అక్టోబర్ 27, 2007

నేనెందుకు కనిపించట్లేదు ???

Posted in అనుభవాలు, డాన్సు వద్ద 5:35 సా. ద్వారా Praveen Garlapati

డాన్సంటే నాకెంతో గౌరవం. ఎందుకంటే అది ఎంత కష్టమో నాకు తెలుసు కాబట్టి.
అన్నట్టు చెయ్యడం వేరు రావడం వేరు. నేను చేసా కానీ రాదు 🙂

ఇంతకీ సంగతేంటంటే మా “కంపెనీ రోజు” జరగబోతుంది. దానికి డాన్సాడే వాళ్ళ పేర్లిమ్మంటే ఓ బలహీన క్షణాన “ఊ” అన్నా…
ఇక అక్కడనుండీ కష్టాలు మొదలు. నాకు నా ఫిట్‌నెస్ మీద ఎలాంటి అపోహలూ లేవు. కానీ అలా జరిగిపోయిందన్నమాట.

ఇక ఓ వారం పది రోజుల నుండీ ప్రాక్టీసు చేస్తుంటే తెలుస్తుంది. కాలేజీలో ఆడిన మాసు డాన్సు, స్టెప్పులు ఓ రకం. కానీ ఇప్పుడు కాలేజీ అయిపోయిన ఇన్నాళ్ళ తరవాత ఎగరాలంటే అబ్బో తల ప్రాణం తోకకొస్తుంది.
అదీ మా వోళ్ళు ఎవరో బయట డాన్స్ అకాడమీ నుండి ఓ కొరియోగ్రాఫర్ ని తీసుకొచ్చి మరీ ప్రాక్టీసు చేయిస్తున్నారు.

పాపం నా లాగే ఇంకొందరు బకరాలు కూడా ఉన్నారు మా గ్రూపులో. అందులో కొన్ని ఓస్ డాన్సెంత అని అనుకుని వచ్చినవి కొన్నయితే, అబ్బో కాలేజీలో ఇలాంటివెన్నో చేసాము అని అనుకుని వచ్చినవి మరికొంత.

మొదటి రోజు నాలుగు స్టెప్పులేసేసరికి నలుగురు కనిపించలా. అదేంటబ్బా అని చూస్తే నేల మీద ఆయాసంతో పడున్నారు. హహహ… అని నవ్వినంత సేపు మిగిలిన నలుగురం కూడా అదే స్థితి. ఇక డాన్సు దేవుడెరుగు అని ఆ రోజుకి దుకాణం కట్టేసాము.
ఇక ఆ రోజు నుండి ప్రతీ రోజూ సాయంత్రం ఓ రెండు గంటలు కంపెనీ కెఫటీరియా లో కలవటం, డాన్సు నేర్చుకోవడం. ఇంటికెళ్ళి అన్నం తినడం, పడుకోవడం. అంతే.

మా అమ్మ నాకు దిష్టి తీసింది. ఎప్పుడూ లేంది వీడు ఇంటికి రాగానే సుబ్బరంగా తిని కంప్యూటర్ తెరవకుండా పడుకుంటున్నాడేంటబ్బా ? అని.
తర్వాత చెప్పా డాన్సు చేస్తున్నా అని. ఆ.. అని కాసేపు నోరెళ్ళబెట్టి వీడింతే వీడినెప్పుడూ అంచనా వెయ్యలేము అనే లుక్కించింది.

అన్నట్టు దీని సైడెఫెక్టు ఏంటంటే ఓ రెండు కేజీలు తగ్గా (అని జనాలంటున్నారు). ఓ రెండేళ్ళు తగ్గినట్టు కనబడుతున్నాని కాంప్లిమెంటిచ్చారు. అవునవును తొందర్లోనే షారూఖ్ ఖాన్ లాగా సిక్స్ పాక్ తో కనిపిస్తా.
ఆ… ఏంటి డేట్సా ? ఇప్పుడప్పుడే ఖాళీలు లేవు…. తర్వాత చూద్దాం. 😛

ఎలాగో కష్టపడి మొత్తానికి డాన్సు స్టెప్పులయితే నేర్చేసుకున్నా మరి. చూడాలి ఆ రోజు ఎన్ని టమాటాలు, గుడ్లూ ఏరుకోవచ్చో. అంత వరకూ నేను ఆన్‌లైను లో అంతగా కనిపించను మరి. టాటా… బై.

24 వ్యాఖ్యలు »

 1. నవీన్ గార్ల said,

  కెవ్వు..కేక…బాకు..పిడి..కత్తి..ఆహా..వోహో..సూపరు…
  ఆంధ్రావోళ్ళు స్టేజేక్కేది తక్కువ. నువ్వు మాత్రం తొక్కి తోల్దీ అంతే
  ( ఏ పాటకు చేస్తున్నావో చెప్పలేదే? )

 2. కెవ్వు..కేక…బాకు..పిడి..కత్తి..ఆహా..వోహో..సూపరు…ఆంధ్రావోళ్ళు స్టేజేక్కేది తక్కువ. నువ్వు మాత్రం తొక్కి తోల్దీ అంతే( ఏ పాటకు చేస్తున్నావో చెప్పలేదే? )

 3. తెలుగు వీర said,

  డ్యాన్సుల్లో కాలేజీ డ్యాన్సులు వేరయా!!
  మీ సంగతి తెలీదు కానీ కాలేజీ డ్యాన్సుల పర్యవసానం మర్నాడు తెలియకుండా ఉండాలంటే బాగా బీరకాయలు పట్టించి మర్నాడు చంద్రుడొచ్చేదాకా తొంగోవటమే!!
  ఎంజాయ్

 4. డ్యాన్సుల్లో కాలేజీ డ్యాన్సులు వేరయా!!మీ సంగతి తెలీదు కానీ కాలేజీ డ్యాన్సుల పర్యవసానం మర్నాడు తెలియకుండా ఉండాలంటే బాగా బీరకాయలు పట్టించి మర్నాడు చంద్రుడొచ్చేదాకా తొంగోవటమే!!ఎంజాయ్

 5. రాజశేఖర్ said,

  బాగుంది .. అప్పుడెప్పుడో కాలేజీలో భరత్ వాళ్ళతో డాన్స్ చేసానన్నావు..ఆ తర్వాత ఇదేనేమో కదా 🙂

  /** కాసేపు నోరెళ్ళబెట్టి వీడింతే వీడినెప్పుడూ అంచనా వెయ్యలేము **/

  దీనిలో అనుమానపడటానికి ఏం లేదుగా ప్రవీణ్ .. అలా నోరు వెళ్ళబెట్టేవారి జాబితాలో నన్ను కూడా కలుపుకో 😉

 6. బాగుంది .. అప్పుడెప్పుడో కాలేజీలో భరత్ వాళ్ళతో డాన్స్ చేసానన్నావు..ఆ తర్వాత ఇదేనేమో కదా :)/** కాసేపు నోరెళ్ళబెట్టి వీడింతే వీడినెప్పుడూ అంచనా వెయ్యలేము **/దీనిలో అనుమానపడటానికి ఏం లేదుగా ప్రవీణ్ .. అలా నోరు వెళ్ళబెట్టేవారి జాబితాలో నన్ను కూడా కలుపుకో 😉

 7. పద్మ said,

  వహ్వా. ఇంతకీ ఏ కంపెనీ, ఏ పాట, ఏ సైన్మాలోది ఈ డీటైల్స్ మమ్మల్ని ఎక్కడ ఏరుకొమ్మంటారు?

  యూ ట్యూబులోకి ఎక్కించే ప్రయత్నాలు ఉన్నాయా?

 8. పద్మ said,

  వహ్వా. ఇంతకీ ఏ కంపెనీ, ఏ పాట, ఏ సైన్మాలోది ఈ డీటైల్స్ మమ్మల్ని ఎక్కడ ఏరుకొమ్మంటారు? యూ ట్యూబులోకి ఎక్కించే ప్రయత్నాలు ఉన్నాయా?

 9. Aruna Gosukonda said,

  Ha HA..
  All the best.[:)]

 10. Ha HA..All the best.[:)]

 11. Anonymous said,

  చరణకింకిణులు గొల్లు గొల్లు మన .. కర కంకణములు విలవిల లాడగా…

 12. Anonymous said,

  చరణకింకిణులు గొల్లు గొల్లు మన .. కర కంకణములు విలవిల లాడగా…

 13. రానారె said,

  😀
  రా ర్రా ర్రారా బంగారం… [ఈల]..[ఈల]
  అరె నీకు పోటీ లేనే లేదోయ్ బంగారం … [ఈల]..[ఈల]

  వీడియో మాత్రం కావలసిందే. అక్కడేం జరుగుతోందో మాకు తెలియాలి తెలియాలి తెలియాలి కదా!

 14. :Dరా ర్రా ర్రారా బంగారం… [ఈల]..[ఈల] అరె నీకు పోటీ లేనే లేదోయ్ బంగారం … [ఈల]..[ఈల]వీడియో మాత్రం కావలసిందే. అక్కడేం జరుగుతోందో మాకు తెలియాలి తెలియాలి తెలియాలి కదా!

 15. కొత్త పాళీ said,

  యనానిమహాశయా .. తమరి కామెంటు వెరీ ఫన్నీ!
  ఐనా మన ప్రవీణుడు స్టేజిమీద వీర విజృంభణం చేసే వేళ
  అన్న గజ్జె కడ్తే మాస్
  అన్న స్టెప్పేస్తే మాస్ – లెవెల్లో ఉంతుంది లెండి :-))

 16. యనానిమహాశయా .. తమరి కామెంటు వెరీ ఫన్నీ!ఐనా మన ప్రవీణుడు స్టేజిమీద వీర విజృంభణం చేసే వేళఅన్న గజ్జె కడ్తే మాస్అన్న స్టెప్పేస్తే మాస్ – లెవెల్లో ఉంతుంది లెండి :-))

 17. నవీన్ గార్ల said,

  యనానిమస్‌…మీ సెన్సాఫ్ హ్యూమర్‌ని అభినందిస్తాం కానీ ..ఇలాంటి కామెంట్లు వ్రాసేటప్పుడు ధైర్యంగా మీ పేరును, బ్లాగును కూడా జోడించండి ….జనాలు మిమ్మల్నేమీ చెయ్యరులే.

 18. యనానిమస్‌…మీ సెన్సాఫ్ హ్యూమర్‌ని అభినందిస్తాం కానీ ..ఇలాంటి కామెంట్లు వ్రాసేటప్పుడు ధైర్యంగా మీ పేరును, బ్లాగును కూడా జోడించండి ….జనాలు మిమ్మల్నేమీ చెయ్యరులే.

 19. Aditya said,

  I really liked ur post, thanks for sharing. Keep writing. I discovered a good site for bloggers check out this http://www.blogadda.com, you can submit your blog there, you can get more auidence.

 20. Aditya said,

  I really liked ur post, thanks for sharing. Keep writing. I discovered a good site for bloggers check out this http://www.blogadda.com, you can submit your blog there, you can get more auidence.

 21. ప్రవీణ్ గార్లపాటి said,

  నవీన్ అన్న:
  థాంకూ, థాంకూ 🙂
  నేను చేసేది ఫ్యూజన్. పాటలు ఓ ఇన్స్ట్రుమెంటల్, ఓ ఫోక్, రెండు సినిమా. ఏడు నిముషాలు.

  తెలుగు వీర గారు:
  బీరకాయల అలవాటు లేదు. ప్చ్…

  రాజశేఖర్ అన్న:
  హహహ… అదే మరి అందరినీ అలా ఆశ్చర్యపరుస్తూండాలి అప్పుడప్పుడూ. లేకపోతే జనాలు మరచిపోతుంటారు 🙂

  పద్మ గారు:
  పైన నవీన్ గారికి చెప్పిన సమాధానమే డిట్టో.
  యూట్యూబా! వామ్మో.

  aruna గారు:
  థాంకూ 🙂

  anonymous:
  skip

  రానారె:
  వీడియో చేతికందితే ప్రైవేటుగా పంపిస్తాలే. 😉

  కొత్తపాళీ గారు:
  అబ్బో మీ లాంటి వారి ముందు మేమెంతండి బాబు. ఏదో సరదాకి అప్పుడప్పుడూ అలా.

 22. నవీన్ అన్న: థాంకూ, థాంకూ :)నేను చేసేది ఫ్యూజన్. పాటలు ఓ ఇన్స్ట్రుమెంటల్, ఓ ఫోక్, రెండు సినిమా. ఏడు నిముషాలు.తెలుగు వీర గారు:బీరకాయల అలవాటు లేదు. ప్చ్…రాజశేఖర్ అన్న:హహహ… అదే మరి అందరినీ అలా ఆశ్చర్యపరుస్తూండాలి అప్పుడప్పుడూ. లేకపోతే జనాలు మరచిపోతుంటారు :)పద్మ గారు:పైన నవీన్ గారికి చెప్పిన సమాధానమే డిట్టో.యూట్యూబా! వామ్మో. aruna గారు:థాంకూ :)anonymous:skipరానారె:వీడియో చేతికందితే ప్రైవేటుగా పంపిస్తాలే. ;)కొత్తపాళీ గారు:అబ్బో మీ లాంటి వారి ముందు మేమెంతండి బాబు. ఏదో సరదాకి అప్పుడప్పుడూ అలా.

 23. రానారె said,

  If you enjoy doing it, audience enjoy it too. All the best.

 24. If you enjoy doing it, audience enjoy it too. All the best.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: