ఏప్రిల్ 25, 2008

కుబుంటు హార్డీ హెరాన్ …

Posted in ఉబుంటు, కుబుంటు, టెక్నాలజీ, లినక్సు వద్ద 5:26 సా. ద్వారా Praveen Garlapati

ఉబుంటు/కుబుంటు మరో సరికొత్త రిలీజుతో ఆకట్టుకుంది. సరికొత్తగా విడుదలయిన రిలీజు పేరు “హార్డీ హెరాన్“.

ఉబుంటు/కుబుంటు గురించి తెలియని వారికి, ఇది ఒక లినక్సు డిస్ట్రిబ్యూషను. డెబియన్ డిస్ట్రిబ్యూషను నుంచి వచ్చినది. ప్రతీ ఆరు నెలల రిలీజుతో “యూజబిలిటీ” మీద ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తూ దూసుకుపోయే ఒక మంచి డిస్ట్రిబ్యూషను ఇది.
గత కొద్ది ఏళ్ళుగా డేస్క్‌టాప్ పైన విండోసుకి బలమయిన ఉచిత ప్రత్యామ్నాయంగా ఎదిగిన ఆపరేటింగ్ సిస్టం ఇది.

అన్నట్టు ఇది ఒక ఎల్టీఎస్ (Long Term Support) రిలీజు. అంటే ఒక మూడేళ్ళ వరకూ సపోర్టు ఉండే రిలీజన్నమాట. అదీ ఉబుంటు సమస్యలను ఎంత తొందరగా పరిష్కరిస్తుందో వాడిన వారందరికీ తెలిసే ఉంటుంది.

ఈ రిలీజుతో పాటు ఎన్నో చక్కని ఫీచర్లు వచ్చాయి. కొన్ని ఈ కింద.

అన్నిటికన్నా నాకు బాగా నచ్చింది

వుబీ ఇంస్టాలర్: ఎందుకంటారా ? దీని ద్వారా ఇప్పుడు విండోసులోనే ఉబుంటు ని స్థాపించుకోవచ్చు. అంటే మీకు మరో పార్టీషను లేకపోయినా ఫరవాలేదు. మీరు చెయ్యవలసిందల్లా ఈ ఉబుంటు/కుబుంటు సీడీ దొరకబుచ్చుకుని విండోసులో తెరవండి. మీకు ఒక చిన్న విజర్డ్ ని చూపిస్తుంది. దానినుపయోగించి ఉబుంటుని విండోసులో ఒక అప్లికేషనులాగా ఇంస్టాల్ చేసుకోవచ్చు.

ఈ కింది బొమ్మ చూడండి.

ఉబుంటు కి ఎంత స్థలం కేటాయించాలనుకుంటున్నారో చెప్పండి. అంతే. ఒక సారి రీబూట్ అవగానే మీ సిస్టమ్‌ లో ఉబుంటు స్థాపితమయిపోతుంది.
కంప్యూటరు బూటవుతున్నప్పుడు ఉబుంటు/కుబుంటు ఎంచుకోండి. ఝామ్మని వాడెయ్యండి.

ఇప్పుడర్థమయిందా ? నాకెందుకు నచ్చిందో. విండోసు వాడుకదారులని లినక్సుకి మరల్చడంలో ఇదెంతో సహాయపడుతుందని నా నమ్మకం. అంత రూఢిగా ఎలా చెబుతున్నానంటారా ? ఇప్పటికే నలుగురిని ఇలా మార్చా కాబట్టి 🙂 (అందులో మన రానారె ఒక్కడు)

ఇంకా ఈ రిలీజులో కేడీయీ ౪ ఇంటిగ్రేట్ చెయ్యబడి ఉంది. అదేంటంటారా ? నా ఇంతకు ముందు టపా ఓ సారి చదవండి.

కేడీయీ ౪ సరికొత్త రూపం. కొత్త ప్రయోగం. ఇప్పుడిప్పుడే విడుదలవుతుంది గనుక రఫ్ గా ఉంటుంది. కానీ ఇప్పుడే ఇలా ఉంటే రేప్పొద్దున్న ఎంత ఎక్సైటింగుగా ఉంటుందో ఓ సారి ఊహించుకోండి.

విడ్జెట్లు, ఎఫెక్ట్లతో తప్పకుండా ఆకట్టుకుంటుంది.

ఇకపోతే కాంపిజ్ కి చెందిన డెస్క్‌టాప్ ఎఫెక్ట్లు ఇప్పుడు కేడీయీలో సులభంగా ఎంచుకోవచ్చు.

లినక్సు లో ఇంటర్ఫేసు కి హంగులు లేవని అనే వారికి ఇవి చూసిన తరువాత దిమ్మతిరుగుతుంది. కాంపిజ్ ద్వారా ఎలాంటి ఎఫెక్ట్లు మీకు లభ్యమవుతాయో మచ్చుకు ఈ లంకెలో ఉన్న తెరచాపలను చూడండి.

ఇవి కొన్ని ఫీచర్లూ, మార్పులూ మాత్రమే. ఉబుంటు ని స్థిర పరచడానికి, ముందు ముందు చక్కని రిలీజులు చెయ్యడానికి మన కంటికి కనిపించని ఎంతో పని ఈ రిలీజు మీద జరిగింది.

పూర్తి ఫీచర్ల గురించి తెలుసుకోవాలంటే ఈ లంకె చూడండి.

అన్నట్టు మీకు తెలియకపోతే ఉబుంటు/కుబుంటు సీడీలు మీకు ఉచితంగా పంపిణీ చెయ్యబడతాయి. ఎన్ని కావాలంటే అన్ని. ఇక్కడకెళ్ళి అడగొచ్చు. అందరికీ పంచగలిగినన్ని సీడీలు తెప్పించుకుని అందరికీ ఇవ్వవచ్చు. అంత వరకూ ఆగలేకపోతే దీనిని ప్రయత్నించి చూడడానికి మీకయ్యే ఖర్చల్లా ఒక్క సీడీ మాత్రమే. ఇక్కడ నుంచి ఐఎస్‌ఓ ని తెచ్చుకుని సీడీ తయారు చేసుకోండి. అంతే.

కుబుంటు ని ఎలా వాడాలో కొత్తగా వాడేవారికి నా ఈ టపా ఉపయోగపడవచ్చు.

మరోసారి జై బోలో కుబుంటు కీ !

4 వ్యాఖ్యలు »

 1. Sai Charan said,

  ప్రవీణ్ గారు చాలా బాగా రాశారు.నాకు కూడా అది ట్రై చేయలని ఉ౦ది.మీ ను౦చి మరిన్ని మ౦చి పోస్టులు ఆశిస్తూనాను.

 2. Sai Charan said,

  ప్రవీణ్ గారు చాలా బాగా రాశారు.నాకు కూడా అది ట్రై చేయలని ఉ౦ది.మీ ను౦చి మరిన్ని మ౦చి పోస్టులు ఆశిస్తూనాను.

 3. ప్రవీణ్ గార్లపాటి said,

  @ sai charan:
  థాంక్స్, తప్పకుండా ప్రయత్నించండి. సహాయం చెయ్యడానికి మన బ్లాగర్లు ఉండనే ఉన్నారు.

  అన్నట్టు మీరు “ం” టైపు చెయ్యడానికి ఇబ్బంది పడుతున్నట్టున్నారు.
  ఇలా టైపు చెయ్యండి “అందం” రాయడానికి “aMdaM”, ఉంది రాయడానికి “uMdi”…

 4. @ sai charan:థాంక్స్, తప్పకుండా ప్రయత్నించండి. సహాయం చెయ్యడానికి మన బ్లాగర్లు ఉండనే ఉన్నారు.అన్నట్టు మీరు “ం” టైపు చెయ్యడానికి ఇబ్బంది పడుతున్నట్టున్నారు.ఇలా టైపు చెయ్యండి “అందం” రాయడానికి “aMdaM”, ఉంది రాయడానికి “uMdi”…


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: