సెప్టెంబర్ 27, 2007

చిరంజీవి నీవు చిరంజీవిగా వర్ధిల్లు గాక …

Posted in చిరంజీవి, సినిమా, సినిమాలు వద్ద 8:55 సా. ద్వారా Praveen Garlapati

నాకెంతో ఇష్టమయిన చిరంజీవి సినిమాల గురించి రాద్దామనుకుంటున్నా ఇవాళ. అసలు ఇప్పుడంటే చిరంజీవి ఇలా చీపయిపోయాడు కానీ వయసులో ఉన్నప్పుడు వైవిధ్యభరితమయిన సినిమాలు చేసినప్పుడూ, ప్రతీ సినిమాలోనూ కొత్తదనం చూపించాలనుకున్నప్పుడూ మా బాగా ఉండేవాడు.

అందుకే నాకభిమాన నటుడయ్యాడు. చిరంజీవి సినిమాలంటే పడి చచ్చేవాడిని. ఆ వేష భాషలను అనుకరించాలని ప్రయత్నించేవాడిని చిన్నప్పుడు. కొంత పెద్దయ్యాక చిరంజీవి డాన్సు చూసిన ప్రతీ సారీ ఫ్లాటయిపోయేవాడిని. ఎన్నో సార్లు చేద్దామని బొక్క బోర్లా పడ్డాను కూడా. ఆ స్టెప్పులు భలే మజాగా ఉండేవి. డిస్కో, బ్రేక్ మొదలయినవి అద్భుతంగా చేసేవాడు.

అలాగని కమర్షియల్ మూసలోనే కాకుండా వైవిధ్యభరితమయిన చంటబ్బాయి, రుద్రవీణ, ఆపధ్భాంధవుడు మొదలయిన సినిమాలలో నటించాడు. కొండవీటి దొంగ, కొదమ సింహం, లంకేశ్వరుడు, రుద్రనేత్ర, మరణ మృదంగం, స్టేట్ రౌడీ, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, రౌడీ అల్లుడు, ఖైదీ నంబర్ 786, గాంగ్ లీడర్, స్వయంకృషి, దొంగ మొగుడు, మగ మహారాజు, ఛాలెంజ్, పసివాడి ప్రాణం, రాజా విక్రమార్క, బావగారు బాగున్నారా, ఠాగూర్, శంకర్ దాదా MBBS, ఇంద్ర అబ్బో చెప్పుకుంటే ఎంత వైవిధ్యభరితమయిన నటనా చరిత్ర ఉంది చిరంజీవికి. అలాంటి సత్తా ఉన్న వ్యక్తి టాలెంటు ఇప్పుడు వేస్టవుతుందే అని కొద్దిగా (చాలా) బాధగా కూడా ఉంటుంది నాకు. కానీ ఏం చేస్తాం. విధి రాత.

ఇక నేనిప్పుడు ఆయన సినిమాలలో నా ఛాయిస్ అయిన వాటి గురించి మాట్లాడతా:

చిరంజీవి నట జీవితంలో ప్రత్యేకమయిన ప్రస్తావన తేవలసిన సినిమాలు ఉన్నాయంటే నాకయితే రెండు స్వయంకృషి, రుద్రవీణ. మిగతా సినిమాలెన్నో నచ్చినవి నాకున్నా ఇవి మాత్రం ఎంతో ప్రత్యేకం. నా హృదయానికి దగ్గరగా ఉంటాయి ఎప్పటికీ. అసలు వీటిని ఎన్ని సార్లు చూసానో నాకే తెలీదు.

స్వయంకృషి:
ఈ సినిమా గురించి తలచుకుంటేనే నాకు ఒళ్ళు పులకరిస్తుంది. అద్భుతమయిన కథ/కథనం, అంతకన్నా అద్భుతమయిన నటులు కలిస్తే ఈ సినిమా. కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో తయారయిన మణిపూస ఇది. ఈ సినిమాలో ఎన్నో హైలైట్లు. మొదటిది కృషితో నాస్తి దుర్భిక్షం. చెప్పులు కుట్టే చిరంజీవి స్వయంకృషితో పైకొస్తాడు. ఎదురు దెబ్బలు తగిలినా ఎంతో ఎత్తుకు ఎదుగుతాడు. సినిమా అక్కడితో ఆగితే ఇందులో గొప్పతనం ఉండేది కాదు ఎందుకంటే ఆ తరువాత జరిగే సంఘటనలే ఈ సినిమాకు ప్రాణం. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లవాడు చెడు దారిన పడతాడు ఐశ్వర్యం తో. ఆ పిల్లాడిని తిరిగి ఎలా దారికి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తాడో, ఆ దారిలో నచ్చచెప్పడం, భయపెట్టడం, బుజ్జగించడం, ప్రేమించడం అన్నీ ఆకట్టుకుంటాయి.

చిరంజీవి ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలి అనే సూత్రం పాటిస్తాడు. మనం “పెద్ద” అయినంత మాత్రాన సరిపోదు మన మనసు కూడా పెద్దదవాలి అని కథ చెబుతుంది. చెడు వైపుకి లొంగడం, క్షణిక సుఖాల కోసం మొగ్గడం సులభం. కానీ కృషి వల్ల వచ్చే సంతోషం దాని వల్ల రాదు అని ఎంత చక్కగా చెబుతుందో ఈ సినిమా. నేను నమ్మే సూత్రాలకు చాలా దగ్గరగా ఉంటుంది ఈ సినిమా. ఓ మనిషిని అతని హోదాతోనో, అతని డబ్బుతోనో, పదవితోనో, పేరుతోనో అంచనా వెయ్యకూడదు. కృషి, పట్టుదల ముందు అన్నీ దిగదుడుపే.

ఈ సినిమాలో “సిగ్గూ పూబంతి” పాట నాకు ఇష్టమయినది.

రుద్రవీణ:
కె బాలచందర్ గారి దర్శకత్వంలో వచ్చిన ఇంకో వజ్రం ఈ సినిమా. నటనకి ఎంతో ఆస్కారం ఉన్న ఎన్నో పాత్రలు ఈ సినిమా సొంతం. అలాంటి పాత్రలలో ఎప్పటీకీ గుర్తుండిపోయే పాత్రలో చిరంజీవి నటన అద్భుతం. ఇందులో ఎన్నో అంశాలు స్పృశిస్తాడు దర్శకుడు. సంగీతం అనేది కొందరికి చెందినదిగానే మిగిలిపోకూడదు అందరికీ చెందినప్పుడే దాని గొప్పతనం అనీ, అంటరానితనం / ఉన్నత కులం, నీచ కులం అనే అసమానత రూపుమాపాలనీ, తాగుడుకి బానిస కాకూడదనీ ఈ సినిమాలో చూపిస్తాడు దర్శకుడు.
చిరంజీవి నటన ఈ సినిమాని ఎక్కడికో తీసుకెళుతుంది. సూర్యం పాత్రలో ఒదిగిపోయి అసమాన నటనా ప్రావీణ్యంతో ఎన్నో భావాలు ఒలికిస్తాడు చిరంజీవి. అలాగే బిళహరి పాత్రలో సూర్యం నాన్నగా నటించిన పాత్ర కూడా ఎంతో అద్భుతమయిన పాత్ర. తన తండ్రి బిళహరి గణపతి శాస్త్రి కి పూర్తి వ్యతిరేకం సూర్యం పాత్ర. వారిద్దరి మధ్య జరిగే ఘర్షణ హైలైటు.

ఈ సినిమాలో “కదలిరాద తనే వసంతం…” నాకెంతో ఇష్టమయిన పాట. అలాగే “రండి రండి దయచేయండి…” పాట కూడా చాలా బాగుంటుంది. (పెంటమ్మ ఘట్టం గుర్తుందా అందరికీ ?)

చంటబ్బాయి:
హీరోయిజం ఉన్న చిరంజీవితో డాన్సులు, ఫైట్లు మాత్రమే కాకుండా కామెడీ చేయించిన వినూత్న చిత్రం ఇది. దీంట్లో చిరంజీవి కి ఉన్న కామెడీ టైమింగ్ స్పష్టమవుతుంది. (తన నటనలో ఉపయోగించుకోవలసినంతగా ఉపయోగించుకోలేదని నా విమర్శ). అసలు సినిమా అంతా నవ్విస్తూనే ఉంటుంది. జంధ్యాల గారి చేతిలో రూపు దిద్దుకున్న హాస్య గుళిక ఇది. “పాండ్ జేంస్ పాండ్” గా చిరంజీవి “పాండు” కారెక్టర్ తెగ నవ్విస్తుంది. అదీనూ చిరంజీవి ని చావబాదే కారెక్టర్లో అల్లు అరవింద్… హహహ.. నవ్వుల పండగే.

ఈ సినిమాలో “అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను…” పాట హిలేరియస్…

ఛాలెంజ్:
యండమూరి నవలల ఆధారంగా రూపొందించిన చిరంజీవి సినిమాల్లో ఇదొకటి. నిరుద్యోగుల మీద ప్రాక్టికల్ జోకు ప్లే చేసిన రావు గోపాల్ రావు తో చిరంజీవి యాభై లక్షలు సాధిస్తానని చాలెంజ్ చేసి గెలుస్తాడు. కథ పాతదే అయినా బాగుంటుంది.
ఆఖరి సీనులో చిరంజీవి “రామ్మోహనరావు నేనే గెలిచాను…” అరుపు నాకెప్పుడూ గుర్తుంటుంది.

ఇక మోడర్న్ సమయానికి వస్తే

జగదేక వీరుడు అతిలోక సుందరి:
అప్పటికే మెగాస్టార్ స్టేటస్ ఉన్న చిరంజీవికి జనాలలో ఇంకా ఎంతో క్రేజ్ పెంచిన సినిమా ఇది. ఫాంటసీ తో రూపొందిన ఈ సినిమాలో చిరంజీవి, శ్రీదేవి నటన అబ్బో. ఇంద్రుడి కుమార్తె అయిన శ్రీదేవి తన అంగుళీయకం భూలోకంలో పోగొట్టుకోవడం, అది మానవుడయిన చిరంజీవి కి దొరకడం, ఆ అంగుళీకాన్ని చిరంజీవి నుండి వెనక్కి తీసుకురావడం కోసం శ్రీదేవి తంటాలు బహు బాగు ఈ సినిమా. మానవా అంటూ చిరంజీవి ని సంబోధిస్తున్న శ్రీదేవి సంభాషణలు భలే ఉంటాయి.
ఈ సినిమాలో నాకు నచ్చిన పాట “అబ్బ నీ తియ్యని దెబ్బ…” 😉

ఇక ఆపుతా నోస్టాల్జిక్ మూడులోకెళ్ళిపోయా…. తీరికున్నప్పుడు మరిన్ని చిరంజీవి సినిమాల గురించి రాస్తా. చిరంజీవి పైన లాంటి చిత్రాల్లోనే నటిస్తే ఎంత బాగుండును ప్చ్…
నాకు తెలుసు చిరంజీవి ఘరానా మొగుడూ, మృగరాజు, స్టాలిన్ లాంటి చెత్త సినిమాల గురించి ఎందుకు రాయలేదు అని అడుగుతారని. ఇంత మంచి మూడు ని పాడుచేసుకోవడం ఇష్టం లేదు నాకు 🙂

ప్రకటనలు

37 వ్యాఖ్యలు »

  1. మేధ said,

    అవునండీ, నాకు అలానే అనిపిస్తోంది.. అసలు అంత మంచి సినిమాలు చేసిన ఆయన, ఇప్పుడు ఇలాంటి సినిమాలు చేస్తుంటే చాలా బాధగా ఉంటుంది..

    నాకు ఇష్టమైన సినిమాలు, “రుద్రవీణ”, “చంటబ్బాయి”…. నాకు రుద్రవీణ లోని, చుట్టూపక్కల చూడరా, చిన్నవాడా అనే పాట బాగా ఇష్టం..

  2. మేధ said,

    అవునండీ, నాకు అలానే అనిపిస్తోంది.. అసలు అంత మంచి సినిమాలు చేసిన ఆయన, ఇప్పుడు ఇలాంటి సినిమాలు చేస్తుంటే చాలా బాధగా ఉంటుంది..నాకు ఇష్టమైన సినిమాలు, “రుద్రవీణ”, “చంటబ్బాయి”…. నాకు రుద్రవీణ లోని, చుట్టూపక్కల చూడరా, చిన్నవాడా అనే పాట బాగా ఇష్టం..

  3. 'ఐ'స్మైల్! said,

    మళ్లీ ఆ లోకంలోకి తీసుకెళ్లారుగా! ఆహా ఆ రోజులే వేరు! అన్నట్టు ఘరానామొగుడు ఆ రోజుల్లో అతి పెద్ద హిట్టు.ఇక మృగరాజు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇప్పటికీ న్యామద్దెల అనే పల్లెలోని మా బావ (ఆయన బాలకృష్ణుడి పంకా లెండి)నన్ను ‘ముగరాజు’ అని వెక్కిరిస్తూ ఉంటాడు:(

  4. 'ఐ'స్మైల్! said,

    మళ్లీ ఆ లోకంలోకి తీసుకెళ్లారుగా! ఆహా ఆ రోజులే వేరు! అన్నట్టు ఘరానామొగుడు ఆ రోజుల్లో అతి పెద్ద హిట్టు.ఇక మృగరాజు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇప్పటికీ న్యామద్దెల అనే పల్లెలోని మా బావ (ఆయన బాలకృష్ణుడి పంకా లెండి)నన్ను ‘ముగరాజు’ అని వెక్కిరిస్తూ ఉంటాడు:(

  5. మళ్లీ ఆ లోకంలోకి తీసుకెళ్లారుగా! ఆహా ఆ రోజులే వేరు! అన్నట్టు ఘరానామొగుడు ఆ రోజుల్లో అతి పెద్ద హిట్టు.ఇక మృగరాజు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇప్పటికీ న్యామద్దెల అనే పల్లెలోని మా బావ (ఆయన బాలకృష్ణుడి పంకా లెండి)నన్ను ‘ముగరాజు’ అని వెక్కిరిస్తూ ఉంటాడు:(

  6. నవీన్ గార్ల said,

    అభిలాష, నకిలీ మనిషి, యముడికి యముడు, మంత్రి గారి వియ్యంకుడు లాంటి సినిమాలను మరచిపోయావా!! లేక చూడలేదా? చూడకపోతే మాత్రం వెంటనే చూడు

  7. అభిలాష, నకిలీ మనిషి, యముడికి యముడు, మంత్రి గారి వియ్యంకుడు లాంటి సినిమాలను మరచిపోయావా!! లేక చూడలేదా? చూడకపోతే మాత్రం వెంటనే చూడు

  8. ప్రవీణ్ గార్లపాటి said,

    మేధ గారు:
    అవును రుద్రవీణ సినిమాలో పాటలన్నీ బావుంటాయి. నాకు “నేను సైతం…” పాట కూడా ఇష్టం.

    ఐస్మైల్ గారు:
    అవునండీ ఆ కాలమే వేరు, ఆ చిరంజీవే వేరు. మీ అంత భీభత్స భయానక పంకా ని కాకపోయినా ఓ మోస్తరు పంకానే నేను చిరంజీవికి.
    ఘరానా మొగుడు సూపర్ హిట్టు కానీ నాకు నచ్చిన సినిమా కాదు. చిరంజీవిని ఎందుకో వెకిలిగా ఇష్టపడను నేను.
    ఇక ఈ మధ్య జై చిరంజీవా, స్టాలిన్ ల గురించి ఏం చెప్పమంటారు లెండి.

    నవీన్ అన్న:
    చూడకే… చిరంజీవి సినిమాల్లో చాలా శాతం చూసాను. కొన్ని చూడలేకపోయాను. కొన్ని చూడవద్దనుకున్నాను.
    మీరు చెప్పిన వాటిలో నకిలీ మనిషి చూడలేదు. లేదా గుర్తులేదు.

  9. మేధ గారు:అవును రుద్రవీణ సినిమాలో పాటలన్నీ బావుంటాయి. నాకు “నేను సైతం…” పాట కూడా ఇష్టం.ఐస్మైల్ గారు:అవునండీ ఆ కాలమే వేరు, ఆ చిరంజీవే వేరు. మీ అంత భీభత్స భయానక పంకా ని కాకపోయినా ఓ మోస్తరు పంకానే నేను చిరంజీవికి.ఘరానా మొగుడు సూపర్ హిట్టు కానీ నాకు నచ్చిన సినిమా కాదు. చిరంజీవిని ఎందుకో వెకిలిగా ఇష్టపడను నేను.ఇక ఈ మధ్య జై చిరంజీవా, స్టాలిన్ ల గురించి ఏం చెప్పమంటారు లెండి.నవీన్ అన్న:చూడకే… చిరంజీవి సినిమాల్లో చాలా శాతం చూసాను. కొన్ని చూడలేకపోయాను. కొన్ని చూడవద్దనుకున్నాను.మీరు చెప్పిన వాటిలో నకిలీ మనిషి చూడలేదు. లేదా గుర్తులేదు.

  10. కొత్త పాళీ said,

    స్టాలిన్ దాకా ఎందుకు. ఠాగూర్ చూడ్డవే చాలా కష్టవైపోయింది. యండమూరి నవలల సినిమాల్లో ఛాలెంజ్ కంటే అభిలాష బావుంటుందని నా అభిప్రాయం. రాక్షసుడు కూడా. “ఇందువదన కుందరదన” పాట ఏ సినిమాలోది? ఆ కాలంలో జనాలకి బాగా వెర్రెక్కిచ్చింది. చిరంజీవి మంచి “నటన” కనబరిచిన ఇంకో మంచి సినిమా శుభలేఖ. చిరంజీవి తెలుగు తెరమీద విజృంభిస్తున్న రోజుల్లోనే నేను ఆంధ్ర దేశానికి దూరమై చాలా సినిమాలు మిస్సయ్యాను. ఈ మధ్యనే మళ్ళీ ఆ చిత్ర రాజాలన్నీ దర్శించడం మొదలెట్టాను.
    మొత్తానికి మంచి టపా, ప్రవీణ్.

  11. స్టాలిన్ దాకా ఎందుకు. ఠాగూర్ చూడ్డవే చాలా కష్టవైపోయింది. యండమూరి నవలల సినిమాల్లో ఛాలెంజ్ కంటే అభిలాష బావుంటుందని నా అభిప్రాయం. రాక్షసుడు కూడా. “ఇందువదన కుందరదన” పాట ఏ సినిమాలోది? ఆ కాలంలో జనాలకి బాగా వెర్రెక్కిచ్చింది. చిరంజీవి మంచి “నటన” కనబరిచిన ఇంకో మంచి సినిమా శుభలేఖ. చిరంజీవి తెలుగు తెరమీద విజృంభిస్తున్న రోజుల్లోనే నేను ఆంధ్ర దేశానికి దూరమై చాలా సినిమాలు మిస్సయ్యాను. ఈ మధ్యనే మళ్ళీ ఆ చిత్ర రాజాలన్నీ దర్శించడం మొదలెట్టాను. మొత్తానికి మంచి టపా, ప్రవీణ్.

  12. నవీన్ గార్ల said,

    కొత్తపాళీ గారు, “ఇందువదన కుందరదన” పాట “ఛాలెంజ్”లోనిది. నా అభిప్రాయమైతే ఛాలెంజ్, అభిలాష వేటికవే సాటి. ఒకటి ఎక్కువ ఇంకొకటి తక్కువ అని చెప్పలేము. అవి రెండూ అంత బాగున్నాయి మరి 🙂

  13. కొత్తపాళీ గారు, “ఇందువదన కుందరదన” పాట “ఛాలెంజ్”లోనిది. నా అభిప్రాయమైతే ఛాలెంజ్, అభిలాష వేటికవే సాటి. ఒకటి ఎక్కువ ఇంకొకటి తక్కువ అని చెప్పలేము. అవి రెండూ అంత బాగున్నాయి మరి 🙂

  14. రాకేశ్వర రావు said,

    చిరంజీవికి ముక్కుతాడులా మెగాస్టార్ ఇమేజి రాక ముందు సినిమాలు చూస్తే, ఎంత బాగా చేసేవాడు అని పిస్తుంది. ప్చ్..
    మా అభిమన హీరో పవన్ కళ్యాణ్ అలా అవడని ఆశిస్తూ.. 🙂

  15. చిరంజీవికి ముక్కుతాడులా మెగాస్టార్ ఇమేజి రాక ముందు సినిమాలు చూస్తే, ఎంత బాగా చేసేవాడు అని పిస్తుంది. ప్చ్.. మా అభిమన హీరో పవన్ కళ్యాణ్ అలా అవడని ఆశిస్తూ.. 🙂

  16. చేతన said,

    Maa PK alA avakapOvaTam enDanDI bAbU, #already# ayipOyADu. #balu, annavaram, bangaram#.. EnTi ee chetta. chiranjeevi ki #image# chaTram, PK ki anna chaTram.

  17. చేతన said,

    Maa PK alA avakapOvaTam enDanDI bAbU, #already# ayipOyADu. #balu, annavaram, bangaram#.. EnTi ee chetta. chiranjeevi ki #image# chaTram, PK ki anna chaTram.

  18. Sri said,

    This comment has been removed by the author.

  19. Srinivas Ch said,

    నాకు చిరంజీవి సినిమాలు దాదాపు అన్నీ ఇష్టమే, కాని ఎందుకనో బావగారూ-బాగున్నారా, శంకర్ దాదా అసలు నచ్చలేదు. మున్నాభాయి ముందే చూసేసాను కాబట్టి శంకర్ దాదా నచ్చలేదు అనుకుంటా..

    ఇంక రుద్రవీణ నా ఆల్ టయిమ్ ఫేవరేట్ సినిమా, అందులో పాటలు ఒకదానిని మించి ఒకటి బాగుంటాయి. నాకైతే లలిత ప్రియకమలం విరిసినది పాట చాలా ఇష్టం. దాంట్లో చిరుకి నాన్న వేషం వేసింది తమిళ నటుడు జెమిని గణేషన్ గారు.

  20. Srinivas Ch said,

    నాకు చిరంజీవి సినిమాలు దాదాపు అన్నీ ఇష్టమే, కాని ఎందుకనో బావగారూ-బాగున్నారా, శంకర్ దాదా అసలు నచ్చలేదు. మున్నాభాయి ముందే చూసేసాను కాబట్టి శంకర్ దాదా నచ్చలేదు అనుకుంటా..ఇంక రుద్రవీణ నా ఆల్ టయిమ్ ఫేవరేట్ సినిమా, అందులో పాటలు ఒకదానిని మించి ఒకటి బాగుంటాయి. నాకైతే లలిత ప్రియకమలం విరిసినది పాట చాలా ఇష్టం. దాంట్లో చిరుకి నాన్న వేషం వేసింది తమిళ నటుడు జెమిని గణేషన్ గారు.

  21. 'ఐ'స్మైల్! said,

    “భీభత్స భయానక పంకా”- ఇది నచ్చింది:) అవును చెప్పడం మరచిపోయా…’చిరు’ చిత్రాలలో నాకమితంగా నచ్చిన చిత్రం- “ఆరాధన”. కథానాయిక: సుహాసిని దర్శకత్వం:భారతీరాజా
    సంగీతం: ఇళయరాజా.

  22. 'ఐ'స్మైల్! said,

    “భీభత్స భయానక పంకా”- ఇది నచ్చింది:) అవును చెప్పడం మరచిపోయా…’చిరు’ చిత్రాలలో నాకమితంగా నచ్చిన చిత్రం- “ఆరాధన”. కథానాయిక: సుహాసిని దర్శకత్వం:భారతీరాజా
    సంగీతం: ఇళయరాజా.

  23. “భీభత్స భయానక పంకా”- ఇది నచ్చింది:) అవును చెప్పడం మరచిపోయా…’చిరు’ చిత్రాలలో నాకమితంగా నచ్చిన చిత్రం- “ఆరాధన”. కథానాయిక: సుహాసిని దర్శకత్వం:భారతీరాజాసంగీతం: ఇళయరాజా.

  24. అశోక్ గార్ల said,

    4GB క్లయంట్ (చిరు) కి 1GB సర్వర్ (డైరక్టర్) ని తగిలిస్తే ఎల వుంటాది?

    క్లయంట్ కి ఎంత కపాసిటి వున్నా సర్వర్ కి అంత లేక అంతకన్నా ఎక్కువ కపాసిటి వుండాలి కదా?

    చిరు పాత సినిమా డైరక్టర్లు అలా వుండే వారు మరి. కె.విస్వనాథ్, కె.రాఘవేంద్ర రావు, కె.బాలచందర్, కొదండ రామిరెడ్డి, విజయబాపినీడు, రవిరాజా పినిసెట్టి, జంద్యాల, భారతీరాజా.

  25. 4GB క్లయంట్ (చిరు) కి 1GB సర్వర్ (డైరక్టర్) ని తగిలిస్తే ఎల వుంటాది? క్లయంట్ కి ఎంత కపాసిటి వున్నా సర్వర్ కి అంత లేక అంతకన్నా ఎక్కువ కపాసిటి వుండాలి కదా? చిరు పాత సినిమా డైరక్టర్లు అలా వుండే వారు మరి. కె.విస్వనాథ్, కె.రాఘవేంద్ర రావు, కె.బాలచందర్, కొదండ రామిరెడ్డి, విజయబాపినీడు, రవిరాజా పినిసెట్టి, జంద్యాల, భారతీరాజా.

  26. ప్రవీణ్ గార్లపాటి said,

    కొత్తపాళీ గారు:
    అభిలాష, రాక్షసుడు అద్భుతమయిన సినిమాలు.
    ఇందువదన కుందరదన…మంచి పాట గుర్తుచేసారు. (నవీన్ అనే ఓ సినిమాల ఎన్సైక్లోపీడియా ఉందని మర్చిపోకండి. 🙂 )
    భలే ఇప్పుడు చూస్తున్న పాత సినిమాల మీద “విన్నా కన్నా” టపాలు చూడచ్చన్నమాట.

    నవీన్ అన్న:
    అవును ఛాలెంజ్, అభిలాష రెండూ వేటికవే. ఛాలెంజ్ నాకెందుకో ప్రత్యేకంగా నచ్చుతుంది. చిరంజీవి కూల్…

    రాకేశ్వర:
    అవును ఇమేజీ చట్రంలో బిగుసుకున్న తరవాత పతనం మొదలయింది పాపం.
    అన్నట్టు బ్రదర్ మీరు పవన్ కళ్యాణ్ గురించి జోక్ చేసారు కదూ 🙂

    చేతన గారు:
    అబ్బో పవన్ కళ్యాణ్ కథే వేరు, డ్రీం స్టార్ట్ లభించిన తరవాత చేజేతులా అతి కి పోయి జానీ, పాంట్ మీద పాంట్ అని ఎదవ్వేషాలెయ్యడం మొదలెట్టాడు. ఇప్పుడు హిట్టుల్లేక చతికిలబడ్డాడు.

    Srinivas గారు:
    బావగారు…, శంకర్ దాదా నచ్చలేదని చెప్పను కానీ చిరంజీవి ఇతర మంచి సినిమాల లెవెల్ వీటిది కాదు.
    అవును జెమినీ గణేశన్ గారు. నాకసలు ఆయనని అనిపించలేదెందుకో మరి.

    ఇస్మాయిల్ గారు:
    ఆరాధన సినిమా నాకు గుర్తురావట్లేదేమిటబ్బా ?

    అశోక్ గారు:
    సర్వర్ ని ఎంచుకునే సత్తా క్లయింట్ కి ఉండి కూడా అలాంటి సర్వర్ ని ఎంచుకుంటే నిందించాల్సిందే కదండీ మరి.

  27. కొత్తపాళీ గారు:అభిలాష, రాక్షసుడు అద్భుతమయిన సినిమాలు. ఇందువదన కుందరదన…మంచి పాట గుర్తుచేసారు. (నవీన్ అనే ఓ సినిమాల ఎన్సైక్లోపీడియా ఉందని మర్చిపోకండి. 🙂 )భలే ఇప్పుడు చూస్తున్న పాత సినిమాల మీద “విన్నా కన్నా” టపాలు చూడచ్చన్నమాట.నవీన్ అన్న:అవును ఛాలెంజ్, అభిలాష రెండూ వేటికవే. ఛాలెంజ్ నాకెందుకో ప్రత్యేకంగా నచ్చుతుంది. చిరంజీవి కూల్…రాకేశ్వర:అవును ఇమేజీ చట్రంలో బిగుసుకున్న తరవాత పతనం మొదలయింది పాపం.అన్నట్టు బ్రదర్ మీరు పవన్ కళ్యాణ్ గురించి జోక్ చేసారు కదూ :)చేతన గారు:అబ్బో పవన్ కళ్యాణ్ కథే వేరు, డ్రీం స్టార్ట్ లభించిన తరవాత చేజేతులా అతి కి పోయి జానీ, పాంట్ మీద పాంట్ అని ఎదవ్వేషాలెయ్యడం మొదలెట్టాడు. ఇప్పుడు హిట్టుల్లేక చతికిలబడ్డాడు.Srinivas గారు:బావగారు…, శంకర్ దాదా నచ్చలేదని చెప్పను కానీ చిరంజీవి ఇతర మంచి సినిమాల లెవెల్ వీటిది కాదు.అవును జెమినీ గణేశన్ గారు. నాకసలు ఆయనని అనిపించలేదెందుకో మరి.ఇస్మాయిల్ గారు:ఆరాధన సినిమా నాకు గుర్తురావట్లేదేమిటబ్బా ?అశోక్ గారు:సర్వర్ ని ఎంచుకునే సత్తా క్లయింట్ కి ఉండి కూడా అలాంటి సర్వర్ ని ఎంచుకుంటే నిందించాల్సిందే కదండీ మరి.

  28. mohanrazz said,

    “కదలి రాదా తనే వసంతం” కాదేమో..”తరలి రాదా తనే వసంతం” ఏమో..నాకూ అదే ఫేవరేట్ సాంగ్ !!

  29. mohanrazz said,

    “కదలి రాదా తనే వసంతం” కాదేమో..”తరలి రాదా తనే వసంతం” ఏమో..నాకూ అదే ఫేవరేట్ సాంగ్ !!

  30. Solarflare said,

    కదలి అనే నాకు గుర్తు. అలాగే “కదలి రాదా…” కాదు – “కదలి రాద…” ద కి ధీర్ఘం లేదు.

  31. Solarflare said,

    కదలి అనే నాకు గుర్తు. అలాగే “కదలి రాదా…” కాదు – “కదలి రాద…” ద కి ధీర్ఘం లేదు.

  32. Solarflare said,

    మరి మంచుపల్లకి సంగతేమిటంటారు?

  33. Solarflare said,

    మరి మంచుపల్లకి సంగతేమిటంటారు?

  34. ప్రవీణ్ గార్లపాటి said,

    mohanrazz గారు:
    మ్మ్… నేను అలాగే విన్నాను. తెలీదు తప్పేమో మరి.

    solarflare గారు:
    మంచు పల్లకి చూడలేదండీ బాగుంటుందా ?
    ఓ రివ్యూ రాయండి వీలయితే.

  35. mohanrazz గారు:మ్మ్… నేను అలాగే విన్నాను. తెలీదు తప్పేమో మరి.solarflare గారు:మంచు పల్లకి చూడలేదండీ బాగుంటుందా ? ఓ రివ్యూ రాయండి వీలయితే.

  36. Anonymous said,

    అద్భుతమైన చిత్రాలు అన్న పదానికి అర్థాలే మార్చేసారు ఇక్కడి అభిమానులు..ఏంటో మరి..రాక్షసుడు, అభిలాష అద్భుతమైన చిత్రాలా..?అభిలాష కేవలం ఒక వ్యాపారాత్మక చిత్రం మాత్రమే, అంటే నటించడానికి పెద్ద స్కోప్ ఉన్న చిత్రం కాదు, ఇక అభిలాష చిత్రం లోని పాత్ర కేవలం మంచి ఔనత్యం ఉన్న పాత్ర మాత్రమే మంచి చిత్రం. కాని అద్భుతమైన నటన ప్రదర్శిచ్ణే పాత్ర అందులో లేదు. చిరంజీవి కేవలం ఓ మంచి హీరో మాత్రమే, అంటే నెంబర్ ఒన్ హీరో మేగస్టార్ అంతె కాని, గొప్ప మంచినటుడు ఎప్పటికి కాలేక పోయాడు, ప్రతి పాత్రలోను చిరు నే కనపడతాడు తప్ప ఆ ” పాత్ర ” ఎక్కడ కాని ఎప్పుడు కాని కనపడే విదంగా ఎప్పుడు నటించలేదు. అప్పట్లో కూడ దొంగ, గూండా, పులి లాంటి కమర్షియల్ చిత్రాలలోనే నటీంచాడు, రుద్రవీణ, స్వయం కృషి, ఆపధ్బాంధవుడు లాంటి కొన్ని ఔనత్యం ఉన్న పాత్రలు తప్ప పెద్దగా మంచి చిత్రాలు ఎప్పుడు నటించలేక పోయాడు, అందుకే చివరి దశలో తాపత్రయపడ్డాడు మంచి చిత్రాలు అంటే దేశం గురించో లేక సమాజం కోసం అన్న చిత్రాలు కోసం తాపత్రయ పడ్డాడు. పాత తరం ఎస్.వి.ఆర్, యన్.టి.ఆర్, అక్కినేని నాగేశ్వర రావు తర్వాత అంత స్థాయికి తగ్గ మంచి నటులున్న హీరోలు మనకు లేరు. పక్క రాష్ట్రమైన తమిళనాడు లో కమల్ హాసన్ తర్వాత ఆ స్థాయి నటులు ఇద్దరు వచ్చారు. మనకు ఒక్క కమల్ హాసన్ కూడ లేడు. ఇంకా చిరు గురించి చెప్పుకోవడమెందుకు..? KAMAL

  37. em chesthadu aayana mathram nammukunna vaala kosam anni ammukuntunnattu kanipisthondi


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: