ఫిబ్రవరి 13, 2008

మైక్రోసాఫ్టు, యాహూ, గూగుల్ … వెబ్ సమీకరణాలు …

Posted in గూగుల్, టెక్నాలజీ, మైక్రోసాఫ్ట్, యాహూ వద్ద 7:40 సా. ద్వారా Praveen Garlapati

ఆన్లైను వెబ్ వ్యాపారం మరింత రంజుగా మారే రోజులొచ్చాయి మైక్రోసాఫ్టు యాహూ ని కొనుగోలు చెయ్యడానికి ముందుకు రావడంతో.

ఇంతవరకూ వెబ్ కంపెనీలలో రారాజులు లాంటివి యాహూ, గూగుల్, అమెజాన్ వంటివి. కాకపోతే అమెజాన్ ఎక్కువగా కన్స్యూమర్ బిజినెస్ మీద ఆధారపడినది. అంటే విక్రేత వ్యాపారం పరంగా అది అగ్రగామి. కానీ పోర్టలు బిజినెస్ లో కాదు.

ఇంక ఆ స్పేసులో కొట్టుకునేది ఈ మధ్య వరకూ గూగుల్, యాహూ. యాహూ గూగుల్ కంటే ముందే వచ్చి స్థిరపడింది. వెబ్‌సైట్ల లంకెలని ఒక డైరెక్టరీ గా ఉంచుతూ ప్రస్థానం మొదలుపెట్టింది. అలా ఒకదాని వెంట ఒకటిగా విభిన్న పోర్టల్సు ని ప్రారంభించి తనకంటూ ఒక విశిష్ఠ స్థాయిని ఏర్పరచుకుంది. యాహూ మెయిల్ ఆన్లయిను మెయిళ్ళన్నింటిలోనూ అగ్రగామి. అలాగే యాహూ పోర్టలు, యాహూ న్యూస్, యాహూ ఫైనాన్సు మొదలయిన ఎన్నో మంచి సైట్లు దీని సొంతం. ఈ బిజినెస్ లో ముందుగా రావడంతో ఒక చక్కని లీడ్ ఉంది యాహూకి.

గూగుల్ సంగతి అందరికీ తెలిసిందే. సెర్చ్ ఇంజనుగా ప్రారంభమయింది. తర్వాత కొన్నాళ్ళు యాహూ సైటు కూడా గూగుల్ సెర్చ్ ఇంజనుతో శక్తిమంతమయింది. ఆ తర్వాత తన కంపెనీని యాహూకి అమ్మజూపారు గూగుల్ స్థాపకులు. కానీ యాహూ కొనలేదు. దాంతో ఐపీఓ కి వెళ్ళి అద్వితీయమైన విజయం సాధించడం, ఆ తర్వాత వెనుదిరిగి చూడనవసరం లేని విజయాలు సాధించింది. డబ్బు పుష్కళంగా చేరుతుండడంతో కొత్త కొత్త వ్యాపారాలలోకి ప్రవేశించి మెయిలు, మెసెంజరు, వగయిరా అప్పటికే స్థాపించుకుపోయిన వాటిలోంచి కూడా మార్కెటు షేరుని కొల్లగొట్టింది.

ఇక ఇంతటితో ఆగితే మజా ఏముంటుంది కథలో ?
గూగుల్ కి ఆయువు పట్టు ఆడ్‌సెన్స్. అంటే ఆన్లైనులో చూపించే అడ్వర్టైజ్మెంట్లు. దానితోనే అది బిలియన్ల కొద్దీ డబ్బు గడిస్తూంది. దీనికీ ఓ కథ ఉంది. ఈ ఆడ్ ఆలోచన గూగుల్ సొంతానిది కాదు. ఓవర్చుర్ అనే ఓ కంపెనీ ఈ పద్ధతిని కనిపెట్టింది. దానిని నకలు చేసి గూగుల్ ఆన్లైను ఆడ్లని తన సెర్చింజనులోకి చొప్పించింది.
తర్వాత ఆ ఓవర్చుర్ కంపెనీని యాహూ కొనేసి గూగుల్ ని స్యూ చేసింది పేటెంటు ఇన్ఫ్రిన్జ్మెంటు కింద. గూగుల్ తో పేటెంటుకి సంబంధించి ఒప్పందం కుదుర్చుకోవడంలో బ్లండర్ చేసింది. ఓ రెండు మిలియన్ల పైన గూగుల్ స్టాక్స్ కి బదులుగా ఆ పేటెంటుని ఉపయోగించుకోవడానికి అనుమతిచ్చింది. గూగుల్ ఐపీఓ విడుదలవగానే అమ్మేసుకుని కాష్ చేసేసుకుంది. అలా కాక ఆడ్ టెక్నాలజీ మీద ఎప్పటికీ డబ్బులు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకుని ఉంటే ఎంతో డబ్బు గడించి ఉండేది.

అటు గూగుల్ ఈ ఆడ్ టెక్నాలజీని న భూతో అన్నట్టుగా అభివృద్ధి పరచి మొత్తం ఆన్లైను ఆడ్ మార్కెటుని ఆక్రమించేసుకుంది. యాహూ అది తెలుసుకునే సరికే కీలకమయిన సెర్చ్ లోనూ, ఆడ్ మార్కెటు లోనూ గూగుల్ అందరాని ఎత్తుకి ఎదిగిపోయింది. తర్వాత నాలుక్కరచుకుని సెర్చ్ లోకి ప్రవేశించినా, పనామా అనే ప్రాజెక్టుని సృష్టించి ఆడ్ ప్లాట్ఫాం ని సృష్టించినా ఏవీ పని చెయ్యలేదు.

ఇక అటు గూగులేమో అపారంగా వచ్చిన కొత్త డబ్బుతో మంచి మంచి ప్రాడెక్టులని సృష్టించి, అక్వైర్ చేసి యాహూ బిజినెస్ నే కొల్లగొట్టడం మొదలుపెట్టింది. ఆఖరికి పరిస్థితి తారుమారయి యాహూ రెవెన్యూ అంతా కోల్పోతూ వచ్చింది. పరిస్థితి నానాటికీ క్షీణించడం మొదలయింది.

ఇది ఈ రెండు కంపెనీల సంగతయితే ఈ మధ్యలో ఇంకో కంపెనీ నేనున్నానంటూ ముందుకొచ్చింది. అదే మైక్రోసాఫ్టు. పీసీ మార్కెట్లో ఎదురులేని కంపెనీగా ప్రపంచంలోనే పెద్ద కంపెనీగా అవతరించిన మైక్రోసాఫ్టు ఆన్లైను మార్కెటు నాడి పట్టడంలో చాలా జాప్యం చేసింది. గూగుల్ ని బచ్చాగా తీసివేస్తూ వచ్చింది. దాన్ని పొడిచేస్తాం, చంపేస్తాం అని ప్రగల్భాలు పలకడమే తప్ప ఏమీ చెయ్యలేకపోయింది.
కానీ ఇన్నాళ్ళుగా రెండిటి వ్యాపారమూ వేరు వేరు అవడంతో చాప కింద నీరులా గూగుల్ విస్తరించింది. ఇప్పుడు మైక్రోసాఫ్టు కొన్ని బిజినెస్సులకి గురి పెడుతుండడంతో అకస్మాత్తుగా మేలుకుంది.

ఓఎస్ మార్కెట్టులో ఎదురు లేని రారాజయినా నెమ్మదిగా అందులో ప్రాఫిట్ మార్జిన్లూ, ఇన్నోవేషనూ తగ్గుతుండడంతో, ప్రత్యామ్నాయ ఓఎస్ లు (లినక్స్, మాక్) కొంత మార్కెట్టుని చేజిక్కించుకోవడంతో ప్రత్యామ్నాయాల కోసం వెబ్ బిజినెస్ లోకి రావాల్సిన అవసరం ఏర్పడింది. అదే కాక ఆడ్ బిజినెస్సులో ఉన్న డబ్బు కూడా నోరూరించేది.
ఇక దాని కోసం ఎమెసెన్ అనే సెర్చ్ ఇంజిన్ ని ప్రారంభించి, లైవ్ అనే పోర్టలుని సృష్టించి, అనేకమయిన సర్వీసులతో ముందుకు వచ్చింది. లైవ్ సెర్చ్ తో గూగుల్ ని తరిమేద్దామనుకున్న మైక్రోసాఫ్టు సెర్చ్ లో విఫలమయించి. యాహూ కొంతయినా మెరుగు. అలాగే లైవ్ బ్రాండుకి కూడా పెద్ద మార్కెట్టు ఏర్పడలేదు. ఆడ్ బిజినెస్సుని పెద్దగా చేజిక్కించుకోలేకపోయింది.

కానీ చూస్తూ చూస్తూ అంత లాభదాయకమయిన బిజినెస్సుని వదులుకోలేదు కూడా.

అలాంటి సమయంలో దానికి యాహూ కనబడింది. యాహూ గత కొన్నేళ్ళుగా పడిపోతున్నా దాని బ్రాండుకి ఇంకా మంచి డిమాండే ఉంది. చాలా సర్వీసుల్ల్లో ఇంకా అది మార్కెట్ లీడరే. ఇప్పటికీ ఎక్కువ జనాలు వీక్షించే పోర్టలు యాహూనే.
కానీ ఈ మధ్య కాలంలో లాభాలు లేక చతికిలబడుతూ వచ్చింది. పెద్ద పెద్ద ఎగ్జిక్యూటీవ్ లందరూ వదిలేసి వెళ్ళిపోయారు కూడా. అలాగే పనామా ప్రాజెక్టు ఫెయిలవడంతో యాహూ సీయీఓ అయిన టెర్రీ సెమెల్ కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది.

ఆన్లైను మార్కెట్ లోకి చొచ్చుకుపోవడానికి విఫలయత్నం చేస్తున్న మైక్రోసాఫ్టుకి యాహూ మంచి ఇన్వెస్ట్‌మెంటుగా కనిపించింది. అందుకే పేద్ద ఇన్వెస్టుమెంటయినా సరే 44.6 బిలియన్ డాలర్లకి యాహూ ని కొనడానికి సిద్ధపడింది. మంచి ప్రైజ్ ఆఫరు చేసింది. ఇక ఇప్పుడు బంతి యాహూ కోర్టులోకి వచ్చింది. యాహూ ఈ ఆఫరుని కాదంటే కూడా షేర్ హోల్డర్లు దానిని స్యూ చెయ్యవచ్చు. అందుకని ఊరికే కాదు అనలేదు. అలా అని మైక్రోసాఫ్టు ని చూస్తే పూర్తిగా విభిన్నమయిన కల్చరు. దాంట్లో ఇమడనూ లేదు. (నాకు తెలిసి యాహూ లో నా స్నేహితులెవరూ మైక్రోసాఫ్టు ప్రాడక్టులని ఉపయోగించరు)

ఇక ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన తరుణం వచ్చింది యాహూకి. మైక్రోసాఫ్టుకి అమ్ముడుపోవాలి, గూగుల్ వాడి సహాయం తీసుకోవాలి లేదా ఇంకో బిడ్డర్ ని అయినా సంపాదించాలి. సొంతంగా లాభాల బాటలోకెళ్ళడం కష్టతరమే. ఇదీ దాని వైపు నుంచి చూస్తే.

ఇక గూగుల్ వైపు నుంచి చూస్తే ఇంత కాలం ఎదురులేని వాడు ఇప్పుడు మైక్రోసాఫ్టు, యాహూ కలిస్తే ఒక పెద్ద అపోనెంటు తయారవచ్చు. కాబట్టి పావులు ఆచి తూచి కదుపుతున్నాడు.

మైక్రోసాఫ్టు వైపు నుంచి చూస్తే ఇంత ఇన్వెస్టు చేసి యాహూ ని కొంటే దానిని లాభాలలో పెట్టి మార్కెట్టు కోల్పోకుండా, చొచ్చుకుపోవాలి. కానీ దానికన్నా ముందు ఈ మర్జరు సరిగా జరగాలి. లేకపోతే మొదటికే మోసం వస్తుంది.

యాహూ మైక్రోసాఫ్టు బిడ్ ని తిరస్కరించింది ఓ రెండు రోజుల క్రితం. (ఇంకా ఎక్కువ డబ్బు వస్తుందన్న ఆశతో కావచ్చు.)

కాబట్టి సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఏది ఏమయినా ఈ సంవత్సరం వెబ్ మార్కెట్టులో ఎన్నో మార్పులు చూడవచ్చేమో ?
వినియోగదారుడికి వచ్చే నష్టమేమీ లేదు 🙂

14 వ్యాఖ్యలు »

 1. కొత్త పాళీ said,

  “దాన్ని పొడిచేస్తాం, చంపేస్తాం అని ప్రగల్భాలు పలకడమే తప్ప ఏమీ చెయ్యలేకపోయింది. “
  భలే! ప్రవీణ్, నువ్వింక తెలుగు దినపత్రికలకి టెక్నాలజీ బిజినెస్ కాలంస్ రాయొచ్చు.

 2. “దాన్ని పొడిచేస్తాం, చంపేస్తాం అని ప్రగల్భాలు పలకడమే తప్ప ఏమీ చెయ్యలేకపోయింది. “భలే! ప్రవీణ్, నువ్వింక తెలుగు దినపత్రికలకి టెక్నాలజీ బిజినెస్ కాలంస్ రాయొచ్చు.

 3. రవి said,

  మైక్రో సాఫ్ట్ ది భిన్నమైన కల్చరు…హమ్మ్…కల్చరు కూడా ఈ సమీకరణాల్లో భాగం పంచుకుంటుందా? ఎందుకో, ఆఖరుకు, మసి పూసి మారేడు కాయ చేసి, మైక్రో సాఫ్టు వాడు ఈ వ్యాపార చదరంగం లో నెగ్గుకొస్తాడేమో అని నాకనిపిస్తుంది.

  మంచి ట్రయాంగిల్ లవ్ స్టోరీ స్క్రిప్టు వినిపించారు :-))

 4. రవి said,

  మైక్రో సాఫ్ట్ ది భిన్నమైన కల్చరు…హమ్మ్…కల్చరు కూడా ఈ సమీకరణాల్లో భాగం పంచుకుంటుందా? ఎందుకో, ఆఖరుకు, మసి పూసి మారేడు కాయ చేసి, మైక్రో సాఫ్టు వాడు ఈ వ్యాపార చదరంగం లో నెగ్గుకొస్తాడేమో అని నాకనిపిస్తుంది.మంచి ట్రయాంగిల్ లవ్ స్టోరీ స్క్రిప్టు వినిపించారు :-))

 5. Sudhakar said,

  చాలా టైప్ చేసి ఓపెన్ ఐడి ఉపయోగించి అదంతా పోగొట్టుకున్నా…మళ్ళీ ఆ ఓపిక లేదు.

  ప్రోడక్ట్స్ వాడటం కల్చర్ లో భాగం కాదేమో ప్రవీణ్. ఎందుకంటే MS లో పని చేస్తున్న వారిలో IBM, Yahoo, Redhat, Google నుంచి జాయిన్ అయిన ఎంతో మంది ఉద్యోగులున్నారు. నేనూ రేపు గూగుల్ కు మారితే నాకు ఆ కల్చర్ పడదంటానా? డబ్బులు ముఖ్యం కానీ 🙂

  ఒకటి, రెండు సంవత్సరాలు ఎక్స్ పీరియన్స్ ఉన్న వారిలో ఈ ఫేక్ కల్చరల్ ఇమ్మెచ్యూరిటీ కనిపిస్తుంది. బాగా సీనియర్లయ్యాక ఏ కంపనీ అయినా మన ఫ్రీక్వెన్సీ మీద మనం నడవటమే.

 6. Sudhakar said,

  చాలా టైప్ చేసి ఓపెన్ ఐడి ఉపయోగించి అదంతా పోగొట్టుకున్నా…మళ్ళీ ఆ ఓపిక లేదు.ప్రోడక్ట్స్ వాడటం కల్చర్ లో భాగం కాదేమో ప్రవీణ్. ఎందుకంటే MS లో పని చేస్తున్న వారిలో IBM, Yahoo, Redhat, Google నుంచి జాయిన్ అయిన ఎంతో మంది ఉద్యోగులున్నారు. నేనూ రేపు గూగుల్ కు మారితే నాకు ఆ కల్చర్ పడదంటానా? డబ్బులు ముఖ్యం కానీ 🙂 ఒకటి, రెండు సంవత్సరాలు ఎక్స్ పీరియన్స్ ఉన్న వారిలో ఈ ఫేక్ కల్చరల్ ఇమ్మెచ్యూరిటీ కనిపిస్తుంది. బాగా సీనియర్లయ్యాక ఏ కంపనీ అయినా మన ఫ్రీక్వెన్సీ మీద మనం నడవటమే.

 7. oremuna said,

  http://oremuna.com/blog/?p=542

  Sorry to disappoint you by not commenting 🙂

  youc an read the above story may be good one 🙂 again!

 8. oremuna said,

  http://oremuna.com/blog/?p=542 Sorry to disappoint you by not commenting :)youc an read the above story may be good one 🙂 again!

 9. ప్రవీణ్ గార్లపాటి said,

  కొత్త పాళీ గారు: 🙂

  రవి గారు:
  ఏం జరుగుతుందో ఆగి చూడాల్సిందే. మైక్రోసాఫ్టు ని తక్కువంచనా వెయ్యలేము.
  అవును కల్చర్‌కి కూడా ఎంతో ప్రాముఖ్యం ఉందనే నా అభిప్రాయం. ఎందుకంటే ప్రతీ కంపెనీకీ ఓ మైండ్ సెట్ ఉంటుంది. అలా మైండ్‌సెట్ కలవని కంపెనీలు మర్జ్ అవుతున్నప్పుడూ చాలా విషయాల్లో తేడాలొస్తాయి. నేనెరుగుదును. మా కంపెనీకి కూడా అక్విజిషన్లలో పేద్ద హిస్టరీ ఉంది. 🙂

  sudhakar గారు:
  నేను తప్పు ఉదాహరణ ఎంచుకున్న మాట నిజం. ప్రాడక్ట్స్ వాడటం వల్ల కల్చరు వేరు కాకపోవచ్చు. కానీ స్థూలంగా చూస్తే మైక్రోసాఫ్టు, యాహూ విభిన్నమయిన బాక్‌గ్రౌండ్స్ నుంచి వచ్చిన కంపెనీలు. కార్పొరేటు పుషింగు ధోరణి మైక్రోసాఫ్టు దయితే ప్రోడక్ట్సుతో ఆకట్టుకుని బిజినెస్ చేయాల్సిన “అవసరం” యాహూది.
  డబ్బెంతో ముఖ్యం అని నేనొప్పుకుంటా కానీ అదొక్కటే కాదని కూడా నా అభిప్రాయం. కొన్ని “పేద్ద” కంపెనీలలో ఆఫరు వచ్చినా వదులుకున్నా నాకు పని నచ్చక, వారి ధోరణి నచ్చక. (ఇంటర్వ్యూల తీరు, ఉద్యోగులు మాట్లాడే తీరు)
  పని చేసే చాలా మంది మనోభావాలకు విభిన్నంగా మర్జరు జరిగినట్టయితే కలిసిన తరవాత కూడా శత్రువులుగా చూసే ఆస్కారం ఉంది. అది నాకు తెలుసు. నాకు తెలిసున్న స్నేహితులకు ఈ అనుభవాలు ఉన్నాయి. ఇక మర్జరు అయిన తరువాత కంపెనీ వదిలి పోవడమో, లేక ఇంతకు ముందు పని చేసినట్టు చెయ్య(క/లేక)పోవడమో జరుగుతుంది.
  అందుకనే నేను మైక్రోసాఫ్టు ఈ మర్జరు జరిగితే జాగ్రత్తగా డీల్ చెయ్యాలని చెప్పింది. ఇవి రెండు కంపెనీలూ జైంట్లు. రెండిటిలోనూ ఓవర్లాపింగ్ ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి. వాటిని సరిగా డీల్ చెయ్యకపోతే ఖంగు తినవచ్చు.

  oremuna:
  మీ కథ బాగుంది. ఊహ నిజమైంది.
  అలాంటి హాపీ ఎండింగే ఇక్కడ జరుగుతుందని ఆశిద్దాము 🙂

 10. కొత్త పాళీ గారు: :)రవి గారు: ఏం జరుగుతుందో ఆగి చూడాల్సిందే. మైక్రోసాఫ్టు ని తక్కువంచనా వెయ్యలేము.అవును కల్చర్‌కి కూడా ఎంతో ప్రాముఖ్యం ఉందనే నా అభిప్రాయం. ఎందుకంటే ప్రతీ కంపెనీకీ ఓ మైండ్ సెట్ ఉంటుంది. అలా మైండ్‌సెట్ కలవని కంపెనీలు మర్జ్ అవుతున్నప్పుడూ చాలా విషయాల్లో తేడాలొస్తాయి. నేనెరుగుదును. మా కంపెనీకి కూడా అక్విజిషన్లలో పేద్ద హిస్టరీ ఉంది. :)sudhakar గారు:నేను తప్పు ఉదాహరణ ఎంచుకున్న మాట నిజం. ప్రాడక్ట్స్ వాడటం వల్ల కల్చరు వేరు కాకపోవచ్చు. కానీ స్థూలంగా చూస్తే మైక్రోసాఫ్టు, యాహూ విభిన్నమయిన బాక్‌గ్రౌండ్స్ నుంచి వచ్చిన కంపెనీలు. కార్పొరేటు పుషింగు ధోరణి మైక్రోసాఫ్టు దయితే ప్రోడక్ట్సుతో ఆకట్టుకుని బిజినెస్ చేయాల్సిన “అవసరం” యాహూది.డబ్బెంతో ముఖ్యం అని నేనొప్పుకుంటా కానీ అదొక్కటే కాదని కూడా నా అభిప్రాయం. కొన్ని “పేద్ద” కంపెనీలలో ఆఫరు వచ్చినా వదులుకున్నా నాకు పని నచ్చక, వారి ధోరణి నచ్చక. (ఇంటర్వ్యూల తీరు, ఉద్యోగులు మాట్లాడే తీరు)పని చేసే చాలా మంది మనోభావాలకు విభిన్నంగా మర్జరు జరిగినట్టయితే కలిసిన తరవాత కూడా శత్రువులుగా చూసే ఆస్కారం ఉంది. అది నాకు తెలుసు. నాకు తెలిసున్న స్నేహితులకు ఈ అనుభవాలు ఉన్నాయి. ఇక మర్జరు అయిన తరువాత కంపెనీ వదిలి పోవడమో, లేక ఇంతకు ముందు పని చేసినట్టు చెయ్య(క/లేక)పోవడమో జరుగుతుంది.అందుకనే నేను మైక్రోసాఫ్టు ఈ మర్జరు జరిగితే జాగ్రత్తగా డీల్ చెయ్యాలని చెప్పింది. ఇవి రెండు కంపెనీలూ జైంట్లు. రెండిటిలోనూ ఓవర్లాపింగ్ ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి. వాటిని సరిగా డీల్ చెయ్యకపోతే ఖంగు తినవచ్చు.oremuna:మీ కథ బాగుంది. ఊహ నిజమైంది. అలాంటి హాపీ ఎండింగే ఇక్కడ జరుగుతుందని ఆశిద్దాము 🙂

 11. vIkAtAkAvI said,

  మైక్రోసాఫ్టు మరీ ఎవడో కావాలని చెడగొట్టాలని కంపు చేస్తే తప్ప ఈసారి యాహూని “యాహూ” అని చేజిక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. జనాలు ఇన్నాళ్ళు మైక్రోసాఫ్టుని రాక్షసుడు అని తిడుతూ గూగుల్ అనే మరో రాక్షసుణ్ణి తయారు చేశారు. ఆ రాక్షసుడు అందర్నీ తినక ముందే వాడికి తగ్గ వీరుడు మరొకడు తయారవ్వాలి. దానికి ఇదే చక్కని అవకాశం.

  ఇక డూప్లికేషను అంటారా, ఏ మెర్జర్ జరిగినా ఇది తప్పదు. జనాలు అనుకున్నంత కష్టమేమీ కాదు మైక్రోసాఫ్టుకి, నిజంగా యాహూని దక్కించుకుంటే.

 12. vIkAtAkAvI said,

  మైక్రోసాఫ్టు మరీ ఎవడో కావాలని చెడగొట్టాలని కంపు చేస్తే తప్ప ఈసారి యాహూని “యాహూ” అని చేజిక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. జనాలు ఇన్నాళ్ళు మైక్రోసాఫ్టుని రాక్షసుడు అని తిడుతూ గూగుల్ అనే మరో రాక్షసుణ్ణి తయారు చేశారు. ఆ రాక్షసుడు అందర్నీ తినక ముందే వాడికి తగ్గ వీరుడు మరొకడు తయారవ్వాలి. దానికి ఇదే చక్కని అవకాశం.ఇక డూప్లికేషను అంటారా, ఏ మెర్జర్ జరిగినా ఇది తప్పదు. జనాలు అనుకున్నంత కష్టమేమీ కాదు మైక్రోసాఫ్టుకి, నిజంగా యాహూని దక్కించుకుంటే.

 13. Anonymous said,

  wonderful article. Thanks a lot for presenting so many titles. looking for more articles.

 14. Anonymous said,

  wonderful article. Thanks a lot for presenting so many titles. looking for more articles.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: