ఏప్రిల్ 18, 2008

మీరు సినిమాలు చూస్తారా ? అయితే మీరే టైపో ?

Posted in వర్గాలు, సరదా, సినిమా, హాస్యం వద్ద 5:27 సా. ద్వారా Praveen Garlapati

సినిమాలు చూసేవారు రకరకాలు. సరదాకి వారిని విశ్లేషిస్తే అన్న ఆలోచన వచ్చింది నాకు.
ఇక చూసుకోండి మీరెందులో ఇముడుతారో ?

సినిమా సినిమానే:

వీరు అందరి కంటే ఎక్కువగా సినిమాలను ఎంజాయ్ చేస్తారేమో. సినిమా అంటే వీరికి ఒక వినోద సాధనం. అంతే. అంతకన్నా అందులో లాజిక్కులు పట్టవు, కథ ఉందా ? వేల మందిని ఆలోచింపచేస్తుందా ? అసలు సినిమా తీయడానికి దర్శకుడికి ఒక కారణం ఉందా ? లాంటి ప్రశ్నలు వీరిని వేధించవు.

కావలసినంత వినోదం ఉందా, డాన్సులు కత్తిలా ఉన్నాయా, హీరోయిను బాగా చూపించిందా, హీరో వంద మందిని ఇరగదీసాడా, నాలుగు పంచి, మాసు డయిలాగులు చెప్పాడా ?
వీరు సినిమాని చక్కగా ఆనందించేస్తారు.

కృష్ణ, శివాజీ లాంటి సినిమాలు చూసినా వీరు దానిని హిట్టనగలరు. సుఖ పురుషులు.
ఓ తమిళమ్మాయిని/మళయాళమమ్మాయిని పెట్టి, దానిని ఒసే, ఏమే, నీకు పొగరే… అని పిలిపిస్తే ఉంటుంది నా సామిరంగా.

పాతొక వింత కొత్తొక రోత:

వీరు పురాతన కాలంలో మాత్రమే నివసిస్తుంటారు. వీరికి సినిమా అంటే పాత సినిమాలు మాత్రమే. కొత్త సినిమా బాగుందని వీరికి చెప్పండి. ఛా! అలా కుదరదు అని అనేస్తారు.

ఆహా! మిస్సమ్మ, గుండమ్మ కథ, రాముడు భీముడు. మిగతావన్నీ అసలు సినిమాలేనా ?

సినిమాలు వివిధ రకాలు, కాలంతో పాటు అవి తీసే తీరు మారతాయని వీరికి చెప్పండి. ఊహూ…
నే పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు.

ఓల్డ్ ఈజ్ గోల్డ్ ! అని మాత్రమే వీరికి తెలుసు. కాలంతో పాటు మార్పులని వీరు అందుకోలేరు. వీరి కాలం వీరిదే.

లాహిరి లాహిరి లాహిరిలో… ఉండండి ఎక్కడో మాయాబజారు వస్తున్నట్టుంది.

ఏవీ మంచి సినిమాలు ?

ఇంగ్లీషా ? తెలుగా ? హిందీనా ? ఏదయితే నాకే మంచి సినిమానా ? నేను చూస్తాను.
వీరు ఈ రకం. భాష గానీ, కాలం గానీ, మార్పు గానీ వీరికి అడ్డంకి కాదు.

వీరికి కావలసిందల్లా ఒక మంచి సినిమా. సరయిన కథ, మంచి నటన, దర్శకత్వం, కెమేరా పనితనం ఉన్నాయా ? అయితే ఆ సినిమా చూసి తీరాల్సిందే.

ఐఎం డీబీ టాప్ 250 లిస్టులు, రాటెన్ టొమేటోస్ బెస్టాఫ్ లిస్టులూ వీరి పట్టుగొమ్మలు.

మంచి సినిమా రాగానే టారెంట్లు వెతకడం వీరు చేసే మొదటి పని, ఎందుకంటే అన్ని సినిమాలూ థియేటర్లో చూడలేము కదా !

ఓ ఇవాళ ఆదివారం కదూ, నేను రోడ్డు పక్కన డీవీడీల వేట మొదలెట్టాలి. ఇక ఉంటాను.

నా భాషా ?

సినిమా నా భాషా కాదా ?

వేరేదయినా అయితే ఆ… అప్పుడే ఆవలింతలొచ్చేస్తున్నాయేంటి ?

హు. జనాలకి అసలు మన భాషంటే ఇష్టం పోయింది. చక్కగా డయిలాగులూ అవీ అర్థమవుతుంటే ఇవి చూడక వచ్చీ రాని ఇంగ్లీషు, చైనీసు ఎందుకో ? ఏమి చెప్తాము ? అని వాపోతుంటారు.

శనివారం, ఆదివారం మా టీవీ, ఈ టీవీ, జెమిని, తేజ ఎప్పుడు ఎందులో ఏ సినిమా వేసినా, ఖాళీగా ఉంటే ఆ సినిమా చూడాల్సిందే.

అరె! ఇక్కడేదో “పోరంబోకు పెంట నాయాల” సినిమా మొదలయింది. తర్వాత మాట్లాడుకుందాం.

క్రిటిక్ని/విశ్లేషకుణ్ణి మాత్రమే నేను:

సినిమాలో కెమేరా ఏ కోణంలో పెట్టి తీసాడు ? అసలు లైటింగు ఈ కాంతిలో మాత్రమే ఎందుకుంది ?
దర్శకుడు ఈ సీను ఇలా ఎందుకు తీసాడు ? ఇలా తీస్తే బాగుండేదే ?

ఎబ్బే… ఈ హీరో అసలు సుమోలని గాలిలో ఎగరెయ్యడం ఏమీ బాగోలేదు. ఏమన్నా నాచురాలిటీ ఉందా అందులో ?

సినిమా అన్నాక నిజానికి దగ్గరలో ఉండొద్దూ. ఒక క్లాసికల్ టచ్ ఉండొద్దూ. దర్శకుడి ప్రతిభ, కెమెరా పనితనం కనబడొద్దూ ?

రోషొమోన్ , సెవెన్ సమురాయ్, గాడ్ ఫాదర్ చూడు. అవీ అసలు సినిమాలంటే.

ఈ జనాలకు అసలు టేస్టు లేకుండా పోతుంది. ఏ చెత్త సినిమా మొహాన పడేయి చూసేస్తారు. నాలుగు పాటలు, ఆరు ఫైట్లు, ఓ ప్రేమ కథ వీళ్ళ మొహాన పడేయి. సినిమాని సూపరు హిట్టు చేసేస్తారు. ఇలాగయితే అయినట్లే. మన *లీవుడ్, హాలీవుడ్ గట్రాని అందుకునేదెప్పుడు అని ఓ మథన పడిపోతారు.

వీరు సినిమాని సరిగా ఆనందించలేరేమో కూడాను అనిపిస్తుంది. అంత తీక్షణంగా గమనిస్తే సినిమా బదులు సీన్లు మాత్రమే కనిపిస్తాయేమో ?

అన్నట్టు గురూ ఎక్కడయినా “సైకో” కలెక్టర్సు ఎడిషను దొరుకుతుందా ?

ఇక ఆఖరు

నా సినిమా హీరో, ఆహా ఓహో …:

వీరి గురించి ప్రత్యేకంగా ఏమీ చెప్పక్కర్లేదు.

మన అభిమాన సినిమా హీరో నటించాడా ? అయితే జల్సా కూడా సల్సానే.
*రెడ్డి, *నాయుడు అన్నీ అద్భుతమయిన కళాఖండాలు. ఈ హీరో తప్ప ఇంకెవరూ ఏ కాలంలోనూ వేయలేని కారెక్టర్లు.

అరె… బ్లాగులలో కూడా నా హీరో అభిమాన సంఘాలున్నాయా ? నేను వెంటనే అందులో చేరిపోవాలి.
జై ఫలానా! జై జై ఫలానా !!

రే ఎవడ్రా అక్కడ నా అభిమాన హీరో సినిమా బాగాలేదని రాసింది. వేలి గోటితో నరికేస్తా….

22 వ్యాఖ్యలు »

 1. మాకినేని ప్రదీపు said,

  నేను “ఏవీ మంచి సినిమాలు ?” క్లబ్బులో చేరటానికి సరిగ్గా సరిపోతాను.

 2. నేను “ఏవీ మంచి సినిమాలు ?” క్లబ్బులో చేరటానికి సరిగ్గా సరిపోతాను.

 3. కొత్త పాళీ said,

  విహారికి కాంపిటీషను పెరిగిపోతోంది.
  ఆ మధ్య హీరోల డాన్సు స్టెప్పుల్ని యెనలైజు చేసినట్టు ఇప్పుడు వీక్షకుల మీదికి తిప్పారా?
  నవ్వలేక చచ్చాను.
  ప్రతీ వర్గంలోనూ చివరి టేగ్ లైను హైలైటు.

  అన్నట్టు ఇంకో వర్గం కూడా ఉంది నాకు తెలిసి. అతిపురాతన యుగం. వీళ్ళు హెచ్చెం రెడ్డి, గూడవల్లి రామబ్రహ్మం ల తరువాతి సినిమాలు చూడరు.

 4. విహారికి కాంపిటీషను పెరిగిపోతోంది.ఆ మధ్య హీరోల డాన్సు స్టెప్పుల్ని యెనలైజు చేసినట్టు ఇప్పుడు వీక్షకుల మీదికి తిప్పారా?నవ్వలేక చచ్చాను.ప్రతీ వర్గంలోనూ చివరి టేగ్ లైను హైలైటు.అన్నట్టు ఇంకో వర్గం కూడా ఉంది నాకు తెలిసి. అతిపురాతన యుగం. వీళ్ళు హెచ్చెం రెడ్డి, గూడవల్లి రామబ్రహ్మం ల తరువాతి సినిమాలు చూడరు.

 5. Padma I. said,

  “అన్నట్టు ఇంకో వర్గం కూడా ఉంది నాకు తెలిసి. అతిపురాతన యుగం. వీళ్ళు హెచ్చెం రెడ్డి, గూడవల్లి రామబ్రహ్మం ల తరువాతి సినిమాలు చూడరు. “

  :- ) ఇలాంటివాళ్లు నాకు కనీసం ఒకరైనా తెలుసు. :- )
  btw, భలే విశ్లేషించారండీ ప్రదీప్ గారు!

 6. Padma I. said,

  “అన్నట్టు ఇంకో వర్గం కూడా ఉంది నాకు తెలిసి. అతిపురాతన యుగం. వీళ్ళు హెచ్చెం రెడ్డి, గూడవల్లి రామబ్రహ్మం ల తరువాతి సినిమాలు చూడరు. “:- ) ఇలాంటివాళ్లు నాకు కనీసం ఒకరైనా తెలుసు. :- )btw, భలే విశ్లేషించారండీ ప్రదీప్ గారు!

 7. సత్యసాయి కొవ్వలి said,

  నా భాషా టైపనుకుంటా నేను. అన్ని ఛానెల్సూ వరుసగా తిప్పేస్తూ అష్టావధానంలో లాగా ఒకేసారి 4-5 సినిమాలు చూసేస్తోంటా.
  టపా సూపరు. 100 డేస్ :))

 8. నా భాషా టైపనుకుంటా నేను. అన్ని ఛానెల్సూ వరుసగా తిప్పేస్తూ అష్టావధానంలో లాగా ఒకేసారి 4-5 సినిమాలు చూసేస్తోంటా. టపా సూపరు. 100 డేస్ :))

 9. KK said,

  వీటిలో దాదాపు అన్ని కాటగిరీలు మారి చివరికి “తెలుగు లో మంచి సినిమాలు రావు” అనే కాటగిరీ లొ ఉన్నా ప్రస్తుతం 🙂 మంచి టపా!

 10. KK said,

  వీటిలో దాదాపు అన్ని కాటగిరీలు మారి చివరికి “తెలుగు లో మంచి సినిమాలు రావు” అనే కాటగిరీ లొ ఉన్నా ప్రస్తుతం 🙂 మంచి టపా!

 11. డా.స్మైల్ said,

  ప్రవీణ్…
  టపా అదిరింది. ఈ మధ్య మన బ్లాగుల్లో తెలుగు సినిమాలపై ఒకటే విరుచుకుపడుతున్నారు. కానీ ఇలా బాధపడిపోయే వారందరూ ‘పా.వి.కొ.రో’ కానీ ‘క్రి/వి.మా.నే’ కేటగిరీకి చెందిన వారు. ఇక మన ప్రజల్లో గణనీయ శాతం ‘సి.సి’ కి చెందిన వారే. అందుకే ఎలాంటి సినిమాలైనా అలా హిట్టయిపోతున్నాయి. అందుకు మనం బాధపడి ప్రయోజనం లేదు. ఎవడి ఆనందం వాడిది:-) ఇక నా వరకూ వస్తే నా మూడ్ బట్టి అన్ని కేటగిరీలు నావే!

 12. ప్రవీణ్…టపా అదిరింది. ఈ మధ్య మన బ్లాగుల్లో తెలుగు సినిమాలపై ఒకటే విరుచుకుపడుతున్నారు. కానీ ఇలా బాధపడిపోయే వారందరూ ‘పా.వి.కొ.రో’ కానీ ‘క్రి/వి.మా.నే’ కేటగిరీకి చెందిన వారు. ఇక మన ప్రజల్లో గణనీయ శాతం ‘సి.సి’ కి చెందిన వారే. అందుకే ఎలాంటి సినిమాలైనా అలా హిట్టయిపోతున్నాయి. అందుకు మనం బాధపడి ప్రయోజనం లేదు. ఎవడి ఆనందం వాడిది:-) ఇక నా వరకూ వస్తే నా మూడ్ బట్టి అన్ని కేటగిరీలు నావే!

 13. చదువరి said,

  ఓ సందేహం..
  వచ్చే ప్రతి సినిమానీ చూసి డోక్కునేవారు, డోక్కుంటూనే వచ్చే ప్రతి సినిమానీ చూసేవాళ్ళదే వర్గం? (పాపం.. సమీక్షకులనవచ్చేమో!)

 14. ఓ సందేహం..వచ్చే ప్రతి సినిమానీ చూసి డోక్కునేవారు, డోక్కుంటూనే వచ్చే ప్రతి సినిమానీ చూసేవాళ్ళదే వర్గం? (పాపం.. సమీక్షకులనవచ్చేమో!)

 15. ప్రవీణ్ గార్లపాటి said,

  @ ప్రదీపు:

  అవును. ఆ వర్గంలో మీరు సరిగ్గా సరిపోతారు.

  @ కొత్త పాళీ గారు:

  అనాలసిస్సులు చక్కగా చెయ్యగలం కదా. ఏం చేసినా చెయ్యలేకపోయినా.
  మీరు చెప్పిన వారిని కూడా పాతొక వింత వర్గంలోకి తోసేస్తే సరి.

  @ padma గారు:

  నాకూ తెలిసినట్టే ఉంది. మీరనుకుంటున్న వారూ నేనూ ఒకరేనేమో.
  విశ్లేషణ నచ్చినందుకు సంతోషం. btw నేను ప్రవీణ్ ని అండీ 🙂

  @ కొవ్వలి గారు:

  అబ్బో ఈ వర్గంతో చాలా తిప్పలండీ బాబూ.
  మా నాన్నగారు కూడా ఇదే వర్గం. ఆయన దగ్గర నుండి రిమోటు లాక్కోవాలంటే తల ప్రాణం తోకకొస్తుంది.

  @ kk గారు:

  హు… ఏమి చేస్తాం.
  నేను “ఏవీ మంచి సినిమాలు ?” వర్గంలో ఉన్నా ప్రస్తుతం.

  @ డాక్టరు గారు:

  అవును. మన వాళ్ళెక్కువ సి.సి నే.
  ఎవరినీ తప్పు పట్టలేము. ఎవరి ఆనందం వారిది.

  @ చదువరి గారు:

  అలాంటి వర్గమూ ఉందీ… సరే సరి.

 16. @ ప్రదీపు:అవును. ఆ వర్గంలో మీరు సరిగ్గా సరిపోతారు.@ కొత్త పాళీ గారు:అనాలసిస్సులు చక్కగా చెయ్యగలం కదా. ఏం చేసినా చెయ్యలేకపోయినా.మీరు చెప్పిన వారిని కూడా పాతొక వింత వర్గంలోకి తోసేస్తే సరి.@ padma గారు:నాకూ తెలిసినట్టే ఉంది. మీరనుకుంటున్న వారూ నేనూ ఒకరేనేమో.విశ్లేషణ నచ్చినందుకు సంతోషం. btw నేను ప్రవీణ్ ని అండీ :)@ కొవ్వలి గారు:అబ్బో ఈ వర్గంతో చాలా తిప్పలండీ బాబూ.మా నాన్నగారు కూడా ఇదే వర్గం. ఆయన దగ్గర నుండి రిమోటు లాక్కోవాలంటే తల ప్రాణం తోకకొస్తుంది.@ kk గారు:హు… ఏమి చేస్తాం. నేను “ఏవీ మంచి సినిమాలు ?” వర్గంలో ఉన్నా ప్రస్తుతం.@ డాక్టరు గారు:అవును. మన వాళ్ళెక్కువ సి.సి నే. ఎవరినీ తప్పు పట్టలేము. ఎవరి ఆనందం వారిది.@ చదువరి గారు:అలాంటి వర్గమూ ఉందీ… సరే సరి.

 17. Sreenivas Paruchuri said,

  కొత్తపాళీగారిలా అన్నారు:
  <<<"అన్నట్టు ఇంకో వర్గం కూడా ఉంది నాకు తెలిసి.
  అతిపురాతన యుగం. వీళ్ళు హెచ్చెం రెడ్డి, గూడవల్ రామబ్రహ్మం ల తరువాతి సినిమాలు చూడరు. “>>>

  మహాశయా! మీకు తెలియదేమో! దానిపైన ఇంకో పురాత్న/సనాతన వర్గముంది. నచ్చని వాళ్ళని విసిరికొట్టి, ఎగతాళి చేసేది/చేసింది. అలాగే పైన చెప్పిన యిద్దర్నీ కూడా తీవ్రంగా విమర్శించిన వర్గం. కావల్సిన యెడల మరింత Data, మరియు రిఫరెన్సులు యివ్వబడును.

  padma.i గారు:
  మీ వూళ్ళోనే 1945-48 ప్రాంతం తర్వాత తెలుగు సినిమా తెలియని వ్యక్తి వున్నారు. ఆయనకు నాగయ్య తర్వాతి పాటలు కూడా తెలియవు. మనిద్దరికీ పరిచయమున్న మరో పెద్ద మనిషి కోరితే ఒక దశాబ్దం క్రితం అలాంటి పాత పాటలు టేపుల మీదకెక్కించి సరఫరా చేయడం జరిగింది.

  పోతే, H. M రెడ్డి అంటే అతి పురాతనమయిన అన్న వ్యంగ్యం ధ్వనించేట్లు మాట్లాడుతున్నారు మీరు. ఆయన 1956 వరకు సినిమా రంగంలో వున్నాడు. అంటే, మీ దృష్టిలో “పాతాళభైరవి” లు, “మల్లీశ్వరి”లు, … కూడా *అతి పురాతన* మయినవనా?

  ఏదయినా ఇలాంటి విశ్లేషణతో చారిత్రాత్మకంగా చాలా యిబ్బందులున్నాయి. సరదాగా అప్పటికఫ్ఫుడు చదువుకుని నవ్వుకోవడం వరకు మాత్రం బానే వుంటాయి.

  భవదీయుడు,
  పరుచూరి శ్రీనివాస్

 18. కొత్తపాళీగారిలా అన్నారు:<<<"అన్నట్టు ఇంకో వర్గం కూడా ఉంది నాకు తెలిసి. అతిపురాతన యుగం. వీళ్ళు హెచ్చెం రెడ్డి, గూడవల్ రామబ్రహ్మం ల తరువాతి సినిమాలు చూడరు. “>>>మహాశయా! మీకు తెలియదేమో! దానిపైన ఇంకో పురాత్న/సనాతన వర్గముంది. నచ్చని వాళ్ళని విసిరికొట్టి, ఎగతాళి చేసేది/చేసింది. అలాగే పైన చెప్పిన యిద్దర్నీ కూడా తీవ్రంగా విమర్శించిన వర్గం. కావల్సిన యెడల మరింత Data, మరియు రిఫరెన్సులు యివ్వబడును.padma.i గారు: మీ వూళ్ళోనే 1945-48 ప్రాంతం తర్వాత తెలుగు సినిమా తెలియని వ్యక్తి వున్నారు. ఆయనకు నాగయ్య తర్వాతి పాటలు కూడా తెలియవు. మనిద్దరికీ పరిచయమున్న మరో పెద్ద మనిషి కోరితే ఒక దశాబ్దం క్రితం అలాంటి పాత పాటలు టేపుల మీదకెక్కించి సరఫరా చేయడం జరిగింది.పోతే, H. M రెడ్డి అంటే అతి పురాతనమయిన అన్న వ్యంగ్యం ధ్వనించేట్లు మాట్లాడుతున్నారు మీరు. ఆయన 1956 వరకు సినిమా రంగంలో వున్నాడు. అంటే, మీ దృష్టిలో “పాతాళభైరవి” లు, “మల్లీశ్వరి”లు, … కూడా *అతి పురాతన* మయినవనా?ఏదయినా ఇలాంటి విశ్లేషణతో చారిత్రాత్మకంగా చాలా యిబ్బందులున్నాయి. సరదాగా అప్పటికఫ్ఫుడు చదువుకుని నవ్వుకోవడం వరకు మాత్రం బానే వుంటాయి.భవదీయుడు,పరుచూరి శ్రీనివాస్

 19. రవి said,

  5 % సి + 5 % పా+ 70 % ఏ + 0 నా + 20 % క్రి+ 0 నా … నేను ఈ కాటగిరీ గాణ్ణి. అడ్డు చెప్పావో గొంతు నులుముతా…

  ప్రవీణ్, మీ బ్లాగు లే అవుట్ లో ఓ చిన్న దోషం. కామెంట్, ఓల్డ్ టపాలు రెండూ, అలుక్కు పోయి వున్నాయి. ఒకటి నొక్కితే ఇంకొకటి వస్తున్నది.

  నేను వాడుతున్నది ముష్టి మైక్రొసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరరు…

 20. రవి said,

  5 % సి + 5 % పా+ 70 % ఏ + 0 నా + 20 % క్రి+ 0 నా … నేను ఈ కాటగిరీ గాణ్ణి. అడ్డు చెప్పావో గొంతు నులుముతా…ప్రవీణ్, మీ బ్లాగు లే అవుట్ లో ఓ చిన్న దోషం. కామెంట్, ఓల్డ్ టపాలు రెండూ, అలుక్కు పోయి వున్నాయి. ఒకటి నొక్కితే ఇంకొకటి వస్తున్నది.నేను వాడుతున్నది ముష్టి మైక్రొసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరరు…

 21. ప్రవీణ్ గార్లపాటి said,

  రవి,

  అవునా ? నేను విండోస్ లోకి వెళ్ళి చాలా రోజులవుతోంది 🙂
  బూటయిన వెంటనే చూస్తాను.

  మన బద్దకం కాటగిరీ పేరు నిలబెట్టొద్దూ ?? 😉

 22. రవి,అవునా ? నేను విండోస్ లోకి వెళ్ళి చాలా రోజులవుతోంది 🙂 బూటయిన వెంటనే చూస్తాను.మన బద్దకం కాటగిరీ పేరు నిలబెట్టొద్దూ ?? 😉


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: