మే 25, 2008

హిమాలాయాలలో ట్రెక్కు – ట్రావెలాగుడు ౧

Posted in అనుభవాలు, ట్రెక్, సంగతులు, హిమాలయాలు వద్ద 10:09 ఉద. ద్వారా Praveen Garlapati

సరే… రానారె ట్రావె’లాగుడు’ రాయమని చెప్పాడుగా… అదీ ప్రయత్నిద్దాం.

ఇంతకు ముందు టపాలో చెప్పినట్టు నేనూ, నా స్నేహితుడు హర్ష (కన్నడిగుడు, నా సహోద్యోగి) హిమాలయాల్లో ట్రెక్కింగుకి వెళదామని నిర్ణయించేసుకున్నాము. ఆ మేరకు మా డేమేజర్ల నుంచి అనుమతి కూడా సంపాదించేసుకున్నాము.

ఇక ట్రెక్కుకి రిజిస్టరు చేసేసుకున్నాము కూడా. ఇక్కడ కొంత మేము ట్రెక్కుకి వెళ్ళిన సంస్థ గురించి చెప్పుకోవాలి. దాని పేరు YHAI (Youth Hostels Association of India). దీని మాతృక విదేశమయినా, ఇది భారతానికి సంబంధించిన ఛాప్టరు అన్నమాట. వీరు అడ్వెంచర్ ట్రెక్కింగులు, మొదలయినవి ఆర్గనైజ్ చేస్తారు. అదీ కాక వీరు నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషను.

అంటే మన జేబులకు చిల్లు పడదు, ఫలితమూ దక్కుతుంది. ఈ హిమాలయన్ ట్రెక్కు మేము చేసింది ‘సర్ పాస్‘ అని. దీనికి గాను వారికి మేము చెల్లించిన మొత్తం కేవలం రెండు వేల అయిదు వందల రూపాయలు. అదీ టెంటులూ, అన్నపానీయాలూ కలిపి. ఇంత తక్కువలో వారు చెయ్యగలగడం చాలా ఆశ్చర్యకరం.

సరే ఎలాగయితేనే వారి ద్వారా ఈ ట్రెక్కుకి సంబంధించి బుకింగు చేసుకున్నాము. ఈ ట్రెక్కుకి ఖరారు చేసుకోవడానికి మన ఆరోగ్య స్థితి బాగుందని ఒక డాక్టరు సర్టిఫికెట్టు కూడా జతచెయ్యాలి. అలాగే నాకేం జరిగినా వారి బాధ్యత కాదని ఒక పేపరు మీద సంతకం చెయ్యాలి.

ఆ సంస్థ కి చందాదారు అయి, అవన్నీ పూర్తి చేసిన తరువాత మా చేతికి మేము మే ౩న ట్రెక్కు మొదలెట్టాల్సుంటుందని ఒక పేపరు చేతికి వచ్చింది.

ఇక దానికి సన్నాహాలు మొదలు.

ట్రెక్కు ఎలా సాగుతుందంటే సభ్యులందరూ “కులూ” లో ఉన్న ఒక పల్లెటూరు లో ఉన్న “బేస్ కాంపు” కి చెప్పిన తారీఖులో రిపోర్టు చెయ్యాలి. అక్కడ నుంచి పదకొండు రోజుల ట్రెక్కు మొదలవుతుంది.

ఇక మేము ఢిల్లీ కి రైలు టికెట్టులు బుక్ చేసుకున్నాము (ఏం చేస్తాం, మిడిల్ క్లాసు కి అలవాటుపడ్డ ప్రాణాలు. ఇప్పుడు సంపాదించినా ఎగిరెళ్ళడానికి అంత ఎక్కువ ఖర్చు పెట్టబుద్ది కాలేదు). ఢిల్లీ నుంచి “బేస్ కాంపు” కి మళ్ళీ వేరే ప్రయాణం.

జనాల ఉచిత సలహాలు అప్పటికే మొదలయ్యాయి. అక్కడ అలా ఉంటుంది, ఇవి పట్టుకెళ్ళండి, అది చెయ్యండి, ఇది చెయ్యండి. అయ్యో రైల్లో వెళుతున్నారా ? ఎండ వేడికి మాడి మసయిపోతారు వగయిరా, వగయిరా…

అయినా అనుకున్న ప్రకారం కొత్తయినా సరే మమ్మల్ని మేము నమ్ముకుని, అలాంటి ట్రెక్కులు చేసిన ఇతరుల నుంచి కొంత సమాచారం సేకరించి ఏ సామానులు పట్టుకెళితే అవసరానికి పనికొస్తాయో కనుక్కున్నాము.

ఓ ఆదివారం (మీరు సరిగ్గా ఊహించారు, వెళ్ళే ఒక రెండు రోజుల ముందు) త్యాగం చేసి ఒక బాక్‌పాక్, ఇతర అవసరమయిన టాయిలెట్ పేపరు, టిష్యూలు, ఓ షూ వగయిరా అన్నీ షాపింగు చేసి తయారయామనిపించాము.

ఏప్రిల్ ౩౦ న వర్షంలో తడుస్తూ మొత్తానికి కర్ణాటక ఎక్స్‌ప్రెస్ ఎక్కి బయల్దేరాము. రైల్లో టైం పాస్ చెయ్యడానికి పెద్ద సరంజామా ఏమీ తీసుకెళ్ళలేదు. నా ఎంపీత్రీ ప్లేయరు మాత్రం తోడుంది. ఇక ఇద్దరమూ ముచ్చట్లేసుకుని అలా అలా ప్రయాణం సాగించాము. మధ్యలో అలా కిటికీ లోంచి ఆ పొలాలు, మనుషులూ, వారి జీవన విధానాలు మాకు చూపిస్తూ ఆ రైలు అలా మమ్మల్ని మోసుకెళుతూ ఉంది.

డామేజర్లని కాసేపు మననం చేసుకుని (వారి మీద కాసిన్ని చమక్కులు వేసుకుని, కాసేపు పాపం మంచోళ్ళు మనకు సెలవిచ్చారని పొగిడి) రాబోయే రోజులని తలచుకుంటూ జోగుతూ ఢిల్లీ చేరుకున్నాము.

ఓ… అన్నట్లు చెప్పడం మరచాను. నా బాక్‌పాక్ ని కొద్దిగా ఓవర్ స్టఫ్ చేసాను. అది ఎంచగ్గా ఢిల్లీ లోని చెత్త ఐఎస్బీటీ బస్ స్టాండుకి వెళ్ళగానే పుటుక్కుమంది (దాని తప్పు కాదు నాదే). దానినో చెప్పులు కుట్టే వాడి చేత బాగు చేయించి భయం భయంగా ఎక్కడ మళ్ళీ తెగిపోతుందో అని కదిలాను.

ఢిల్లీ నుంచి మేము చేరాల్సింది హిమాచల్ ప్రదేశ్, కులూ లో ఉన్న “కసోల్” అనే కుగ్రామం. దానికి నేరుగా బస్సు లేకపోవడంతో “భుంతర్” అనే ప్రదేశం చేరి అక్కడ నుంచి ఇంకో లోకల్ బస్సెక్కి కసోల్ చేరాలి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఢిల్లీ కానీ హిమాచల్ కానీ నార్త్ లో మా ప్రయాణంలో చుట్టిన రాష్ట్రాలన్నిటిలోనూ బస్ సర్వీసులు మాత్రం మహా చెత్తగా ఉన్నాయి. ఇక ప్రైవేటు బస్ ఆపరేటర్లందరూ విపరీతంగా ఓవర్ ప్రైస్డ్.

బస్ ప్రయాణం రాత్రి పూట. అదేదో స్లీపర్ కోచ్ అన్నాడు. అటకెక్కించ్చాడు మమ్మల్ని. పడుకోడానికి బానే ఉంది. అంత పెద్ద ప్రయాణం చేసిన తరువాత చల్లగాలి ముఖానికి తగులుతుంటే హాయిగా నిద్ర పట్టింది.

మామూలుగా తొమ్మిది, తొమ్మిదిన్నర కి మధ్యలో నిద్ర లేచే నాకు ఆ మరుసటి రోజు ఎందుకో మరి ఉదయం ఐదున్నరకే మెలకువొచ్చింది. కొద్దిగా చలేస్తుంది. అలా కాస్త బద్దకంగా ఒళ్ళు విరుచుకుని జారగిలబడి కిటికీలో నుంచి బయటకు చూడగానే వావ్… అనిపించింది. బస్సు వెళుతున్న దారిలో లోయలు, ఆ పొద్దున్న అప్పుడే బయటకొస్తున్న సూర్యుడు ఎంత అద్భుతమయిన దృశ్యాల్ని చూపించాయో.

అసలు అవి చూస్తూ చూస్తూనే సమయం ఎలా గడిచిపోయిందో తెలియలేదు. ఎప్పుడు నిద్ర లేచాడో‌గానీ హర్ష కూడా నాలాగే కిటికీలో నుంచి బయటకు చూస్తున్నాడు. ఇద్దరమూ ఏమీ మాట్లాడుకోలేదు చాలా సేపటి వరకూ. అలా చూస్తూనే ఉన్నాము. ఆఖరికి ఓ గంట సేపటి తరవాతేమో ఇద్దరమూ ఓ సారి ముఖ ముఖాలు చూసుకుని ఓ చిరునవ్వు నవ్వుకుని ఈ ప్రదేశమే ఇలాగుంటే మనం వెళ్ళబోయే ప్రదేశాలు ఇంకెంత బాగుంటాయో అనుకున్నాము.

డ్రైవరుకి చెప్పకపోతే ఆపడేమో అని నెమ్మదిగా ఆ పక్కకి వెళుతుంటే ఆ వైపున ఇంకో అటక మీదున్న మాలాంటి స్నేహితులే అన్నారు లేదు ఆపుతారు, మేమూ అక్కడికే వెళుతున్నాము. ఆ ట్రెక్కుకే అన్నారు. భలే సంతోషమేసింది.
వారితో ముచ్చట్లు మొదలెట్టాము. వారిద్దరూ ముంబై వాసులని తెలిసింది. ఒకరు హర్షద్ (మెకానికల్ ఇంజినీరయిన ఇతను తన హాబీ/బిజినెస్ గా చెక్క రిస్టు వాచీలు తయారు చేస్తాడు), ఇంకొకరు యోగేష్ (ఇతనొక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్.)

అందరమూ అలా మాట్లాడుకుంటూనే భుంతర్ చేరుకున్నాము. ఇంకొందరు కూడా అక్కడ తగిలారు మాకు. జీపు మాట్లాడుకుందామా అని చూస్తున్న మాకు అప్పుడే వచ్చిన బస్సు కనిపించింది. పద పదమని అందరమూ ఆ బస్సెక్కేసాము. ఆ బస్సు ప్రయాణం కూడా బాగుంది. లోకల్ బస్ సర్వీసు అది. పొద్దున్నే పనికెళ్ళే వారు, స్కూలుకెళ్ళే పిల్లలు, ఒకరిద్దరు అందమైన యువతులు ఆ బస్సులో కనిపించారు. మా వంక కొద్దిగా వింతగా చూస్తున్నారు.

ఎదురుగా వచ్చే జీపులు, బస్సులని తప్పించుకుని ఆ సన్నని కొండ దారిలో నేర్పుగా నడుపుతున్నాడు డ్రైవరు. మా బాక్‌పాక్ లను ఒళ్ళో పెట్టుకుని ఆ లోయలను చూస్తూ మళ్ళీ ఇందాకటి స్నేహితులతో మాటల్లో పడ్డాము. అందులో హర్షద్ ఇప్పటికే యూత్ హాస్టల్స్ కి సంబంధించిన అన్ని ట్రెక్కులూ పూర్తి చేసాడనీ, ఇదే ఆఖరనీ, ప్రతీ ఏడాదీ ఒక ట్రెక్కు చెయ్యడం అతని అలవాటనీ తెలిసింది.

అతని స్నేహితుడు యోగేష్ ఫోటొగ్రఫీ వృత్తనీ, ఇంకొన్ని రోజులలో ఒక ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ పెట్టబోతున్నాడనీ, ఈ ట్రెక్‌లో తీసిన ఫోటోలను కూడా ఉంచుతాడనీ, అతను కూడా ఇంతకు ముందు ఒక రెండు ట్రెక్కులు చేసాడనీ కూడా తెలిసింది.

ఊ… మంచి ఇంటరెస్టింగ్ జనాలు దొరికారని అనుకున్నాము నేనూ, హర్షా.

అలా మొత్తానికి “కసోల్” చేరి, మా బేస్ కాంపుకి చేరుకున్నాము. అక్కడికెళ్ళగానే మాకు మొదట కనిపించిన దృశ్యాలు ఇవి. ఓ రెండు క్లిక్కులు క్లిక్కి రిపోర్టింగు చెయ్యవలసిన టెంటుకి చేరాము.

అక్కడ మాకో పింకు స్లిప్పిచ్చారు. అది మా ఐడెంటిటీ అన్నమాట. మేము కాంపు నుంచి బయటికెళ్ళాలంటే దానిని వెనక్కిచ్చి వెళ్ళాలి, తిరిగొచ్చినప్పుడు తీసుకోవాలి. అలా మమ్మల్ని ట్రాక్ చేస్తారన్నమాట.

ఇంతలో మా వాడు హర్ష ఒక బాంబు పేల్చాడు. నా బాక్‌పాక్ తెగడంతో దాంట్లో నుంచి కొంత సామానుని ఒక ప్లాస్టిక్ కవరులోకి మార్చాను. ముఖ్యంగా తినడానికి తెచ్చుకున్న సామానులు. ఓ అరకేజీ ఖర్జూరం, జీడిపప్పు, ఓ యాభై ఫైవ్ స్టారులు మొదలయినవన్నమాట 🙂
మా వాడు బస్సు దిగుతూ అది కాస్తా దాంట్లో వదిలేసాడుట.

ఇద్దరికీ చాలా సేపు బాధగా అనిపించింది. నేను అన్ని డబ్బులు పోసి కొన్నవీ, ఆఖరికి ట్రెక్కులో పనికి రాకుండా పోయాయనీ. సరే పోయినదానికి విచారించడమెందుకని అక్కడితో వదిలేసాము. కొంతలో కొంత నయమేమిటంటే అవసరమయిన సామానులేవీ అందులో పెట్టలేదు.

ఇక మేము అక్కడ రిపోర్టు చేసిన తరువాత మాకు ఒక టెంటు ఇవ్వడం జరిగింది. వీటి కథా కమామీషేమిటంటే బేస్ కాంపులో రిపోర్టు చేసిన నాటి నుంచీ మన బస అంతా టెంట్లలోనే. ఒక్కో టెంటులోనూ పది-పదిహేను దాకా జనాలుంటారు. అందరికీ ఒక స్లీపింగు బాగు, రగ్గు ఇవ్వబడతాయి.

పదిహేను మందీ టెంటులో చేరితే అటూ ఇటూ తిరగడానికి స్థలముండదు. మాకివ్వబడిన టెంటులో అప్పటికి ఇద్దరు జనాలు మాత్రమే ఉన్నారు. ఒకరు “అయ్యరు”, ఇంకొకరు అతని “పుత్తరు” (కొడుకు). వీరి మహత్యం ముందు ముందు ట్రావెలాగులలో తెలుస్తుంది…

26 వ్యాఖ్యలు »

 1. క్రాంతి said,

  అబ్బ భలే ఇంట్రెస్టింగా ఉంది.waiting for the next post!

 2. అబ్బ భలే ఇంట్రెస్టింగా ఉంది.waiting for the next post!

 3. రవి said,

  బావుంది.
  చాలా రోజుల తర్వాత రాస్తున్నట్టున్నారు.
  హీరోయిను ఇంట్రొడక్షనూ, ఫైట్సూ తతిమ్మవనీ, వచ్చే టపాలో రాయండి.

 4. రవి said,

  బావుంది.చాలా రోజుల తర్వాత రాస్తున్నట్టున్నారు.హీరోయిను ఇంట్రొడక్షనూ, ఫైట్సూ తతిమ్మవనీ, వచ్చే టపాలో రాయండి.

 5. BHARAT said,

  meetho paate praayanam chestunnattu undi

 6. BHARAT said,

  meetho paate praayanam chestunnattu undi

 7. మేధ said,

  అంతకుముందు, నేను కూడా వెళదామని ప్లాన్ చేసుకునాను.. కానీ మొదట్లో వస్తానన్న friends చివరిక handి ఇచ్చారు.. ఇక మళ్ళీ అప్పటినుండి కుదరలేదు. కాకపోతే, కనీసం మీది చదువుతుంటే ఇలా ఉండి ఉండేది నేను కూడా వెళ్ళి ఉంటే అనిపిస్తొంది..

 8. మేధ said,

  అంతకుముందు, నేను కూడా వెళదామని ప్లాన్ చేసుకునాను.. కానీ మొదట్లో వస్తానన్న friends చివరిక handి ఇచ్చారు.. ఇక మళ్ళీ అప్పటినుండి కుదరలేదు. కాకపోతే, కనీసం మీది చదువుతుంటే ఇలా ఉండి ఉండేది నేను కూడా వెళ్ళి ఉంటే అనిపిస్తొంది..

 9. Kamaraju Kusumanchi said,

  మొత్తానికి బాగానే ‘లాగు’తున్నారు! మిగతా parts కూడా వెంటనే post చెయ్యండి!

 10. మొత్తానికి బాగానే ‘లాగు’తున్నారు! మిగతా parts కూడా వెంటనే post చెయ్యండి!

 11. ప్రవీణ్ గార్లపాటి said,

  @క్రాంతి గారు:
  హమ్మయ్య… ఇంటరెస్టింగ్ అనే ఒక బకరా అయినా దొరికింది.

  @రవి:
  ఎబ్బే… హీరోయినూ, ఐటెం సాంగు తారలూ దొరికితే ఇంకా ఈ ట్రావెలాగు రాసుకుంటూ ఎందుకుంటాను 😉

  @bharat గారు:
  థాంకులు.

  @మేధ గారు:
  పోనీలెండి. వచ్చే ఏడాది అందరమూ కలిసెళదాము.

  @kamaraju గారు:
  వీలు దొరికినప్పుడల్లా తప్పకుండా సార్…

 12. @క్రాంతి గారు:హమ్మయ్య… ఇంటరెస్టింగ్ అనే ఒక బకరా అయినా దొరికింది.@రవి:ఎబ్బే… హీరోయినూ, ఐటెం సాంగు తారలూ దొరికితే ఇంకా ఈ ట్రావెలాగు రాసుకుంటూ ఎందుకుంటాను ;)@bharat గారు:థాంకులు.@మేధ గారు:పోనీలెండి. వచ్చే ఏడాది అందరమూ కలిసెళదాము.@kamaraju గారు:వీలు దొరికినప్పుడల్లా తప్పకుండా సార్…

 13. meenakshi said,

  hi praveen garu.mee trecking gurinchi chaduvutunte teleeni santhoshanga undi.chala intresting ga undi.meeru rasevanni chala intresting ga untai.mee next post kosam eduruchustuntanu.sir kasta reply ivvagalaru.plzzzzzzzzzzz.

 14. meenakshi said,

  hi praveen garu.mee trecking gurinchi chaduvutunte teleeni santhoshanga undi.chala intresting ga undi.meeru rasevanni chala intresting ga untai.mee next post kosam eduruchustuntanu.sir kasta reply ivvagalaru.plzzzzzzzzzzz.

 15. meenakshi said,

  sir mee pata tapalanni chadivanu.chala chala chala chala chala chala chala bagunnai.

 16. meenakshi said,

  sir mee pata tapalanni chadivanu.chala chala chala chala chala chala chala bagunnai.

 17. చదువరి said,

  ఓహో, మీరు కూడా లాగుతున్నారన్నమాట, భేష్! ఫోటోలు కాస్త పెద్దవి పెట్టండి, నొక్కి చూసుకునే పని లేకుండా. బ్లాగుకు కూడా అందం వస్తుంది.

 18. ఓహో, మీరు కూడా లాగుతున్నారన్నమాట, భేష్! ఫోటోలు కాస్త పెద్దవి పెట్టండి, నొక్కి చూసుకునే పని లేకుండా. బ్లాగుకు కూడా అందం వస్తుంది.

 19. శ్రీ said,

  భలే రాసారండీ! మీ అడ్వెంచర్స్ భలే ఉన్నాయి. మిగతా టపా కోసం ఎదురుచుస్తూ ఉంటాం!

 20. శ్రీ said,

  భలే రాసారండీ! మీ అడ్వెంచర్స్ భలే ఉన్నాయి. మిగతా టపా కోసం ఎదురుచుస్తూ ఉంటాం!

 21. రానారె said,

  అయ్యరు, అతని పుత్తరు! హహ్హ సూపరు!! 🙂

  తదుపరి …!?

 22. అయ్యరు, అతని పుత్తరు! హహ్హ సూపరు!! :)తదుపరి …!?

 23. విహారి said,

  నేను కాలేజీ లు వున్నప్పుడు వీటి గురించి విన్నా. కానీ వెళదామంటే అప్పుడు కాసులు ఖాళీ. బెంగళూరు లో ఇలా ట్రెక్కింగ్ కు వెళ్లే క్లబ్బులు కూడా వున్నాయనుకుంటా.

  ప్చ్.. ఇప్పుడు కిటికీ తెరిస్తే ఇలాంటి దృశ్యాలే. ఇక్కడ మా ఊళ్ళోనే సిల్వెస్టర్ స్టాలిన్‌ cliffhanger సినిమా తీశారు.

  మీరు మరీ బస్సు స్పీడామీటర్ లా 1.1, 1.2, 1.3…కిలోమీటర్స్ అని సాగదీస్తారా ఏవిటి?

  — విహారి

 24. నేను కాలేజీ లు వున్నప్పుడు వీటి గురించి విన్నా. కానీ వెళదామంటే అప్పుడు కాసులు ఖాళీ. బెంగళూరు లో ఇలా ట్రెక్కింగ్ కు వెళ్లే క్లబ్బులు కూడా వున్నాయనుకుంటా.ప్చ్.. ఇప్పుడు కిటికీ తెరిస్తే ఇలాంటి దృశ్యాలే. ఇక్కడ మా ఊళ్ళోనే సిల్వెస్టర్ స్టాలిన్‌ cliffhanger సినిమా తీశారు.మీరు మరీ బస్సు స్పీడామీటర్ లా 1.1, 1.2, 1.3…కిలోమీటర్స్ అని సాగదీస్తారా ఏవిటి?– విహారి

 25. ప్రవీణ్ గార్లపాటి said,

  @ meenakshi గారు:
  నా బ్లాగు నచ్చినందుకు థాంకులు.

  @ చదువరి గారు:
  అలాగే…

  @శ్రీ, @రానారె:
  తదుపరి వెలువడింది.

  @విహారి:
  నాకు ఓపిక ఉన్నంతవరకూ మీకీ తిప్పలు తప్పవు 🙂

  మరే! ఇంటి బయటే అన్నీ ఉంటే అవి మనకెక్కడ ఆనతాయి ?

 26. @ meenakshi గారు:నా బ్లాగు నచ్చినందుకు థాంకులు.@ చదువరి గారు:అలాగే…@శ్రీ, @రానారె:తదుపరి వెలువడింది.@విహారి:నాకు ఓపిక ఉన్నంతవరకూ మీకీ తిప్పలు తప్పవు :)మరే! ఇంటి బయటే అన్నీ ఉంటే అవి మనకెక్కడ ఆనతాయి ?


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: