బులు కట్టాల్సిందే. సాధారణంగా మొబైల్స్ వంటి ఉపకరణాలలో తక్కువ ఫుట్ప్రింట్ అంటే చిన్న సైజు, తక్కువ మెమోరీ తీసుకునే విధంగా కస్టమైజ్ చేసుకుంటారు.sivapatnani గారు: థాంక్స్. లైసెన్సుల మీద ఓ టపా రాయాలని ఉంది. నాకు అన్ని లైసెన్సుల మీదా పూర్తిగా అవగాహన లేదు. కొంత చదివి త్వరలోనే రాస్తా. క్రియేటీవ్ కామన్స్ గురించి ఓ చిన్న టపా ఇదివరకూ రాసాను. ఇక్కడ చదవచ్చు.

 9. Jagadish said,

  This comment has been removed by the author.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: