ఫిబ్రవరి 29, 2008

నీకు గారెలు నాకు బూరెలు …

Posted in సరదా వద్ద 6:24 సా. ద్వారా Praveen Garlapati

బ్లాగులలో ఓ రోజు

అ గారు: మీ టపా చాలా బాగుంది
@ఆ గారు: కృతజ్ఞతలు
@అ గారు గారు: ధన్యాభినందనలు…..

బ్లా బ్లా…

కబుర్లలో ఒక రోజు

ఎ గారు, హలో
ఏ గారు గారు, హలో హలో…

బై బై…

పై వాటిలో మీకేమీ వింతగా కనిపించనట్లయితే మీరు కూడా గార్లు వడ్డించే వారేనన్నమాట 🙂

ఎందుకనో నాకు దగ్గరవాళ్ళని గారు అనాలంటే అదోలా ఉంటుంది. మొహమాటం కోసం మొదట్లో అన్నామంటే అర్థముంది.
బాగా తెలిసిన తరువాత కూడా మీరు, గారు, అయ్యా, ఆర్యా… అవసరమా ? అనిపిస్తుంది.

ఇది గాక అనానిమాసురులకీ, రాత పేర్లకీ కూడా గార్లు తగిలించడం కృతకంగా అనిపిస్తుంది.
సింపుల్ గా పేరు పెట్టి పిలుచుకుంటే సరిపోదూ.

అలాగని అదేదో సినిమాలో జోకినట్టు ఏరా, ఒరే లెవెలు అవసరం లేదు కానీ పేరు పెట్టి నోరారా పిలిస్తే ఈ బంధనాల నుంచి విముక్తులమవుతామనిపిస్తుంది.

ఇన్ని చెప్పానని నేనేదో దీనికతీతుడననుకునేరు. ఆటోమేటిగ్గా నేను నా గారెల రుణం నా శక్తి కొలదీ తీర్చుకుంటూనే ఉన్నాను.
దీనికి పరిష్కారమేమిటో ?

30 వ్యాఖ్యలు »

 1. Vamsi M Maganti said,

  ఏముంది ..గారెలు వండి అందరికీ బుట్టలో పందేరం చెయ్యటమే… 🙂 …

 2. ఏముంది ..గారెలు వండి అందరికీ బుట్టలో పందేరం చెయ్యటమే… 🙂 …

 3. జ్యోతి said,

  నాకు కూడా ఈ గార్లు బూర్లు నచ్చవు. పేరుతో హాయిగా మాట్లాడుకుంటే గౌరవం తగ్గదుగా. గారు పెట్టినంత మాత్రాన ఆ వ్యక్తిని గౌరవించినట్టు కాదు. మనసులో ఉండాలి. గారు తీసేస్తే పెద్ద అడ్డంకి , అడ్డుగోడ తీసినట్టు ఉంటుంది నాకైతే. అందుకే కబుర్లలో అందరికి నేనుచెప్పేది నో గార్లు, బూర్లు..

 4. నాకు కూడా ఈ గార్లు బూర్లు నచ్చవు. పేరుతో హాయిగా మాట్లాడుకుంటే గౌరవం తగ్గదుగా. గారు పెట్టినంత మాత్రాన ఆ వ్యక్తిని గౌరవించినట్టు కాదు. మనసులో ఉండాలి. గారు తీసేస్తే పెద్ద అడ్డంకి , అడ్డుగోడ తీసినట్టు ఉంటుంది నాకైతే. అందుకే కబుర్లలో అందరికి నేనుచెప్పేది నో గార్లు, బూర్లు..

 5. Anonymous said,

  మనకి సంఘ పరం గా ఒక వ్యవస్థని పెద్ద వాళ్ళు సృష్టించారు. ఆ వ్యవస్థకి అనుగుణంగా కొన్ని పధ్ధతులు ఏర్పడ్డాయి. పేరు పెట్టి పిలవడం లో తప్పేమీ లేదు గాని కొన్ని సందర్భాల్లో ఆ పిలవడం వక్రీకరించబడుతుంది. ఒక etiquette మరియు decorum maintain చేయాల్సిన అవసరం ఉంది. మాంసం తింటున్నామని ఎముకలు మెడలో వేసుకోవడం లాంటిదే ఇది. మన సభ్య ప్రపంచం లో వెకిలితనం ఒక హాస్యం గా మారింది.నేనయితే పేరు పెట్టి పిలిస్తే అభ్యంతరమా అని అడుగుతాను. దీనికి నేను చాలా ఉదాహరణలు చెప్పగలను.

 6. Anonymous said,

  మనకి సంఘ పరం గా ఒక వ్యవస్థని పెద్ద వాళ్ళు సృష్టించారు. ఆ వ్యవస్థకి అనుగుణంగా కొన్ని పధ్ధతులు ఏర్పడ్డాయి. పేరు పెట్టి పిలవడం లో తప్పేమీ లేదు గాని కొన్ని సందర్భాల్లో ఆ పిలవడం వక్రీకరించబడుతుంది. ఒక etiquette మరియు decorum maintain చేయాల్సిన అవసరం ఉంది. మాంసం తింటున్నామని ఎముకలు మెడలో వేసుకోవడం లాంటిదే ఇది. మన సభ్య ప్రపంచం లో వెకిలితనం ఒక హాస్యం గా మారింది.నేనయితే పేరు పెట్టి పిలిస్తే అభ్యంతరమా అని అడుగుతాను. దీనికి నేను చాలా ఉదాహరణలు చెప్పగలను.

 7. ప్రవీణ్ గార్లపాటి said,

  @anonymous:

  etiquette కి విరుద్ధంగా చెయ్యమని నేననట్లేదు. కాకపోతే ఉదా: ఏ రానారెనో, వీవెనో మీకు తగిలారనుకోండి, మీ వయసు వారయుండీ వారికి గారు తగిలించడం అవసరం లేదేమో ?

  మీ ఉదాహరణ నాకు అర్థం కాలేదు.

 8. @anonymous:etiquette కి విరుద్ధంగా చెయ్యమని నేననట్లేదు. కాకపోతే ఉదా: ఏ రానారెనో, వీవెనో మీకు తగిలారనుకోండి, మీ వయసు వారయుండీ వారికి గారు తగిలించడం అవసరం లేదేమో ?మీ ఉదాహరణ నాకు అర్థం కాలేదు.

 9. సుధాకర్ said,

  తెలియని వారిని పేరు పెట్టి ఏకవచనంలో పిలిస్తే నాకు నచ్చదస్సలు. ఎందుకో గానీ. ఇక్కడ గౌరవాలతో కూడిన విషయం కాదు. నేనైతే ఒక వ్యక్తిగా గుర్తింపు అనుకుంటాను. నేను వీరు వారు అని తేడా లేకుండా మీరు, గారు అలవాటు చేసుకున్నాను. ఆటోవాలా, రిక్షా వాలా అయినా సరే. పిల్లలతోనే నేను ఏక వచనంలో మాట్లాడుతాను.

  అందరినీ “గారు” అని పెట్టి పిలిచినా ప్రాబ్లెం రాకపోవచ్చు. కానీ అందరినీ ఏకవచనంలో పిలిస్తే ఫీలయ్యేవాళ్ళు చాలా మందే వుంటాను. తెలియని వ్యక్తులతో ఎందుకొచ్చిన ప్రాక్టికల్స్?

  బిజినెస్ ఫార్మల్స్ అలోచన పుట్టిందీ అందుకనే…

 10. తెలియని వారిని పేరు పెట్టి ఏకవచనంలో పిలిస్తే నాకు నచ్చదస్సలు. ఎందుకో గానీ. ఇక్కడ గౌరవాలతో కూడిన విషయం కాదు. నేనైతే ఒక వ్యక్తిగా గుర్తింపు అనుకుంటాను. నేను వీరు వారు అని తేడా లేకుండా మీరు, గారు అలవాటు చేసుకున్నాను. ఆటోవాలా, రిక్షా వాలా అయినా సరే. పిల్లలతోనే నేను ఏక వచనంలో మాట్లాడుతాను. అందరినీ “గారు” అని పెట్టి పిలిచినా ప్రాబ్లెం రాకపోవచ్చు. కానీ అందరినీ ఏకవచనంలో పిలిస్తే ఫీలయ్యేవాళ్ళు చాలా మందే వుంటాను. తెలియని వ్యక్తులతో ఎందుకొచ్చిన ప్రాక్టికల్స్?బిజినెస్ ఫార్మల్స్ అలోచన పుట్టిందీ అందుకనే…

 11. సుధాకర్ said,

  @anonymous గారు,

  మీ ఉదాహరణ నాకర్ఢం కాలేదు గానీ, మిగతాది చాలా కరక్టు. మనుషులను అందరినీ మన గాటనే వుంటారనుకోవటం చిన్నపిల్లల మనస్తత్వం. అందుకనే పిల్లలకు ఈ బేధాలుండవు. కానీ నిజజీవితంలో అవి పనికిరావు. మీరు జపాన్ వెలితే జపనీస్ లా వుండాల్సిందే. షార్ట్స్ వేసుకుని కిళ్లీకోసం బయటకెళ్తా అంటే పనికి రాదు. ఇదీ అంతే. గో జిల్లాలు, కోస్తా జిల్లాలలో నువ్వు గట్రా అన్నారంటే ఉన్న గౌరవం కొట్టుకుపోయి వాళ్ళు మిమ్మల్ని అసలు పట్టించుకోరు. మీరు దానిని మార్చనూలేరు. నాకైతే గోదావరి జిల్లాలలో ఎంతో ఆప్యాయంగా మాట్లాడే ఈ “గారు”, “ఆండి” వింటే చాలా హాయిగా వుంటుంది. అక్కడా వీటికి చిన్నా, పెద్ద తేడా కూడా వుండదు. ఎవరి అలవాట్లు వారివే.అయితే కె.సి.ఆర్ ఈ మధ్య చెప్పిన లెవల్లో కాదులెండి. ఆ మాటలు ఎక్కడయినా జుగుప్సగానే వుంటాయి.
  ఎవరి ప్రాంతపు అలవాట్లు వారిని వాడనివ్వండి. నాకైతే ఎలా మాట్లాడినా అడ్డు గోడలు కనిపించవు. అడ్డుగోడలు వుండాల్సినవి మన కామన్ సెన్స్ లోనే. అదే నిర్ణయిస్తుంది వుండాలా, అక్కరలేదా అనేది.

 12. @anonymous గారు,మీ ఉదాహరణ నాకర్ఢం కాలేదు గానీ, మిగతాది చాలా కరక్టు. మనుషులను అందరినీ మన గాటనే వుంటారనుకోవటం చిన్నపిల్లల మనస్తత్వం. అందుకనే పిల్లలకు ఈ బేధాలుండవు. కానీ నిజజీవితంలో అవి పనికిరావు. మీరు జపాన్ వెలితే జపనీస్ లా వుండాల్సిందే. షార్ట్స్ వేసుకుని కిళ్లీకోసం బయటకెళ్తా అంటే పనికి రాదు. ఇదీ అంతే. గో జిల్లాలు, కోస్తా జిల్లాలలో నువ్వు గట్రా అన్నారంటే ఉన్న గౌరవం కొట్టుకుపోయి వాళ్ళు మిమ్మల్ని అసలు పట్టించుకోరు. మీరు దానిని మార్చనూలేరు. నాకైతే గోదావరి జిల్లాలలో ఎంతో ఆప్యాయంగా మాట్లాడే ఈ “గారు”, “ఆండి” వింటే చాలా హాయిగా వుంటుంది. అక్కడా వీటికి చిన్నా, పెద్ద తేడా కూడా వుండదు. ఎవరి అలవాట్లు వారివే.అయితే కె.సి.ఆర్ ఈ మధ్య చెప్పిన లెవల్లో కాదులెండి. ఆ మాటలు ఎక్కడయినా జుగుప్సగానే వుంటాయి. ఎవరి ప్రాంతపు అలవాట్లు వారిని వాడనివ్వండి. నాకైతే ఎలా మాట్లాడినా అడ్డు గోడలు కనిపించవు. అడ్డుగోడలు వుండాల్సినవి మన కామన్ సెన్స్ లోనే. అదే నిర్ణయిస్తుంది వుండాలా, అక్కరలేదా అనేది.

 13. చిన్నమయ్య said,

  ఆలోచింపదగ్గ విషయమే. ఎప్పటికైనా ఒక తెలుగు బ్లాగు స్మృతి ఏర్పడితే, అందులో ఈ నిర్ణయం తప్పక పొందు పరచాలి.

 14. ఆలోచింపదగ్గ విషయమే. ఎప్పటికైనా ఒక తెలుగు బ్లాగు స్మృతి ఏర్పడితే, అందులో ఈ నిర్ణయం తప్పక పొందు పరచాలి.

 15. జ్యోతి said,

  అందరిని పేరుపెట్టి పిలవలేము. కొద్ది పాటి పరిచయం, సాన్నిహిత్యం, మనకంటే చిన్నవాళ్ళు, సమవయస్కులు, అని తెలిసినపుడే గారు లేకుండా పేరుతో పిలవగలం.

 16. అందరిని పేరుపెట్టి పిలవలేము. కొద్ది పాటి పరిచయం, సాన్నిహిత్యం, మనకంటే చిన్నవాళ్ళు, సమవయస్కులు, అని తెలిసినపుడే గారు లేకుండా పేరుతో పిలవగలం.

 17. Anonymous said,

  Actually addressing amongst ourselves without this “gaaru”, its wonderful. There is a thin veil called etiquette/decorum which covers our emotions nicely. That’s why universally its better to put that thin veil “garu” until we know about others. There is no universalism here as Andhra Pradesh has different mannerisms. In my view ( no comments on this please), Andhra Pradesh should be divided in to four parts by taking the districts from the states of Karnataka, TN, MP and orissa.I lived in 23 districts in Andhra Pradesh and have found the difference in the language, mannerisms, influence of other languages.

 18. Anonymous said,

  Actually addressing amongst ourselves without this “gaaru”, its wonderful. There is a thin veil called etiquette/decorum which covers our emotions nicely. That’s why universally its better to put that thin veil “garu” until we know about others. There is no universalism here as Andhra Pradesh has different mannerisms. In my view ( no comments on this please), Andhra Pradesh should be divided in to four parts by taking the districts from the states of Karnataka, TN, MP and orissa.I lived in 23 districts in Andhra Pradesh and have found the difference in the language, mannerisms, influence of other languages.

 19. రాధిక said,

  తెలియని వారిని గారూ అని పిస్తేనే బాగుంటుంది.తెలిసిన వారిలో పెద్దవారిని గారు అని పిలిచి సమవయస్కులని పేరుతో పిలిస్తె బాగుంటుంది.కొన్ని సార్లు ఈ “గారు” ని వెటకారం గా కూడా ఉపయోగిస్తాము. గోదావరి జిల్లాలో కొన్ని చోట్ల నిమ్న కులాలలోని పెద్దవారు అగ్రకులాల వారి పిల్లల్ని కూడా గారూ అని పిలవాలి.ఆ పిల్లలు మాత్రం ఆ పెద్దలని పేర్లు పెట్టి పిలవాలి..చదువు నేర్పిన సంస్కార మేమో వాళ్లని గారూ అని పిలవమంటుంది.పెద్దలేమో అలా పిలుస్తావేమని మందలిస్తారు.పోనీ మనల్ని గారూ అనొద్దన్నా వినరు.అది చాలా ఇబ్బందికర పరిస్థితి

 20. తెలియని వారిని గారూ అని పిస్తేనే బాగుంటుంది.తెలిసిన వారిలో పెద్దవారిని గారు అని పిలిచి సమవయస్కులని పేరుతో పిలిస్తె బాగుంటుంది.కొన్ని సార్లు ఈ “గారు” ని వెటకారం గా కూడా ఉపయోగిస్తాము. గోదావరి జిల్లాలో కొన్ని చోట్ల నిమ్న కులాలలోని పెద్దవారు అగ్రకులాల వారి పిల్లల్ని కూడా గారూ అని పిలవాలి.ఆ పిల్లలు మాత్రం ఆ పెద్దలని పేర్లు పెట్టి పిలవాలి..చదువు నేర్పిన సంస్కార మేమో వాళ్లని గారూ అని పిలవమంటుంది.పెద్దలేమో అలా పిలుస్తావేమని మందలిస్తారు.పోనీ మనల్ని గారూ అనొద్దన్నా వినరు.అది చాలా ఇబ్బందికర పరిస్థితి

 21. ప్రవీణ్ గార్లపాటి said,

  @సుధాకర్:
  మీరు చెప్పిందే నిజం. అందరినీ ఎవరిని పడితే వారిని ఏకవచనంలో పిలవనవసరంలేదు. అవసరాన్ని బట్టి, పరిస్థితిని బట్టి మార్చుకోవాలి.
  కానీ నాకు నచ్చనిది మన సమ వయస్కులయుండీ, తెలిసినవారయుండీ కూడా అనవసరమయిన బంధనాలు తగిలించడమే.

  @చిన్నమయ్య గారు: దీని గురించి ఆలోచించినందుకు కృతజ్ఞతలు

  @జ్యోతి గారు:
  అగ్రీడ్ 🙂

  @anonymous (గారు లేకుండా :):
  కొన్ని సార్లు నాకు ఈ సూడో పరదాలు నచ్చవు. కానీ తప్పదు.

  @రాధిక గారు:
  గోదావరి జిల్లాలో కొంత మేర పెరిగిన వాడిని కనుక నాకు ఆ ఇబ్బందికర పరిస్థితి కొంత మేరకు తెలుసు.

  ఆఖరికి తేలిందేమిటంటే మీ మీ జడ్జ్‌మెంటు ఉపయోగించి మీకు ఇబ్బంది కలగని విధంగా ప్రవర్తించడమే. పొలిటికల్లీ కరెక్టు స్టేట్‌మెంటయినా ఇదే దారి 🙂

 22. @సుధాకర్:మీరు చెప్పిందే నిజం. అందరినీ ఎవరిని పడితే వారిని ఏకవచనంలో పిలవనవసరంలేదు. అవసరాన్ని బట్టి, పరిస్థితిని బట్టి మార్చుకోవాలి.కానీ నాకు నచ్చనిది మన సమ వయస్కులయుండీ, తెలిసినవారయుండీ కూడా అనవసరమయిన బంధనాలు తగిలించడమే.@చిన్నమయ్య గారు: దీని గురించి ఆలోచించినందుకు కృతజ్ఞతలు@జ్యోతి గారు:అగ్రీడ్ :)@anonymous (గారు లేకుండా :):కొన్ని సార్లు నాకు ఈ సూడో పరదాలు నచ్చవు. కానీ తప్పదు. @రాధిక గారు:గోదావరి జిల్లాలో కొంత మేర పెరిగిన వాడిని కనుక నాకు ఆ ఇబ్బందికర పరిస్థితి కొంత మేరకు తెలుసు.ఆఖరికి తేలిందేమిటంటే మీ మీ జడ్జ్‌మెంటు ఉపయోగించి మీకు ఇబ్బంది కలగని విధంగా ప్రవర్తించడమే. పొలిటికల్లీ కరెక్టు స్టేట్‌మెంటయినా ఇదే దారి 🙂

 23. రవి said,

  మా సీమ లో కొత్త వారితో పరిచయం అయినప్పుడు సాధారణంగా ‘అన్నా ‘ అనడం కద్దు. ( రానారె ఓ కామెంట్ రాస్తూ ఇదే పదం వాడారు నా విషయం లో). ‘గారు ‘ అనడం అవతల వ్యక్తి ఏమనుకుంటాడో అనే సంశయం వచ్చినప్పుడు మాత్రం వాడతారు.

  ఏతావాతా మనంతకు మనమే ఈ గార్లను బూర్లను బుట్టలో వేసేద్దాం.

 24. రవి said,

  మా సీమ లో కొత్త వారితో పరిచయం అయినప్పుడు సాధారణంగా ‘అన్నా ‘ అనడం కద్దు. ( రానారె ఓ కామెంట్ రాస్తూ ఇదే పదం వాడారు నా విషయం లో). ‘గారు ‘ అనడం అవతల వ్యక్తి ఏమనుకుంటాడో అనే సంశయం వచ్చినప్పుడు మాత్రం వాడతారు. ఏతావాతా మనంతకు మనమే ఈ గార్లను బూర్లను బుట్టలో వేసేద్దాం.

 25. నిషిగంధ said,

  ‘గారు ‘ నించి ‘నువ్వు ‘ లోకి రావాలంటే దగ్గిరతనం అవసరం.. కొంతమంది సంవత్సరాల తరబడి ‘గారు ‘ గానే ఉండిపోతే ఇంకొందరు రెండు రొజుల్లొనే ‘నువ్వు ‘ అయిపోతారు 🙂

 26. ‘గారు ‘ నించి ‘నువ్వు ‘ లోకి రావాలంటే దగ్గిరతనం అవసరం.. కొంతమంది సంవత్సరాల తరబడి ‘గారు ‘ గానే ఉండిపోతే ఇంకొందరు రెండు రొజుల్లొనే ‘నువ్వు ‘ అయిపోతారు 🙂

 27. రవి వైజాసత్య said,

  అయితే..మీరు ఢీ సినిమా చూడలేదా ప్రవీణ్ గారూ..:-) నాకు కాస్తపరిచయమవగానే నువ్వు అనటం ఇష్టం..అందులో ఉన్న ఆత్మీయతే వేరు..కానీ చదువరి పద్ధతి కూడా ఫర్వాలేదనిపిస్తుంది (పేరుతో పిలవటం..సంబోధనలో మాత్రం మీరు అనటం)
  ఇందులో సభామర్యాదను కూడా పరిగణలోకి తీసుకోవాలేమో (ఉదాహరణకు జ్యోతిని జ్యోతి గారు అనాలంటే ఎబ్బెట్టుగా ఉంటుంది.. కానీ అందరూ జ్యోతిగారు అంటున్నప్పుడు జ్యోతి అనటం ఇబ్బందిగానే ఉంటుంది)..కానీ నేను చాలామటుకు మిర్రరింగ్ పద్ధతి పాటిస్తుంటాను (ఈ పద్ధతిని అతిక్రమించేవాళ్లంటే కొద్దిగా చిరుకోపమొస్తుంది..ఉదా:ప్రవీణ్, రాకేశ్ (నువ్వు అంటే మీరు అనే రకాలు)

 28. అయితే..మీరు ఢీ సినిమా చూడలేదా ప్రవీణ్ గారూ..:-) నాకు కాస్తపరిచయమవగానే నువ్వు అనటం ఇష్టం..అందులో ఉన్న ఆత్మీయతే వేరు..కానీ చదువరి పద్ధతి కూడా ఫర్వాలేదనిపిస్తుంది (పేరుతో పిలవటం..సంబోధనలో మాత్రం మీరు అనటం)ఇందులో సభామర్యాదను కూడా పరిగణలోకి తీసుకోవాలేమో (ఉదాహరణకు జ్యోతిని జ్యోతి గారు అనాలంటే ఎబ్బెట్టుగా ఉంటుంది.. కానీ అందరూ జ్యోతిగారు అంటున్నప్పుడు జ్యోతి అనటం ఇబ్బందిగానే ఉంటుంది)..కానీ నేను చాలామటుకు మిర్రరింగ్ పద్ధతి పాటిస్తుంటాను (ఈ పద్ధతిని అతిక్రమించేవాళ్లంటే కొద్దిగా చిరుకోపమొస్తుంది..ఉదా:ప్రవీణ్, రాకేశ్ (నువ్వు అంటే మీరు అనే రకాలు)

 29. Anonymous said,

  నా వరకు నాకు కొత్తవారిని కానీ, లేదా బాగా ఆత్మీయులైన వారిని కూడా నువ్వు అని సంబోధించడం నచ్చదు. మరీ చిన్నవారైతే తప్ప నువ్వు అనాలంటే ఇబ్బందిగా ఉంటుంది. అదీ కొంచెం పెద్దవారైతే పేరు పెట్టి పిలవాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. కొత్తగా పరిచయమైన వాళ్ళని, మన ఈడు వాళ్ళని పేరుతో పిలిచినా మీరు అంటేనే మర్యాదగా ఉంటుంది. నా వరకు నేను నన్ను గారు అని సంబోధించాలని కోరుకోను. కానీ నువ్వు అంటే ఎంత మాత్రం నచ్చదు నాకు.

  — ప్రశాంతి ఉప్పలపాటి
  prasanthi.wordpress.com

 30. Anonymous said,

  నా వరకు నాకు కొత్తవారిని కానీ, లేదా బాగా ఆత్మీయులైన వారిని కూడా నువ్వు అని సంబోధించడం నచ్చదు. మరీ చిన్నవారైతే తప్ప నువ్వు అనాలంటే ఇబ్బందిగా ఉంటుంది. అదీ కొంచెం పెద్దవారైతే పేరు పెట్టి పిలవాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. కొత్తగా పరిచయమైన వాళ్ళని, మన ఈడు వాళ్ళని పేరుతో పిలిచినా మీరు అంటేనే మర్యాదగా ఉంటుంది. నా వరకు నేను నన్ను గారు అని సంబోధించాలని కోరుకోను. కానీ నువ్వు అంటే ఎంత మాత్రం నచ్చదు నాకు. — ప్రశాంతి ఉప్పలపాటి prasanthi.wordpress.com


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: