ఏప్రిల్ 6, 2008

బ్లాగు పుస్తకం ఇదుగో …

Posted in బ్లాగు పుస్తకం వద్ద 6:20 సా. ద్వారా Praveen Garlapati

అనుకున్నట్టుగానే ఉగాదికి మన బ్లాగు పుస్తకం ఇక్కడ విడుదల.

ఈ పుస్తకం మొదలు నుంచి చివరి వరకూ నాకు చక్కని అనుభవంగా మిగిలింది.
చేద్దాము అనుకున్న దగ్గర నుంచీ టపాలు సేకరించి, వాటిలో నుంచి టపాలను ఎంచుకుని, వాటిని ఒక పద్ధతిలో పేర్చి పుస్తకం తయారు చేసే వరకూ అన్ని పనులలో వివిధ వ్యక్తుల నుంచి నాకు సహకారం లభించింది.

వారందరి సహాయంతో మన మొదటి బ్లాగు పుస్తకం తయారు అయింది.

వివిధ వర్గాలు ఈ ప్రకారంగా బ్లాగు పుస్తకంలో ఉంచబడ్డాయి.

 1. హాస్యం
 2. కవిత
 3. కథ
 4. రాజకీయం
 5. సినిమా
 6. సాంకేతికం
 7. వ్యక్తిగతం/ఆలోచనలు/అనుభవాలు
 8. వ్యాసం

నాకు వచ్చిన టపాలలో నుంచి మంచి వాటిని ఎంపిక చేసి, వర్గాలుగా విభజించి పై వాటిలో ఉంచాను.

ఆ తర్వాత ఆకర్షణీయమయిన కవరుపేజీ ని వీవెన్ తయారు చేసి ఇవ్వడంతో పుస్తకానికి నిజమయిన పుస్తకం రూపు వచ్చింది.
ఆఖరికి ఇలా మీ ముందుకి వచ్చింది.

పుస్తకాన్ని ఇక్కడ నుంచి (http://employees.org/~praveeng/telugublogbook/telugublogbook.pdf) దిగుమతి చేసుకోగలరు.

ఈ ప్రయత్నంలో నన్ను ప్రోత్సాహించిన అందరికీ నా కృతజ్ఞతలు.

ఈ పుస్తకాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను. మీకు తెలిసిన తెలుగు వారందరికీ ఈ పుస్తకాన్ని అందించగలరు. 🙂

* పుస్తకానికి సంబంధించి ఏమన్నా మెరుగుపరచవచ్చంటే చెప్పగలరు.
* దయచేసి ఇందులో టపాలను మాత్రమే అత్యుత్తమంగా అనుకోవద్దు. నాకు వచ్చిన టపాల నుంచి, నా దృష్టిలో ఉన్న టపాల నుంచి మంచి టపాలను ఒక సంకలనంగా మాత్రమే ఈ పుస్తకాన్ని పరిగణించగలరు.
* ఎవరివయినా మంచి టపాలు ఇందులో లేకపోతే క్షమించగలరు. వచ్చేసారి ఇంతకన్నా మెరుగ్గా అన్ని టపాలనూ సేకరించడానికి ప్రయత్నించవచ్చు 🙂 (దయచేసి పుస్తకాన్ని పుస్తకంగా చూడగలరు.)
* నాకు అంతటా సహకరించిన మన బ్లాగు స్నేహితులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. (చావా కిరణ్, వీవెన్, స్వాతికుమారి, రానారె, చదువరి, కొత్త పాళీ, సుధాకర్ కీ ప్రత్యేకంగా)

61 వ్యాఖ్యలు »

 1. శ్రీ said,

  బ్రమ్హాండంగా ఉందండీ బ్లాగు పుస్తకం! మంచి అలోచన, చాలా వరకు మిస్ అయిన బ్లాగుల్ని పట్టుకొచ్చారు. ఇక మీ పుస్తకంలొ సురక్షితంగా ఉంటాయి.

 2. శ్రీ said,

  బ్రమ్హాండంగా ఉందండీ బ్లాగు పుస్తకం! మంచి అలోచన, చాలా వరకు మిస్ అయిన బ్లాగుల్ని పట్టుకొచ్చారు. ఇక మీ పుస్తకంలొ సురక్షితంగా ఉంటాయి.

 3. నిషిగంధ said,

  ప్రవీణ్ గారూ, పుస్తకం చాలా చాలా బాగా వచ్చిందండి.. కవర్ పేజీ ఆకర్షణీయంగా ఉంది.. పుస్తకంలో ఎన్నో మంచి మంచి టపాలను పరిచయం చేశారు.. కృతజ్ఞతలు..

 4. ప్రవీణ్ గారూ, పుస్తకం చాలా చాలా బాగా వచ్చిందండి.. కవర్ పేజీ ఆకర్షణీయంగా ఉంది.. పుస్తకంలో ఎన్నో మంచి మంచి టపాలను పరిచయం చేశారు.. కృతజ్ఞతలు..

 5. విహారి said,

  చాలా బావుంది. ఎంతో శ్రమ కోర్చి చేశారు. అభినందనలు.

  — విహారి

 6. చాలా బావుంది. ఎంతో శ్రమ కోర్చి చేశారు. అభినందనలు. — విహారి

 7. నల్లమోతు శ్రీధర్ said,

  ప్రవీణ్ గారు బ్లాగు పుస్తకం చాలా బాగా వచ్చింది. ఇంత మంచి పోస్టులు ఒకేచోట చదువుకునే అదృష్టం కల్పించిన మీకు, మీ ప్రయత్నానికి సహకరించిన కొత్తపాళీ, రానారె, సుధాకర్, వీవెన్, స్వాతి కుమార్, చదువరి తదితరులకు ప్రత్యేక అభినందనలు. వారపత్రికల వార్షిక ప్రత్యేక సంచికలను తలదన్నే స్థాయిలో చదువరులకు ఉగాది కానుకగా ఈ పుస్తకాన్ని అందించారు, ధన్యవాదాలు.

  – నల్లమోతు శ్రీధర్

 8. ప్రవీణ్ గారు బ్లాగు పుస్తకం చాలా బాగా వచ్చింది. ఇంత మంచి పోస్టులు ఒకేచోట చదువుకునే అదృష్టం కల్పించిన మీకు, మీ ప్రయత్నానికి సహకరించిన కొత్తపాళీ, రానారె, సుధాకర్, వీవెన్, స్వాతి కుమార్, చదువరి తదితరులకు ప్రత్యేక అభినందనలు. వారపత్రికల వార్షిక ప్రత్యేక సంచికలను తలదన్నే స్థాయిలో చదువరులకు ఉగాది కానుకగా ఈ పుస్తకాన్ని అందించారు, ధన్యవాదాలు.- నల్లమోతు శ్రీధర్

 9. netizen said,

  ప్రవీణ్, మీ ప్రయత్నం సఫలం.
  వీవెన్ గారు చక్కటి ముఖ పత్రాన్ని తయారుచేసారు.
  అనుకున్నట్టుగానే ఉగాది నాటికే వెలువరించడానికి, మీకు తోడ్పడిన వారందిరికివే కృతజ్ఞతలు, అభినందనలు, అభివాదాలు!

 10. netizen said,

  ప్రవీణ్, మీ ప్రయత్నం సఫలం.వీవెన్ గారు చక్కటి ముఖ పత్రాన్ని తయారుచేసారు.అనుకున్నట్టుగానే ఉగాది నాటికే వెలువరించడానికి, మీకు తోడ్పడిన వారందిరికివే కృతజ్ఞతలు, అభినందనలు, అభివాదాలు!

 11. Srividya said,

  చాలా బాగుందండి బ్లాగు పుస్తకం. మీ కష్టం కనిపిస్తుంది.

 12. Srividya said,

  చాలా బాగుందండి బ్లాగు పుస్తకం. మీ కష్టం కనిపిస్తుంది.

 13. Dr. Ram$ said,

  ముందుగా ఉగాది శుభాకాంక్షలు.. జన రంజకమైన బ్లాగులు అన్ని ఒక చోటె, మరల అవి పుస్తక రూపం లో, వందనం అభివందనం మిత్రమా..!! మీరు పడ్డ కష్టం నిజంగా ప్రశంసనీయమైనది.. నెట్ ప్రపంచము లో తెలుగు బాషాబివ్రుద్దికి యిది ఎంతో వుపకరిస్తుంది అనుకుంటున్నాను..ముందు ముందు యిలాంటి బ్రహత్తర కార్యక్రమాలు మరెన్నో చేపట్టే లా మీకు తగు శక్తిని ప్రసాదించాలని ఆ ఏడుకొండలు వాడిని వేనోళ్ళ వేడుకుంటున్నాను..

 14. Dr. Ram$ said,

  ముందుగా ఉగాది శుభాకాంక్షలు.. జన రంజకమైన బ్లాగులు అన్ని ఒక చోటె, మరల అవి పుస్తక రూపం లో, వందనం అభివందనం మిత్రమా..!! మీరు పడ్డ కష్టం నిజంగా ప్రశంసనీయమైనది.. నెట్ ప్రపంచము లో తెలుగు బాషాబివ్రుద్దికి యిది ఎంతో వుపకరిస్తుంది అనుకుంటున్నాను..ముందు ముందు యిలాంటి బ్రహత్తర కార్యక్రమాలు మరెన్నో చేపట్టే లా మీకు తగు శక్తిని ప్రసాదించాలని ఆ ఏడుకొండలు వాడిని వేనోళ్ళ వేడుకుంటున్నాను..

 15. సిరిసిరిమువ్వ said,

  అభినందనలు. ఉగాదికి తెలుగు బ్లాగర్లకు మరియు తెలుగు వారికి మంచి బహుమతి ఇచ్చారు. ముఖపత్రం చాలా బాగుంది. మీ కృషి అభినందనీయం. మీకు సహకరించిన తోటి బ్లాగర్లకు అభినందనలు.

  సర్వధారినామ ఉగాది శుభాకాంక్షలతో….

 16. అభినందనలు. ఉగాదికి తెలుగు బ్లాగర్లకు మరియు తెలుగు వారికి మంచి బహుమతి ఇచ్చారు. ముఖపత్రం చాలా బాగుంది. మీ కృషి అభినందనీయం. మీకు సహకరించిన తోటి బ్లాగర్లకు అభినందనలు.సర్వధారినామ ఉగాది శుభాకాంక్షలతో….

 17. ప్రవీణ్ గార్లపాటి said,

  @ శ్రీ:
  కృతజ్ఞతలు. అదే ఆలోచనతో మొదలుపెట్టినది ఈ బ్లాగు పుస్తకం 🙂

  @ నిషిగంధ గారు:
  కవర్‌పేజీ క్రెడిటంతా వీవెన్ దే.

  @ విహారి:
  సంతోషం.

  @ శ్రీధర్ గారు:
  థాంక్స్. చక్కని టపాలు రాసి ఈ పుస్తకానికి వన్నె తెచ్చిన బ్లాగరులకు కూడా ఈ అభినందనలు చెందుతాయి.

  @netijen:
  మీకును. ఉగాదికి వెలువరింగలగడం నాకూ చాలా సంతోషంగా ఉంది.

  @srividya గారు:
  నచ్చినందుకు సంతోషం.

  @dr. ram$ గారు:
  మనందరమూ కలిస్తే ఇలాంటివి ఎన్నో చెయ్యవచ్చనే నా నమ్మకం. మీ వ్యాఖ్య ఎంతో ఆనందం కలుగచేసింది.

  @సిరిసిరిమువ్వ గారు:
  ఉగాది కానుకగా ఇవ్వగలగడం సంతృప్తి. మీకు కూడా నా తరఫున ఉగాది శుభాకాంక్షలు.

 18. @ శ్రీ:కృతజ్ఞతలు. అదే ఆలోచనతో మొదలుపెట్టినది ఈ బ్లాగు పుస్తకం :)@ నిషిగంధ గారు:కవర్‌పేజీ క్రెడిటంతా వీవెన్ దే.@ విహారి:సంతోషం. @ శ్రీధర్ గారు:థాంక్స్. చక్కని టపాలు రాసి ఈ పుస్తకానికి వన్నె తెచ్చిన బ్లాగరులకు కూడా ఈ అభినందనలు చెందుతాయి.@netijen:మీకును. ఉగాదికి వెలువరింగలగడం నాకూ చాలా సంతోషంగా ఉంది.@srividya గారు:నచ్చినందుకు సంతోషం.@dr. ram$ గారు:మనందరమూ కలిస్తే ఇలాంటివి ఎన్నో చెయ్యవచ్చనే నా నమ్మకం. మీ వ్యాఖ్య ఎంతో ఆనందం కలుగచేసింది.@సిరిసిరిమువ్వ గారు:ఉగాది కానుకగా ఇవ్వగలగడం సంతృప్తి. మీకు కూడా నా తరఫున ఉగాది శుభాకాంక్షలు.

 19. దిలీప్ said,

  ప్రవీణ్ గారూ,

  బ్లాగు పుస్తకం అనే విన్నూత్న ప్రయత్నం చాలా చక్కగా ఉంది. ఇంటర్ నెట్ పై తెలుగు భాష ప్రస్థానంలో ఇదొక కీలక మజిలీలా నిలిచిపోతుంది. మీకూ, ఈ బృహత్కార్యంలో పాలుపంచుకున్న తోటి బ్లాగర్లకూ అభినందనలు.

  దిలీప్

 20. ప్రవీణ్ గారూ,బ్లాగు పుస్తకం అనే విన్నూత్న ప్రయత్నం చాలా చక్కగా ఉంది. ఇంటర్ నెట్ పై తెలుగు భాష ప్రస్థానంలో ఇదొక కీలక మజిలీలా నిలిచిపోతుంది. మీకూ, ఈ బృహత్కార్యంలో పాలుపంచుకున్న తోటి బ్లాగర్లకూ అభినందనలు. దిలీప్

 21. రాజేంద్ర కుమార్ దేవరపల్లి said,

  ప్రవీణ్ గారు బ్లాగ్బుక్,బ్లాగ్రంధం మొదటి సంపుటం చాలా చక్కగా వచ్చింది.ఇహ దీన్ని ప్రజా బాహుళ్యానికి,పాఠకలోకానికి ముఖ్యంగా బ్లాగుల గీతకు ఆవల ఉన్నవారి దరికి చేర్చటంఆన్న సంగతి మీద నిపుణులంతా దృష్టి కేంద్రీకరించాలి,తరువాయి సంపుటి వచ్చేవరకూ.అయిదో సంపుటి నాటి కైనా అందులో చోటు సంపాదించుకునే స్తాయి గలిగిన బ్లాగు టపా ఒక్కటైనా రాయగలనని నా ఆశ.మీకు,మీకు సహకరించిన వారందరికి నా అినందనలు.

 22. ప్రవీణ్ గారు బ్లాగ్బుక్,బ్లాగ్రంధం మొదటి సంపుటం చాలా చక్కగా వచ్చింది.ఇహ దీన్ని ప్రజా బాహుళ్యానికి,పాఠకలోకానికి ముఖ్యంగా బ్లాగుల గీతకు ఆవల ఉన్నవారి దరికి చేర్చటంఆన్న సంగతి మీద నిపుణులంతా దృష్టి కేంద్రీకరించాలి,తరువాయి సంపుటి వచ్చేవరకూ.అయిదో సంపుటి నాటి కైనా అందులో చోటు సంపాదించుకునే స్తాయి గలిగిన బ్లాగు టపా ఒక్కటైనా రాయగలనని నా ఆశ.మీకు,మీకు సహకరించిన వారందరికి నా అినందనలు.

 23. జ్యోతి said,

  చాలా బావుంది ప్రవీణ్. కంగ్రాట్యులేషన్స్. ప్రతి ఉగాదికి ఇలాటి కానుక ఇవ్వకూడదు నువ్వే. ప్రతి తెలుగు భాషాబిమానికి ఇవ్వగల మంచి బహుమతి ఇది.

 24. చాలా బావుంది ప్రవీణ్. కంగ్రాట్యులేషన్స్. ప్రతి ఉగాదికి ఇలాటి కానుక ఇవ్వకూడదు నువ్వే. ప్రతి తెలుగు భాషాబిమానికి ఇవ్వగల మంచి బహుమతి ఇది.

 25. చదువరి said,

  మంచి మంచి జాబులను ఏరి చక్కటి పుస్తకాన్ని కూర్చారు. ప్రవీణ్, మీకు నా అభినందనలు. చక్కటి పుస్తకానికి మహా చక్కటి అట్ట చేసిచ్చిన వీవెన్ కు కూడా నా అభినందనలు.

  అయితే.., ఒక్ఖ కవరుపేజీ తయారుచేసి, మీ శ్రమనంతా వీవెన్ దోచేసుకున్నారు. ఏదేమైనా మనం ముందు ముందు చెయ్యబోయే ఇలాంటి పనులకు అట్ట చేసిమ్మని వీవెన్ని అడక్కపోవటం ఉత్తమం! 🙂

 26. మంచి మంచి జాబులను ఏరి చక్కటి పుస్తకాన్ని కూర్చారు. ప్రవీణ్, మీకు నా అభినందనలు. చక్కటి పుస్తకానికి మహా చక్కటి అట్ట చేసిచ్చిన వీవెన్ కు కూడా నా అభినందనలు.అయితే.., ఒక్ఖ కవరుపేజీ తయారుచేసి, మీ శ్రమనంతా వీవెన్ దోచేసుకున్నారు. ఏదేమైనా మనం ముందు ముందు చెయ్యబోయే ఇలాంటి పనులకు అట్ట చేసిమ్మని వీవెన్ని అడక్కపోవటం ఉత్తమం! 🙂

 27. వికటకవి said,

  ప్రవీణ్,

  మంచి మొదటి ప్రయత్నం. ఫలితం కష్టానికి తగ్గట్టుగానే చాలా బాగుంది. కానీ విషయసూచిక నుంచి పేజీకి లింకులు నేరుగా ఎందుకు పనిచేయట్లేదు? నా యాడోబీలో లోపమా లేక మరేదైనానా? తలో చేయి వేసిన అందరికీ కృతజ్ఞతలు.

 28. ప్రవీణ్,మంచి మొదటి ప్రయత్నం. ఫలితం కష్టానికి తగ్గట్టుగానే చాలా బాగుంది. కానీ విషయసూచిక నుంచి పేజీకి లింకులు నేరుగా ఎందుకు పనిచేయట్లేదు? నా యాడోబీలో లోపమా లేక మరేదైనానా? తలో చేయి వేసిన అందరికీ కృతజ్ఞతలు.

 29. ప్రవీణ్ గార్లపాటి said,

  @ దిలీప్ గారు:

  అలాగే జరగాలని కోరుకుందాము. మీకు కృతజ్ఞతలు.

  @ రాజేంద్ర గారు:
  ఏమో మీ టపాలు ఉండే స్థాయికి ఈ పుస్తకమే ఎదగాలేమో. 🙂
  జోకులు ఆ పక్కన, మీరు చెప్పిన విషయం ఆలోచించ దగ్గది. దయచేసి మీ ఆలోచనలు పంచుకోగలరు ఈ విషయంలో.

  @ జ్యోతి గారు:
  జ్యోతి గారు. నాకూ చాలా సంతోషంగా ఉంది.
  ప్రతీ సారి నేనే చేస్తే నేను పొందిన లాంటి అందమయిన అనుభవం ఇతర జనాలకు కలుగదు కదా 🙂 సరదాకన్నా.
  ముందు ముందు కూడా చెయ్యడానికి నా కృషి తప్పకుండా ఉంటుంది.

  @ చదువరి గారు:
  వీవెన్‌ కి ఎన్ని అభినందనలు వచ్చినా నష్టం లేదు లెండి. ఆయన చేసిన వాటికి.
  ఎవరికొచ్చినా మనందరికే కదండీ. “మన” పుస్తకం అయినప్పుడు 🙂

  (Don’t Judge a book by its cover. అన్నారు. ఇక్కడ judge చెయ్యమని అడగాలేమో :P)

  @ వికటకవి గారు:
  ఏం చెప్పమంటారు లెండి. అదో పెద్ద అంతులేని కథ.
  ఇంకెప్పుడయినా కాఫీ తాగుతూ చెప్పుకుందాము 🙂

  తప్పు మీ సిస్టం లో కాదు, ఆ లోపం పుస్తకానిదే.

 30. @ దిలీప్ గారు:అలాగే జరగాలని కోరుకుందాము. మీకు కృతజ్ఞతలు.@ రాజేంద్ర గారు:ఏమో మీ టపాలు ఉండే స్థాయికి ఈ పుస్తకమే ఎదగాలేమో. :)జోకులు ఆ పక్కన, మీరు చెప్పిన విషయం ఆలోచించ దగ్గది. దయచేసి మీ ఆలోచనలు పంచుకోగలరు ఈ విషయంలో.@ జ్యోతి గారు:జ్యోతి గారు. నాకూ చాలా సంతోషంగా ఉంది.ప్రతీ సారి నేనే చేస్తే నేను పొందిన లాంటి అందమయిన అనుభవం ఇతర జనాలకు కలుగదు కదా 🙂 సరదాకన్నా.ముందు ముందు కూడా చెయ్యడానికి నా కృషి తప్పకుండా ఉంటుంది.@ చదువరి గారు:వీవెన్‌ కి ఎన్ని అభినందనలు వచ్చినా నష్టం లేదు లెండి. ఆయన చేసిన వాటికి.ఎవరికొచ్చినా మనందరికే కదండీ. “మన” పుస్తకం అయినప్పుడు :)(Don’t Judge a book by its cover. అన్నారు. ఇక్కడ judge చెయ్యమని అడగాలేమో :P)@ వికటకవి గారు:ఏం చెప్పమంటారు లెండి. అదో పెద్ద అంతులేని కథ.ఇంకెప్పుడయినా కాఫీ తాగుతూ చెప్పుకుందాము :)తప్పు మీ సిస్టం లో కాదు, ఆ లోపం పుస్తకానిదే.

 31. రవీంద్రనాధ్ గెడ్డం said,

  ప్రవీణ్ గారూ,
  బ్లాగుల పుస్తకం అనే మీ అలోచన అద్భుతం. ఫలితం కూడా అద్భుతంగా వుంది.మీకు నా అభినందనలు.

 32. ప్రవీణ్ గారూ,బ్లాగుల పుస్తకం అనే మీ అలోచన అద్భుతం. ఫలితం కూడా అద్భుతంగా వుంది.మీకు నా అభినందనలు.

 33. బ్లాగేశ్వరుడు said,

  really good effort

 34. really good effort

 35. రానారె said,

  రాజేంద్రగారన్నట్టు, … ముఖ్యంగా బ్లాగుల గీతకు ఆవల ఉన్నవారి దరికి చేర్చటం ఆన్న సంగతి మీద నిపుణులంతా దృష్టి కేంద్రీకరించాలి … ఈ పుస్తకం తయారీలో మీ లక్ష్యం అదే కదా!

 36. రాజేంద్రగారన్నట్టు, … ముఖ్యంగా బ్లాగుల గీతకు ఆవల ఉన్నవారి దరికి చేర్చటం ఆన్న సంగతి మీద నిపుణులంతా దృష్టి కేంద్రీకరించాలి … ఈ పుస్తకం తయారీలో మీ లక్ష్యం అదే కదా!

 37. నువ్వుశెట్టి బ్రదర్స్ said,

  ప్రవీణ్. ఏమని పొగడుదు నిన్ను. నిన్నటిదాకా మనకు ఆదిబ్లాగరు మాత్రమే ఉండేవారు. ఇప్పుడు ఆదిగ్రంధాన్ని రచించి చరిత్ర సృష్టించావు. కంగ్రాట్స్. ఈ యజ్ఞంలో నీకు సహాయపడిన వారందరికీ అభినందనలు 🙂

 38. ప్రవీణ్. ఏమని పొగడుదు నిన్ను. నిన్నటిదాకా మనకు ఆదిబ్లాగరు మాత్రమే ఉండేవారు. ఇప్పుడు ఆదిగ్రంధాన్ని రచించి చరిత్ర సృష్టించావు. కంగ్రాట్స్. ఈ యజ్ఞంలో నీకు సహాయపడిన వారందరికీ అభినందనలు 🙂

 39. Anonymous said,

  Really this book was excellent and covered the most of the very good articles in all areas. I know that it is not very eassy task. Lot of efforts and endurance required to create this type of free & usefull thing to the telugu people. If I speak frankly, current media, press & news papers has to feel shy and guilty after seeing this book. Most of news every day what ever I am seing is useless and spoling our tradition and youth. In think there are very good heart touching articles. If we bring this into hard copy and we display at colleages, libraries youth will not show intrest to read the stupid and vulgur news. Why should not release this book as a monthly magzine into the public?

 40. Anonymous said,

  Really this book was excellent and covered the most of the very good articles in all areas. I know that it is not very eassy task. Lot of efforts and endurance required to create this type of free & usefull thing to the telugu people. If I speak frankly, current media, press & news papers has to feel shy and guilty after seeing this book. Most of news every day what ever I am seing is useless and spoling our tradition and youth. In think there are very good heart touching articles. If we bring this into hard copy and we display at colleages, libraries youth will not show intrest to read the stupid and vulgur news. Why should not release this book as a monthly magzine into the public?

 41. కొత్త పాళీ said,

  ఛ్ఛాలా బావుంది ప్రవీణ్!
  ఇంక నా దగ్గర ఈమెయిల్ ఎడ్రసులున్న తెలుగు వళ్ళంతా ఐపోయారన్నమాటే!
  జనాల మెయిలు బాక్సులు ఈ పుస్తకంతో నింపే కార్యక్రమం ఈ పూటే మొదలు పెడతా!

 42. ఛ్ఛాలా బావుంది ప్రవీణ్!ఇంక నా దగ్గర ఈమెయిల్ ఎడ్రసులున్న తెలుగు వళ్ళంతా ఐపోయారన్నమాటే!జనాల మెయిలు బాక్సులు ఈ పుస్తకంతో నింపే కార్యక్రమం ఈ పూటే మొదలు పెడతా!

 43. Srinivas said,

  చక్కటి ప్రయత్నం.
  మీరు మర్చిపోయిన బ్లాగులలో “కలం కలలు” ఒకటి.

 44. Srinivas said,

  చక్కటి ప్రయత్నం. మీరు మర్చిపోయిన బ్లాగులలో “కలం కలలు” ఒకటి.

 45. ప్రవీణ్ గార్లపాటి said,

  @ రవీంద్ర గారు:

  నెనర్లు. మీకు నచ్చితే ఇతరులకూ పంపించగలరు.

  @ బ్లాగేశ్వరుడు గారు:

  🙂

  @ రానారె:

  అవును. ఇక దాని మీద దృష్టి సారించాలి. ఒక రోజు రెస్టు తీసుకుని ఆ పనిలో ఉందాము.

  @ నువ్వుశెట్టి బ్రదర్స్:

  హహహ… మీ ఆదరణ. మంచి టపాలు రాసి వచ్చే పుస్తకం ఇంతకంటే బాగా చేద్దాము. ఏమంటారు ?

  @ anonymous:

  most of what you said is right indeed. I would definitely encourage people who would like to print it to go ahead.
  A monthly collection of similar thing is already being done by poddu.
  You may check this for a sample.

  http://poddu.net/?p=549

  @ కొత్త పాళీ గారు:

  ఆసం… పుస్తకం మళ్ళీ నా వద్దకు వస్తుందన్నమాట 😉

  @ srinivas గారు:

  2008 బ్లాగు పుస్తకానికి ఏదో ఒక హైలైటు మిగలాలి కదండీ 🙂

 46. @ రవీంద్ర గారు:నెనర్లు. మీకు నచ్చితే ఇతరులకూ పంపించగలరు.@ బ్లాగేశ్వరుడు గారు::)@ రానారె:అవును. ఇక దాని మీద దృష్టి సారించాలి. ఒక రోజు రెస్టు తీసుకుని ఆ పనిలో ఉందాము.@ నువ్వుశెట్టి బ్రదర్స్:హహహ… మీ ఆదరణ. మంచి టపాలు రాసి వచ్చే పుస్తకం ఇంతకంటే బాగా చేద్దాము. ఏమంటారు ?@ anonymous:most of what you said is right indeed. I would definitely encourage people who would like to print it to go ahead.A monthly collection of similar thing is already being done by poddu.You may check this for a sample.http://poddu.net/?p=549@ కొత్త పాళీ గారు:ఆసం… పుస్తకం మళ్ళీ నా వద్దకు వస్తుందన్నమాట ;)@ srinivas గారు:2008 బ్లాగు పుస్తకానికి ఏదో ఒక హైలైటు మిగలాలి కదండీ 🙂

 47. రవి said,

  మీ టపా చూడగానే విపరీతమైన ఎక్సైట్మెంట్. దానికి తోడు, ఇక్కడ ఇంటర్నెట్ పిచ్చ స్లో. గంట నుండీ ప్రయత్నించి ఇప్పటికి దింపుకున్నాను. పుస్తకం ఎప్పుడైనా చదవచ్చు కానీ, కామెంట్ మాత్రం ఇప్పుడే రాయాలి.

  నాకు తెలిసి ప్రవీణ్ ఒక్కడే ఇలాంటి పని చేయగలడు అనిపించింది.

  బ్లాగు మిత్రులందరూ ఈ మాట ఒప్పుకుంటారనుకుంటా.

  ఇర్ర్ ర్ర్ ర్ర్ ర్ర్ ర్రగదీశారు. మీరే కాదు., అందరూనూ. అంటే వీవెన్, కొత్త పాళీ వగైరా వగైరా..

 48. రవి said,

  మీ టపా చూడగానే విపరీతమైన ఎక్సైట్మెంట్. దానికి తోడు, ఇక్కడ ఇంటర్నెట్ పిచ్చ స్లో. గంట నుండీ ప్రయత్నించి ఇప్పటికి దింపుకున్నాను. పుస్తకం ఎప్పుడైనా చదవచ్చు కానీ, కామెంట్ మాత్రం ఇప్పుడే రాయాలి. నాకు తెలిసి ప్రవీణ్ ఒక్కడే ఇలాంటి పని చేయగలడు అనిపించింది.బ్లాగు మిత్రులందరూ ఈ మాట ఒప్పుకుంటారనుకుంటా. ఇర్ర్ ర్ర్ ర్ర్ ర్ర్ ర్రగదీశారు. మీరే కాదు., అందరూనూ. అంటే వీవెన్, కొత్త పాళీ వగైరా వగైరా..

 49. నాగరాజా said,

  ప్రవీణ్ -మీకూ, ప్రాజెక్టు బృందానికి కంగ్రాట్స్. నిజంగా గొప్ప కార్యాన్ని సాధించారు.

 50. ప్రవీణ్ -మీకూ, ప్రాజెక్టు బృందానికి కంగ్రాట్స్. నిజంగా గొప్ప కార్యాన్ని సాధించారు.

 51. స్మైల్ said,

  ప్రవీణ్ ఇంత చక్కని పుస్తకాన్ని అందించి నా మరో కోరికను తీర్చినందుకు కూడా నీకు నెనర్లు! అదేంటంటే ఐఫోనులో తెలుగు భ్లాగులను చదవడం. ఒక్క కొరత మిగిలిపోయింది అది నా టపా ఈ పుస్తకంలో చదవలేకపోవడం.

 52. ప్రవీణ్ ఇంత చక్కని పుస్తకాన్ని అందించి నా మరో కోరికను తీర్చినందుకు కూడా నీకు నెనర్లు! అదేంటంటే ఐఫోనులో తెలుగు భ్లాగులను చదవడం. ఒక్క కొరత మిగిలిపోయింది అది నా టపా ఈ పుస్తకంలో చదవలేకపోవడం.

 53. This comment has been removed by the author.

 54. రాధిక said,

  చిరంజీవి పార్టీ లా,నేటి మన సినిమాల్లా వాయిదాపడకుండా అన్న రోజుకి పుస్తకాన్ని రిలీజు చెయ్యడం చూసి చాలా సంతోషం అనిపించింది.పుస్తకం అద్భుతం గా వుంది.నిజం చెప్పొద్దూ ముఖ చిత్రం దగ్గరే అర్ధగంట ఆగిపోయా.ఈ పుస్తకాన్ని అచ్చులో చూడాలని ఆశపడుతున్నాను:)

 55. చిరంజీవి పార్టీ లా,నేటి మన సినిమాల్లా వాయిదాపడకుండా అన్న రోజుకి పుస్తకాన్ని రిలీజు చెయ్యడం చూసి చాలా సంతోషం అనిపించింది.పుస్తకం అద్భుతం గా వుంది.నిజం చెప్పొద్దూ ముఖ చిత్రం దగ్గరే అర్ధగంట ఆగిపోయా.ఈ పుస్తకాన్ని అచ్చులో చూడాలని ఆశపడుతున్నాను:)

 56. ప్రవీణ్ గార్లపాటి said,

  రవి గారు:
  బాగా ఎత్తేసారు 🙂
  మీ ఎక్సైట్మెంట్ చూస్తే చాలా ఆనందం కలిగింది. ఇతర తెలుగు మిత్రులకు కూడా పుస్తకం చూపించగలరు.

  @నాగరాజా గారు:
  నెనర్లు.

  @ఇస్మాయిల్ గారు:
  పోనీ లెండి. ఈ పుస్తకం మీ లాంటి వారికి కొలబద్ద కాదు. మీరు ఆ స్టాండర్డ్స్ స్థాపించాల్సిన వారు 🙂

  @రాధిక గారు:
  భలే చమత్కారాలు 🙂
  ఏంటి అప్పుడే ఈ ముఖచిత్రం ఏ కవితకన్నా పనికొస్తుందేమో అని ఆలోచించేస్తున్నారా ? ఆయ్ఁ…

 57. రవి గారు:బాగా ఎత్తేసారు :)మీ ఎక్సైట్మెంట్ చూస్తే చాలా ఆనందం కలిగింది. ఇతర తెలుగు మిత్రులకు కూడా పుస్తకం చూపించగలరు.@నాగరాజా గారు:నెనర్లు.@ఇస్మాయిల్ గారు:పోనీ లెండి. ఈ పుస్తకం మీ లాంటి వారికి కొలబద్ద కాదు. మీరు ఆ స్టాండర్డ్స్ స్థాపించాల్సిన వారు :)@రాధిక గారు:భలే చమత్కారాలు :)ఏంటి అప్పుడే ఈ ముఖచిత్రం ఏ కవితకన్నా పనికొస్తుందేమో అని ఆలోచించేస్తున్నారా ? ఆయ్ఁ…

 58. రవి said,

  బ్లాగు పుస్తకం చదివాను, చదువుతున్నాను. (చదివిస్తున్నాను కూడా, మా తెలుగు మిత్రులతో). దాచుకుని చదవాల్సిన పుస్తకం.

  వచ్చే సారి బ్లాగు పుస్తకం ఇంకొంచెం లావుగా, ఇంకా అందమైన టపాలతో రావాలి.

  ఇందుకు కొన్ని ఆలోచనలు.

  1. గౌతం ని ఎలాగైనా ఒప్పించి మరిన్ని టపా(కాయ)లు రాయించాలి.
  2. విహారి గారు అప్పుడప్పుడు సిక్సర్లు బాదుతున్నారు. మరిన్ని ఒన్స్ మోర్ లు కావాలి.
  3. హాస్యం, కవిత, కథ, వగైరా వగైరా..ఆఖర్న మిస్ అయిన కొంత మంది ప్రముఖ బ్లాగర్ల కోసం ఓ కాటగిరీ. కనుమూరి జాన్ హైడ్ గారూ, నాగమురళి గారూ (ఆయన తిథుల టపా) మిస్ అయారా అని ఓ డవుటు.
  4. ఎక్కడైతే (ఏయే విషయాలలో) , మనకు కొరత వుందో, వాటిని గుర్తించి, ప్రోత్సహించాలి.
  5. జ్యోతి గారు పొద్దు సంపాదకీయానికి తిరుగు జవాబిస్తూ, మహిళలకు ఓక పేజీ కేటాయించమని కోరారు. ఇక్కడా మనం ఆ పద్ధతి పాటించవచ్చునేమో.
  6. తెలుగు సామెతలు, పండుగల గురించిన చర్చ, లేదా మంచి టపాలు, లేదా మంచి అనుభవాలు…ఇలా తెలుగుదనం ప్రతిబింబించే టపాలు యేవైనా మనం ఓ గుర్తింపు తీసుకు రావాలి.
  7. ముఖ్యంగా ఓ సంపాదక వర్గం ఉంటే మంచిదేమో.

  ఇంకా మరిన్ని…ఇంకా ఆలొచిస్తే మరిన్ని తడతాయి.

  మీ గూగుల్ గుంపు మళ్ళీ పని చేయడం మొదలెడితే, ఓ టపా పెట్టండి. నేనూ జాయిన్ అవుతాను. (అంత సీను నాకు వుంటే :-))

 59. రవి said,

  బ్లాగు పుస్తకం చదివాను, చదువుతున్నాను. (చదివిస్తున్నాను కూడా, మా తెలుగు మిత్రులతో). దాచుకుని చదవాల్సిన పుస్తకం.వచ్చే సారి బ్లాగు పుస్తకం ఇంకొంచెం లావుగా, ఇంకా అందమైన టపాలతో రావాలి.ఇందుకు కొన్ని ఆలోచనలు. 1. గౌతం ని ఎలాగైనా ఒప్పించి మరిన్ని టపా(కాయ)లు రాయించాలి.2. విహారి గారు అప్పుడప్పుడు సిక్సర్లు బాదుతున్నారు. మరిన్ని ఒన్స్ మోర్ లు కావాలి.3. హాస్యం, కవిత, కథ, వగైరా వగైరా..ఆఖర్న మిస్ అయిన కొంత మంది ప్రముఖ బ్లాగర్ల కోసం ఓ కాటగిరీ. కనుమూరి జాన్ హైడ్ గారూ, నాగమురళి గారూ (ఆయన తిథుల టపా) మిస్ అయారా అని ఓ డవుటు.4. ఎక్కడైతే (ఏయే విషయాలలో) , మనకు కొరత వుందో, వాటిని గుర్తించి, ప్రోత్సహించాలి.5. జ్యోతి గారు పొద్దు సంపాదకీయానికి తిరుగు జవాబిస్తూ, మహిళలకు ఓక పేజీ కేటాయించమని కోరారు. ఇక్కడా మనం ఆ పద్ధతి పాటించవచ్చునేమో.6. తెలుగు సామెతలు, పండుగల గురించిన చర్చ, లేదా మంచి టపాలు, లేదా మంచి అనుభవాలు…ఇలా తెలుగుదనం ప్రతిబింబించే టపాలు యేవైనా మనం ఓ గుర్తింపు తీసుకు రావాలి.7. ముఖ్యంగా ఓ సంపాదక వర్గం ఉంటే మంచిదేమో.ఇంకా మరిన్ని…ఇంకా ఆలొచిస్తే మరిన్ని తడతాయి. మీ గూగుల్ గుంపు మళ్ళీ పని చేయడం మొదలెడితే, ఓ టపా పెట్టండి. నేనూ జాయిన్ అవుతాను. (అంత సీను నాకు వుంటే :-))

 60. teluGODU said,

  telugu blog book was really a good idea andi.. any plans to publish the book?
  praveen

 61. teluGODU said,

  telugu blog book was really a good idea andi.. any plans to publish the book?praveen


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: