నవంబర్ 18, 2007

బార్‌కాంప్ – ఇండిక్ లాంగ్వేజస్ …

Posted in ఇండిక్ లాంగ్వేజస్, కలెక్టీవ్, టెక్నాలజీ, బార్‌కాంప్ వద్ద 8:13 సా. ద్వారా Praveen Garlapati

ఈ రోజు బార్‌కాంప్ లో ఇండిక్ లాంగ్వేజస్ మీద కలెక్టీవ్ బాగానే సాగింది.

ఒక విషయం మాత్రం రూఢీ గా అర్థమయ్యింది. ఇతర భాషల కంటే కూడా తెలుగే ఆర్గనైజ్డ్ గా ఉందని.
నిన్నటి రోజు వినయ్ అని ఒక కన్నడ అతనితో మాట్లాడాను. అతను సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలేసి ఈ మధ్యనే ఒక ఎన్‌జీవో లో చేరాడు. అతనితో కలిసి ఈ కలెక్టీవ్ ని చేసాను.
అర్జున రావు గారు తను కొత్తగా తయారు చేసిన కీబోర్డు లే అవుటు గురించి కూడా చెప్పారు.

ఈ కలెక్టీవ్ లో చర్చకి వచ్చిన విషయాలు స్థూలంగా:

 • ఇంకా జనాలకు ఇండిక్ భాషల గురించిన అవగాహన సరిగా లేదు (కలెక్టీవ్ పరంగా ఇంకా బయట నేను ఇంటరాక్ట్ చేసిన అనుభవాలతో ఇది చెబుతున్నాను.)
 • జనాలకు సాధారణంగా ఇండిక్ భాషలు వెబ్ పేజీలకు మాత్రమే పరిమితం. అదీ రీడ్ మోడ్ లోనే ఎక్కువ మంది ఉన్నారు. అంటే రాయడం, సంభాషించడం తక్కువ.
 • రాయడానికి విభిన్న ఫార్మాట్లు ఉండడం కొత్త వారిని కన్‌ఫ్యూజ్ చేస్తుంది. చాలా మంది RTS, కొంత మంది ఇన్‌స్క్రిప్టు వాడుతున్నారు. కొత్త కీ బోర్డు లే అవుట్లు వగయిరా కంటే స్టాండర్డైజేషన్ ముఖ్యమని అభిప్రాయం. మొదట్లో కష్టమయినా అందరూ అదే వాడతారు కాబట్టి ఆ పద్ధతి మంచిదని అభిప్రాయం వ్యక్తమయింది.
 • ఇతర భాషలకు తెలుగు కి ఉన్నట్టు సపోర్టు గ్రూపుల కొరత కనబడుతుంది. వారి సమస్యలకు ఒక గోటూ ప్లేస్ లేదు.
 • చాలా మంది బరహా వాడతారు.
 • జనాలకు (టెకీలకు) యూనీకోడ్ మీద కొంత అవగాహన ఉంది.
 • ప్రింట్ మీడియా, డీటీపీ వారు తమకు ఒక ఐడెంటిటీ సృష్టించుకోవడం కోసం ప్రొప్రయిటీ ఫాంట్లు వాడుతున్నారు. ఇప్పుడిప్పుడే టెక్నాలజీ ని అర్థం చేసుకుని యూనీకోడ్ వైపు మళ్ళుతున్నారు.
 • వివిధ ఇండిక్ భాషలకు ఉపకరణాలున్నా అందరూ కలిసి పని చెయ్యడం లేదు. దాని వల్ల చాలా మటుకు పని లో రిపిటీషను ఉంటుంది. కలిసి పని చెయ్యడం వల్ల అన్ని భాషలకీ ఒక ఫ్రేం వర్కు, ఉపకరణాలు సృష్టించుకోవచ్చని కొంత మంది అభిప్రాయపడ్డారు. కొందరు అంగీకరించలేదు. (దీనికి ఉదా: ఆన్లైనులో ఉన్న వివిధ ట్రాన్స్లిటరేషన్ ఉపకరణాలు, ఫైఫాక్స్ ఆడాన్లు వగయిరా…)
 • వికీ మొదలయిన వాటిలో పార్టిసిపేషన్, మోటివేషన్ తక్కువగా ఉంది. ఆసక్తి అంతగా లేదు.
 • ఓపెన్ సోర్స్ ట్రాన్స్లేషన్ లో జనాల ఇన్వాల్వ్మెంటు బాగానే ఉంది. కానీ లినక్స్ మొదలయిన వాటిలో వివిధ కార్పొరేషన్లు కలిసి పని చెయ్యట్లేదు, దాని వల్ల చాలా రిడండన్సీ ఉందని కూడా అభిప్రాయం వ్యక్తమయింది. (జీనోం, కేడీయీ వాటి ట్రాన్స్లేషన్ ఒక లినక్స్ వర్షన్లో చేస్తే అది వివిధ ఫ్లేవర్లకు కూడా ఉపయోగపడేటట్టు ఉంటే బాగుంటుంది)
 • విండోస్ ఇండిక్ భాషలకు ఇతర భాషలకు ఇచ్చిన ప్రాముఖ్యం ఇవ్వట్లేదనే అభిప్రాయం కూడా ఉంది. (కానీ ఇంత మార్కెట్టు పెట్టుకుని ఇవ్వాల్సి తప్పదని కూడా అభిప్రాయపడ్డారు)
 • టెకీలకు తప్పితే ఇతరులకు ఇంకా అందుబాటులో లేదు ఇండిక్ భాషలు. ముందస్తుగా చెయ్యాల్సిన సెట్టింగులు వగయిరా వల్ల. దాంట్లో ఆపరేటింగ్ సిస్టం ల నుంచి వెసులుబాటు ఉండాలి. ఉదా: ఇండియా లో విడుదల చేసే కంప్యూటర్లకి/ఓఎస్ లకి ముందస్తుగానే సపోర్టు ఎనేబుల్ చేసి ఆ ఉపకరణాలని ఇన్స్టాల్ చేసి ఇవ్వచ్చు.
 • ఇండ్ లినక్స్ (http://indlinux.org) లాంటి ఇనీషియేటీవ్స్ బాగున్నా కానీ వాటికి సరిగా ప్రాచుర్యం లభించట్లేదు.
 • టెకీ జార్గన్ కి ఒక సరయిన డిక్షనరీ కొరత ఉంది. ప్రతీ ఒక్కరూ తమకి తగిన విధంగా అనువదిస్తున్నారు. దానితో కన్సిస్టెన్సీ ఉండట్లేదు అన్నిచోట్లా.

ఇంకా ఏమన్నా విశేషాలు మిగిలి ఉంటే గుర్తు రాగానే జోడిస్తాను.
మొత్తానికి ఒక గంట అనుకున్న చర్చ కాస్తా మూడు గంటల పైగా సాగింది.
ఒక విషయం మాత్రం అర్థమయింది ఇది ఒక పాషనేట్ టాపిక్ అని. ఎంత సేపయినా దీని మీద చర్చ కొనసాగుతూనే ఉంటుంది. 🙂

ఇందుకోసం నేను ఉపయోగించిన ప్రజంటేషన్ ఇక్కడ ఉంది. ఎవరికయినా కావలిస్తే ఉపయొగించుకోవచ్చు.

4 వ్యాఖ్యలు »

 1. బ్లాగేశ్వరుడు said,

  అన్నింటికి తెలుగు పేర్లు పెట్టి మంటనక్క కి మాత్రము ఆంగ్ల పేరు పెట్టారే, సభలో ఫైర్ ఫాక్స్ వాళ్ళు ఉంటే మీ మీద దాడి చేస్తారని అనుకొన్నారా? జ్వాలా జంభుకం అని పెట్టండి బాగుంటుంది , బాగుంది మీ సమీక్ష

 2. అన్నింటికి తెలుగు పేర్లు పెట్టి మంటనక్క కి మాత్రము ఆంగ్ల పేరు పెట్టారే, సభలో ఫైర్ ఫాక్స్ వాళ్ళు ఉంటే మీ మీద దాడి చేస్తారని అనుకొన్నారా? జ్వాలా జంభుకం అని పెట్టండి బాగుంటుంది , బాగుంది మీ సమీక్ష

 3. ప్రవీణ్ గార్లపాటి said,

  ఇందులో ఎలాంటి కుట్రా లేదు అని మనవి చేసుకుంటున్నాను…
  జ్వాలా జంభూకం కూడా బానే ఉంది 🙂

 4. ఇందులో ఎలాంటి కుట్రా లేదు అని మనవి చేసుకుంటున్నాను…జ్వాలా జంభూకం కూడా బానే ఉంది 🙂


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: