డిసెంబర్ 8, 2007

మన సినిమాలు, తారల డాన్సులు …

Posted in డాన్సు, సినిమా, సినిమాలు వద్ద 7:34 సా. ద్వారా Praveen Garlapati

మన సినిమాలలో ఎంత లేదన్నా నాకు నచ్చేది డాన్సులు పాటలు. ఇతర భాషలలో వచ్చే సినిమాలలో కథ, కథనం, ఆక్షన్ అన్నీ ఉన్నా డాన్సులు, పాటలు మాత్రం ఉండవు. అవన్నీ కావాలంటే వారు ఏ రాక్ షో కో, పాప్ షో కో వెళ్ళాలి. కానీ మనకవి మన సినిమాలలో పాకేజీ అయి వస్తాయి.

మంచి కాలక్షేపం కోసం సినిమాకి వెళ్ళే వారికి (అందులో నేనూ ఉన్నా) డాన్సులు, పాటలు ఎంతో ముఖ్యం.
నాకు మంచి డాన్సులున్న పాటలు చూడడమంటే ఎంతో ఇష్టం. డాన్సులను దగ్గరగా ఫాలో అవు ఎవరెలా చేస్తారో.

మన స్టారుల వైపు ఓ లుక్కేస్తే

చిరంజీవి: డాన్సనగానే చిరు తో తప్ప ఇంకెవరితో మొదలెడతాము. ఆ డాన్సులో ఉన్న ఈజు ఇంకెవరికీ లేదు. పాటకు తగ్గ స్టెప్పులు వెయ్యడంలో ఆయనకి ఆయనే సాటి. తొలి నాటి చిత్రాల నుంచీ ఇప్పటి లేటెస్టు చిత్రాల వరకూ డాన్సులో తన విశిష్టత నిలుపుకుంటూ వచ్చాడు చిరంజీవి. అప్పటి బ్రేక్ డాన్సు నుంచి ఇప్పటి సరదా పాటల వరకూ డాన్సు అదరగొడుతూనే ఉన్నాడు.
అలాగే ఆయన తనకు తగిన డాన్సు డైరెక్టర్లను కూడా ఎంచుకుంటాడు. ఇప్పుడయితే లారెన్స్ కి ఫిక్సయిపోయాడు. లారెన్సు వీణ స్టెప్పు ఎంత ప్రాచుర్యం పొందిందో నే చెప్పవలసిన అవసరం లేదనుకుంట. ఈ చక్కని జోడీ ఎన్నో చక్కని స్టెప్పులని మనకందించిండి. ఒక రకంగా చెప్పాలంటే నాకు లారెన్సు చేసే అవే స్టెప్పుల కంటే చిరంజీవి చేసిన స్టెప్పులే బావున్నట్టనిపిస్తాయి.
కాకపోతే ఈయన మీద నాకు కొన్ని కంప్లెయింట్లు ఉన్నాయి. డాన్సుకి ముఖ్యమయినవి ఒకటి ఈజు, బాడీ లాంగ్వేజీ అయినా బాడీ స్ట్రక్చర్ బావుంటే దానికి అదనపు అందం వస్తుంది. ఈ మధ్య ఫిట్నెస్ విషయంలో మాత్రం చిరంజీవి దెబ్బతినేస్తున్నాడు. ఆ అదనపు అందం రావట్లేదు.

బాలకృష్ణ: బాలకృష్ణ డాన్సు పవర్ పాక్డ్. డాన్సులో స్లీక్‌నెస్ కనిపించదు. కొంత మోటు గానూ, వేషధారణ కూడా డిఫరెంటుగా ఉంటుంది. లెదర్ పాంట్లు, ఓ కాలు గ్రీను, ఇంకోటి యెల్లో లాంటివి ఉంటాయి. కొన్ని స్టెప్పులు మోటుగా, బండగా ఉన్నా డాన్సు బాగా చెయ్యాలి అనే తపన మాత్రం తప్పకుండా కనబడుతుంది.

నాగార్జున: ఈయన డాన్సులో కంపారిటీవ్లీ వీక్. అందుకే ఈయన పాటలలో చాలా మటుకు ఏ పార్టీ లో పాటలో (మన్మధుడు లో అందమయిన భామలు… టైపు), లేక స్టెప్పులు ఎక్కువగా లేని సరదా పాటలో (బోటనీ ఆట ఉంది టైపు) వో ఎక్కువుంటాయి. మరీ
కష్టమయిన స్టెప్పులెయ్యకుండా చేసినంతలో బాగానే చేస్తాడు.

వెంకటేష్: వెంకటేష్ కూడా సూపర్ స్టెప్పులు వేయ్యగా నేను చూడలా. నాలుగు ఐదు విదేశీ మోడళ్ళను వెంట పెట్టుకుని వారి మధ్యలో నడవడం (అన్ని సినిమాల్లోనూ), ఏ పూదోటలో నడుస్తూనో చలా మటుకు పాటలు లాగించేస్తాడు. మానరిజంలు చాలా రిపీటవుతూ ఉంటాయి వెంకటేష్ పాటలలో.

అల్లు అర్జున్: నాకు ఈ టైపు డాన్సంటే ఇష్టం. ప్రొఫెషనల్ టైపు అన్నమాట. చిరంజీవి నుంచి డాన్సు ని వారసత్వంగా పుచ్చుకున్నాడు. డాడీ సినిమాలో డాన్సుని రుచి చూపినా ఆర్య సినిమాతో వెలుగులోకొచ్చింది డాన్సు ప్రతిభ. మంచి ఈజు ఉంది. కానీ చిరంజీవి లా స్టెప్పులు పాటతో పాటుగా ఉండవు, కొంత తెచ్చిపుట్టుకున్న స్టెప్పులలా ఉంటాయి.

జూనియర్ ఎన్‌టీఆర్: ఈ మధ్య ఆక్టర్లలో డాన్సు మీద కొంత పట్టున్న వారిలో ఎన్‌టీఆర్ ఒకడు. ఎక్కువ మాసు స్టెప్పులే కాకపోతే. మాసు కి అప్పీల్ కావడానికే ఈయన డాన్సులు ఓరియెంటెడ్ (నువ్వు విజిలేస్తే ఆంధ్రా సోడాబుడ్డి, షేకు షకాలా… లాంటివి). కానీ చక్కని ఈజుతో, మంచి పెర్ఫార్మెన్సు ఇవ్వగలడు.

మహేష్ బాబు: ఈయన స్టెప్పులు పరవాలేదనిపిస్తాడు. కానీ ఈయన పాటలు ఎక్కువ డ్రెస్ సెన్స్ చూపించడానికీ, హెయిర్ స్టైలు హైలైటు చెయ్యడానికీ అనిపిస్తుంది. నాకు అన్ని పాటలలోకీ ఒక్కడు సినిమాలో చెప్పవే చిరుగాలి, హరే రామ… హరే రామ… పాటకు చేసిన స్టెప్పులు నచ్చుతాయి. అటు సీరియస్ స్టెప్పులు కాకుండా అప్పీలింగుగా ఉంటాయి.

ఇక ఆ కాలం నటులలో చూస్తే. రాజుల కాలం నాటి సినిమాలు వగయిరాలు వదిలేస్తే

ఎన్‌టీఆర్: కలర్ సినిమాలలో ఈయన డాన్సు పంథా చాలా డిఫరెంటు. హావభావాల మీద ఆధారపడ్డ స్టెప్పులుంటాయి. అలాగే స్ట్రాంగు స్టెప్పులు ఈయన పాటల్లో ఉండాల్సిందే. కొంత మోటు టైపే. చేతులు, కాళ్ళు బాగా ఆడతాయి ఈయన స్టెప్పుల్లో 🙂 ఎవరయినా డాన్సులకేసిన స్టెప్పులు చూడండి, ఆ చెయ్యి ముందుకు చాచి కాలు ముందు కీ వెనకకీ కదిపే స్టెప్పు తప్పక ఉంటుంది. అలా ట్రేడు మార్కు అయిపోయింది.

నాగేశ్వరరావు: నో స్టెప్పులు. ఏ బాల్కనీలో నుంచుని పాడే పాటలో, పియానో వాయిస్తూ పాడే పాటలో, అమ్మాయి వెంట పడి ఏడిపిస్తూ పాడే పాటలో ఉంటాయి. చటుక్కున గెంతులు తప్పితే ఆక్చువల్ స్టెప్పులు పెద్దగా ఉన్నట్టు నాకు అనిపించదు.

కృష్ణ: డాన్సు గురించి మాట్లాడి, ఈయన గురించి మాటలాడకపోవడమా ? పీటీ మాస్టరు దగ్గర డాన్సు నేర్చుకొచ్చినట్టుంటాయి ఈయన స్టెప్పులు. ఆయన డాన్సు చేస్తుంటే వన్, టూ, త్రీ లు నాకు కనబడుతూ ఉంటాయి కళ్ళ ముందు. ఎక్కడ నుంచో అమ్మాయిల మధ్య నడుచుకుంటూ రావటం, లేదా ఎక్సర్సైజులు ఈయ స్టెప్పుల్లో ఎక్కువ. చలాకీగా గెంతడం కూడా ఈయన డాన్సులో భాగమే.

అదీ టూకీగా.
ఇక నాకు సంబంధించి నేను ఎంతో అభిమానించే హీరో డాన్సులో హృతిక్ రోషన్. మొదటి సినిమా ఎక్ పల్ కా జీనా తోటే నే ఫ్లాటు. దాని తరువాత లక్ష్య లో మై ఐసా క్యో హూ… సాంగు లో డాన్సు కూడా అదురుతుంది. అన్ని సినిమాలలోనూ డాన్సు అదుర్స్.

కొసమెరుపు: ఈ టపా రాస్తుంటే టీవీలో ఈ పాటొస్తుంది హిందీది. నో కామెంట్ మీరే చూసి ఎంజాయ్ చెయ్యండి.

11 వ్యాఖ్యలు »

 1. Anonymous said,

  పొరపడ్డారు. డ్యూయెట్లలో హీరో కూడా డాన్సు చెయ్యాలి అనే ఫార్ములా వచ్చినప్పణ్ణించీ (బహుశా రావడానికి ఆద్యుడేమో కూడా) నాగేశ్వర్రావు బాగా స్టెప్పులు వేసేవాడు. దసరాబుల్లోడు దగర్నించీ ఆలుమగలు, ప్రేమాభిషేకం దాకా ఆ కాలంలో డాన్సింగ్ స్టార్!

 2. Anonymous said,

  పొరపడ్డారు. డ్యూయెట్లలో హీరో కూడా డాన్సు చెయ్యాలి అనే ఫార్ములా వచ్చినప్పణ్ణించీ (బహుశా రావడానికి ఆద్యుడేమో కూడా) నాగేశ్వర్రావు బాగా స్టెప్పులు వేసేవాడు. దసరాబుల్లోడు దగర్నించీ ఆలుమగలు, ప్రేమాభిషేకం దాకా ఆ కాలంలో డాన్సింగ్ స్టార్!

 3. రాధిక said,

  మీ విశ్లేషణ చాలా బాగుంది.నాకయితే మొత్తం గా చూస్తే హృతిక్ ,ఆ తరువాత అల్లు అర్జున్,జూ ఎంటీఅర్,ఆతరువాత చిరంజీవి డాన్సులు నచ్చుతున్నాయి.అల్లు అర్జున్ డాన్సు స్టైలిష్ గా వుంటే ఎంటీఆర్ డాన్సులో ఈజ్ తోపాటూ ఎక్స్ప్రెషన్స్,ఎక్కడో క్లాసికల్ టచ్ కనిపిస్తూవుంటుంది.మహేష్ కి పంకాని కాబట్టి చిన్నమాట చెప్పాలి.ఇతను కూడా బాగా డేన్స్ చేస్తే ఇంకా పెద్ద స్టార్ అయిపోతాడని అనిపిస్తుంది.టక్కరి దొంగ సినిమాలో ఆ పాటలని ఎంత పిచ్చిగా చూస్తానో నేను.

 4. మీ విశ్లేషణ చాలా బాగుంది.నాకయితే మొత్తం గా చూస్తే హృతిక్ ,ఆ తరువాత అల్లు అర్జున్,జూ ఎంటీఅర్,ఆతరువాత చిరంజీవి డాన్సులు నచ్చుతున్నాయి.అల్లు అర్జున్ డాన్సు స్టైలిష్ గా వుంటే ఎంటీఆర్ డాన్సులో ఈజ్ తోపాటూ ఎక్స్ప్రెషన్స్,ఎక్కడో క్లాసికల్ టచ్ కనిపిస్తూవుంటుంది.మహేష్ కి పంకాని కాబట్టి చిన్నమాట చెప్పాలి.ఇతను కూడా బాగా డేన్స్ చేస్తే ఇంకా పెద్ద స్టార్ అయిపోతాడని అనిపిస్తుంది.టక్కరి దొంగ సినిమాలో ఆ పాటలని ఎంత పిచ్చిగా చూస్తానో నేను.

 5. చదువరి said,

  ఔను, ప్రవీణ్.. పాటల్లో స్టెప్పులకి “నాగ్గాడే” 🙂 ఆద్యుడనుకుంటా. కాకపోతే ఆయన స్టెప్పులు కా..స్త ఆడంగితనంగా ఉంటాయని నేననుకుంటూ ఉంటాను.

  ఏదేమైనా, ఇప్పటి రికార్డింగు డ్యాన్సుల కంటే అప్పటివే నయమని నేను భావిస్తాను! 🙂

 6. ఔను, ప్రవీణ్.. పాటల్లో స్టెప్పులకి “నాగ్గాడే” 🙂 ఆద్యుడనుకుంటా. కాకపోతే ఆయన స్టెప్పులు కా..స్త ఆడంగితనంగా ఉంటాయని నేననుకుంటూ ఉంటాను. ఏదేమైనా, ఇప్పటి రికార్డింగు డ్యాన్సుల కంటే అప్పటివే నయమని నేను భావిస్తాను! 🙂

 7. ప్రవీణ్ గార్లపాటి said,

  anonymous, చదువరి:
  అయితే నేనే పొరపడుంటా…
  ఎక్కువగా చూడలేదన్నమాట నాగ్గాడిని నేను డాన్సులలో.

  రాధిక గారు:
  చిరంజీవి మారతాడు గానీ, లేకపోతే ఆ జాబితా నాదే సేమే.
  హిందీలో షాహిద్ కపూర్ కూడా బాగా చేస్తాడు డాన్సు.

 8. anonymous, చదువరి:అయితే నేనే పొరపడుంటా…ఎక్కువగా చూడలేదన్నమాట నాగ్గాడిని నేను డాన్సులలో.రాధిక గారు:చిరంజీవి మారతాడు గానీ, లేకపోతే ఆ జాబితా నాదే సేమే. హిందీలో షాహిద్ కపూర్ కూడా బాగా చేస్తాడు డాన్సు.

 9. CresceNet said,

  This comment has been removed by a blog administrator.

 10. sujata said,

  మీరు ఎంచుకున్న సబ్జెక్టు చాలా బావుంది. ఆఖరి వీడియో చాలా బాగా కొరియోగ్రాఫ్ చేసారు. ఐడియా కాపీ కొట్టినా చాలా టీంవర్క్ చేసారు. థాంక్స్.

 11. sujata said,

  మీరు ఎంచుకున్న సబ్జెక్టు చాలా బావుంది. ఆఖరి వీడియో చాలా బాగా కొరియోగ్రాఫ్ చేసారు. ఐడియా కాపీ కొట్టినా చాలా టీంవర్క్ చేసారు. థాంక్స్.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: