బ్లాగుల పుస్తకం …

బ్లాగుల నుండి ఒక పుస్తకం సృష్టించాలని ఎప్పటి నుంచో అనుకుంటూనే ఉన్నాం మనం. కానీ ఎవరూ చేయట్లా…
ఇక నాలాంటి బద్ధకిష్ఠు పూనుకుంటే కానీ పని జరిగేట్లు లేదు. 🙂

ఇంతకీ సంగతేంటంటే మన తెలుగు బ్లాగుల నుంచి అత్యుత్తమ టపాలను ఏరి ఒక పుస్తకం గా వేస్తే ఎలా ఉంటుందని చాన్నాళ్ళ నుంచి నానుతుంది. దానికో రూపు ఇవ్వడానికి ఇదో మంచి తరుణమని భావిస్తున్నాను.

ఇక ఇక్కడ నాకు కొన్ని సూచనలు కావాలి.

౧. ఎన్ని టపాలను పుస్తకంలో ఉంచితే బాగుంటుంది (ఒక యాభై వంద) ??

౨. నేను టపాలను వర్గాలు గా విభజించి పెడదామనుకుంటున్నా (కవితలు, వ్యాసాలు, హాస్యం, సినిమా, రాజకీయం, టెక్నాలజీ లాగా). ఇలా ఏ వర్గాలు ఉండడం బాగుంటుంది ? అసలు వర్గాలుండడం మంచిదేనా ?

౩. ఈ పుస్తకానికి టపాలను ఎలా ఎంచుకోవాలి ?? అంటే ఏ పద్ఢతి ప్రకారం. బాగా ప్రాచుర్యం పొందినవి. వాటిని ఎలా నిర్దేశించడం. ఎక్కువ సలహాలు రాకపోతే నాకు నచ్చిన టపాలతో మొదలెడతా అనుకోండి.

ఇకపోతే టపాలను పుస్తకంగా ప్రచురించాలంటే ఆయా బ్లాగులకు సరయిన లైసెన్సు ఆపాదించి ఉండాలి లేదా టపా ప్రచురణకు బ్లాగు ఓనర్ల నుంచి అనుమతి కావాలి. మరి దీనికి ఎలాంటి విధానం అనుసరిస్తే మంచిది ?

నేను అనుకోవడమేమిటంటే జనాలను తమ తమ బ్లాగులలోంచి అత్యుత్తమం అనుకున్న ఒక ఐదు టపాలను ఇమ్మని వాటిలోంచి వోటింగు ద్వారా నో మరే విధానం ద్వారానో పుస్తకానికి టపాలు ఎంచుకోవడం.

దీనికి నాకు అందరి ఆలోచనలూ కావాలి. ఎలా దీనిని చేస్తే బాగుంటుందో, ఉపయోగపడుతుందో ?
ఇకపోతే ఇందులో అందరి సహాయమూ కావాలి. ఉదా: దీనికి కవరు పేజీ తయారు చేయాలి, మంచి ఫాంటు ఎంచాలి, పీడీఎఫ్ తయారు చెయ్యాలి గట్రా.

అన్నిటినీ సమన్వయపరచడానికి నేను రెడీ. ఎవరూ సహాయం చెయ్యకపోయినా ఇది చేసి తీరుతాను 🙂
దీనికోసం ఒక గుంపు సృష్టించాను (http://groups.google.com/group/telugublogbook). ఆసక్తి గల వారు, సహాయం చేయాలనుకున్న వారు చేరగలరు.

గమనిక: పైవాటికి మొదలుగా ఈ తెలుగు వికీలో ఒక పేజీ సృష్టించాను. దీని గురించి సమాచారం అక్కడ కూడా ఉంచుదాము.

34 thoughts on “బ్లాగుల పుస్తకం …

 1. నవతరంగంలో వ్యాసాలన్నీ ఒక పుస్తకంగా ప్రచురించాలని ఆలోచన వుంది. నెల నెలా వచ్చిన వ్యాసాలను ఒక pdf గా మార్చి download చేసే అవకాశం కూడా కల్పించాం. చూడండి.
  http://navatarangam.com/?p=138

  మీ ప్రయత్నం సఫలమవ్వాలని ఆశిస్తున్నాను. అలాగే నా వంతు సహాయం చేయగలను.

  నెనర్లు
  వెంకట్

 2. నవతరంగంలో వ్యాసాలన్నీ ఒక పుస్తకంగా ప్రచురించాలని ఆలోచన వుంది. నెల నెలా వచ్చిన వ్యాసాలను ఒక pdf గా మార్చి download చేసే అవకాశం కూడా కల్పించాం. చూడండి.http://navatarangam.com/?p=138మీ ప్రయత్నం సఫలమవ్వాలని ఆశిస్తున్నాను. అలాగే నా వంతు సహాయం చేయగలను.నెనర్లువెంకట్

 3. మీరు చెప్పినట్టు పుస్తకం వర్గాలుగా విభజిస్తేనే బావుంటుంది. బ్లాగు ఓనర్ అనుమతి కోసం ఒక ఈ మెయిల్ చేసి వాళ్ళ ద్వారా మీ ఈ మెయిల్ లో హక్కులు ఉచితంగా పొంది, దాచి వుంచితే సరి. అలాగే ఒక్కో బ్లాగరు 5 టాపాలు కాకుండా, తనకిష్టమైన ఒకే టపా లైదా రెండు పంపితే సరిపోతుందనుకుంటాను. వాటిలో అర్హత గలిగినది ప్రచురించవచ్చు. అర్హత లేదనిపిస్తే వదిలేయవచ్చు. ఏమంటారు.

 4. మీరు చెప్పినట్టు పుస్తకం వర్గాలుగా విభజిస్తేనే బావుంటుంది. బ్లాగు ఓనర్ అనుమతి కోసం ఒక ఈ మెయిల్ చేసి వాళ్ళ ద్వారా మీ ఈ మెయిల్ లో హక్కులు ఉచితంగా పొంది, దాచి వుంచితే సరి. అలాగే ఒక్కో బ్లాగరు 5 టాపాలు కాకుండా, తనకిష్టమైన ఒకే టపా లైదా రెండు పంపితే సరిపోతుందనుకుంటాను. వాటిలో అర్హత గలిగినది ప్రచురించవచ్చు. అర్హత లేదనిపిస్తే వదిలేయవచ్చు. ఏమంటారు.

 5. మంచి ఆలోచనండి. పుస్తకం కోసం ఎలాగూ అత్యుత్తమ జాబులను ఎంచాలి కాబట్టి, అదేదో బ్లాగుల పోటీలాగా కూడా పెట్టి, ఆ తరవాత, పుస్తకం గురించి ఆలోచిస్తే బాగుంటుంది కదా! రెండు పనులూ అయిపోతాయి. పోటీని e-తెలుగు ఆధ్వర్యంలో చెయ్యొచ్చేమో, సభ్యులొప్పుకుంటే! ఏమంటారు?

 6. మంచి ఆలోచనండి. పుస్తకం కోసం ఎలాగూ అత్యుత్తమ జాబులను ఎంచాలి కాబట్టి, అదేదో బ్లాగుల పోటీలాగా కూడా పెట్టి, ఆ తరవాత, పుస్తకం గురించి ఆలోచిస్తే బాగుంటుంది కదా! రెండు పనులూ అయిపోతాయి. పోటీని e-తెలుగు ఆధ్వర్యంలో చెయ్యొచ్చేమో, సభ్యులొప్పుకుంటే! ఏమంటారు?

 7. ఇది మరింత మంది మంచి (నా లాంటి 🙂 బ్లాగర్లను ప్రోత్సహిస్తుంది, ఖచ్చితంగా.

  నా శివలింగం (బోడి) సలహాలు.

  * ఓ 50 టపాలతో ఆరంభిస్తే బావుంటుంది.
  * వర్గీకరణ అనుసరించండి, కానీ ఎక్కడా ఉదహరించకండి.
  * సాధ్యమైనన్ని వైవిధ్యమైన టపాలు వచ్చేలా చూడండి.

  మా ఆఫీసు లో వీర కుమ్ముడు, పైగా ‘వెబ్ భరో ‘ , చాలా వెబ్ సైట్ లను బ్లాక్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ కామెంట్ కూడా, అతి కష్టం మీద సెక్యూరిటీ వలయాన్ని చేదించి రాస్తున్నాను.

 8. ఇది మరింత మంది మంచి (నా లాంటి 🙂 బ్లాగర్లను ప్రోత్సహిస్తుంది, ఖచ్చితంగా. నా శివలింగం (బోడి) సలహాలు. * ఓ 50 టపాలతో ఆరంభిస్తే బావుంటుంది.* వర్గీకరణ అనుసరించండి, కానీ ఎక్కడా ఉదహరించకండి. * సాధ్యమైనన్ని వైవిధ్యమైన టపాలు వచ్చేలా చూడండి. మా ఆఫీసు లో వీర కుమ్ముడు, పైగా ‘వెబ్ భరో ‘ , చాలా వెబ్ సైట్ లను బ్లాక్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ కామెంట్ కూడా, అతి కష్టం మీద సెక్యూరిటీ వలయాన్ని చేదించి రాస్తున్నాను.

 9. venkat గారు: మీ ఆలోచన చాలా మంచిది. ఆచరణలో పెట్టినందుకు అభినందనలు.

  వింజమూరి గారు: సరే… అలాగే. ఐదు అని ఎందుకన్నానంటే జనాలు ఎక్కువగా రెస్పాండు కారని.

  చదువరి గారు: చెయ్యవచ్చు. telugublogbook గుంపులో గాని తెలుగుబ్లాగు గుంపులో కానీ మీ అభిప్రాయాలు అందరికీ చెప్పగలరు. అందరికీ నచ్చితే తప్పకుండా అలాగే.

  రవి గారు: అంత కష్టపడి వ్యాఖ్య రాసినందుకు కృతజ్ఞతలు. 🙂
  మీ సూచనలు పాటిస్తాను. లేదు పాటిద్దాము ఎందుకంటే ఇది నా ఒక్కడీ ప్రాజెక్టు కాదు. అందరిదీ.
  మీరు ప్రతీ సారీ ఇలా వలయాల్ని ఛేదించి రాస్తుండండి.

 10. venkat గారు: మీ ఆలోచన చాలా మంచిది. ఆచరణలో పెట్టినందుకు అభినందనలు.వింజమూరి గారు: సరే… అలాగే. ఐదు అని ఎందుకన్నానంటే జనాలు ఎక్కువగా రెస్పాండు కారని.చదువరి గారు: చెయ్యవచ్చు. telugublogbook గుంపులో గాని తెలుగుబ్లాగు గుంపులో కానీ మీ అభిప్రాయాలు అందరికీ చెప్పగలరు. అందరికీ నచ్చితే తప్పకుండా అలాగే.రవి గారు: అంత కష్టపడి వ్యాఖ్య రాసినందుకు కృతజ్ఞతలు. :)మీ సూచనలు పాటిస్తాను. లేదు పాటిద్దాము ఎందుకంటే ఇది నా ఒక్కడీ ప్రాజెక్టు కాదు. అందరిదీ.మీరు ప్రతీ సారీ ఇలా వలయాల్ని ఛేదించి రాస్తుండండి.

 11. Great idea!
  అవును, ఇలాంటి మహత్కార్యాలు మీలాంటి బద్ధకిస్టులు పూనుకుంటేనే గానీ కావు!
  పోటీ ఒద్దు. ఒకేళ పెట్టాల్సిందే అనుకుంటే .. keep it restricted to newbies.

 12. Great idea!అవును, ఇలాంటి మహత్కార్యాలు మీలాంటి బద్ధకిస్టులు పూనుకుంటేనే గానీ కావు!పోటీ ఒద్దు. ఒకేళ పెట్టాల్సిందే అనుకుంటే .. keep it restricted to newbies.

 13. ప్రవీణ్,

  మంచి ఆలోచన. కానీ ముందుగా ఇ-పుస్తకం ఉత్తమం, ప్రజల నాడి తెలుస్తుంది. అచ్చు పుస్తకం అయితే కాస్త గట్టిగా ఆలోచించాలి. ఊరికే ఇస్తే విలువుండదు, ఖరీదు పెడితే అదో కష్టం.

 14. ప్రవీణ్,మంచి ఆలోచన. కానీ ముందుగా ఇ-పుస్తకం ఉత్తమం, ప్రజల నాడి తెలుస్తుంది. అచ్చు పుస్తకం అయితే కాస్త గట్టిగా ఆలోచించాలి. ఊరికే ఇస్తే విలువుండదు, ఖరీదు పెడితే అదో కష్టం.

 15. బాగుంది ప్రవీణ్ గారు మీ అలోచన.. కాని ఒక్కటే పోటి పెడితే మీకు 50 టపాలు దొరకడం కష్టమేమో ఆలోచించండి.. పోటి జోలికి వెళ్ళకుండా బాగున్నాయి అనిపించేవి ప్రచురిస్తే బాగుంటుంది(వర్గీకరించి).. టపాలు ఎలా ఎంచుకొంటారు?? వ్యాఖ్యలననుసరించా?? పుస్తకంలో వ్యాఖ్యలను కూడా పొందుపరుస్తారా?? అసలు ఒక్క వ్యాఖ్య కూడా లేకుండా ఎన్నో మంచి టపాలు కూడా వున్నాయి.. ఆలోచించి..నొప్పించక తనొవ్వక అనే రీతిలో ఉంటే మంచిదేమో.. పుస్తకంలో వున్నవి మాత్రమే మంచివి మిగతావి కాదనే అపోహ వస్తే కూడా కొంచం కష్టమే..

 16. బాగుంది ప్రవీణ్ గారు మీ అలోచన.. కాని ఒక్కటే పోటి పెడితే మీకు 50 టపాలు దొరకడం కష్టమేమో ఆలోచించండి.. పోటి జోలికి వెళ్ళకుండా బాగున్నాయి అనిపించేవి ప్రచురిస్తే బాగుంటుంది(వర్గీకరించి).. టపాలు ఎలా ఎంచుకొంటారు?? వ్యాఖ్యలననుసరించా?? పుస్తకంలో వ్యాఖ్యలను కూడా పొందుపరుస్తారా?? అసలు ఒక్క వ్యాఖ్య కూడా లేకుండా ఎన్నో మంచి టపాలు కూడా వున్నాయి.. ఆలోచించి..నొప్పించక తనొవ్వక అనే రీతిలో ఉంటే మంచిదేమో.. పుస్తకంలో వున్నవి మాత్రమే మంచివి మిగతావి కాదనే అపోహ వస్తే కూడా కొంచం కష్టమే..

 17. కొత్త పాళీ గారు:
  లేదు, పోటీ లాంటిది కుదరదు లెండి. మీరు మాత్రం నాకు సహాయం చెయ్యాల్సిందే. మీ టపాలు, మీకు నచ్చినవి పంపండి మరి.

  వికటకవి గారు:
  ఇది కేవలం ఈ-పుస్తకం మాత్రమే. అచ్చు పుస్తకం నా పరిధి కాదు.

  rama గారు:
  అన్ని టపాలనూ ప్రచురించడం సాధ్యం కాదు కదండీ.
  మీ సూచనలకి కృతజ్ఞతలు.

 18. కొత్త పాళీ గారు:లేదు, పోటీ లాంటిది కుదరదు లెండి. మీరు మాత్రం నాకు సహాయం చెయ్యాల్సిందే. మీ టపాలు, మీకు నచ్చినవి పంపండి మరి.వికటకవి గారు: ఇది కేవలం ఈ-పుస్తకం మాత్రమే. అచ్చు పుస్తకం నా పరిధి కాదు.rama గారు:అన్ని టపాలనూ ప్రచురించడం సాధ్యం కాదు కదండీ. మీ సూచనలకి కృతజ్ఞతలు.

 19. పోటీలు ఈ స్థాయిలో సరిగ్గా కుదిరేట్టులేవు. పోటీల్లేకుండా..న్యూబీలు..ఓల్డుబీలతో కూడా సంబంధం లేకుండా (నిర్వచించటం కష్టం..లేనిపోని తలనొప్పి) ఒకే బ్లాగునుండి ఒకే టపా (మహా అయితే రెండు) అన్న చిన్న నియమం పెట్టుకొని ఎంపిక చేస్తే బాగుంటుంది. ఎంపికకు ఫలానా తేదీ నుండి ఫలాన తేదీ వరకు ప్రచురించినవి అని కూడా ఒక పరిమితి పెట్టుకోండి.

 20. పోటీలు ఈ స్థాయిలో సరిగ్గా కుదిరేట్టులేవు. పోటీల్లేకుండా..న్యూబీలు..ఓల్డుబీలతో కూడా సంబంధం లేకుండా (నిర్వచించటం కష్టం..లేనిపోని తలనొప్పి) ఒకే బ్లాగునుండి ఒకే టపా (మహా అయితే రెండు) అన్న చిన్న నియమం పెట్టుకొని ఎంపిక చేస్తే బాగుంటుంది. ఎంపికకు ఫలానా తేదీ నుండి ఫలాన తేదీ వరకు ప్రచురించినవి అని కూడా ఒక పరిమితి పెట్టుకోండి.

 21. ఈ ఈ-పుస్తక ఆలోచన ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తున్న మీకు నా అభినందనలు.తమ తమ బ్లాగుల్లోని ఉత్తమమయిన పోస్టులనే కాకుండా ఇతురుల బ్లాగులోని బాగా నచ్చిన టపాలను కూడా పంపించవచ్చా?

 22. ఈ ఈ-పుస్తక ఆలోచన ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తున్న మీకు నా అభినందనలు.తమ తమ బ్లాగుల్లోని ఉత్తమమయిన పోస్టులనే కాకుండా ఇతురుల బ్లాగులోని బాగా నచ్చిన టపాలను కూడా పంపించవచ్చా?

 23. మంచి ప్రయత్నం.

  నా బ్లాగు నుండి మీకు నచ్చిన వాటిని (గరిష్టంగా ఐదు) మీరు వుపయోగించుకోండి. నేను చేయగల ఇతర సహాయమ ఏడైనా కూడా చేయడానికి నేను సిద్దం.

  ప్రసాదం

 24. మంచి ప్రయత్నం.నా బ్లాగు నుండి మీకు నచ్చిన వాటిని (గరిష్టంగా ఐదు) మీరు వుపయోగించుకోండి. నేను చేయగల ఇతర సహాయమ ఏడైనా కూడా చేయడానికి నేను సిద్దం.ప్రసాదం

 25. రవి:
  పోటీ కుదరదనే నా అభిప్రాయం కూడా. పరిమితి పెట్టుకుందామనే అనుకున్నాను ముందు. కానీ మొదటి సారి కదా ఇంతకు ముందు కూడా ఉన్న మంచి టపాలు ఉంచుదామని అనుకున్నా.

  రాధిక గారు:
  ఆచరణలో పెట్టడానికి నేను సిద్ధం కానీ అందరూ పాల్గొంటేనే సరయిన విధంగా రూపొందేది. మీ ఆసక్తి కి కృతజ్ఞతలు.
  మీకు నచ్చిన ఇతర బ్లాగులలోంచి కూడా పంపవచ్చు.

  ప్రసాదం:
  థాంక్స్. మీరు చేయగలిగిన సహాయం నా తర్వాత టపాలో నిర్వచించాను.
  హాస్యం కాటగరీలో మీకు నచ్చిన టపాలు పంపగలిగితే సంతోషం.

 26. రవి:పోటీ కుదరదనే నా అభిప్రాయం కూడా. పరిమితి పెట్టుకుందామనే అనుకున్నాను ముందు. కానీ మొదటి సారి కదా ఇంతకు ముందు కూడా ఉన్న మంచి టపాలు ఉంచుదామని అనుకున్నా.రాధిక గారు:ఆచరణలో పెట్టడానికి నేను సిద్ధం కానీ అందరూ పాల్గొంటేనే సరయిన విధంగా రూపొందేది. మీ ఆసక్తి కి కృతజ్ఞతలు.మీకు నచ్చిన ఇతర బ్లాగులలోంచి కూడా పంపవచ్చు.ప్రసాదం:థాంక్స్. మీరు చేయగలిగిన సహాయం నా తర్వాత టపాలో నిర్వచించాను.హాస్యం కాటగరీలో మీకు నచ్చిన టపాలు పంపగలిగితే సంతోషం.

 27. రైతన్నా ఏంటన్నా
  నీ బాదలు తెలిసేదెవరికన్న
  అన్ని వృత్తులకెల్లా ఉత్తమమైన
  వృత్తి నీదన్నా
  ప్రపంచంలో ఉన్న పరిమళం నీవన్న
  కాయ కష్టాలను నమ్ముకున్నవాడివి నీవన్న
  కష్టాలు కన్నీటిలో కూరికుపోయినా
  నిన్ను ఓదార్చే నాదుడెవరన్నా
  నీ కష్టాలు తీర్చే దేవుడెవరన్నా
  ఎండకు పొలం ఎండినా
  తుఫాన్లకు పొలం నాశనమైనా
  కష్టం నీదన్న నష్టం నీదన్న
  ఫలితం ఏదన్నా వనవన్నా రైతన్నా!

  1. ఈ రోజులలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వీటంతటికీ కారణం రైతులు విత్తనాలలకనీ,ఎరువులకనీ ఉన్న కొంత డబ్బు కర్చుపెట్టి ఇంకా చాలకపోతే అప్పులు చేసి అప్పుపాలయ్యి అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతన్నను ఓదార్చడానికై ఓ కవిత ఇదే.
   నా కవిత నచ్చినవారికి కృతజ్ఖతలు

 28. మానవా
  అంతలో ఏదో అంటావు
  పొంతనే ఉండదు దేనికి
  జ్ఙనం అని అరుస్తావు
  ఆశ అని అరుస్తావు
  అత్యాసకు గురౌతావు
  ప్రకృతి అని అరుస్తావు
  వికృతికి గురౌతావు
  మాట ఇస్తున్నావు
  మాట నుంచి తప్పించుకుంటుమన్నావు
  మానవ,మాట అనేది
  కోటి కిరణాలలో వెలువడేది
  ఒక్క మాటంటేకోటి
  కిరణాలతో సమానం
  ఇప్పటికైనా ఇచ్చిన మాటను
  తలపెట్టుకో నీ జీవితాన్ని నిలబెట్టుకో…

 29. ఆడపిల్లా
  నీవో ఆడదానివమ్నా
  నిన్ను పురిటిలోనే చంపేస్తుంటే
  స్త్రీ జాతి ఏమైపోవాలమ్మా
  నిన్ను కాపాడే నాదుడెవమ్మ
  నీ కష్టాలు తర్చే దేవుడెవరమ్మ
  అనంతమైన శక్తి నీలోనే దాగుందమ్మ
  ఈ వశ్వంలో నిన్ను
  ఓడించే శక్తి లేదమ్మ
  నీ గొప్పతనాన్ని నీవు
  తెలుసుకో అమ్మా
  స్వరాజ్యమన్నది నీ చేతులోనే ఉందమ్మ
  చదువులతల్లి సరస్వతీదేవి
  ఓ ఆడదేకదమ్మ
  నిన్నెందుకు చదివించరమ్మ
  నీలో ఉన్న శక్తిని ఎందుకు
  వెలువడనివ్వరమ్మా
  నిన్ను వద్దనుకుంటే యుగానికి
  మూలమెవరమ్మా
  ప్రపంచానికి మార్గమేదమ్మా
  జగతికి మార్గంనీవమ్మా
  జనజాతికి జన్యువు నీవమ్మ
  జగంలో వెదజల్లే
  కాంతివి నీవమ్మా
  నీవో ఆడదానివమ్మా!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s