డిసెంబర్ 17, 2007

అడ్వెంచర్స్ ఆఫ్ సాలీ – పీ జీ వోడెహౌజ్

Posted in ద అడ్వెంచర్స్ ఆఫ్ సా, నవల, పీ జీ వోడెహౌజ్ వద్ద 3:58 సా. ద్వారా Praveen Garlapati

ఇతర వ్యాపకాలు ఎక్కువవడంతో ఈ మధ్య చదవడం తగ్గింది కానీ ఒకప్పుడయితే విపరీతంగా చదివేవాడిని. నవలలు, అందులో ఎక్కువగా ఫిక్షన్, ఫాంటసీ నాకు ఎక్కువ ఇష్టం. అవి కాక రొమాన్స్… 🙂

నాకిష్టమయిన హారీ పాటర్ కాక నాకెదురయిన సిడ్నీ షెల్డన్, జెఫ్రీ ఆర్చర్, షెర్లాక్ హోంస్, రాబిన్ కుక్ ఏదీ వదిలిపెట్టను.

సహజంగా అయితే ఏక బిగిన మొదలుపెట్టిన నవల పూర్తి చెయ్యడం నాకిష్టం. లీజర్ గా ఓ వారం పది రోజులు నేను చదవలేను. అలా ఉంచానంటే అది పూర్తి చెయ్యలేనన్న్నమాట. దానికో ఉదాహరణ నే మొదలుపెట్టిన అయాన్ రాండ్ “ఫౌంటెయిన్ హెడ్”. అద్భుతంగా నచ్చింది నాకు చదివినంత వరకు. ఎందుకో తెలీదు కానీ రెండు రోజులు చదివిన తర్వాత బ్రేకిచ్చాను. ఇప్పటి వరకూ మళ్ళీ కుదరలేదు.

ఇకపోతే నేను చదవడం విశ్లేషణాత్మకంగా ఉండదు. చదువుతున్నంత సేపూ అందులో లీనమయి చదువుతా గానీ ఆ శైలిని గుర్తించడం, దానిని వడపోయడం, అందులో తప్పొప్పుల గురించి బేరీజు వెయ్యడం ఎందుకో అలవాటు లేదు.

సాఫీగా సాగిపోయే కథలంటే నాకెంతో ఇష్టం. అలాంటి వాటిలో నేను ఈ మధ్య చదివిన “పీ జీ వోడెహౌజ్” రాసిన “ద అడ్వెంచర్స్ ఆఫ్ సాలీ” నాకు బాగా నచ్చింది. హార్డు కవర్ పుస్తకాలు ఈ మధ్య కొనడం తగ్గింది అనిపించి అటు ప్లాట్ఫాం మీద చూడగానే నాకు ఈ పుస్తకం కనిపించింది. ఎప్పటి నుంచో పీ జీ వోడెహౌజ్ పుస్తకం ఒక్కటయినా చదవాలని అనుకుంటున్నాను. వెంటనే కొన్నా.

పుస్తకాలను కంప్యూటర్ పైన చదవడం బాగా అలవాటయింది కానీ నాకు చేలో పట్టుకుని చదివిన పుస్తకంలో వచ్చిన ఆనందం నాకు అందులో రాదు.

సరే ఇక నేను శనివారం ఓ వైల్డు లైఫు ట్రిప్ కోసం వెళుతుంటే ప్రయాణంలో పనికొస్తుందని తీసుకెళ్ళా. స్నేహితుడితో కలిసి వెళ్ళాను, మాట్లాడుకోవడం లోనే తెలీకుండా సమయం గడిచిపోయింది. ఇక పుస్తకాన్ని తీసే సమయమే రాలేదు. వైల్డు లైఫు లో నాకు లైఫేమీ పెద్దగా కనబడకపోవడంతో బాగా నిరుత్సాహపడ్డాను. ఇక రాత్రి పన్నెండింటికి ఇంటికి తిరిగొచ్చి సరే ఈ పుస్తకాన్నయినా తిరగేద్దామని తీసుకుంటే ఎంచగ్గా పేజీలు అలా తిరిగిపోతూనే ఉన్నాయి. అలా నాలుగయిపోయింది.
అమ్మ నాలుగు చీవాట్లు పెట్టడంతో పుస్తకం బలవంతం మీద మూసేసా. ఇక ఆదివారం లాపుటాపు పట్టకుండా పుస్తకం పట్టాను. సాయంత్రం కల్లా ముగించా…

నవల చాల బాగుంది. వోడెహౌజ్ స్టైలు నాకు నచ్చింది. ఇంతకీ క్లుప్తంగా కథ ఏమిటంటే సాలీ అనే ఒక పడుచమ్మాయికి అనుకోకుండా కొంత డబ్బు కలిసొస్తుంది. అప్పటి నుంచీ సాఫీగా సాగిపోతున్న జీవితంలో ఇక్కట్లు మొదలవుతాయి. సరదా సరదాగా సాగిపోతుంది కథ. అందులో కారెక్టర్లు కూడా చక్కగా ఉంటాయి.

ఇందులో థీం నా మనసుకు చాలా దగ్గరది. ఎందుకంటే జీవితంలో డబ్బు కంటే చిన్న చిన్న ఆనందాలు, మన మనుషులు ఎక్కువ సంతోషం కలిగిస్తాయని నమ్మే వాడిని నేను. ఈ నవలలో సాలీ కూడా అంతే… డబ్బు వచ్చిందన్నమాటే కానీ ఆ డబ్బు పెద్ద తేడా కాదు తనకి. కానీ చుట్టుపక్కల వారికి దానితో అవసరం.
నచ్చిన మనుషులకు దగ్గరగా ఉండాలని కోరుకుంటుంది. అలా సాగిపోతుంది కథ.

కథలో వివిధ కారెక్టర్లు మనకు తారసపడతాయి. స్నేహితులు, బంధువులు, సాలీ ని కోరుకుంటున్న వాడు, సాలీ కోరుకుంటున్న వాడు… ఇలా.
హాయిగా జీవించాలంటే మనసుకు నచ్చిన వాడు కావాలి కానీ, డబ్బున్న వాడూ, పరపతి ఉన్నవాడూ కాదనీ నమ్ముతుంది. అలా కథ ముగుస్తుంది.

మీకు ఆహ్లాదంగా ఉండే రచన చదవాలనిపిస్తే ఈ పుస్తకం చదవండి. కథలో ట్విస్టులు, థ్రిల్లర్లూ ఏమీ ఉండవు. ఒక మామూలు కథ. సున్నితమయిన హాస్యంతో బాగుంటుంది.

మీరు దీనిని ఆన్‌లైనులో చదవాలనుకుంటే ఇక్కడ చదవచ్చు. ఇతర వోడెహౌజ్ పుస్తకాల కోసం కూడా గుటెన్‌బర్గ్ చూడచ్చు.

ప్రకటనలు

17 వ్యాఖ్యలు »

 1. oremuna said,

  మీకు నాకూ చాలా పోలికలున్నాయి:
  — ఈ మధ్య చదవడంలేదు.
  — చదవడం మొదలుపెడితే ఆపబుద్ధి కాదు.
  — ఆపితే ఇహ అంతే!
  ఎప్పుడన్నా హై వస్తే చెప్పండి, ఓ సారి కలుద్ధాం.

 2. oremuna said,

  మీకు నాకూ చాలా పోలికలున్నాయి:– ఈ మధ్య చదవడంలేదు. — చదవడం మొదలుపెడితే ఆపబుద్ధి కాదు. — ఆపితే ఇహ అంతే! ఎప్పుడన్నా హై వస్తే చెప్పండి, ఓ సారి కలుద్ధాం.

 3. Satya said,

  Hi this is satya
  I have joined the Telugu Transliteration team for ubuntu gutsy on launchpad.
  Im interested in tranlation. How should i proceed? How do i contact you

 4. Satya said,

  Hi this is satyaI have joined the Telugu Transliteration team for ubuntu gutsy on launchpad.Im interested in tranlation. How should i proceed? How do i contact you

 5. ప్రవీణ్ గార్లపాటి said,

  చావా గారు:
  తప్పకుండా కలుద్దాము. ఈలోపల మీరు బెంగుళూరు వచ్చినా కలవచ్చు 🙂

  సత్య గారు:
  చాలా మంచిది.
  మీరు ఈ లంకె చూడండి (https://translations.edge.launchpad.net/ubuntu/gutsy/+lang/te).

  అక్కడ ఉన్న పాకేజీలలో మీరు అనువదించాలనుకున్న పాకేజీని ఎంచుకుని అనువాదం చెయ్యడమే.
  ఇంకా ఏమన్నా సందేహాలుంటే praveengarlapati [at] gmail [dot] com కి మెయిల్ చెయ్యండి.

 6. చావా గారు:తప్పకుండా కలుద్దాము. ఈలోపల మీరు బెంగుళూరు వచ్చినా కలవచ్చు :)సత్య గారు:చాలా మంచిది.మీరు ఈ లంకె చూడండి (https://translations.edge.launchpad.net/ubuntu/gutsy/+lang/te). అక్కడ ఉన్న పాకేజీలలో మీరు అనువదించాలనుకున్న పాకేజీని ఎంచుకుని అనువాదం చెయ్యడమే.ఇంకా ఏమన్నా సందేహాలుంటే praveengarlapati [at] gmail [dot] com కి మెయిల్ చెయ్యండి.

 7. రాకేశ్వర రావు said,

  వోడ్ హౌస్ …
  చదవవలనిన అతన్నే చదివారు …
  wodehouse is the best అండి.
  నాకేతై నవ్వినవ్వి చచ్చి పోతానేమో అనిపిస్తుంది.
  నాకు అతిగా నచ్చేవి blandings లో కథలు..
  ఈ మధ్య చదవవలసిన మహాసాహిత్యం ఎక్కువయ్యి wodehouse లాంటి ఆనందాలకి దూరమౌతున్నా…

 8. వోడ్ హౌస్ … చదవవలనిన అతన్నే చదివారు … wodehouse is the best అండి. నాకేతై నవ్వినవ్వి చచ్చి పోతానేమో అనిపిస్తుంది. నాకు అతిగా నచ్చేవి blandings లో కథలు.. ఈ మధ్య చదవవలసిన మహాసాహిత్యం ఎక్కువయ్యి wodehouse లాంటి ఆనందాలకి దూరమౌతున్నా…

 9. కొత్త పాళీ said,

  Yes, one should keep revisiting this master once in a while .. I’d recommend at least one wodehouse novel for every four serious books you read 🙂 Just finished Full Moon – certainly not among his top .. but was a good diversion. I like Leave it to Psmith and Sam the Sudden the best.
  BTW, my bro, who’s now a respectable prof in a leading Indian Institution, used to be able to quote entire passages from Wodehouse novels! amazing.

 10. Yes, one should keep revisiting this master once in a while .. I’d recommend at least one wodehouse novel for every four serious books you read 🙂 Just finished Full Moon – certainly not among his top .. but was a good diversion. I like Leave it to Psmith and Sam the Sudden the best.BTW, my bro, who’s now a respectable prof in a leading Indian Institution, used to be able to quote entire passages from Wodehouse novels! amazing.

 11. Giri said,

  Wodehouse (pronounced wood-house) is now popular in India than in UK or US. You’ll find Jeeves’ books in the US easily but not Blandings; I think the latter are much better. One of the chapter names I can’t forget (but i forget the book) is “patient perserverence produces pugilistic prodigies” 🙂

 12. Giri said,

  Wodehouse (pronounced wood-house) is now popular in India than in UK or US. You’ll find Jeeves’ books in the US easily but not Blandings; I think the latter are much better. One of the chapter names I can’t forget (but i forget the book) is “patient perserverence produces pugilistic prodigies” 🙂

 13. ప్రవీణ్ గార్లపాటి said,

  రాకేశ్వర: ఓ మీరు మాంచి ఫాన్ అన్నమాట. ఆ blandings ఏవో నేనూ చదువుతా మరి.

  కొత్తపాళీ: అంత మంచి పేరుందని తెలీదు చదవక ముందు, ఇప్పటి వరకు కూడా. ఏమ్నన్నా మంచి నవలలు సూచించండి ఆయనవి.

  గిరి గారు: సరయిన ప్రొనౌన్సియేషన్ చెప్పినందుకు కృతజ్ఞతలు.
  అందరూ blandings గురించి చెబుతున్నారు. నాకు కుతూహలం ఎక్కువయిపోతుంది.

 14. రాకేశ్వర: ఓ మీరు మాంచి ఫాన్ అన్నమాట. ఆ blandings ఏవో నేనూ చదువుతా మరి.కొత్తపాళీ: అంత మంచి పేరుందని తెలీదు చదవక ముందు, ఇప్పటి వరకు కూడా. ఏమ్నన్నా మంచి నవలలు సూచించండి ఆయనవి.గిరి గారు: సరయిన ప్రొనౌన్సియేషన్ చెప్పినందుకు కృతజ్ఞతలు.అందరూ blandings గురించి చెబుతున్నారు. నాకు కుతూహలం ఎక్కువయిపోతుంది.

 15. koresh said,

  pronoucement gurinchi andhrulu bale tamashaaga pravarthistaaru, english vishayam lo ne sumandi… gutti ni gooty ani ananthapuru ni anantapor anto vintha vintha ga maatlaada thaaru , telugu miida premanu penchandi telugu mida mama kaaram panchandi

 16. koresh said,

  pronoucement gurinchi andhrulu bale tamashaaga pravarthistaaru, english vishayam lo ne sumandi… gutti ni gooty ani ananthapuru ni anantapor anto vintha vintha ga maatlaada thaaru , telugu miida premanu penchandi telugu mida mama kaaram panchandi

 17. srisri said,

  okasari mee mail adress ivvandi …


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: