జనవరి 23, 2008

కేడీయీ ౪…

Posted in కేడీయీ ౪, టెక్నాలజీ, లినక్స్, KDE 4, linux వద్ద 8:31 సా. ద్వారా Praveen Garlapati

ఈ మధ్య నన్ను బాగా నిరాశపరచినది కొత్తగా రిలీజయిన కేడీయీ ౪.

ఇది చాలా విధాలుగా ఓ రివల్యూషనరీ అని బాగా ప్రచారం జరిగింది ఎందుకంటే ఇది కేడీయీ కి సంబంధించి చాలా వరకూ కోడ్ రీరైట్.
స్టన్నింగ్ గ్రాఫిక్స్, ఐకాన్స్ తో మాక్ నే తలదన్నేట్టుగా ఉంటుందన్న అంచనాలున్నాయి.
ఇది ఆక్సిజన్ అని ఒక సరికొత్త ఐకాన్స్, గ్రాఫిక్స్ సెట్ ని ఉపయోగించుకుంటుంది. (ఎక్సలెంటుగా ఉన్నాయి ఐకాన్లు)
అలాగే ప్లాస్మా అనే ఒక విడ్జెట్ల మీద ఆధారితమయిన కేడీయీ ని రూపొందించారు. (చాలా మంచి కాన్సెప్టు)

అంతా బాగానే ఉంది. కొత్త రిలీజూ చెయ్యబడింది కానీ హైప్ చేసినంత బాగా లేదనే చెప్పుకోవాలి.
నన్నయితే బాగా నిరాశపరచింది.

లినక్స్ చాలా రోజుల నుంచీ వాడుతున్నా ఎక్కువగా కేడీయీ డెస్క్‌టాప్ మేనేజర్ నే వాడడం అలవాటు నాకు. జీనోం‌ వాడేది చాలా తక్కువ.
ఎప్పుడయినా క్యూబ్ ఎఫెక్ట్లు, విండో ఎఫెక్ట్లు వగయిరాలతో ఆడుకోవాలనిపిస్తే తప్ప 😉
కుబుంటు కేడీయీ ని ఎంత బాగా తయారు చేసిందంటే అసలు విండోస్ ఎక్స్పీ (విస్టా నేను వాడలేదు) కంటే కూడా తెగ నచ్చేసింది నాకు.

అలాంటిది కేడీయీ ౪ ని వాడినప్పుడు అంత ఎక్సైట్‌మెంట్ కలగలేదు.
కొన్ని ఫీచర్లు చాలా బాగున్నాయి. కానీ చాలా బగ్గీగా ఉంది. కస్టమైజేషను సరిగా లేదు.
ఓ పెద్ద గుది బండ లాంటి టాస్కుబారు, దానిని కస్టమైజు చెయ్యాలంటే కాన్ఫిగ్ ఫైళ్ళు కెలకాల్సిందే.
ఎక్కువగా అవుటాఫ్ ది బాక్సు పని చేసే కేడీయీ ని ఇలా చూడడం అలవాటు లేదు.

కానీ ఇక్కడ నేను కన్వీనియంటుగా మర్చిపోయిందేమిటంటే ఇది చాలా విధాలుగా సరికొత్త కోడు.
అదీ కాక ఇది మొదటి వర్షను రిలీజు. కుబుంటు ఆల్రడీ దీనిని గట్సీకీ, హార్డీ కి ఇంటిగ్రేట్ చేసింది (ఊరికే ట్రై చెయ్యడానికి) కానీ కస్టమైజు చెయ్యలేదు.
కాబట్టి అద్భుతమయిన యూఐ, మరియు ఫీచర్లతో కూడిన కేడీయీ ౪ ని త్వరలోనే చూడవచ్చేమో.
ఆల్రడీ కేడీయీ ౪.౧ కి సన్నాహాలు జరుగుతున్నాయి. జూలై లో విడుదల అనుకుంట.

అప్పటివరకూ కేడీయీ ౪ కి మాత్రం నేను పర్మనెంటుగా స్విచ్ అయ్యేది లేదు 🙂

ఇటు చూడండి: అన్నట్టు నేను “బ్లాగిన్ మెయిలు” సన్నాహాలు చేస్తున్నాను. అంటే రోజుకోసారి ఏదో ఒక సమయంలో కూడలిలో ఉన్న టపాలను ఓ హెచ్‌టీ‌‌ఎమ్‌ఎల్ ఫైలు రూపంలో కావలసిన జనాలకి పంపడానికి. (ఫోటోలు ఉండవు) ఇవి సాధ్యమయినంత వరకూ కత్తిరించిన టపాలు కాకుండా పూర్తి టపాలతోనే చెయ్యాలనుకుంటున్నా. కోడు కొంత మటుకు పూర్తయింది గానీ ఇంకా చాలానే బగ్గులున్నాయి. ఎవరికయినా బీటా టెస్టు చెయ్యడానికి ఆసక్తి ఉంటే మీ మెయిలయిడీ వ్యాఖ్యలలోగానీ, నా మెయిలయిడీకి గానీ పంపించండి.

10 వ్యాఖ్యలు »

 1. Naveen Garla said,

  నేనొకణ్ణి ఉన్నా కదా…నా మెయిల్ ఐడీకి పంపు.

 2. Naveen Garla said,

  నేనొకణ్ణి ఉన్నా కదా…నా మెయిల్ ఐడీకి పంపు.

 3. Tulasi Ram Reddy said,

  సరైన సమయంలో దీని గురించి రాశారు. నేను ఇవ్వాలే ఉబుంటూ లినక్సు నుంచి ఒక అడుగు ముందుకు వేసి ఆర్చి లీనక్స్ ఇన్స్టాల్ చేశాను.దానితో పాటు కొత్తగా రిలీజైన కె.డి.యీ-4ని కూడా ఇన్స్టాల్ చేశాను. ఆహా, ఒహో,కత్తి, కెవ్వు,….. ఇంకా ఇంకా..కొత్త క్డియీని చూసిన నా రియాక్షన్లు ఇవి. అయితే మీరన్నట్లుగా ఇది కొంచెం బగ్గీగా ఉన్నది. కొత్త దాని మీద ఆతృత కొద్దీ, అన్నింటినీ ఒకేసారి పరిశీలిస్తుంటే అప్పుడే ఒకసారి బద్దకించడం(హ్యాంగ్) కూడా జరిగింది. ఎప్పుడూ వాడే కాంక్వెరెర్‌ను కాదని ఫైల్ బ్రౌజర్ కింద డాల్ఫిన్‌ని ఎంచుకున్నారు. ఇది మట్టుకు కేక. మీరన్నట్లు కొద్దిగా బగ్గీగా ఉందన్న మాట నిజమేనేమో. ఇకపోతే ఆర్చీ లీనక్సు మట్టుకు అల్లడిస్తుంది. ఆగమన్న ఆగనంటోంది(అదే అంత వేగంగా పరిగెడుతోంది). కొద్దిగా లినక్సు గురించి అవగాహన ఉన్న వారికి ఈ లినక్సు అతికినట్లు సరిపోతుందని నా అభిప్రాయం.

 4. సరైన సమయంలో దీని గురించి రాశారు. నేను ఇవ్వాలే ఉబుంటూ లినక్సు నుంచి ఒక అడుగు ముందుకు వేసి ఆర్చి లీనక్స్ ఇన్స్టాల్ చేశాను.దానితో పాటు కొత్తగా రిలీజైన కె.డి.యీ-4ని కూడా ఇన్స్టాల్ చేశాను. ఆహా, ఒహో,కత్తి, కెవ్వు,….. ఇంకా ఇంకా..కొత్త క్డియీని చూసిన నా రియాక్షన్లు ఇవి. అయితే మీరన్నట్లుగా ఇది కొంచెం బగ్గీగా ఉన్నది. కొత్త దాని మీద ఆతృత కొద్దీ, అన్నింటినీ ఒకేసారి పరిశీలిస్తుంటే అప్పుడే ఒకసారి బద్దకించడం(హ్యాంగ్) కూడా జరిగింది. ఎప్పుడూ వాడే కాంక్వెరెర్‌ను కాదని ఫైల్ బ్రౌజర్ కింద డాల్ఫిన్‌ని ఎంచుకున్నారు. ఇది మట్టుకు కేక. మీరన్నట్లు కొద్దిగా బగ్గీగా ఉందన్న మాట నిజమేనేమో. ఇకపోతే ఆర్చీ లీనక్సు మట్టుకు అల్లడిస్తుంది. ఆగమన్న ఆగనంటోంది(అదే అంత వేగంగా పరిగెడుతోంది). కొద్దిగా లినక్సు గురించి అవగాహన ఉన్న వారికి ఈ లినక్సు అతికినట్లు సరిపోతుందని నా అభిప్రాయం.

 5. ప్రవీణ్ గార్లపాటి said,

  @నవీన్ అన్న:
  రేపటి నుంచీ పంపుతా 🙂

  @Tulasi Ram Reddy గారు:
  అవునా ? ఇంత వరకూ నేను మీరు చెప్పిన డీస్ట్రిబ్యూషను వాడలేదు. వీలయితే తప్పకుండా ప్రయత్నిస్తా.
  కేడీయీ ౪ మాత్రం ఓ సరికొత్త రివల్యూషన్ అవుతుందని ఆశిద్దాము.

 6. @నవీన్ అన్న:రేపటి నుంచీ పంపుతా :)@Tulasi Ram Reddy గారు:అవునా ? ఇంత వరకూ నేను మీరు చెప్పిన డీస్ట్రిబ్యూషను వాడలేదు. వీలయితే తప్పకుండా ప్రయత్నిస్తా.కేడీయీ ౪ మాత్రం ఓ సరికొత్త రివల్యూషన్ అవుతుందని ఆశిద్దాము.

 7. రానారె said,

  బ్లాగిన్ మెయిలు ఎంతవరకూ వచ్చింది? నాక్కూడా పంపు. అది బాలేదు ఇది బాలేదు అంటూవుంటా 🙂

 8. బ్లాగిన్ మెయిలు ఎంతవరకూ వచ్చింది? నాక్కూడా పంపు. అది బాలేదు ఇది బాలేదు అంటూవుంటా 🙂

 9. ప్రవీణ్ గార్లపాటి said,

  @రానారె:
  బేసిక్ తయారయింది. నీ పేరూ చేరుస్తా.
  హమ్మయ్య ఓ ఇద్దరు దొరికారు కనీసం బాగాలేదు అనడానికి. 🙂

 10. @రానారె:బేసిక్ తయారయింది. నీ పేరూ చేరుస్తా.హమ్మయ్య ఓ ఇద్దరు దొరికారు కనీసం బాగాలేదు అనడానికి. 🙂


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: