డిసెంబర్ 29, 2007

12 angry men …

Posted in 12 angry men, సినిమా, సినిమాలు, cinema వద్ద 8:23 సా. ద్వారా Praveen Garlapati

నిన్న 12 angry men అనే అద్భుతమయిన సినిమా చూసాను.
చాలా మంచి సినిమా ఇది. ఈ సినిమా ఒక కోర్టు కేసులో జూరీ యొక్క వాదోపవాదాలకి సంబంధించినది.

సినిమా కథ గురించి చెప్పుకునే ముందు జూరీ పద్ధతి గురించి కొంత చెప్పుకోవాలి.
జూరీ అంటే ఒక పన్నెండు(కొన్ని దేశాలలో పదిహేను) మందితో కూడిన ఒక టీము. కొన్ని కోర్టు కేసులలో తీర్పు వెలువరించడానికి జూరీ సహాయం కోరుతుంటారు.
జూరీ లో ఉండడానికి జనాల ఎంపిక జరుగుతుంది. అందులో ఎలాంటి ఒపీనియనేటెడ్ కాకుండా, ప్రీజుడిస్ లేకుండా ఉన్న జనాలను ఎంచుకుంటారు.
ఏదయినా కేసులో జూరీ ని ఉపయోగించాలనుకున్నప్పుడు అలా ఎంచుకున్న వారిలోంచి పన్నెండు మందిని రాండం గా పిలుస్తారు.
వీరి నుండి ఆశించేది అన్‌బయాస్డ్ గా తీర్పు వెలువడించాలని.

కొన్ని తీర్పులకు జూరీ ఏకమొత్తంగా గిల్టీ (నిందితుడు తప్పు చేసాడు), నాట్ గిల్టీ (నిందితుడు తప్పు చెయ్యలేదు) అనే ఉండాలి. మధ్యస్తంగా ఉండకూడదు అంటే పది మంది గిల్టీ, ఇద్దరు నాట్ గిల్టీ అని ఉండకూడదు. అలా ఉంటే ఇంకో జూరీ ని నియమించి మళ్ళీ విచారణ జరిపిస్తారు.

అసలు ఈ జూరీ ఉండడానికి కారణం జనాలకు ఒక రిజర్వు బెంచ్ మెంబర్ల మీద నమ్మకం లేకపోవడమే. ఇలా జూరీ ని ఎంపిక చేసి వారి చేత తీర్పు వెలువడిస్తే అది నిజాయితీ గా ఉంటుందని ఒక భావన. ఎంత వరకూ సక్సస్ అయిందో అనేది నాకు తెలీదు.
కానీ ఈ జూరీ లలో ఎంపిక చేసిన జనాలు అన్ని వేళలా హానెస్టుగా ఉండరు.

జూరీ కి ఒక నిబంధన ఏమిటంటే వారికి సంపూర్ణంగా విశ్వాసం కలిగితే కానీ ఒక నిర్ణయానికి రాకూడదు, ఎందుకంటే ఇది ఒక మనిషి జీవితానికి సంబంధించినది కాబట్టి.

* భారతం లో కూడా జూరీ పద్ధతి ఉండేదని, ఒక కేసు తరవాత ఆ పద్ధతి నిలిపివేయబడిందని తెలుసుకుని ఆశ్చర్యం కలిగింది.

అదీ జూరీ గురించి.

ఇక సినిమా సంగతికొస్తే సినిమా మొదట్లో ఒకతను తన తండ్రి ని చంపిన కేసులో నిందితుడిగా విచారింపబడుతుంటాడు.
దానికి జూరీ నియమింపబడుతుంది. ఆ జూరీ హంగ్ నిర్ణయం ఒప్పుకోబడదని జడ్జీ చెబుతాడు.
అక్కడ నుంచి ఆ పన్నెండు మంది జూరీ ఒక గదిలో ఉండి ఒక తీర్పుకి రావడానికి చేసే ప్రయత్నమే ఈ సినిమా.

మొదట సాక్ష్యాలు చూసి ఆ పన్నెండు మందిలో ఒక్కరు తప్ప అందరూ గిల్టీ అని నిర్ణయిస్తారు.
అక్కడ నుంచి ఎలా అందరూ కలిసి ఒక నిర్ణయానికి వస్తారు అనేదే సినిమా కథ.

ఈ సినిమా నాకు నచ్చడానికి కారణం లాజికల్ రీజనింగ్.
రెండోది పొరపాటున కూడా ఒక అమాయకుడికి శిక్ష పడకూడదు అని ఒక్కడు పడే తపన.
ఆ ఒక్కడు కోర్టు అంటే గౌరవం, లా పట్ల నిబద్ధత చూపించి మిగతా వారిని తన రీజనింగుతో కన్విన్సు చెయ్యడం.

చూడదగిన సినిమా.

22 వ్యాఖ్యలు »

 1. Anonymous said,

  super movie

 2. Anonymous said,

  super movie

 3. Giri said,

  ఇది నాకు చాలా చాలా నచ్చిన సినిమాలలో ఒకటి..మీరు చూసిన వెర్షనే కాక నేను జాక్ లెమన్ నటించిన 70ల్లో వచ్చినది, హిందిలో బాసు చటర్జీ తీసినది కూడా చూసాను.

 4. Giri said,

  ఇది నాకు చాలా చాలా నచ్చిన సినిమాలలో ఒకటి..మీరు చూసిన వెర్షనే కాక నేను జాక్ లెమన్ నటించిన 70ల్లో వచ్చినది, హిందిలో బాసు చటర్జీ తీసినది కూడా చూసాను.

 5. కొత్త పాళీ said,

  fantastic movie isn’t it? was chatting with my 19 yr old nephew the other day .not many things we could agree on but we both agreed this was one supe movie! 🙂

 6. fantastic movie isn’t it? was chatting with my 19 yr old nephew the other day .not many things we could agree on but we both agreed this was one supe movie! 🙂

 7. రాజేంద్ర కుమార్ దేవరపల్లి said,

  జాం గ్రీషం నవలల్లో తరచూ ఈ జ్యూరీ గురించిన ప్రస్తావనలు వస్తుంటాయి.రన్‌ అవే జ్యూరీ,అ టైం టు కిల్ ఇలా చాలా వాటిల్లో

 8. జాం గ్రీషం నవలల్లో తరచూ ఈ జ్యూరీ గురించిన ప్రస్తావనలు వస్తుంటాయి.రన్‌ అవే జ్యూరీ,అ టైం టు కిల్ ఇలా చాలా వాటిల్లో

 9. ప్రవీణ్ గార్లపాటి said,

  @anonymous:
  అవును.

  giri గారు:
  ఓ ఇంకా వర్షన్లు ఉన్నాయా ? తెలీదు.
  అవి ఇంకా బాగున్నాయా ?

  కొత్త పాళీ గారు:
  నిజంగా ఫెంటాస్టిక్కే. ఏ ఏజ్ కయినా నచ్చుతుంది మరి.

  రాజేంద్ర గారు:
  నిజం! జాన్ గ్రిషం అన్నీ లాయర్లూ, జ్యూరీలూ చుట్టూనేగా.

 10. @anonymous:అవును.giri గారు:ఓ ఇంకా వర్షన్లు ఉన్నాయా ? తెలీదు.అవి ఇంకా బాగున్నాయా ?కొత్త పాళీ గారు:నిజంగా ఫెంటాస్టిక్కే. ఏ ఏజ్ కయినా నచ్చుతుంది మరి. రాజేంద్ర గారు:నిజం! జాన్ గ్రిషం అన్నీ లాయర్లూ, జ్యూరీలూ చుట్టూనేగా.

 11. Anonymous said,

  Yes …It is Fantastic Movie…

 12. Anonymous said,

  Yes …It is Fantastic Movie…

 13. pi said,

  This movie is one of alltime favorites. It is an excellent movie about human psycology.

 14. pi said,

  This movie is one of alltime favorites. It is an excellent movie about human psycology.

 15. రవి said,

  గురు గారూ,
  ఈ టపా కు కామెంట్ రాయాలని అనుకుంటూనే, మిస్ అవుతున్నా.ఇప్పుడు కుదిరింది.

  నేనీ సినిమా చూడలేదు.

  ఈ సినిమా గురించి, ముళ్ళపూడి వెంకట రమణ సినీ రామణీయం (6 వ సంచిక) లో సమీక్షించారు. వీలయితే చదవండి. అప్పటి నుండీ ఈ డీ వీ డీ కోసం వెతుకుతున్నాను. బెంగళూరు లో ఎక్కడ దొరుకుతుందో చెప్పండి.

  రమణ సమీక్షించిన ఇంకో క్లాసిక్, “బ్రిడ్జ్ ఆన్ రివర్ క్వాయ్ “. ఈ సినిమా దొరికితే తప్పక చూడండి.

 16. రవి said,

  గురు గారూ,ఈ టపా కు కామెంట్ రాయాలని అనుకుంటూనే, మిస్ అవుతున్నా.ఇప్పుడు కుదిరింది. నేనీ సినిమా చూడలేదు.ఈ సినిమా గురించి, ముళ్ళపూడి వెంకట రమణ సినీ రామణీయం (6 వ సంచిక) లో సమీక్షించారు. వీలయితే చదవండి. అప్పటి నుండీ ఈ డీ వీ డీ కోసం వెతుకుతున్నాను. బెంగళూరు లో ఎక్కడ దొరుకుతుందో చెప్పండి. రమణ సమీక్షించిన ఇంకో క్లాసిక్, “బ్రిడ్జ్ ఆన్ రివర్ క్వాయ్ “. ఈ సినిమా దొరికితే తప్పక చూడండి.

 17. ప్రవీణ్ గార్లపాటి said,

  @రవి గారు:
  సినిమా చూడలేదా ? వెంటనే చూడండి. డీవీడీ ఎక్కడ దొరుకుతుందో తెలీదండీ. నా దగ్గరయితే సినిమా ఉంది. ఈ సారి కలిస్తే మీరు కాపీ చేసుకోవచ్చు 🙂

  సినిమా గురించి వివరాలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు.
  “బ్రిడ్జ్ ఆన్ రివర్ క్వాయ్” చూసానండీ. క్రితం సంవత్సరం చూసిన నూట యాభై సినిమాలలో ఇదొకటి 🙂
  అద్భుతమయిన సినిమా ఇది కూడా. ఎండింగ్ అయితే ఆ… అనిపించక మానదు.

 18. @రవి గారు:సినిమా చూడలేదా ? వెంటనే చూడండి. డీవీడీ ఎక్కడ దొరుకుతుందో తెలీదండీ. నా దగ్గరయితే సినిమా ఉంది. ఈ సారి కలిస్తే మీరు కాపీ చేసుకోవచ్చు :)సినిమా గురించి వివరాలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు.”బ్రిడ్జ్ ఆన్ రివర్ క్వాయ్” చూసానండీ. క్రితం సంవత్సరం చూసిన నూట యాభై సినిమాలలో ఇదొకటి :)అద్భుతమయిన సినిమా ఇది కూడా. ఎండింగ్ అయితే ఆ… అనిపించక మానదు.

 19. Anonymous said,

  It is an excellent movie. It was made in Hindi as well. “Aek rukha huwa faisla”- Pankaj Kapoor.
  Try Manchurian Candidate (Frank Sinatra) if you have not. Different genre. But you may like it.

 20. Anonymous said,

  It is an excellent movie. It was made in Hindi as well. “Aek rukha huwa faisla”- Pankaj Kapoor.Try Manchurian Candidate (Frank Sinatra) if you have not. Different genre. But you may like it.

 21. కత్తి మహేష్ కుమార్ said,

  చాలా మంచి చిత్రాన్ని గుర్తుకు చెసారు. ఎక్కడ ఫిల్మ్ క్లబ్బున్నా ఖచ్చితంగా చూపించే చిత్రాలలో ఇదొకటి. మా యూనివర్సిటీలో (HCU)లో ఈ చిత్రం యొక్క VHS క్యాసెట్ ఉండాలి. బహుశా ఇప్పటికి దాన్ని CD చేసుంటారేమో! చూడాలి.

 22. చాలా మంచి చిత్రాన్ని గుర్తుకు చెసారు. ఎక్కడ ఫిల్మ్ క్లబ్బున్నా ఖచ్చితంగా చూపించే చిత్రాలలో ఇదొకటి. మా యూనివర్సిటీలో (HCU)లో ఈ చిత్రం యొక్క VHS క్యాసెట్ ఉండాలి. బహుశా ఇప్పటికి దాన్ని CD చేసుంటారేమో! చూడాలి.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: