అక్టోబర్ 10, 2007

హాపీ డేస్…

Posted in సినిమా, సినిమాలు, హాపీ డేస్ వద్ద 7:52 సా. ద్వారా Praveen Garlapati

నిజంగానే హాపీ డేస్ ని గుర్తుకు తెచ్చింది. మొన్న వీకెండ్ శనివారం సినిమా చూద్దామని కాదు కానీ కొద్దిగా షాపింగ్ చేసి టికెట్లు దొరికితే చూద్దామని ఫోరం కి వెళ్ళాము నేనూ నా నా స్నేహితుడు రమేషూ.

కసా పిసా తొక్కేసి ఎట్టకేలకు ఓ టీషర్ట్ కొన్నాము చెరోటీనీ. తరవాత పై ఫ్లోరు లో ఉన్న పీవీఆర్ కెళ్ళి చూస్తే అనుకున్నట్టుగానే టికెట్లు అయిపోయాయి అన్ని షోలకీ. సర్లే అని పక్కనే గా ఆఫీసు, వీక్ డేస్ లో అయితేనేం హాపీ డేస్ చూడచ్చు అని బుధవారానికి టికెట్లు కొనుక్కొచ్చేసాము.

పెద్దగా అంచనాలు లేకుండానే వెళ్ళా సినిమాకి ఎందుకంటే సినిమాలలో కాలేజీ రోజులనగానే చిరాకు తెప్పించేంత, వెగటు పుట్టించేంత వెధవ సీన్లు వాడతారు కాబట్టి. అయినా ఏదో నమ్మకం ఈయన మరీ చెత్తగా తీయలేడేమో అని.

గ్రౌండ్ బ్రేకింగ్ అని చెప్పను గానీ ఫ్రీ ఫ్లోయింగ్ సినిమా ఇది. ఎక్కడా బోరు కొట్టించకుండా, వెకిలి వేషాలు లేకుండా, అబ్నార్మల్ గా కాకుండా తీయగలగడంలో దాదాపు ఓ ఎనభై శాతం సఫలమయ్యాడు శేఖర్ కమ్ముల. పాటలు బాగుండడం ఓ అదనం. టెక్నికాలిటీ గురించి బ్లాగు పెద్దలకు వదిలేస్తా గానీ వినసొంపుగానే ఉన్నాయి. మికీ జె మేయర్ డిడ్ ఎ గుడ్ జాబ్…

ఇక కథ విషయానికొస్తే మన కాలేజీ లైఫే. కథలో ప్రతీ కారెక్టరునూ నేను ఐడెంటీఫై చేసుకోగలిగాను నా కాలేజీ రోజులలో నుంచి. నిజం. వేరే వారికి ఎలా అనిపించిందో తెలీదు కానీ నేను మాత్రం క్లియర్ గా ఆ ట్రెయిట్స్ ని గమనించగలిగాను. కథలో పానకం లో పుడకలాగా అనిపించేది టైసన్ అనవసర ఎక్స్పెరిమెంట్లు, కమలినీ ముఖర్జీ పాత్ర (పాత్ర అసహజం కాదు కానీ తీయడంలో ఎక్కడో సరిగా రాలేదు). అది వదిలేస్తే అంతా బాగానే ఉంది. ఓ రెండున్నర గంటల పాటు సంతోషకరమయిన మన కాలేజీ రోజులలోకి వెళ్ళిపోవచ్చు. మామూలు కథ నుంచి మంచి సినిమా రాబట్టగలగడం శేఖర్ కమ్ముల గొప్పతనమే.

ఎమోషన్స్ మీద ప్లే చేసాడనీ, సేఫ్ గేం ఆడాడనీ కొంత టాక్ ఉంది. నిజమే. ఇలాంటి ఎమోషన్స్ ని తెప్పించగలిగితే సక్సస్ రావడం నిజమయినప్పటికీ అది సరిగా చేయగలిగే సత్తా కూడా ఉండాలి. కాలేజీ స్టూడెంట్ల సినిమాలంటే బీ గ్రేడ్ సినిమాలా ఊహించుకునేటంత చెత్తగా తయారు చేసారు మన దర్శకులు. ఎప్పుడూ బీర్లు తాగుతూ, ఆంటీల వెనకాల పడుతూ, అమ్మాయిలను ఏడిపిస్తూ, చెత్త వాగుడు వాగుడుతుండడమే హీరోయిజంగా ప్రోజెక్ట్ చెయ్యబడింది. ఈ సినిమాలో కూడా అలాంటివి ఉన్నాయి కానీ సరయిన మోతాదులో, నిజమని నమ్మగలిగే మోతాదులో.

ఇక శేఖర్ ఎన్నుకున్న కారక్టరైజేషన్ అద్భుతంగా ఉంది. ఇలాంటి కారెక్టర్లు సర్వ సాధారణం కాలేజీలలో. చందు లాంటి ఇగోయిస్టు, రాజేష్ లాంటి దూకుడు టైపూ, టైసన్ లాంటి ఆల్రౌండరూ, శంకర్ లాంటి ఆపర్ట్యూనిస్టు, మధు లాంటి కాజ్యువల్, సంగీత లాంటి డిస్‌హానెస్టూ, అప్పు లాంటి టాంబాయ్ అన్నీను.

ఇకపోతే శ్రవంతి, టైసన్ కథ ని ముగించిన తీరు నచ్చింది. కథ ముగింపు కూడా బాగుంది. టైసన్ ఆబ్వియస్గా నాకు నచ్చిన పాత్ర. అలాగే రాజేష్ ది కూడా. మధు పాత్రలో తమన్నా బాగుంది. చాలా అందంగా ఉంది. కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రకారం రెండు సినిమాల తరవాత ఎలాగూ కనిపించదు లేదా ఎక్స్పోజింగు చట్రంలో చిక్కుకుంటుంది. ప్చ్…

ఈ సినిమాలో నన్ను ఐడెంటీఫై చేసుకోగలిగాను కానీ ఏ పాత్రో చెప్పను. 🙂

మొత్తానికి మంచి సినిమా, వీలయితే తప్పకుండా చూడండి. నా కలెక్షనుకి ఆడ్ చేసుకోవాలి కుదిరితే.

అన్నట్టు కాలేజీ రోజులలో అద్భుతమయిన స్నేహాన్ని గుర్తుకు తెచ్చే ఈ సినిమాని, కాలేజీ బయట అంత స్థాయిలో స్నేహితుడితో చూడటం హైలైటు 😉

రేటింగ్: 4/5

10 వ్యాఖ్యలు »

 1. radhika said,

  అందరూ ఈ సినిమా గురించి తెగ చెప్పేస్తుంటే నాకిప్పుడే చూసేయాలనుంది.కానీ ఇక్కడికి ఇంకో 2 వారాల తరువాత వస్తుంది

 2. radhika said,

  అందరూ ఈ సినిమా గురించి తెగ చెప్పేస్తుంటే నాకిప్పుడే చూసేయాలనుంది.కానీ ఇక్కడికి ఇంకో 2 వారాల తరువాత వస్తుంది

 3. వికటకవి said,

  నేను రేపు చూసేస్తున్నానోచ్! శేఖర్ మొదటి రెండు సినిమాలు ఫస్ట్ వీక్లోనే చూశా, ఈ సారే కాస్త లేట్.

 4. నేను రేపు చూసేస్తున్నానోచ్! శేఖర్ మొదటి రెండు సినిమాలు ఫస్ట్ వీక్లోనే చూశా, ఈ సారే కాస్త లేట్.

 5. మేధ said,

  నేను కూడా ఆ సినిమాని, మా స్నేహితులతో చూద్దామనే ఇంకా చూడలేదు.. దసరా కి ఇంటికి వెళ్ళినప్పుడు తప్పకుండా చూడాలి..

 6. మేధ said,

  నేను కూడా ఆ సినిమాని, మా స్నేహితులతో చూద్దామనే ఇంకా చూడలేదు.. దసరా కి ఇంటికి వెళ్ళినప్పుడు తప్పకుండా చూడాలి..

 7. Budaraju Aswin said,

  చాలా బావుందండీ
  చాలా
  చాలా బా తీసారు
  శేఖర్ కమ్ములా టేస్టు బా కనపడుతుంది
  ఇలాంటి దర్శకుడు లభించటం మన అదృ్ష్టం
  నాకు నచ్చిన పాత్ర
  taisan
  sravs..

 8. చాలా బావుందండీచాలా చాలా బా తీసారు శేఖర్ కమ్ములా టేస్టు బా కనపడుతుందిఇలాంటి దర్శకుడు లభించటం మన అదృ్ష్టంనాకు నచ్చిన పాత్రtaisan sravs..

 9. ప్రవీణ్ గార్లపాటి said,

  radhika గారు:
  మరేం ఫరవాలేదు లెండి, వెయిట్ చెయ్యడంలో కూడా మజా 🙂

  వికటకవి గారు:
  హహహ… ఈ సారి మీకన్నా నే ముందన్నమాట.

  మేధ గారు:
  మంచి పని చేసారు. స్నేహితులతో కలిసి చూస్తే ఇంకా బాగా ఆస్వాదించవచ్చు.

  budaraju aswin గారు:
  అవును. అన్ని పాత్రలూ బాగా సరిపోయాయి.

 10. radhika గారు:మరేం ఫరవాలేదు లెండి, వెయిట్ చెయ్యడంలో కూడా మజా :)వికటకవి గారు:హహహ… ఈ సారి మీకన్నా నే ముందన్నమాట.మేధ గారు:మంచి పని చేసారు. స్నేహితులతో కలిసి చూస్తే ఇంకా బాగా ఆస్వాదించవచ్చు.budaraju aswin గారు:అవును. అన్ని పాత్రలూ బాగా సరిపోయాయి.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: