జనవరి 1, 2008

కొత్త సంవత్సరం….పాత సంవత్సరం

Posted in ఆలోచనలు, కొత్త సంవత్సరం, పాత సంవత్సరం వద్ద 3:27 సా. ద్వారా Praveen Garlapati

ఇంకో కొత్త సంవత్సరం వచ్చింది…
పాత సంవత్సరం గురించి ఆలోచన చేయడం, కొత్త సంవత్సరానికి ప్రణాళికలు తయారు చెయ్యడం అందరూ చేసేదే.

నాకు ఎప్పుడూ ప్లాన్ చేసుకోవటం అలవాటు లేదు. చేసుకోవాలని ఉంటుంది, కానీ అంత ఆలోచించడానికి బద్ఢకం.
ఎప్పటికయినా రిజల్యూషను చేసుకోవాలని ఒక రిజల్యూషను చేసుకోవాలేమో 🙂

ఒక సారి గుండ్రాలు గుండ్రాలు తిప్పితే క్రితం సంవత్సరం ఎలా జరిగింది అని ఆలోచిస్తే అంత సంతృప్తి ఇవ్వలేదనే చెప్పాలి.
ఇవి సాధించాలి అనుకోలేదు కానీ, సాధించినవి మాత్రం సరిపోవు అని అనిపించింది.
కొత్తగా నేర్చుకున్నవి పరంగా అంత సంతృప్తిని ఇవ్వలేదు నాకు. ఇంకా చాలా చెయ్యచ్చు అనిపించింది.

అన్నిటికన్నా ఎక్కువ సంతృప్తిని ఇచ్చింది మాత్రం తెలుగు బ్లాగులనే చెప్పచ్చు.
క్రితం సంవత్సరం నవంబరు నెలలో మొదలుపెట్టిన ఈ బ్లాగు, దీని ద్వారా నేను ఏర్పరచుకున్న స్నేహాలు నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చాయి.

బ్లాగు ప్రస్థానం ఎలా సాగిందో నాకంటే నా సహ బ్లాగర్లూ, పాఠకులే బాగా చెప్పగలరు.
అందరిలాగే ముందర అత్యుత్సాహం ఫేజు దాటి స్టెబిలైజేషన్ ఫేజు కి చేరింది.

కంటెంటు పరంగా సంతృప్తిని ఇచ్చింది. కొలబద్దలను పక్కన పెడితే నాకు సంతోషం కలిగించింది.
ఇక ఈ సంవత్సరం పరంగా బ్లాగుని ఇలా మెయింటెయిన్ చేయగలిగితే సంతోషమే.

ఈ సంవత్సరం వెబ్సైట్ల పరంగా, అగ్రిగేటర్ల పరంగానూ మంచి అభివృద్ఢి కలిగింది. కూడలి, తెలుగుబ్లాగరు, జల్లెడ, తేనెగూడు వంటి ఎన్నో ఆప్షన్లు వచ్చాయి తెలుగు వాడకందార్లకి.
ఇక నాకు నచ్చిన తెలుగు వెబ్ ఉపకరణం వీవెన్ ఈ మధ్య సృష్టించిన కబుర్లు. (కొత్త కూడలి కొంత నిరాశపరచింది)
ఇక్కడ రానారె, వీవెన్, శ్రీనివాస, చదువరి, నాగరాజు, కొత్త పాళీ, పరుచూరి, జ్యోతి, శ్రీధర్ ఇంకా ఎందరో బ్లాగు రాయని మహామహులను కూడా నేరుగా కలవడం నాకు ఎంతో సంతోషం కలిగించింది.

ఈ సంవత్సరం నేను చూడాలనుకున్నవి ఇంకా ఎక్కువ మంది తెలుగు కి సంబంధించిన కార్యక్రమాలలో పాల్గొనడం.
ప్రతీ ఒక్కరూ వారు చేయగలిగిన పరిధిలో ఏదో ఒకటి చేసి తెలుగు వ్యాప్తికి తోడ్పడాలి. వికీ, బ్లాగు, తెలుగీకరణ పనులలో తలో చేయి వేసి తోడ్పాటునందించాలి.

ఈ సంవత్సరం అందరికీ శుభాలు కలగాలని, తెలుగు దశదిశలా వ్యాపించాలని కోరుకుందాము.

12 వ్యాఖ్యలు »

 1. కొత్త పాళీ said,

  కంప్యూటరు సాంకేతిక విషయాలు (నాకు పెద్దగా అర్ధం కావనుకోండి) తెలుగునే ప్రాథమిక మాధ్యమంగా ఉపయోగించి బాగా రాస్తున్నారు. మొదట్లో మీ బ్లాగు చూసి ఏదో అన్నీ కంప్యూటర్ సాంకేతిక విషయాలులే అనుకున్నాను. ఇంతలో కళ్ళమీద టపా, స్నేహం మీద టపా, ఇటీవల సినీనాయకుల నాట్య విన్యాసాల విశ్లేషణ టపాలతో మీకీబోర్డుకి నాలుగువేపులా పదునే అని నిరూపించారు. క్రమం తప్పకుండానూ, క్వాలిటీ తగ్గకుండానూ రాస్తుండటం అంత సులభం ఖాదు. అభినందనలు .. మరియూ కొత్త సంవత్సరంలో మీ ఆశయాలు నెరవేరేందుకు శూభాకాంక్షలు.

 2. కంప్యూటరు సాంకేతిక విషయాలు (నాకు పెద్దగా అర్ధం కావనుకోండి) తెలుగునే ప్రాథమిక మాధ్యమంగా ఉపయోగించి బాగా రాస్తున్నారు. మొదట్లో మీ బ్లాగు చూసి ఏదో అన్నీ కంప్యూటర్ సాంకేతిక విషయాలులే అనుకున్నాను. ఇంతలో కళ్ళమీద టపా, స్నేహం మీద టపా, ఇటీవల సినీనాయకుల నాట్య విన్యాసాల విశ్లేషణ టపాలతో మీకీబోర్డుకి నాలుగువేపులా పదునే అని నిరూపించారు. క్రమం తప్పకుండానూ, క్వాలిటీ తగ్గకుండానూ రాస్తుండటం అంత సులభం ఖాదు. అభినందనలు .. మరియూ కొత్త సంవత్సరంలో మీ ఆశయాలు నెరవేరేందుకు శూభాకాంక్షలు.

 3. Ravi said,

  మీ రాతలలో ఓ విషయం గమనించాను. నవ్వించడానికి ప్రయత్నించకుండానే, నవ్విస్తాయి. సారి బ్లాగు మిత్రుల సమావేశం యేదయినా వుంటే, చెప్పండి.

 4. Ravi said,

  మీ రాతలలో ఓ విషయం గమనించాను. నవ్వించడానికి ప్రయత్నించకుండానే, నవ్విస్తాయి. సారి బ్లాగు మిత్రుల సమావేశం యేదయినా వుంటే, చెప్పండి.

 5. ప్రవీణ్ గార్లపాటి said,

  కొత్త పాళీ గారు:
  కృతజ్ఞతలు. ఇంకా వైవిధ్యభరితమయిన టపాలు రాయడానికి ప్రయత్నిస్తాను.

  ravi గారు:
  థాంక్స్. సమావేశం గురించి తప్పకుండా చెబుతాను.
  జనాలకి ఆసక్తి లేకపోవడంతో ప్రతీ సారీ నేనూ, ప్రదీపూ మాత్రమే కలవడం అవుతుంది. అందుకనే ఓ రెండు నెలలు ఆపేద్దామనుకున్నా.

 6. కొత్త పాళీ గారు:కృతజ్ఞతలు. ఇంకా వైవిధ్యభరితమయిన టపాలు రాయడానికి ప్రయత్నిస్తాను.ravi గారు:థాంక్స్. సమావేశం గురించి తప్పకుండా చెబుతాను.జనాలకి ఆసక్తి లేకపోవడంతో ప్రతీ సారీ నేనూ, ప్రదీపూ మాత్రమే కలవడం అవుతుంది. అందుకనే ఓ రెండు నెలలు ఆపేద్దామనుకున్నా.

 7. చదువరి said,

  ఈ సంవత్సరం మరింత మంచి జాబులు వస్తాయని ఆశిస్తాను.

  పైన ట్యాబులు చూసి అవి వర్గాలేననుకున్నాను. మొత్తం మూడు వర్గాలేనా అని కూడా అనుకున్నాను. తీరా చూస్తే కొన్ని వర్గాలను ఒక గుంపుగా చేసినట్టు కనబడింది. మొత్తం ఉన్న వర్గాలు మూడు, మిగతావన్నీ ఈ మూడింటి ఉపవర్గాలనుకోవచ్చా?

 8. ఈ సంవత్సరం మరింత మంచి జాబులు వస్తాయని ఆశిస్తాను.పైన ట్యాబులు చూసి అవి వర్గాలేననుకున్నాను. మొత్తం మూడు వర్గాలేనా అని కూడా అనుకున్నాను. తీరా చూస్తే కొన్ని వర్గాలను ఒక గుంపుగా చేసినట్టు కనబడింది. మొత్తం ఉన్న వర్గాలు మూడు, మిగతావన్నీ ఈ మూడింటి ఉపవర్గాలనుకోవచ్చా?

 9. చాలా ఉంది said,

  ప్రవీణ్ గారు, అభినందనలు. కొత్త సంవత్సరంలో మీ ఆశయాలు నెరవేరాలని ఆకాంక్షిస్తూ..

 10. ప్రవీణ్ గారు, అభినందనలు. కొత్త సంవత్సరంలో మీ ఆశయాలు నెరవేరాలని ఆకాంక్షిస్తూ..

 11. ప్రవీణ్ గార్లపాటి said,

  @చదువరి గారు:
  ఇంకా మంచి జాబులు రాయడానికి ప్రయత్నిస్తాను.

  పైన ట్యాబులు అన్ని వర్గాలు కావండీ. నేను టాగులను కొద్దిగా వేరుగా వాడతాను. వర్గాలుగా కంటే నా టపాలోని కీవర్డ్సు ని టాగులుగా పెడతాను.
  నేను పైన ట్యాబులుగా పెట్టినవి నా బ్లాగులో నేను ఎక్కువగా టపాలు రాసే వర్గాలు.

  @చాలా ఉంది గారు:

  కృతజ్ఞతలు.
  నా ఆశయాలను నెరవేర్చుకోవడానికి నా వైపు నుంచి కావలసినదంతా చేస్తాను.

 12. @చదువరి గారు:ఇంకా మంచి జాబులు రాయడానికి ప్రయత్నిస్తాను.పైన ట్యాబులు అన్ని వర్గాలు కావండీ. నేను టాగులను కొద్దిగా వేరుగా వాడతాను. వర్గాలుగా కంటే నా టపాలోని కీవర్డ్సు ని టాగులుగా పెడతాను.నేను పైన ట్యాబులుగా పెట్టినవి నా బ్లాగులో నేను ఎక్కువగా టపాలు రాసే వర్గాలు.@చాలా ఉంది గారు:కృతజ్ఞతలు. నా ఆశయాలను నెరవేర్చుకోవడానికి నా వైపు నుంచి కావలసినదంతా చేస్తాను.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: