సెప్టెంబర్ 24, 2007

ఇండియా నెగ్గింది…. హాకీ ఆ తూచ్…

Posted in ఇండియా, క్రికెట్టు, నేను, పాకిస్తాన్, సరదా వద్ద 8:00 సా. ద్వారా Praveen Garlapati

ఈ రోజు పొద్దున్న నుంచే ఆఫీసులో మొదలయ్యాయి ఎవరు గెలుస్తారు ? ఇండియా నా ? పాకిస్తానా ?
ముందు బాటింగా బౌలింగా ? ఇప్పటి వరకూ ఫస్ట్ బాటింగ్ పని చేసింది, మరి ఈ సారి కూడా పని చేస్తుందా ?

నేనూ నా శక్తి మేరకు నేనూ పాల్గొన్నా ఆ చర్చల్లో. ఇక పొద్దున్న నుండి ఒకటే “ఇంటి నుండి పని” మెయిళ్ళు. మా ఇల్లు ఓ కిలోమీటర్ దూరం మాత్రమే ఉండడంతో నేను సాయంత్రం బయల్దేరవచ్చులే అని ఊరకున్నా. మూడున్నర నుండి నాలుగున్నర వరకూ మీటింగు. తరవాత ఓ టీ తాగి హస్కు కొట్టే సరికి అయిదయింది. అయిదు పదిహేనుకి సిస్టం షట్డవున్ చేసి మేనేజరుకేసి ఓ వంకర నవ్వు నవ్వి బయల్దేరా. నా క్యూబ్ పక్కనుండే మేనేజర్ అప్పుడే తన సరంజామా వేసుకుని బయల్దేరుతున్నాడు. నా పక్క క్యూబతను టాసయిపోయింది ఇండియా బాటింగ్ అన్నాడు. ఇంక ఆ మేనేజరు పరిగెత్తాడు. వెనక నేనూ.

అయిదు నిమషాల్లో ఇంట్లో ఉంటాననుకున్నా. మా ఆఫీసు బిల్డింగ్ దాటే వరకే పది నిముషాలు పట్టింది. ఈ డొక్కు మేనేజర్ల కార్లన్నీ అడ్డంగా ఉన్నాయి. వాటి సందుల్లోంచి ఎలాగో దూర్చి నా బైకుని రోడ్డు మీదకి తీసుకొచ్చి (కారు కొననందుకు శభాషిచ్చుకుని) రయ్యి మని వెళ్ళిపోదామని ఆక్సిలరేటర్ మీద చెయ్యి పోనిస్తూ ఓ సారి రోడ్డు కేసి చూసి అవాక్కయ్యారా లో ప్రైజొస్తే అవాక్కయినట్టు స్టన్నయ్యా. ఆ చివరి నుండి ఈ చివరి వరకూ ఒకటే ట్రాఫిక్కు. నే కుడి వేపుకు తిరగాల్సిన సందు రెండు ఫర్లాంగులు మాత్రమే. అక్కడికి చేరుకుంటే అసలు ట్రాఫిక్ ఉండదు.

షిట్! అని మనసులో ఓ వంద సార్లనుకుని కార్ల మధ్యలో నుంచి దూర్చి అడుగూ అడుగూ ముందుకు వేస్తూ నా వాచీ ఓ పది నిముషాలు ఫాస్టని గుర్తొచ్చి ఓ నవ్వు నవ్వా. నా పక్క అతను సాఫ్ట్‌వేరతనే మ్యాచా ? అన్నాడు. అవునన్నట్టు తలూపా. ఈ మధ్యలో ఓ పది సార్లు ఇద్దరమూ వాచీ కేసి చూసుకున్నాము. మధ్యమధ్యలో చిరునవ్వులు… షిట్లూ… ఇంకో పది నిముషాల్లో ఇంటికి చేరుకోకపోతే ఇండియా పాకిస్తాన్ అదీ ఫైనల్ మాచ్ మొదటి బాల్ మిస్సయ్యే ప్రమాదముంది.

అంతలో ఓ కారు కొద్దిగా ఎడమ పక్కకి జరగడంతో నా బైకు మొదటి చక్రం అందులో దూర్చడం ఆ తరవాత ఒంటె మాదిరి బైకు మొత్తం దూర్చడం , తరవాత బస్సు పక్కన నుండి కట్టు కొట్టి ట్రాఫిక్ పోలీసు కనిపించడంతో ప్రాణం లేచొచ్చింది. అక్కడే నే రైట్ టర్న్ తీసుకోవాల్సింది. చెయ్యి అలా చూపించాడో లేదో ఓ నలభై బైకులు , కార్లూ రివ్వు రివ్వున దూసుకుపోయాయి. అందులో నాదీ ఒకటి. మళ్ళీ బిల్డింగ్ లో పార్క్ చేసే వరకూ ఆగలేదు. వాచీ కేసి చూసుకున్నా. అయిదున్నర అయింది. అమ్మయ్య టైముకి వచ్చేసా అనుకుని లిఫ్టు బటను నొక్కి పైకెళ్ళా. అంతలో పెద్ద గోల వినిపించింది. ఇంటి తలుపు నా కోసమే అమ్మ తెరిచుంచింది. యువరాజు కాచ్ కోసం డైవ్ చేసినట్టు డైవ్ చేసి బవుండరీ దాటి పడుతున్న బంతిని చూసేసా. యస్ బవుండరీ మిస్సవలేదు.

ఇక నా బాగు అలా దీవాను మీద పడేసి పక్కనున్న సోఫాలో ఒదిగిపోయాను. కళ్ళు మళ్ళీ రెప్ప వేస్తే ఒట్టు.
మా అమ్మకు తెలుసు ఇంక ఈ ఘటం కదలదు అని (మా ఇంట్లో మా మూడేళ్ళ మేనల్లుడితో పాటు అందరూ క్రికెట్టు తెగ చూసేస్తారు). అందుకే డిస్టర్బ్ చెయ్యకుండా నా బాగులోంచి టిఫిన్ బాక్సు తీసి బాగుని నా గదిలో పెట్టేసింది. అది రోజూ నే చేసే పని మరి. ఆ మాత్రం ఎక్సర్సైజు చేస్తా లేండి.

ఇక వికెట్లు పడటం మొదలవ్వడంతో బూతులొస్తున్నాయి. ఇంట్లో ఉండడంతో షిట్ తప్పితే ఇంకేదీ వాడలేదు. తెగ ఆవేశానికి గురయ్యా. గంభీరుడు ఓ నాలుగు ఫోర్లు కొట్టేసరికి శాంతించా. యువరాజు క్రీజులోకొచ్చాడు. కళ్ళు చేటలంత చేసుకుని తెగ చూస్తున్నా. మరీ అంత టీవీలోకి దూరకురా అంది అమ్మ. సర్లే అని విసుక్కుని చూసేస్తున్నా. ఒక్క షాటూ కొట్టడే. ఒరే ఎదవ.. ఏమయిందిరా నీకు మొన్నటి వరకూ బానే ఆడావుగా అని తిట్టుకుంటున్నా. ఒక్క షాటూ కొట్టట్లా. ఓవర్లు తరిగి పోతున్నాయి. అవుటన్నా అవరా అనుకున్నా. అడిగిందే తడవగా వరమిచ్చేసాడు. పక్కనే హే అంటూ కిల కిలలు వినిపించాయి. మా మేనల్లుడు తెగ అరుస్తున్నాడు. వాడికేం తెలుసు. అవతలోడవుటయ్యాడో మనోడవుటయ్యాడో. నే కొర కొరా చూసేసరికి ఎక్కడ కందిపోతాడో అని అక్క వచ్చి ఒరే మనోడురా అవుటయింది అంది. మళ్ళీ ఓ హే కొట్టాడు మనోడు. ఆ… అని జుట్టు పీక్కున్నా.

తరవాత ఓ మోస్తరుగా అక్కడక్కడా ఓ షాట్ పడడంతో ఏదో స్కోరు వచ్చింది. మనసు కొద్దిగా శాంతించింది. అప్పుడు గానీ నాన్న నాకు కనబడలా. ఆయనా మునిగిపోయారనుకోండి. సర్లే మొన్న ఇలాంటి స్కోరుకే మాచ్ డ్రా అయిందిగా అని సర్ది చెప్పుకున్నా. మధ్యలో వచ్చిన ఓ పది నిముషాల్లో పదిహేను నిముషాల అడ్వర్టైజ్మెంట్లు చూసేసి ఎయ్యరా ఎదవా అన్నాను. పాపం ఈఎస్పీఎన్ వాడు మన డీడీ, సోనీ లాగా తలతిక్కోడు కాదు కాబట్టి వెంటనే టెలీకాస్టొచ్చేసింది. కమాన్ వికెట్లు తొందరగా పడాలని మనసులో తెగ జపిస్తున్నా. రెండు వికెట్లు టప టపా పడటంతో యస్ యస్ అని అరిచాను. ఎదురింటి బాచిలర్ కుర్రోళ్ళు డీటీఎస్ సౌండులో అరిచారు.

తరవాత మొదలయింది వీరబాదుడు కొంత సేపు. కళ్ళళ్ళో నీరు సుళ్ళు తిరిగాయి. ఏంటి మాచ్ పోతుందా ? స్కోరు తక్కువుందే అని. అప్పటి నుండి టప టపా వికెట్లు పడటంతో ఆనంద భాష్పాలు వచ్చాయి. హమ్మయ్య ముప్పై బంతుల్లో అరవై పరుగులు గెలిచేసాము అని తెగ సంబరపడిపోతున్నా. మా మేనల్లుడి బూరా తెగ ఊదుతున్నా. టప్ అని అటు చూసే సరికి బాల్‌తో ఆడియన్సు కాచ్ ఆడుకుంటున్నారు. ఇవ్వనంటున్నారు. మళ్ళీ ఇటే వస్తుందిగా అని అంటున్నారు. ఆ అని గుండె పోటొచ్చింది. సోఫా లోంచి లేచి నిలబడ్డా. చేతులు నులుముకుంటున్నా. చెమటలు పడుతున్నాయి.

పాకిస్తాన్ చేతిలో ఓడి పోనుందా ? అప్పటికే హర్భజన్ ఓవర్లో మూడు సిక్సులు, తరవాత ఓవర్లో ఇంకో సిక్సు వెళ్ళిపోయాయి. ఎవడ్రా ఈ మిస్బా ఎదవ నా… అని తిట్టుకుంటున్నా. అంతలోనే వికెట్ల చప్పుడు శ్రవనానందం కలిగించడంతో మళ్ళీ ఆశ. అలా ఆఖరి ఓవర్ వచ్చింది. పన్నెండు పరుగులు మాత్రమే కావాలి. మొదటి బాల్ సిక్సు. మళ్ళీ గుండె నొప్పి, కుప్ప కూలడం జరిగాయి. నరాలు తెగిపోయి రక్తం ఫాక్షన్ సినిమాలోలా ప్రవహించేస్తుంది. ఛీ ఈ జోగీందర్ వెధవని ఎందుకు తీసుకున్నారో ? అసలు బౌలింగే రాదు, పేస్ లేదు, లైన్ లేదు, లెంత్ లేదు అని పిచ్చ బూతులు తిట్టుకున్నా.

తరువాత బంతి వెయ్యడానికి వచ్చాడు గురుడు. బంతి వెయ్యక ముందే పక్కకి జరిగాడు మిస్బా… బాట్ ని తన పక్కనబెట్టి స్కూప్ షాట్ ఆడాడు. అయిపోయింది, అంతా అయిపోయింది అనుకున్నాను. బంతి పైకి లేచింది. సిక్సెళ్ళిపోయిందా అని కూలబడబోతుంటే శ్రీశాంత్ ఈ బంతిని నే పట్టకపోతే నన్ను రంపాలతో కోసేస్తారు అన్నట్టు ఫేసెట్టి కాచ్ పట్టాడు. మైండ్ బ్లాంక్. ఏం జరిగింది ? అంతలో పెద్ద గోల, ఎదురింటోళ్ళు డబల్ డీటీఎస్, టపాసుల చప్పుళ్ళు. యాహూ అని నా అరుపుకి నా మేనల్లుడు బేరుమన్నాడు. అయినా లెక్కచెయ్యకుండా మళ్ళీ వాడి బూరా లాక్కుని డాన్సే డాన్సు. మా నాన్న అమ్మ, అక్క ఎవరూ వాడి ఏడుపుని పట్టించుకోకుండా చప్పట్లే చప్పట్లు. అలా ఓ గంట సేపు డాన్స్ చేసి ఆఖరికి కూలబడ్డా. అమ్మ బత్తాయి రసమివ్వడంతో ఓ గుక్కలో తాగి నా గొంతు లోంచి మాటలు రావట్లేదేమిటా అని చూస్తే ఇంకెక్కడి గొంతు, ఎప్పుడో హుష్ కాకి… అదండీ ఇవాళ క్రికెట్టు మాచ్ ప్రహసనం.

ఇదేం పిచ్చి రో బాబూ అనుకుంటున్నారా… దటీజ్ మీ. రాకేశ్వరా నీకు పోటీ కాసుకో…

24 వ్యాఖ్యలు »

 1. Srinivas Ch said,

  ప్రవీణూ…అబ్బబ్బా..అసలు మ్యాచ్ మొత్తం, మ్యాచ్ అనే ఏంటి..నీ దినచర్య మొత్తం కళ్లకు కట్టినట్టు రాసావుగా…మొత్తానికి మ్యాచ్ మాత్రం బాగ ఎంజాయ్ చేసావు లాగుంది. నీ టపా చదువుతుంటే నేనే మ్యాచ్ చూస్తూన్నట్టు అనుభూతి చెందాననుకో…

 2. Srinivas Ch said,

  ప్రవీణూ…అబ్బబ్బా..అసలు మ్యాచ్ మొత్తం, మ్యాచ్ అనే ఏంటి..నీ దినచర్య మొత్తం కళ్లకు కట్టినట్టు రాసావుగా…మొత్తానికి మ్యాచ్ మాత్రం బాగ ఎంజాయ్ చేసావు లాగుంది. నీ టపా చదువుతుంటే నేనే మ్యాచ్ చూస్తూన్నట్టు అనుభూతి చెందాననుకో…

 3. చదువరి said,

  ఏంటి, మీ బెంగళూరులో ట్రాఫిక్కులో పక్కనోణ్ణి చూసి చిరునవ్వుతారా? అవున్లెండి మీ ఊరు మాకంటే అమెరికాకు దగ్గర కదా!:)

  ఈ ఇరవై ఇరవై హోరొచ్చాక, హాకీ నిజంగానే తూచ్ ఐపోయింది. ట్వంటీ ట్వంటీ అనేకంటే ఇరవై ఇరవై అనడం ఎంతో తేలిగ్గా ఉంది చూసారా?

 4. ఏంటి, మీ బెంగళూరులో ట్రాఫిక్కులో పక్కనోణ్ణి చూసి చిరునవ్వుతారా? అవున్లెండి మీ ఊరు మాకంటే అమెరికాకు దగ్గర కదా!:)ఈ ఇరవై ఇరవై హోరొచ్చాక, హాకీ నిజంగానే తూచ్ ఐపోయింది. ట్వంటీ ట్వంటీ అనేకంటే ఇరవై ఇరవై అనడం ఎంతో తేలిగ్గా ఉంది చూసారా?

 5. Anonymous said,

  భలే రాసారు మస్టారూ, “US” లో కొర్చుని , rediff,cricinfo లు f5 కొట్టలేక చెతులు నొప్పి పెట్టే మాలాటి ఎదవలు, ఎం కొల్పొతున్నరో , కళ్ళకు కట్టి నట్లు చెప్పారు. HATS OFF

  మీ ఎదురింట్లొ DTS మద్య ఉందవలసిన వాదిని – పక్క చుబె collegues థొ లస్త్ 30mins match (score) చూసి , గెలిచిన సంతొషం లొ మీద kauphy పోస్కొవడం తప్ప ఎం పీకలెక పొయ్య ..

  నే ఇండియా వచ్చేస్త బబోఓఓఓఓఓఊఊఒయ్!!!!

 6. Anonymous said,

  భలే రాసారు మస్టారూ, “US” లో కొర్చుని , rediff,cricinfo లు f5 కొట్టలేక చెతులు నొప్పి పెట్టే మాలాటి ఎదవలు, ఎం కొల్పొతున్నరో , కళ్ళకు కట్టి నట్లు చెప్పారు. HATS OFFమీ ఎదురింట్లొ DTS మద్య ఉందవలసిన వాదిని – పక్క చుబె collegues థొ లస్త్ 30mins match (score) చూసి , గెలిచిన సంతొషం లొ మీద kauphy పోస్కొవడం తప్ప ఎం పీకలెక పొయ్య .. నే ఇండియా వచ్చేస్త బబోఓఓఓఓఓఊఊఒయ్!!!!

 7. మాకినేని ప్రదీపు said,

  అలాంటి ట్రాఫిక్కు సమస్య ఏదయినా వస్తుందేమోనని నేణు నిన్న ఇంటి నుండే పని చేసాను…

 8. అలాంటి ట్రాఫిక్కు సమస్య ఏదయినా వస్తుందేమోనని నేణు నిన్న ఇంటి నుండే పని చేసాను…

 9. క్రాంతి said,

  20-20కే ఇంత అల్లాడి పోతున్నారు.ఇంక మనవాళ్ళు world cup తెస్తే మీకు గుండెపోటు వస్తుందేమో!
  Just kidding.

 10. 20-20కే ఇంత అల్లాడి పోతున్నారు.ఇంక మనవాళ్ళు world cup తెస్తే మీకు గుండెపోటు వస్తుందేమో!Just kidding.

 11. రాకేశ్వర రావు said,

  నేను పుట్టిన తరువాత,
  భారతం మొదటిసారి విశ్వవిజేతలవడం చాలా సంతోషాన్నిచ్చింది. మొదటి సారి క్రికెట్ సెమీ ఫైనల్, ఫైనల్ కూర్చుని చూడడం.
  It was ‘almost’ as good as Football, Hockey or NFL. 🙂
  అదే వూపుతో, ఒక హీకీ అజ్లన్ షానో, ప్రపంచ కప్పో నెగ్గి, ఒక ఫుట్బాల్ ప్రపంచ కప్పుకు చేరుకుంటే (నెగ్గక్కర్లేదు) జన్మ తరిస్తుంది. 🙂

 12. నేను పుట్టిన తరువాత, భారతం మొదటిసారి విశ్వవిజేతలవడం చాలా సంతోషాన్నిచ్చింది. మొదటి సారి క్రికెట్ సెమీ ఫైనల్, ఫైనల్ కూర్చుని చూడడం. It was ‘almost’ as good as Football, Hockey or NFL. :)అదే వూపుతో, ఒక హీకీ అజ్లన్ షానో, ప్రపంచ కప్పో నెగ్గి, ఒక ఫుట్బాల్ ప్రపంచ కప్పుకు చేరుకుంటే (నెగ్గక్కర్లేదు) జన్మ తరిస్తుంది. 🙂

 13. S said,

  సరిగ్గా నేను కూడా రాకేశ్ కామెంట్ మొదటి భాగమే రాయబోతూ ఉండగా ఆ కామెంటు చూసాను.
  నేను పుట్టాక మన ఇండియన్ టీమ్ గెలిచిన మొదటి ప్రపంచ కప్…అసలు ఎప్పటికైనా గెలుస్తుందో లేదో అని బెంగ గా ఉండింది..పోనీ…ఏదో ఓటి..ఇరవైయ్యిరవై కప్పన్నా గెలిచారు కదా. 🙂 ఒక్క బాల్ కూడా చూడలేదు ఈ మ్యాచ్ లో! 😦 రిఫ్రెష్ కొట్టూకుంటూ క్రిక్‍ఇన్ఫో పై అధారపడాల్సి వచ్చింది…కొన్ని కారణాల వల్ల 😦

 14. S said,

  సరిగ్గా నేను కూడా రాకేశ్ కామెంట్ మొదటి భాగమే రాయబోతూ ఉండగా ఆ కామెంటు చూసాను.నేను పుట్టాక మన ఇండియన్ టీమ్ గెలిచిన మొదటి ప్రపంచ కప్…అసలు ఎప్పటికైనా గెలుస్తుందో లేదో అని బెంగ గా ఉండింది..పోనీ…ఏదో ఓటి..ఇరవైయ్యిరవై కప్పన్నా గెలిచారు కదా. 🙂 ఒక్క బాల్ కూడా చూడలేదు ఈ మ్యాచ్ లో! 😦 రిఫ్రెష్ కొట్టూకుంటూ క్రిక్‍ఇన్ఫో పై అధారపడాల్సి వచ్చింది…కొన్ని కారణాల వల్ల 😦

 15. కొత్త పాళీ said,

  ఫ్రేం బై ఫ్రేం డ్రామా అంతా తెరమీద దించేశావుగా! 🙂

 16. ఫ్రేం బై ఫ్రేం డ్రామా అంతా తెరమీద దించేశావుగా! 🙂

 17. ప్రవీణ్ గార్లపాటి said,

  srinivas గారు:
  అవునండీ…మాచ్ బాగా ఎంజాయ్ చేసాను. మీకు నచ్చినందుకు సంతోషం. భారతం విజయాన్ని మీరు కూడా ఆస్వాదించుంటారని ఆశిస్తున్నా…

  చదువరి గారు:
  అబ్బో అది క్రికెట్టు మహిమండీ బాబూ. జనాలందరినీ ఒక్క తాటిన నిలబెట్టగలిగేదేదన్నా ఉందంటే కొంత వరకూ అది క్రికెట్టే.
  ఇరవై ఇరవై కీ జై. 🙂

  anonymous గారు:
  మరేం ఫరవాలేదు తొందర్లో వెనక్కొచ్చెయ్యండి. లైఫ్ లో ఇలాంటివి కోల్పోకూడదు మరి.
  మీ DTS కోసం ఎదురుచూస్తుంటా 😉

  ప్రదీపు:
  స్మార్ట్… నేనూ చేద్దును కానీ నాకు కాలూ చెయ్యీ ఆడదు ఆఫీసుకి పోందే. ఏ పనీ చెయ్యలేను ఇంట్లో.
  నువ్వు క్రికెట్టు చూస్తావని నాకు తెలీదు.

  క్రాంతి గారు:
  ఇండియా లో క్రికెట్టంటే అంతే మరి. ఏ వరల్డ్ కప్పయినా అందరినీ కొట్టీ తేవలసిందేగా 🙂

  రాకేశ్వరా:
  అభీష్ట సిద్ధిరస్తు 🙂

  సౌమ్య గారు:
  నే పుట్టిన తరవాత రెండోది లెండి. 🙂 కానీ నేను చూసిన మొదటిది.
  అయ్యో మాచ్ చూడలేకపోయారా ?

  కొత్త పాళీ గారు:
  మరంతే… క్రికెట్టు ఫాన్సన్నాక తప్పుద్దా.

 18. srinivas గారు:అవునండీ…మాచ్ బాగా ఎంజాయ్ చేసాను. మీకు నచ్చినందుకు సంతోషం. భారతం విజయాన్ని మీరు కూడా ఆస్వాదించుంటారని ఆశిస్తున్నా…చదువరి గారు: అబ్బో అది క్రికెట్టు మహిమండీ బాబూ. జనాలందరినీ ఒక్క తాటిన నిలబెట్టగలిగేదేదన్నా ఉందంటే కొంత వరకూ అది క్రికెట్టే. ఇరవై ఇరవై కీ జై. :)anonymous గారు:మరేం ఫరవాలేదు తొందర్లో వెనక్కొచ్చెయ్యండి. లైఫ్ లో ఇలాంటివి కోల్పోకూడదు మరి.మీ DTS కోసం ఎదురుచూస్తుంటా ;)ప్రదీపు: స్మార్ట్… నేనూ చేద్దును కానీ నాకు కాలూ చెయ్యీ ఆడదు ఆఫీసుకి పోందే. ఏ పనీ చెయ్యలేను ఇంట్లో. నువ్వు క్రికెట్టు చూస్తావని నాకు తెలీదు. క్రాంతి గారు:ఇండియా లో క్రికెట్టంటే అంతే మరి. ఏ వరల్డ్ కప్పయినా అందరినీ కొట్టీ తేవలసిందేగా :)రాకేశ్వరా:అభీష్ట సిద్ధిరస్తు :)సౌమ్య గారు:నే పుట్టిన తరవాత రెండోది లెండి. 🙂 కానీ నేను చూసిన మొదటిది.అయ్యో మాచ్ చూడలేకపోయారా ?కొత్త పాళీ గారు:మరంతే… క్రికెట్టు ఫాన్సన్నాక తప్పుద్దా.

 19. రానారె said,

  చివరి ఓవరు వచ్చేసరికి cricinfo బిగబట్టేసింది. రక్తప్రసరణ, గుండెపోటుల విషయంలో నాదీ నీ పరిస్థితే. ఎన్నిసార్లు దాని మొహం కడిగినా (refresh) అదే జిడ్డు. అంతలో ఒక మెయిల్ వచ్చింది – “Pak can’t beat India in WC” అని. వీడు వర్తమానం గురించే మాట్లాడుతున్నాడా గతమా లేక “సూర్యుడు తూర్పున ఉదయించును” లాంటి స్టేట్‌మెంటా అనే ఆదుర్దాలో ఉండగానే ఇంకో మెయిల్ “వి వన్” అని. నేనున్న బిల్డింగులో మనోళ్లెవరూ లేరు. సంబరాలు జరుపుకోవడానికి పక్క బిల్డింగులోకి పరుగు. తర్వాత కొద్ది సేపటికి తెలుగు పేపర్లు చూద్దునుగదా, కీచకుణ్ణి భీమసేనుడు మాంసపుముద్దగా చేసిపారేసినట్లు రాశారు. ఓరి వీళ్ల అసాధ్యంగూలా అనుకొని, మళ్లీ ఇంగ్లీషు పేపర్ల దారి…

 20. చివరి ఓవరు వచ్చేసరికి cricinfo బిగబట్టేసింది. రక్తప్రసరణ, గుండెపోటుల విషయంలో నాదీ నీ పరిస్థితే. ఎన్నిసార్లు దాని మొహం కడిగినా (refresh) అదే జిడ్డు. అంతలో ఒక మెయిల్ వచ్చింది – “Pak can’t beat India in WC” అని. వీడు వర్తమానం గురించే మాట్లాడుతున్నాడా గతమా లేక “సూర్యుడు తూర్పున ఉదయించును” లాంటి స్టేట్‌మెంటా అనే ఆదుర్దాలో ఉండగానే ఇంకో మెయిల్ “వి వన్” అని. నేనున్న బిల్డింగులో మనోళ్లెవరూ లేరు. సంబరాలు జరుపుకోవడానికి పక్క బిల్డింగులోకి పరుగు. తర్వాత కొద్ది సేపటికి తెలుగు పేపర్లు చూద్దునుగదా, కీచకుణ్ణి భీమసేనుడు మాంసపుముద్దగా చేసిపారేసినట్లు రాశారు. ఓరి వీళ్ల అసాధ్యంగూలా అనుకొని, మళ్లీ ఇంగ్లీషు పేపర్ల దారి…

 21. అశోక్ గార్ల said,

  చాలా బాగా రాసారు.చదువుతుంటే నేరుగా చూస్తున్నట్లు గా ఉంది.

  http://gsashok.wordpress.com/2007/09/24/20_20_worldcup_finals_india_paki

 22. చాలా బాగా రాసారు.చదువుతుంటే నేరుగా చూస్తున్నట్లు గా ఉంది.http://gsashok.wordpress.com/2007/09/24/20_20_worldcup_finals_india_paki

 23. ప్రవీణ్ గార్లపాటి said,

  రానారె: cricinfo ఎప్పుడూ జిడ్డు మొహమే. కడగడం కూడా కుదరదు. నే అందుకే cricbuzz చూస్తా (ఎప్పుడయినా నేరుగా చూడలేకపోతే)
  మన ప్రెస్సోళ్ళు అంతేగా.. అయితే అందలం లేదా పాతాళం.

  అశోక్ గారు: థాంక్స్

 24. రానారె: cricinfo ఎప్పుడూ జిడ్డు మొహమే. కడగడం కూడా కుదరదు. నే అందుకే cricbuzz చూస్తా (ఎప్పుడయినా నేరుగా చూడలేకపోతే)మన ప్రెస్సోళ్ళు అంతేగా.. అయితే అందలం లేదా పాతాళం.అశోక్ గారు: థాంక్స్


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: