జనవరి 6, 2008

ఆలోచనలు… ప్రశ్నలు…

Posted in ఆలోచనలు, నిజాయితీ, ప్రశ్నలు, లౌక్యం వద్ద 6:07 సా. ద్వారా Praveen Garlapati

కొన్ని సార్లు నేను ఆలోచిస్తుంటాను మనం ఎంత నిజాయితీగా బతుకుతున్నామా అని ?

మనమొక చర్చలో పాల్గొంటాము. అందులో మనం సరి అని అనుకున్న పాయింటు లేవదీస్తాము చర్చ సాగినకొద్దీ మనం వాదించేది తప్పు అని తెలుస్తుంది. అప్పుడు మనం మన వాదనను వెనక్కి తీసుకుంటామా ? లేక అడ్డంగా వాదిస్తామా ?
ఇప్పుడు నేనడిగితే తొంభై శాతం మంది నేను సరయినదాన్ని సమర్థిస్తా అని చెబుతారు, కానీ నిజంగా ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే.
కొన్ని సార్లు మనల్ని మనం మోసం చేసుకుంటున్నామేమో అనిపిస్తుంది.

నిజాన్ని నిజం అని ఒప్పుకోవడానికి ధైర్యం కావాలి. అది మనలో అప్పుడప్పుడూ లోపిస్తుందేమో ?

దానికి కారణాలు ఏవయినా కావచ్చు. చాలా సార్లు మటుకు మన అహం. నేను తప్పు అని ఒప్పుకుంటే ఎక్కడ అందరికీ లోకువయిపోతానో, నా ఉనికి, నేను సంపాదించుకున్న పేరు ఎక్కడ దెబ్బతింటాయో అని.
కానీ మనం ఇక్కడ మర్చిపోయేది నిజాయితీ. వేరే వాళ్ళ సంగతి వదిలెయ్యండి. మన మనస్సాక్షి మనల్ని ప్రశ్నిస్తూనే ఉంటుంది. ఇక మరి దానిని కూడా పట్టించుకోని మనిషంటే ఆత్మ లేని మనిషి అన్నమాటేగా ?

అసలు తప్పుని తప్పు అని ఒప్పుకోవడానికి ఎందుకు భయం ?

తప్పును తప్పు అని ఒప్పుకుంటే మనమీద గౌరవం పెరుగుతుందే తప్ప తరగదని నా ఉద్దేశ్యం.

ఒక వాదనలో ఎవరి తప్పో మనం ఎత్తి చూపగానే వెంటనే తొంభై శాతం మంది ఎదుటి వారు మన తప్పుల్ని ఎత్తి చూపుతారు. కానీ అక్కడ జనాలు ఆలోచించనిది ఏమిటంటే ఎదుటి వాడి తప్పులు ఎత్తి చూపడం వల్ల తప్పు ఒప్పు అయిపోదు అని.
ఒక్క క్షణం ఆగి అసలు తప్పేంటి అని ఆలోచిస్తే ఇంకో సారి ఎదుటి వాళ్ళకి వేలెత్తి చూపే అవకాశం ఇవ్వం కదా. ఆ పద్ధతిలో ఎందుకు ఆలోచించకూడదు ?

ఇంకొన్ని సార్లు నాకనిపిస్తుంది నిజాయితీగా ఉండడం సరయినదే కానీ అప్పుడప్పుడూ దానివల్ల ఎదుటి వారికి ఇబ్బంది కలిగితే మనం నిజాయితీగా ఉండాలా ? లేక లౌక్యం చూపించాలా ?

చిన్నప్పటి నుంచీ నాకందరూ చెబుతుంటారు లౌక్యం నేర్చుకో అపుడే పైకొస్తావు అని. నాకు తెలుసు లౌక్యం అంటే “అన్యుల మనముల్ ఒప్పింపక తానొవ్వక…” అనేట్లు ఉండాలనే. కానీ అది అబద్ధం ఆడకుండా ఎంతవరకు సాధ్యం ?

లౌక్యం అంటే ఏంటి అబద్ధం ఆడటమేనా ?

అసలు నిజాయితీ కీ నిజానికీ సంబంధం ఉందా ? లేదా రెండూ వేరు వేరా ?

హు…

28 వ్యాఖ్యలు »

 1. రాధిక said,

  మనవాళ్ళు చెప్పిన లౌక్యానికి అసలు అర్ధం తెలియదుగానీ ఎక్కువ మంది చెప్పుకున్న అర్ధం ఏమిటంటే మనకి నష్టం,కష్టం కలగకుండా అప్పుడున్న పరిస్థితి నుండి బయటపడగలగడమే.

  ఎక్కువ మందికి మంచి జరుగుతుందంటే ఒకరిద్దరికి బాధ కలిగినా తీరని నష్టం మాత్రం కలగకుండా వుంటే అబద్ధం కూడా మంచిదే.సంఘ జీవిగా వున్నప్పుడు మనసులో ని భావాలు నిర్మొహమాటం గా చెప్పకూడదు.పని వుండి రాలేకపోయాను అని చెప్పినదానికి,కావాలనే రాలేదు అని చెప్పినదానికి చాలా తేడావుంది.మనకి నిజానికి పనిలేదని ఎదుటివాడికి తెలిసినా అదే సమాధానం మన నోటి నుండి వినాలనుకోడు.ప్రమాదం లేనంత వరకు ఆనందాన్నిచ్చే అబద్ధం ప్రతివాడూ కోరుకుంటాడు.

 2. మనవాళ్ళు చెప్పిన లౌక్యానికి అసలు అర్ధం తెలియదుగానీ ఎక్కువ మంది చెప్పుకున్న అర్ధం ఏమిటంటే మనకి నష్టం,కష్టం కలగకుండా అప్పుడున్న పరిస్థితి నుండి బయటపడగలగడమే.ఎక్కువ మందికి మంచి జరుగుతుందంటే ఒకరిద్దరికి బాధ కలిగినా తీరని నష్టం మాత్రం కలగకుండా వుంటే అబద్ధం కూడా మంచిదే.సంఘ జీవిగా వున్నప్పుడు మనసులో ని భావాలు నిర్మొహమాటం గా చెప్పకూడదు.పని వుండి రాలేకపోయాను అని చెప్పినదానికి,కావాలనే రాలేదు అని చెప్పినదానికి చాలా తేడావుంది.మనకి నిజానికి పనిలేదని ఎదుటివాడికి తెలిసినా అదే సమాధానం మన నోటి నుండి వినాలనుకోడు.ప్రమాదం లేనంత వరకు ఆనందాన్నిచ్చే అబద్ధం ప్రతివాడూ కోరుకుంటాడు.

 3. రవి వైజాసత్య said,

  సత్యం వదం, హితం వదం, ప్రియం వదం అని పెద్దలు ఎప్పుడో చెప్పారు కదా దీని గురించి.. హితం జరుగుతుందంటే అబద్ధమాడినా ఫర్వాలేదు..అలాగే ఒక అమ్మాయిని చూసి ఛెండాలంగా ఉన్నావని నిజం చెప్పి నొప్పించటమూ సరికాదు.

 4. సత్యం వదం, హితం వదం, ప్రియం వదం అని పెద్దలు ఎప్పుడో చెప్పారు కదా దీని గురించి.. హితం జరుగుతుందంటే అబద్ధమాడినా ఫర్వాలేదు..అలాగే ఒక అమ్మాయిని చూసి ఛెండాలంగా ఉన్నావని నిజం చెప్పి నొప్పించటమూ సరికాదు.

 5. సుధాకర్ said,

  నాకూ కొంత వుండేదీ జాడ్యం. ఒక తప్పుడు స్టేట్మెంట్ని సమర్ధించుకుంటూ మొదలుపెట్టి ఆ సమర్ధనలో నేనే కొట్టుకుపోయే విధంగా మాట్లాడటం కొన్ని సార్లు ఎప్పుడో జరిగింది. తీవ్రంగా ఆలోచించిన తరువాత అర్ధం అయింది ఎక్కడో మన ప్రవర్తనలోనే లోపం వుందని. ఇప్పుడు నేను అవును నేను చెప్పేది తప్పే అనటానికి సిగ్గుపడనుకాక సిగ్గు పడను. క్షమాపణ కోరడానికి సిగ్గు పడను.

  మీరన్నట్లు నిజాయతీ కొన్ని సార్లు భారీ ఇబ్బందులు తెస్తుంది. దీన్నే కొంతమంది అహంకారం అని జమ కట్టేస్తారు. అందువలన “నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడే” ధన్యుడు.

  జై జై వేమన

 6. నాకూ కొంత వుండేదీ జాడ్యం. ఒక తప్పుడు స్టేట్మెంట్ని సమర్ధించుకుంటూ మొదలుపెట్టి ఆ సమర్ధనలో నేనే కొట్టుకుపోయే విధంగా మాట్లాడటం కొన్ని సార్లు ఎప్పుడో జరిగింది. తీవ్రంగా ఆలోచించిన తరువాత అర్ధం అయింది ఎక్కడో మన ప్రవర్తనలోనే లోపం వుందని. ఇప్పుడు నేను అవును నేను చెప్పేది తప్పే అనటానికి సిగ్గుపడనుకాక సిగ్గు పడను. క్షమాపణ కోరడానికి సిగ్గు పడను.మీరన్నట్లు నిజాయతీ కొన్ని సార్లు భారీ ఇబ్బందులు తెస్తుంది. దీన్నే కొంతమంది అహంకారం అని జమ కట్టేస్తారు. అందువలన “నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడే” ధన్యుడు.జై జై వేమన

 7. రాజేంద్ర కుమార్ దేవరపల్లి said,

  ఎక్కడో చదివాను మనం చేస్తే లౌక్యం,ఎదుటివాడు చేస్తే మోసం.అలాగే మీరు అన్నట్లు చర్చల్లో వాదనలే వినిపిస్తాయి వాస్తవాలు కాదు,మానవసహజమైన నాదే పైచేయి కావాలనే దుగ్ధతో ఏమి మాట్లాడటానికీ,ఏమైనా చేయటానికీ జంకకపోవటానికీ కూడా మనలోని సహజాతాలూ,వాదనా సామర్ధ్యం,ఎదుటివాడి మేధస్సు,మన మెతకలూ,ఇలా ఒక్కటేమిటి చాలా కారణాలు ప్రభావితం చేస్తాయి.కేవలం నిజాలే చెప్పాలన్న వ్రతం పెట్టుకోకపోయినా వీలైననత వరకూ నిజం చెప్పాలి,వా్స్తవానికి దగ్గరగా బతకాలి అన్న చిన్న కోరికతో గత నాలుగేళ్ళుగా నేను ఆర్ధికంగా కొంత పోగొ ట్టుకున్నా మనశ్శాంతి,నిద్ర మాత్రం నాతోనే ఉన్నాయి.తప్పులు చేయకుండా ఉండేందుకు ప్రయత్నించటం చేస్తే వెంటనే తప్పు ఒప్పుకుని మన్నించమనో ,క్షమించమనో నేను ఏనాడూ ఎవరిని అయినా అడిగేందుకు వెనుకాడ లేదు.సాధ్యమయినంతవరకూ ముందు ముందు కూడా ఇదే పంధా కొనసాగించాలనేది నా అభిలాష

 8. ఎక్కడో చదివాను మనం చేస్తే లౌక్యం,ఎదుటివాడు చేస్తే మోసం.అలాగే మీరు అన్నట్లు చర్చల్లో వాదనలే వినిపిస్తాయి వాస్తవాలు కాదు,మానవసహజమైన నాదే పైచేయి కావాలనే దుగ్ధతో ఏమి మాట్లాడటానికీ,ఏమైనా చేయటానికీ జంకకపోవటానికీ కూడా మనలోని సహజాతాలూ,వాదనా సామర్ధ్యం,ఎదుటివాడి మేధస్సు,మన మెతకలూ,ఇలా ఒక్కటేమిటి చాలా కారణాలు ప్రభావితం చేస్తాయి.కేవలం నిజాలే చెప్పాలన్న వ్రతం పెట్టుకోకపోయినా వీలైననత వరకూ నిజం చెప్పాలి,వా్స్తవానికి దగ్గరగా బతకాలి అన్న చిన్న కోరికతో గత నాలుగేళ్ళుగా నేను ఆర్ధికంగా కొంత పోగొ ట్టుకున్నా మనశ్శాంతి,నిద్ర మాత్రం నాతోనే ఉన్నాయి.తప్పులు చేయకుండా ఉండేందుకు ప్రయత్నించటం చేస్తే వెంటనే తప్పు ఒప్పుకుని మన్నించమనో ,క్షమించమనో నేను ఏనాడూ ఎవరిని అయినా అడిగేందుకు వెనుకాడ లేదు.సాధ్యమయినంతవరకూ ముందు ముందు కూడా ఇదే పంధా కొనసాగించాలనేది నా అభిలాష

 9. తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said,

  చిన్న సవరణలు :

  1. హితం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమప్రియమ్.
  2. “నొప్పింపక తా నొవ్వక…” సుమతీశతకం.

 10. చిన్న సవరణలు :1. హితం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమప్రియమ్.2. “నొప్పింపక తా నొవ్వక…” సుమతీశతకం.

 11. చదువరి said,

  ఈ జాబును చదివేప్పుడు మీ స్వగతంలా అనిపించినా.. ఏంటో, చదువుతూంటే మీరీ ప్రశ్నలు నన్నే అడుగుతున్నట్టుంది. “నాది తప్పే” అని ఒప్పుకోడానికి ముందు అహాన్ని తొలగించుకోవాలి అని నాఉద్దేశ్యం. (స్వీయ పరిశీలనతో చెబుతున్నాను!)

  మరింత మంచి జాబులు రాసే పని మొదలెట్టేసారుగా! భేష్!

 12. ఈ జాబును చదివేప్పుడు మీ స్వగతంలా అనిపించినా.. ఏంటో, చదువుతూంటే మీరీ ప్రశ్నలు నన్నే అడుగుతున్నట్టుంది. “నాది తప్పే” అని ఒప్పుకోడానికి ముందు అహాన్ని తొలగించుకోవాలి అని నాఉద్దేశ్యం. (స్వీయ పరిశీలనతో చెబుతున్నాను!) మరింత మంచి జాబులు రాసే పని మొదలెట్టేసారుగా! భేష్!

 13. సుధాకర్ said,

  నేనొప్పుకోను అది వేమన శతకమే. 😉

  ఈ రోజు వుదయమే అది గుర్తొచ్చి నాలుక్కరుచుకున్నా 🙂

  జై సుమతీ శతక కర్త

 14. నేనొప్పుకోను అది వేమన శతకమే. ;-)ఈ రోజు వుదయమే అది గుర్తొచ్చి నాలుక్కరుచుకున్నా :-)జై సుమతీ శతక కర్త

 15. రవి వైజాసత్య said,

  బాలసుబ్రమణ్యం గారూ, సవరించినందుకు నెనర్లు

 16. బాలసుబ్రమణ్యం గారూ, సవరించినందుకు నెనర్లు

 17. విహారి said,

  లౌక్యానికి సమాధానం పబ్లిగ్గా అయితే లౌక్యంగానే చెప్పాలి. బతకనేర్వడం, అవసరమైతే పక్కనోడిని బలి చెయ్యడమే లౌక్యం.

  నిజాయితీ వంట్లో వుంటే ఉత్తమ పౌరుడు బిరుదొస్తుంది. అది లేకపోయినా వంట్లో వున్నాట్టు అందరికీ చెబుతూ నమ్మిస్తే ఉత్తమ నాయకుడు బిరుదొస్తుంది.

  — విహారి

 18. లౌక్యానికి సమాధానం పబ్లిగ్గా అయితే లౌక్యంగానే చెప్పాలి. బతకనేర్వడం, అవసరమైతే పక్కనోడిని బలి చెయ్యడమే లౌక్యం. నిజాయితీ వంట్లో వుంటే ఉత్తమ పౌరుడు బిరుదొస్తుంది. అది లేకపోయినా వంట్లో వున్నాట్టు అందరికీ చెబుతూ నమ్మిస్తే ఉత్తమ నాయకుడు బిరుదొస్తుంది. — విహారి

 19. ప్రవీణ్ గార్లపాటి said,

  @రాధిక గారు:
  మీరు చెప్పినది సరిగానే ఉంది…
  ప్రాక్టికాలిటీ లో అదే సాధ్యమవుతుంది. కానీ ఆలోచనలలో ఆ కాంట్రాస్ట్ నాకెప్పుడూ వింతగా అనిపిస్తుంది.

  @వైజాసత్య గారు:
  ఐతే అబ్బాయికి చెప్పొచ్చా ? 🙂
  సరదాకి.

  @సుధాకర్ గారు:
  నాకు తెలిసి మనలో అందరూ ఎప్పుడో అప్పుడు ఈ పరిస్థితిలో ఉండేవాళ్ళమే. కానీ మీరు రియలైజ్ అయ్యరు చూడండి అదీ ముఖ్యం.
  మీరు జై జై వేమన అనగానే ఆ… అనిపించింది. 🙂

  @రాజేంద్ర గారు:
  నిజానికి దగ్గరలో బతకాలి అనేది నిజం. కనీసం ప్రయత్నమయినా చెయ్యక ముందే చేతులెత్తేస్తే తప్పు. భేష్ మీరు సరయిన పంథాలో సాగుతున్నందుకు

  @తాడేపల్లి గారు:
  ధన్యావాదాలు. తప్పుల్ని సరి దిద్దినందుకు.

  @చదువరి గారు:
  అవునండీ ఆ ప్రశ్నలు అప్పుడప్పుడు మెదడుని తొలుస్తాయి…
  దానికి సమాధానం సరిగా రాకపోతే ఇదుగో ఇలా.
  మంచి జాబు అన్నందుకు కృతజ్ఞతలు.

  @మళ్ళీ సుధాకర్ గారు:
  రైటో…

  @విహారి గారు:
  సమాధానం మీ శైలిలో చెప్పారు.
  ఏంటి మాయమయిపోయారు ఈ మధ్య ?

 20. @రాధిక గారు:మీరు చెప్పినది సరిగానే ఉంది…ప్రాక్టికాలిటీ లో అదే సాధ్యమవుతుంది. కానీ ఆలోచనలలో ఆ కాంట్రాస్ట్ నాకెప్పుడూ వింతగా అనిపిస్తుంది.@వైజాసత్య గారు:ఐతే అబ్బాయికి చెప్పొచ్చా ? :)సరదాకి.@సుధాకర్ గారు:నాకు తెలిసి మనలో అందరూ ఎప్పుడో అప్పుడు ఈ పరిస్థితిలో ఉండేవాళ్ళమే. కానీ మీరు రియలైజ్ అయ్యరు చూడండి అదీ ముఖ్యం.మీరు జై జై వేమన అనగానే ఆ… అనిపించింది. :)@రాజేంద్ర గారు:నిజానికి దగ్గరలో బతకాలి అనేది నిజం. కనీసం ప్రయత్నమయినా చెయ్యక ముందే చేతులెత్తేస్తే తప్పు. భేష్ మీరు సరయిన పంథాలో సాగుతున్నందుకు@తాడేపల్లి గారు:ధన్యావాదాలు. తప్పుల్ని సరి దిద్దినందుకు.@చదువరి గారు:అవునండీ ఆ ప్రశ్నలు అప్పుడప్పుడు మెదడుని తొలుస్తాయి…దానికి సమాధానం సరిగా రాకపోతే ఇదుగో ఇలా. మంచి జాబు అన్నందుకు కృతజ్ఞతలు.@మళ్ళీ సుధాకర్ గారు:రైటో…@విహారి గారు:సమాధానం మీ శైలిలో చెప్పారు.ఏంటి మాయమయిపోయారు ఈ మధ్య ?

 21. Ramya said,

  నిజం లేని నిజాయితి ఎలాఉంటుంది! అహంకారంవల్ల తప్పు ఒప్పకోరని మీరన్నది నిజం.
  లౌక్యాన్ని నిజాయితి అనుకోవటం నేనొప్పుకోను అందిtతేజుట్టు అంటారే అdదీ లౌక్యమే మరి.

  ఒక వ్యక్తి తాను ఎవ్వరి నుండి ఆశించక జీవిస్తున్నాను కాబట్టి నేను నిజాయిtతీపరున్ని అనుకుంటాడు,తాను ఎవరిkకీఏmమీచేయక్కర్లేదు అని కూడా అనుకుంటాడు,

  మరొక వ్యక్తి నలుగుర్ని మోసం చేసినా పది మందని బ్రతికించాను కాబట్టి నేను నిజాయtతీపరున్ని అనుకుంటాడు(aఆపది మందీ కూడ ఇతడు నిజాయితీ పరుడనిఒప్ప్ ఉకుంటారు) . వారి వారి ఆలోచనలను బట్టి నిజాయితీకి నిర్వచనం మారుతూ ఉంటుంది.

 22. Ramya said,

  నిజం లేని నిజాయితి ఎలాఉంటుంది! అహంకారంవల్ల తప్పు ఒప్పకోరని మీరన్నది నిజం. లౌక్యాన్ని నిజాయితి అనుకోవటం నేనొప్పుకోను అందిtతేజుట్టు అంటారే అdదీ లౌక్యమే మరి.ఒక వ్యక్తి తాను ఎవ్వరి నుండి ఆశించక జీవిస్తున్నాను కాబట్టి నేను నిజాయిtతీపరున్ని అనుకుంటాడు,తాను ఎవరిkకీఏmమీచేయక్కర్లేదు అని కూడా అనుకుంటాడు,మరొక వ్యక్తి నలుగుర్ని మోసం చేసినా పది మందని బ్రతికించాను కాబట్టి నేను నిజాయtతీపరున్ని అనుకుంటాడు(aఆపది మందీ కూడ ఇతడు నిజాయితీ పరుడనిఒప్ప్ ఉకుంటారు) . వారి వారి ఆలోచనలను బట్టి నిజాయితీకి నిర్వచనం మారుతూ ఉంటుంది.

 23. వింజమూరి విజయకుమార్ said,

  వారి వారి మానసిక స్థాయి కనుగుణంగా నిజాయితీకి నిర్వచనం చెప్పుకుంటారనేది నిజమే. కానీ, లౌక్యం, యుక్తి అనేవాటిని నిజాయితీతో సరిదిద్దవచ్చు. నిజాయితీని లౌక్యం, యుక్తీ ఏమీ చేయలేవు.

 24. వారి వారి మానసిక స్థాయి కనుగుణంగా నిజాయితీకి నిర్వచనం చెప్పుకుంటారనేది నిజమే. కానీ, లౌక్యం, యుక్తి అనేవాటిని నిజాయితీతో సరిదిద్దవచ్చు. నిజాయితీని లౌక్యం, యుక్తీ ఏమీ చేయలేవు.

 25. ప్రవీణ్ గార్లపాటి said,

  @ramya గారు:
  “నలుగుర్ని మోసం చేసినా పది మందని బ్రతికించాన వాడు” తనను తాను నిజాయితీపరుడిని అనుకోగలడా ???
  నాకనుమానమే…

  కానీ నిజాయితీకి నిర్వచనాలు సెల్ఫ్ డిఫైన్డ్ అన్నది మాత్రం నిజం.

  @వింజమూరి గారు:
  చెప్పలేమండీ కొన్ని సార్లు నిజాయితీని లౌక్యం జయిస్తుంది ఈ కాలంలో.

 26. @ramya గారు:”నలుగుర్ని మోసం చేసినా పది మందని బ్రతికించాన వాడు” తనను తాను నిజాయితీపరుడిని అనుకోగలడా ???నాకనుమానమే…కానీ నిజాయితీకి నిర్వచనాలు సెల్ఫ్ డిఫైన్డ్ అన్నది మాత్రం నిజం.@వింజమూరి గారు:చెప్పలేమండీ కొన్ని సార్లు నిజాయితీని లౌక్యం జయిస్తుంది ఈ కాలంలో.

 27. వింజమూరి విజయకుమార్ said,

  నిజాయితీ ఎప్పటికీ ఓడిపోదండి. నిన్నటి బెనజీర్ హత్యా ఉదంతమే ఉదాహరణగా తీసుకుందాం. యుక్తి, లౌక్యం అంటే ముషరఫ్, లేక తాలిబన్లు అనుకుందాం. బెనజీర్ ని నిజాయితీ అనుకుందాం(ఒకవేళ కాకపోయినా. ఎందుకంటే ఈవిడ అతి చిన్న వయసు లోనే పాకిస్తాన్ ప్రధాని కావడం వల్ల ఎప్పడూ ఊహల్లో తేలిపోతూ మొఘల్ మహరాణిలా ఫీలవుతూ ప్రజల్ని విస్మరించిందనే విమర్శలు ఉన్నాయి గనుక). ఇప్పుడు యుక్తి బెనజీర్ ని హత్య చేసింది. అంత మాత్రం చేత నిజాయితీ ఓడిందనరాదు. బెనజీర్ భౌతికంగా లేదు. కానీ ప్రజల హృదయాలంతా ఆమే ఆక్రమించుకుంది. కనుక, నిజాయితీ యిక్కడ మరింత బలపడి వుంది. ఏమంటారు?

 28. నిజాయితీ ఎప్పటికీ ఓడిపోదండి. నిన్నటి బెనజీర్ హత్యా ఉదంతమే ఉదాహరణగా తీసుకుందాం. యుక్తి, లౌక్యం అంటే ముషరఫ్, లేక తాలిబన్లు అనుకుందాం. బెనజీర్ ని నిజాయితీ అనుకుందాం(ఒకవేళ కాకపోయినా. ఎందుకంటే ఈవిడ అతి చిన్న వయసు లోనే పాకిస్తాన్ ప్రధాని కావడం వల్ల ఎప్పడూ ఊహల్లో తేలిపోతూ మొఘల్ మహరాణిలా ఫీలవుతూ ప్రజల్ని విస్మరించిందనే విమర్శలు ఉన్నాయి గనుక). ఇప్పుడు యుక్తి బెనజీర్ ని హత్య చేసింది. అంత మాత్రం చేత నిజాయితీ ఓడిందనరాదు. బెనజీర్ భౌతికంగా లేదు. కానీ ప్రజల హృదయాలంతా ఆమే ఆక్రమించుకుంది. కనుక, నిజాయితీ యిక్కడ మరింత బలపడి వుంది. ఏమంటారు?


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: